
హెచ్‌ఎస్ ప్రణయ్, పీవీ సింధు
జకార్తా : ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్‌లు నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో తొలుత ప్రణయ్ చైనా షట్లర్ షీయుకీ చేతిలో పరాజయం కాగా.. సింధు సైతం చైనాకు చెందిన బింగ్జియా చేతిలోనే ఓటమిపాలైంది. సింధు మ్యాచ్ బింగ్జియాతో ఏకపక్షంగా సాగింది. ఎలాంటి పోటీ నివ్వకుండా సింధు 21-14, 21-15 తేడాతో వరుస సెట్లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇబ్బంది పడ్డ సింధు ఏదశలోను కోలుకోలేకపోయింది.
అదే బాటలో ప్రణయ్..
షీ యుకీతో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 17-21, 18-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో షీ యుకీని నిలవరించ లేక ప్రణయ్ ఓటమిని మూటగట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే కంగుతినగా.. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ సైతం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్, సింధులు ఓడిపోవడంతో ఇండోనేషియా ఓపెన్ టోర్నీలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment