Sarabjot Singh
-
Olympics: ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించిన సరబ్జోత్ సింగ్
ఒలింపిక్ పతక విజేత, షూటర్ సరబ్జోత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హర్యానా ప్రభుత్వం ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని తాను స్వీకరించలేనన్నాడు. తన దృష్టి మొత్తం షూటింగ్‌పైనే కేంద్రీకృతమై.. ఉందని అందుకే ఈ ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపాడు. తాను ముందే కొన్ని కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నానని.. వాటికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశాడు.ప్రభుత్వం ఆఫర్ చేసిన ఉద్యోగం ఇదే కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్‌తో కలిసి మూడోస్థానంలో నిలిచిన ఈ హర్యానా అథ్లెట్.. తొలిసారి ఒలింపిక్ పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం అతడికి క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ పదవిని ఆఫర్ చేసింది.కారణం ఇదేఅయితే, సరబ్జోత్ సింగ్ మాత్రం ఇందుకు నో చెప్పాడు. ఒలింపిక్ పతకంతో స్వదేశానికి తిరిగి వచ్చిన 22 ఏళ్ల సరబ్జోత్ అంబాలాలో మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా... ‘‘ఇది మంచి ఉద్యోగమే. కానీ ఇప్పుడు దీనిని స్వీకరించలేను. షూటింగ్‌పైనే మరింతగా దృష్టి సారించాలనుకుంటున్నాను.నా కుటుంబం కూడా ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటోంది. అయితే, నేను షూటర్‌గానే కొనసాగాలని భావిస్తున్నాను. నా లక్ష్యాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను మార్చుకోలేను. అందుకే ప్రస్తుతం ఈ జాబ్ చేయలేను’’ అని సరబ్జోత్ సింగ్ తన మనసులో మాటను వెల్లడించాడు. కాగా రైతు కుటుంబంలో జన్మించిన సరబ్జోత్ ఎన్నో కష్టాలు దాటి షూటర్‌గా ఎదిగాడు. చదవండి: ఫుట్‌బాలర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే! షూటర్‌గా ఒలింపిక్ మెడల్ #WATCH | Ambala, Haryana: On Haryana government's offer of the post of Deputy Director in the Sports Department, Indian Shooter and Olympic Athlete Sarabjot Singh says, "The job is good but I will not do it right now. I want to work on my shooting first. My family has also been… pic.twitter.com/XU7d1QdYBj— ANI (@ANI) August 10, 2024 -
ప్యారిస్ ఒలింపిక్స్: నీతా అంబానీ సెల్ఫీల సందడి, వైరల్ వీడియో
రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. ముఖ్యంగా ఇటీవల లాంచ్ చేసిన ప్రతిష్టాత్మక ఇండియా హౌస్‌లో భారత ఒలింపిక్ షూటింగ్ బృందాన్ని సత్కరించారు. ప్రత్యేకంగా అభినందించారు. వారితో సెల్పీలకు ఫోజులిచ్చి సందడి చేశారు. భారతీయులందర్నీ గర్వంతో తల ఎత్తుకునేలా చేశారు! గో ఇండియా.. గో’ అంటూ వారిని ఉత్సాహ పరిచారు. మరిన్ని విజయాలు సాధించాలంటూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు విశ్వ క్రీడావేదికపై మనదేశాన్ని సగర్వంగా నిలిపిన కృషికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటికే రెండు పతకాలతో, మన షూటర్లు పారిస్‌లో త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరేసిన సంగతి తెలిసిందే. భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్, ఇండియా హౌస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. విమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్‌లోనూ మను కాంస్య పతకాన్నిసాధించి స్వాతంత్య్రం తర్వాత రెండు మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్‌గా చరిత్రకెక్కింది.Indian star shooter Sarabjot Singh gets heroic reception in India house 😍😍Manu Bhaker and Sarabjot Singh win Bronze 🥉 in the 10m air pistol mixed team event. #Sarabjot #Shooting #ManuBhaker #ParisOlympics2024 #Paris2024 #Paris2024Olympic #ParisOlympics pic.twitter.com/8oUs2x7PoK— India Olympics 2024 (@nnis_sports) July 30, 2024 -
మను మహరాణి
పారిస్ వేదికగా మంగళవారం భారత మహిళా షూటర్ మనూ భాకర్ కొత్త చరిత్రను లిఖించింది. గతంలో ఏ భారత ప్లేయర్‌కూ సాధ్యంకాని ఘనతను మనూ సాధించి చూపించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఈ హరియాణా అమ్మాయి అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మనూ భాకర్... మంగళవారం అదే వేదికపై సహచరుడు సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత ప్లేయర్‌గా ఆమె చరిత్రకెక్కింది. తాను పోటీపడ్డ రెండు ఈవెంట్లలోనూ పతకాలు నెగ్గిన మనూకు మూడో పతకం సాధించే అవకాశం కూడా ఉంది. ఆగస్టు 2న ఆమె 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో బరిలోకి దిగుతుంది. క్వాలిఫయింగ్‌లో రాణించి ఫైనల్‌కు చేరితే ఆగస్టు 3న మూడో పతకంపై మనూ గురి పెడుతుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత క్వాలిఫయింగ్‌లో త్రుటిలో ఫైనల్ స్థానాన్ని చేజార్చుకున్న సరబ్జోత్... మనూతో కలిసి ‘మిక్స్డ్’లో కాంస్యం నెగ్గి కెరీర్లోనే చిరస్మరణీయ ప్రదర్శన నమోదు చేశాడు.పారిస్: రెండు రోజుల క్రితం పతకం సాధించిన విశ్వాసంతో భారత మహిళా యువ షూటర్ మనూ భాకర్ మరోసారి అదరగొట్టింది. పూర్తి సంయమనంతో, చెక్కు చెదరని ఏకాగ్రతతో లక్ష్యం దిశగా బుల్లెట్లు సంధించిన మనూ ఈ క్రమంలో కొత్త చరిత్రలో భాగమైంది. స్వాతంత్య్రం వచ్చాక ఒలింపిక్స్ క్రీడల్లో ఏ భారతీయ క్రీడాకారుడు సాధించని ఘనతను మనూ అందుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా మనూ భాకర్ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్–సరబ్జోత్ సింగ్ (భారత్) జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో మనూ–సరబ్జోత్ ద్వయం 16–10 పాయింట్ల తేడాతో జిన్ ఓయె–లీ వన్హో (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో మనూ–సరబ్జోత్ 580 పాయింట్లతో మూడో స్థానంలో, జిన్ ఓయె–లీ వన్హో 579 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. తర్హాన్ సెవల్ ఇల్యాదా–యూసుఫ్ డికెచ్ (టర్కీ) జోడీ 582 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... జొరానా అరునోవిచ్–దామిర్ మికెచ్ (సెర్బియా) ద్వయం 581 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత పొందారు. మంగళవారం జరిగిన ఫైనల్లో జొరానా–దామిర్ ద్వయం 16–14తో తర్హాన్–యూసుఫ్ జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. తర్హాన్–యూసుఫ్ జోడీకి రజత పతకం లభించింది. 1900 పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో బ్రిటిష్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన నార్మన్ ప్రిచర్డ్ పురుషుల 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు. అయితే ఈ ఘనత భారత్‌కు స్వాతంత్య్రంరాక ముందు నమోదైంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో సౌరభ్ చౌదరీతో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో బరిలోకి దిగిన మనూ భాకర్ క్వాలిఫయింగ్‌లో ఏడో స్థానంలో నిలిచి మెడల్ రౌండ్‌కు అర్హత పొందలేకపోయింది. అయితే ఈసారి సరబ్‌జోత్‌తో జత కట్టిన మనూ క్వాలిఫయింగ్‌లోనే కాకుండా కాంస్య పతక మ్యాచ్‌లోనూ నిలకడగా స్కోరు చేసి తన ఖాతాలో రెండో పతకాన్ని వేసుకుంది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం క్వాలిఫయింగ్‌లో 577 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయిన బాధను మర్చిపోయి సరబ్జోత్ ‘మిక్స్డ్’ ఈవెంట్లో గురి తప్పని లక్ష్యంతో పాయింట్లు సాధించి తన ఒలింపిక్ పతకం కలను నిజం చేసుకున్నాడు. మిక్స్డ్ ఈవెంట్ పతక మ్యాచ్‌లో రెండు జోడీల్లో తొలుత 16 పాయింట్లు స్కోరు చేసిన జంటను విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో అవకాశంలో రెండు జట్లలోని ఇద్దరేసి షూటర్లు లక్ష్యం దిశగా రెండు షాట్ల చొప్పున సంధిస్తారు. రెండు జోడీల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జంటకు 2 పాయింట్లు, తక్కువ స్కోరు చేసిన జోడీకి 0 పాయింట్లు కేటాయిస్తారు. 13 సిరీస్లపాటు జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో తొలి సిరీస్‌లో కొరియా జోడీ నెగ్గగా... ఆ తర్వాత వరుసగా నాలుగు సిరీస్‌లలో భారత జంట గెలిచి 8–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆరో సిరీస్‌లో కొరియా ద్వయం... ఏడో సిరీస్‌లో భారత జోడీ పైచేయి సాధించాయి. ఎనిమిదో సిరీస్‌లో కొరియా గెలుపొందగా... తొమ్మిది, పది సిరీస్‌లను భారత జోడీ సొంతం చేసుకొని 14–6తో విజయానికి చేరువైంది. అయితే 11వ సిరీస్‌లో, 12వ సిరీస్‌లో కొరియా ద్వయం పైచేయి సాధించి ఆధిక్యాన్ని 10–14కి తగ్గించింది. అయితే 13వ సిరీస్‌లో మనూ–సరబ్జోత్ జోడీ 19.6 స్కోరు చేయగా... కొరియా జంట 18.5 స్కోరు సాధించింది. దాంతో భారత జంట మొదటగా 16 పాయింట్లను అందుకొని విజయంతోపాటు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. పతకం గెలవగానే నా మనసులో ఎన్నో చిన్ననాటి ఆలోచనలు వచ్చాయి. ఇన్నేళ్లుగా నాన్న, తాత నాకు అండగా నిలిచిన వైనం, తొలి రెండేళ్లు కోచింగ్ కోసం బస్సులో అంబాలాకు వెళ్లిన రోజులు గుర్తుకొచ్చాయి. ఈవెంట్‌కు ముందు రేంజ్‌లోకి అడుగు పెట్టే సమయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా. వ్యక్తిగత విభాగంలో వైఫల్యం తర్వాత నా కుటుంబసభ్యులు, కోచ్‌లు ఓదార్చి నాలో మళ్లీ స్ఫూర్తిని నింపారు. ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకునే ప్రయత్నం చేశాను. నా విజయంలో ఆరి్థకపరంగా అండగా నిలిచిన భారత ప్రభుత్వ పాత్ర కూడా ఎంతో ఉంది. –సరబ్జోత్ సింగ్ మనందరం గర్వపడే క్షణాలను మన షూటర్లు మళ్లీ అందించారు. మనూ, సరబ్‌జోత్‌లకు అభినందనలు. ఇద్దరూ చక్కటి ప్రదర్శన కనబర్చారు. భారత్ ఎంతో సంతోషిస్తోంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి వరుసగా రెండో ఒలింపిక్ పతకం సాధించడం మనూ భాకర్ నిలకడైన ప్రదర్శనను, అంకితభావాన్ని చూపిస్తోంది. కాంస్యం గెలిచిన మనూ, సరబ్‌జోత్‌లకు శుభాకాంక్షలు. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. –ద్రౌపది ముర్ము, రాష్ట్రపతిమనూ, సరబ్జోత్... గతంలో ఏ భారత జోడీ సాధించని ఘనతను మీరు అందుకున్నారు. షూటింగ్లో ఇది భారత్‌కు తొలి టీమ్ మెడల్. ఈ క్షణాలను ఆస్వాదించండి. –అభినవ్ బింద్రా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి మనూ, సరబ్జోత్ దేశం గర్వపడేలా చేశారు. ఇతర క్రీడాకారులకు మీ ప్రదర్శన స్ఫూర్తిగా నిలుస్తుంది. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం3 స్వాతంత్య్రం వచ్చాక ఒలింపిక్స్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన మూడో భారత ప్లేయర్ మనూ భాకర్. గతంలో రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్–కాంస్యం; 2012 లండన్–రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం) ఈ ఘనత సాధించారు.6 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన ఆరో భారతీయ షూటర్‌గా సరబ్జోత్ సింగ్ గుర్తింపు పొందాడు. గతంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (డబుల్ ట్రాప్; రజతం–2004 ఏథెన్స్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; స్వర్ణం–2008 బీజింగ్), విజయ్ కుమార్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్; రజతం–2012 లండన్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; కాంస్యం–2012 లండన్), మనూ భాకర్ (2024 పారిస్; 2 కాంస్యాలు) ఈ ఘనత సాధించారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుస్తానని నేను అనుకోలేదు. ఈ అనుభూతి కొత్తగా ఉంది. దేశం తరఫున సాధ్యమైనన్ని ఎక్కువ పతకాలు గెలవాలని కోరుకుంటా. టోక్యోలో వైఫల్యం చూశాను కాబట్టి ఆ పతకాల విలువ ఏమిటో నాకు ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతోంది. ప్రస్తుతానికి మరో మెడల్ సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నా. తర్వాతి ఈవెంట్లో ఎలా ఆడతానో చెప్పలేను. నా శాయశక్తులా ప్రయతి్నస్తా. ఒకవేళ విఫలమైతే అభిమానులు నిరాశపడరనే అనుకుంటున్నా. నాపై కురుస్తున్న ఈ ప్రేమాభిమానులు ఇలాగే కొనసాగాలి. –మనూ భాకర్ -
‘పిస్టల్’తో పంట పండించాడు!
‘కిసాన్ ద పుత్తర్ హై... దిల్ థోడా చడీ దా’... శనివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో త్రుటిలో ఫైనల్ చేరే అవకాశం కోల్పోయిన తర్వాత సరబ్‌జోత్‌తో అతని తండ్రి జతీందర్ సింగ్ చెప్పిన మాట ఇది. ‘రైతు బిడ్డవు నువ్వు...బేలగా మారిపోయి బాధపడవద్దు’ అంటూ నాన్న స్ఫూర్తి నింపే ప్రయత్నం చేయగా... సరిగ్గా మూడు రోజుల తర్వాత ఆ బిడ్డ మళ్లీ తన తుపాకీని లక్ష్యంపై సరిగ్గా గురి పెట్టాడు. ‘నా కొడుకు షూటింగ్‌ను చాలా ఇష్టపడ్డాడు. గత పదేళ్లుగా అందులో ఎంతో కష్టపడ్డాడు. గత ఈవెంట్లో ఫైనల్ అవకాశం కోల్పోయినప్పుడు అదే గుర్తు చేశాను. గతం మరిచి భవిష్యత్తుపై దృష్టి పెట్టమని చెప్పాను. ఆ నిరాశను దూరం చేసి అతను ఇప్పుడు ఒలింపిక్ పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది’ అని జతీందర్ సంతోషం వ్యక్తం చేశాడు. నాన్న అండతో... హరియాణా రాష్ట్రం అంబాలాలోని ధీన్ గ్రామం సరబ్జోత్ స్వస్థలం. ఐదు ఎకరాల వ్యవసాయదారుడు అయిన తండ్రి అక్కడి చాలా కుటుంబాలలాగే తన పెద్ద కొడుకు కూడా పొలంలో సహాయకారిగా ఉంటే చాలనుకున్నాడు. కానీ సరబ్జోత్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. స్థానికంగా జరిగిన వేసవి శిబిరంలో కొంత మంది కుర్రాళ్ల చేతుల్లో ఉన్న ఎయిర్ గన్స్ అతడిని ఆకర్షించాయి. కాగితాలపై చిత్రించిన లక్ష్యాలను వారు కొడుతున్న తీరు మరింత ఇష్టాన్ని పెంచింది. కొన్నాళ్లకు ఆ శిబిరం ముగిసిపోయినా... ఆ టీనేజర్ మనసులో పిస్టల్ ముద్రించుకుపోయింది. దాంతో ధైర్యం చేసుకొని 13 ఏళ్ల ఆ కుర్రాడు తాను షూటింగ్ నేర్చుకుంటానంటూ తండ్రితో చెప్పేశాడు. ముందుగా సందేహించినా...ఆ తర్వాత తండ్రి తనను అంబాలాలోని షూటింగ్ అకాడమీలో చేరి్పంచాడు. అక్కడ ఓనమాలు నేర్పించిన కోచ్ అభిషేక్ రాణా ఇప్పటి వరకు కూడా కోచ్‌గా ఉంటూ సరబ్జోత్ ఒలింపిక్ పతక ప్రస్థానంలో కీలకపాత్ర పోషించడం విశేషం. ఆ వయసులోనే పొలంలో కష్టం చేసే అలవాటు ఉన్న ఆ అబ్బాయి తనకు సూపర్ఫిట్గా అనిపించాడని, నిర్విరామంగా గంటలకొద్దీ కదలకుండా నిలబడి సాధన చేసేవాడని రాణా గుర్తు చేసుకున్నాడు. అలా మొదలై... 16 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో ఈ హరియాణా అబ్బాయి వెలుగులోకి వచ్చాడు. అప్పుడే అతను తన తండ్రి వద్ద తొలిసారి సొంతంగా కొత్త పిస్టల్ కొనివ్వమని అడిగే ధైర్యం చేశాడు. అదే సమయంలో నోట్లు రద్దు కారణంగా కొంత ఇబ్బందులు ఉన్నా... కొడుకు కోసం దాదాపు రూ. 2 లక్షలతో తండ్రి పిస్టల్ కొనిచ్చాడు. తనపై తండ్రి ఉంచిన నమ్మకాన్ని సరబ్జోత్ నిలబెట్టుకున్నాడు. తర్వాతి రెండేళ్ల పాటు ఆటలో మరింత రాటుదేలిన అతను 2019లో జర్మనీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో స్వర్ణం సాధించి అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని రుచి చూశాడు. అదే ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లలో 2 స్వర్ణాలు, ఒక కాంస్యం సరబ్‌ను భారత్ నుంచి మంచి భవిష్యత్తు ఉన్న పిస్టల్ షూటర్లలో ఒకడిగా మార్చింది. రెండేళ్ల తర్వాత పెరూలోని లిమాలో జరిగిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలతో అతను ఆకట్టుకున్నాడు. ఇదే జోరులో వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణ, రజతాలు సరబ్ ఖాతాలో చేరాయి. గత ఏడాది చాంగ్వాన్లో ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడే అతనిపై అంచనాలు పెరిగాయి. చివరకు అతను వాటిని నిలబెట్టుకున్నాడు. లక్ష్యం చేరిన బుల్లెట్... ‘నాకు వరల్డ్ కప్ విజయాలు అవసరం లేదు... వేరే ఇతర టోర్నీ ల్లో పతకాలు అవసరం లేదు... నాకు ఒలింపిక్స్ పతకం మాత్రమే కావాలి... గత ఎనిమిదేళ్లుగా నేను దీని గురించి కలగన్నాను... ఇప్పుడు నా గుండెల్లో ఒక రకమైన అగ్ని జ్వలిస్తోంది’... పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సరబ్జోత్ సింగ్ ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాట ఇది. శనివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో పోటీ పడినప్పుడు కూడా అతను అంతే ఉత్సాహంగా కనిపించాడు. క్వాలిఫయింగ్‌లో జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్‌తో కలిసి 577 పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అయితే 10 పాయింట్ల షాట్లు వాల్టర్కంటే ఒకటి తక్కువగా కొట్టడంతో అనూహ్యంగా ఫైనల్ చేరే అవకాశం చేజారింది. దాంతో ఆవేదనగా ని్రష్కమించిన అతను ఇప్పుడు మిక్స్‌డ్‌లో కాంస్యంతో ఆ భారం కాస్త దించుకున్నాడు. వేగంగా దూసుకెళ్లే కార్లు, పంజాబీ పాప్ సంగీతాన్ని ఇష్టపడే ఈ 23 ఏళ్ల షూటర్ తన ఇంట్లో, పరిసరాల్లో, సరదాగా ఆడే వీడియో గేమ్‌లపై కూడా ఒలింపిక్ రింగ్‌లను ఎల్ఈడీ లైట్లతో అలంకరించుకున్నాడు. వాటిని చూడగానే తన లక్ష్యం ఏమిటో, తాను పడిన శ్రమ ఏమిటో ఇవి పదే పదే గుర్తుకొస్తుందని, తన కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలను పెంచడం కోసం ఇలా చేసినట్లు అతను చెప్పుకున్నాడు. ఇప్పుడు ఒలింపిక్ పతకం గెలుచుకున్న క్షణాన ‘నేను ఎన్నో ఫాస్ట్ కార్లను అద్దెకు తీసుకొని నోయిడా సర్క్యూట్లో వేగంగా డ్రైవింగ్ చేశాను. ఇప్పుడు నా కోసం ఒకటి కొనుక్కుంటాను. అది ఎంతో వేగంగా దూసుకెళ్లాలంటే 3–4 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోవాలి’ అంటూ తన కోరికను అతను బయటపెట్టాడు. –సాక్షి క్రీడా విభాగం నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్టేబుల్ టెన్నిస్మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్: ఆకుల శ్రీజ X జియాన్ జెంగ్ (సింగపూర్) (మధ్యాహ్నం గం. 2:20 నుంచి).ఆర్చరీ మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: దీపిక X రీనా పర్నట్ (ఎస్తోనియా) (మధ్యాహ్నం గం. 3:56 నుంచి). పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: తరుణ్‌దీప్ రాయ్X టామ్ హాల్ (బ్రిటన్) (రాత్రి గం. 9:15 నుంచి). ఈక్వె్రస్టియన్ డ్రెసాజ్ వ్యక్తిగత గ్రాండ్ ప్రి: అనూష్ అగర్వల్లా (మధ్యా హ్నం గం. 1:30 నుంచి). బాక్సింగ్మహిళల 75 కేజీల ప్రిక్వార్టర్స్: లవ్లీనా బొర్గొహైన్ X సునీవా హాఫ్స్టడ్ (నార్వే) (మధ్యాహ్నం గం. 3:50 నుంచి). పురుషుల 71 కేజీల ప్రిక్వార్టర్స్: నిశాంత్ దేవ్ X జోస్ గాబ్రియల్ రోడ్రిగ్జ్ (ఈక్వెడార్) (అర్ధరాత్రి గం. 12:18 నుంచి). బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ గ్రూప్ లీగ్ మ్యాచ్: పీవీ సింధు X క్రిస్టిన్ కూబా (ఎస్తోనియా) (మధ్యాహ్నం గం. 12:50 నుంచి). పురుషుల సింగిల్స్ గ్రూప్ లీగ్ మ్యాచ్: లక్ష్యసేన్ X జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) (మధ్యాహ్నం గం. 1:40 నుంచి). పురుషుల సింగిల్స్ గ్రూప్ లీగ్ మ్యాచ్): హెచ్ఎస్ ప్రణయ్ ్ఠ డక్ పాట్ లీ (వియత్నాం) (రాత్రి గం. 11:00 నుంచి). షూటింగ్50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ పురుషుల క్వాలిఫికేషన్ రౌండ్: ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). మహిళల ట్రాప్ క్వాలిఫికేషన్ రౌండ్: శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). -
Olympics 2024: మనూ భాకర్- సరబ్జోత్ సింగ్‌లకు వైఎస్ జగన్ అభినందనలు
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన భారత ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ జోడీ మనూ భాకర్- సరబ్జోత్ సింగ్‌లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు.‘ఒలింపిక్స్ ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల మిక్స్డ్ ఈవెంట్ లో మనూ భాకర్- సరబ్జోత్ సింగ్‌లు కాంస్యం గెలిచి భారతదేశ కీర్తిని మరింత పెంచారు’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Team India makes the nation proud yet again at the 2024 Olympics! @realmanubhaker and Sarabjot Singh bring home the bronze in the 10m air pistol mixed team event. #IndiaAtOlympics pic.twitter.com/MQQI792J1q— YS Jagan Mohan Reddy (@ysjagan) July 30, 2024 కాగా, ఒలింపిక్స్-2024లో భారత్ రెండో పతకం సాధించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్ జోడీ మనూ భాకర్- సరబ్జోత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్ మెడల్ అందించారు.దక్షిణ కొరియా జోడీ(జిన్ ఓయె–లీ వన్హో)ని 16-10తో ఓడించి పతకం సాధించారు. ఈ క్రమంలో మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్‌గా నిలిచింది. కాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఆమె కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. -
