ఒలింపిక్ పతక విజేత, షూటర్ సరబ్‌జోత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హర్యానా ప్రభుత్వం ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని తాను స్వీకరించలేనన్నాడు. తన దృష్టి మొత్తం షూటింగ్‌పైనే కేంద్రీకృతమై.. ఉందని అందుకే ఈ ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపాడు. తాను ముందే కొన్ని కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నానని.. వాటికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశాడు.
ప్రభుత్వం ఆఫర్ చేసిన ఉద్యోగం ఇదే
కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో సరబ్‌జోత్ సింగ్ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్‌తో కలిసి మూడోస్థానంలో నిలిచిన ఈ హర్యానా అథ్లెట్.. తొలిసారి ఒలింపిక్ పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం అతడికి క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ పదవిని ఆఫర్ చేసింది.
కారణం ఇదే
అయితే, సరబ్‌జోత్ సింగ్ మాత్రం ఇందుకు నో చెప్పాడు. ఒలింపిక్ పతకంతో స్వదేశానికి తిరిగి వచ్చిన 22 ఏళ్ల సరబ్‌జోత్ అంబాలాలో మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా... ‘‘ఇది మంచి ఉద్యోగమే. కానీ ఇప్పుడు దీనిని స్వీకరించలేను. షూటింగ్‌పైనే మరింతగా దృష్టి సారించాలనుకుంటున్నాను.
నా కుటుంబం కూడా ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటోంది. అయితే, నేను షూటర్‌గానే కొనసాగాలని భావిస్తున్నాను. నా లక్ష్యాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను మార్చుకోలేను. అందుకే ప్రస్తుతం ఈ జాబ్ చేయలేను’’ అని సరబ్‌జోత్ సింగ్ తన మనసులో మాటను వెల్లడించాడు. కాగా రైతు కుటుంబంలో జన్మించిన సరబ్‌జోత్ ఎన్నో కష్టాలు దాటి షూటర్‌గా ఎదిగాడు.
చదవండి: ఫుట్‌బాలర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే! షూటర్‌గా ఒలింపిక్ మెడల్
#WATCH | Ambala, Haryana: On Haryana government's offer of the post of Deputy Director in the Sports Department, Indian Shooter and Olympic Athlete Sarabjot Singh says, "The job is good but I will not do it right now. I want to work on my shooting first. My family has also been… pic.twitter.com/XU7d1QdYBj
— ANI (@ANI) August 10, 2024
Comments
Please login to add a commentAdd a comment