రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. ముఖ్యంగా ఇటీవల లాంచ్ చేసిన ప్రతిష్టాత్మక ఇండియా హౌస్‌లో భారత ఒలింపిక్ షూటింగ్ బృందాన్ని సత్కరించారు. ప్రత్యేకంగా అభినందించారు. వారితో సెల్పీలకు ఫోజులిచ్చి సందడి చేశారు. భారతీయులందర్నీ గర్వంతో తల ఎత్తుకునేలా చేశారు! గో ఇండియా.. గో’ అంటూ వారిని ఉత్సాహ పరిచారు. మరిన్ని విజయాలు సాధించాలంటూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు విశ్వ క్రీడావేదికపై మనదేశాన్ని సగర్వంగా నిలిపిన కృషికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే రెండు పతకాలతో, మన షూటర్లు పారిస్‌లో త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరేసిన సంగతి తెలిసిందే. భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్, ఇండియా హౌస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. విమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్‌లోనూ మను కాంస్య పతకాన్నిసాధించి స్వాతంత్య్రం తర్వాత రెండు మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్‌గా చరిత్రకెక్కింది.
Indian star shooter Sarabjot Singh gets heroic reception in India house 😍😍
Manu Bhaker and Sarabjot Singh win Bronze 🥉 in the 10m air pistol mixed team event. #Sarabjot #Shooting #ManuBhaker #ParisOlympics2024 #Paris2024 #Paris2024Olympic #ParisOlympics pic.twitter.com/8oUs2x7PoK— India Olympics 2024 (@nnis_sports) July 30, 2024
Comments
Please login to add a commentAdd a comment