
జకార్తా : సీజన్‌లో తొలి టైటిల్ లోటును తీర్చుకోవాలని భావించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు నిరాశే ఎదురైంది. తనను ఎప్పుడూ వేధించే ఫైనల్ ఫోబియాతోనే మరోసారి టైటిల్ అందుకోలేకపోయింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్‌లో సింధు ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి(జపాన్) 21-15, 21-16 ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధుపై అలవోక విజయం సాధించింది. 51 నిమిషాల్లో ముగిసిన పోరులో యామగుచి ఏకపక్ష విజయం సాధించింది. మ్యాచ్ తొలి గేమ్‌లో భాగంగా మొదటి అర్థభాగం వరకూ సింధు ఆధిపత్యం కనబర్చినప్పటికీ.. ఆపై తేరుకున్న యామగుచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో యామగుచి,సింధుతో ఉన్న ముఖముఖి రికార్డును 5-10కి మెరుగు పరుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment