జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీలో భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించిన ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం.. ఇవాళ (జూన్ 17) జరిగిన సెమీఫైనల్లో అన్ సీడెడ్ దక్షిణ కొరియా జోడీ కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె పై 17-21 21-19 21-18 తేడాతో విజయం సాధించింది.
ఈ పోటీలో గంటా 7 నిమిషాల పాటు పోరాడిన భారత ద్వయం.. చెమటోడ్చి కొరియన్ పెయిర్‌పై గెలుపొందింది. భారత జోడీ తొలి సెట్ కోల్పోయినప్పటికీ.. ఏమాత్రం తగ్గకుండా పోరాడి గెలిచింది. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. ప్రముద్య కుసుమవర్ధన-ఎరేమియా ఎరిక్ యోచే రాంబటన్ (ఇండొనేసియా)-ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీల మధ్య విజేతను ఢీకొంటుంది. కాగా, ప్రస్తుత సీజన్‌లో సాత్విక్–చిరాగ్ స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ చేరారు.
చదవండి: సాత్విక్–చిరాగ్ సంచలనం
Comments
Please login to add a commentAdd a comment