Denmark Open
-
సింధు పరాజయం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన స్టార్ ప్లేయర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 13–21, 21–16, 9–21తో ప్రపంచ 8వ ర్యాంకర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను కోల్పోయినా వెంటనే తేరుకొని రెండో గేమ్‌ను దక్కించుకుంది.అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో గ్రెగోరియా ధాటికి సింధు చేతులెత్తేసింది. గతంలో గ్రెగోరియాపై 10 సార్లు గెలిచిన సింధు మూడుసార్లు ఓటమిని మూటగట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధుకు 4,675 డాలర్ల (రూ. 3 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 18–21, 21–12, 21–16తో ప్రపంచ 7వ ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను కోల్పోయినా నెమ్మదిగా తేరుకొని ఆ తర్వాతి రెండు గేముల్లో గెలిచి ముందంజ వేసింది. హాన్ యువెపై సింధుకిది ఏడో విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–2తో గ్రెగోరియాపై ఆధిక్యంలో ఉంది. -
పీవీ సింధు శుభారంభం.. లక్ష్య సేన్ విఫలం
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఊరట విజయం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న రెండో టోర్నమెంట్లో ఆమె జయకేతనం ఎగురవేసింది. విశ్వక్రీడల తర్వాత ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన సింధు... మంగళవారం మొదలైన డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో శుభారంభం అందుకుంది.మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి పాయ్ యు పోతో జరిగిన మ్యాచ్‌లో సింధు 21–8, 13–7తో విజయం సాధించింది. అయితే, తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో ఆరు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. ఈ క్రమంలో సింధు విజేతగా నిలిచి ప్రిక్టార్టర్స్కు అర్హత సాధించింది.ఇక నాలుగో సీడ్ హాన్ యువె (చైనా), పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్) మధ్య తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు తలపడుతుంది. మరోవైపు.. భారత్‌కే చెందిన రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మాళవిక 13–21, 12–21తో థుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో, ఆకర్షి కూడా 13–21, 12–21తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో లౌరెన్ లామ్ (అమెరికా)తో ఉన్నతి హుడా పోటీపడుతుంది.ఇదిలా ఉంటే.. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ లక్ష్య సేన్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–12, 19–21, 14–21తో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) ద్వయం 18–21, 22–24తో చాంగ్ చింగ్ హుయ్–యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓటమి పాలైంది. సోనమ్ గురికి రజతంన్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత జట్టు రజత పతకంతో బోణీ చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సోనమ్ మస్కర్ రజత పతకాన్ని సాధించింది. 22 ఏళ్ల సోనమ్ ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు అర్జున్ (188.3 పాయింట్లు) ఐదో స్థానంలో, దివ్యాంశ్ (124 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అర్జున్ సింగ్ (109.9 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు రిథమ్ (197.2 పాయింట్లు) నాలుగో స్థానంలో, సురభి (176.6 పాయింట్లు) 5వస్థానంలో నిలిచారు. -
Denmark Open 2024: కళ్లన్నీ వాళ్లిద్దరిపైనే..
ఒడెన్స్ (డెన్మార్క్): ఈ సీజన్లో ఫామ్‌లోకి వచ్చేందుకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పట్టుదలగా ఉంది. గత వారం ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్ వైఫల్యాన్ని అధిగమించి డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో శుభారంభం చేయాలనే లక్ష్యంతో సింధు సన్నద్ధమైంది.ఆ అడ్డంకిని దాటితేనేరెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధుకు గత ఈవెంట్లో అనూహ్యంగా తొలి రౌండ్లోనే కెనడా ప్లేయర్ మిచెల్లీ లీ చేతిలో ఓటమి ఎదురైంది. గతంలో మిచెల్లీపై పదిసార్లు విజయం సాధించిన భారత షట్లర్‌కు ఫిన్లాండ్లో మాత్రం నిరాశ ఎదురైంది. తాజా డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో ఆమె చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పొతో తలపడుతుంది. ఈ అడ్డంకిని దాటితే సింధుకు రెండో రౌండ్లో చైనా షట్లర్ హాన్ యువె ఎదురవనుంది. మహిళల సింగిల్స్‌లో ఆమెతో పాటు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడాలు కూడా ఈ టోరీ్నలో శుభారంభంపై దృష్టి సారించారు. లక్ష్య సేన్ గాడిన పడతాడా?పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ లక్ష్య సేన్ కూడా మెరుగైన ఆటతీరుతో ఈ సీజన్లో గాడిన పడేందుకు శ్రమిస్తున్నాడు. ఈ టోర్నీలో 23 ఏళ్ల లక్ష్య సేన్ తొలిరౌండ్లో లూ గ్వాంగ్ జు (చైనా)తో పోటీపడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్లో కిష్టమైన ప్రత్యర్థి ఎదురవనున్నాడు. ఇండోనేసియాకు షట్లర్ జొనాథన్ క్రిస్టీతో లక్ష్య సేన్ తలపడే అవకాశముంది.డబుల్స్లోఇక మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ జంట తొలి రౌండ్లో ఐదో సీడ్ పియర్లీ తన్–తినా మురళీధరన్ (మలేసియా) జోడీతో ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమిత్ రెడ్డి ద్వయానికి తొలి రౌండ్లో కెవిన్లీ– ఎలియాన జంగ్ (కెనడా) జంట ఎదురవుతుంది. గతంలో భారత క్రీడాకారులకు డెన్మార్క్ ఓపెన్ కలిసొచ్చింది. సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2017లో), సైనా నెహా్వల్ (2012లో) విజేతలుగా నిలిచారు. -
PV Sindhu-Carolina: బాక్సింగ్ కోర్టు కాదు.. బ్యాడ్మింటన్ కోర్టు
డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 సెమీఫైనల్.. ఒకవైపు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మరోవైపు స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్. తొలి సెట్ నుంచే హొరా హోరీ పోటీ. వీరిద్దరూ మధ్య ఫైట్ బాక్సింగ్ కోర్టును తలపించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి సింధు ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ మాత్రం బ్యాడ్మింటన్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అస్సలు ఏమి జరిగిందో ఓ లూక్కేద్దం. తొలిసెట్ ఓ రణరంగం.. తొలిసెట్లో మొదటి పాయింట్ మారిన్ ఖాతాలో చేరింది. దీంతో మారిన్ అనందానికి హద్దులు లేవు. మారిన్ పాయింట్ సాధించిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. సిందూ కూడా ప్రత్యర్ధికి తగ్గట్టే సంబరాలు జరుపుకుంది. సింధు కూడా పాయింట్ సాధించినా ప్రతీసారి బిగ్గరగా అరిచింది. మొదటి వార్నింగ్.. వీరిద్దరూ సెలబ్రేషన్స్ శృతిమించడంతో మొదటి సెట్లోనే అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరిని దగ్గరకి పిలిచి గట్టిగా అరవద్దూ అంటూ అంపైర్ హెచ్చరించాడు. దీంతో సింధు సైలెంట్ అయినప్పటికీ.. కరోలినాలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించలేదు. తన పంథాను కొనసాగించింది. తొలి సెట్లో ఓటమి.. మొదటి సెట్లో పీవీ సింధు చివరవరకు పోరాడినప్పటికీ కరోలినా ముందు తలవంచకతప్పలేదు. సింధు 18-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. రెండో సెట్లో విజయం.. రెండో సెట్లో సింధు దెబ్బతిన్న పులిలా పంజా విసిరింది. ఈ సెట్ మొదటి నుంచే ప్రత్యర్ధిని సింధు ముప్పు తిప్పలు పెట్టింది. అయితే అనూహ్యంగా ప్రత్యర్ధి పుంజుకున్నప్పటికీ 21-19 తేడాతో సింధు విజయం సాధించింది. మూడో సెట్లో వాగ్వాదం.. నిర్ణయాత్మమైన మూడో సెట్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరోలినా పదే పదే గట్టిగా అరుస్తుండడంతో సింధు అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. మరోసారి కరోలినాకు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ కరోనా తీరు మారలేదు. చివరి గేమ్‌లో మొదటి నుంచే సింధుపై కరోలినా పై చేయి సాధించింది. మారిన్ 9-2తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. సింధు సిద్ధంగా ఉండటానికి తగినంత సమయం ఇవ్వకుండా మారిన్ గేమ్‌ను వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా సింధు కోర్టులో ఉన్న షటిల్‌ను తనవైపు తీసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో సింధుకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా వాదించుకున్నారు. ఈ క్రమంలో అంపైర్ జోక్యం ఇద్దరికి ఎల్లో కార్డు చూపించాడు. అదే విధంగా మూడో సెట్ ఆఖరిలో షటిల్‌ను సింధు ముఖంపై కొట్టింది. వెంటనే కరోలినా తన బ్యాట్‌ను పైకెత్తి సారీ చెప్పినప్పటికీ.. సింధు వైపు మాత్రం చూడలేదు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అనవసర తప్పిదాలతో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ ప్రత్యర్థికి సమర్పించుకుంది. 7-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. క్షమాపణలు చెప్పిన కరోలినా.. ఇక ఈ మ్యాచ్ అనంతరం సింధుకు కరోలినా క్షమాపణలు చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పీవీ సింధు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. అందులో "మ్యాచ్ ఓడిపోవడం బాధగా ఉంది. అయితే ఈ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. కానీ బ్యాక్-టు-బ్యాక్ సెమీ-ఫైనల్‌కు క్వాలిఫై కావడం సాధించడం చాలా సంతోషంగా ఉంది. నా ఫిట్నెస్ కూడా మరింత మెరుగుపడింది. ప్రతీ ఒక్కరికి భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఎదుటివారిని ద్వేషించడం సరికాదు " అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్టుకు కరోలినా స్పందిస్తూ.. "మ్యాచ్‌లో మంచి ఫైట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనమద్దిరం ఆ గేమ్‌లో గెలవాలని పోరాడాం. కానీ నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకోలేదు. ఏదైమైనప్పటికీ అందరి ముందు నేను ఈ విధమైన ప్రవర్తన చూపినందుకు క్షమించండి. త్వరలో మళ్లీ కలుద్దాం మిత్రమా అంటూ రిప్లే ఇచ్చింది. -
సెమీస్‌లో సింధు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–12తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. అయితే రెండో గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడుతుంది. ముఖా ముఖి రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉంది. క్వార్టర్ ఫైనల్లో కరోలినా మారిన్ 19–21, 21–15, 21–18తో తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
ఒడెన్స్: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 750 టోర్నీ డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ప్రత్యర్థినుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా చివరకు తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు 21–14, 18–21, 21–10 స్కోరుతో కిర్స్టీ గిల్మర్ (స్కాట్లండ్)పై విజయం సాధించింది. 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న తర్వాత సింధుకు ఆ తర్వాత గిల్మర్ గట్టి పోటీనిచ్చి పోరును 1–1తో సమం చేసింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు తన స్థాయికి తగినట్లుగా చెలరేగింది. ఒక దశలో వరుసగా 7 పాయింట్లు సాధించి దూసుకుపోయిన భారత షట్లర్ చివరి వరకు దానిని కొనసాగించింది. మహిళల సింగిల్స్‌లో మరో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్ కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో ఆకర్షి 10–21, 22–20, 21–12 తేడాతో లి వైవోన్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. అయితే పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ను నిరాశ ఎదురైంది. తొలి పోరులో శ్రీకాంత్ 21–19, 10–21, 16–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓడి నిష్క్రమించాడు. లక్ష్య సేన్ కూడా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. థాయిలాండ్‌కు చెందిన కంటఫాన్ వాంగ్ చరన్ 21–16, 21–18తో లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు. మరో వైపు ఆసియా క్రీడల స్వర్ణపతక జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి చివరి నిమిషంలో టోర్నీనుంచి నిష్క్రమించింది. ఈ జంట వాకోవర్ ఇవ్వడంతో మలేసియా ద్వయం ఆంగ్ యు సిన్ – టియో యీ యి రెండో రౌండ్‌కు చేరింది. -
'బంగారు' వేదాంత్.. డానిష్ ఓపెన్‌లో రెండో పతకం సాధించిన మాధవన్ కొడుకు
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్ వేదాంత్ మాధవన్ మరోసారి మెరిశాడు. నిన్న (ఏప్రిల్ 17) పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతం సాధించిన వేదాంత్.. ఇవాళ (ఏప్రిల్ 18) 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. వేదాంత్ 800 మీటర్ల లక్ష్యాన్ని 8 నిమిషాల 17:28 సెకెన్లలో పూర్తి చేశాడు. వేదాంత్ రజతం పతకం నెగ్గి రోజు తిరగకుండానే పసిడి సాధించడం విశేషం. సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్ (16) ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వరుస పతాకలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) గతేడాది జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించిన వేదాంత్.. లాత్వియా ఓపెన్‌లో కాంస్యం, తాజాగా డానిష్ ఓపెన్‌లో బంగారు, రజత పతకాలు సాధించాడు. వేదాంత్ అంతర్జాతీయ వేదికలపై వరుస పతకాలు సాధిస్తుండటంతో అతని తండ్రి మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. మరోవైపు వేదాంత్ సాధించిన విజయాల పట్ల యావత్ భారత చలనచిత్ర సీమ ఆనందం వ్యక్తం చేస్తుంది. దక్షిణాదికి చెందిన మాధవన్.. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. కాగా, డానిష్ ఓపెన్‌లో కొడుకు సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోను మాధవన్ స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కరోనా కల్లోలం.. విదేశీ ఆటగాడికి పాజిటివ్..? -
డేవిస్ కప్‌లో రామ్‌కుమార్, యూకీ బాంబ్రీ గెలుపు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే–ఆఫ్ టైలో భాగంగా డెన్మార్క్‌తో జరుగుతున్న పోరులో శుక్రవారం భారత్ 2–0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6–3, 6–2తో క్రిస్టియాన్ సిగ్స్గార్డ్పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ 170వ ర్యాంకర్ రామ్‌కుమార్ కేవలం 59 నిమిషాల్లోనే 824వ ర్యాంకింగ్ ప్లేయర్‌పై గెలిచాడు. సుదీర్ఘ విరామానంతరం... 2017 తర్వాత మళ్లీ డేవిస్ కప్ బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ రెండో సింగిల్స్‌లో 6–4, 6–4తో మికేల్ టొర్పెగార్డ్ను ఓడించాడు. నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జోడీ గెలిస్తే చాలు భారత్ రివర్స్ సింగిల్స్ ఆడే అవకాశం లేకుండానే విజయం సాధిస్తుంది. ఇదే జరిగితే భారత్ వరల్డ్ గ్రూప్–1లో స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. చదవండి: national chess championship 2022: విజేతగా అర్జున్.. తొలి తెలంగాణ ఆటగాడిగా రికార్డు -
నగాల్‌పై వేటు... యూకీకి చోటు
న్యూఢిల్లీ: డెన్మార్క్‌తో జరిగే డేవిస్ కప్ పోరు కోసం ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) సెలక్టర్లు ఎంపిక చేశారు. సుమీత్ నగాల్‌ను తప్పించి యూకీ బాంబ్రీకి చోటు కల్పించడం ఈ ఎంపికలో కీలక మార్పు. వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ ‘టై’లో భాగంగా మార్చి 4, 5 తేదీల్లో భారత్, డెన్మార్క్ తలపడనున్నాయి. ఢిల్లీ జింఖానా క్లబ్‌లోని గ్రాస్ కోర్టుల్లో రెండు రోజుల పాటు సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచ 222వ ర్యాంకర్ నగాల్‌ను కాదని 863 ర్యాంకర్ యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ (182), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (228)లను సింగిల్స్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు. డబుల్స్‌లో వెటరన్ స్టార్ రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌లకు స్థానం కల్పించారు. గ్రాస్ కోర్టు స్పెషలిస్ట్ కాకపోవడంతో నగాల్‌పై వేటు పడింది. తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని, దిగ్విజయ్ ప్రతాప్ సింగ్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసినట్లు ‘ఐటా’ ఒక ప్రకటనలో తెలిపింది. భారత టెన్నిస్ జట్టుకు జీషాన్ అలీ కోచ్‌గా, రోహిత్ రాజ్‌పాల్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఎంపికైన జట్టు ఈ నెల 23న న్యూఢిల్లీలో బయోబబుల్‌లోకి వెళుతుంది. కరోనా నేపథ్యంలో ‘ఐటా’ సెలక్షన్ కమిటీ వర్చువల్ పద్ధతిలో సమావేశమై జట్టును ఎంపిక చేసింది. -
తొలి రౌండ్లోనే సైనా ఇంటిముఖం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్‌కు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో 16–21, 14–21తో అయా ఒహోరి (జపాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... సౌరభ్ వర్మ, కశ్యప్, ప్రణయ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. లక్ష్య సేన్ 21–9, 21–7తో సౌరభ్ వర్మ (భారత్)పై నెగ్గగా... ప్రణయ్ 18–21, 19–21తో జొనాథాన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. చౌ తియె చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ తొలి గేమ్‌లో 0–3తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగాడు. చదవండి: భారత్ తొలి ప్రత్యర్థి ఫ్రాన్స్ -
PV Sindhu: సింధుకు తొలి పరీక్ష
ఒడెన్స్ (డెన్మార్క్): గత ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాక ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మళ్లీ రాకెట్ పట్టనుంది. నేటి నుంచి మొదలయ్యే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సింధు బరిలోకి దిగనుంది. తొలి రౌండ్లో ప్రపంచ 29వ ర్యాంకర్ నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)తో సింధు ఆడనుంది. భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ కూడా ఈ టోరీ్నలో ఆడనుంది. తొలి రౌండ్లో అయా ఓరి (జపాన్)తో సైనా తలపడనుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఏకంగా ఏడుగురు భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ, పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
సింధు ట్వీట్ స్మాష్
న్యూఢిల్లీ: ఒక్క ట్వీట్‌తో భారత క్రీడాభిమానులకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ‘డెన్మార్క్ ఓపెన్ నా చివరి టోర్నీ. నేను రిటైరయ్యా’ అని సింధు చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ ట్వీట్‌తో పాటు కోవిడ్–19 స్థితిగతులు, దాని ప్రభావంపై ఆమె సుదీర్ఘ ప్రకటన చేసింది. దీంతో కరోనా నేపథ్యంలో నిజంగానే ఆమె ఆటకు దూరంగా వెళ్తుందేమోనని అందరూ బోల్తా పడ్డారు. కానీ ట్వీట్ చివర్లో నెగెటివిటీ, అనవసరపు విశ్రాంతి, భయం నుంచి తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంత కాలంగా అనవసరపు అనిశ్చితితో బాధపడుతున్నానని, ఇక దానికి స్వస్తి పలుకుతానంటూ ఆమె ట్వీట్‌ను మొదలుపెట్టింది. ‘ఆటలో ఇన్నాళ్లూ పోరాడాను. కానీ కంటికి కనిపించని ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియట్లేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఎన్నో కథనాలు చదువుతూ ఇంటి నుంచి అడుగు బయటపెట్టేందుకు ఆలోచించా. కానీ ఈ అనిశ్చితి నుంచి రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా. భయం, నెగెటివిటీ, అవాస్తవికతకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. పోరాడకుండా నేనెప్పుడూ ఓటమి ఒప్పుకోను. భారత్‌కు ప్రాతినిధ్యం వహించకుండా ఉండటం డెన్మార్క్ ఓపెన్‌తోనే ముగిస్తున్నా’ అని ఇకపై ఆడతాననే తన అభిలాషను సింధు విశ్లేషణాత్మకంగా వివరించింది. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘సింధు! నాకు మినీ షాక్ ఇచ్చావ్. కానీ నాకు నీ అకుంఠిత దీక్ష, సంకల్పంపై పూర్తి నమ్మకం ఉంది. దేశానికి ఇంకా ఎన్నో పురస్కారాలు అందిస్తావనే విశ్వాసం ఉంది’ అని రిజిజు ట్వీట్ చేశారు. -
శ్రీకాంత్ ఆరో‘సారీ’...
ఒడెన్స్: ఏడు నెలల తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 22–20, 13–21, 16–21తో ఓడిపోయాడు. చౌ తియెన్ చెన్ చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. శ్రీకాంత్ ఏకైకసారి 2014లో హాంకాంగ్ ఓపెన్‌లో చౌ తియెన్ చెన్పై గెలిచాడు. ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో తలపడిన ఆరుసార్లూ (2015 వరల్డ్ సూపర్‌సిరీస్ ఫైనల్స్; 2017 వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్; 2018 చైనా ఓపెన్; 2019 ఫ్రెంచ్ ఓపెన్; 2020 మలేసియా మాస్టర్స్ టోర్నీ; 2020 డెన్మార్క్ ఓపెన్) శ్రీకాంత్‌ను పరాజయమే పలకరించింది. 62 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... రెండో గేమ్ నుంచి ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ తడబడ్డాడు. ఒకదశలో 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ ఆ తర్వాత వెనుకబడి కోలుకోలేకపోయాడు. నిర్ణాయక మూడో గేమ్ లోనూ తియెన్ చెన్ పైచేయి సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శ్రీకాంత్‌కు 4,125 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీ, 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సైనాకు చుక్కెదురు
ఓదెన్స్(డెన్మార్క్): గత కొంతకాలంగా తొలి రౌండ్లోనే వెనుదిరుగుతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు మరోసారి అదే ఫలితం పునరావృతమైంది. డెన్మార్క్ ఓపెన్ సూప ర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధ వారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 15–21, 21–23తో తక హాషి(జపాన్) చేతిలో ఓటమి చవిచూసిం ది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజే త, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా ఈ మ్యాచ్‌లో తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయింది. తొలి సెట్‌ను చేజార్చు కున్నాక హోరాహోరీగా సాగిన రెండో సెట్లో సైనా పోరాడినప్పటికీ చివరికి ప్రత్యర్థి ధాటికి పరాజయం పాలైంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ 21–11, 21–11తో సునెయమ (జపాన్) ను చిత్తు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో చెన్ లాంగ్(చైనా)తో సమీర్ తలపడతాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా– సిక్కిరెడ్డి ద్వయం 21–16, 21–11తో సీడెల్–ఎఫ్లర్(జర్మనీ) జోడీపై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరగా, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–అశ్వని పొన్నప్ప ద్వయం ప్రత్యర్థి జోడీ వాంగ్–హువాంగ్(చైనా)కు వాకోవర్ ఇచ్చి పోటీ నుంచి తప్పుకొంది. -
సింధుకు మరో పరీక్ష
ఒడెన్స్: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఈ సీజన్లో మరో పరీక్షకు సిద్ధమైంది. నేటి నుంచి జరిగే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమెతో సహా భారత స్టార్ షట్లర్లంతా బరిలోకి దిగుతున్నారు. సింధు ప్రపంచ టైటిల్ నెగ్గినప్పటికీ ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. పైగా చైనా ఓపెన్, కొరియా ఓపెన్లలో అనూహ్యంగా ఆరంభ రౌండ్లలోనే ఓడి నిరాశపరిచింది. నేడు జరిగే తొలి రౌండ్లో గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)తో సింధు ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్... లిన్ డాన్ (చైనా)తో సాయిప్రణీత్.. జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రణయ్ ఆడతారు. -
టైటిల్‌కు విజయం దూరంలో
ఓడెన్స్: ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో విజయం దూరంలో నిలిచింది. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 21–11, 21–12తో ప్రపంచ 19వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సైనా ఆడుతుంది. గ్రెగోరియాతో కేవలం 30 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సైనాకు ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. ఈ టోర్నీ తొలి మ్యాచ్ నుంచి కాబోయే భర్త పారుపల్లి కశ్యప్, కోచ్ సియాదత్ కోర్టు పక్కనే ఉంటూ సైనాకు సలహాలు ఇస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆలస్యంగా ముగిసిన క్వార్టర్ ఫైనల్లో సైనా 17–21, 21–16, 21–12తో ప్రపంచ మాజీ చాంపియన్, ఏడో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. తై జు యింగ్‌పై నెగ్గేనా... 2012లో ఈ టోర్నీ టైటిల్ గెలిచిన సైనా ఈసారి అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గెలిచిన సైనా ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్)పై, ఎనిమిదో సీడ్ ఒకుహారాపై గెలిచింది. అయితే ఫైనల్లో తై జు యింగ్ రూపంలో సైనా సత్తాకు అసలు పరీక్ష ఎదురుకానుంది. కొన్నేళ్లుగా కొరకరాని కొయ్యగా మారిన తై జు యింగ్‌పై గెలిచి సైనాకు ఐదేళ్లు దాటింది. ఇప్పటివరకు వీరిద్దరు 17 సార్లు తలపడగా... తై జు యింగ్ 12 మ్యాచ్‌ల్లో... సైనా 5 మ్యాచ్‌ల్లో గెలిచారు. 2013 స్విస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో తై జు యింగ్‌పై గెలిచిన తర్వాత ఆమెతో ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో సైనాకు ఓటమే ఎదురైంది. ఈ ఏడాది ఈ చైనీస్ తైపీ షట్లర్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సైనాకు చుక్కెదురైంది. ఈ టోర్నీలో నిలకడగా ఆడుతోన్న సైనా ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి తై జు యింగ్ ఆట కట్టిస్తుందో లేదో వేచి చూడాలి. శ్రీకాంత్‌కు మళ్లీ నిరాశ... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ (భారత్)కు నిరాశ ఎదురైంది. ప్రపంచ చాంపియన్, నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)తో జరిగిన సెమీఫైనల్లో ఆరో ర్యాంకర్ శ్రీకాంత్ 16–21, 12–21తో ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. -
సెమీఫైనల్లో శ్రీకాంత్
ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ శ్రీకాంత్ 78 నిమిషాల్లో 22–20, 19–21, 23–21తో భారత్‌కే చెందిన సమీర్ వర్మను ఓడించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)తో శ్రీకాంత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 3–8తో వెనుకంజలో ఉన్నాడు. 2015 ఇండియా ఓపె న్లో చివరిసారి కెంటో మొమోటాపై నెగ్గిన శ్రీకాంత్ ఆ తర్వాత వరుసగా ఐదు సార్లు ఈ జపాన్ ప్లేయర్ చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 18–21, 21–17, 21–16తో బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ (చైనా)పై సంచలన విజయం సాధించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ విజేత, నాలుగుసార్లు ఆసియా చాంపియన్ అయిన 35 ఏళ్ల లిన్ డాన్‌పై శ్రీకాంత్ నెగ్గడం ఇది రెండోసారి. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 23–21, 6–21, 22–20తో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు. సైనా సంచలనం... మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21–15, 21–17తో సంచలన విజయం సాధించింది. 2014 చైనా ఓపెన్‌లో చివరిసారి యామగుచిని ఓడించిన సైనా ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఈ జపాన్ ప్లేయర్ చేతిలో ఓడింది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత మళ్లీ యామగుచిపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 18–21, 22–20, 21–18తో ఏడో సీడ్ లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (దక్షిణ కొరియా) జోడీపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
యామగూచికి సైనా షాక్
ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-15, 21-17 తేడాతో ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి యామగూచి(జపాన్)కి షాకిచ్చి క్వార్టర్ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఈ రెండు గేమ్‌ల్లో తొలుత వెనుకబడ్డ సైనా నెహ్వాల్.. ఆపై చెలరేగి ఆడారు. కేవలం 36 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సుదీర్ఘమైన ర్యాలీలు, చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో ఆకట్టకున్న సైనా.. ఎట్టకేలకు యామగూచికి బ్రేక్ వేశారు. దాదాపు నాలుగేళ్ల క్రితం చైనా ఓపెన్‌లో యమగూచిపై గెలిచిన సైనాకు ఆ తర్వాత ఇదే ఆమెపై తొలి విజయం. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరువురి క్రీడాకారిణుల ముఖాముఖి రికార్డులో యామగూచి 6-1తో ఆధిక్యంలో ఉన్నారు. కాగా, ఈసారి మాత్రం ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా సైనా నెహ్వాల్ తన అనుభవాన్ని ఉపయోగించి యామగూచి ఆటకట్టించారు. -
సిక్కి–అశ్విని జోడీ శుభారంభం
ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని జంట 21–7, 21–11తో ఏరియల్ లీ–సిడ్నీ లీ (అమెరికా) జోడీపై ఘనవిజయం సాధించింది. కేవలం 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంటకు ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు. రెండు గేమ్‌ల ఆరంభ దశలో పాయింట్లు కోల్పోయినా ఆ వెంటనే జోరు పెంచి భారత జంట అలవోకగా విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీ 17–21, 11–21తో ఎమ్మా కార్ల్సన్–జోనా మాగ్నుసన్ (స్వీడన్) ద్వయం చేతిలో ఓడింది. మంగళవారం ఆలస్యంగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అలవోక విజయాన్ని అందుకున్నాడు. హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–16, 21–10తో గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో సాయిప్రణీత్ (భారత్) 21–12, 14–21, 15–21తో హువాంగ్ యుజియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో చైనా దిగ్గజం లిన్ డాన్‌తో శ్రీకాంత్; జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో సమీర్ వర్మ; అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్; లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (దక్షిణ కొరియా)లతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప తలపడతారు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 1–3తో... సైనా 1–6తో వెనుకబడి ఉండగా... సమీర్ వర్మ 1–0తో ఆధిక్యంలో ఉన్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో చివరిసారి లిన్ డాన్‌తో తలపడ్డ శ్రీకాంత్ 3 గేములపాటు పోరాడి ఓడిపోయాడు. సైనా నెహ్వాల్ 2014 చైనా ఓపెన్‌లో చివరిసారి యామగుచిపై విజయం సాధించింది. -
సైనా, సింధు సత్తాకు పరీక్ష
ఓడెన్స్: ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సైనా, సింధులతోపాటు పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో బీవెన్ జాంగ్ (అమెరికా)తో సింధు; యి ఎన్గాన్ చెయుంగ్ (హాంకాంగ్)తో సైనా తలపడతారు. భారత స్టార్స్ ఇద్దరికీ కఠినమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సైనా; అయా ఒహోరి (జపాన్)తో సింధు ఆడే అవకాశముంది. ఈ రౌండ్‌ను దాటితే క్వార్టర్స్‌లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు; మాజీ ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సైనా తలపడే చాన్స్ ఉంది. -
‘నా పాస్‌పోర్ట్ పోయింది.. సాయం చేయరూ’
ఆమ్స్టర్డామ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉన్న కశ్యప్.. తన పాస్‌పోర్ట్ పోయిన విషయాన్ని ట్వీటర్ ద్వారా తెలియజేశాడు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పునరుద్దరించేందుకు ఏర్పాటు చేయాలని విన్నవించాడు. ‘నా పాస్ట్‌పోర్ట్ పోయింది. గత రాత్రి ఆమెస్టర్‌డామ్‌లో నా పాస్‌పోర్ట్‌ను పోగుట్టుకున్నాను. నేను ఇప్పుడు డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ జర్మనీ ఓపెన్, సార్లౌక్స్ ఓపెన్‌లో పాల్గొనడానికి పయనం కావాల్సి ఉంది. డెన్మార్క్‌కు వెళ్లడానికి ఆదివారం నాటికి టికెట్ తీసుకున్నాను. అదే సమయంలో నా పాస్‌పోర్ట్ పోయింది. ఈ విషయంలో సుష్మా జీ సాయం చేయండి. ఈ వ్యవహారంలో త్వరతగతిన సాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’అని కశ్యప్ ట్వీట్లో పేర్కొన్నాడు. తన ట్వీట్‌ను క్రీడాశాఖా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌కు, ప్రధాని నరేంద్ర మోదీలకు సైతం ట్యాగ్ చేశాడు. Good Morning Ma’am, I’ve lost my passport at Amsterdam last night . I have to travel to Denmark Open, French Open and Saarloux Open,Germany . My ticket for Denmark is on Sunday, 14th October .I request help in this matter . @SushmaSwaraj @Ra_THORe @himantabiswa @narendramodi — Parupalli Kashyap (@parupallik) 13 October 2018 -
క్వాలియింగ్‌లో కశ్యప్ ఓటమి
ఒడెన్‌స: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలియింగ్ తొలి రౌండ్లో ప్రపంచ 92వ ర్యాంకర్ కశ్యప్ 13-21, 21-8, 20-22తో ప్రపంచ 47వ ర్యాంకర్ రౌల్ మస్ట్ (ఎస్తోనియా) చేతిలో ఓడిపోయాడు. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ నిర్ణాయక మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్లును వృథా చేశాడు. ఒకదశలో 14-19తో వెనుకబడిన కశ్యప్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 20-19తో విజయానికి ఒక పాయింట్లు దూరంలో నిలిచాడు. అయితే రౌల్ మస్ట్ పట్టుదలతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి కశ్యప్ ఓటమిని ఖాయం చేశాడు. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో సింధు, సాయిప్రణీత్, జయరామ్, ప్రణయ్ బరిలోకి దిగనున్నారు. -
‘సూపర్’ టైటిల్‌పై సింధు గురి
ఒడెన్‌స (డెన్మార్క్): అందని ద్రాక్షగా ఉన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో భారత స్టార్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో బరిలోకి దిగనుంది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతోపాటు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చైనా ప్లేయర్ హీ బింగ్జియావోతో సింధు ఆడుతుంది. రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన తర్వాత సింధు ఆడనున్న తొలి టోర్నమెంట్ ఇదే కావడం విశేషం. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సింధు ఈసారి విజేతగా నిలిచి తన ఖాతాలో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను జమ చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ‘రియో ఒలింపిక్స్ ప్రదర్శనతో నాలో చాలా ఆత్మ విశ్వాసం పెరిగింది. అదే ఉత్సాహంతో ఈ టోర్నీలో మెరుగ్గా రాణిస్తానని ఆశిస్తున్నాను. ఇప్పటి నుంచి నాపై మరింత బాధ్యత పెరిగింది. అరుుతే ఇలాంటి విషయాలను ఆలోచిస్తూ అనవసరంగా ఒత్తిడి పెంచుకోదల్చుకోలేదు. విజయం సాధించేందుకు ఎప్పటిలాగే వందశాతం కృషి చేస్తాను’ అని హీ బింగ్జియావోతో ముఖాముఖి రికార్డులో 1-3తో వెనుకంజలో ఉన్న సింధు వ్యాఖ్యానించింది. ‘డ్రా’ రెండో పార్శ్వంలో ఉన్న సింధు తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో సయాకా సాటో (జపాన్)... క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)... సెమీస్‌లో నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా) లేదా ఐదో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో ఆడే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి ప్రపంచ నంబర్‌వన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్) ఫైనల్‌కు చేరే అవకాశముంది. క్వాలిఫయింగ్‌లో కశ్యప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత మాజీ నంబర్‌వన్ పారుపల్లి కశ్యప్ క్వాలిఫయింగ్‌లో పోటీపడనున్నాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్లో అతను రౌల్ మస్ట్ (ఎస్తోనియా)తో ఆడతాడు. ఈ మ్యాచ్ గెలిస్తే రెండో రౌండ్లో కశ్యప్‌కు ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్) లేదా ఖోసిట్ (థాయ్‌లాండ్) ఎదురవుతారు. గాయం కారణంగా భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి సాయిప్రణీత్, అజయ్ జయరామ్, ప్రణయ్ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా బరిలో ఉన్నారు. -
సింధు జోరు
ఒడెన్స్:రెండు సార్లు వరల్డ్ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత, హైదరాబాద్ అమ్మాయి పివి సింధు డెన్మార్క్ ఓపెన్ లో సంచలన విజయాలను నమోదు చేస్తోంది. నిన్న ప్రపంచ నాలుగో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ కు చేరిన సింధు.. ఈరోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భాగంగా శనివారం జరిగిన పోరులో సింధు 21-18, 21-19 తేడాతో మాజీ నంబర్ వన్ వాంగ్ యిహాన్ (చైనా)పై వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్ కు చేరింది. 45 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు ఆద్యంతం ఆకట్టుకుంది. సెమీ ఫైనల్లో సింధు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, వరల్డ్ నంబర్ వన్ కరోలినా మారిన్ తో ఆడనుంది. ఇద్దరి రికార్డులను పరిశీలిస్తే మారిన్ దే పై చేయిగా ఉంది. అంతకుముందు ఇరువురి మధ్య జరిగిన గత మూడు మ్యాచ్ ల్లో మారిన్ విజయం సాధించింది.