క్వార్టర్‌ ఫైనల్లో అడుగు పెట్టిన చిరాగ్ శెట్టి-సాత్విక్‌ జోడి | Satwiksairaj Rankireddy-Chirag Shetty enters quarter finals | Sakshi
Sakshi News home page

BWF World Badmintonship 2022: క్వార్టర్‌ ఫైనల్లో అడుగు పెట్టిన చిరాగ్ శెట్టి-సాత్విక్‌ జోడి

Published Thu, Aug 25 2022 2:43 PM | Last Updated on Thu, Aug 25 2022 2:56 PM

Satwiksairaj Rankireddy-Chirag Shetty enters quarter finals - Sakshi

చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జోడి ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లో అడుగు పెట్టింది. టోక్యో వేదికగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో  డానిష్ జంట జెప్పీ బే, లాస్సే మోల్హెడేను 21-12, 21-10 తేడాతో  ఈ భారత స్టార్‌ జోడీ ఓడించింది.  

అంతకుముందు సాత్విక్ ,చిరాగ్ జంట గ్వాటెమాలన్ జంటను ఓడించి ప్రీ-క్వార్టర్‌ఫైనల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక జపాన్‌ ద్వయం టకురో హోకి, యుగో కొబయాషితో  క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్ ,చిరాగ్  తలపడనుంది.

మరోవైపు భారత షట్లర్లు ధ్రువ్‌ కపిల- ఎం.ఆర్‌ అర్జున్‌ తొలి సారి బీడబ్ల్యూఎఫ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్‌ఫైనల్లో  హీ యోంగ్‌ కాయ్‌ టెరీ–లో కీన్‌ హీన్‌ జంటను ఓడించి ఈ ద్వయం క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది.
చదవండి: BWF World Badmintonship 2022: చరిత్ర సృష్టించిన ధ్రువ్‌- అర్జున్‌ జోడీ.. తొలిసారిగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement