indonesia open
-
లక్ష్య సేన్ ఓటమి
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్, ప్రపంచ 14వ ర్యాంకర్ లక్ష్య సేన్ ఓటమి పాలయ్యాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో 61 నిమిషాలపాటు జరిగిన పోరులో లక్ష్య సేన్ 22–24, 18–21తో ఓడిపోయాడు. లక్ష్య సేన్‌కు 7,150 డాలర్ల (రూ. 5 లక్షల 96 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–9, 21–15తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై విజయం సాధించాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 2–3తో వెనుకంజలో ఉన్నాడు. మరోవైపు భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రియాన్షు 10–21, 17–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. గాయత్రి జోడీ నిష్క్రమణ డబుల్స్ విభాగాల్లో భారత జోడీల కథ ముగిసింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–19, 19–21, 19–21తో మయు మత్సుమోటో–వకానా నాగహార (జపాన్) జంట చేతిలో... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ 13–21, 21–19, 13–21తో హ నా బేక్–సో హీ లీ (దక్షిణ కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయాయి. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ 9–21, 11–21తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ ద్వయం సి వె జెంగ్–యా కియాంగ్ హువాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. -
Indonesia Open 2024: పీవీ సింధుకు మరో ఘోర పరాభవం..
సింగపూర్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌లోనే ఓటమి పాలైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరో పరాభవం ఎదురైంది. ఇండోనేషియా ఓపెన్‌లో తొలి రౌండ్లో సింధు ఓటమి చవిచూసింది. ఇండోనేషియా ఓపెన్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి రౌండ్లో చైనీస్ తైపీ షట్లర్ వెన్ చి హ్సుతో చేతిలో సిందు పరాజయం పాలైంది.వరుసగా మూడు గేమ్స్‌లో 15-21, 21-15, 14-21 తేడాతో ఓడిన సింధు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో ప్రత్యర్ధికి గట్టి పోటీనిచ్చిన సింధు.. రెండు రౌండ్లో మాత్రం అద్బుతంగా పుంజుకుని వెన్ చి హ్సు ఓడించింది.కానీ ఫలితాన్ని తేల్చే మూడో గేమ్‌లో మాత్రం సింధు ప్రత్యర్ధి ముందు తేలిపోయింది. దీంతో తొలి రౌండ్లోనే సింధు కథ ముగిసింది. కాగా పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సింధుకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి.ఈ ఓటమి కంటే ముందు సింగపూర్ ఓపెన్‌తో పాటు మలేషియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో సిందు పరాజయం చవిచూసింది. -
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి–ట్రెసా జోడీ
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–15, 21–11తో యు పె చెంగ్–యు సింగ్ సన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ ముందంజ వేయగా... భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. లక్ష్య సేన్ 21–12, 21–17తో కెంటా సునెయామ (జపాన్)పై గెలుపొందగా... ప్రియాన్షు 21–17, 21–12తో ప్రణయ్‌ను బోల్తా కొట్టించాడు. కిరణ్ జార్జి 21–11, 10–21, 20–22తో హాంగ్ యాంగ్ వెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 18–21, 21–16, 21–17తో విన్సన్ చియు–జెనీ గాయ్ (అమెరికా) జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
కిరణ్ జార్జికి సింగిల్స్ టైటిల్
భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిరణ్ జార్జి తన కెరీర్లో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. జకార్తాలో ఆదివారం ముగిసిన ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోరీ్నలో 23 ఏళ్ల కిరణ్ జార్జి విజేతగా నిలిచాడు. కేరళకు చెందిన కిరణ్ జార్జి ఫైనల్లో 21–19, 22–20తో జపాన్‌కు చెందిన ప్రపంచ 82వ ర్యాంకర్ కూ తకహాíÙపై గెలుపొందాడు. కిరణ్ జార్జికు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
అపూర్వ జోడీ... అద్భుత విజయం
సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి(భారత్) జోడి ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో అపూర్వ విజయం సాధించింది. పురుషుల డబుల్స్ విభాగంలో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. జకార్తాలో జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–18తో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ ఆరోన్–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలుపొందింది. భారత్ జోడీకి 92,500 డాలర్ల (రూ.75 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా, విజేతలుగా నిలిచిన ఏపీ క్రీడాకారుడు సాత్విక్‌తో పాటు చిరాగ్‌ను సీఎం జగన్ అభినందించారు. జకార్తా వేదికగా ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. గతంలో ఏ భారతీయ బ్యాడ్మింటన్ జోడీకి సాధ్యంకాని ఘనతను సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం సుసాధ్యం చేసి చూపించింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ఈ భారత జంట తొలిసారి విజేతగా అవతరించింది. తద్వారా డబుల్స్ విభాగంలో ఈ ఘనత సాధించిన మొదటి జోడీగా కొత్త చరిత్ర సృష్టించింది. గత ఐదేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లో తమ విజయాలతో భారత డబుల్స్ విభాగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సాత్విక్–చిరాగ్ జోడీ తాజా గెలుపుతో తమ స్థాయిని మరింత ఎత్తుకు పెంచుకుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జంటను ఓడించి సంచలనం సృష్టించిన సాత్విక్–చిరాగ్... ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జోడీని కూడా బోల్తా కొట్టించి ఔరా అనిపించింది. జకార్తా: నిరీక్షణ ముగిసింది. డబుల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఖాతాలో తొలిసారి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ టైటిల్ చేరింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ మరోసారి భారత్‌కు కలిసొచ్చింది. గతంలో సైనా నెహ్వల్, కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలువగా... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం మొదటిసారి చాంపియన్‌గా అవతరించింది. తమ కెరీర్లో ఫైనల్ చేరుకున్న తొలి సూపర్–1000 టోర్నీలోనే సాత్విక్–చిరాగ్ ద్వయం టైటిల్ సాధించడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–17, 21–18తో ప్రపంచ మూడో ర్యాంక్ జంట, ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌గా ఉన్న ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు ముందు 2017 నుంచి ఇప్పటి వరకు ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌లతో ఎనిమిదిసార్లు తలపడిన సాత్విక్–చిరాగ్‌లకు ఎనిమిదిసార్లూ ఓటమి ఎదురుకాగా... తొమ్మిదో ప్రయత్నంలో తొలిసారి ఈ మలేసియా టాప్ జోడీపై గెలిచారు. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 92,500 డాలర్ల (రూ. 75 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ జంటకు 43,750 డాలర్ల (రూ. 35 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పక్కా వ్యూహంతో... గతంలో మలేసియా జోడీ చేతిలో ఎదురైన ఎనిమిది పరాజయాలను విశ్లేషించి ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో భారత జోడీ బరిలోకి దిగింది. ఎలా ఆడితే తమ ప్రత్యర్థి జంట ఆట కట్టించే అవకాశముందో అదే రకంగా సాత్విక్–చిరాగ్ ద్వయం ఆడింది. సుదీర్ఘ ర్యాలీలను ఆడుతూనూ పదునైన స్మాష్ షాట్లతో వాటికి ఫినిషింగ్ టచ్ ఇచ్చి సాత్విక్–చిరాగ్ సత్తా చాటుకున్నారు. తొలి గేమ్ ఆరంభంలో ఒకదశలో 3–7తో వెనుకబడిన సాత్విక్–చిరాగ్ నెమ్మదిగా తేరుకున్నారు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 9–7తో ఆధిక్యంలోకి వచ్చారు. అనంతరం మలేసియా జోడీ స్కోరును 9–9 వద్ద సమం చేసినా... సాత్విక్–చిరాగ్ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టి ప్రత్యర్థి జంటపై ఒత్తిడి పెంచి వరుసగా మూడు పాయింట్లతో 12–9తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు ఆ తర్వాత భారత జోడీ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 8–7 వద్ద సాత్విక్–చిరాగ్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 11–7తో... ఆ తర్వాత స్కోరు 14–11 వద్ద ఈసారి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 18–11తో ఆధిక్యాన్ని పెంచుకున్నారు. చివర్లో 20–14 వద్ద వరుసగా సాత్విక్–చిరాగ్ వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి ఆధిక్యం 20–18కి తగ్గడంతో ఒత్తిడికి లోనయ్యారు. అయితే మలేసియా జోడీ అనవసర తప్పిదంతో భారత జోడీకి ఒక పాయింట్ రావడంతో విజయం ఖాయమైంది. వరల్డ్ టూర్ టోర్నీలు అంటే... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్‌ను ఆరు స్థాయిలుగా విభజించారు. ఏడాదిలో నాలుగు సూపర్–1000 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 12 లక్షల 50వేల డాలర్లు), ఆరు సూపర్–750 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 8 లక్షల 50 వేల డాలర్లు), ఏడు సూపర్–500 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 4 లక్షల 20 వేల డాలర్లు)...11 సూపర్–300 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 2 లక్షల 10 వేల డాలర్లు) ఉంటాయి. వీటితోపాటు సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్ (మొత్తం ప్రైజ్‌మనీ: 20 లక్షల డాలర్లు) కూడా జరుగుతుంది. దాంతోపాటు సూపర్–100 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 1 లక్ష డాలర్లు) కూడా నిర్వహిస్తారు. టోర్నీ స్థాయిని బట్టి ర్యాంకింగ్ పాయింట్లలో, ప్రైజ్‌మనీలో తేడా ఉంటుంది. సూపర్–1000 టోర్నీలలో అత్యధిక పాయింట్లు, అత్యధిక ప్రైజ్‌మనీ లభిస్తుంది. -
Indonesia Open 2023: చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ
జకార్తా: భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి.. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ భారత ద్వయం.. వరల్డ్ ఛాంపియన్స్ ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీపై వరుస సెట్లలో (21-17, 21-18) విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకున్నారు. ఇండోనేసియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇది తొలి టైటిల్. సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం నెగ్గిన నెల రోజుల అనంతరం ఇండోనేసియా ఓపెన్ టైటిల్‌ను కూడా చేజిక్కించుకోవడం విశేషం. కాగా, సాత్విక్-చిరాగ్ జోడీ.. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే,ప్రస్తుత సీజన్లో సాత్విక్–చిరాగ్ జోడీ.. స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా.. మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ వరకు చేరింది. ఈ జోడీ ఇటీవలికాలంలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, థామస్ కప్ స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు. అలాగే సూపర్ 300 (సయ్యద్ మోదీ), సూపర్ 500 (థాయ్‌లాండ్, ఇండియా ఓపెన్), సూపర్ 750 (ఫ్రెంచ్ ఓపెన్) టైటిళ్లు సాధించారు. సాత్విక్ జోడీని అభినందించిన సీఎం జగన్ ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీని సీఎం జగన్ అభినందించారు. భవిష్యత్తులో ఈ జోడీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు సీఎం జగన్. -
సెమీస్‌లోనే నిష్క్రమించిన ప్రణయ్.. టైటిల్‌కు అడుగుదూరంలో సాత్విక్- చిరాగ్
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో... ఆసియా చాంపియన్‌షిప్‌లో... కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో అతి గొప్ప టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. వరల్డ్ టూర్ సూపర్–1000 స్థాయి టోర్నీలో ఈ జంట టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. జకార్తా: అంచనాలకు మించి రాణిస్తూ భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఇండోనేసియా ఓపెన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 67 నిమిషాల్లో 17–21, 21–19, 21–18తో మిన్ హిక్ కాంగ్–సియో సెంగ్ జె (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌లతో ఎనిమిదిసార్లు తలపడిన సాత్విక్–చిరాగ్ జంట ఒక్కసారి కూడా గెలవలేదు. తొమ్మిదో ప్రయత్నంలోనైనా సాత్విక్–చిరాగ్ విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి. భారత కాలమానం ప్రకారం సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే అవకాశముంది. ఫైనల్ మ్యాచ్‌లన్నీ స్పోర్ట్స్–18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ముగిసిన ప్రణయ్ పోరాటం మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ 15–21, 15–21తో ఓడిపోయాడు. సెమీఫైనల్లో నిష్క్రమించిన ప్రణయ్‌కు 17,500 డాలర్ల (రూ. 14 లక్షల 33 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 8400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో గొప్ప ఫామ్‌లో ఉన్న సాత్విక్–చిరాగ్ మరోసారి మెరిశారు. కొరియా జోడీపై గతంలో రెండుసార్లు నెగ్గిన సాత్విక్–చిరాగ్‌కు ఈసారి గట్టిపోటీ లభించింది. తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జంట రెండో గేమ్‌లో నెమ్మదిగా తేరుకుంది. ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసి ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలో రెండు జోడీలు ప్రతి పాయింట్‌కు హోరాహోరీగా పోరాడాయి. స్కోరు 5–5తో సమంగా ఉన్నపుడు సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 12–5తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే కొరియా జంట పట్టుదలతో ఆడి స్కోరును 16–16 వద్ద సమం చేసింది. ఈ దశలో సాత్విక్–చిరాగ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 19–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పో యిన భారత జోడీ వెంటనే రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఎనిమిదోసారి కాగా బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీలలో సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ చేరడం ఇది ఎనిమిదోసారి. ఐదు టోర్నీలలో నెగ్గిన సాత్విక్–చిరాగ్, రెండు టోర్నీలలో రన్నరప్‌గా నిలిచారు. చదవండి: Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..? -
Indonesia Open: ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ
జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీలో భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించిన ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం.. ఇవాళ (జూన్ 17) జరిగిన సెమీఫైనల్లో అన్ సీడెడ్ దక్షిణ కొరియా జోడీ కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె పై 17-21 21-19 21-18 తేడాతో విజయం సాధించింది. ఈ పోటీలో గంటా 7 నిమిషాల పాటు పోరాడిన భారత ద్వయం.. చెమటోడ్చి కొరియన్ పెయిర్‌పై గెలుపొందింది. భారత జోడీ తొలి సెట్ కోల్పోయినప్పటికీ.. ఏమాత్రం తగ్గకుండా పోరాడి గెలిచింది. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. ప్రముద్య కుసుమవర్ధన-ఎరేమియా ఎరిక్ యోచే రాంబటన్ (ఇండొనేసియా)-ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీల మధ్య విజేతను ఢీకొంటుంది. కాగా, ప్రస్తుత సీజన్లో సాత్విక్–చిరాగ్ స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ చేరారు. చదవండి: సాత్విక్–చిరాగ్ సంచలనం -
సాత్విక్–చిరాగ్ సంచలనం
జకార్తా: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో సంచలన ప్రదర్శన చేసింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13, 21–13తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)లను బోల్తా కొట్టించింది. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ ఆరంభ దశలో రెండు జోడీలు పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడాయి. అయితే మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ సాత్విక్–చిరాగ్ జోడీ పైచేయి సాధించింది. చివరిసారి 2019లో ఫజర్–అర్దియాంతోలతో తలపడిన సాత్విక్–చిరాగ్ నాడు వరుస గేముల్లో నెగ్గగా...ఈసారీ రెండు గేముల్లోనే గెలిచారు. నేడు జరిగే సెమీఫైనల్లో కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె (దక్షిణ కొరియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ సీజన్లో సాత్విక్–చిరాగ్ స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ చేరారు. వరుసగా రెండో ఏడాది... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ వరుసగా రెండో ఏడాది ఈ టోరీ్నలో సెమీఫైనల్ చేరుకోగా... కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 21–16తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)పై గెలుపొందాడు. గతంలో నరోకాతో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ ఐదో ప్రయత్నంలో ఈ జపాన్ ప్లేయర్‌పై నెగ్గడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 2–5తో వెనుకంజలో ఉన్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 69 నిమిషాల్లో 14–21, 21–14, 12–21తో ప్రపంచ పదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
శ్రీకాంత్, ప్రణయ్ జోరు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–17, 22–20తో ప్రపంచ 20వ ర్యాంకర్, భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌ను ఓడించగా... ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 21–16తో ప్రపంచ 16వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. గతంలో లక్ష్య సేన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన శ్రీకాంత్‌కు ఈసారి గట్టిపోటీనే లభించింది. ప్రతి పాయింట్‌కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. అయితే కీలకదశలో శ్రీకాంత్ సంయమనంతో ఆడి పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో స్కోరు 17–17తో సమంగా ఉన్నదశలో శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్ 20–14తో విజయానికి పాయింట్ దూరంగా నిలిచాడు. అయితే లక్ష్య సేన్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయినా శ్రీకాంత్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత యువతార ప్రియాన్షు రజావత్ 22–20, 15–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరి గిన మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ సింధు 18–21, 16–21తో ఓడిపోయింది. ఓవరాల్‌గా తై జు యింగ్ చేతిలో సింధుకిది 19వ ఓటమికాగా వరుసగా తొమ్మిదో పరాజయం. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చివరిసారి తై జు యింగ్‌ను ఓడించిన సింధు ఆ తర్వాత వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఈ చైనీస్ తైపీ ప్లేయర్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–15తో హి జి టింగ్–జౌ హావో డాంగ్ (చైనా) జంటపై గెలిచింది. -
శ్రీకాంత్ ముందుకు...
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత క్రీడాకారులు ముందంజ వేశారు. కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. ప్రియాన్షు రజావత్‌కు ప్రపంచ మూడో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) నుంచి వాకోవర్ లభించడంతో అతను కోర్టులో అడుగు పెట్టకుండానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ గ్వాంజ్ జు లూ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 21–13, 21–19తో గెలుపొందాడు. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో శ్రీకాంత్ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు ప్రతిఘటన ఎదురైంది. అయితే స్కోరు 19–19 వద్ద శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు గ్వాంజ్ జు లూపై వరుసగా ఐదో విజయాన్ని సాధించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్, ఆసియా చాంపియన్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–17, 21–13తో గెలిచాడు. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో స్కోరు 17–17 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచాడు. రెండో గేమ్‌లో స్కోరు 5–3 వద్ద లక్ష్య సేన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 12–3తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్‌నకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 43వ ర్యాంకర్ ఆకర్షి తొలి రౌండ్లో 10–21, 4–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లక్ష్య సేన్‌తో శ్రీకాంత్; ఎన్జీ కా లాంగ్ అంగుస్ (వియత్నాం)తో ప్రణయ్; ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రియాన్షు రజావత్; తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో పీవీ సింధు తలపడతారు. -
సింధు శుభారంభం
జకార్తా: థాయ్‌లాండ్ ఓపెన్, సింగపూర్ ఓపెన్ టోర్నీలలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... ప్రతిషాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో మాత్రం తొలి రౌండ్ అడ్డంకిని దాటింది. ఇండోనేసియా క్రీడాకారిణి, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్జుంగ్పై సింధు వరుస గేముల్లో గెలిచింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు 21–19, 21–15తో మరిస్కాను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీ లభించింది. ఆధిక్యం పలుమార్లు ఇద్దరితో దోబూచులాడింది. అయితే కీలకదశలో సింధు పైచేయి సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలోనూ ఇద్దరూ ప్రతి పాయింట్‌కు హోరాహోరీగా పోరాడారు. సింధు స్కోరు 7–6 వద్ద మూడు పాయింట్లు నెగ్గి 10–6తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయిన సింధు మళ్లీ చెలరేగి ఈసారి వరుసగా ఆరు పాయింట్లు గెలుపొంది 16–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని సింధు విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఏడాది మరిస్కా చేతిలో స్పెయిన్ మాస్టర్స్, మలేసియా మాస్టర్స్ టోర్నీలలో ఓడిపోయిన సింధు ఆమెను ఈ సీజన్లో తొలిసారి ఓడించడం గమనార్హం. ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధుకు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడనుంది. తై జు యింగ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 5–18తో వెనుకబడి ఉంది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చివరిసారి తై జు యింగ్‌ను ఓడించిన సింధు ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో ఆడిన ఎనిమిది వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో ప్రణయ్ 50 నిమిషాల్లో 21–16, 21–14తో కెంటా నిషిమోటో (జపాన్)పై గెలుపొందాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో ప్రణయ్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్, అంగుస్ 5–5తో సమఉజ్జీగా ఉన్నారు. సాత్విక్ జోడీ ముందంజ డబుల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 16వ ర్యాంక్ జంట గాయత్రి–ట్రెసా జాలీ 22–20, 12–21, 16–21తో ప్రపంచ 18వ ర్యాంక్ జోడీ రిన్ ఇవనాగ–కి నకనిషి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. క్రిస్టో పొపోవ్–తోమా పొపోవ్ (ఫ్రాన్స్)లతో జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తొలి గేమ్‌ను 21–12తో నెగ్గి రెండో గేమ్‌లో 11–7తో ఆధిక్యంలో ఉన్న దశలో పొపోవ్ బ్రదర్స్ గాయం కారణంగా వైదొలిగారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–ఎంఆర్ అర్జున్ (భారత్) ద్వయం 21–12, 6–21, 20–22తో ఎనిమిదో సీడ్ ఒన్జ్ యె సిన్–తియో ఈ యి (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్, లక్ష్య సేన్
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్, ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ పదో ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–23, 10–21తో ప్రపంచ 41వ ర్యాంకర్బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోగా... భారత్‌కే చెందిన ప్రపంచ 23వ ర్యాంకర్ ప్రణయ్ 21–10, 21–9తో లక్ష్య సేన్‌ను బోల్తా కొట్టించాడు. గతంలో లెవెర్డెజ్తో ఆడిన ఐదుసార్లూ గెలిచిన శ్రీకాంత్ ఆరోసారి మాత్రం ఓటమి చవిచూశాడు. లక్ష్య సేన్‌పై ప్రణయ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ జోడీ 27–25, 18–21, 21–19తో మత్సుయ్–టెకుచి (జపాన్) జంటపై గెలిచింది. చదవండి: Asia Cup Qualifiers: సునీల్ ఛెత్రీ అరుదైన రికార్డు.. మెస్సీకి రెండు అడుగుల దూరంలో -
‘వరల్డ్ టూర్ ఫైనల్స్’కు సాత్విక్ జోడీ అర్హత
బాలి (ఇండోనేసియా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు భారత పురుషుల డబుల్స్ స్టార్‌జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీకి అర్హత పొందిన తొలి భారత పురుషుల జంటగా నిలిచింది. గతవారం ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్ చేరింది. వీరికి పోటీగా ఉన్న జపాన్ జోడీ అకిరా కొగా–తైచి సయితో కూడా సెమీస్‌లోనే ఓడింది. ఆ సెమీస్‌లో తప్పక గెలిస్తేనే క్వాలిఫై కావాల్సి ఉండగా, జపాన్ జంట కూడా ఓడిపోవడంతో సాత్విక్–చిరాగ్ ద్వయానికి మార్గం సుగమమైంది. బుధవారం బాలిలో మొదలయ్యే ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్, మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప బరిలో ఉన్నారు. -
సింధుకు నిరాశ
బాలి (ఇండోనేసియా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇండో నేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో ప్రపంచ చాంపియన్ సింధు కథ సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 26 ఏళ్ల సింధు 21–15, 9–21, 14–21తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను దక్కించుకున్నా ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెల్చుకున్నాక సింధు ఆడిన నాలుగు టోర్నీల్లో సెమీఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేదు. వరుసగా పదోసారి... మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట కూడా సెమీఫైనల్లో నిష్క్రమించింది. ప్రపంచ నంబర్‌వన్ జోడీ మార్కస్ గిడియోన్–కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ 16–21, 18–21తో ఓటమి పాలైంది. గిడియోన్–కెవిన్ ద్వయం చేతిలో సాత్విక్–చిరాగ్‌లకిది వరుసగా పదో పరాజయం కావడం గమనార్హం. -
సెమీస్‌లో సింధు
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 66 నిమిషాల్లో 14–21, 21–19, 21–14తో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 12–21, 8–21తో అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–19, 21–19తో గో జె ఫె–నూరూజుద్దీన్ (మలేసియా) జంటపై నెగ్గి సెమీఫైనల్‌కు చేరింది. వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీకి సిక్కి–అశ్విని జంట అర్హత బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు భారత మహిళల డబుల్స్ జంట సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో బరిలోకి దిగనున్న తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా సిక్కి–అశ్విని గుర్తింపు పొందింది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు బాలిలో జరిగే ఈ టోర్నీకి మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా అర్హత సాధించడం దాదాపుగా ఖాయమైంది. -
క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–12, 21–18తో వైవోన్ లీ (జర్మనీ)పై అలవోక విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టోర్నీ మూడో సీడ్ సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించి టోర్నీలో ముందంజ వేసింది. నేడు జరిగే క్వార్టర్స్ పోరులో సిమ్ యుజిన్ (కొరియా)తో సింధు ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 21–17, 14–21, 21–19తో క్రిస్టో పోపొవ్ (ఫ్రాన్స్)పై పోరాడి గెలిచాడు. అయితే మరో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు మాత్రం ప్రిక్వార్టర్స్‌లో నిరాశ ఎదురైంది. శ్రీకాంత్ 14–21, 18–21తో టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–15, 19–21, 23–21తో కంగ్ మిన్‌హ్యూక్– సియో సెంగ్‌జే (కొరియా) జంటపై నెగ్గి ముందంజ వేసింది. చదవండి: IND Vs NZ: మొదటి రోజు దుమ్ములేపిన భారత బ్యాటర్లు.. తొలి మ్యాచ్‌లోనే అయ్యర్ అర్ధ సెంచరీ -
PV Sindhu: సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం...
Indonesia Open- PV Sindhu Kidambi Srikanth Sai Praneeth Enters 2nd Round: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ శుభారంభం చేశారు. బుధవారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టోర్నీ మూడో సీడ్ సింధు 17–21, 21–17, 21–17తో జపాన్ షట్లర్ అయా ఒహోరిపై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–15, 19–21, 21–12తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)పై, సాయి ప్రణీత్ 21–19, 21–18తో టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి ద్వయం 27–29, 18–21తో గ్యాబ్రియెల్ స్టొయెవా– స్టిఫాని స్టొయెవా (బల్గేరియా) జంట చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్–అశ్విని పొన్నప్ప (భారత్) 24–22, 12–21, 19–21తో టకురో హోకి– నమి మత్సుయమ (జపాన్) చేతిలో, ధ్రువ్ కపిల–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 7–21, 12–21తో యమషిటా–నరు షినోయ (జపాన్) జంట చేతిలో ఓడారు. చదవండి: IPL 2022 Auction: ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునేది వీళ్లనే..! -
సింధుని వీడని ఫైనల్ ఫోబియా!
జకార్తా : సీజన్లో తొలి టైటిల్ లోటును తీర్చుకోవాలని భావించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు నిరాశే ఎదురైంది. తనను ఎప్పుడూ వేధించే ఫైనల్ ఫోబియాతోనే మరోసారి టైటిల్ అందుకోలేకపోయింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సింధు ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి(జపాన్) 21-15, 21-16 ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధుపై అలవోక విజయం సాధించింది. 51 నిమిషాల్లో ముగిసిన పోరులో యామగుచి ఏకపక్ష విజయం సాధించింది. మ్యాచ్ తొలి గేమ్‌లో భాగంగా మొదటి అర్థభాగం వరకూ సింధు ఆధిపత్యం కనబర్చినప్పటికీ.. ఆపై తేరుకున్న యామగుచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో యామగుచి,సింధుతో ఉన్న ముఖముఖి రికార్డును 5-10కి మెరుగు పరుచుకుంది. -
సిక్కి రెడ్డి జంటకు మిశ్రమ ఫలితాలు
జకార్తా : ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట... పురుషుల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 20–22, 22–20, 20–22తో వివియన్ హూ–యాప్ చెంగ్ వెన్ (మలేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో మూడో గేమ్‌లో సిక్కి ద్వయం 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచింది. అయితే మలేసియా జోడీ మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడంతోపాటు వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 25–23, 16–21, 21–19తో రాబిన్ తబెలింగ్–సెలెనా పీక్ (నెదర్లాండ్స్) జంటపై కష్టపడి గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట తొలి గేమ్‌లో 16–20తో వెనుకబడింది. ఈ కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన సిక్కి–ప్రణవ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి స్కోరును 20–20తో సమం చేశారు. ఆ తర్వాత ఆధిక్యం దోబూచులాడినా చివరకు సిక్కి జోడీదే పైచేయిగా నిలిచింది. రెండో గేమ్‌లో తడబడిన భారత జంట నిర్ణాయక మూడో గేమ్‌లో 14–18తో వెనుకంజలో నిలిచింది. మరోసారి భారత ద్వయం సంయమనంతో ఆడి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత మరో పాయింట్ చేజార్చుకున్నా... వెంటనే మరో పాయింట్ గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–19, 18–21, 21–19తో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంటను ఓడించింది. నేడు జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత స్టార్స్ పీవీ సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మను అత్రి జోడీ... మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ –అశ్విని జంట బరిలోకి దిగనున్నాయి. అయా ఒహోరి (జపాన్)తో సింధు; నిషిమోటో (జపాన్)తో శ్రీకాంత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; షి యుకి (చైనా)తో ప్రణయ్ తలపడతారు. మిన్ చున్– హెంగ్ (చైనీస్ తైపీ)లతో సుమీత్–మను అత్రి; తొంతోవి అహ్మద్–విన్నీ కాండో (ఇండోనేసియా)లతో సాత్విక్–అశ్విని ఆడతారు. (ఉదయం 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం) -
సింధు, శ్రీకాంత్‌లపైనే ఆశలు
జకార్తా: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్ నేటి నుంచి మొదలయ్యే ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సీజన్లో ఆరు టోర్నీల్లో ఆడిన సింధు ఒక్క దాంట్లోనూ ఫైనల్ చేరలేకపోయింది. గాయంతో బాధపడుతున్న సైనా నెహ్వాల్ ఈ టోర్నీకి దూరంగా ఉండటంతో భారత్ ఆశలన్నీ సింధుపైనే ఉన్నాయి. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో అయా ఒహోరి (జపాన్)తో సింధు ఆడుతుంది. సింధు పార్శ్వంలోనే ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్), రెండో సీడ్ చెన్ యుఫె (చైనా) ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్లో అతను కెంటో నిషిమోటో (జపాన్)తో ఆడతాడు. వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; షి యుకి (చైనా)తో ప్రణయ్ తలపడతారు. -
‘ఇండోనేసియా’లో రాత మారుస్తా!
సాక్షి, హైదరాబాద్: భారత అగ్రశ్రేణి షట్లర్, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుకు గత కొంత కాలంగా చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. 2019లో ఆమె ఆరు టోర్నమెంట్లు ఆడగా ఒక్కదాంట్లో కూడా ఆమె ఫైనల్ చేరలేక పోయింది. రెండు టోర్నీలలో సెమీస్ వరకు రాగలిగింది. అయితే ఏడాది రెండో అర్ధ భాగంలో తాను మంచి ఫలితాలు సాధిస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ నెల 16నుంచి జరిగే ఇండోనేసియా ఓపెన్‌నుంచి విజయాల బాట పడతానని సింధు చెప్పింది. ‘ఈ సీజన్ నిజంగా గొప్పగా ఏమీ సాగలేదు. అయితే ఫర్వాలేదని చెప్పగలను. నేను సంతృప్తిగానే ఉన్నా. అయితే ఇంకా మెరుగ్గా ఆడాల్సిందని మాత్రం చెప్పగలను. నా వైపునుంచి లోపాలేమీ లేవు. కానీ కొన్ని సార్లు మనం 100 శాతం ప్రదర్శన ఇవ్వకపోవచ్చు. ఆటలో తప్పులు కూడా జరిగిపోతుంటాయి. ఫలితాలతో కొంత బాధపడ్డా ఎప్పుడైనా వచ్చే సారి మరో అవకాశం ఉంటుందనే విషయం మరచిపోవద్దు’ అని సింధు వ్యాఖ్యానించింది. తనకు దాదాపు నెల రోజుల విరామం లభించిందని, ఈ సమయంలో ఆటతీరు మెరుగుపర్చుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌పై కూడా బాగా దృష్టి పెట్టినట్లు ఆమె పేర్కొంది. ‘ఇప్పుడు ఆటతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండటం అవసరం. ఎందుకంటే మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగుతున్నాయి. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. వీడియో రికార్డింగ్‌లతో ప్రత్యర్థులు మన ఆటను పట్టేస్తున్నారు. కాబట్టి మళ్లీ మళ్లీ మన ఆటను, శైలిని మార్చుకోవాల్సి వస్తోంది. ఎంతో శ్రమిస్తే గానీ ఒక్కో పాయింట్ లభించడం లేదు’ అని సింధు విశ్లేషించింది. ప్రస్తుతం సింధు కొరియా కోచ్ కిమ్ జి హ్యూన్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటోంది. -
ఫైనల్లో సైనా నెహ్వాల్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్-500 టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సైమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ 18-21, 21-12, 21-18 తేడాతో ఏడో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా.. ఆపై వరుసగా రెండు గేమ్‌లు సత్తా చాటి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఇరువురి మధ్య కడవరకూ హోరాహోరీగా సాగిన పోరులో సైనానే పైచేయి సాధించారు. సుదీర్ఘమైన ర్యాలీలు, స్మాష్‌లతో సైనా ఆకట్టుకుని బింగ్జియావోను ఓడించారు. తొలి గేమ్‌ను సైనా చేజార్చుకున్నప్పటికీ, రెండో గేమ్‌లో విజృంభించి ఆడారు. ఏ దశలోనూ బింగ్జియావోకు అవకాశం ఇవ్వకుండా సైనా వరుస పాయింట్లతో దుమ్మురేపారు. కాగా, మూడో గేమ్ ఆదిలో సైనా ఆధిక్యంలో నిలిచినప్పటికీ, బింగ్జియావో తిరిగి పుంజుకున్నారు. దాంతో మ్యాచ్ రసవత్తరంగామారింది. కాగా, చివర్లో ఒత్తిడిని అధిగమించిన సైనా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను లాగేసుకున్నారు. -
ముగిసిన సింధు, ప్రణయ్ పోరు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. శుక్రవారం పురుషుల, మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్, పీవీ సింధు ఓటమి పాలయ్యారు. ప్రపంచ ఏడో ర్యాంకర్ హీ బింగ్జియావోతో జరిగిన మ్యాచ్‌లో మూడో ర్యాంకర్ సింధు 14–21, 15–21తో పరాజయం పాలైంది. హీ బింగ్జియావోతో 11 సార్లు తలపడ్డ సింధుకు ఆరుసార్లు ఓటమి ఎదురైంది. షి యూకీతో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 17–21, 18–21తో ఓడిపోయాడు. తొలి రౌండ్లో చైనా దిగ్గజం లిన్ డాన్‌ను ఓడించిన ప్రణయ్ ఈ మ్యాచ్‌లో మాత్రం చైనా యువ షట్లర్ ముందు నిలువలేకపోయాడు. క్వార్టర్స్‌లో ఓడిన సింధు, ప్రణయ్‌లకు 6,875 డాలర్ల (రూ. 4 లక్షల 73 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 6,600 పాయింట్లు లభించాయి.