ఫుట్‌బాలర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే! షూటర్‌గా ఒలింపిక్ మెడల్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత యువ షూటర్ సరబ్జోత్ సింగ్ సత్తాచాటాడు. సరబ్జోత్ 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మను భాకర్‌తో కలిసి కాంస్య పతకాన్ని భారత్‌కు అందించాడు. మూడు రోజుల క్రితం పురుషుల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో తృటిలో ఫైనల్‌కు చేరే ఛాన్స్ కోల్పోయిన సరబ్జోత్.. మిక్స్డ్ ఈవెంట్లో మాత్రం తన గురితప్పలేదు. విశ్వవేదికపై మను భాకర్‌తో కలిసి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. దీంతో దేశవ్యాప్తంగా సరబ్జోత్ సింగ్ పేరు మారుమ్రోగుతోంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం అందించిన సరబ్జోత్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఎవరీ సరబ్జోత్ సింగ్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ సరబ్జోత్ సింగ్.. ?22 ఏళ్ల సరబ్జోత్ సింగ్ హర్యానా రాష్ట్రం అంబాలాలోని ధీన్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. సరబ్జోత్ తన చిన్నతనంలో ఫుట్‌బాలర్ కావాలని కలలు కన్నాడు. ఆ విధంగానే ముందుకు అడుగులు వేశాడు. కానీ తన 13 ఏళ్ల వయస్స్సులో ఒక రోజు స్కూల్ సమ్మర్ క్యాంప్‌లో కొంత మంది పిల్లలు ఎయిర్ గన్లతో తాత్కాలిక రేంజ్లో టార్గెట్‌ను గురిపెట్టడం సరబ్జోత్ చూశాడు.ఆ దృశ్యం(షూటింగ్) అతడిని ఎంతో గానో ఆకట్టుకుంది. దీంతో సరబ్జోత్ కూడా షూటర్ కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి జతీందర్ సింగ్ కూడా సరబ్‌జోత్‌కు మద్దతుగా నిలిచాడు. సరబ్జోత్ చండీగఢ్‌లోని డీఏవీ కాలేజీలో చదువును కొనసాగిస్తూ కోచ్ అభిషేక్ రాణా దగ్గర శిక్షణ పొందాడు. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం వంటి స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలు కూడా అతడు షూటర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించాయి. 2019లో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించడం సరబ్జోత్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఆ తర్వాత సరబ్జోత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ఏకంగా విశ్వక్రీడల్లో కూడా తన తుపాకీ పవర్‌ను సరబ్జోత్ చూపించాడు.సరబ్జోత్ సింగ్ సాధించిన విజయాలు ఇవే..2023 ఆసియా ఛాంపియన్షిప్, కొరియా: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం, (ఒలింపిక్ కోటా)2023 ప్రపంచ కప్, భోపాల్: వ్యక్తిగత ఈవెంట్లో బంగారు పతకం2023 ప్రపంచ కప్, బాకు: మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం2022 ఆసియా క్రీడలు: టీమ్ ఈవెంట్లో బంగారు పతకం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజత పతకం2022 జూనియర్ ప్రపంచ కప్, సుహ్ల్: టీమ్ ఈవెంట్లో బంగారు పతకం, వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో రజత పతకాలు2021 జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్, లిమా: టీమ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు2019 జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్