ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి అదరగొట్టారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జంట అడుగుపెట్టింది. తద్వారా ఓ అరుదైన ఘనతను ఈ స్టార్ భారత జోడీ తమ పేరిట లిఖించుకున్నారు.
ఒలింపిక్స్ చరిత్రలోనే బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్స్‌కు చేరిన తొలి భారత జోడీగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు. ఇండోనేషియాకు చెందిన అల్ఫియన్- ఫజార్ చేతిలో 21-13, 21-10 తేడాతో ఫ్రెంచ్ ద్వయం లాబార్-కోర్వీ ఓడిపోవడంతో సాత్విక్-చిరాగ్ క్వార్టర్స్ బెర్త్ ఖారారైంది.
కాగా సోమవారం నాటి రెండో మ్యాచ్‌లో సాత్విక్- చిరాగ్ జంట జర్మనీ జోడీ మార్విన్ సీడెల్- మార్క్ లామ్స్‌ఫస్‌తో తలపడాల్సింది. అయితే, మార్క్ మోకాలి గాయం కారణంగా ఈ జర్మనీ ద్వయం పోటీ నుంచి తప్పుకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు. ఈ క్రమంలో క్వార్టర్ ఫైనల్‌కు భారత జోడీ చేరాలంటే మంగళవారం ఇండోనేషియా జంటపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంతలోనే సోమవారం జరిగిన సెకెండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ జోడీని ఇండోనేషియా ద్వయం ఓడించడంతో భారత్ క్వార్టర్ట్‌కు మార్గం సుగమమైంది. ఫ్రాన్స్ ఇంటి ముఖం పట్టడంతో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ సి పాయింట్ల పట్టికలో సాత్విక్- చిరాగ్ పెయిర్ రెండో స్ధానంలో నిలిచింది. ఈ జోడీ తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో మంగళవారం ఇండోనేషియా జంట ఫజర్ అల్ఫియాన్- మహమ్మద్ రియాన్ ఆర్టియాంటోతో తలపడనుంది.
భారత్- అర్జెంటీనా హాకీ మ్యాచ్ డ్రా
భారత్- అర్జెంటీనా పురుషుల హాకీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1 సమంగా గోల్స్ చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చివరి నిమిషంలో గోల్ కొట్టి భారత్‌ను ఓటమి నుంచి తప్పించాడు. భారత తమ తదుపరి మ్యాచ్‌లో జూలై 30న ఐర్లాండ్‌తో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment