Satwiksairaj
-
Olympics 2024: మనోళ్లకు భారీ షాక్.. సాత్విక్- చిరాగ్ అవుట్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పతకం ఖాయమనకున్న విభాగంలో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు.ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో విఫలమై ప్యారిస్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆద్యంతం ఆసక్తి రేపిన మ్యాచ్‌లో మలేషియా జోడీ చేతిలో 21-13, 14-21, 16-21తో ఓడి ఇంటిబాటపట్టారు. ఒత్తిడిని అధిగమించలేకకాగా ఒలింపిక్స్‌లో పతకం రేసులో నిలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన సమయంలో సాత్విక్- చిరాగ్ తడబడ్డారు. వాస్తవానికి మలేషియా జోడీతో ముఖాముఖి రికార్డులో సాత్విక్–చిరాగ్ ద్వయం 3–8తో వెనుకబడి ఉంది. ఒకదశలో మలేసియా జంట చేతిలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే, భారత జోడీ ఇటీవల ఈ ద్వయంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. కానీ.. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో చిత్తైంది. ఫలితంగా పతకం గెలవాలన్న కల చెదిరిపోయింది. కాగా.. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన ఆరోన్ చియా–సో వుయ్ యిక్ ఈసారీ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లారు.ఇదిలా ఉంటే.. ఆరోరోజు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో మహారాష్ట్ర షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం సాధించాడు. అయితే, 50 కేజీల మహిళల బాక్సింగ్ విభాగంలో నిఖత్ జరీన్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. తాజాగా సాత్విక్- చిరాగ్ జోడీ కూడా నిరాశపరిచింది.చదవండి:Olympics: ముగిసిన ప్రయాణం.. నిఖత్ జరీన్ కన్నీటి పర్యంతం -
పారిస్ ఒలింపిక్స్.. క్వార్టర్స్‌కు చేరిన సాత్విక్- చిరాగ్ జోడీ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి అదరగొట్టారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జంట అడుగుపెట్టింది. తద్వారా ఓ అరుదైన ఘనతను ఈ స్టార్ భారత జోడీ తమ పేరిట లిఖించుకున్నారు. ఒలింపిక్స్ చరిత్రలోనే బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్స్‌కు చేరిన తొలి భారత జోడీగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు. ఇండోనేషియాకు చెందిన అల్ఫియన్- ఫజార్ చేతిలో 21-13, 21-10 తేడాతో ఫ్రెంచ్ ద్వయం లాబార్-కోర్వీ ఓడిపోవడంతో సాత్విక్-చిరాగ్ క్వార్టర్స్ బెర్త్ ఖారారైంది.కాగా సోమవారం నాటి రెండో మ్యాచ్‌లో సాత్విక్- చిరాగ్ జంట జర్మనీ జోడీ మార్విన్ సీడెల్- మార్క్ లామ్స్ఫస్తో తలపడాల్సింది. అయితే, మార్క్ మోకాలి గాయం కారణంగా ఈ జర్మనీ ద్వయం పోటీ నుంచి తప్పుకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు. ఈ క్రమంలో క్వార్టర్ ఫైనల్‌కు భారత జోడీ చేరాలంటే మంగళవారం ఇండోనేషియా జంటపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతలోనే సోమవారం జరిగిన సెకెండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ జోడీని ఇండోనేషియా ద్వయం ఓడించడంతో భారత్ క్వార్టర్ట్కు మార్గం సుగమమైంది. ఫ్రాన్స్ ఇంటి ముఖం పట్టడంతో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ సి పాయింట్ల పట్టికలో సాత్విక్- చిరాగ్ పెయిర్ రెండో స్ధానంలో నిలిచింది. ఈ జోడీ తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో మంగళవారం ఇండోనేషియా జంట ఫజర్ అల్ఫియాన్- మహమ్మద్ రియాన్ ఆర్టియాంటోతో తలపడనుంది.భారత్- అర్జెంటీనా హాకీ మ్యాచ్ డ్రాభారత్- అర్జెంటీనా పురుషుల హాకీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1 సమంగా గోల్స్ చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చివరి నిమిషంలో గోల్ కొట్టి భారత్‌ను ఓటమి నుంచి తప్పించాడు. భారత తమ తదుపరి మ్యాచ్‌లో జూలై 30న ఐర్లాండ్‌తో ఆడనుంది. -
Paris Olympics Tennis: గ్రూపు-సిలో సాత్విక్ –చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి అనుకూలమైన ‘డ్రా’ లభించింది. మూడో సీడ్ పొందిన సాత్విక్–చిరాగ్‌లకు గ్రూప్ ‘సి’లో చోటు దక్కింది. ఇదే గ్రూప్‌లో ఫజర్–అర్దియాంతో (ఇండోనేసియా), లమ్స్‌ఫుస్–సీడెల్ (జర్మనీ), కోరీ్వ–లాబర్ (ఫ్రాన్స్) జంట లు ఉన్నాయి. ఈ మూడు జోడీలు కూడా గతంలో ఒక్కసారి కూడా సాత్విక్–చిరాగ్‌లను ఓడించలేదు. ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రూప్‌ల్లో నాలుగు జంటలు... ‘డి’ గ్రూప్‌లో ఐదు జోడీలున్నాయి. లీగ్ దశ తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జోడీలు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. నాకౌట్ దశ లో గ్రూప్ ‘టాపర్’గా నిలిచిన జోడీలు మరో గ్రూప్ ‘టాపర్’తో తలపడే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో సాత్విక్–చిరాగ్ ద్వయం గ్రూప్ టాపర్‌గా నిలిస్తే క్వార్టర్ ఫైనల్లోనూ సులువైన ప్రత్యర్థి ఎదురయ్యే చాన్స్ ఉంటుంది. -
ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ..
థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఫైనల్లో అడుగుపెట్టారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన లు మింగ్-చే-టాంగ్ కై-వీపై 21-11 21-12 తేడాతో సాత్విక్-చిరాగ్ ద్వయం విజయం సాధించింది.కేవలం 35 నిమిషాల్లో మ్యాచ్‌ను ఈ జంట ఫినిష్ చేసింది. వరుస రెండు గేమ్‌లలోనూ వీరిద్దరూ ప్రత్యర్ధి జోడీపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.ఇక ఆదివారం జరగనున్న తుది పోరులో చైనా జోడీ చెన్బో యాంగ్-లియు యితో భారత టాప్ సీడ్ సాత్విక్, చిరాగ్ ద్వయం తలపడనుంది. -
French Open: పీవీ సింధుకు పరభావం.. క్వార్టర్స్‌లో ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో చైనాకు చెందిన చెన్ యు ఫీ చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో అద్భుతమైన పోరాట పటిమ చూపించిన సింధు.. ఆఖరికి 24-22,17-21, 18-21తో పరాజయం చవిచూసింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్లో 24-22 తేడాతో చెన్ యు ఫీని ఓడించిన సింధూ.. రెండు, మూడు సెట్లను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయింది. రెండు, మూడు సెట్లలో ప్రత్యర్ధి చెన్ యు ఫీ అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఎటువంటి తప్పిదాలు చేయకుండా సెమీస్బెర్త్ను ఖారారు చేసుకుంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ 21-19, 21-13తో సుపక్ జొంకో, కెడ్రెన్(థాయ్‌లాండ్) జోడీని ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌ను కష్టంగా గెలిచిన సాత్విక్, చిరాగ్ జంట.. రెండో గేమ్‌ను అలవోకగా దక్కించుకున్నారు. సెమీస్‌లో మిన్ హ్యుక్ కాంగ్, సెయింగ్ జయె(కొరియా) జోడీతో తలపడనున్నారు. చదవండి: IPL 2024: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..!? -
సాత్విక్-చిరాగ్ జోడి సంచలనం.. కొరియా ఓపెన్ కైవసం
భారత స్టార్ డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన పరుషుల డబుల్స్ ఫైనల్లో ఈ ద్వయం.. ఇండోనేషియాకు చెందిన టాప్ సీడ్ ఫజర్ అల్‌పయాన్–ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయాన్ని సాధించారు. కాగా గత నెల ఈ జోడి ఇండోనేషియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 17-21తో ఓడిపోయినప్పటికి రెండో గేమ్‌లో ఫుంజుకున్న సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి ప్రత్యర్థి జంట సర్వీస్‌ను పదే పదే బ్రేక్ చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్లారు. 21-13తో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక కీలకమైన మూడో గేమ్‌లోనూ బలమైన స్మాష్ సర్వీస్‌లతో విరుచుకుపడిన సాత్విక్-చిరాగ్ జోడి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 21-14తో గేమ్‌ను ముగించి చాంపియన్స్‌గా అవతరించారు. ఓవరాల్‌గా ఈ జంటకు ఇది మూడో BWF వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ కావడం విశేషం. 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🤩 Satwik-Chirag win their 3️⃣rd #BWFWorldTour Super 500 title 🥳 📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #KoreaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/t0osXuHCFS — BAI Media (@BAI_Media) July 23, 2023 Korea Open: SatChi defeated Alfian/Ardianto in a 3 setter battle to win the title, 3rd title of the year.. What a great pair they have become, df. WN2 pair in SF and WN1 pair in Final.. #Badminton #KoreaOpen pic.twitter.com/JQt8p3BegQ — Aditya Narayan Singh (@AdityaNSingh87) July 23, 2023 చదవండి: #Gianluigi Donnarumma: దోపిడి దొంగల బీభత్సం.. గోల్‌కీపర్, అతని భార్యను బంధించి -
గర్వంగా ఉంది: సాత్విక్- చిరాగ్‌లకు సీఎం జగన్ అభినందనలు
Satwiksairaj- Chirag Shetty: బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2023లో పసిడి పతకం గెలిచిన సాత్విక్- చిరాగ్‌లను ఆయన అభినందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ విజయాల పట్ల గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ సోమవారం ట్వీట్ చేశారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఎట్టకేలకు రెండో స్వర్ణం లభించిన విషయం తెలిసిందే. 1965లో పురుషుల సింగిల్స్‌లో దినేశ్ ఖన్నా చాంపియన్‌గా నిలవగా.. 58 ఏళ్ల తర్వాత పురుషుల డబుల్స్‌లో సాత్విక్- చిరాగ్ తమ అద్భుత ఆటతీరుతో భారత్‌కు పసిడి పతకం అందించారు. ఈ భారత జోడీ పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ ఒంగ్ యె సిన్–తియో ఈ యి (చైనీస్ తైపీ) జంటను ఓడించి విజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జోడీగా సరికొత్త చరిత్ర సృష్టించారు సాత్విక్- చిరాగ్. సాత్విక్ సాయిరాజ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడు కాగా.. చిరాగ్ శెట్టి స్వరాష్ట్రం మహారాష్ట్ర. చదవండి: IPL 2023: మిస్టర్ కూల్‌కు ఆగ్రహం! వైరల్ వీడియో చూశారా? -
సాత్విక్- చిరాగ్ సరికొత్త చరిత్ర.. తొలి భారతీయ జోడీగా రికార్డు
Satwiksairaj Rankireddy- Chirag Shetty- బాసెల్: కీలకదశలో పట్టుదల కోల్పోకుండా ఆడిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 68 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్–చిరాగ్ గుర్తింపు పొందింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సాత్విక్–చిరాగ్ జంట 54 నిమిషాల్లో 21–19, 24–22తో రెన్ జియాంగ్ యు–టాన్ కియాంగ్ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టిలకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కాగా, ఓవరాల్‌గా ఐదో టైటిల్. ఐదో టైటిల్! ఇక విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 16,590 డాలర్ల (రూ. 13 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీ, 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా సాత్విక్–చిరాగ్ కెరీర్లో గెలిచిన వరల్డ్ టూర్ డబుల్స్ టైటిల్స్. స్విస్ ఓపెన్ కంటే ముందు ఈ జంట హైదరాబాద్ ఓపెన్ (2018), థాయ్‌లాండ్ ఓపెన్ (2019), ఫ్రెంచ్ ఓపెన్ (2022), ఇండియా ఓపెన్ (2022) టోర్నీల్లో విజేతగా నిలిచారు. ఏడోసారి స్విస్ ఓపెన్‌లో భారత్ ప్లేయర్లకు టైటిల్ దక్కడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2011, 2012), పీవీ సింధు (2022)... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (2015), హెచ్ఎస్ ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018)... పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ (2023) విజేతగా నిలిచారు. ఇవి కూడా చదవండి: బోపన్న జోడీకి షాక్ ఫ్లోరిడా: గతవారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ... మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో మాత్రం నిరాశపరిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 6–4, 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ 11 ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. కీలకమైన సూపర్ టైబ్రేక్‌లో మాత్రం బోపన్న, ఎబ్డెన్ తడబడి ఓటమి చవిచూశారు. తొలి రౌండ్లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 18,020 డాలర్ల (రూ. 14 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హంపి, హారిక తొలి గేమ్ ‘డ్రా’ న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీని భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో ప్రారంభించారు. ఆదివారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడ్డారు. తెల్లపావులతో ఆడిన హంపి 31 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. భారత్‌కే చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) వైశాలికి తొలి గేమ్‌లో ‘వాకోవర్’ లభించింది. ఆమెతో తొలి రౌండ్లో తలపడాల్సిన జర్మనీ గ్రాండ్‌మాస్టర్ ఎలిజబెత్ పాట్జ్ టోర్నీ నుంచి వైదొలిగింది. దాంతో తొలి గేమ్‌లో వైశాలిని విజేతగా ప్రకటించారు. టోర్నీ నిర్వాహకుల నిర్వహణ వైఫల్యాల కారణంగానే తాను టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని ఎలిజబెత్ తెలిపింది. నిర్వాహకుల తీరుపై ఆగ్రహంతో కజకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ జాన్సయ అబ్దుమలిక్ కూడా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. చదవండి: Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు -
Malaysia Open 2023: సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ ద్వయం 17–21, 22–20, 21–9తో లియు యు చెన్–జువాన్ యి ఒయు (చైనా) జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ 16–21, 21–19, 12–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. ప్రణయ్‌కు 6,875 డాలర్ల (రూ. 5 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
French Open 2022: డబుల్స్ విజేత సాత్విక్–చిరాగ్ జోడీ
పారిస్: ఈ ఏడాది తమ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తమ ఖాతాలో మరో డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 49 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–19తో లూ చింగ్ యావో–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) జోడీపై నెగ్గింది. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 49,950 డాలర్ల (రూ. 41 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీ ఇండియా ఓపెన్ టైటిల్‌తోపాటు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. చదవండి: BWF Championships: ఫైనల్లో ఓడినా.. చరిత్ర సృష్టించిన శంకర్ ముత్తుస్వామి -
సాత్విక్- చిరాగ్ జోడి సంచలనం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సిరీస్ సూపర్-750 పురుషుల డబుల్స్‌లో భాగంగా శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్-చిరాగ్ జంట 21-18, 21-14తో చోయ్ సోల్ గ్యు-కిమ్ వాన్ హో ద్వయం(కొరియా)పై విజయం సాధించింది. 45 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్- చిరాగ్ జంట ఆద్యంతం ఆధితప్యం చెలాయించారు. #FrenchOpen2022 #FrenchOpenSuper750 #Badminton Indian pair of Satwiksairaj Rankireddy and Chirag Shetty reaches French Open men's doubles final pic.twitter.com/CZIDpIXM2x — TOI Sports (@toisports) October 29, 2022 కాగా ఈ ఏడాదిలో ఈ జోడికి ఇది రెండో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. ఇంతకముందు జనవరిలో ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో ఫైనల్ చేరిన సాత్విక్-చిరాగ్ జోడి టైటిల్ కొల్లగొట్టింది. తాజాగా మరో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌పై కన్నేసింది. కాగా ఈ టోర్నీలో ఎనిమిది మంది భారత షట్లర్లు పాల్గొనగా మిగిలింది ఈ ఒక్క జంట మాత్రమే. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ తో పాటు సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి పాలయ్యారు. -
సాత్విక్–చిరాగ్ ‘డబుల్స్’ ధమాకా
భారత అమ్మాయిల జోడి 11 ఏళ్ల క్రితమే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం పని పట్టింది. ఈ టోర్నీ చరిత్రలో ఇన్నేళ్లయినా పురుషుల జోడీ వల్ల ఒక్క పతకం కూడా రాలేదు. ఇప్పుడా లోటు ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ వల్ల తీరింది. చిరాగ్‌శెట్టితో జతకట్టిన తెలుగు తేజం తనకన్నా మెరుగైన రెండో ర్యాంకింగ్ జోడీని కంగు తినిపించాడు. సెమీస్ చేరడం ద్వారా సాత్విక్–చిరాగ్‌లకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. టోక్యో: మన షట్లర్లు దూసుకెళుతున్నారు. కామన్వెల్త్గేమ్స్, ఏషియాడ్, ఒలింపిక్స్, థామస్–ఉబెర్ కప్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఇలా ఏ మెగా ఈవెంట్ అయినా సరికొత్త చరిత్ర సృష్టిస్తూ సాగుతున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్‌లో అందని ద్రాక్షయిన పతకాన్ని ఇప్పుడు అందుకోనున్నారు. అంతర్జాతీయ సర్క్యూట్లో స్థిరంగా రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ఈ టోక్యో ఈవెంట్లో ఆ ఘనత సాధించారు. పురుషుల డబుల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీ సెమీస్ చేరడంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకు జంటపై భారత ద్వయం ఆటను చూస్తే పతకం రంగు మారినా ఆశ్చర్యం లేదు. అంతలా డిఫెండింగ్ చాంపియన్స్‌పై సత్తా చాటారు. రెండో గేమ్‌లో పుంజుకున్న స్థానిక మేటి ర్యాంకింగ్ జోడీని నిర్ణాయక గేమ్‌లో ఓడించి మరీ సెమీస్ చేరిన తీరు అద్భుతం! శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడి 24–22, 15–21, 21–14తో ప్రపంచ రెండో ర్యాంకు, డిఫెండింగ్ చాంపియన్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్) జంటను కంగుతినిపించింది. గంటా 15 నిమిషాల పాటు జరిగిన ఈ హోరాహోరీ పోరాటంలో భారత జోడీదే పైచేయి అయ్యింది. తొలిగేమ్‌లో ఆరంభం నుంచే పట్టుబిగించిన సాత్విక్–చిరాగ్ 12–5తో జోరు పెంచారు.అయితే వరుసగా ఏడు పాయింట్లు సాధించిన డిఫెండింగ్ చాంపియన్ జంట 16–14తో పోటీలో పడింది. ఈ గేమ్ ఆఖరిదాకా పట్టుసడలించని పోరాటం చేసిన భారత జంటే గేమ్ గెలుచుకుంది. కానీ రెండో గేమ్‌లో పుంజుకున్న జపాన్ షట్లర్లు భారత ఆటగాళ్లకు చెక్‌పెట్టారు. నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్ జంటే అదరగొట్టింది. 16–9తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత జోడీ అదే వేగంతో పాయింట్లను సాధిస్తూ మ్యాచ్‌ను గెలిచింది. మరో పురుషుల డబుల్స్ జోడీ ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిలకు క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అర్జున్–ధ్రువ్ 8–21, 14–21తో మూడు సార్లు చాంపియన్లుగా నిలిచిన మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. భారత@13 డబుల్స్‌లో భారత్‌కిది రెండో పతకం. మహిళల డబుల్స్‌లో ఇదివరకే (2011లో) గుత్తాజ్వాల–అశ్విని పొన్నప్ప కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా అయితే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కిది 13వ పతకం. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు స్వర్ణం సహా ఐదు పతకాలు నెగ్గగా, సైనా రజత, కాంస్య పతకాలు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ (రజతం), లక్ష్యసేన్ (కాంస్యం), సాయిప్రణీత్ (కాంస్యం), దిగ్గజం ప్రకాశ్ పదుకొనె (కాంస్యం) పతక విజేతలుగా నిలిచారు. -
BWF World Championships: చిరాగ్- సాత్విక్ జోడీ సంచలన విజయం.. సరికొత్త చరిత్ర
Chirag Shetty and Satwiksairaj Rankireddy: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ జంటగా నిలిచింది. టోక్యో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో జపాన్ బ్యాడ్మింటన్ జోడీతో తలపడి ఈ రికార్డు సాధించింది. కాగా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్-2022లో భాగంగా చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి ద్వయం.. రెండో సీడ్ టకురో హోకి- యుగో కొబయాషి(జపాన్)తో క్వార్టర్ ఫైనల్లో తలపడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ తొలి గేమ్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైనా భారత జోడీ 24-22తో పైచేయి సాధించింది. అయితే, రెండో గేమ్‌లో మాత్రం జపాన్ షట్లర్ల ద్వయం.. చిరాగ్- సాత్విక్‌లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. 21-15తో ఓడించింది. తిరిగి పుంజుకున్న భారత జంట 21-14తో టకురో హోకి- యుగో కొబయాషిలను మట్టికరిపించి విజయం సాధించింది. తద్వారా సెమీస్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. ఇక చిరాగ్- సాత్విక్ జోడీ కామన్వెల్త్ గేమ్స్-2022లో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: Virat Kohli: ధోనితో ఉన్న ఫొటో షేర్ చేసి కోహ్లి భావోద్వేగం! రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అంటూ.. ఫ్యాన్స్ ఆందోళన! ✅ First 🇮🇳 MD pair to secure a #BWFWorldChampionships medal ✅ Only 2nd #WorldChampionships medal from 🇮🇳 doubles pair ✅ 13th medal for 🇮🇳 at World's@satwiksairaj & @Shettychirag04 script history yet again 😍#BWFWorldChampionships2022#BWC2022#Tokyo2022#IndiaontheRise pic.twitter.com/POW0uYt7KC — BAI Media (@BAI_Media) August 26, 2022 -
క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టిన చిరాగ్ శెట్టి-సాత్విక్ జోడి
చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జోడి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. టోక్యో వేదికగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో డానిష్ జంట జెప్పీ బే, లాస్సే మోల్హెడేను 21-12, 21-10 తేడాతో ఈ భారత స్టార్ జోడీ ఓడించింది. అంతకుముందు సాత్విక్ ,చిరాగ్ జంట గ్వాటెమాలన్ జంటను ఓడించి ప్రీ-క్వార్టర్ఫైనల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక జపాన్ ద్వయం టకురో హోకి, యుగో కొబయాషితో క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ ,చిరాగ్ తలపడనుంది. మరోవైపు భారత షట్లర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ తొలి సారి బీడబ్ల్యూఎఫ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్ఫైనల్లో హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ జంటను ఓడించి ఈ ద్వయం క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. చదవండి: BWF World Badmintonship 2022: చరిత్ర సృష్టించిన ధ్రువ్- అర్జున్ జోడీ.. తొలిసారిగా.. -
India Open 2022: ప్రపంచ ఛాంపియన్స్‌కు షాకిచ్చిన భారత ఆటగాళ్లు
India Open 2022: భారత క్రీడాకారుడు లక్ష్యసేన్ ఇండియా ఓపెన్-2022 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్యూను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో లక్ష్యసేన్ లోహ్ కీన్యూపై 24-22, 21-17 తేడాతో గెలుపొందాడు. 54 నిమిషాలపాటు సాగిన ఈ గేమ్‌లో వరుస రెండు సెట్లలో విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో లక్ష్యసేన్ తన తొలి సూపర్ 500 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ టైటిల్ గెలుచుకున్న మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. Take a bow for the Men’s Singles champions! 🔥🔥👏 🥇: @lakshya_sen 🥈: @reallohkeanyew #YonexSunriseIndiaOpen2022 #IndiaKaregaSmash #Badminton pic.twitter.com/iM9wkpiDLD — BAI Media (@BAI_Media) January 16, 2022 ఇండియా ఓపెన్ డబుల్స్ ఫైనల్లో చిరాగ్‌శెట్టి- సాత్విక్ సాయిరాజ్ జోడి మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్లు అయిన ఇండోనేషియాకు చెందిన మహ్మద్ అహ్పాన్, హెండ్రా సెటియావాన్‌లను ఓడించి టైటిల్‌ను గెలుపొందారు. ఫైనల్లో ఈ జోడి వరుస సెట్లలో అద్భుతమైన ఆటతీరుతో 21-16, 26-24 తేడాతో గెలుపొందింది. Put your hands together for the Men’s doubles champions! 🇮🇳 🇮🇩 👏👏🔝 🥇: @satwiksairaj & @Shettychirag04 🥈: Mohammad Ahsan & Hendra Setiwan#YonexSunriseIndiaOpen2022 #IndiaKaregaSmash #Badminton pic.twitter.com/hHC4i5ybOE — BAI Media (@BAI_Media) January 16, 2022 చదవండి: (విరాట్ కోహ్లి రిటైర్మెంట్.. స్పందించిన పుజారా) -
సాత్విక్ ‘పాజిటివ్’
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో ఈనెలారంభంలో జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం మొదలైన వెంటనే కరోనా కలకలం చెలరేగింది. ఈ శిబిరానికి హాజరైన మహిళల డబుల్స్ స్టార్ సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ కిరణ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. వెంటనే మరోసారి నిర్వహించిన కోవిడ్–19 టెస్టుల్లో వీరిద్దరికి నెగెటివ్ ఫలితం వచ్చింది. తాజాగా పురుషుల డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)కు కూడా కరోనా సోకింది. అతనిలో కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవు. ఈ మహమ్మారి సోకడంతో ప్రస్తుతం అమలాపురంలోని తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న సాత్విక్... ఈనెల 29న ఆన్లైన్లో జరిగే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవానికి దూరం కానున్నాడు. డబుల్స్‌లో తన భాగస్వామి చిరాగ్ శెట్టితో పాటు ఈ ఏడాది ‘అర్జున’ అవార్డుకు సాత్విక్ ఎంపికయ్యాడు. ‘కొన్నిరోజుల క్రితమే యాంటిజెన్ పరీక్షకు హాజరయ్యా. ఆ తర్వాత చేసిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షలోనూ కరోనా సోకినట్లు తేలింది. ఐదు రోజులుగా క్వారంటైన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నా. జ్వరం, జలుబు, ఒళ్లునొప్పుల్లాంటి లక్షణాలేవీ లేవు. మరో మూడు రోజుల తర్వాత మళ్లీ కరోనా టెస్టు చేయించుకుంటా. అదృష్టవశాత్తు మా కుటుంబసభ్యులెవరికీ కరోనా పాజిటివ్ రాలేదు’ అని 20 ఏళ్ల సాత్విక్ వివరించాడు. సాత్విక్‌తో పాటు మరో ఇద్దరు అవార్డు విజేతలు కూడా కరోనా కారణంగా ఈ వేడుకలకు హాజరు కాలేకపోతున్నారని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులు పేర్కొన్నారు. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. మొదటిసారిగా... మరోవైపు కోవిడ్–19 నేపథ్యంలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం నిర్ణీత సమయానికి జరుగుతుందో లేదో అనే సందేహాల్ని పటాపంచలు చేస్తూ కేంద్రం వినూత్న సంప్రదాయానికి తెరతీసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వర్చువల్ (ఆన్లైన్) వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ‘సాయ్’ కేంద్రాలు ఇందుకు వేదికలుగా మారనున్నాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ నుంచే వర్చువల్ పద్ధతిలో విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. అవార్డులకు ఎంపికైన క్రీడాకారులంతా తమ నగరాల్లోని ‘సాయ్’ కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది 74 మంది జాతీయ అవార్డులకు ఎంపికవగా 65 మంది శనివారం ఈ అవార్డును పొందనున్నట్లు ‘సాయ్’ తెలిపింది. -
‘అర్జున’ ఒక్కరికే వస్తుందనుకున్నా...
హైదరాబాద్: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసిన జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘అర్జున అవార్డు’ కోసం తనతోపాటు తన భాగస్వామి చిరాగ్ శెట్టి పేరు కూడా ఉండటంపై ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. 2019లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో అద్భుత ఫలితాలు సాధించింది. థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గిన ఈ ద్వయం ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో పురుషుల డబుల్స్ ప్రపంచ చాంపియన్ జోడీని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న జంటను సాత్విక్–చిరాగ్ ద్వయం ఓడించింది. ‘చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరిలో ఒక్కరికే అవార్డు వచ్చే అవకాశముందని, ఇద్దరికీ రాకపోవచ్చని ఎవరో చెప్పారు. అయితే అవార్డుల సెలక్షన్ కమిటీ మా ఇద్దరి పేర్లను కేంద్ర క్రీడా శాఖకు పంపించడంతో ఊరట చెందాను’ అని సాత్విక్ అన్నాడు. ప్రస్తుతం అమలాపురంలోనే ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపిన సాత్విక్... రెండు వారాలలోపు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న జాతీయ శిక్షణ శిబిరానికి హాజరవుతానన్నాడు. . తన అర్జున అవార్డును తల్లిదండ్రులకు, కోచ్‌లకు, తానీ స్థాయికి చేరుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ అంకితం ఇస్తున్నానని ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ తెలిపాడు. 20 ఏళ్ల ప్రాయంలోనే ‘అర్జున’ అవార్డు వస్తుందని ఊహించలేదని... ఈ పురస్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సాత్విక్ పేర్కొన్నాడు. ‘టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తీవ్రంగా నిరాశ చెందాను. కొంతకాలంగా మేమిద్దరం మంచి ఫామ్‌లో ఉన్నాం. మరో రెండు నెలల వరకు ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలు లేవు. టోర్నీలు లేని సమయంలో ఏ క్రీడాకారుడికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ప్రాక్టీస్ మొదలుపెట్టిన రెండు వారాల్లో మేము ఫామ్‌లోకి వస్తామని ఆశిస్తున్నాను’ అని సాత్విక్ వివరించాడు. -
బీడబ్ల్యూఎఫ్ అవార్డు రేసులో సాత్విక్, చిరాగ్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వార్షిక అవార్డుల్లో భాగంగా ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ కేటగిరీలో భారత డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు స్థానం లభించింది. ఈ ఏడాది సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గడంతోపాటు ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో మిచెల్లి లీ (మహిళల సింగిల్స్–కెనడా), కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (మహిళల డబుల్స్–కొరియా), ప్రవీణ్ జోర్డాన్–మేలతి దేవ ఒక్టావియాంతి (మిక్స్డ్ డబుల్స్–ఇండోనేసియా) కూడా ఉన్నారు. దివ్యాంగుల విభాగంలో భారత్‌కే చెందిన ప్రమోద్ భగత్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో ఉన్నాడు. ప్రమోద్ ఈ ఏడాది జరిగిన పారా బ్యాడ్మింటన్ టోర్నీల్లో మొత్తం 10 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు గెలిచాడు. ఈనెల 9న చైనాలోని గ్వాంగ్జూలో జరిగే బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్ ప్రారంభోత్సవంలో విజేతలను ప్రకటిస్తారు. -
క్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్ జోడీ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. టోర్నీ రెండో సీడ్‌ను కంగుతినిపించి క్వార్టర్స్‌లో ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జంట 21–18, 18–21, 21–13తో మొహమ్మద్ హసన్– హెండ్రా సెతియావాన్ (సింగపూర్) ద్వయంపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. తొలి గేమ్‌ను గెల్చుకున్న సాయిరాజ్ జంట రెండో గేమ్‌ను కోల్పోయినా... మూడో గేమ్‌లో పుంజుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు భారత టాప్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహా్వల్ నిలకడగా ఆడుతున్నారు. ప్రిక్వార్టర్స్ మ్యాచుల్లో తమ ప్రత్యర్థులపై అలవోక విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించారు. టోర్నీ ఐదో సీడ్ సింధు 21–10, 21–13తో యో జియా మిన్ (సింగపూర్)పై సునాయాస విజయం సాధించిం ది. మరో ప్రిక్వార్టర్ పోరులో సెనా నెహ్వాల్ 21–10, 21–11తో లినె హోజ్మార్క్ జెర్స్‌ఫెట్ (డెన్మార్క్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శుభాంకర్ డే (భారత్) 6–21, 13–21తో శెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. -
సాత్విక్-చిరాగ్ జోడి కొత్త చరిత్ర
బ్యాంకాక్: భారత బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు సరికొత్త చరిత్ర సృష్టించారు. భారత్ తరఫున సూపర్-500 టైటిల్‌ను గెలిచిన తొలి జోడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించారు. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా పురుషుల డబల్స్ టైటిల్‌ను గెలవడం ద్వారా నూతన రికార్డుకు శ్రీకారం చుట్టారు. ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్‌ల జోడి 21-19, 18-21, 21-18 తేడాతో లి జున్ హు- యు చెన్(చైనా) ద్వయంపై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నారు. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సాత్విక్-చిరాగ్‌ల ద్వయం.. రెండో గేమ్‌ను చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్ జోడి అంచనాలకు మించి రాణించింద. రెండో ర్యాంక్ చైనా జంటను ఒత్తిడిలోకి నెట్టింది. సుదీర్ఘ ర్యాలీలో ఆకట్టకున్న సాత్విక్ జోడి చివరకు గేమ్‌తో మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుని భారత పురుషుల డబుల్స్ విభాగంలో నయా రికార్డును లిఖించింది. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడి
బ్యాంకాక్: అంచనాలకు మించి రాణిస్తూ వస్తోన్న భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ ఫైనల్స్‌కు చేరి ఔరా అనిపించింది. సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారత జోడీగా చరిత్ర సృష్టించింది. హేమాహేమీలైన భారత షట్లర్లు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా భారత టైటిల్ ఆశలను తమ భుజాలపై మోస్తూ వచ్చిన సాయిరాజ్ జోడి మరో అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీస్ మ్యాచ్‌లో ప్రపంచ 16వ ర్యాంక్ సాయిరాజ్ జోడి 22–20, 22–24, 21–9తో 19వ ర్యాంక్ కో సుంగ్ హ్యూన్ – షిన్ బేక్ చియోల్ (కొరియా) జంటను చిత్తుచేసింది. 63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సాయిరాజ్ జంట టైటిల్ కోసం జరిగే తుది పోరుకు అర్హత సాధించింది. -
ఫైనల్లో సాత్విక్ జోడి
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగన పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో సాత్విక్ ద్వయం 22-20, 22-24, 21-9 తేడాతో కొ సంగ్ హ్యూన్ – షిన్ బేక్ చియోల్ (కొరియా) జోడిపై గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సాత్విక్-చిరాగ్‌ల జోడి.. రెండో గేమ్‌లో ఓటమి పాలైంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్-చిరాట్‌ల ద్వయం రెచ్చిపోయి ఆడింది. ఏ దశలోనూ కొ సంగ్ హ్యూన్ – షిన్ బేక్ చియోల్లకు అవకాశం ఇవ్వకుండా భారీ తేడాతో గేమ్‌ను గెలుచుకోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో సాత్విక్-చిరాగ్‌ల జోడి లి జున్ హు- యు చెన్(చైనా)తో తలపడనుంది. -
ముంబై, అహ్మదాబాద్ ఘనవిజయం
ముంబై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ముంబై రాకెట్స్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ బోణీ కొట్టాయి. ఆదివారం జరిగిన పోటీల్లో ముంబై 5–0తో ఢిల్లీ డాషర్స్‌పై గెలుపొందగా, అహ్మదాబాద్ 4–1తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌పై విజయం సాధించింది. వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సైనా నెహ్వాల్ గాయంతో బరిలోకి దిగలేదు. ముందుగా ఢిల్లీతో జరిగిన పోరులో ముంబై రెండు ట్రంప్ మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. పురుషుల డబుల్స్‌ను ముంబై ట్రంప్‌గా ఎంచుకోగా... లీ యంగ్ డే–కిమ్ జి జంగ్ (ముంబై) ద్వయం 14–15, 15–12, 15–9తో వాంగ్ సిజి–చై బియావో జంటపై గెలిచింది. తర్వాత రెండు పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ ముంబై ఆటగాళ్లే గెలిచారు. అండర్స్ అంటోన్సెన్ (ముంబై) 15–13, 15–7తో సుగియార్తోపై, సమీర్ వర్మ (ముంబై) 15–14, 15–9తో ప్రణయ్‌పై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్‌లో లీ యంగ్ డే–బెర్నడెత్ (ముంబై)జోడీకి 11–15, 12–15తో మనిపాంగ్ జొంగ్జిత్–చియా సిన్ లీ జంట చేతిలో చుక్కెదురైంది. ఢిల్లీ ఎంచుకున్న మహిళల సింగిల్స్ ట్రంప్ మ్యాచ్‌లో శ్రేయాన్షి పరదేశి (ముంబై) 12–15, 15–8, 15–10తో ఎవజెనియా కొసెట్స్‌కయాపై గెలిచింది. దీంతో –1 పాయింట్ వల్ల మిక్స్డ్ డబుల్స్‌లో గెలిచిన స్కోరును ఢిల్లీ కోల్పోయింది. స్మాష్ మాస్టర్స్ జోరు... అనంతరం జరిగిన పోరులో పురుషుల డబుల్స్‌ను నార్త్ ఈస్టర్న్ వారియర్స్, పురుషుల సింగిల్స్‌ను అహ్మదాబాద్ ట్రంప్ మ్యాచ్‌లుగా ఎంచుకున్నాయి. వరుసగా జరిగిన ఈ పోటీల్లో అహ్మదాబాద్ ప్లేయర్లే గెలిచారు. దీంతో మరో మూడు మ్యాచ్‌లుండగానే అహ్మదాబాద్ జట్టు 3– (–1)తో విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – లీ రెగినాల్డ్ (అహ్మదాబాద్)జంట 10–15, 15–14, 15–14తో లియో మిన్ చన్– యు సియాంగ్‌పై నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో అక్సెల్సన్ (అహ్మదాబాద్) 15–11, 15–14తో సెన్సొబూన్సుక్ను ఓడించాడు. గిల్మోర్ (అహ్మదాబాద్)కు 8–15, 9–15తో రీతూపర్ణ దాస్ షాకిచ్చింది. పురుషుల సింగిల్స్‌లో డారెన్ ల్యూ (అహ్మదాబాద్)11–15, 15–10, 10–15తో తియాన్ హౌవీ చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–సిక్కిరెడ్డి (అహ్మదాబాద్) జోడీ 15–8, 15–7 యు సియాంగ్–కిమ్ హ న జంటపై గెలిచింది. నేడు ముంబైలో జరిగే చివరి పోరులో పుణే సెవెన్ ఏసెస్‌తో అవధ్ వారియర్స్ తలపడుతుంది. -
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ జంట
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –500 బ్యాడ్మింటన్ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో ఈ జోడీ 19–21, 21–14, 21–17తో అక్బర్–విన్నీ ఒక్తా(ఇండోనేసియా) ద్వయంపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో హైదరాబాద్ ప్లేయర్ రాహుల్ యాదవ్ 14–21, 12–21తో సితికోమ్ (థాయ్‌లాండ్) చేతిలో, కార్తికేయ 14–21, 26–28తో సోనీ ద్వి కుంకొరో (ఇండోనేసియా) చేతిలో, శ్రేయాన్‡్ష 7–21, 9–21తో లూ గ్వాంగ్జు (చైనా) చేతిలో ఓడారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్లో చుక్కా సాయి ఉత్తేజిత రావు 18–21, 9–21తో యూలియా సుసాంతో (ఇండోనేసియా) చేతిలో ఓడింది. -
సూపర్ సాత్విక్...
ఒకే రోజు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం ►పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత ►జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ అంతర్జాతీయస్థాయి బ్యాడ్మింటన్ ప్రమాణాలకు అనుగుణంగా ఒక రోజు ఒక మ్యాచ్ ఆడితే కోలుకోవడానికి తగినంత విశ్రాంతి కావాలి. మరి ఒకే రోజు ఎనిమిది గంటల వ్యవధిలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి వస్తే ఫిట్నెస్తోపాటు మానసికంగా ఎంతో ధృడంగా ఉండాలి. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే 17 ఏళ్ల సాత్విక్ సాయిరాజ్ ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా నాలుగు మ్యాచ్‌ల్లోనూ తన భాగస్వాములతో కలిసి విజయం సాధించి అబ్బురపరిచాడు. ఫలితంగా ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఈ అమలాపురం కుర్రాడు పురుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టితో కలిసి... మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. టోక్యో: అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువ డబుల్స్ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల ఈ కుర్రాడు ఒకే రోజు నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 24 నిమిషాల్లో 21–13, 21–15తో హిరోకి మిదొరికావా–నత్సు సైతో (జపాన్) జోడీపై... రెండో రౌండ్లో 29 నిమిషాల్లో 21–18, 21–9తో హిరోకి ఒకముర–నారు షినోయా (జపాన్) జంటపై విజయం సాధించి మెయిన్ ‘డ్రా’కు దూసుకెళ్లింది. అనంతరం పురుషుల డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 59 నిమిషాల్లో 14–21, 22–20, 21–18తో హిరోకత్సు హషిమోటో–హిరోయుకి సెకి (జపాన్) జంటపై... రెండో రౌండ్లో 33 నిమిషాల్లో 21–18, 21–12తో కెచిరో మత్సు–యోషినోరి తెకుచి (జపాన్) ద్వయంపై గెలుపొంది మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో పారుపల్లి కశ్యప్ (భారత్)కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో కశ్యప్ 21–15, 21–14తో ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)పై గెలుపొంది... రెండో రౌండ్లో 11–21, 21–18, 14–21తో ఇగారషి (జపాన్) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. మిక్స్డ్ డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 21–19, 17–21, 21–15తో తొమాయా తకషినా–రి ఎతో (జపాన్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తియాన్ హువీ (చైనా)తో కిడాంబి శ్రీకాంత్; లిన్ డాన్ (చైనా)తో సౌరభ్ వర్మ; లీ డోంగ్ కెయున్ (దక్షిణ కొరియా)తో సాయిప్రణీత్; అండెర్స్ అంటోన్సెన్ (డెన్మార్క్) ప్రణయ్; ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)తో సమీర్ వర్మ ఆడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మినత్సు మితాని (జపాన్)తో సింధు; పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. త్రీ స్టార్స్... త్రీ చీర్స్ టోక్యోలో జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ సందర్భంగా తన చిరకాల ప్రత్యర్థులు రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), ప్రపంచ చాంపియన్ ఒకుహారా (జపాన్)లతో పీవీ సింధు