
సాక్షి, హైదరాబాద్: ‘లెట్స్ షటిల్’ కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఉదయ్, తేజస్విని విజేతలుగా నిలిచారు. పీబీఎల్ ఫ్రాంచైజీ హైదరాబాద్ హంటర్స్ ఈ టోర్నీని నిర్వహించింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఉదయ్ 21–6, 19–10తో భరత్‌పై గెలుపొందగా... మహిళల సింగిల్స్ ఫైనల్లో తేజస్విని 21–12, 23–21తో అలేఖ్యపై విజయం సాధించింది. తేజస్విని సింగిల్స్ టైటిల్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ విజేతగా నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో తేజస్విని–చైతన్య జంట 23–21, 21–7తో ఆకాశ్ సింగ్ గౌతమ్–మంజు జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అనురాగ్–ముహీబ్ ద్వయం 23–21, 21–13తో చైతన్య–ఉదయ్ జంటపై గెలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మంజుల–హారిక జోడీ 14–21, 21–19, 21–17తో ఆస్థ, తేజస్విని ద్వయంపై నెగ్గింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు విజేతలకు ట్రోఫీలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment