భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇంతనోన్ రచనోక్‌తో తలపడిన సైనా.. ప్రత్యర్థిని చిత్తు చేసింది. 49 నిమిషాల పాటు జరిగిన హోరాహోరి పోరులో సైనా 21-19, 21-19 తో మ్యాచ్‌ను గెలుచుకుని ఫైనల్‌కు చేరింది.