Chirag Shetty
-
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–16, 21–15తో చెన్ జి రే–లిన్ యు చియె (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీకి ప్రతిఘటన ఎదురైనా కీలకదశల్లో పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి గేమ్‌లో స్కోరు 17–16 వద్ద సాత్విక్–చిరాగ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. రెండో గేమ్‌లోనూ భారత ద్వయం దూకుడు కొనసాగించి ఆరంభంలోనే 12–5తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు.సాత్విక్–చిరాగ్ జంట ఆడిన గత మూడు టోర్నీలలో (చైనా మాస్టర్స్, మలేసియా ఓపెన్–1000, ఇండియా ఓపెన్–750) సెమీఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప (భారత్) జంట కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి రౌండ్లో తనీషా–అశ్విని ద్వయం 21–6, 21–14తో ఒర్నిచా జోంగ్సతాపోర్న్పార్న్–సుకిత్త సువాచాయ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది. సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు చుక్కెదురైంది. భారత్‌కే చెందిన ఆయుశ్ శెట్టితో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 7–21, 15–21తో ఓడిపోవడం గమనార్హం.మహిళల క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో తాన్యా హేమంత్ 16–21, 21–17, 21–15తో టుంగ్ సియో టాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. మరో మ్యాచ్‌లో ఇషారాణి బారువా 18–21, 20–22తో చియారా మార్వెలా హండాయో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంలో విఫలమైంది. -
సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
కౌలాలాంపూర్: కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలనుకున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ జంట సెమీ ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 10–21, 15–21తో కిమ్ వన్ హో–సియో సెయంగ్ జే (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. గత ఏడాది ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన భారత షట్లర్లు ఈ సారి సెమీస్‌తోనే ఇంటిదారి పట్టారు. ‘గత మూడు మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఈ మ్యాచ్‌ను మెరుగ్గా ఆరంభించలేకపోయాం. ఈ ఫలితం నుంచి పాఠాలు నేర్చుకుంటాం’ అని సాత్విక్ అన్నాడు. తొలి గేమ్‌లో 6–11తో వెనుకబడిన సాత్విక్ జంట ఆ తర్వాత కోలుకోలేకపోయింది. రెండో గేమ్ ఆరంభంలో మంచి ఆటతీరు కనబర్చిన భారత జోడీ 11–8తో ఆధిక్యం చాటినా... చివరి వరకు అదే తీవ్రత కొనసాగించడంలో విఫలమై పరాజయం పాలైంది. -
సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలనే లక్ష్యం దిశగా భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఒక అడుగు ముందుకు వేసింది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 26–24, 21–15తో యె సిన్ ఓంగ్–ఈ యి టియో (మలేసియా) జోడీపై గెలిచింది. 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ తొలి గేమ్‌లో నాలుగు గేమ్ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. రెండో గేమ్‌లోనూ భారత జోడీకి గట్టిపోటీ లభించింది. ఒకదశలో సాత్విక్–చిరాగ్ 8–11తో వెనుకబడ్డారు. కానీ భారత జంట ఇదే స్కోరు వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 12–11తో ఆధిక్యంలోకి వచ్చిoది. ఆ తర్వాత స్కోరు 12–12తో సమమైంది. ఈ దశలో సాత్విక్–చిరాగ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 15–12తో ముందంజ వేశారు. అదే జోరులో గేమ్‌ను సొంతం చేసుకున్న సాత్విక్–చిరాగ్ వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. నేడు జరిగే సెమీఫైనల్లో కిమ్ వన్ హో–సియో సెయంగ్ జే (దక్షిణ కొరియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. -
సాత్విక్–చిరాగ్ ద్వయం ముందుకు
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తమ జోరు కొనసాగిస్తోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ఏడాది రన్నరప్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 21–15తో నూర్ మొహమ్మద్ అజ్రియాన్–టాన్ వీ కియోంగ్ (మలేసియా) జోడీపై గెలిచింది. 43 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లో భారత జంట స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో యె సిన్ ఓంగ్–ఈ యి టియో (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ‘కొత్త సీజన్లో శుభారంభం లభించింది. కొత్త కోచ్‌తో మళ్లీ కలిసి పని చేస్తున్నాం. అంతా సవ్యంగా సాగుతోంది’ అని విజయానంతరం సాత్విక్–చిరాగ్ వ్యాఖ్యానించారు. మహిళల డబుల్స్‌లో భారత కథ ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–15, 19–21, 19–21తో జియా యీ ఫాన్–జాంగ్ షు జియాన్ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) జంట 13–21, 20–22తో చెంగ్ జింగ్–జాంగ్ చి (చైనా) ద్వయం చేతిలో... సతీశ్ కరుణాకరన్–ఆద్యా వరియత్ (భారత్) జంట 10–21, 17–21తో సూన్ హువార్ గో–షెవోన్ జెమీలాయ్ (మలేసియా) జోడీ చేతిలో పరాజయం చవిచూశాయి. సింగిల్స్ విభాగంలోనూ భారత పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 8–21, 21–15, 21–23తో లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. 82 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ నిర్ణాయక మూడో గేమ్‌లో ఒక మ్యాచ్ పాయింట్ వదులుకోవడం గమనార్హం. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాళవిక బన్సోద్ (భారత్) 18–21, 11–21తో హాన్ యువె (చైనా) చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి 21–10, 16–21, 21–5తో మింగ్ చె లు–టాంగ్ కాయ్ వె (చైనీస్ తైపీ)లపై గెలుపొందారు. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌ను నెగ్గినా... రెండో గేమ్‌లో తడబడింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సాతి్వక్–చిరాగ్ చెలరేగి ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు. సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రణయ్ 21–12, 17–21, 21–15తో బ్రియాన్ యాంగ్ (కెనడా)పై నెగ్గగా... ప్రియాన్షు 11–21, 16–21తో ఏడో సీడ్ షి ఫెంగ్ లీ (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... అనుపమా , ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మాళవిక 21–15, 21–16తో గో జిన్ వె (మలేసియా)పై విజయం సాధించగా... ఆకర్షి 14–21, 12–21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో, అనుపమ 17–21, 21–18, 8–21తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సెమీస్‌లో ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్ (చైనా): భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలకు చైనా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీఫైనల్లో చుక్కెదురైంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన ఈ టోర్నీలో నిలకడైన ఆటతీరు కనబరిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ భారత ద్వయానికి అనూహ్యంగా అన్‌సీడెడ్ కొరియన్ జంట చేతిలో ఓటమి ఎదురైంది. సాత్విక్–చిరాగ్ జోడీ 18–21, 21–14, 16–21తో జిన్ యంగ్–సియో సంగ్ జె (కొరియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. గంటా 14 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత ద్వయం పైచేయి సాధించినా... కీలకదశలో వరుసగా పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్‌లో 11–10తో, తర్వాత 15–12తో ఆధిక్యం కనబరిచిన సాతి్వక్–చిరాగ్‌లు తర్వాత వెనుకబడి గేమ్‌ను కోల్పోయారు. కానీ రెండో గేమ్‌లో అద్భుతంగా ఆడి ప్రత్యర్థుల్ని ఓడించినప్పటికీ నిర్ణాయక మూడో గేమ్‌లో కొరియన్ జోరు ముందు నిలువలేకపోయారు. గత సీజన్ చైనా మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ డబుల్స్ జోడీ ఫైనల్ చేరి రన్నరప్‌తో తృప్తి పడగా... ఈ సారి సెమీస్‌లోనే కంగుతింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ సంచలనం
షెన్జెన్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నమెంట్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ అదరగొడుతోంది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్‌ముసేన్ (డెన్మార్క్)తో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–19తో గెలిచింది.47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్‌లో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. ఒక్కసారి కూడా స్కోరును సమం కానివ్వలేదు. రెండో గేమ్‌లో మాత్రం గట్టిపోటీనే లభించింది. డెన్మార్క్ జంట తీవ్రంగా పోరాడటంతో పలుమార్లు స్కోరు సమమైంది. చివర్లో స్కోరు 19–19 వద్ద సమంగా ఉన్నపుడు భారత జోడీ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. గత ఏడాది ఇదే టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ నేడు జరిగే సెమీఫైనల్లో జిన్ యోంగ్–జే సియో సెయింగ్ (దక్షిణ కొరియా) జోడీతో తలపడుతుంది. గతంలో కిమ్ అస్ట్రుప్–స్కారప్లతో తొమ్మిదిసార్లు తలపడి, ఆరుసార్లు ఓడిపోయిన భారత జంట ఈ ఏడాది డెన్మార్క్ ద్వయంపై రెండోసారి గెలిచింది. ఇండియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోనూ డెన్మార్క్ జోడీనే సాత్విక్–చిరాగ్ ద్వయం ఓడించింది. పోరాడి ఓడిన లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 18–21, 15–21తో ఓడిపోయాడు. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో మూడుసార్లు ఆధిక్యంలోకి వెళ్లి దానిని వృథా చేసుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం ఆంటోన్సన్దే పైచేయిగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడిపోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న లక్ష్య సేన్... విశ్వ క్రీడల తర్వాత ఆడిన నాలుగు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్‌ను దాటి ముందుకెళ్లలేకపోయాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీ జోరు
షెన్జెన్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న తొలి టోర్నమెంట్ చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ జోడీగా ఈ టోర్నీలో ఆడుతున్న సాత్విక్–చిరాగ్ ద్వయం కష్టపడి గెలిచి ముందంజ వేసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 21–19, 21–15తో ప్రపంచ 15వ ర్యాంక్ ద్వయం రస్ముస్ జార్–ఫ్రెడెరిక్ సొగార్డ్ (డెన్మార్క్)పై గెలిచింది. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీకి గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్ చివర్లో సాత్విక్–చిరాగ్ పైచేయి సాధించారు. రెండో గేమ్‌లో స్కోరు 13–12 వద్ద భారత జంట వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 17–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో రెండో గేమ్నూ సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్‌ముసేన్ (డెన్మార్క్)తో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 3–6తో వెనుకబడి ఉండటం గమనార్హం. లక్ష్య సేన్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–16, 21–18తో అలవోకగా గెలిచాడు. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో దూకుడుగా ఆడాడు. 13–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత రస్ముస్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ఆధిక్యాన్ని 13–10కి తగ్గించాడు. ఈ దశలో లక్ష్య సేన్ నిలకడగా రాణించి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో లక్ష్య సేన్‌కు గట్టిపోటీ ఎదురైంది. పలుమార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. అయితే కీలకదశలో లక్ష్య సేన్ పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న నాలుగో టోరీ్నలో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం గమనార్హం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 2–4తో వెనుకంజలో ఉన్నాడు. ముగ్గురికీ నిరాశ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. ప్రపంచ 19వ ర్యాంకర్ సింధు 16–21, 21–17, 21–23తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో పరాజయం చవిచూసింది. గతంలో జియా మిన్తో ఆడిన ఐదుసార్లూ నెగ్గిన సింధుకు ఆరోసారి మాత్రం చుక్కెదురైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒకదశలో 13–9తో ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో జియో మిన్ వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 15–13తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు జియా మిన్ కొట్టిన బాడీ స్మాష్‌కు సింధు జవాబివ్వలేకపోవడంతో ఆమె ఓటమి ఖరారైంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మాళవిక 9–21, 9–21తో సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో, అనుపమ 7–21, 14–21తో నత్సుకి నిదైరా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 16–21, 11–21తో రెండో సీడ్ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జోడీకి సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట ‘వాకోవర్’ ఇచ్చింది. -
తాప్సీ భర్త మథియాస్ సంచలన ప్రకటన.. ఇకపై
భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి కోచ్ మథియాస్ బో కీలక ప్రకటన చేశాడు. కోచింగ్ విధుల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో సాత్విక్- చిరాగ్ వైఫల్యం నేపథ్యంలో మథియాస్ బో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మథియాస్ శిక్షణలో సాత్విక్- చిరాగ్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో నంబర్ వన్‌గా ఎదిగారు. కొన్నాళ్లుగా అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ జంట.. విశ్వ క్రీడల్లో కనీసం కాంస్యమైనా సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న సాత్విక్- చిరాగ్.. మలేషియా ద్వయం ముందు తలవంచారు.ప్యారిస్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో ఆరోన్ చియా- వూయీ యిక్ చేతిలో 21-13, 14-21, 16-21తో ఓడి పతక రేసు నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి లోనుకాగా.. సాత్విక్- చిరాగ్‌లను మథియాస్ బో ఓదార్చాడు. ఈ క్రమంలో శనివారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు మథియాస్ బో.అలసిపోయిన ముసలి వ్యక్తిని‘‘కోచ్‌గా నా ప్రస్థానం ముగిసిపోయింది. భారత జోడీ కోచ్‌గా కొనసాగలేను. ఇక్కడే కాదు.. ప్రస్తుతానికి ఎక్కడా పనిచేయలేను. ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో ఎక్కువ సమయం గడిపేశాను. అయినా కోచ్‌గా ఉంటే తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.నేనేమో అలసిపోయిన ముసలి వ్యక్తిని. మనం ఊహించిన ఫలితాలు రాకపోతే కచ్చితంగా నిరాశచెందుతాం. మీరు కష్టపడే తత్వం ఉన్న ఆటగాళ్లు. పతకంతో ఇండియాకు తిరిగి రావాలని ఎంతగా ఆకాంక్షించారో.. అందుకోసం ఎంతగా శ్రమించారో నాకు తెలుసు. అయితే, ఈసారి ఆ కల నెరవేరలేదు.గర్వపడేలా చేశారుగాయాలు వేధించినా.. వెనకడుగు వేయలేదు. నొప్పిని భరించేందుకు ఇంజక్షన్లు తీసుకున్నారు. అంకితభావంతో ఇక్కడిదాకా వచ్చారు. ప్రతీ మ్యాచ్ మనసు పెట్టి ఆడారు. నన్ను గర్వపడేలా చేశారు’’ అంటూ మథియాస్ బో.. సాత్విక్- చిరాగ్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. భారత్‌లో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయంటూ సహచరుల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.మథియాస్ వచ్చిన తర్వాతేకాగా మథియాస్ బో వచ్చిన తర్వాతే తాము ఆటలో మరింతగా రాటుదేలామని సాత్విక్- చిరాగ్ గతంలో పలు సందర్భాల్లో పేర్కన్నారు. తమ విజయాల వెనుక బో కష్టం కూడా ఉందని పేర్కొన్నారు. డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ మథియాస్ బో మరెవరో కాదు.. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను భర్త అన్న సంగతి తెలిసిందే. పదేళ్ల ప్రేమపదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఇక ఒలింపిక్స్ కోసం భర్తతో కలిసి ప్యారిస్ వెళ్లిన తాప్సీ.. డెన్మార్క్‌లో తాము ఇల్లు కొనుగోలు చేశామని.. కొన్నాళ్లు అక్కడే ఉంటామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల మథియాస్ బో రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Mathias Boe (@mathias.boe) -
Olympics 2024: మనోళ్లకు భారీ షాక్.. సాత్విక్- చిరాగ్ అవుట్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పతకం ఖాయమనకున్న విభాగంలో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు.ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో విఫలమై ప్యారిస్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆద్యంతం ఆసక్తి రేపిన మ్యాచ్‌లో మలేషియా జోడీ చేతిలో 21-13, 14-21, 16-21తో ఓడి ఇంటిబాటపట్టారు. ఒత్తిడిని అధిగమించలేకకాగా ఒలింపిక్స్‌లో పతకం రేసులో నిలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన సమయంలో సాత్విక్- చిరాగ్ తడబడ్డారు. వాస్తవానికి మలేషియా జోడీతో ముఖాముఖి రికార్డులో సాత్విక్–చిరాగ్ ద్వయం 3–8తో వెనుకబడి ఉంది. ఒకదశలో మలేసియా జంట చేతిలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే, భారత జోడీ ఇటీవల ఈ ద్వయంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. కానీ.. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో చిత్తైంది. ఫలితంగా పతకం గెలవాలన్న కల చెదిరిపోయింది. కాగా.. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన ఆరోన్ చియా–సో వుయ్ యిక్ ఈసారీ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లారు.ఇదిలా ఉంటే.. ఆరోరోజు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో మహారాష్ట్ర షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం సాధించాడు. అయితే, 50 కేజీల మహిళల బాక్సింగ్ విభాగంలో నిఖత్ జరీన్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. తాజాగా సాత్విక్- చిరాగ్ జోడీ కూడా నిరాశపరిచింది.చదవండి:Olympics: ముగిసిన ప్రయాణం.. నిఖత్ జరీన్ కన్నీటి పర్యంతం -
గ్రూప్ ‘టాపర్’గా సాత్విక్–చిరాగ్ జోడీ
భారీ అంచనాలతో విశ్వక్రీడల బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట.. అందుకు తగ్గట్లే వరుస విజయాలతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ ‘సి’మ్యాచ్‌లో మూడో సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 38 నిమిషాల్లో 21–13, 21–13తో ఫజర్–రియాన్ (ఇండోనేసియా) జంటపై విజయం సాధించింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న ఈ రెండు జోడీలు గ్రూప్ విజేత స్థానం కోసం పోటీపడ్డాయి. గ్రూప్ దశలో మిగిలిన మ్యాచ్‌లు ముగిసిన అనంతరం బుధవారం క్వార్టర్ ఫైనల్ ‘డ్రా’ విడుదల కానుంది. ఇక మహిళల డబుల్స్ గ్రూప్ ‘సి’లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంట వరుసగా మూడో పరాజయంతో ఒలింపిక్స్ నుంచి విజయం లేకుండానే ని్రష్కమించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో అశి్వని–తనీషా జంట 15–21, 10–21 తో మాపసా–ఏంజెలా (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడింది. కాగా, ఇవే తన చివరి ఒలింపిక్ క్రీడలని 34 ఏళ్ల అశ్విని పొన్నప్ప ప్రకటించింది. -
క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
పారిస్: పతకమే లక్ష్యంగా పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తొలి లక్ష్యాన్ని పూర్తి చేసింది. గ్రూప్ ‘సి’ నుంచి సాత్విక్–చిరాగ్...ఫజర్–అర్దియాంతో (ఇండోనేసియా) జోడీలు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. గాయం కారణంగా గ్రూప్ ‘సి’లోని మార్క్ లమ్స్‌ఫుస్–మార్విన్ సిడెల్ (జర్మనీ) జోడీ వైదొలిగింది. ఇదే గ్రూప్‌లో ఉన్న లుకాస్ కోరి్వ–రొనాన్ లాబర్ (ఫ్రాన్స్) జంట ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దాంతో ఒక్కో మ్యాచ్‌లో నెగ్గిన భారత్, ఇండోనేసియా జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. గ్రూప్ విజేతను నిర్ణయించే మ్యాచ్‌లో నేడు ఫజర్–అర్దియాంతోలతో సాతి్వక్–చిరాగ్ తలపడతారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సాతి్వక్–చిరాగ్ జోడీ గ్రూప్ దశలోనే ని్రష్కమించింది. అశ్విని–తనీషా అవుట్ మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో అశి్వని–తనీషా జోడీ 11–21, 12–21తో నామి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎల్’ రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్ (భారత్) 21–19, 21–14తో జూలియన్ కరాగి (బెల్జియం)పై గెలిచాడు. గ్వాటెమాలాకు చెందిన కెవిన్ కార్డన్ గాయంతో వైదొలిగాడు. ఫలితంగా కార్డన్‌పై లక్ష్య సేన్ గెలిచిన ఫలితాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గితేనే లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంటాడు. బోపన్న జోడీ ఓటమి పారిస్ ఒలింపిక్స్‌లో భారత వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న నిరాశ పరిచాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–శ్రీరామ్ బాలాజీ జంట 5–7, 2–6తో వాసెలిన్–మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడింది. మ్యాచ్ అనంతరం బోపన్న మాట్లాడుతూ దేశం తరఫున ఇదే తన చివరి పోరు అని పేర్కొన్నాడు. ఇప్పటికే డేవిస్ కప్‌కు వీడ్కోలు పలికిన బోపన్న ఇకపై జాతీయ జట్టు తరఫున ఆడబోనని ప్రకటించాడు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో బోపన్నకు ఒలింపిక్ పతకం అందని ద్రాక్షలాగే మిగిలింది. 2016 రియో ఒలింపిక్స్ మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి నాలుగో స్థానంలో నిలిచిన బోపన్న.. ఇంత సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఆనందించానని అన్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు టెన్నిస్‌లో ఏకైక పతకం 1996 అట్లాంటా క్రీడల్లో (లియాండర్ పేస్–కాంస్యం) దక్కింది. -
Paris Olympics: సాత్విక్- చిరాగ్ మ్యాచ్ రద్దు.. కారణం ఇదే!
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి రెండో మ్యాచ్ రద్దైంది. ప్రత్యర్థి ద్వయంలోని ఓ షట్లర్ గాయపడటంతో సోమవారం జరగాల్సిన మ్యాచ్ మొదలుకాకుండానే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో తమ తదుపరి మ్యాచ్‌లో సాత్విక్- చిరాగ్ జోడీ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.పురుషుల డబుల్స్ విభాగంలో నంబర్ వన్‌గా ఎదిగిన సాత్విక్- చిరాగ్ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్యారిస్ వేదికగా గ్రూపు దశలో తమ మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఈ జోడీ శుభారంభం అందుకున్నారు. గ్రూపు-సి పోటీల్లో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ కోర్వీ- రొనాన్ లాబార్ ద్వయాన్ని 21-17, 21-14తో ఓడించి శనివారం తొలి గెలుపు నమోదు చేశారు.మ్యాచ్ రద్దు.. కారణం ఇదేఈ క్రమంలో సోమవారం నాటి రెండో మ్యాచ్‌లో సాత్విక్- చిరాగ్ జంట జర్మనీ జోడీ మార్విన్ సీడెల్- మార్క్ లామ్స్ఫస్తో తలపడాల్సింది. అయితే, మార్క్ మోకాలి గాయం కారణంగా ఈ జోడీ పోటీ నుంచి తప్పుకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రద్దైపోయింది. ఈ విషయాన్ని నిర్వాహకులు నిర్ధారించారు.‘‘గ్రూప్-సిలో మ్యాచ్‌లో లామ్స్‌ఫస్- మార్విన్ సీడెల్ ఆడాల్సిన మ్యాచ్‌లు రద్దైపోయాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు రీషెడ్యూల్ చేయాల్సి ఉంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం.. గ్రూప్-సి దశలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు, మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ డిలీట్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.తప్పక గెలవాలికాగా సాత్విక్- చిరాగ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఇండోనేషియా జంట ఫజర్ అల్ఫియాన్- మహమ్మద్ రియాన్ ఆర్టియాంటోతో మంగళవారం పోటీ పడనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సాత్విక్- చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్ మార్గం సుగమమవుతుంది. ఇక ఫజర్- రియాన్ మాజీ నంబర్ వన్ జోడీ. ప్రస్తుతం ఏడో ర్యాంకులో కొనసాగుతున్నారు.గతంలో సాత్విక్- చిరాగ్ - ఫజర్ రియాన్ జోడీలు ఐదుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. భారత జోడీ మూడుసార్లు గెలవగా.. ఇండోనేషియా జంట రెండుసార్లు విజయం సాధించింది. చివరగా కొరియన్ ఓపెన్-2023లో పోటీపడ్డ ఈ జోడీల్లో సాత్విక్- చిరాగ్ పైచేయి సాధించారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ మన జోడీ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగింది.చదవండి: Paris Olympics: నిరాశపరిచిన బోపన్న-బాలాజీ జోడీ.. తొలి రౌండ్లోనే ఔట్ -
Paris Olympics Tennis: గ్రూపు-సిలో సాత్విక్ –చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి అనుకూలమైన ‘డ్రా’ లభించింది. మూడో సీడ్ పొందిన సాత్విక్–చిరాగ్‌లకు గ్రూప్ ‘సి’లో చోటు దక్కింది. ఇదే గ్రూప్‌లో ఫజర్–అర్దియాంతో (ఇండోనేసియా), లమ్స్‌ఫుస్–సీడెల్ (జర్మనీ), కోరీ్వ–లాబర్ (ఫ్రాన్స్) జంట లు ఉన్నాయి. ఈ మూడు జోడీలు కూడా గతంలో ఒక్కసారి కూడా సాత్విక్–చిరాగ్‌లను ఓడించలేదు. ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రూప్‌ల్లో నాలుగు జంటలు... ‘డి’ గ్రూప్‌లో ఐదు జోడీలున్నాయి. లీగ్ దశ తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జోడీలు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. నాకౌట్ దశ లో గ్రూప్ ‘టాపర్’గా నిలిచిన జోడీలు మరో గ్రూప్ ‘టాపర్’తో తలపడే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో సాత్విక్–చిరాగ్ ద్వయం గ్రూప్ టాపర్‌గా నిలిస్తే క్వార్టర్ ఫైనల్లోనూ సులువైన ప్రత్యర్థి ఎదురయ్యే చాన్స్ ఉంటుంది. -
T20 WC: ‘క్రికెటర్లకు క్యాష్ రివార్డు.. మరి నాకేం దక్కింది?’
మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై భారత బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెటర్లకు పెద్ద పీట వేసే షిండే సర్కారు.. తనలాంటి క్రీడాకారులను మాత్రం ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించాడు.క్రీడాకారుల పట్ల ఇలాంటి వివక్ష తగదని.. అందరినీ సమానంగా చూడాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు చిరాగ్ శెట్టి విజ్ఞప్తి చేశాడు. కాగా భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో జయభేరి మోగించి ఐసీసీ ట్రోఫీని గెలిచింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి రాగానే ఘన స్వాగతం లభించింది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే మైదానంలో విజయోత్సవాలు నిర్వహించిన బీసీసీఐ ఏకంగా రూ. 125 కోట్ల నజరానాను అందించింది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో నలుగురు ముంబై ఆటగాళ్లు ఉండటం విశేషం. కెప్టెన్ రోహిత్ శర్మ సహా టీ20 స్టార్లు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివం దూబేలు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యులు.వరల్డ్‌కప్ విజేతలకు రూ. 11 కోట్ల నజరానాఈ నేపథ్యంలో సీఎం ఏక్నాథ్ షిండే ఈ నలుగురిని తన నివాసంలో ప్రత్యేకంగా సన్మానించారు. శాలువాలు కప్పి.. వినాయకుడి ప్రతిమలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.అదే విధంగా.. వరల్డ్‌కప్ విజేతలకు రూ. 11 కోట్ల నజరానా కూడా ప్రకటించారు మహా సీఎం. ఈ నేపథ్యంలో చిరాగ్ శెట్టి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.క్రికెటర్లకు క్యాష్ రివార్డు.. మరి నాకేం దక్కింది?‘‘బ్యాడ్మింటన్‌లో థామస్ కప్.. క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన దానికంటే తక్కువేం కాదు. థామస్ కప్ ఫైనల్లో ఇండోనేషియాను ఓడించి టైటిల్ గెలిచిన భారత జట్టులో నేను సభ్యుడిని.అంతేకాదు కప్ గెలిచిన జట్టులో ఉన్న ఏకైక మహారాష్ట్ర క్రీడాకారుడిని. వరల్డ్‌కప్ గెలిచిన క్రికెట్ స్టార్లను ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సంతోషం.కానీ నాలాంటి ఆటగాళ్ల శ్రమను కూడా గుర్తిస్తే బాగుంటుంది. క్రీడలన్నింటికీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వాలి. క్రికెటర్లను సత్కరించడం పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు.అంతెందుకు బ్యాడ్మింటన్ ప్లేయర్లందరం కూడా టీవీలో వరల్డ్‌కప్ ఫైనల్ చూశాం. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలవడం పట్ల గర్వపడుతున్నాం.అయితే, గత రెండేళ్ల కాలంలో నేను కూడా గుర్తుంచుకోదగ్గ.. చిరస్మరణీయ విజయాలు సాధించాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం నన్ను కనీసం అభినందించలేదు.ఎలాంటి క్యాష్ రివార్డు కూడా ప్రకటించలేదు. 2022 కంటే ముందు భారత బ్యాడ్మింటన్ జట్టు కనీసం సెమీస్ చేరిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది మేము ఏకంగా టైటిల్ గెలిచాం. అయినా తగిన గుర్తింపు కరువైంది’’ అని చిరాగ్ శెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు.ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ బ్యాడ్మింటన్ స్టార్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డితో కలిసి బ్యాడ్మింటన్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.అంతేకాదు ప్రఖ్యాత థామస్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్ సాధించాడు. సాత్విక్‌సాయిరాజ్‌తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ గెలిచాడు. అదే విధంగా.. మలేషియన్ సూపర్ 750, ఇండియా సూపర్ 750 ఫైనల్స్ చేరాడు. తదుపరి ఈ జోడీ ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది.చదవండి: ‘నేను డకౌట్ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’# Live📡| 05-07-2024 📍वर्षा निवासस्थान, मुंबई 📹 जगज्जेत्या भारतीय क्रिकेट संघाचे वर्षा निवासस्थानी स्वागत https://t.co/TSiJXnHFzw— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) July 5, 2024 -
సాత్విక్–చిరాగ్ జోడీకి చుక్కెదురు
సింగపూర్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి అనూహ్య పరాజయం ఎదురైంది. సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్– చిరాగ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 34వ స్థానంలో ఉన్న డానియల్ లుండ్‌గార్డ్– మాడ్స్ వెస్టెర్గార్డ్ (డెన్మార్క్) ద్వయం 22–20, 21–18తో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీని బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ పలు దశల్లో సాత్విక్–చిరాగ్ ఆధిక్యంలో ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ టోర్నీకి ముందు సాత్విక్–చిరాగ్ సీజన్లో ఆరు టోర్నీలు ఆడి ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో, థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్స్ నెగ్గారు. మలేసియా సూపర్–1000, ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచి, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. -
మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ జోడీగా...
న్యూఢిల్లీ: నెల రోజుల తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మళ్లీ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం రెండు స్థానాలు మెరుగు పర్చుకొని మూడో ర్యాంక్ నుంచి టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది. గత ఆదివారం థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సాత్విక్–చిరాగ్ జంట విజేతగా నిలవడంతో వారి ర్యాంక్‌లో మార్పు వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న భారత జోడీ రెండు వారాలపాటు అగ్రస్థానంలో కొనసాగి ఆ తర్వాత ఐదో ర్యాంక్‌కు పడిపోయింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 23న నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని ఏప్రిల్ 15వ తేదీ వరకు టాప్ ర్యాంక్‌లో కొనసాగి మూడో ర్యాంక్‌కు పడిపోయింది. -
థాయ్‌లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతగా భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన చెన్ బో యాంగ్, లియు యిపై 21-15 21-15 తేడాతో విజయం సాధించిన ఈ భారత ద్వయం.. తొమ్మిదవ వరల్డ్ టూర్ టైటిల్ తమ ఖాతాలో వేసుకున్నారు.వరుస గేమ్‌లలో ప్రత్యర్ధి జోడీని ప్రపంచ నం.3 సాత్విక్ ద్వయం చిత్తు చేసింది. ఏ దశలోనూ ప్రత్యర్ధికి కోలుకునే అవకాశం సాత్విక్, చిరాగ్ జంట ఇవ్వలేదు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు టైటిల్‌ను సొంతం చేసుకోవడం ఈ జోడికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇక ప్రస్తుత బీడబ్ల్యూఎఫ్ సీజన్లో ఈ జోడికి ఇది రెండువ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ టైటిల్‌ను ఈ జోడీ సొంతం చేసుకుంది. అదేవిధంగా మలేషియా సూపర్ 1000,ఇండియా సూపర్ 750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచారు. -
ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ..
థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఫైనల్లో అడుగుపెట్టారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన లు మింగ్-చే-టాంగ్ కై-వీపై 21-11 21-12 తేడాతో సాత్విక్-చిరాగ్ ద్వయం విజయం సాధించింది.కేవలం 35 నిమిషాల్లో మ్యాచ్‌ను ఈ జంట ఫినిష్ చేసింది. వరుస రెండు గేమ్‌లలోనూ వీరిద్దరూ ప్రత్యర్ధి జోడీపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.ఇక ఆదివారం జరగనున్న తుది పోరులో చైనా జోడీ చెన్బో యాంగ్-లియు యితో భారత టాప్ సీడ్ సాత్విక్, చిరాగ్ ద్వయం తలపడనుంది. -
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబు ల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం మరో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–11తో జి సావో నాన్–జెంగ్ వె హాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ మైస్నం మిరాబా లువాంగ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ మణిపూర్ ఆటగాడు 21–14, 22–20తో మాడ్స్ క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అశ్విని–తనీషా ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–19, 21–17తో హంగ్ ఎన్ జు–లిన్ యు పె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అష్మిత (భారత్) 15–21, 21–12, 12–21తో హాన్ యువె (చైనా) చేతిలో ఓడిపోయింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–13తో నూర్ మొహమ్మద్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జంటపై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 84వ ర్యాంకర్ మైస్నం మిరాబా లువాంగ్ వరుస గేముల్లో ప్రణయ్‌ను ఓడించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు.55 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో మిరాబా 21–19, 21–18తో ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన కిరణ్ జార్జి, సతీశ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. కిరణ్ 15–21, 21–13, 17–21తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో... సతీశ్ 13–21, 17–21తో జేసన్ గుణవన్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యారు.అష్మిత మినహా...మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి ఐదుగురు బరిలోకి దిగగా... అష్మిత మినహా మిగతా నలుగురు ఉన్నతి హుడా, సామియా, మాళవిక, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అష్మిత 19–21, 21–15, 21–14తో ఎస్తర్ నురిమి (ఇండోనేసియా) పై గెలిచింది. ఉన్నతి 21–14, 14–21, 19–21తో లియాన్ టాన్ (బెల్జియం) చేతిలో, సామియా 13–21, 13–21తో గావో ఫాంగ్ జి (చైనా) చేతిలో ... మాళవిక 11–21, 10–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 13–21, 8–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
వైదొలిగిన సాత్విక్-చిరాగ్ జోడీ
భుజం గాయం నుంచి సాత్విక్ పూర్తిగా కోలుకోకపోవడంతో... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ వైదొలిగింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. థామస్ కప్‌లో మాత్రం సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగుతుందని భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. ఆసియా చాంపియన్‌షిప్ ఈనెల 9 నుంచి 14 వరకు చైనాలో జరుగుతుంది. -
శరత్ కమల్ ఓటమి
సింగపూర్: సంచలన విజయాలతో సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో అదరగొట్టిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ జోరుకు బ్రేక్ పడింది. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన ప్రపంచ 88వ ర్యాంకర్ శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శరత్ కమల్ 9–11, 2–11, 7–11, 11–9, 8–11తో ప్రపంచ 6వ ర్యాంకర్ ఫెలిక్స్ లెబ్రున్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శరత్ మొత్తం 37 పాయింట్లు సాధించాడు. ఇందులో 24 పాయింట్లు తన సర్వీస్‌లో నెగ్గగా... తన సరీ్వస్‌లో మరో 22 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శరత్ కమల్‌కు 14,000 డాలర్ల (రూ. 11 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్ బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి చుక్కెదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 16–21, 15–21తో 2022 డబుల్స్ చాంపియన్ షోహిబుల్ ఫిక్రీ–మౌలానా బగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. గతంలో ఫిక్రీ–మౌలానా ద్వయంపై నాలుగుసార్లు గెలిచిన సాతి్వక్–చిరాగ్ ఈసారి ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ వాటరింజెన్ (నెదర్లాండ్స్): డచ్ ఇంటర్నేషనల్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్‌గా అడుగుపెట్టిన తరుణ్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–16, 23–21తో భారత్‌కే చెందిన శుభాంకర్ డేపై గెలుపొందాడు. తొలి రౌండ్లో తరుణ్ 18–21, 21–10, 23–21తో ఆరో సీడ్ మథియాస్ కిక్లిట్జ్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 21–18, 21–14తో 2019 చాంపియన్ జోడీ మొహమ్మద్ అసన్–హెండ్రా సెతియావాన్ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2022 విజేత జోడీ మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రి–బగాస్ మౌలానా (ఇండోనేసియా)తో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. లక్ష్య సేన్ బోణీ మరోవైపు పురుషుల సింగిల్స్‌లో 2022 రన్నరప్, భారత స్టార్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 21–14తో ప్రపంచ 33వ ర్యాంకర్ మాగ్నస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ ప్రియాన్షు రజావత్‌కు నిరాశ ఎదురైంది. చికో ఔరా ద్వి వర్దాయో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్షు 19–21, 21–11, 9–21తో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ ముందంజ వేయగా... గత ఏడాది సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట ఈసారి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. అశి్వని–తనీషా ద్వయం 21–13, 21–18తో యెంగ్ ఎన్గా టింగ్–యెంగ్ పుయ్ లామ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గింది. గాయత్రి–ట్రెసా జోడీ 18–21, 12–21తో అప్రియాని రహాయు–సితీ ఫాదియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
All England Badminton 2024: సాత్విక్–చిరాగ్ జోడీపైనే ఆశలు!
బర్మింహమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్‌కు చివరిసారి 2001లో టైటిల్ లభించింది. ఆనాడు పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వల్... 2022లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. అయితే ఈసారి పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలపై భారత బృందం భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో వీరిద్దరు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆడిన మూడు టోరీ్నల్లోనూ (మలేసియా మాస్టర్స్, ఇండియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఫైనల్ చేరారు. రెండింటిలో రన్నరప్‌గా నిలిచారు. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ కూడా దక్కించుకున్నారు. అంతా సవ్యంగా సాగితే... నేడు మొదలయ్యే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత బృందం 23 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించే అవకాశాలున్నాయి. కానీ ఈసారి అన్ని విభాగాల్లోనూ భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్ దాటాక ప్రతి మ్యాచ్‌లో మేటి ప్రత్యర్థులు సిద్ధంగా ఉండనున్నారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మాజీ చాంపియన్ మొహమ్మద్ అహ్సాన్–హెండ్రా సెతియవాన్ (ఇండోనేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. సాత్విక్ ద్వయం ఈ అడ్డంకి దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా) జోడీ.. క్వార్టర్ ఫైనల్లో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జంట ఎదురయ్యే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సాత్విక్–చిరాగ్ జోడీ ప్రతి మ్యాచ్‌లో విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కిడాంబి శ్రీకాంత్; సు లి యాంగ్ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; ఎన్జీ జె యోంగ్ (మలేసియా)తో లక్ష్య సేన్; వర్దాయో (ఇండోనేసియా)తో ప్రియాన్షు తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వ్యోన్ లి (బెల్జియం)తో పీవీ సింధు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో సింధు గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె ప్రత్యరి్థగా ప్రపంచ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో ఉండనుంది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ; అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు బరిలో ఉన్నాయి.