
ఒడెన్స్: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఈ సీజన్‌లో మరో పరీక్షకు సిద్ధమైంది. నేటి నుంచి జరిగే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమెతో సహా భారత స్టార్ షట్లర్లంతా బరిలోకి దిగుతున్నారు. సింధు ప్రపంచ టైటిల్ నెగ్గినప్పటికీ ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. పైగా చైనా ఓపెన్, కొరియా ఓపెన్‌లలో అనూహ్యంగా ఆరంభ రౌండ్లలోనే ఓడి నిరాశపరిచింది. నేడు జరిగే తొలి రౌండ్‌లో గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)తో సింధు ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్... లిన్ డాన్ (చైనా)తో సాయిప్రణీత్.. జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రణయ్ ఆడతారు.
Comments
Please login to add a commentAdd a comment