రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే? | Rajendra Prasad Grand Daughter Tejaswini Movie Release On This Date | Sakshi
Sakshi News home page

రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?

Published Mon, Dec 23 2024 3:59 PM | Last Updated on Mon, Dec 23 2024 4:12 PM

Rajendra Prasad Grand Daughter Tejaswini Movie Release On This Date

సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ  సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్,  శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా బిజినెస్ షో వేశారు. ఈ సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని అన్నారు.

అయితే ఈ మూవీని వచ్చే శివరాత్రికి థియేట్రికల్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో డివోషనల్ టచ్ ఉండడంతో ఇప్పుడు రిలీజ్ చేయడం మంచిది కాదని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా అంటే ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ..'సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు.. కానీ కంటెంట్ మాత్రం కంటెంట్ అద్భుతంగా ఉందని చూసినవారు చెప్పారు' అని అన్నారు. ఈ చిత్రంలో శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ప్రమోద్ పులిగార్ల సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement