పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభం సందర్భంగా గూగుల్ ప్రత్యేకంగా డూడుల్‌ను డిజైన్ చేసింది. యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే ఒలింపిక్ 2024కి సంబంధించిన తాజా అప్‌డేట్‌లు వచ్చేలా పేజీ సిద్ధం చేశారు. నదిలో జీవులు సేదతీరుతున్నట్లు ఈ డూడుల్‌ను ఏర్పాటు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ఈవెంట్‌లు ఉన్నపుడు గూగుల్ వాటిని తెలియజేసేలా సృజనాత్మకంగా డూడుల్‌లను రూపొందిస్తోంది. జులై 26న పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభం అవుతుండడంతో ఈ ఈవెంట్‌ను తెలియజేసేలా డూడుల్‌ను సిద్ధం చేసింది. పారిస్ వెంబడి ప్రవహించే ‘సీన్ నది’ని తలపిస్తూ ఐదు ఖండాల క్రీడాకారులను రిప్రజెంట్ చేసేలా వివిధ జీవులతో డూడుల్‌ను రూపొందించింది. ప్రస్తుతం పారిస్‌లో వేసవికాలం ఉండడంతో అవి నదిలో సేదతీరుతున్నట్లు ఈ డూడుల్‌లో చూడవచ్చు.
పారిస్ ఒలింపిక్ 2024 ప్రారంభ వేడుకలకు రెండు రోజుల ముందే జులై 24న ఆర్చరీ, సాకర్, హ్యాండ్‌బాల్, రగ్బీలో ప్రాథమిక రౌండ్‌ను మొదలుపెట్టారు. 69 ఈవెంట్లలో 117 మంది భారతీయ పోటీదారులు 95 పతకాల కోసం పోటీపడబోతున్నారు. ఇందులో 70 మంది పురుషులు, 47 మంది మహిళలు ఉన్నారు. పారిస్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పోటీదారుల్లో జావెలిన్‌థ్రో స్టార్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్లు పీజీ సింధు, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వంటి ప్రముఖ క్రీడాకారులున్నారు.
ఇదీ చదవండి: ఒలింపిక్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైన నీతా అంబానీ
ఒలింపిక్ 2024 ప్రారంభ వేడుక తర్వాత జులై 27న శనివారం న్యూజిలాండ్‌తో భారత పురుషుల హాకీ జట్టు పోటీపడనుంది. బ్యాడ్మింటన్, బాక్సింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లు కూడా అదే రోజున జరుగుతాయి. ఈ ఈవెంట్స్ స్పోర్ట్స్ 18, వయాకామ్ 18 నెట్‌వర్క్‌తో అనుసంధానం కలిగిన ఛానల్స్‌తో పాటు, జియో సినిమా యాప్‌లో ప్రసారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment