‘వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌’కు సాత్విక్‌ జోడీ అర్హత | Satwik sairaj Rankireddy-Chirag Shetty pair qualifies for BWF | Sakshi
Sakshi News home page

‘వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌’కు సాత్విక్‌ జోడీ అర్హత

Published Tue, Nov 30 2021 5:30 AM | Last Updated on Tue, Nov 30 2021 5:30 AM

Satwik sairaj Rankireddy-Chirag Shetty pair qualifies for BWF - Sakshi

బాలి (ఇండోనేసియా): బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు భారత పురుషుల డబుల్స్‌ స్టార్‌జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీకి అర్హత పొందిన తొలి భారత పురుషుల జంటగా నిలిచింది. గతవారం ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 టోర్నీలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం సెమీఫైనల్‌ చేరింది. వీరికి పోటీగా ఉన్న జపాన్‌ జోడీ అకిరా కొగా–తైచి సయితో కూడా సెమీస్‌లోనే ఓడింది. ఆ సెమీస్‌లో తప్పక గెలిస్తేనే క్వాలిఫై కావాల్సి ఉండగా, జపాన్‌ జంట కూడా ఓడిపోవడంతో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయానికి మార్గం సుగమమైంది. బుధవారం బాలిలో మొదలయ్యే ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్, మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప బరిలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement