Paris Olympics : మను భాకర్‌పై నీతా అంబానీ ప్రశంసలు, సన్మానం | Paris Olympics Nita Ambani felicitates Manu Bhaker Kusale at India House | Sakshi
Sakshi News home page

ప్యారిస్‌ ఒలింపిక్స్‌: మను భాకర్‌పై నీతా అంబానీ ప్రశంసలు, సన్మానం

Published Wed, Aug 7 2024 10:56 AM | Last Updated on Wed, Aug 7 2024 12:14 PM

Paris Olympics Nita Ambani felicitates Manu Bhaker Kusale at India House

ఐవోసీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ  ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల కృషిని  అభినందిస్తూ మంగళవారం పారిస్‌లోని ఇండియన్ హౌస్‌లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఒలింపిక్ గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు మను.

ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన యువషూటర్ మను భాకర్‌ను  నీతా అంబానీ ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకి కృషికి, విజయాలను సెలబ్రేట్‌ చేస్తూ ఆమెను  సన్మానించారు. మను భాకర్‌తో పాటు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన స్వప్నిల్ కుశాలేను కూడా సత్కరించారు. ఫ్రాన్స్‌ ఒలింపిక్‌ ఈవెంట్‌లో అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సమున్నతంగా నిలిపిన అథ్లెట్లను అంబానీ అభినందించారు.   టోక్యో ఆటల తర్వాత, మను  చెప్పినట్టుగా అందరూ మన ప్రాచీన గ్రంథం గీతాసారాన్ని, గీత బోధను అనుసరించాలని  'మీ వంతు కృషి చేయండి , మిగిలిన వాటిని భగవంతుడికి వదిలివేయండి’’ అంటూ క్రీడాకారులకు  నీతా సూచించారు.

ఈ ఒలింపిక్స్‌లో మన షూటింగ్ టీమ్ అత్యుత్తమ ఫామ్‌లో ఉందంటూ నీతా అంబానీ పేర్కొన్నారు.  షట్లర్ లక్ష్య సేన్, షూటర్లు విజయవీర్ సింగ్ సిద్ధూ, మహేశ్వరి చౌహాన్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, సిఫ్ట్ కౌర్ సమ్రా, ఈషా సింగ్, రైజా ధిల్లాన్, అనీష్ బన్వాలా, బాక్సర్ నిషాంత్ దేవ్, షాట్ పుట్ అథ్లెట్ తాజిందర్‌పాల్ సింగ్ టూర్, అథ్లెట్ జెస్విన్ ఆల్డ్రిన్ శాలువాలతో సత్కరించారు.నిలకడగా ఆడి మలేషియాకు చెందిన జియ్ జియా లీపై కాంస్య పతకాన్ని సాధించి ఒలంపిక్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచిన షట్లర్ లక్ష్య సేన్‌ను కూడా అభినందించారు. తకాలు,రికార్డులకు అతీతంగా వ్యక్తిత్వం, పట్టుదల, కఠోర శ్రమ, ఓటమినిఎదిరించే సామర్థ్యంతో  మనం అందరం  జరుపుకునే విశ్వ క్రీడా  వేడుక అని నీతా అంబానీ అన్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement