నేటి నుంచి ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
వాంటా (ఫిన్లాండ్): పారిస్ ఒలింపిక్స్ వైఫల్యం మరిచి తదుపరి టోరీ్నలో టైటిల్స్ లక్ష్యంగా భారత షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ తమ రాకెట్లకు పదును పెడుతున్నారు. ఆర్కిటిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పారిస్ మెగా ఈవెంట్ తర్వాత వీళ్లిద్దరు బరిలోకి దిగుతున్న తొలి టోర్నీ ఇదే కాగా... మహిళల సింగిల్స్‌లో సింధుకు ఆరో సీడింగ్ కేటాయించగా, పురుషుల ఈవెంట్‌లో లక్ష్య సేన్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగుతున్నాడు.
తొలి రౌండ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు కెనడాకు చెంది మిచెల్లి లీతో తలపడుతుంది. ఇందులో శుభారంభం చేస్తే తదుపరి రౌండ్‌లో భారత టాప్ స్టార్‌కు 2022 జూనియర్ ప్రపంచ చాంపియన్, జపాన్ టీనేజ్ సంచలనం తొమకొ మియజాకి ఎదురవనుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్... డెన్మార్క్‌కు చెందిన రస్ముస్ గెమ్కేతో తలపడతాడు. గతేడాది ఇండియా ఓపెన్‌లో రస్మస్‌తో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం లక్ష్య సేన్‌కు ఆరంభరౌండ్లోనే లభించింది. ఈ అడ్డంకిని అధిగమిస్తే భారత ఆటగాడు చైనీస్ తైపీకి చెందిన ఏడో సీడ్ చౌ తియెన్ చెన్‌తో పోటీపడే అవకాశముంటుంది.
Comments
Please login to add a commentAdd a comment