
Indonesia Open- PV Sindhu Kidambi Srikanth Sai Praneeth Enters 2nd Round: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ శుభారంభం చేశారు. బుధవారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో టోర్నీ మూడో సీడ్ సింధు 17–21, 21–17, 21–17తో జపాన్ షట్లర్ అయా ఒహోరిపై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21–15, 19–21, 21–12తో హెచ్‌ఎస్ ప్రణయ్ (భారత్)పై, సాయి ప్రణీత్ 21–19, 21–18తో టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది.
తొలి రౌండ్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి ద్వయం 27–29, 18–21తో గ్యాబ్రియెల్ స్టొయెవా– స్టిఫాని స్టొయెవా (బల్గేరియా) జంట చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్–అశ్విని పొన్నప్ప (భారత్) 24–22, 12–21, 19–21తో టకురో హోకి– నమి మత్సుయమ (జపాన్) చేతిలో, ధ్రువ్ కపిల–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 7–21, 12–21తో యమషిటా–నరు షినోయ (జపాన్) జంట చేతిలో ఓడారు.
చదవండి: IPL 2022 Auction: ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునేది వీళ్లనే..!