పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన భారత ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ జోడీ మనూ భాకర్- సరబ్‌జోత్ సింగ్‌లను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.
‘ఒలింపిక్స్ ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల మిక్స్‌డ్ ఈవెంట్ లో మనూ భాకర్- సరబ్‌జోత్ సింగ్‌లు కాంస్యం గెలిచి భారతదేశ కీర్తిని మరింత పెంచారు’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Team India makes the nation proud yet again at the 2024 Olympics! @realmanubhaker and Sarabjot Singh bring home the bronze in the 10m air pistol mixed team event. #IndiaAtOlympics pic.twitter.com/MQQI792J1q
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 30, 2024
కాగా, ఒలింపిక్స్-2024లో భారత్ రెండో పతకం సాధించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్‌లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్ జోడీ మనూ భాకర్- సరబ్‌జోత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్ మెడల్ అందించారు.
దక్షిణ కొరియా జోడీ(జిన్ ఓయె–లీ వన్‌హో)ని 16-10తో ఓడించి పతకం సాధించారు. ఈ క్రమంలో మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్‌గా నిలిచింది. కాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఆమె కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment