Sai Praneeth
-
గోపీచంద్ అకాడమీకి బైబై..!.. అమెరికాకు పయనం!
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా పుల్లెల గోపీచంద్ అకాడమీలో కోచ్‌గా పని చేస్తున్న మొహమ్మద్ సియాదతుల్లా సిద్దిఖి అకాడమీని వీడనున్నాడు. అమెరికాలోని ఒరెగాన్ బ్యాడ్మింటన్ అకాడమీలో సియాదతుల్లా కోచ్‌గా చేరనున్నాడు. 40 ఏళ్ల సియదతుల్లా భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్ తదితరుల వెంట పలు అంతర్జాతీయ టోర్నీల్లో కోచ్‌గా వెళ్లాడు. ‘నా బావ మరిది అమెరికాలో ఉంటున్నాడు. అతను ఈ ప్రతిపాదన తెచ్చాడు. ప్రతిపాదన బాగుండటంతో అంగీకరించాను. ఈనెల 7వ తేదీన అమెరికాకు వెళుతున్నాను. జూన్‌లో కుటుంబసభ్యులు అమెరికాకు వస్తారు’ అని సియాదతుల్లా తెలిపాడు. అమెరికాలో బ్యాడ్మింటన్ అకాడమీ హెడ్ కోచ్‌గా సాయిప్రణీత్ భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుల్లో ఒకడైన భమిడిపాటి సాయిప్రణీత్ ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. త్వరలో హెడ్ కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. వచ్చే నెలలో అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీ హెడ్ కోచ్‌గా 31 ఏళ్ల సాయిప్రణీత్ బాధ్యతలు తీసుకోనున్నాడు. 2008 నుంచి అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిప్రణీత్ చివరిసారి గత ఏడాది డిసెంబర్లో గువాహటి మాస్టర్స్ టోర్నీలో పోటీపడి రెండో రౌండ్లో ఓడిపోయాడు. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సాయిప్రణీత్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి లీగ్ దశలో నిష్క్రమించాడు. 2019లో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ అందుకున్నాడు. ►కెరీర్ మొత్తంలో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి సాయిప్రణీత్ 417 మ్యాచ్‌లు ఆడాడు. 243 మ్యాచ్‌ల్లో నెగ్గి, 174 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ►2020లో కెరీర్ బెస్ట్ 10వ ర్యాంక్‌ను అందుకున్న సాయిప్రణీత్ ప్రస్తుతం 106వ ర్యాంక్‌లో ఉన్నాడు. ►2019లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గడం సాయిప్రణీత్ కెరీర్లో హైలైట్. 2017లో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కూడా సాధించాడు. ►2016లో కెనడా గ్రాండ్‌ప్రి, 2017లో థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి టోర్నీల్లోనూ విజేతగా నిలిచాడు. ►2016, 2020లలో జరిగిన ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ►2010లో మెక్సికోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో, 2008లో కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో సాయిప్రణీత్ కాంస్య పతకాలు గెలిచాడు. ►బ్యాడ్మింటన్‌లో మేటి క్రీడాకారులైన లిన్ డాన్, చెన్ లాంగ్ (చైనా), లీ చోంగ్ వె (మలేసియా), తౌఫిక్ హిదాయత్ (ఇండోనేసియా), కెంటో మొమోటా (జపాన్), టామీ సుగియార్తో (ఇండోనేసియా), ఆంథోని జిన్‌టింగ్ (ఇండోనేసియా)లపై సాయిప్రణీత్ విజయాలు నమోదు చేశాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షట్లర్
హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా ఇవాళ (మార్చి 4) వెల్లడించాడు. 31 ఏళ్ల సాయి ప్రణీత్ అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ఎన్ని పతకాలు సాధించిపెట్టాడు. 2019లో అతను వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం గాయాలతో సతమతమైన ప్రణీత్.. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. ప్రణీత్ తన కెరీర్లో సింగపూర్ ఓపెన్, కెనడా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు. కెరీర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రణీత్.. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించలేకపోయానని బాధపడ్డాడు. ప్రణీత్‌ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రణీత్ రిటైర్మెంట్ సందేశంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. View this post on Instagram A post shared by Sai Praneeth (@saipraneeth92) ప్రణీత్ తన కెరీర్ మొత్తంలో 225 విజయాలు సాధించి, 151 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 46 స్థానంలో ఉన్న ప్రణీత్.. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్‌కు సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం ప్రణీత్ కోచ్‌గా సేవలించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. యూఎస్‌లోని నార్త్ కరోలినా క్లబ్లో అతను కోచ్‌గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
సైనా, సాయిప్రణీత్ ఓటమి
న్యూఢిల్లీ: ఓర్లియాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, సాయిప్రణీత్ నిరాశ పరిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 16–21, 14–21తో తుర్కియే షట్లర్ నిష్లిహాన్ యిగిట్ చేతిలో... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిప్రణీత్ 20–22, 17–21తో లీంగ్ జున్ హావో (మలేసియా) చేతిలో ఓడిపోయారు. -
Malaysia Masters: అదరగొట్టిన సింధు, ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్‌లో ఏడో సీడ్ పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–12, 21–10తో ప్రపంచ 32వ ర్యాంకర్ జంగ్ యి మన్ (చైనా)పై అలవోక విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. పురుషుల ఈవెంట్లో ప్రణయ్ 21–19, 21–16తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. సాయిప్రణీత్ 14–21, 17–21తో లి షె ఫెంగ్ (చైనా) చేతిలో, కశ్యప్ 10–21, 15–21తో ఆరో సీడ్ ఆంథోని సినిసుక (ఇండోనేసియా) చేతిలో వరుస గేముల్లో కంగుతిన్నారు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో సింధు... రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో, ప్రణయ్... జపాన్‌కు చెందిన సునెయామతో తలపడతారు. చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్ ఆల్‌రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం -
Malaysia Open: తొలి రౌండ్లోనే అవుట్.. పోరాడి ఓడిన సాయి ప్రణీత్
కౌలాలంపూర్: భారత అగ్రశ్రేణి షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 19వ ర్యాంకర్ సాయిప్రణీత్ 15–21, 21–19, 9–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ సీజన్లో సాయిప్రణీత్ ఏడు టోర్నీలలో పాల్గొనగా, ఆరింటిలో తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. మరోవైపు సమీర్ వర్మ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోగా, ప్రణయ్ శుభారంభం చేశాడు. 2018 ఆసియా క్రీడల చాంపియన్ క్రిస్టీ (ఇండోనేసియా) 21–14, 13–21, 21–7తో సమీర్ వర్మను ఓడించగా... ప్రణయ్ 21–14, 17–21, 21–18తో డారెన్ లూ (మలేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–18, 21–11 తో మాన్ వె చోంగ్–కయ్ వున్ టీ (మలేసియా) జోడీపై గెలి చింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని (భారత్) జంట 15– 21, 11–21తో మత్సుయామ–చిహారు (జపాన్) జోడీ చేతిలో ఓడింది. చదవండి: Wimbledon 2022: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు -
Malaysia Open Badminton: తాడో పేడో తేల్చుకోనున్న సాయిప్రణీత్
కౌలాలంపూర్: కొంతకాలంగా నిలకడలేమితో ఇబ్బంది పడుతోన్న భారత అగ్రశ్రేణి షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ మరో టోర్నీకి సిద్ధమయ్యాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన ఈ హైదరాబాద్ ప్లేయర్‌కు ఈ ఏడాదీ కలసి రావడంలేదు. ఈ సంవత్సరం ఆరు టోర్నీలలో బరిలోకి దిగిన సాయిప్రణీత్ ఐదు టోర్నీలలో తొలి రౌండ్లోనే వెనుదిరగ్గా... మరో టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. నేడు మొదలయ్యే మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీలో 30 ఏళ్ల సాయిప్రణీత్‌కు తొలి రౌండ్లోనే క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రపంచ 19వ ర్యాంకర్ సాయిప్రణీత్ తలపడనున్నాడు. సాయిప్రణీత్‌తోపాటు హెచ్ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ మలేసియా ఓపెన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలో ఉన్నారు. చదవండి: Wimbledon: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. జకోవిచ్ శుభారంభం.. -
సాయిప్రణీత్‌కు కరోనా పాజిటివ్
బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్ ఇండియా ఓపెన్ నుంచి భారత అగ్రశ్రేణి ప్లేయర్, హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ వైదొలిగాడు. ఆదివారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో సాయిప్రణీత్‌కు పాజిటివ్ రావడంతో... మంగళవారం నుంచి న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీ నుంచి అతను తప్పుకున్నాడు. ‘రెండు రోజుల నుంచి నాకు దగ్గు, జలుబు ఉంది. కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను’ అని సాయిప్రణీత్ తెలిపాడు. -
శ్రీకాంత్ శుభారంభం.. తొలి రౌండ్లోనే సాయిప్రణీత్‌కు షాక్
World Badminton Championship: Kidambi Srikanth Wins First Round (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేయగా... 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–12, 21–16తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో 16వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–17, 7–21, 18–21తో 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 16–21, 15–21తో జోయెల్ ఎల్పీ–రస్ముస్ జార్ (డెన్మార్క్) జంట చేతిలో పరాజయం పాలైంది. చదవండి: KS Bharat Century: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం.. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ భారీ ధర కన్ఫర్మ్ -
క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–12, 21–18తో వైవోన్ లీ (జర్మనీ)పై అలవోక విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టోర్నీ మూడో సీడ్ సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించి టోర్నీలో ముందంజ వేసింది. నేడు జరిగే క్వార్టర్స్ పోరులో సిమ్ యుజిన్ (కొరియా)తో సింధు ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 21–17, 14–21, 21–19తో క్రిస్టో పోపొవ్ (ఫ్రాన్స్)పై పోరాడి గెలిచాడు. అయితే మరో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు మాత్రం ప్రిక్వార్టర్స్‌లో నిరాశ ఎదురైంది. శ్రీకాంత్ 14–21, 18–21తో టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–15, 19–21, 23–21తో కంగ్ మిన్‌హ్యూక్– సియో సెంగ్‌జే (కొరియా) జంటపై నెగ్గి ముందంజ వేసింది. చదవండి: IND Vs NZ: మొదటి రోజు దుమ్ములేపిన భారత బ్యాటర్లు.. తొలి మ్యాచ్‌లోనే అయ్యర్ అర్ధ సెంచరీ -
PV Sindhu: సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం...
Indonesia Open- PV Sindhu Kidambi Srikanth Sai Praneeth Enters 2nd Round: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ శుభారంభం చేశారు. బుధవారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టోర్నీ మూడో సీడ్ సింధు 17–21, 21–17, 21–17తో జపాన్ షట్లర్ అయా ఒహోరిపై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–15, 19–21, 21–12తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)పై, సాయి ప్రణీత్ 21–19, 21–18తో టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి ద్వయం 27–29, 18–21తో గ్యాబ్రియెల్ స్టొయెవా– స్టిఫాని స్టొయెవా (బల్గేరియా) జంట చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్–అశ్విని పొన్నప్ప (భారత్) 24–22, 12–21, 19–21తో టకురో హోకి– నమి మత్సుయమ (జపాన్) చేతిలో, ధ్రువ్ కపిల–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 7–21, 12–21తో యమషిటా–నరు షినోయ (జపాన్) జంట చేతిలో ఓడారు. చదవండి: IPL 2022 Auction: ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునేది వీళ్లనే..! -
Uber Cup: 11 ఏళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్స్‌కు
అర్హుస్ (డెన్మార్క్): థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో 11 ఏళ్ల తర్వాత భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. తాహితి జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండో గెలుపుతో ఈ టోర్నీలో 2010 తర్వాత భారత్‌కు నాకౌట్ బెర్త్ ఖరారైంది. ఇదే గ్రూప్ నుంచి చైనా కూడా క్వార్టర్స్‌కు చేరింది. నేడు భారత్, చైనా మధ్య జరిగే మ్యాచ్ విజేత గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. తాహితి జట్టుతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో సాయిప్రణీత్ 21–5, 21–6తో లూయిస్ బిబోయిస్‌ను ఓడించాడు. రెండో మ్యాచ్‌లో సమీర్ వర్మ 21–12, 21–12తో రెమి రోస్‌పై, మూడో మ్యాచ్‌లో కిరణ్ జార్జి 21–4, 21–2తో మౌబ్లాంక్‌పై గెలవడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తర్వాత రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్; సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీలు తమ ప్రత్యర్థి జంటలపై గెలుపొందాయి. మరోవైపు ఉబెర్ కప్‌లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 0–5తో థాయ్‌లాండ్ జట్టు చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో భారత్ ఆడనుంది. -
చేతులు కలుపుదాం.. కలిసి సాగుదాం
న్యూఢిల్లీ: అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్’అనే నినాదంతో దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మన క్రీడాకారులు విజయులై తిరిగిరావాలని ఆకాంక్షించారు. భారత ఆటగాళ్లకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ► భారతదేశానికి పరాయి పాలన నుంచి స్వాతంత్య్ర లభించి ఈ ఆగస్టు 15వ తేదీ నాటికి 74 ఏళ్లు పూర్తయ్యి 75వ సంవత్సరం రాబోతోంది. ఏడాది తర్వాత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా దేశమంతటా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్నాం. ► జాతి అభివృద్ధి దిశగా కలిసి పనిచేయడం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. ► జాతిపిత మహాత్మాగాంధీ భారత్ చోడో ఆందోళన్ (క్విట్ ఇండియా ఉద్యమం) చేపట్టారు. అదే స్ఫూర్తితో ప్రతి భారతీయుడు భారత్ జోడో ఆందోళన్ (ఐక్య భారత ఉద్యమం)లో పాలు పంచుకోవాలి. వైవిధ్యం, భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో ఐక్యంగా ఉండడం అందరి బాధ్యత. ► అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారత జాతీయ గీతం జనగణమనను సాధ్యమైనంత ఎక్కువ మంది కలిసి ఆలపించేలా కేంద్ర సాంస్కృతిక శాఖ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం http://rarhtrafan.in అనే వెబ్‌సైట్‌ను సృష్టించింది. ఈ వెబ్సైట్ ద్వారా జాతీయ గీతాన్ని ఆలపించి, రికార్డు చేసుకోవచ్చు. జాతీయ గీతం ఆలాపనతో మీరంతా అనుసంధానమై ఉంటారని ఆశిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో మన ముందుకు రాబోతున్నాయి. ► ఒలింపిక్ క్రీడల్లో మన ఆటగాళ్లను ప్రోత్సహించండి. ఇందుకోసం ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రారంభమైన ‘విక్టరీ పంచ్’ ప్రచార కార్యక్రమంలో పాల్గొనండి. భారత ఆటగాళ్లకు మద్దతు కొనసాగించండి. మీ విక్టరీ పంచ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు. ► ఈ నెల 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. 1999లో మన దేశం గర్వించేలా అపూర్వ పోరాటం సాగించిన అమర జవాన్లకు నివాళులర్పించాల్సిన సందర్భమిది. ► ఇక మన్ కీ బాత్ అనేది ప్రతినెలా సానుకూలత, సామూహికతకు సంబంధించిన వేడుకలాంటిది. దీనిపై ప్రజల నుంచి వస్తున్న అన్ని సలహాలు సూచనలను నేను పాటించలేకపోవచ్చు కానీ వాటిలో చాలావరకు సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపిస్తున్నా. ► మన్ కీ బాత్‌కి సందేశాలు, సలహాలు అందజేస్తున్న వారిలో దాదాపు 75 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని ఒక అధ్యయనంలో తేలింది. ఇదొక మంచి పరిణామం. ఈ కార్యక్రమంలో సానుకూలత, సున్నితత్వం ఇమిడి ఉన్నాయి. ఇందులో సానుకూల అంశాలే మాట్లాడుకుంటాం. ► దేశంలో వలస పాలన కొనసాగుతున్నప్పుడు దేశ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఒక్కతాటిపైకి వచ్చారు. ఉమ్మడి లక్ష్య సాధన కోసం చేతులు కలిపారు. ఇప్పుడు దేశ అభివృద్ధి కోసం ప్రజలంతా చేతులు కలపాలి. ► స్థానిక వ్యాపారులకు, కళాకారులకు, వృత్తి నిపుణులకు, చేనేత కార్మికులకు అండగా నిలవడం ద్వారా జాతి నిర్మాణంలో భాగస్వాములు కావొచ్చు, ► ఆగస్టు 7వ తేదీ మనకు జాతీయ చేనేత దినోత్సవం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చాలామందికి అతిపెద్ద ఆదాయ వనరు చేనేత ఉత్పత్తులే. అందుకే వాటిని కొనుగోలు చేయండి. ► 2014 నుంచి మన దేశంలో ఖాదీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడం హర్షించదగ్గ పరిణామం. సాయిప్రణీత్‌కు ప్రత్యేక అభినందనలు దేశంలో వివిధ కీలక రంగాల్లో పలువురు కొనసాగిస్తున్న కృషిని ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రశంసించారు. వాతావరణ నిపుణుడిగా (వెదర్ మ్యాన్) గుర్తింపు పొందిన సాయిప్రణీత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సాయిప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వాతావరణ సంబంధిత అంశాలను క్షుణ్నంగా విశ్లేషించడంలో దిట్టగా ప్రఖ్యాతి పొందారు. సాయి ప్రణీత్ తన ఆసక్తి, ప్రతిభను రైతుల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారని మోదీ కితాబిచ్చారు. వాతావరణ వివరాలను వివిధ మార్గాల ద్వారా సేకరించి విశ్లేషిస్తూ, స్థానిక భాషలో రైతులకు సలహాలు, సూచనలు పంపడం అభినందనీయమన్నారు. -
టోక్యో ఒలింపిక్స్‌కు కోచ్ గోపీచంద్ దూరం
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఈసారి ఒలింపిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే శిక్షణ సహాయ సిబ్బందిని అనుమతిస్తుండటంతో ఆయన గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. జాతీయ కోచ్‌గా ఆయనకు అవకాశమున్నప్పటికీ సింగిల్స్ ప్లేయర్ సాయిప్రణీత్ వ్యక్తిగత కోచ్ అగుస్ వి సాంటోసాకు చాన్స్ ఇవ్వాలని గోపీ తప్పుకున్నారు. ఒక్కో క్రీడాంశానికి గరిష్టంగా ఐదుగురు (ముగ్గురు కోచ్‌లు, ఇద్దరు ఫిజియోలు) సహాయ సిబ్బంది మాత్రమే టోక్యోకు వెళ్లేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అనుమతిస్తోంది. పీవీ సింధు వెంట వ్యక్తిగత కోచ్ తే సాంగ్ పార్క్... డబుల్స్ జంట సాతి్వక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి వెంట కోచ్ మథియాస్ బో... ఇద్దరు ఫిజియోలు (సుమాన్ష్ శివలంక, బద్దం ఇవాంజలైన్) వెళ్లనున్నారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఏడుగురు కోచ్‌లు వెళ్లేందుకు అవకాశమివ్వాలని ఐఓఏకు లేఖ రాసింది. కానీ ప్రస్తుత కరోనా ప్రొటోకాల్ ప్రకారం ఆటగాళ్ల సంఖ్యలో 33 శాతానికి మించి సహాయ సిబ్బందిని పంపే వీలులేకపోవడంతో ‘బాయ్’ వినతిని ఐఓఏ తోసిపుచ్చింది. -
ఖేల్‌రత్న రేసులో తెలుగు తేజాలు
చెన్నై: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ కోసం ఈసారి భారీగానే దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరించేందుకు మరో మూడు రోజులు ఉన్నందున ఆయా జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు తమ అత్యుత్తమ క్రీడాకారుల పేర్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం నామినేట్ చేస్తున్నాయి. తాజాగా అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) భారత మహిళా చెస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి పేరును ‘ఖేల్‌రత్న’ కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 34 ఏళ్ల హంపి 2019 డిసెంబర్లో ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా గతేడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్‌లోనూ టైటిల్ సాధించింది. మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భాగంగా 2019లో రష్యాలో జరిగిన తొలి టోర్నీలో చాంపియన్‌గా, మొనాకో లో జరిగిన రెండో టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా గ్రాండ్‌ప్రి సిరీస్‌లో రెండో స్థానంలో నిలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులోనూ హంపి సభ్యురాలిగా ఉంది. హంపికి 2003లోనే అర్జున అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబుతోపాటు ఇతర ప్లేయర్లు విదిత్ గుజరాతి, ఆధిబన్, సేతురామన్, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ఏఐసీఎఫ్ గౌరవ కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ నామినేట్ చేశారు. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్... తెలంగాణకు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ పేర్లను ‘ఖేల్‌రత్న’ కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సిఫారసు చేసింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో సాయిప్రణీత్ ఒక్కడే అర్హత సాధించాడు. మరోవైపు 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత చెప్పుకోతగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ చోప్రా, సమీర్ వర్మ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ‘బాయ్’ ప్రతిపాదించింది. ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ కోసం ఒలింపియన్ పీవీవీ లక్ష్మి, లెరాయ్ డిసా పేర్లను... ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం భాస్కర్ బాబు, మురళీధరన్ పేర్లను ‘బాయ్’ పంపించింది. అవార్డీల కమిటీ మొత్తం దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు తొలి వారంలో తుది అవార్డులు గెల్చుకున్న వారి జాబితాను ప్రకటించే అవకాశముంది. -
'ఖేల్‌రత్న' రేసులో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్
న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు కోసం స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌ల పేర్లను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) ప్రతిపాదించింది. అలాగే మరో ముగ్గురు షట్లర్ల పేర్లను అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ జెర్రీ చోప్రా, సమీర్ వర్మలను అర్జున అవార్డు బరిలో నిలిపింది. ద్రోణాచార్య అవార్డు కోసం ఎస్ మురళీధరన్, పీయూ భాస్కర్ల పేర్లను కేంద్ర క్రీడా శాఖకు సిఫార్సు చేసింది. వీరిలో మురళీధరన్‌కు ఇప్పటికే ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే, 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన సాయి ప్రణీత్.. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు పురుషుల సింగిల్స్ విభాగంలో క్వాలిఫై అయిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక కిదాంబి శ్రీకాంత్ విషయానికొస్తే.. ఈ స్టార్ షట్లర్ ఇటీవల కాలంలో ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో అతను టోక్యో బెర్తు కూడా సాధించలేకపోయాడు. కిదాంబి శ్రీకాంత్ చివరిసారిగా 2017లో నాలుగు టైటిల్స్ సాధించాడు. కాగా, ఈ అవార్డు కోసం క్రికెట్ విభాగంలో మిథాలీ రాజ్, రవిచంద్రన్ అశ్విన్ నామినేట్ కాగా, ఆర్చరీలో వన్నెం జ్యోతి సురేఖ, ఫుట్‌బాల్‌లో సునీల్ ఛెత్రీ, టీటీలో శరత్ కమల్, జావలీన్ త్రోలో నీరజ్ చోప్రా తదితరులు నామినేట్ అయ్యారు. -
సారథులుగా శ్రీకాంత్, సింధు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనే 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించారు. పురుషుల జట్టును ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ నడిపించనున్నాడు. డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3నుంచి 11వరకు జరుగనున్న ఈ టోర్నీలో కశ్యప్, లక్ష్యసేన్, శుభాంకర్, సిరిల్ వర్మ, మను అత్రి, సుమీత్ రెడ్డి, అర్జున్, ధ్రువ్ కపిల, కృష్ణ ప్రసాద్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. మోకాలి గాయం కారణంగా ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ చాంపియన్ పీవీ సింధుతో పాటు సైనా నెహ్వాల్, అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డిలతో పాటు మాల్విక బన్సోద్, ఆకర్షి కశ్యప్, పూజ, సంజన సంతోష్, పూర్వీషా రామ్, జక్కంపూడి మేఘన జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేసి జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మేరకు సెప్టెంబర్ 3–27 వరకు శిబిరం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో అకాడమీలోనే ఉంటూ ప్రాక్టీస్ చేసేందుకు కొందరు ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. పైగా క్యాంప్ ప్రారంభానికి ముందు నిబంధనల ప్రకారం వారం రోజుల క్వారంటీన్ తప్పనిసరి కావడంతో అంత సమయం లేదని భావించిన ‘బాయ్’ మొత్తం శిబిరాన్నే రద్దు చేసింది. థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ అనంతరం జరుగనున్న డెన్మార్క్ ఓపెన్ (అక్టోబర్ 13–18), డెన్మార్క్ మాస్టర్స్ (అక్టోబర్ 20–25) టోర్నీల్లోనూ శ్రీకాంత్, లక్ష్యసేన్, సింధు, సైనా, అశ్విని, సిక్కిరెడ్డి ఆడనున్నారు. -
టీకా వస్తేనే ఆటలకు మేలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వైరస్‌కు టీకా అందుబాటులోకి వచ్చాకే క్రీడా ఈవెంట్లను ప్రారంభించాలని భారత స్టార్ షట్లర్ సాయిప్రణీత్ అభిప్రాయపడ్డాడు. ఆ టీకాకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆమోదం ఉంటే క్రీడాకారులు ధైర్యంగా పోటీల్లో పాల్గొనగలరని పేర్కొన్నాడు. పరిస్థితులు సద్దుమణిగినా కూడా... వ్యాక్సినేషన్ లేకుంటే అందరిలో కరోనా భయం తొలగిపోదన్నాడు. ‘వాడా నిషేధించిన డ్రగ్స్ లేకుండా టీకా ఉంటే క్రీడాకారులకు మంచిది. లేకపోతే ప్లేయర్ల భవిష్యత్ కష్టాల్లో పడుతుంది. టీకా లేకుండా పరిస్థితులు కచ్చితంగా మన చేతుల్లోకి రావు. ఆటగాళ్లు తరచూ విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. కరోనా మొత్తం తగ్గిన తర్వాత కూడా చైనా, కొరియా లాంటి దేశాలకు వెళ్లాలంటే ఆటగాళ్లు ఆందోళన చెందుతారు. ఎందుకంటే ప్రయాణాల్లో, బ్యాడ్మింటన్ కోర్టుల్లో ప్రతీసారి, ప్రతీచోటా సామాజిక దూరం పాటించడం కుదరదు. కొన్నిచోట్ల వైరస్ తగ్గినట్లే తగ్గి తిరగబెడుతోంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో టీకా లేకుండా టోర్నీలు ఆడటం సాహసమే. ఇప్పుడిప్పుడే టీకా ప్రయోగాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ వరకు బ్యాడ్మింటన్ టోర్నీలు ఉండకపోవచ్చు’ అని ఈ హైదరాబాదీ ప్లేయర్ వివరించాడు. -
సాయిప్రణీత్ విరాళం రూ. 4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాడు, హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ తనవంతుగా రూ. 4 లక్షలు విరాళం ఇచ్చాడు. గతేడాది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన సాయిప్రణీత్... ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 లక్షలు... తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 1 లక్ష వితరణ చేశాడు. కరోనా కట్టడి కోసం ఇప్పటి వరకు బ్యాడ్మింటన్ క్రీడాంశం నుంచి చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ (రూ. 26 లక్షలు), పీవీ సింధు (రూ. 10 లక్షలు), శ్రీకృష్ణప్రియ (రూ. 5 లక్షలు), కశ్యప్ (రూ. 3 లక్షలు) విరాళాలు ఇచ్చారు. హాకీ ఇండియా (హెచ్ఐ) ఇప్పటికే పీఎం–కేర్స్ రిలీఫ్ ఫండ్ కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించగా... తాజా ఒడిశా సీఎం సహాయనిధికి రూ. 21 లక్షలు ఇచ్చింది. చెస్ క్రీడాకారుల దాతృత్వం కోవిడ్–19పై పోరాటానికి చెస్ క్రీడాకారులందరూ ఏకమయ్యారు. ఆన్లైన్ టోర్నీల్లో పాల్గొనడం, విరాళాల ద్వారా రూ. 3 లక్షలకు పైగా నిధుల్ని సమకూర్చారు. తమిళనాడుకు చెందిన చెస్ కోచ్ ఆర్బీ రమేశ్‌కు చెందిన చారిటబుల్ ట్రస్ట్ ‘చెస్ గురుకుల్’కు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రూ. 2 లక్షలు, కార్తికేయన్ మురళి రూ. 25,000 విరాళం ఇచ్చారు. -
బెంగళూరుకు చుక్కెదురు
చెన్నై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 3–4తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ చేతిలో ఓడింది. ఒకదశలో 1–3తో ఆధిక్యంలో నిలిచిన బెంగళూరు... అనంతరం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పరాజయాన్ని మూట గట్టుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో చాన్ పెంగ్–యోమ్ హే వోన్ (బెంగళూరు) ద్వయం 15–8, 15–11తో లీ యంగ్ డే–కిమ్ హన (నార్త్ ఈస్టర్న్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ (బెంగళూరు) 14–15, 9–15తో లే చియుక్ యు (నార్త్ ఈస్టర్న్) చేతిలో ఓడటంతో... ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (బెంగళూరు) 15–7, 15–5తో అస్మిత (నార్త్ ఈస్టర్న్)పై గెలుపొందింది. ఈ పోరులో బెంగళూరు ‘ట్రంప్ కార్డు’ ఉపయోగించడంతో రెండు పాయింట్లు లభించాయి. దాంతో బెంగళూరు 3–1తో ఆధిక్యంలోకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన నార్త్ ఈస్టర్న్ జోడీ బొదిన్ ఇసారా–లీ యంగ్ డే ద్వయం 15–12, 15–6తో అరుణ్ జార్జ్–రియాన్ అగుంగ్ సపుర్తో (బెంగళూరు) జంటను చిత్తు చేసింది. దీంతో మరోసారి ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమం అయ్యాయి. ఇక విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్ అయిన పురుషుల రెండో సింగిల్స్‌లో సెన్సోమ్బూన్సుక్ (నార్త్ ఈస్టర్న్) 15–7, 15–8తో లెవెర్డెజ్పై గెలుపొందడంతో నార్త్ ఈస్టర్న్ విజయం ఖాయమైంది. -
సాయిప్రణీత్, శ్రీకాంత్ ఇంటిముఖం
కౌలాలంపూర్: టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ కొత్త సీజన్‌ను పరాజయంతో ప్రారంభించారు. మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో సాయిప్రణీత్, శ్రీకాంత్‌లతోపాటు మరో తెలుగు షట్లర్ పారుపల్లి కశ్యప్ కూడా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 11–21, 15–21తో ప్రపంచ 19వ ర్యాంకర్ రస్ముస్ జెమ్కె (డెన్మార్క్) చేతిలో... ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 17–21, 5–21తో రెండో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో... ప్రపంచ 23వ ర్యాంకర్ కశ్యప్ 17–21, 16–21తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. రస్‌ముస్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ ఏదశలోనూ పోటీనివ్వలేకపోయాడు. గతేడాది ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచిన ఈ హైదరాబాద్ ప్లేయర్ రెండు గేముల్లోనూ ఆరంభంలోనే ఆధిక్యం కోల్పోయి ఆ తర్వాత కోలుకోలేకపోయాడు. మరోవైపు చౌ తియెన్ చెన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ కేవలం 30 నిమిషాల్లో చేతులెత్తేశాడు. తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రెండో గేమ్‌లో మాత్రం కేవలం ఐదు పాయింట్లు సాధించాడు. అయితే భారత్‌కే చెందిన సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ 21–16, 21–15తో వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)పై... ప్రణయ్ 21–9, 21–17తో కాంటా సునెయామ (జపాన్)పై గెలిచారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెంటో మొమోటాతో ప్రణయ్; లీ జి జియా (మలేసియా)తో సమీర్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహా్వల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సింధు 21–15, 21–13తో ఎవ్‌గెనియా కొసెత్‌స్కాయ (రష్యా)పై... సైనా 21–15, 21–17తో లియాన్ తాన్ (బెల్జియం)పై విజయం సాధించారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అయా ఒహోరి (జపాన్)తో సింధు; ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సైనా పోటీపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 10–21, 10–21తో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
శ్వేతను పెళ్లాడిన సాయిప్రణీత్
సాక్షి, కాకినాడ: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, హైదరాబాద్ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం కాకినాడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్వేత జయంతితో సాయిప్రణీత్ వివాహం జరిగింది. సాత్విక్ సాయిరాజు సహా పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పెళ్లికి హాజరయ్యారు. సాయిప్రణీత్-శ్వేత జంటకు సోషల్ మీడియా ద్వారా వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సాయిప్రణీత్ అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న సాయిప్రణీత్‌ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘అర్జున అవార్డు’తో సత్కరించింది. -
సాయిప్రణీత్ శుభారంభం
లక్నో: బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్ సయ్యద్ మోదీ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ భమిడిపాటి సాయిప్రణీత్‌తోపాటు ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 2116, 2220తో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా)పై... శ్రీకాంత్ 2112, 2111తో మల్కోవ్ (రష్యా)పై... ప్రణయ్ 1821, 2220, 2113తో లి షి ఫెంగ్ (చైనా)పై... సౌరభ్ వర్మ 2111, 2116తో జియోడాంగ్ షెంగ్ (కెనడా)పై గెలుపొందారు. హైదరాబాద్ కుర్రాడు సిరిల్ వర్మ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సిరిల్ వర్మ 1221, 2115, 213తో హువాంగ్ పింగ్ సెయిన్ (చైనీస్ తైపీ)ను ఓడించాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడిన హైదరాబాద్ ఆటగాడు చిట్టబోయిన రాహుల్ యాదవ్ 1621, 821తో కున్లావుత్ వితిత్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. వృశాలి, ఉత్తేజిత ఓటమి మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగమ్మాయిలు గుమ్మడి వృశాలి 1621, 1621తో అష్మిత చాలిహా (భారత్) చేతిలో... సాయి ఉత్తేజిత 1021, 2119, 1521తో చోల్ బిర్చ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడారు. సాత్విక్‌చిరాగ్ జంటకు షాక్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ ఫేవరెట్ జోడీ, రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి (భారత్) తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. డి జి జియాన్‌వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం 2112, 2321తో సాత్విక్‌చిరాగ్ జంటను ఓడించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డిఅశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 2113, 1621, 2119తో ఎన్జీ సాజ్ యావుయువెన్ సిన్ యింగ్ (హాంకాంగ్) జంటపై నెగ్గింది. -
నిన్న మహిళల సింగిల్స్.. నేడు పురుషుల సింగిల్స్
ఫుజౌ (చైనా): చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మంటన్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భారత షట్లర్ సాయి ప్రణీత్ 20-22, 22-20, 16-21 తేడాతో ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సాయి ప్రణీత్.. రెండో గేమ్‌లో గెలిచి రేసులోకి వచ్చాడు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆండెర్స్ ర్యాలీలు, స్మాష్‌లతో ప్రణీత్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ప్రణీత్ తాను చేసి తప్పిదాల నుంచి తేరుకునే లోపే ఆండెర్స్ గేమ్‌తో మ్యాచ్‌ను కూడా గెలిచి మూడో రౌండ్‌కు చేరాడు. తొలి గేమ్‌లో పోరాట స్పూర్తిని ప్రదర్శించిన ప్రణీత్.. రెండో గేమ్‌లో జోరును కొనసాగించాడు. ఆండెర్స్‌కు అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను గెలిచాడు. కాగా, మూడో గేమ్‌లో ఆండెర్స్ తిరిగి పుంజుకున్నాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ ప్రణీత్‌ను ఒత్తిడిలోకి నెట్టి పైచేయి సాధించాడు. చివర్లో ప్రణీత్ పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రణీత్ ఓటమితో భారత్ సింగిల్స్‌లో పోరాటాన్ని ముగించింది. నిన్న మహిళల సింగిల్స్ పోరాటం ముగిస్తే, ఈరోజు పురుషుల సింగిల్స్ పోరాటం సైతం ముగిసింది. -
సాయిప్రణీత్ శుభారంభం
ఫుజౌ (చైనా): ఆరంభంలో తడబడ్డా... వెంటనే తేరుకున్న భారత స్టార్ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 15–21, 21–12, 21–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ టామీ సుగియార్తోపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సుగియార్తోపై సాయిప్రణీత్కిది వరుసగా మూడో విజయం. 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాయిప్రణీత్ తొలి గేమ్‌ను చేజార్చుకున్నా... తదుపరి రెండు గేముల్లో పూర్తి ఆధిపత్యం చలాయించాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో సాయిప్రణీత్ ఆరంభంలో 0–3తో వెనుకంజలో నిలిచాక... ఒక్కసారిగా విజృంభించి వరుసగా 10 పాయింట్లు స్కోరు చేసి 10–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఇద్దరు 1–1తో సమంగా ఉన్నారు. సాయిప్రణీత్‌తోపాటు హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... సమీర్ వర్మ తొలి రౌండ్లోనే ని్రష్కమించాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ కశ్యప్ 44 నిమిషాల్లో 21–14, 21–13తో ప్రపంచ 21వ ర్యాంకర్ సిథికోమ్ థమాసిన్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. ఈ విజయంతో ఇటీవల డెన్మార్క్ ఓపెన్‌లో థమాసిన్ చేతిలో ఎదురైన ఓటమికి కశ్యప్ బదులు తీర్చుకున్నాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ సమీర్ వర్మ 18–21, 18–21తో ప్రపంచ 28వ ర్యాంకర్ లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కశ్యప్ ఆడతాడు. 23 నిమిషాల్లోనే... మహిళల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. మంగళవారం ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టగా... సింధు సరసన సైనా నెహ్వాల్ కూడా చేరింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా కేవలం 23 నిమిషాల్లో 9–21, 12–21తో ప్రపంచ 22వ ర్యాంకర్ కాయ్ యాన్ యాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. గత నెలన్నర కాలంలో సైనా ఐదు టోర్నీలు ఆడగా... ఫ్రెంచ్ ఓపెన్ మినహా మిగతా నాలుగు టోరీ్నల్లో తొలి రౌండ్లోనే ని్రష్కమించడం గమనార్హం. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) 14–21, 14–21తో వాంగ్ చి లిన్–చెంగ్ చి యా (చైనీస్ తైపీ) చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) 21–23, 19–21తో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
శభాష్ సాయిప్రణీత్
ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన కాంస్య పతకం గాలివాటంగా వచ్చినది కాదని తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ నిరూపించాడు. తనదైన రోజున ఎంతటి మేటి క్రీడాకారులనైనా బోల్తా కొట్టిస్తానని ఈ హైదరాబాద్ ప్లేయర్ మరోసారి రుజువు చేశాడు. మంగళవారం ఆరంభమైన డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సాయిప్రణీత్ తొలి రౌండ్లో పెను సంచలనం సృష్టించాడు. రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన చైనా దిగ్గజం లిన్ డాన్‌ను వరుస గేముల్లో ఓడించి సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఒడెన్స్ (డెన్మార్క్): ఈ ఏడాది లోటుగా ఉన్న వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో... డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సాయిప్రణీత్ 36 నిమిషాల్లో 21–14, 21–17తోప్రపంచ 18వ ర్యాంకర్, మాజీ నంబర్‌వన్, 36 ఏళ్ల లిన్ డాన్ (చైనా)పై... మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 38 నిమిషాల్లో 22–20, 21–18తో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడనుండగా... ప్రపంచ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్), వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) మధ్య జరిగే తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో సాయిప్రణీత్ తలపడతాడు. గతంలో లిన్ డాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన సాయిప్రణీత్ ఈసారి మాత్రం అదరగొట్టాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ, నిలకడగా పాయింట్లు సాధించాడు. మొదట్లో 3–0తో ఆధిక్యం సంపాదించిన సాయిప్రణీత్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కొనసాగించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. 16–16తో స్కోరు సమంగా ఉన్నదశలో సాయిప్రణీత్ రెండు పాయింట్లు సాధించి 18–16తో ముందంజ వేశాడు. ఆ తర్వాత లిన్ డాన్ ఒక పాయింట్ నెగ్గగా... ఆ వెంటనే సాయిప్రణీత్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చైనా స్టార్ ప్లేయర్ ఓటమిని ఖాయం చేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 25వ ర్యాంకర్ కశ్యప్ 13–21, 12–21తో సితికోమ్ తమాసిన్ (థాయ్‌లాండ్) చేతిలో... సౌరభ్ వర్మ 21–19, 11–21, 17–21తో మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 24–22, 21–11తో కిమ్ జి జంగ్–లీ యోంగ్ డే (దక్షిణ కొరియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 23–25, 18–21తో టాప్ సీడ్ మాయు మత్సుమోతో–వకానా నాగాహార (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో కిడాంబి శ్రీకాంత్; కాంటా సునెయామ (జపాన్)తో సమీర్ వర్మ; మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సయాక తకహాషి (జపాన్)తో సైనా నెహా్వల్ తలపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మార్విన్ సిడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; వాంగ్ యి లియు–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా)లతో సాతి్వక్ సాయిరాజ్–అశి్వని పొన్నప్ప పోటీపడతారు. ►1 ప్రపంచ మాజీ చాంపియన్స్ లేదా ఒలింపిక్ మెడలిస్ట్లైన ఆరుగురు ఆటగాళ్లను (తౌఫిక్ హిదాయత్–ఇండోనేసియా; లీ చోంగ్ వీ–మలేసియా; చెన్ లాంగ్–చైనా; విక్టర్ అక్సెల్సన్–డెన్మార్క్; కెంటో మొమోటా–జపాన్; లిన్ డాన్–చైనా) కనీసం ఒక్కసారైనా ఓడించిన ఏకైక భారత క్రీడాకారుడు సాయిప్రణీత్. ►4 చైనా దిగ్గజం లిన్ డాన్‌ను కనీసం ఒక్కసారి ఓడించిన నాలుగో భారత ప్లేయర్ సాయిప్రణీత్. గతంలో హెచ్ఎస్ ప్రణయ్ మూడుసార్లు లిన్ డాన్‌పై నెగ్గగా... పుల్లెల గోపీచంద్ రెండుసార్లు (2002లో) ఓడించగా... శ్రీకాంత్ (2014లో) ఒక్కసారి గెలిచాడు. -
సింధుకు మరో పరీక్ష
ఒడెన్స్: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఈ సీజన్లో మరో పరీక్షకు సిద్ధమైంది. నేటి నుంచి జరిగే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమెతో సహా భారత స్టార్ షట్లర్లంతా బరిలోకి దిగుతున్నారు. సింధు ప్రపంచ టైటిల్ నెగ్గినప్పటికీ ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. పైగా చైనా ఓపెన్, కొరియా ఓపెన్లలో అనూహ్యంగా ఆరంభ రౌండ్లలోనే ఓడి నిరాశపరిచింది. నేడు జరిగే తొలి రౌండ్లో గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)తో సింధు ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్... లిన్ డాన్ (చైనా)తో సాయిప్రణీత్.. జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రణయ్ ఆడతారు. -
సింధుకు మళ్లీ నిరాశ
ప్రపంచ చాంపియన్ షిప్ విజయం తర్వాత పీవీ సింధుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. మొన్న చైనా ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లోనే ఓటమి ఎదురవగా... తాజాగా కొరియా ఓపెన్‌లో మొదటి రౌండ్లోనే ఆమె ఇంటిముఖం పట్టింది. సింధుతో పాటు ప్రపంచ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, సైనా నెహా్వల్ గాయాల కారణంగా తొలిరౌండ్ మ్యాచ్ మధ్యలోనే వైదొలగగా... పారుపల్లి కశ్యప్ ముందంజ వేశాడు. ఇంచియోన్ (దక్షిణ కొరియా): వరల్డ్ టూర్ వేదికపై ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు చుక్కెదురైంది. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ టైటిలే లక్ష్యంగా బరిలో దిగిన ఈ ప్రపంచ చాంపియన్... తొలి రౌండ్లోనే నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21–7, 22–24, 15–21తో బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. అదిరే ఆరంభం లభించినా... బీవెన్ జాంగ్‌తో పోరులో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధుకు అదిరే ఆరంభం లభించింది. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆమె ప్రత్యర్థికి ఏడు పాయింట్లను మాత్రమే కోల్పోయి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఈ గేమ్‌లో సింధు వరుసగా 12 పాయింట్లు సాధించడం విశేషం. రెండో గేమ్‌లో హోరాహోరీగా తలపడ్డారు. కీలక సమయంలో అసాధారణమైన ఆటతీరుతో జాంగ్ 24–22తో గేమ్‌ను ఖాతాలో వేసుకుంది. విజేతను నిర్ణయించే మూడో గేమ్‌లో సింధు చేతులెత్తేసింది. గేమ్ ఆరంభంలో గట్టి పోటీ ఇచి్చన సింధు... మ్యాచ్ సాగే కొద్ది పాయింట్లు సాధించడంలో వెనుకపడింది. 17–14తో ఉన్న సమయంలో ప్రత్యర్థి వరుసగా నాలుగు పాయింట్లు సాధించడంతో సింధు టైటిల్ ఆశలకు తొలి రౌండ్లోనే బ్రేకులు పడ్డాయి. గాయాలతో వైదొలిగిన సాయి, సైనా పతకంపై ఆశలు పెట్టుకున్న భారత షట్లర్లు సాయి ప్రణీత్, సైనా నెహా్వల్లను గాయాలు దెబ్బతీశాయి. పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్లో ఐదో సీడ్ ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 9–21, 7–11తో ఉన్న సమయంలో కాలి మడమ గాయం కారణంగా వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో కిమ్ గా ఉన్ (దక్షిణ కొరియా)తో మ్యాచ్‌లో సైనా నెహా్వల్ 21–19, 18–21, 1–8తో ఉండగా గాయంతో తప్పుకుంది. కశ్యప్ ముందంజ పారుపల్లి కశ్యప్ మాత్రమే తొలి రౌండ్ అడ్డంకిని దాటి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. అతను 21–16, 21–16తో లు చియా హుంగ్ (చైనీస్ తైపీ)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. నేటి ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో లూయీ డారెన్ (మలేసియా)తో కశ్యప్ తలపడతాడు. పురుషుల డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. తొలి రౌండ్ పోరులో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం 19–21, 21–18, 18–21తో నాలుగో సీడ్ తకేషి కముర– కిగో సొనొడ (జపాన్) జోడీ చేతిలో, మను అత్రి– సుమిత్ రెడ్డి జోడీ 16–21 21–19, 18–21తో క్వాలిఫయర్స్ హ్యూంగ్ కై జియాంగ్– లియు చెంగ్ (చైనా) జంట చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. -
పీవీ సింధుకు మరో షాక్..
ఇంచియోన్ (దక్షిణ కొరియా): ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత షట్లర్లు.. వరుసగా చైనా, కొరియా టోర్నీలలో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. తాజాగా కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500టోర్నీలో ప్రపంచ చాంపియన్ భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అనూహ్య పరాజయం చవిచూసింది. గతవారం చైనా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిన సింధు బుధవారం జరిగిన కొరియా ఓపెన్ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసింది. తొలి రౌండ్లో చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌పై 7-21, 24-22, 21-15 తేడాతో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఇటీవలే జరిగిన ప్రపంచ చాంపియన్‌లో బీవెన్ జాంగ్‌పై సునాయసంగా గెలిచిన సింధు నేటి మ్యాచ్‌లో మాత్రం తడబడింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ కూడా కొరియా ఓపెన్‌లో ఇంటిదారి పట్టాడు. డెన్మార్క్‌కు చెందిన ఆంటోన్సెన్తో మ్యాచ్‌లో తొలి రౌండ్లో ఓడిపోయిన ప్రణీత్.. రెండో రౌండ్లో గాయపడ్డాడు. దీంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతొ కొరియా ఓపెన్‌లో సింధు, సాయి ప్రణీత్‌ల ప్రయాణం ముగిసింది. ఇక మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పైనే ఆశలు ఉన్నాయి. -
సాయిప్రణీత్ పరాజయం
చాంగ్జూ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ కథ ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక భారత షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలయ్యాడు. ఇండోనేసియాకు చెందిన ఏడో సీడ్ ఆంథోనీ సినిసుకా జిన్‌టింగ్ 16–21, 21–6, 21–16తో సాయిప్రణీత్‌ను ఓడించాడు. నెల రోజుల క్రితం ఇదే జిన్‌టింగ్‌ను వరల్డ్ చాంపియన్‌షిప్‌లో చిత్తు చేసిన ప్రణీత్‌కు ఈసారి ప్రతికూల ఫలితం వచ్చింది. ఆరంభంలో ఆధిక్యం కనబర్చిన ప్రణీత్ తొలి గేమ్‌ను సునాయాసంగానే గెలుచుకున్నా... రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. మూడో గేమ్‌లో 11–7తో భారత ఆటగాడు ముందంజలో నిలిచి కూడా తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయాడు. -
చైనా ఓపెన్ నుంచి రిక్త హస్తాలతో..
చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్‌టూర్ సూపర్-1000 టోర్నీలో భారత షట్లర్ సాయి ప్రణీత్ ఇంటి దారి పట్టాడు. . శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ కార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-16, 6-21, 16-21 తేడాతో ఆంటోని సినిసుకా గింటిక్(ఇండోనేసియా) చేతలో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన సాయి ప్రణీత్.. మిగతా రెండు గేమ్‌ల్లో తేలిపోయాడు. రెండో గేమ్‌ను దారుణంగా కోల్పోయిన ప్రణీత్.. మూడో గేమ్‌లో పుంజు కోవడానిక యత్నించినా ఆంటోని ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధిస్తూ ప్రణీత్‌పై ఒత్తిడి పెంచాడు. ప్రధానంగా రెండో గేమ్‌లో ఆంటోని వరుస ఆరు పాయింట్లు సాధించడంతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలోనే గేమ్‌ను కోల్పోయాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆంటోని ఆరంభంలోనే పైచేయి సాధించాడు. ప్రణీత్‌ను 2-6తో వెనక్కి నెట్టిన ఆంటోని.. అదే జోరును కడవరకూ కొనసాగించాడు. దాంతో ప్రణీత్‌కు పరాజయం తప్పలేదు. దాంతో చైనా ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది. కనీసం ఒక్క పతకం కూడా సాధించకుండానే భారత ఆటగాళ్ల రిక్త హస్తాలతో వెనుదిరిగారు. -
సింధు జోరుకు బ్రేక్
చాంగ్జౌ (చైనా): ప్రపంచ చాంపియన్ హోదాలో... మరో ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టైటిల్ లక్ష్యంగా చైనా ఓపెన్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ర్యాంకింగ్స్‌లో తన కంటే కింది స్థానంలో ఉన్న పొర్న్‌పవీ చొచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి నిరాశ పరిచింది. గురువారం జరిగిన వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21–12, 13–21, 19–21తో ప్రపంచ 15వ ర్యాంక్ షట్లర్ చొచువోంగ్ చేతిలో కంగుతింది. ఆధిక్యం ప్రదర్శించినా... ప్రస్తుత ఫామ్ దృష్ట్యా చొచువోంగ్పై సింధు విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్లే చక్కటి స్మాష్‌లతో విరుచుకుపడ్డ సింధు... వరుసగా పాయింట్లు సాధించి 21–12తో తొలి గేమ్‌ను గెల్చుకుంది. రెండో గేమ్ నుంచి మాత్రం సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా గాడి తప్పిన సింధు ఆట ప్రత్యర్థికి వరంలా మారింది. వరుసగా 5 పాయింట్లు సాధించిన చొచువోంగ్ 5–1తో, ఆ తర్వాత మరోసారి వరుసగా ఆరు పాయింట్లు కొల్లగొట్టి 15–7తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ పట్టును నిలుపుకున్న థాయ్‌లాండ్ షట్లర్ రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో తొలి 12 పాయింట్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిచారు. ఈ దశలో సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ 19–15తో ఆధిక్యంలో నిలిచింది. విజయానికి కేవలం రెండు పాయింట్ల దూరంలో ఉన్న సమయంలో థాయ్ అమ్మాయి అనూహ్యంగా పుంజుకుంది. చొచువోంగ్ వరుసగా 6 పాయింట్లు సాధించి సింధు కళ్ల ముందే మ్యాచ్‌ను లాగేసుకుంది. క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ 21–19, 21–19తో లూ గాంగ్ జూ (చైనా)పై విజయం సాధించి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. మరో భారత అటగాడు పారుపల్లి కశ్యప్ 21–23, 21–15, 12–21తో ఆంథోని సింసుక గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. డబుల్స్‌లోనూ నిరాశే.. డబుల్స్ విభాగాల్లో పోటీ పడుతున్న భారత జోడీలు రెండో రౌండ్లో ఓడి నిరాశ పరిచాయి. పరుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి (భారత్) 19–21, 8–21తో తకెషి కముర– కిగో సొనొడ (జపాన్) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యారు. అనంతరం జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లోనూ సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప ద్వయం 11–21, 21–16, 12–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ యూకి కనెకొ– మిసాకి మట్సుటొమొ (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి– అశ్విని పొన్నప్ప జోడి 12–21, 17–21తో మిసాకి మట్సుటొ మొ– అయక తకహాషి (జపాన్) చేతిలో ఓడింది. -
ప్రిక్వార్టర్స్‌కు సింధు.. సైనా ఇంటిబాట
చాంగ్జౌ(చైనా): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచి జోరుమీదున్న తెలుగు తేజాలు పీవీ సింధు, సాయిప్రణీత్ చైనా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం మహిళల సింగిల్స్‌తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పసిడి పతక విజేత సింధు 21–18, 21–12తో మాజీ ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్(చైనా)పై గెలిచింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ ఆఖర్లో సింధు ధాటికి జురుయ్ తలవంచింది. ఇక రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేయడంతో మ్యాచ్ సింధు వశమైంది. కాగా, మరో భారత క్రీడాకారిణి, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ 10–21 17–21తో బుసానన్ అంగ్బమ్రంగ్పన్(థాయ్‌లాండ్) చేతిలో అనూహ్య పరాజయం చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 44 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి సెట్‌ను చేజార్చుకున్నాక రెండో సెట్లో పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించాక అనంతరం ఏ టోర్నీలోనూ సైనా కనీసం సెమీస్‌కు కూడా చేరలేదు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ 21–19, 21–23, 21–14తో సుపన్యు అవిహింగ్సనన్ (థాయ్‌లాండ్)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జోడీ సైతం తదుపరి రౌండ్‌కు చేరింది. ఈ ద్వయం 21–13తో తొలి సెట్‌ను దక్కించుకొని రెండో సెట్లో 11–8తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి జంట చిన్ చెన్ లీ– చి యా చెంగ్ తప్పుకొంది. కాగా, మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా–సిక్కిరెడ్డి ద్వయం 12–21, 21–23తో మార్క్ లామ్స్‌ఫస్–ఇసాబెల్ హెర్ట్రిచ్(జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. -
సత్తాకు పరీక్ష
అద్వితీయ ప్రదర్శనతో విశ్వవిజేతగా అవతరించి... అన్ని వర్గాల నుంచి ఆత్మీయ సత్కారాలు, స్వాగతాలు అందుకొని... కొత్త చరిత్ర మధుర క్షణాలను ఆస్వాదించి... మూడు వారాలుగా బిజీబిజీగా గడిపిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనుంది. నేడు మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఈ తెలుగు తేజం టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం పక్కాగా సిద్ధమై అనుకున్న లక్ష్యాన్ని అందుకున్న సింధు... చైనా గడ్డపై రెండోసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఇక నుంచి సింధు ఆటతీరును ఆమె ప్రత్యర్థులు నిశితంగా గమనించే అవకాశం ఉంది. సరికొత్త వ్యూహాలతో ఈసారీ తన ప్రత్యర్థులకు సింధు చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి. చాంగ్జౌ (చైనా): భారత బ్యాడ్మింటన్ స్టార్స్ మరో సమరానికి సిద్ధమయ్యారు. నేటి నుంచి మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో మహిళల ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, మాజీ రన్నరప్ సైనా నెహా్వల్... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్, కశ్యప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్విట్జర్లాండ్‌లో గత నెలలో ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొంటున్న తొలి టోర్నమెంట్ ఇదే కానుంది. కాస్త కఠినమే... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఐదో సీడ్‌గా, సైనా నెహ్వాల్ ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగనున్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్‌తో సింధు... ప్రపంచ 19వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫన్ (థాయ్‌లాండ్)తో సైనా ఆడతారు. లీ జురుయ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 3–3తో సమంగా ఉండగా... సైనా 3–1తో బుసానన్‌పై ఆధిక్యంలో ఉంది. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన లీ జురుయ్ మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయతి్నస్తోంది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్ టోరీ్నలో లీ జురుయ్‌తో ఆడిన సింధు మూడు గేమ్‌లపాటు పోరాడి గెలిచింది. గత నెలలో ముగిసిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలకు పక్కా ప్రణాళికతో సిద్ధమైన సింధు చైనా ఓపెన్‌లోనూ సత్తా చాటుకోవాలని పట్టుదలతో ఉంది. 2016లో ఈ టోరీ్నలో విజేతగా నిలిచిన సింధు అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయాలని భావిస్తోంది. తొలి రౌండ్ గట్టెక్కితే సింధుకు క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ చెన్ యుఫె (చైనా), సెమీస్‌లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) లేదా సైనా ఎదురయ్యే అవకాశముంది. గాయం నుంచి కోలుకున్న రెండుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ ఈ టోరీ్నలో ఆడుతోంది. గతవారం వియత్నాం ఓపెన్‌లో మారిన్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో నాలుగో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో మారిన్ ఆడుతుంది. ఇదే పార్శ్వంలో టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్), మాజీ విశ్వవిజేత రచనోక్ (థాయ్‌లాండ్) ఉన్నారు. కోచ్ కిమ్ జీ హ్యున్ లేకుండానే... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించిన భారత మహిళల సింగిల్స్ కోచ్ కిమ్ జీ హ్యున్ (దక్షిణ కొరియా) చైనా ఓపెన్‌కు జట్టు వెంట వెళ్లడం లేదు. తన భర్త ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె స్వదేశం వెళ్లిపోయింది. ఆమె తిరిగి జట్టుతో ఎప్పుడు చేరుతుందనే అంశంపై స్పష్ట మైన సమాచారం లేదు. కనీసం రెండు వారాలపాటు ఆమె తన కుటుంబంతో ఉండే అవకాశముంది. సాయిప్రణీత్ జోరు కొనసాగేనా... పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి నలుగురు ఎంట్రీలు పంపించినా... మోకాలి గాయం కారణంగా కిడాంబి శ్రీకాంత్... డెంగీ జ్వరంతో ప్రణయ్ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో భారత్ ఆశలన్నీ సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌పై ఆధారపడ్డాయి. పురుషుల సింగిల్స్‌లో 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్య పతకం నెగ్గిన భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సాయిప్రణీత్ ఈ టోర్నీలో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. తొలి రౌండ్లో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్ ఆడతాడు. తొలి రౌండ్లో గెలిస్తే రెండో రౌండ్లో మూడో సీడ్ షి యు కి (చైనా)తో సాయిప్రణీత్ ఆడే చాన్స్ ఉంది. కశ్యప్ తొలి రౌండ్లో లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో తలపడతాడు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... సుమీత్ రెడ్డి–మను అత్రి జోడీలు పోటీ పడనున్నాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; అశ్విని పొన్నప్ప–సాత్విక్ సాయిరాజ్ జంటలు బరిలో ఉన్నాయి. -
జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి
-
సాయిప్రణీత్‌కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : అర్జున అవార్డు గ్రహిత సాయిప్రణీత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక అర్జున అవార్డును సాధించడం తెలుగు రాష్ట్రాలకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. కాగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సాయిప్రణీత్ అర్జున అవార్డును అందుకున్నారు. (చదవండి : ఒలంపిక్స్‌లో పతకంమే నా లక్ష్యం : సాయిప్రణీత్) రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగిన ఈ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అవార్డులను అందజేశారు. My heartiest congratulations to @saiprneeth92 on being honored with the Arjuna award for excellence in your Badminton career. Best wishes for your future endeavors. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2019 (చదవండి : రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానం) -
‘ఒలంపిక్స్‌లో పతకం గెలవడమే నా లక్ష్యం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక అర్జున అవార్డు తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు తెలుగు తేజం సాయిప్రణీత్. గురువారం ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నాడు. అనంతరం సాయి ప్రణీత్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం చేయడం ద్వారా క్రీడాకారులు మరింత స్ఫూర్తి పొందుతారని తెలిపారు. కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో అన్ని క్రీడల్లోనూ భారత్ మెరుగైన ప్రతిభ చూపిస్తోందన్నారు. హైదరాబాద్ క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో పతకాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పతకం సాధించిన అనంతరం మరిన్ని చాంపియన్ షిప్‌లపై దృష్టి సారిస్తున్నానని ప్రణీత్ చెప్పారు. గతంలో అనేక మందికి సాధ్యం కానిది తాను సాధించాను కాబట్టి వారికంటే గొప్పగా భావించడం లేదని, రానున్న ఒలంపిక్స్‌లో పతకం నెగ్గడమే లక్ష్యంగా కృషిచేస్తున్నాని సాయి ప్రణీత్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అవార్డులను అందజేశారు. -
అర్జున అవార్డు అందుకున్న సాయిప్రణీత్
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అవార్డులను అందజేశారు. (చదవండి : సాయి ప్రణీత్‌కు ‘అర్జున’) భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్లో అవార్డులు అందజేస్తారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, మహిళా పారాథ్లెట్ దీపా మలిక్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ అందుకున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ను పొందాడు. -
నేడు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్లో అవార్డులు అందజేస్తారు. నేడు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించనున్నారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, మహిళా పారాథ్లెట్ దీపా మలిక్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ అందుకోనున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ను పొందనున్నాడు. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ జాతీయ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
గోపీచంద్ అకాడమీ : పీవీ సింధు మీడియా సమావేశం
-
ఆత్మీయ స్వాగతాలు... అభినందనలు..!
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు... మంత్రి నుంచి ప్రధాన మంత్రి వరకు అందరి అభినందనల వర్షంలో పూసర్ల వెంకట సింధు తడిసి ముద్దయింది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్వదేశం తిరిగొచ్చిన ఆమెకు ముందుగా దేశ రాజధానిలో, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ముందుగా కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజుతో భేటీ జరగ్గా... దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో ఆమెను ఆశీర్వదించారు. అనంతరం స్వస్థలంలో సహచర పతక విజేత సాయిప్రణీత్‌తో కలిసి సింధు మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సింధు, సాయి, కోచ్ గోపీచంద్ స్పందనలు వారి మాటల్లోనే... దేశం గర్వపడే చాంపియన్ పీవీ సింధు: ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం పీవీ సింధుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన చాంపియన్ సింధు అంటూ పొగడ్తలు కురిపించారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పీవీ సింధుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్, తండ్రి పీవీ రమణ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో కలసి ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా సింధు సాధించిన స్వర్ణ పతకాన్ని ఆమె మెడలో వేసి మోదీ అభినందించారు. ‘బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన చాంపియన్ సింధు. ఆమెను కలవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ మోదీ ట్వీట్ చేసి ఫోటోను పంచుకున్నారు. అంతకుముందు సింధుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఎన్నాళ్లో వేచిన విజయం... వరల్డ్ చాంపియన్‌గా నిలవడం చాలా గర్వంగా అనిపిస్తోంది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావట్లేదు. ఎంతో కాలంగా ఆశించిన ఈ విజయాన్ని ఎట్టకేలకు సాధించాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. అందుకు సహకరించిన నా కోచింగ్ బృందానికి కృతజ్ఞతలు. కాంస్య, రజతాలు సాధించినప్పుడు కూడా సంతోషం కలిగింది కానీ ఇంకా సాధించాల్సి ఉందని అనిపించింది. గత రెండు ఫైనల్స్‌లో ఓడినప్పుడు కొంత నిరాశ చెందినా నా ఆటను నేను నమ్మాను. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ దూసుకొచ్చాను. అంతిమ లక్ష్యం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే అయినా అంతకుముందు నేను ఇంకా చాలా గెలవాల్సి ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నేను ప్రతీ మ్యాచ్‌కు ప్రత్యేకంగా సిద్ధమయ్యాను. ప్రత్యర్థులకు నా ఆట గురించి బాగా తెలుసు కాబట్టి ఒకే తరహా ఆటతో విజయాలు సాధించలేం. ఇకపై కూడా కొత్త అంశాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఓడిపోతాననే భయం లేకుండా ఆడాను కాబట్టే ఫైనల్ ఏకపక్షంగా గెలవగలిగాను. –పీవీ సింధు, ప్రపంచ బ్యాడ్మింటన్ స్వర్ణ పతక విజేత ఒలింపిక్స్ క్వాలిఫయింగే లక్ష్యం... వారం రోజుల వ్యవధిలో అర్జున పురస్కారానికి ఎంపిక కావడం, ఇటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలవడం నా ఆనందాన్ని రెట్టింపు చేశాయి. క్వార్టర్స్‌లో క్రిస్టీపై గెలవగానే కాంస్యం ఖాయమైందని తెలుసు కాబట్టి గొప్పగా అనిపించింది. ఆ సమయంలో ప్రకాశ్ సర్ 36 ఏళ్ల రికార్డులాంటి విషయాలు ఏవీ నా మనసులోకి రాలేదు. ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో కీలక సమయంలో గోపీ సర్ చేసిన సూచనల వల్లే గెలవగలిగాను. మొమోటాతో గతంలోనూ ఆడిన అనుభవం ఉంది కాబట్టి సెమీస్‌లో ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగాను. అయితే అతను నాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లాంటి ఈవెంట్లో మనం 100 శాతం శ్రమించినా కొంతయినా అదృష్టం కూడా కలిసి రావాలి. గతంలో అనేక మందికి సాధ్యం కానిది నేను సాధించాను కాబట్టి వారికంటే గొప్పగా భావించడం లేదు. ఇప్పుడు నా తదుపరి లక్ష్యం వచ్చే టోర్నీలలో బాగా ఆడి ప్రస్తుత ర్యాంక్ (15)ను నిలబెట్టుకోవడం, టోక్యోకు అర్హత సాధించడం. –సాయిప్రణీత్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత ప్లాన్ ‘బి’ అవసరం రాలేదు... నాకు వ్యక్తిగతంగా ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. మన ప్లేయర్ స్వర్ణం సాధించాలనేది చాలా కాలంగా నా కల. అది ఇప్పుడు నెరవేరింది. నా దృష్టిలో రెండు పతకాలు అమూల్యమైనవే. సింధు అంచనాలను నిజం చేస్తే, సాయిప్రణీత్ అద్భుతం చేసి చూపించాడు. 2013లో సింధు తొలిసారి కాంస్యం గెలిచినప్పుడు ఎంతో సంతోషించాం. ఆ తర్వాత మరో కాంస్యం, రెండు రజతాలు వచ్చినప్పుడు కూడా ఎంతో సాధించిన సంతృప్తి కలిగింది. అయితే అదే సమయంలో స్వర్ణం సాధించగలమనే విశ్వాసం కూడా ఏర్పడింది. సింధు సూపర్ ఫిట్నెస్ కూడా ఆమె గెలుపునకు ఒక కారణం. ఆమె అన్ని మ్యాచ్‌లు చాలా తెలివిగా ఆడింది. యమగూచి ఆరంభంలోనే వెనుదిరగ్గా... తైజుపై క్వార్టర్స్‌లో గెలవడంతోనే స్వర్ణంపై నమ్మకం ఏర్పడింది. మొదటి నుంచి అటాక్ మాత్రమే చేయాలనేది కొత్త వ్యూహం. ఇది విఫలమైతే ఏం చేయాలో ఆలోచించేవాళ్లం. కానీ సింధు దీనిని సమర్థంగా అమలు చేయడంతో ప్లాన్ ‘బి’ అవసరమే లేకపోయింది. –పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ -
ముగిసిన ప్రణీత్ పోరాటం
బాసెల్ (స్విట్జర్లాండ్): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో 13-21,8-21 తేడాతో 19వ ర్యాంకర్, తెలంగాణ ప్లేయర్ సాయిప్రణీత్ ఓటమి చవిచూశాడు. ఆరంభంలో నువ్వా నేనా అన్నట్టు ఇద్దరూ తలపడ్డారు. దీంతో తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. ఓ దశలో తొలి గేమ్‌లో ఇద్దరూ 10-10 పాయింట్లతో సమానంగా నిలిచారు. అనంతరం మొమోటా తన అనుభవంతో పాటు అసలు సిసలైన చాంపియన్ ఆటను ప్రదర్శించాడు. దీంతో మొమోటా ముందు సాయి ప్రణీత్ తేలిపాయాడు. ఇక రెండో గేమ్‌లోనూ మొమోటా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. దీంతో ప్రణీత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టిస్తాడనుకున్న ప్రణీత్ కాంస్యంతోనే సరిపెట్టాడు. దీంతో భారత దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే సరసన చేరాడు. 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రకాశ్ పదుకొనే కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. 36ఏళ్ల అనంతరం పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మళ్లీ పతకం అందించనున్న ప్లేయర్‌గా సాయిప్రణీత్ చరిత్ర లిఖించాడు. మరోవైపు మహిళ సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో సింధు 21-7, 21-14 తేడాతో చెన్ యుఫె (చైనా)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. -
36 ఏళ్ల తర్వాత....ఇప్పుడు మళ్లీ
బ్యాడ్మింటన్ చరిత్రలో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. 36 ఏళ్ల తర్వాత ఆ కల నెరవేరింది. ఏంటా కల? కొత్త చరిత్ర లిఖించిన ఆ క్రీడాకారులు ఎవరు? వివరాలు తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
శ్రమించి... శుభారంభం
పురుషుల సింగిల్స్‌లో మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణ తెరదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు తొలి రౌండ్ అడ్డంకిని శ్రమించి అధిగమించారు. శ్రీకాంత్, ప్రణయ్ ఒక్కో గేమ్ కోల్పోయి విజయాన్ని అందుకోగా... సాయిప్రణీత్ వరుస గేముల్లో గెలుపొంది రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బాసెల్ (స్విట్జర్లాండ్): తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్స్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఒకదశలో ఊహించని ఫలితం వస్తుందేమోననే అనుమానం కలిగినా... సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చిన భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌ను విజయవంతంగా దాటారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత పదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 19వ ర్యాంకర్ భమిడిపాటి సాయిప్రణీత్, ప్రపంచ 30వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ఈ మెగా ఈవెంట్లో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 66 నిమిషాల్లో 17–21, 21–16, 21–6తో ప్రపంచ 81వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై... సాయిప్రణీత్ 40 నిమిషాల్లో 21–17, 21–16తో 66వ ర్యాంకర్ జేసన్ ఆంథోని హో–షుయె (కెనడా)పై... ప్రణయ్ 59 నిమిషాల్లో 17–21, 21–10, 21–11తో 93వ ర్యాంకర్ ఈటూ హీనో (ఫిన్లాండ్)పై విజయం సాధించారు. గత ప్రపంచ చాంపియన్‌షిప్ తొలి రౌండ్లోనూ ఎన్‌హట్ ఎన్గుయెన్‌తోనే ఆడిన శ్రీకాంత్ నాడు రెండు గేముల్లో గెలుపొందగా... ఈసారి మాత్రం మూడు గేముల్లో గట్టెక్కాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్ రెండో గేమ్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. అయితే స్కోరు 17–16 వద్ద ఒక్కసారిగా విజృంభించిన ఈ ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కోచ్ పుల్లెల గోపీచంద్ తొలి పాయింట్ నుంచే దూకుడుగా ఆడాలని శ్రీకాంత్‌కు సూచించాడు. తొలి పాయింట్ కోల్పోయాక... శ్రీకాంత్ తన జోరు పెంచాడు. స్మాష్‌లతో చెలరేగిపోయాడు. ఫలితంగా వరుసగా 11 పాయింట్లు గెలిచి 11–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్), చైనా దిగ్గజం లిన్ డాన్, నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా), ఆరో సీడ్ ఆంథోని జిన్‌టింగ్ (ఇండోనేసియా), ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), మూడో సీడ్ చెన్ లాంగ్ (చైనా) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా (భారత్) జంట 21–10, 21–18తో డయానా–నిక్తె సోటోమేయర్ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది. -
అర్జున జాబితాలో రవీంద్ర జడేజా
గోపీచంద్ అకాడమీ ఆణిముత్యం, తెలుగుతేజం సాయిప్రణీత్‌కు భారత ప్రభుత్వం నుంచి ఘనమైన గుర్తింపు లభించనుంది. యేటికేడు తన రాకెట్ పదును పెంచుకుంటున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కు ‘అర్జున’ అవార్డు ఖాయమైంది. పారాలింపియన్ దీప మాలిక్ రెండో ‘ఖేల్‌రత్న’గా ఎంపిక కాగా... బ్యాడ్మింటన్ గురువు విమల్ కుమార్ ద్రోణాచార్యుడయ్యాడు. క్రికెటర్లు రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ అర్జునలుగా నిలిచారు. అయితే ఎప్పటిలాగే చిన్నపాటి అసంతృప్తుల సమేతంగానే ఈ సారి కూడా క్రీడా పురస్కారాల జాబితా వెలువడింది. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారానికి మరో తెలుగు షట్లర్ ఎంపికయ్యాడు. భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంటాబయటా నిలకడగా రాణిస్తున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్ ప్రతిభను అవార్డుల కమిటీ గుర్తించింది. 2017లో ప్రణీత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నిలకడైన ప్రదర్శనతో సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పారాలింపియన్ దీపా మాలిక్‌కు భారత అత్యున్నత క్రీడాపురస్కారం దక్కనుంది. రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన ఆమెను ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు నామినేట్ చేశారు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆ అవార్డుకు ఎంపికవగా ఈ ఏడాది సంయుక్తంగా ఇద్దరికి ఆ పురస్కారం లభించనుంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్‌లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని అవార్డుల కమిటీ 19 మందిని ‘అర్జున’కు, ఇద్దరిని ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేసింది. మరో ముగ్గురిని ‘ద్రోణాచార్య’కు నామినేట్ చేసింది. దీపకు మూడో పురస్కారం పారా అథ్లెట్ దీప 2012లో అర్జున అవార్డు అందుకుంది. రెండేళ్ల క్రితం 2017లో భారత పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని దక్కించుకుంది. వరుసగా మూడు పారా ఆసియా గేమ్స్ (2010, 2014, 2018)లో పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. జకార్తా (2018) ఈవెంట్లో ఆమె డిస్కస్ త్రో, జావెలిన్ త్రోలో కాంస్యాలు గెలిచింది. గడిచిన నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా ఇచ్చే ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఆమె అర్హురాలని కమిటీ నిర్ణయించింది. పూనియాతో పాటు ఆమెను ఎంపిక చేసింది. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ ఐసీసీ ఈవెంట్లలో పరుగుల ప్రవాహం సృష్టించడంతో ‘అర్జున’కు ఎంపికైంది. మహిళల భారత జట్టు 2017లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్, గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. విమల్‌కు ద్రోణాచార్య సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ కుమార్ ‘ద్రోణాచార్య’కు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్) కోచ్‌లకు ఇచ్చే పురస్కారానికి ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ భరద్వాజ్, మెర్జ్బన్ పటేల్, రణ్బిర్సింగ్ ఖోఖర్ జీవిత సాఫల్య పురస్కారాలకు నామినేట్ అయ్యారు. కమిటీ నామినీల జాబితాను కేంద్ర క్రీడాశాఖ ఆమోదించిన వెంటనే అధికారికంగా విజేతలను ప్రకటిస్తారు. యేటా హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 23)ని జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాష్ట్రపతి భవన్లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఖేల్‌రత్న విజేతకు పతకంతో రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్యలకు మెమెంటో, రూ. 5 లక్షలు బహుమతిగా అందజేస్తారు. మేరీ తప్పుకుంది... భారత చాంపియన్ బాక్సర్ మేరీకామ్ అవార్డుల కమిటీలో ప్రధాన సభ్యురాలు. కానీ ఆమె శనివారం ‘ద్రోణాచార్య’ ఎంపికలో పాలుపంచుకోలేదు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ బాక్సర్ వ్యక్తిగత కోచ్ చోటేలాల్ యాదవ్ కూడా ‘ద్రోణాచార్య’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నారు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దూరంగా ఉండాలని భావించిన ఆమె ఎంపిక ప్రక్రియ నుంచి స్వయంగా తప్పుకుంది. అవార్డు నామినీల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపామాలిక్ (పారా అథ్లెట్). అర్జున: సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), తేజిందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్ యాహియా, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), సోనియా లాతర్ (బాక్సింగ్), చింగ్లేశన సింగ్ (హాకీ), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), గౌరవ్‌సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), సుందర్‌సింగ్ గుర్జార్ (పారా అథ్లెట్), అంజుమ్ మోద్గిల్ (షూటింగ్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజ ధండ (రెజ్లింగ్), ఫౌవాద్ మిర్జా (ఈక్వెస్ట్రియన్), గుర్‌ప్రీత్‌సింగ్ సంధు (ఫుట్‌బాల్), సిమ్రన్‌సింగ్ షెర్గిల్ (పోలో). ఆర్డీటీకి పురస్కారం క్రీడలను ప్రోత్సహించడంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ సంస్థను అవార్డు కమిటీ ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’కు ఎంపిక చేసింది. ఐదు దశాబ్దాల క్రితం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’గా మొదలైన ఈ స్వచ్ఛంద సంస్థ మొదట్లో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం శ్రమించింది. కాలక్రమంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్‌గా మారాక గత 20 ఏళ్లుగా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 2002లో స్పోర్ట్స్ సెంటర్‌ను ప్రారంభించింది. 32 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పరచింది. సకల సౌకర్యాలతో క్రీడలకు, క్రీడాకారులకు ఎనలేని సేవలందజేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన నిరుపేద బాలబాలికల్లో ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తోంది. ‘‘చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. రాబోయే టోర్నీల్లో మరింత పట్టుదలతో రాణించేందుకు ఈ అవార్డు ఊతమిస్తుంది’’ – ‘సాక్షి’తో సాయి ప్రణీత్ ‘‘మన దేశంలో తమవాళ్లకే అవార్డులు ఇచ్చుకుంటారు. అంటే కమిటీలో మనవారుంటే గుర్తిస్తారు. అంతే తప్ప ప్రదర్శనతోనూ, ప్రతిభతోనూ కాదు. ఇండియాలో ఇంతే. ఎవరేం చేయలేరు. మన పని మనం చేసుకోవాల్సిందే’’ – ట్విట్టర్లో హెచ్.ఎస్.ప్రణయ్ ఆవేదన ‘‘ఆటగాళ్ల విజయంలో కోచ్‌ల పాత్ర ఎంతో ఉంటుంది. నేను ఆ కోచ్‌ల వల్లే ఎదిగాను. జస్పాల్రాణా షూటింగ్లో ఉత్తమ కోచ్. మను భాకర్, సౌరభ్ చౌదరి, అనీశ్ భన్వాలాలను ప్రపంచశ్రేణి షూటర్లుగా తీర్చిదిద్దారు. అలాంటి రాణాను విస్మరించడం సరికాదు. ఇలాంటి తప్పటడుగులు టోక్యో ఒలింపిక్స్‌లో ప్రభావం చూపిస్తాయి’’ – ఒలింపిక్స్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా దీప, జడేజా, పూనమ్, అజయ్, బర్మన్ -
భారత స్టార్స్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్ రెండో రౌండ్లోనే నిష్క్రమించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సమీర్ వర్మ 18–21, 11–21తో హియో క్వాంగ్ హీ (కొరియా) చేతిలో... రెండో సీడ్ సాయిప్రణీత్ 17–21, 23–21, 15–21తో లియోనార్డో రుంబే (ఇండోనేసియా) చేతిలో... మూడో సీడ్ ప్రణయ్ 17–21, 10–21తో జియా వె తాన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ, శుభాంకర్ డే ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ కశ్యప్ 23–21, 19–21, 21–17తో క్వాలిఫయర్ కిమ్ డాంగ్‌హున్ (కొరియా)పై, శుభాంకర్ 19–21, 21–13, 21–16తో సెంగ్ జో యో (మలేసియా)పై గెలిచారు. హైదరాబాద్ ఆటగాడు, క్వాలిఫయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ తొలి రౌండ్లో 21–16, 21–23, 15–21తో మరో క్వాలిఫయర్ బాయ్ యు పెంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చుక్కా సాయి ఉత్తేజిత రావు 21–14, 17–21, 21–10తో దిశా గుప్తా (అమెరికా)పై గెలుపొందగా... గుమ్మడి వృశాలి 16–21, 10–21తో ఫితాయపోర్న్ చైవన్ (థాయ్‌లాండ్) చేతిలో... కుదరవల్లి శ్రీకృష్ణప్రియ 15–21, 10–21తో కి జుయ్‌ఫె (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యారు. -
సాయిప్రణీత్ నిష్క్రమణ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత టైటిల్ ఆశలను మోస్తున్న భమిడిపాటి సాయిప్రణీత్ కూడా ఓటమి పాలయ్యాడు. క్రితం వారం జరిగిన జపాన్ ఓపెన్‌లో సెమీస్ మెట్టు వరకు చేరిన ప్రణీత్ ఈ సారి మాత్రం క్వార్టర్స్ నుంచే ఇంటి దారి పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రణీత్ 18–21, 12–21తో కంట సునెయామ (జపాన్) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యాడు. పోటాపోటీగా సాగిన మొదటి గేమ్ చివర్లో తడబడిన అతను 18–17 ఆధిక్యం నుంచి 18–21తో గేమ్‌ను కోల్పోయాడు. అనంతరం మరింత చేలరేగిన సునెయామ రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. డబుల్స్‌లో మిశ్రమ ఫలితాలు శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల విభాగంలో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టి జంట 21–17, 17–21, 21–19తో చోయ్ సోల్గ్యు – సియో సెంగ్ జే (కొరియా) ద్వయంపై పోరాడి గెలవగా... మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – అశ్విని పొన్నప్ప జోడి 13–21, 15–21తో యుట వటనాబె – అరిస హిగాషినో (జపాన్) జోడి చేతిలో ఓడింది. నేటి సెమీస్ మ్యాచ్‌లో కొ సంగ్ హ్యూన్ – షిన్ బేక్ చియోల్ (కొరియా) ద్వయంతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్‌శెట్టి ద్వయం తలపడనుంది. -
శ్రమించి నెగ్గిన శ్రీకాంత్, సాయిప్రణీత్
ఈ ఏడాది తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తోన్న భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్ థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో కష్టమ్మీద తొలి రౌండ్ గట్టెక్కారు. పురుషుల సింగిల్స్‌లో ఏకంగా ఏడుగురు భారత ఆటగాళ్లు మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగగా... ఐదుగురు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మరో ఇద్దరు తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. బ్యాంకాక్: తొలి రౌండ్లోనే గట్టిపోటీ ఎదుర్కొన్నా... కీలక దశలో పైచేయి సాధించిన భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ థాయ్‌లాండ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే భారత్‌కే చెందిన ‘వర్మ బ్రదర్స్’ సౌరభ్, సమీర్‌లకు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ శుభారంభం చేయగా... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–13, 17–21, 21–19తో రెన్ పెంగ్ బో (చైనా)పై, సాయిప్రణీత్ 17–21, 21–17, 21–15తో కాంతాపోన్ వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్)పై, కశ్యప్ 18–21, 21–8, 21–14తో మిషా జిల్బర్మన్ (ఇజ్రాయెల్)పై, ప్రణయ్ 21–16, 22–20తో వింగ్ వోంగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై విజయం సాధించారు. సౌరభ్ వర్మ 21–23, 19–21, 21–5తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో... సమీర్ వర్మ 23–21, 11–21, 5–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సైనా నెహ్వాల్ 21–17, 21–19తో ఫిత్యాపోర్న్ చైవన్ (థాయ్‌లాండ్)పై నెగ్గగా... సాయి ఉత్తేజిత 17–21, 7–21తో చెన్ జియో జిన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. సిక్కి రెడ్డి జంట ముందంజ... మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తెలంగాణ అమ్మాయి నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21–16, 21–13తో కొహి గోండో–అయానె కురిహారా (జపాన్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–18, 18–21, 21–17తో ఐదో సీడ్ చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా) జోడీని ఓడించి ముందంజ వేసింది. -
భారత్ పోరాటం ముగిసింది..
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్‌టూర్-750 టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భాగంగా సెమీ ఫైనల్లో భారత షట్లర్ సాయి ప్రణీత్ ఓటమి పాలయ్యాడు. సాయి ప్రణీత్ 18-21, 12-21 తేడాతో జపాన్ క్రీడాకారుడు కెంటో మొమోటో చేతిలో పరాజయం చెందడంతో భారత ఆశలు ఆవిరయ్యాయి. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సాయి ప్రణీత్.. రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశాడు. కేవలం 45 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో సాయి ప్రణీత్ ఓటమి చెందాడు. తొలి గేమ్ ఆరంభంలో సాయి ప్రణీత్ 3-1 ఆధిక్యంలో నిలిచినప్పటికీ, ఆ తర్వాత మొమోటో పుంజుకున్నాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ సాయి ప్రణీత్‌ను వెనక్కునెట్టాడు. అదే ఊపును కడవరకూ కొనసాగించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు మొమోటో. ఇక రెండో గేమ్‌లో ప్రణీత్‌కు మొమోటో ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వరుస ఆరు పాయింట్లు సాధించి సాయి ప్రణీత్‌పై తిరుగులేని ఆధిక్యం సాధించాడు. దాంతో పుంజుకోలేక పోయిన సాయి ప్రణీత్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా చేజార్చుకున్నాడు. -
సింధు ఔట్.. సెమీస్‌లో ప్రణీత్
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ఒక్కడి చేతుల్లోనే మిగిలుంది. తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ అలవోక విజయంతో సెమీఫైనల్ చేరగా... స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఆట క్వార్టర్స్‌లోనే ముగిసింది. టోక్యో: ఈ సీజన్లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మళ్లీ టైటిల్ వేటకు దూరమైంది. జపాన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నమెంట్ కూడా ఆమెకు అందని ద్రాక్షగా ముగిసింది. ఈ టోర్నీ మహిళల ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ సింధు క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరో వైపు ఈ టోర్నీలో అసాధారణ ఆటతీరుతో ముందడుగు వేస్తున్న సాయి ప్రణీత్ టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ అన్‌సీడెడ్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీకి నిరాశే ఎదురైంది. అలవోక విజయంతో... పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ వరుస గేముల్లో అలవోక విజయం సాధించాడు. అతను 21–12, 21–15తో ఇండోనేసియాకు చెందిన టామి సుగియార్తోను ఇంటిదారి పట్టించాడు. కేవలం 36 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించాడు. తొలి గేమ్‌లో సుగియార్తోనే ఖాతా తెరిచినా... జోరు మాత్రం ప్రణీత్‌దే! ఇండోనేసియా ఆటగాడు ఒక పాయింట్ చేయగానే... సాయిప్రణీత్ వరుసగా 5 పాయింట్లు సాధించాడు. అక్కడి నుంచి మొదలైన జోరుకు ఏ దశలోనూ సుగియార్తో ఎదురు నిలువలేకపోయాడు. ప్రత్యర్థి 10 పాయింట్లు సాధించేలోపే 19 పాయింట్లతో తెలుగు షట్లర్ గెలుపు తీరం చేరాడు. రెండో గేమ్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. ఆరంభం నుంచే సాయిప్రణీత్ కోర్టులో చురుగ్గా కదంతొక్కడంతో పాయింట్ల చకచకా వచ్చేశాయి. రెండు సార్లు 5–4, 12–10 స్కోరు వద్ద ప్రణీత్‌కు చేరువైనప్పటికీ... సుగియార్తోను ఓడించేందుకు భారత ఆటగాడికి ఎంతోసేపు పట్టలేదు. సింధు మరోసారి... మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ ఐదో సీడ్ సింధు 18–21, 15–21తో నాలుగో సీడ్ యామగుచి (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో చక్కని పోరాటపటిమ కనబరిచిన సింధు... రెండో గేమ్‌లో ఆ ఆటతీరు కొనసాగించలేకపోయింది. చివరకు 50 నిమిషాల్లో ప్రత్యర్థి ధాటికి ఇంటిదారి పట్టింది. ఈ సీజన్లో సింధు ఒకే ఒక్క టోర్నీ (ఇండోనేసియా ఓపెన్)లో ఫైనల్ చేరింది. అంతిమ పోరులో యామగుచి... సింధును ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. తాజాగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం సింధుకు వచ్చింది. కానీ తెలుగుతేజం కసితీరా ఆడలేకపోయింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ షెట్టి ద్వయం 19–21, 18–21తో రెండో సీడ్ తకెషి కముర– కెయిగొ సొనొద (జపాన్) జంట చేతిలో ఓడింది. -
సాయి ప్రణీత్ కొత్త చరిత్ర
టోక్యో: భారత బ్యాడ్మింటన్ ఆటగాడు సాయి ప్రణీత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జపాన్ ఓపెన్ వరల్డ్ సూపర్-750 టోర్నమెంట్లో సెమీ ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-12, 21-15 తేడాతో సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నాడు. ఫలితంగా జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు చేరిన తొలి భారత క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో సాయి ప్రణీత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సాయి ప్రణీత్.. రెండో గేమ్‌లో కూడా అదే జోరును కొనసాగించాడు. ఓ దశలో సుగియార్తో నుంచి ప్రతి ఘటన ఎదురైనా సాయి ప్రణీత్ ఎక్కడ తడబడకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. కేవలం 36 నిమిష్లాలోనే సుగియార్తోను మట్టికరిపించాడు సాయి ప్రణీత్. ఈ ఏడాది సాయి ప్రణీత్‌కు ఇది రెండో సెమీ ఫైనల్. అంతకుముందు స్విస్ ఓపెన్‌లో సాయిప్రణీత్ ఫైనల్‌కు వరకూ చేరాడు. -
క్వార్టర్స్‌కు సింధు, ప్రణీత్
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 11-21, 21-10, 21-13 తేడాతో ఆయూ ఒహోరి(జపాన్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు.. ఆపై రెండో గేమ్ లో సత్తాచాటారు. ఇక మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైతం సింధు విజృంభించి ఆడారు. ఏ దశలోనూ ఒహోరికి అవకాశం ఇవ్వని సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక పురుషుల సింగిల్స్ సాయి ప్రణీత్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. సాయి ప్రణీత్ 21-13, 21-16 తేడాతో కాంటా సునెయామ(జపాన్)పై గెలిచి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. -
ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచిన కోహ్లి. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సాయిప్రణీత్ శుభారంభం. ఇలాంటి మరిన్ని క్రీడా వార్తలు మీ కోసం -
సాయిప్రణీత్ శుభారంభం
టోక్యో: తనకంటే మెరుగైన ర్యాంకర్ ప్రత్యర్థిగా ఉన్నా... ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సహజశైలిలో ఆడిన భారత బ్యాడ్మింటన్ యువతార భమిడిపాటి సాయిప్రణీత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో నిషిమోటో (జపాన్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 23వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–17, 21–13తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాయిప్రణీత్‌కు గట్టిపోటీ ఎదురైనా... కీలకదశలో వరుస పాయింట్లతో విజృంభించి విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఎనిమిది టోర్నీల్లో ఆడిన సాయిప్రణీత్ స్విస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచాడు. ఇండోనేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీల్లో తొలిరౌండ్లో నిష్క్రమించాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, న్యూజిలాండ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరిన అతను ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. రెండేళ్ల తర్వాత నిషిమోటోతో మరోసారి ఆడిన సాయిప్రణీత్ రెండు గేముల్లోనూ తొలుత వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకొని ఆధిక్యంలోకి వచ్చాడు. రెండో గేమ్‌లో 2–7తో వెనుకంజలో ఉన్న సాయిప్రణీత్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత స్కోరు 12–12 వద్ద ఉన్నపుడు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గి 20–12తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించాడు. అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన కాంటా సునెయామతో సాయిప్రణీత్ ఆడతాడు. తొలి రౌండ్లో సునెయామ 21–14, 21–17తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ లాంగ్ (చైనా)ను ఓడించడం విశేషం. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని ద్వయం 21–14, 21–19తో మార్విన్ సీడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మను అత్రి జంట పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సుమీత్–మను అత్రి జోడీ 12–21, 16–21తో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హాన్ యుయె (చైనా)తో పీవీ సింధు; హెచ్ఎస్ ప్రణయ్‌తో కిడాంబి శ్రీకాంత్; ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా)లతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మార్కస్ ఇలిస్–క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్)లతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పోటీపడతారు. -
మనోళ్ల సత్తాకు పరీక్ష
టోక్యో : ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. నేడు మొదలయ్యే జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజు పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పదో ర్యాంకర్ కెంటో నిషిమోటా (జపాన్)తో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ ఆడనున్నాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి; మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో మార్విన్ సీడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ)లతో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప తలపడతారు. బుధవారం జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో హాన్ యుయె (చైనా)తో పీవీ సింధు; ప్రణయ్‌తో శ్రీకాంత్; ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ పోటీపడతారు. గతవారం ఇండోనేసియా ఓపెన్ టోర్నీలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన సింధుకు ఈ టోర్నీలో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్‌ను అధిగమిస్తే ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్లో కిర్స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్) లేదా అయా ఒహోరి (జపాన్)తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సింధుకు క్వార్టర్ ఫైనల్లో ఇండోనేసియా ఓపెన్ విజేత అకానె యామగుచి (జపాన్), సెమీఫైనల్లో రెండో సీడ్ చెన్ యుఫె (చైనా) ప్రత్యర్థులుగా ఎదురు కావొచ్చు. -
ముగిసిన భారత్ పోరు
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ఇప్పటికే మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌లో భారత జోడీలు వెనుదిరగ్గా, తాజాగా మహిళల, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సీజన్లో తొలి టైటిల్ ఖాతాలో వేసుకోవాలని బరిలోకి దిగిన పీవీ సింధుతోపాటు, సమీర్ వర్మ, సాయిప్రణీత్ సైతం ఇంటిబాట పట్టారు. గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, వరల్డ్ నెం.5 సింధు 19–21 18–21తో 29వ ర్యాంకర్ నిచోన్ జిందాపోల్(థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కీలక సమయాల్లో తడబడిన సింధు మూల్యం చెల్లించుకుంది. పురుషుల విభాగంలో వరల్డ్ నెం.12 సమీర్ 16–21, 21–7, 13–21తో వాంగ్ జు వీ(తైవాన్) చేతిలో, సాయి ప్రణీత్ 23–25, 9–21తో రెండో సీడ్ ఆంథోనీ సినిసుక గింటింగ్(ఇండోనేషియా) చేతిలో, పారుపల్లి కశ్యప్ 17–21 22–20 14–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడారు. అలాగే పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ పోరాటం సైతం ముగిసింది. సాయిరాజ్– చిరాగ్ ద్వయం 19–21, 18–21తో లి జున్హుయ్– లియూ యుచెన్(చైనా) చేతిలో పోరాడి ఓడింది. ముఖాముఖి పోరులో జిందాపోల్ చేతిలో ఇది సింధుకు రెండో ఓటమి. ఇప్పటివరకూ వీరిద్దరూ ఏడు సార్లు తలపడగా ఐదింట్లో విజయం సింధూనే వరించింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌తోపాటు మరో నాలుగు టోర్నీల్లో పాల్గొన్న సింధు ఒక్కదాంట్లోనూ కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్‌లో మాత్రం సెమీస్‌కు చేరగలిగింది. -
ప్రణయ్ ముందుకు... సాయిప్రణీత్ ఇంటికి
ఆక్లాండ్: తనకంటే మెరుగైన ర్యాంకర్‌ను ఓడించి భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు హెచ్ఎస్ ప్రణయ్ న్యూజిలాండ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్–300 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ ప్రణయ్ 21–14, 21–12తో ప్రపంచ 13వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌కు ఏదశలోనూ సుగియార్తో నుంచి పోటీ ఎదురుకాలేదు. రెండు గేముల్లోనూ ప్రణయ్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. మరోవైపు భారత మరో స్టార్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. చైనా దిగ్గజం, ఏడో సీడ్ లిన్ డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 12–21, 12–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) ద్వయం 17–21, 19–21తో గో వి షెమ్–తాన్ వి కియోంగ్ (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్. ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి, ప్రణవ్ చోప్రా–శివమ్ శర్మ జోడీలు, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప, అపర్ణా బాలన్–శ్రుతి జంటలు కూడా క్వార్టర్స్ చేరాయి. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భమిడిపాటి సాయిప్రణీత్ 18–21, 21–16, 21–15తో భారత్‌కే చెందిన ఐదో సీడ్ సమీర్‌వర్మకు షాకిచ్చాడు. మూడో సీడ్ శ్రీకాంత్ 21–11, 21–16తో లూ గ్వాంగ్జు (చైనా)పై గెలుపొందగా, హెచ్.ఎస్.ప్రణయ్ 21–19, 20–22, 21–17తో జాన్ జార్జెన్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. పారుపల్లి కశ్యప్ 21–11, 21–13తో తనోంగ్సక్ సెన్సోబూన్సుక్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్, రెండో సీడ్ సింధు 21–11, 21–13తో డెంగ్ జాయ్ జువన్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో ఆరో సీడ్ మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయం 25–23, 21–18తో హువంగ్ కిజియంగ్–వాంగ్ జెకంగ్ (చైనా) జంటపై, ప్రణవ్–శివమ్ జోడీ 21–15, 21–11తో భారత్‌కే చెందిన అనిరుధ మయేకర్–వినయ్ జంటపై గెలుపొందాయి. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి –అశ్విని పొన్నప్ప జంట 21–18, 21–14తో చెన్‌జియాఫో–జౌ చొమిన్ (చైనా) జోడీపై, అపర్ణ–శ్రుతి జంట 21–19, 7–21, 21–17తో వింగ్ యంగ్–యియంగ్ టింగ్ (హాంకాంగ్) జోడీపై గెలిచాయి. నేటి పురుషుల క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌తో సాయిప్రణీత్ ఢీకొంటాడు. -
సాయిప్రణీత్ @19
న్యూఢిల్లీ: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్... ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. మంగళవారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్ విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీకాంత్ ఏడో స్థానంలో, సమీర్ వర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్ టాప్–100లో భారత్ నుంచి పది మంది ఉండటం విశేషం. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సింధు, సైనా వరుసగా ఆరు, తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నారు. -
రన్నరప్ సాయిప్రణీత్
చాలా రోజుల తర్వాత నా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ఫైనల్లో రెండో గేమ్‌లో కీలకదశలో రెండేసి పాయింట్ల చొప్పున కోల్పోవడం మలుపు తిప్పింది. సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్‌పై సాధించిన గెలుపు నా కెరీర్‌లోని గొప్ప విజయాల్లో ఒకటి. వచ్చే వారం భారత్‌లో జరిగే ఇండియా ఓపెన్‌లో టైటిల్ సాధించేందుకు కృషి చేస్తాను. –‘సాక్షి’తో సాయిప్రణీత్ బాసెల్ (స్విట్జర్లాండ్): దాదాపు రెండేళ్లుగా ఊరిస్తోన్న అంతర్జాతీయ టైటిల్ కొరతను తీర్చుకోవాలని ఆశించిన భారత షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్‌కు నిరాశ ఎదురైంది. స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సాయిప్రణీత్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–19, 18–21, 12–21తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2017లో థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత స్విస్ ఓపెన్ రూపంలో మరో అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్ చేరిన ఈ హైదరాబాద్ ప్లేయర్ తుది మెట్టుపై తడబడ్డాడు. 68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాయిప్రణీత్ తొలి గేమ్‌ను నెగ్గినా... రెండో గేమ్ నుంచి అతనికి గట్టిపోటీ ఎదురైంది. ఈ గేమ్‌లో పలుమార్లు స్కోరు సమంగా నిలిచింది. అయితే స్కోరు 18–18 వద్ద షి యుకి వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో షి యుకి జోరు పెంచగా, సాయిప్రణీత్ డీలా పడ్డాడు. విజేత షి యుకికి 11,250 డాలర్లు (రూ. 7 లక్షల 75 వేలు)... రన్నరప్ సాయిప్రణీత్‌కు 5,700 డాలర్లు (రూ. 3 లక్షల 93 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ►దాదాపు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన స్విస్ ఓపెన్‌లో గతంలో భారత క్రీడాకారులు శ్రీకాంత్ (2015), ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018), సైనా (2011, 2012) టైటిల్స్ నెగ్గగా... భారత్ నుంచి రన్నరప్‌గా నిలిచిన తొలి ప్లేయర్ సాయిప్రణీత్. -
సాయి ప్రణీత్ సంచలనం
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ పెను సంచలనం సృష్టించాడు. అంచనాలకు మించి రాణించి... రియో ఒలింపిక్స్ చాంపియన్ , ప్రపంచ ఐదో ర్యాంకర్ చెన్ లాంగ్‌ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–18, 21–13తో రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా, ఒకసారి ఆసియా చాంపియన్ గా నిలిచిన చెస్ లాంగ్‌ను చిత్తు చేశాడు. నేడు జరిగే ఫైనల్లో చైనాకే చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకితో సాయిప్రణీత్ అమీతుమీ తేల్చుకుంటాడు. వెనుకబడి... పుంజుకొని చెన్ లాంగ్‌తో గతంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన సాయిప్రణీత్ మూడో ప్రయత్నంలో గెలుపొందడం విశేషం. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సాయిప్రణీత్ ఒకదశలో 7–11తో వెనుకబడ్డాడు. కానీ పట్టుదలతో ఆడిన ఈ హైదరాబాద్ ప్లేయర్ ఆ తర్వాత స్కోరును సమం చేయడమే కాకుండా 17–13తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ఆరంభం నుంచే సాయిప్రణీత్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. చెన్ లాంగ్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. మొదట్లోనే 7–4తో ఆధిక్యంలోకి వెళ్లిన సాయిప్రణీత్ క్రమం తప్పకుండా పాయింట్లు స్కోరు చేసి ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. స్విస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన ఐదో భారతీయ ప్లేయర్‌గా సాయిప్రణీత్ గుర్తింపు పొందాడు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (2015), హెచ్ఎస్ ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018)... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2011, 2012) ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా విజేతలుగా కూడా నిలిచారు. ►సాయంత్రం గం. 4.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
రెండో రౌండ్లో కశ్యప్
బాసెల్,(స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, శుభాంకర్ డే రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 21–19, 21–17తో ఫెలిక్స్ బ్యూరెస్‌డెట్ (స్వీడన్)పై, శుభాంకర్ 21–19, 21–17తో లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో జక్కా వైష్ణవి రెడ్డి 12–21, 23–21, 17–21తో క్రిస్టిన్ కుబా (ఎస్తొనియా) చేతిలో, గుమ్మడి వృశాలి 14–21, 11–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్) 21–23, 21–15, 21–8తో లిండా జెట్చిరి (బల్గేరియా)పై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–15, 21–17తో రాల్ఫీ జాన్సెన్–కిలాసు (జర్మనీ) జోడీపై నెగ్గింది. -
ఫైనల్లో బెంగళూరు
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో బెంగళూరు రాప్టర్స్ ఫైనల్‌కు చేరింది. తొలి సెమీఫైనల్లో బెంగళూరు 4–2తో అవధ్ వారియర్స్‌ను ఓడించింది. సెమీస్‌లో తొలి మ్యాచ్ మిక్స్డ్ డబుల్స్‌ను అవధ్ ‘ట్రంప్’గా ఎంచుకుంది. మథియాస్ క్రిస్టియన్సెన్–అశ్విని పొన్పప్ప (అవధ్) జోడీ 15–7, 15–10తో మార్కస్ ఎలిస్–లారెన్ స్మిత్ జంటపై గెలుపొంది 2–0తో ముందంజ వేసింది. అయితే, పురుషుల తొలి సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 15–9, 15–4తో లి డాంగ్ కుయెన్‌ను, రెండో సింగిల్స్‌లో శ్రీకాంత్ 15–7, 15–10తో సన్ వాన్ హోను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. తమ ‘ట్రంప్’ మ్యాచ్ పురుషుల డబుల్స్‌లో అహసాన్–సెటియవాన్ జంట 15–14, 15–9తో యాంగ్ లీ–క్రిస్టియన్సెన్ జోడీపై నెగ్గడంతో బెంగళూరు 4–2తో విజయాన్ని ఖాయం చేసుంది. నేడు జరిగే రెండో సెమీస్‌లో హైదరాబాద్ హంటర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో సైనా, ఉత్తేజిత
లక్నో: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో సైనాతోపాటు తెలుగమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు, రితూపర్ణ దాస్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21–14, 21–9తో భారత్‌కే చెందిన అమోలిక సింగ్ సిసోడియాను అలవోకగా ఓడించింది. సాయి ఉత్తేజిత 21–12, 21–15తో రేష్మా కార్తీక్ (భారత్)పై, రితూపర్ణ దాస్ 21–11, 21–15తో శ్రుతి ముందాడ (భారత్)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషి 16–21, 18–21తో రుసెలి హర్తావాన్ (ఇండోనేసియా) చేతిలో... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మామిళ్లపల్లి తనిష్క్ 10–21, 9–21తో హాన్ వైయువె (చైనా) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)తో సాయి ఉత్తేజిత; రితూపర్ణ దాస్‌తో సైనా తలపడతారు. సమీర్ వర్మ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ కాబోయే భర్త పారుపల్లి కశ్యప్‌తోపాటు సాయిప్రణీత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకోగా... గురుసాయిదత్ ఇంటిదారి పట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కశ్యప్ 9–21, 22–20, 21–8తో ఫిర్మాన్ అబ్దుల్ ఖాలిక్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలుపొందగా... సమీర్ వర్మ 22–20, 21–17తో జున్‌పెంగ్ జావో (చైనా)పై... సాయిప్రణీత్ 21–12, 21–10తో రుస్తావిటో (ఇండోనేసియా)పై విజయం సాధించారు. ఒకవేళ ఈ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిస్తే బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడు. సిక్కి–అశ్విని జంట జోరు... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–అశ్విని ద్వయం 21–14, 21–13తో ప్రీతి–ప్రియ (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–15, 21–10తో శివమ్ శర్మ–హేమనాగేంద్ర బాబు (భారత్) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–దండు పూజ (భారత్); సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. -
పిల్లలు చేసే విచిత్రం
సాయి ప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్ ముఖ్య తారలుగా జై రామ్‌కుమార్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి సమర్పణలో మహ్మద్ అస్లాం నిర్మించిన ‘అంతా విచిత్రమ్’ పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. జి.శ్రీను గౌడ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు భోలే షావలి సంగీతం అందించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అస్లాం మాట్లాడుతూ– ‘‘వినూత్నమైన కథాంశంతో రామ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను చూసి ఇంప్రెస్ అయిన ఎం. అచ్చిబాబు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు’’ అన్నారు. ‘‘పవన్‌కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి సూపర్ హీరోల ఫ్యాన్స్ అయిన కొందరు చిన్నారుల కథాంశమే ఈ చిత్రం’’ అన్నారు రామ్ కుమార్. చిన్నపిల్లలతో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించాలని అతిథులుగా పాల్గొన్న రామ సత్యనారాయణ, సాయి వెంకట్, అనంతరాముడు ఆకాంక్షించారు. -
సాయిప్రణీత్‌కు షాక్...
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ సూపర్–100 హైదరాబాద్ ఓపెన్ టోర్నమెంట్లో రెండో సీడ్, ప్రపంచ 23వ ర్యాంకర్ భమిడిపాటి సాయి ప్రణీత్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 169వ ర్యాంకర్ చికో ద్వి వార్దోయో (ఇండోనేసియా) 13–21, 22–20, 21–12తో సాయిప్రణీత్‌ను ఓడించాడు. తొలి గేమ్‌ను గెలుచుకున్న సాయి ప్రణీత్ హోరాహోరీగా సాగిన రెండో గేమ్ లో ప్రత్యర్థికి తలవంచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో వార్దోయో చెలరేగడంతో ప్రణీత్‌కు ఓటమి తప్పలేదు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, గురుసాయిదత్ విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరా రు. సమీర్‌వర్మ 21–16, 21–16తో అరింతాప్ దాస్ గుప్తాపై, సౌరభ్ వర్మ 21–12, 22–20తో లీ యున్ గుయ్ (కొరియా)పై, గురుసాయిదత్ 21–11, 21–14తో మూడో సీడ్ మిషా జిల్బెర్మాన్ (ఇజ్రాయెల్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. యువ సంచలనం లక్ష్యసేన్ రెండో రౌండ్లో 13–21, 12–21తో హియో వాంగ్ హీ (కొరియా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రసిక రాజె 21–19, 21–15తో అలెస్సాండ్రా మైనాకీ (ఇండోనేసియా)పై, ఆకర్షి కశ్యప్ 21–14, 23–21తో ముగ్దపై, శ్రీ కృష్ణ ప్రియ 12–21, 21–16, 21–14తో సిమ్రన్ సింఘిపై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. ఉత్తేజిత రావు 7–21, 21–12, 18–21తో దినార్ అయుస్టైన్ (ఇండోనేసియా) చేతిలో, రితూపర్ణదాస్ 13–21, 11–21తో యో మిన్ (ఇండోనేసియా) చేతిలో, వైదేహి 13–21, 14–21తో హర్త్‌వాన్ (ఇండోనేసియా) చేతిలో, ప్రభు దేశాయ్ 12–21, 14–21తో యూ జిన్ (కొరియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. -
సాయిప్రణీత్‌కు చుక్కెదురు
సింగపూర్ సిటీ: గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా టైటిల్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ఈసారి సింగపూర్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 24వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–16, 16–21, 18–21తో 59వ ర్యాంకర్ యు ఇగారషి (జపాన్) చేతిలో ఓడిపోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 17–17తో సమంగా ఉన్న దశలో సాయిప్రణీత్ వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 15 నిమిషాల్లో 9–21, 6–21తో భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ చేతిలో... క్వాలిఫయర్ గురుసాయిదత్ 14–21, 19–21తో కియావో బిన్ (చైనా) చేతిలో ఓడిపోయారు. శుభాంకర్ డే 14–21, 21–14, 21–16తో జేసన్ ఆంథోని (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రుత్విక శుభారంభం మహిళల సింగిల్స్ విభాగంలో రుత్విక శివాని, రితూపర్ణ దాస్ ముందంజ వేయగా... జక్కా వైష్ణవి రెడ్డి, చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో ఓడిపోయారు. రుత్విక 21–15, 17–21, 21–16తో ప్రపంచ 44వ ర్యాంకర్ లిండా జెట్చిరి (బల్గేరియా)ను ఓడించింది. రితూపర్ణ 5–3తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్) గాయంతో వైదొలిగింది. వైష్ణవి 19–21, 7–21తో మినత్సు మితాని (జపాన్) చేతిలో, ఉత్తేజిత 23–21, 4–21, 6–21తో బీట్రిజ్ కొరాలెస్ (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21–19, 16–21, 21–12తో జోన్స్ జాన్సెన్–కార్లా నెల్టీ (జర్మనీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–18, 13–21, 14–21తో ఎన్జీ సాజ్ యావు–యుయెన్ సిన్ యింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 21–16, 24–22తో రిజ్కీ హిదాయత్–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
భారత జట్లకు చుక్కెదురు
స్టార్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గైర్హాజరీ భారత బ్యాడ్మింటన్ జట్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రతిష్టాత్మక థామస్–ఉబెర్ కప్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత పురుషుల, మహిళల జట్లకు అనూహ్య ఓటమి ఎదురైంది. తొలి లీగ్ మ్యాచ్‌లోనే ఓటమితో భారత జట్లకు నాకౌట్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. బ్యాంకాక్: కోచ్‌ల వ్యూహాత్మక తప్పిదమో... ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేశారో గానీ భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు మూల్యం చెల్లించుకుంది. థామస్ కప్‌లో భాగంగా ఫ్రాన్స్ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–4తో ఓడిపోయింది. సింగిల్స్‌లో అగ్రశ్రేణి షట్లర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌ను... డబుల్స్‌లో మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంటను ఆడించకుండా విశ్రాంతి ఇవ్వడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–7, 21–18తో బ్రైస్ లెవెర్డెజ్ను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించాడు. అయితే రెండో మ్యాచ్‌లో అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జంట 13–21, 16–21తో బాస్టియన్ కెర్సాడీ–జూలియన్ మాయో జోడీ చేతిలో ఓడిపోయింది. స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో 21వ ర్యాంకర్ సమీర్ వర్మ 18–21, 22–20, 18–21తో ప్రపంచ 43వ ర్యాంకర్ లుకాస్ కోర్వీ చేతిలో ఓటమి చవిచూశాడు. దాంతో ఫ్రాన్స్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా జంట 10–21, 12–21తో థోమ్ గికెల్–రోనన్ లాబెర్ ద్వయం చేతిలో ఓడిపోవడంతో ఫ్రాన్స్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామ మాత్రమైన ఐదో మ్యాచ్‌లో జూనియర్ మాజీ వరల్డ్ నంబర్‌వన్ లక్ష్య సేన్ 20–22, 21–19, 19–21తో తోమా పపోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. ఇదే గ్రూప్‌లో చైనా కూడా ఉంది. నాలుగు జట్లున్న ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. సైనాకు షాక్... ఉబెర్ కప్‌లో భాగంగా కెనడాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు 1–4తో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ 21–15, 16–21, 16–21తో ప్రపంచ 14వ ర్యాంకర్ మిచెల్లి లీ చేతిలో పరాజయం పాలైంది. గతంలో మిచెల్లితో ఆడిన రెండుసార్లూ నెగ్గిన సైనాకు ఈసారి నిరాశ ఎదురైంది. రెండో మ్యాచ్‌లో రాచెల్ హోండెరిచ్ 21–11, 21–13తో జక్కా వైష్ణవి రెడ్డిని ఓడించి కెనడాకు 2–0తో ఆధిక్యం అందించింది. మూడో మ్యాచ్‌లో మేఘన–పూర్వీషా ద్వయం 21–19, 21–15తో మిచెల్లి టాంగ్–జోసెఫిన్ వు జంటను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో బ్రిట్నీ టామ్ 21–11, 21–15తో శ్రీకృష్ణప్రియపై నెగ్గడంతో కెనడా 3–1 తో విజయాన్ని దక్కించుకుంది. చివరి మ్యాచ్‌లో రాచెల్–క్రిస్టెన్ సాయ్ ద్వయం 21–14, 21–16తో సంయోగిత–ప్రాజక్తా జంటను ఓడించి కెనడాకు 4–1తో విజయాన్ని అందించింది. -
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్, సమీర్ వర్మ
సిడ్నీ: అలవోక విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు భమిడిపాటి సాయి ప్రణీత్, సమీర్ వర్మ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ సాయిప్రణీత్ 21–12, 21–14తో మౌలానా పంజి అహ్మద్ (ఇండోనేసియా)పై; నాలుగో సీడ్ సమీర్ వర్మ 21–16, 21–12తో టకుమా ఉయెదా (జపాన్)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 21–17, 21–17తో హుక్ జిన్ చొయి–యుంగ్ హూన్ పర్క్ జోడీపై; అర్జున్–రామచంద్రన్ ద్వయం 21–15, 25–23తో ఒకముర–ఒనోదెరా (జపాన్) జంటపై గెలిచింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 5–21, 5–21తో హన్ యూ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మేఘన–పూర్విషా జంట 11–21, 13–21తో మికి కశిహర–మియుకీ కటో (జపాన్) జోడీ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో శివమ్ శర్మ–పూర్విషా రామ్ ద్వయం 6–21, 13–21తో సెంగ్ జాయి సియొ–చై యూజుంగ్ (కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. తొలి రౌండ్లో ప్రణీత్ 21–17, 21–14తో మిష జిల్బెర్మన్ (ఇజ్రాయిల్)పై; సమీర్ 13–21, 21–17, 21–12తో అభినవ్ (న్యూజిలాండ్)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో సౌరభ్ వర్మ 21–19, 17–21, 12–21తో టకుమా ఉయెదా (జపాన్) చేతిలో... జయరామ్ 20–22, 22–20, 21–17తో టకెశిటా (జపాన్) చేతిలో... లక్ష్యసేన్ 20–22, 21–13, 19–21తో లీ చెక్ యూ (హాంకాంగ్) చేతిలో... రాహుల్ యాదవ్ 11–21, 17–21తో మౌలానా (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 19–21, 21–15, 21–15తో జార్జినా బ్లాండ్ (ఇంగ్లండ్)పై గెలిచింది. సాయి ఉత్తేజిత 8–21, 19–21తో మినె (జపాన్) చేతిలో... శ్రీకృష్ణప్రియ 18–21, 20–22తో యూలియా (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
న్యూజిలాండ్ ఓపెన్ సెమీస్‌లో సాయి ప్రణీత్
అక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ టోర్నమెంట్ క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరగా... బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ చేతిలో ఓడి సమీర్ వర్మ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 21–7, 21–9తో నీలుక కరుణరత్నే (శ్రీలంక)పై సునాయస విజయం సాధించాడు. మరో క్వార్టర్స్‌లో సమీర్ వర్మ 19–21, 9–21తో టాప్ సీడ్ లిన్ డాన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. సాయి ప్రణీత్ సెమీస్‌లో రెండో సీడ్ జొనాథన్ క్రైస్ట్ (ఇండోనేసియా)తో తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 10–21, 15–21తో నాలుగో సీడ్ బోడిన్ ఇసారా– నిపిట్‌ఫాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. -
క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్
అక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత షట్లర్లు సాయి ప్రణీత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ 21–18, 21–17తో డారెన్ ల్యూ (మలేసియా)పై; సమీర్ వర్మ 21–17, 21–19తో లీ చౌక్ యూ (హాంకాంగ్)పై గెలుపొంది క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. యువ షట్లర్ లక్ష్యసేన్, అజయ్ జయరామ్ ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యారు. లక్ష్యసేన్ 21–15, 15–21, 12–21తో బ్యాడ్మింటన్ దిగ్గజం, టాప్ సీడ్ లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడాడు. అజయ్ జయరామ్ 15–21, 22–20, 6–21తో వాంగ్ హీ హియో (దక్షిణ కొరియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయం 21–9, 21–12తో అనువిత్–నథాపాట్ ట్రింకజీ (థాయ్‌లాండ్) జోడీ పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో శివమ్ శర్మ–పూర్విషా రామ్ జంట రెండో రౌండ్లో 16–21, 14–21తో చాన్ పెంగ్ సూన్–లియూ యింగ్ గో (మలేసియా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మేఘన–పూర్విషా రామ్ జంట 15–21, 6–21తో డెల్లా హ్యారిస్–రిజ్కి ప్రదీప్త (ఇండోనేసియా) చేతిలో ఓడింది. -
మా జట్టు పటిష్టంగా మారింది
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి జరిగే ఈ టోర్నీలో హైదరాబాద్ హంటర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హంటర్స్ టీమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. గత ఏడాది లీగ్ దశలో నిలకడగానే ఆడినా చివర్లో విఫలమైన హంటర్స్ సెమీఫైనల్ అవకాశం కోల్పోయింది. అయితే ఈసారి తమ జట్టు మరింత పటిష్టంగా మారిందని, జట్టుకు మంచి విజయావకాశాలు ఉన్నాయని కీలక ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ అన్నాడు. ముఖ్యంగా పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు లీ హ్యున్ ఇల్ (దక్షిణ కొరియా), డబుల్స్‌లో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత, ప్రపంచ చాంపియన్ మార్కిస్ కిడో (ఇండోనేసియా) రావడం జట్టు బలాన్ని పెంచింది. ‘లీ హ్యున్, కిడో జట్టుకు అదనపు బలం. కరోలినా మారిన్లాంటి స్టార్ కూడా జట్టుతో ఉంది. ఈసారి మా రాత మారుతుందని గట్టిగా నమ్ముతున్నా. ముందుగా సెమీఫైనల్ చేరుకోవడంపైనే దృష్టి పెట్టాం. ఆ తర్వాత ఫైనల్, ఆపై టైటిల్’ అని ఈ ఏడాది సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు. వరుసగా రెండో ఏడాది హంటర్స్ జట్టుతో కొనసాగడం సంతోషంగా ఉందని... హైదరాబాద్ అభిమానులు సొంతగడ్డపై తమ జట్టు సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు చూసేలా తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని అతను చెప్పాడు. డబుల్స్‌లో బలమైన జట్టు ఉండటం తమకు ఇతర జట్లతో పోలిస్తే మెరుగైన అవకాశాన్ని కల్పిస్తోందని హంటర్స్ కోచ్ రాజేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జట్టు సభ్యులు సాత్విక్ సాయిరాజ్, రాహుల్ యాదవ్‌లతో పాటు టీమ్ యజమాని డాక్టర్ వీఆర్కే రావు, సీఈఓ శ్యామ్ గోపు తదితరులు పాల్గొన్నారు. -
శభాష్ ...సాయిప్రణీత్
ఈ సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ యువతార భమిడిపాటి సాయిప్రణీత్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మరో ముందడుగు వేశాడు. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్న ఈ తెలుగు తేజం రెండో రౌండ్లో ఓటమి అంచుల్లో ఉన్న దశలో పట్టుదలతో పోరాడి గట్టెక్కాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరోవైపు ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్, 12వ సీడ్ సైనా నెహ్వాల్ అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గ్లాస్గో (స్కాట్లాండ్): అత్యున్నత వేదికపై అదరగొట్టే ఆటతీరును ప్రదర్శించేందుకు వచ్చిన అవకాశాన్ని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. వరుసగా ఐదో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతకం గెలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ తమ ప్రత్యర్థులను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 19వ ర్యాంకర్ సాయిప్రణీత్ 14–21, 21–18, 21–19తో ప్రపంచ 26వ ర్యాంకర్ ఆంథోనీ సినిసుకా జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై గెలుపొందగా... శ్రీకాంత్ 21–9, 21–17తో లుకాస్ కోర్వి (ఫ్రాన్స్)ను ఓడించాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ (భారత్) 20–22, 9–21తో 16వ సీడ్ రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడాగా... 13వ సీడ్ అజయ్ జయరామ్ 21–13, 21–18తో మార్క్ కాల్జు (నెదర్లాండ్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లో ‘బై’ పొందిన సైనా నెహ్వాల్ రెండో రౌండ్లో 21–11, 21–12తో సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో సైనా వరుసగా ఎనిమిదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో తన్వీ లాడ్ (భారత్) 9–21, 19–21తో సుంగ్ జీ హున్ చేతిలో, రితూపర్ణ దాస్ (భారత్) 16–21, 13–21తో 16వ సీడ్ క్రిస్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్) చేతిలో ఓడిపోయారు. వరుసగా 8 పాయింట్లు... జిన్‌టింగ్‌తో 72 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ పుంజుకున్నతీరు అద్భుతం. తొలి గేమ్‌ను కోల్పోయిన ఈ హైదరాబాద్ ప్లేయర్ రెండో గేమ్‌లో కోలుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో జిన్‌టింగ్ దూకుడుగా ఆడి 18–12తో ఆధిక్యంలోకి వెళ్లి విజయానికి మూడు పాయింట్ల దూరంలో నిలిచాడు. అయితే ఈ ఏడాది సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన సాయిప్రణీత్ ఓటమి దిశగా పయనిస్తున్నా విజయంపై ఆశలు వదులుకోలేదు. కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సాయిప్రణీత్... నమ్మశక్యంకాని రీతిలో విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి 20–18తో విజయం అంచుల్లోకి వచ్చాడు. జిన్‌టింగ్ ఒక పాయింట్ గెలిచినా, వెంటనే సాయిప్రణీత్ మరో పాయింట్ సాధించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) లేదా చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్; ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్; రెండో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సైనా నెహ్వాల్; ఎన్గాన్ యి చెయుంగ్ (హాంకాంగ్)తో పీవీ సింధు తలపడతారు. మరోవైపు మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) 22–24, 21–19, 15–21తో రెండో సీడ్ కామిల్లా రైటర్జుల్–క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) చేతిలో... ఆరతి సారా సునీల్–సంజన సంతోష్ (భారత్) 14–21, 15–21తో యిక్సిన్ బావో–జియోహాన్ యు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా 21–13, 16–21, 8–21తో ముస్కెన్క్–పియెక్ (నెదర్లాండ్స్) చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–శ్లోక్ 14–21, 21–19, 14–21తో మిన్ చున్–చెంగ్ హెంగ్ సు (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. -
సింధు, సాయిప్రణీత్ శభారంభం
∙ ప్రిక్వార్టర్స్‌లోకి సిక్కి రెడ్డి–ప్రణవ్ జంట ∙ జయరామ్ కూడా ముందంజ ∙ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పూసర్ల వెంకట (పీవీ) సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బోణీ చేశారు. అంచనాలకు అనుగుణంగా రాణించి తమ ప్రత్యర్థులపై విజయాలు నమోదు చేశారు. భారత్‌కే చెందిన అజయ్ జయరామ్ కూడా తొలి అడ్డంకిని దాటి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. గ్లాస్గో (స్కాట్లాండ్): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సాయిప్రణీత్, అజయ్ జయరామ్ సింగిల్స్ విభాగంలో శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లో ‘బై’ పొందిన సింధు మంగళవారం జరిగిన రెండో రౌండ్లో 21–16, 21–14తో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ గెలుపుతో గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కిమ్ హ్యో మిన్ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. గతంలో కిమ్‌పై మూడుసార్లు గెలిచిన సింధుకు ఈసారి అంతగా పోటీ ఎదురుకాలేదు. 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధు వరుసగా ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి 8–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కిమ్ తేరుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు. రెండో గేమ్‌లోనూ సింధు తన జోరు కొనసాగించింది. ఆరంభంలోనే 8–3తో ఆధిక్యంలోకి వెళ్లి పట్టు బిగించింది. ఆ తర్వాత అదే దూకుడులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఎవెగెనియా కొసెత్‌స్కాయా (రష్యా)–చెయింగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)ల మధ్య మ్యాచ్ విజేతతో సింధు మూడో రౌండ్లో తలపడుతుంది. సోమవారం ఆలస్యంగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రితూపర్ణ దాస్ 2–0తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి అనా మికెలా (ఫిన్లాండ్) గాయం కారణంగా వైదొలిగింది. పురుషుల సింగిల్స్‌లో 15వ సీడ్ సాయిప్రణీత్ 21–18, 21–17తో వీ నాన్ (హాంకాంగ్)పై, 13వ సీడ్ అజయ్ జయరామ్ 21–14, 21–12తో లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)పై విజయం సాధించారు. వీ నాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఈ ఏడాది సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సాయిప్రణీత్ రెండో రౌండ్లో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ఆడతాడు. ‘మ్యాచ్ కఠినంగా ఉంటుందని ముందే అంచనా వేశాను. వెనుకబడిన దశలో నా వ్యూహాన్ని మార్చాను. వీ నాన్ కొన్ని పొరపాట్లు చేయడంతో నేను వాటిని సద్వినియోగం చేసుకున్నాను’ అని సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు. డబుల్స్ విభాగాల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 21–12, 21–19తో ప్రాజక్తా సావంత్ (భారత్)–యోగేంద్రన్ కృష్ణన్ (మలేసియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మరోవైపు సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 17–21, 21–18, 5–21తో వాంగ్ యిలు–హువాంగ్ డింగ్పింగ్ (చైనా) ద్వయం చేతిలో... సాత్విక్ సాయిరాజ్–మనీషా (భారత్) జంట 20–22, 18–21తో క్రిస్టియాన్సన్–సారా థిగెసన్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓడిపోయాయి.మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్వని ద్వయం 21–15, 21–13తో రిరిన్ అమెలియా (ఇండోనేసియా)–చింగ్ చెయోంగ్ (మలేసియా) జోడీపై నెగ్గగా... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి జోడీ 8–21, 12–21తో హిరోయుకి ఎండో–వతనాబె (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
సెమీస్ లో శ్రీకాంత్
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 25-23, 21-17 తేడాతో భారత్ కే చెందిన సాయి ప్రణీత్ పై గెలుపొందాడు. ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు జరిగిన పోరులో శ్రీకాంత్ వరుస రెండు సెట్లు గెలిచి సెమీస్ కు చేరాడు. తొలి గేమ్ లో సాయి ప్రణీత్ నుంచి శ్రీకాంత్ కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వీరిద్దరూ హోరాహోరీగా తలపడిన మొదటి గేమ్ లో చివరకు శ్రీకాంత్ పైచేయి సాధించాడు. అదే ఊపును రెండో గేమ్ లో కొనసాగించిన శ్రీకాంత్.. సాయి ప్రణీత్ కు చెక్ పెట్టాడు. తద్వారా సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో సాయి ప్రణీత్ చేతిలో ఎదురైన ఓటమికి శ్రీకాంత్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ టైటిల్ పోరులో శ్రీకాంత్ పై సాయి ప్రణీత్ గెలిచి టైటిల్ ను కైవసం చేసకున్న సంగతి తెలిసిందే. -
జోరు కొనసాగించేనా?
♦ నేటి నుంచి ఆస్ట్రేలియన్ ♦ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ ♦ బరిలో శ్రీకాంత్, సాయిప్రణీత్, సింధు, సైనా సిడ్నీ: ఇటీవలే సింగపూర్ ఓపెన్ నెగ్గిన సాయిప్రణీత్, గతవారం ఇండోనేసియా ఓపెన్‌లో విజేతగా నిలిచిన కిడాంబి శ్రీకాంత్... మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా), రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హెచ్ఎస్ ప్రణయ్ మరో టైటిల్ వేటకు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పారుపల్లి కశ్యప్, సిరిల్ వర్మ, శ్రేయాన్‡్ష జైస్వాల్, రుత్విక శివాని క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడనున్నారు. తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, మనూ అత్రి–సుమీత్ రెడ్డి, కోనా తరుణ్–ఫ్రాన్సిస్ ఆల్విన్ జోడీలు బరిలో ఉన్నాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో ఆడనున్న శ్రీకాంత్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా) ఎదురవుతాడు. ఇతర మ్యాచ్‌ల్లో టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్, యూరోపియన్ చాంపియన్ రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో ప్రణయ్, ఏడో సీడ్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జయరామ్ ఆడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఇండోనేసియా ఓపెన్ విజేత సయాకా సాటో (జపాన్)తో సింధు; నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సైనా తలపడతారు. ఏప్రిల్‌లో సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్‌లో... ఆదివారం కిడాంబి శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్‌లో విజేతగా నిలిచారు. భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ ఇండోనేసియా ఓపెన్‌లో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా), రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)లను ఓడించి పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
సాయిప్రణీత్‌కు సవాల్
జకార్తా: వరుసగా రెండు అంతర్జాతీయ టైటిల్స్ సాధించి జోరు మీదున్న భారత బ్యాడ్మింటన్ యువతార భమిడిపాటి సాయిప్రణీత్ మరో టైటిల్‌పై గురి పెట్టాడు. ఈరోజు(సోమవారం) మొదలయ్యే ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో సాయిప్రణీత్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ విభాగాల్లో మ్యాచ్‌లు ఉంటాయి. మంగళవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ, థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో విజేతగా నిలిచిన సాయిప్రణీత్‌కు ఇండోనేసియా ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్లోనే అగ్ని పరీక్ష ఎదురుకానుంది. మొదటి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)తో సాయిప్రణీత్ ఆడనున్నాడు. సాయిప్రణీత్‌తోపాటు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
శభాష్... సాయిప్రణీత్
థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్ సొంతం బ్యాంకాక్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ యవనికపై మరోసారి భారత్ పతాకం రెపరెపలాడింది. ఆదివారం ముగిసిన థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో భారత యువతార భమిడిపాటి సాయిప్రణీత్ చాంపియన్‌గా నిలిచాడు. 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాయిప్రణీత్ 17–21, 21–18, 21–19తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. ఈ విజయంతో సాయిప్రణీత్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 80 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయిం ట్లు లభించాయి. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సంఘం రూ. 3 లక్షలు నజరానా ప్రకటించింది. ఏప్రిల్ నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన ప్రపంచ 24వ ర్యాంకర్ సాయిప్రణీత్ కెరీర్లో ఇది తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో సాయిప్రణీత్ ఫైనల్‌కు చేరుకున్నా తుది పోరులో భారత్‌కే చెందిన సమీర్ వర్మ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. తాజా విజయంతో 43 ఏళ్ల చరిత్ర కలిగిన థాయ్‌లాండ్ ఓపెన్‌లో... పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా సాయిప్రణీత్ గుర్తింపు పొందాడు. 2013లో హైదరాబాద్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్ తొలిసారి ఈ ఘనత సాధించాడు. 2012లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నీ గెలిచిన ఐదో ప్లేయర్‌గా సాయిప్రణీత్ నిలి చాడు. గతంలో శ్రీకాంత్ మూడు సార్లు (2013 థాయ్‌లాండ్ ఓపెన్, 2015 స్విస్ ఓపెన్, 2016 సయ్యద్ మోడీ ఓపెన్), కశ్యప్ రెండు సార్లు (2012, 2015 సయ్యద్ మోడీ ఓపె న్), అరవింద్ భట్ (2014 జర్మన్ ఓపెన్), సమీర్ వర్మ (2017 సయ్యద్ మోడీ ఓపెన్) ఒక్కోసారి గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నీల్లో టైటిల్స్ గెలిచారు. వెనుకబడి పుంజుకొని... ఫైనల్ చేరుకునే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోని సాయిప్రణీత్‌కు తుది పోరులో గట్టిపోటీనే లభించింది. ప్రపంచ 27వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీతో తొలిసారి ఆడిన ఈ హైదరాబాద్ ప్లేయర్ మొదటి గేమ్‌లో కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో తన పొరపాట్లను సవరించుకొని సాయిప్రణీత్ తేరుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో సాయిప్రణీత్ 3–8తో వెనుకంజ వేశాడు. కానీ సంయమనం కోల్పోకుండా ఆడి నిలకడగా పాయింట్లు సాధించి స్కోరును 9–9తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 17–17తో సమంగా ఉన్నపుడు సాయిప్రణీత్ రెండు పాయింట్లు నెగ్గి 19–17తో ముందంజ వేశాడు. ఆ వెంటనే రెండు పాయింట్లు కోల్పోవడంతో మళ్లీ స్కోరు 19–19తో సమమైంది. ఈ దశలో సాయిప్రణీత్ వెంటవెంటనే రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కేవలం ర్యాలీలపైనే నా దృష్టిని కేంద్రీకరించాను. ఫైనల్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ముఖ్యంగా సుదీర్ఘ ర్యాలీలు నా సహనాన్ని పరీక్షించాయి. అయితే ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా సంయమనంతో ఆడి ఫలితాన్ని సాధించాను. టైటిల్ నెగ్గినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. –సాయిప్రణీత్ -
ఫైనల్లో సాయిప్రణీత్
సెమీస్‌లో సైనా ఓటమి బ్యాంకాక్: గత నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ యువతార భమిడిపాటి సాయిప్రణీత్... మరో అంతర్జాతీయ టైటిల్‌కు విజయం దూరంలో ఉన్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సాయిప్రణీత్ 21–11, 21–15తో పనావిత్ తోంగ్‌నువామ్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో సాయిప్రణీత్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో జొనాథన్ క్రిస్టీ 21–9, 21–18తో జూ వెన్ సూంగ్ (మలేసియా)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సాయిప్రణీత్ గెలిస్తే 43 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. 2013లో కిడాంబి శ్రీకాంత్ ఈ టైటిల్‌ను సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా 2011లో విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సైనా నెహ్వాల్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. ప్రపంచ 13వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బామ్రుంగ్పన్ (థాయ్‌లాండ్)తో జరిగిన సెమీఫైనల్లో సైనా 19–21, 18–21తో ఓడిపోయింది. గతంలో బుసానన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన సైనా నాలుగోసారి మాత్రం ఓటమి రుచి చూసింది. పురుషుల సింగిల్స్ ఫైనల్ మధ్యాహ్నం గం. 1.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
క్వార్టర్స్‌లో సైనా, సాయిప్రణీత్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాదీ స్టార్ సైనా నెహ్వాల్, తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే సౌరభ్ వర్మ, సాయి ఉత్తేజితా రావులకు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 21–11, 21–14తో యింగ్ యింగ్ లీ (మలేసియా)పై అలవోక విజయం సాధించింది. భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి వరుస గేముల్లో 40 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించింది. క్వార్టర్స్‌లో ఆమె... క్వాలిఫయర్ హరుకొ సుజుకి (జపాన్)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింగపూర్ ఓపెన్ చాంపియన్, మూడో సీడ్ సాయిప్రణీత్ 21–13, 21–18తో తొమ్మిదో సీడ్ ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా)ను కంగుతినిపించాడు. 12వ సీడ్ సౌరభ్ వర్మ 16–21, 25–23, 11–21తో ఐదో సీడ్ బ్రైస్ లెవర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్‌లో ఉత్తేజిత 15–21, 17–21తో పట్టరసుడ చయ్వాన్ (థాయ్‌లాండ్) చేతిలో కంగుతింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ డెచపోల్ పువరనుక్రొ–సప్సిరి టెరటనచయ్ (మలేసియా) జంట 21–10, 21–9తో ప్రజక్తా సావంత్ (భారత్)–యోగేంద్ర కృష్ణన్ (మలేసియా) జోడిని ఓడించింది.