ఒడెన్స్ (డెన్మార్క్): ఈ సీజన్‌లో ఫామ్‌లోకి వచ్చేందుకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పట్టుదలగా ఉంది. గత వారం ఫిన్లాండ్‌లో జరిగిన ఆర్క్‌టిక్ ఓపెన్ వైఫల్యాన్ని అధిగమించి డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో శుభారంభం చేయాలనే లక్ష్యంతో సింధు సన్నద్ధమైంది.
ఆ అడ్డంకిని దాటితేనే
రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధుకు గత ఈవెంట్‌లో అనూహ్యంగా తొలి రౌండ్లోనే కెనడా ప్లేయర్ మిచెల్లీ లీ చేతిలో ఓటమి ఎదురైంది. గతంలో మిచెల్లీపై పదిసార్లు విజయం సాధించిన భారత షట్లర్‌కు ఫిన్లాండ్‌లో మాత్రం నిరాశ ఎదురైంది.
తాజా డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్‌లో ఆమె చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పొతో తలపడుతుంది. ఈ అడ్డంకిని దాటితే సింధుకు రెండో రౌండ్లో చైనా షట్లర్ హాన్ యువె ఎదురవనుంది. మహిళల సింగిల్స్‌లో ఆమెతో పాటు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడాలు కూడా ఈ టోరీ్నలో శుభారంభంపై దృష్టి సారించారు.
లక్ష్య సేన్ గాడిన పడతాడా?
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ లక్ష్య సేన్ కూడా మెరుగైన ఆటతీరుతో ఈ సీజన్‌లో గాడిన పడేందుకు శ్రమిస్తున్నాడు. ఈ టోర్నీలో 23 ఏళ్ల లక్ష్య సేన్ తొలిరౌండ్లో లూ గ్వాంగ్ జు (చైనా)తో పోటీపడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్లో కిష్టమైన ప్రత్యర్థి ఎదురవనున్నాడు. ఇండోనేసియాకు షట్లర్ జొనాథన్ క్రిస్టీతో లక్ష్య సేన్ తలపడే అవకాశముంది.
డబుల్స్‌లో
ఇక మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ జంట తొలి రౌండ్లో ఐదో సీడ్ పియర్లీ తన్–తినా మురళీధరన్ (మలేసియా) జోడీతో ఆడుతుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమిత్ రెడ్డి ద్వయానికి తొలి రౌండ్లో కెవిన్‌లీ– ఎలియాన జంగ్ (కెనడా) జంట ఎదురవుతుంది. గతంలో భారత క్రీడాకారులకు డెన్మార్క్ ఓపెన్ కలిసొచ్చింది. సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2017లో), సైనా నెహా్వల్ (2012లో) విజేతలుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment