lauds
-
Paris Olympics : మను భాకర్‌పై నీతా అంబానీ ప్రశంసలు, సన్మానం
ఐవోసీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల కృషిని అభినందిస్తూ మంగళవారం పారిస్‌లోని ఇండియన్ హౌస్‌లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఒలింపిక్ గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు మను.ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన యువషూటర్ మను భాకర్‌ను నీతా అంబానీ ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకి కృషికి, విజయాలను సెలబ్రేట్ చేస్తూ ఆమెను సన్మానించారు. మను భాకర్‌తో పాటు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో కాంస్యం సాధించిన స్వప్నిల్ కుశాలేను కూడా సత్కరించారు. ఫ్రాన్స్ ఒలింపిక్ ఈవెంట్లో అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సమున్నతంగా నిలిపిన అథ్లెట్లను అంబానీ అభినందించారు. టోక్యో ఆటల తర్వాత, మను చెప్పినట్టుగా అందరూ మన ప్రాచీన గ్రంథం గీతాసారాన్ని, గీత బోధను అనుసరించాలని 'మీ వంతు కృషి చేయండి , మిగిలిన వాటిని భగవంతుడికి వదిలివేయండి’’ అంటూ క్రీడాకారులకు నీతా సూచించారు.ఈ ఒలింపిక్స్‌లో మన షూటింగ్ టీమ్ అత్యుత్తమ ఫామ్‌లో ఉందంటూ నీతా అంబానీ పేర్కొన్నారు. షట్లర్ లక్ష్య సేన్, షూటర్లు విజయవీర్ సింగ్ సిద్ధూ, మహేశ్వరి చౌహాన్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, సిఫ్ట్ కౌర్ సమ్రా, ఈషా సింగ్, రైజా ధిల్లాన్, అనీష్ బన్వాలా, బాక్సర్ నిషాంత్ దేవ్, షాట్ పుట్ అథ్లెట్ తాజిందర్‌పాల్ సింగ్ టూర్, అథ్లెట్ జెస్విన్ ఆల్డ్రిన్ శాలువాలతో సత్కరించారు.నిలకడగా ఆడి మలేషియాకు చెందిన జియ్ జియా లీపై కాంస్య పతకాన్ని సాధించి ఒలంపిక్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచిన షట్లర్ లక్ష్య సేన్‌ను కూడా అభినందించారు. తకాలు,రికార్డులకు అతీతంగా వ్యక్తిత్వం, పట్టుదల, కఠోర శ్రమ, ఓటమినిఎదిరించే సామర్థ్యంతో మనం అందరం జరుపుకునే విశ్వ క్రీడా వేడుక అని నీతా అంబానీ అన్నారు. Mrs. Nita Ambani felicitates ace shooters, Manu Bhaker and Swapnil Kusale, as she honours all our athletes at India House, “Every Indian feels inspired and every girl in India feels empowered by Manu’s achievements. Swapnil’s historic success has made all of us proud. Our… pic.twitter.com/chBG0jrwBr— Pankaj Upadhyay (@pankaju17) August 7, 2024 -
కమెడియన్ శ్రద్ధా జైన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
శ్రద్ధగా నవ్విస్తుంది! శ్రద్ధా జైన్.‘శ్రద్ధా జైన్ తెలుసా?’ అని అడిగితే – ‘తెలుసు’ అని చెప్పేవారి సంఖ్య తక్కువ కావచ్చుగానీ– ‘అయ్యో శ్రద్ధా తెలుసా’ అంటే ‘అయ్యో... తెలియకపోవడం ఏమిటి!’ అనే వాళ్ల సంఖ్య ఎక్కువే. బెంగళూరుకు చెందిన శ్రద్ధా జైన్ అలియాస్ ‘అయ్యో శ్రద్ధా’ ‘ఇంటర్నెట్ సెన్సేషన్’గా పేరు తెచ్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇటీవల ‘నేషనల్ క్రియేటర్స్’ అవార్డ్ అందుకుంది హాయిగా నవ్వించే వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది శ్రద్ధా జైన్. తులు, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషలలో ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. 2016లో కర్నాటకాలో జరిగిన ఒక ఫెస్టివల్‌కు సంబంధించి ఫేస్బుక్ వీడియోను పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఈ వీడియో శ్రద్ధాకు వీర లెవెల్లో పేరు తెచ్చింది. ఒక డ్యాన్స్ రియాల్టీ షోకు హోస్ట్‌గా, కొన్ని టీవీ కార్యక్రమాలకు క్రియేటివ్ డైరెక్టర్‌గా అవకాశాలు తెచ్చింది. ఇక కామేడీ షోల సంగతి సరే సరి. కామెడీ డ్రామా సిరీస్ ‘పుష్పవల్లి’తో శ్రద్ధ పేరు హాస్యాభిమానుల అభిమాన పేరు అయింది. పెద్ద బ్రాండ్స్‌తో కలిసి పనిచేసిన శ్రద్ధ ఇలా అంటుంది... ‘కంటెంట్‌లో వెరైటీ ఉండేలా ప్రయత్నించేదాన్ని. ప్రేక్షకుల సంగతి ఏమిటోగానీ కంటెంట్‌లో వెరైటీ లేకపోతే ముందు నాకే బోర్ కొడుతుంది. అది ఎంత పెద్ద హిట్ అయినా సరే ఒకే అంశాన్ని పదేపదే చేయలేను. రియల్ ఎస్టేట్ రంగంలోకి ఉన్న వారికి ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్సర్‌ను ఎంపిక చేసుకోవాలో తెలియదు. నేను సృష్టించిన రీనా దలాల్ క్యారెక్టర్‌ను చూసిన తరువాత... రీనా క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనుకున్నారు. మొదట్లో రియల్ ఎస్టేట్ కోసం కంటెంట్ క్రియేట్ చేసిన అతి కొద్దిమందిలో నేను ఒకరిని’ అంటుంది శ్రద్ధ. ఏ బ్రాండ్ వారు వచ్చినా తమది ఏ బ్రాండ్ అనేది మాత్రమే చెబుతారు. వారికి ‘ఐడియా’ గురించి బొత్తిగా ఐడియా ఉండదు. ఈ నేపథ్యంలో ఐడియా జెనరేట్ చేయడం నుంచి స్క్రీన్‌ప్లే వరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అన్ని విద్యల్లో ఆరితేరింది శ్రద్ధ.పని పట్టాలెక్కడానికి అట్టే టైమ్ పట్టదు. కాన్సెప్ట్ డిస్కషన్ మీటింగ్ తరువాత పని పరుగులు తీస్తుంది. సాధారణంగా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఫిక్స్డ్ స్టైల్‌కే పరిమితం అవుతారు. అది దాటి బయటికి రావడాన్ని రిస్క్ అనుకుంటారు. అయితే ఎప్పటికప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ ‘ఫిక్స్డ్ స్టైల్’ అనేది లేకుండా జాగ్రత్త పడింది శ్రద్ధ. రేడియా జాకీ, డ్యాన్స్ షో హోస్ట్, కమెడియన్, రైటర్, అయిదు లక్షల ఫాలోవర్లు ఉన్న ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్... ఇలా శ్రద్ధా జైన్ సృజనాత్మక రూ΄ాలు ఎన్నో ఉన్నాయి. ‘డాక్టర్ జీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది. ‘నా నటన, రచనలకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు ద్వారా ఏదైనా సౌత్ ఫిల్మ్‌లో నటించే అవకాశం వస్తుంది అనుకున్నాను. అయితే ఏకంగా బాలీవుడ్ నుంచే పిలుపు రావడం ఆనందంగా అనిపించింది’ అంటున్న శ్రద్ధ పోస్ట్–గ్రాడ్యుయేట్ స్టూడెంట్‌గా నటించింది. ‘పెర్ఫర్మర్, కంటెంట్ క్రియేటర్లకు ఇది మంచి టైమ్. ఏమాత్రం టాలెంట్ ఉన్నా మన స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది’ అంటుంది -
ఐపీఎల్ విక్టరీ: ఈ మిరాకిల్ నీకే సాధ్యం,చెన్నైకి రా సెలబ్రేట్ చేసుకుందాం!
సాక్షి,ముంబై: ఐపీఎల్ 2023 టైటిల్ గెల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఫ్రాంచైజీ ఓనర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ప్రశంసలు కురిపించారు. ఈ అద్భుతం లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మాత్రమే సాధ్యమంటూ కితాబిచ్చారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి జట్టును ఆయన అభినందించారు. ఈ మేరకు మంగళవారు ఉదయం ఆయన ధోనితో మాట్లాడారు. “అద్భుతమైన కెప్టెన్ మీరు. అద్భుతం చేసారు. మీరు మాత్రమే చేయగలరు. మీ టీంని చూసి గర్విస్తున్నాను అంటూ ఆయన ధోనీని అభినందనల్లో ముంచెత్తారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ ) అంతేకాదు గత కొన్ని రోజులుగా బ్యాక్-టు-బ్యాక్ షెడ్యూల్‌తో అలిసిపోయారు.. విశ్రాంతి తీసుకోండి అంటూ ధోనీకి సలహా ఇచ్చారు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు జట్టుతో పాటు చెన్నైకి రావాలని కూడా ఆయన ఆహ్వానించారు. (ఐపీఎల్ చాంపియన్ సీఎస్కే ఓనరు, నికర విలువ ఎంత? విషయాలు తెలుసా?) Mr N Srinivasan, former Chairman of the ICC, former President of BCCI and TNCA, Mrs. Chitra Srinivasan and Mrs Rupa Gurunath present @msdhoni with a special memento commemorating the very special 200th 👏#TATAIPL | #CSKvRR | @ChennaiIPL pic.twitter.com/nixs6qsq2P — IndianPremierLeague (@IPL) April 12, 2023 మరిన్ని బిజినెస్ వార్తల కోసం సాక్షిబిజినెస్ -
NMACC: ప్రశంసలు: నీతా ‘షో’ కు కదిలిపోయిన ఆనంద్ మహీంద్ర
సాక్షి: ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ప్రారంభించిన డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) ఎం అండ్ ఎం అధినేత బిలియనీర్ ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్' షోపై తన అనుభవాన్ని ట్విటర్లో షేర్ చేశారు. మ్యూజికల్ షో కథనం తన హృదయాన్ని కదిలించిందనీ, ముఖ్యంగా నీతా అంబానీ రఘుపతి రాఘవ రాజా రామ్‌కి పాటతో పూజ్య బాపూజీని గుర్తు చేశారంటూ అభినందించారు. (NMACC: నీతా అంబానీ అద్భుతమైన డ్యాన్స్, మీరూ ఫిదా అవ్వాల్సిందే!) వరుస ట్వీట్లలో ఈ సందర్భంగా తన సంతోషాన్నిపంచుకున్న ఆనంద్ మహీంద్ర అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించినందుకు ముఖేశ్, నీతా అంబానీలకు ధన్యవాదాలు తెలిపారు. థియేటర్ డైరెక్టర్ ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. లైట్ అండ్ సౌండ్ అద్భుతం. హృదయాన్ని కదిలించే ఈ షోను తనఇద్దరు మనవళ్లు ఈ ప్రదర్శన చూసి, దీని గొప్పతనాన్ని గ్రహించాలని కోరుకోంటున్నా అంటూ ట్వీట్ చేశారు. (నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్ ) కాగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నడిబొడ్డునున్న జియో వరల్డ్ సెంటర్లో అట్టహాసంగా నిర్వహించిన ఎన్ఎంఏసీసీ గ్రాండ్ ఓపెనింగ్‌కు బిలియనీర్ ఆనంద్ మహీంద్రా భార్య అనురాధతో సహా హాజరయ్యారు. బ్లాక్ జోధ్‌పురి సూట్లో ఆనంద్మహీంద్రా, పూల జరీ వర్క్ సాల్మన్ పింక్ చీరలో భార్య అనూరాధ క్లాసీగా స్పెషల్‌గా కనిపించారు. But more than the spectacle, it is the narrative that stirs the heart. My dominant sentiment was of wanting my two grandsons to see the show & grasp the richness of their Indian heritage. Thank you #NitaAmbani & #MukeshAmbani for this show & for a performance platform second to… pic.twitter.com/PzpKwvUgKz — anand mahindra (@anandmahindra) April 1, 2023 Last night, the #NMACC was launched in Mumbai with the staging of “The Great Indian Musical: Civilization to Nation.” A tour de force conceived by Feroz Abbas Khan. It’s a spectacular panorama of India’s cultural & political history. The light, sound, colour & movement are… pic.twitter.com/ZDknbbwbxY — anand mahindra (@anandmahindra) April 1, 2023 our desi celebs showed up at nmacc event & rocked like no one else 🫶🏼 pic.twitter.com/H45tvMkmvo — anushka. (@softiealiaa) April 1, 2023 -
ఆర్ఆర్ఆర్ మేనియా: రామ్ చరణ్‌పై ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్!
సాక్షి,ముంబై: పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం ఆనంద్‌మహీంద్ర ఆర్ఆర్ఆర్ ప్రభంజనంపై స్పందించారు.సోషల్ మీడియాలో ఎపుడూ తరచుగా ఉండే ఆయన తాజాగా టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. మెగా పవర్ స్టార్‌ను గ్లోబల్ స్టార్ అంటూ కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. గుడ్ మార్నింగ్ అమెరికా అనే పాపులర్ టీవీ షోలో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా అందరూ పొగిడేస్తున్నారు. దీంతో ఆనంద్ మహీంద్రా కూడా ట్వీట్ చేశారు. గుడ్ మార్నింగ్ అమెరికా సోషల్ మీడియా పోస్టును రీట్వీట్ చేసిన ఆయన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ కొనియాడటం విశేషం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ అంతర్జాతీయ పలు అవార్డులతో ప్రపంచ ఖ్యాతిని దక్కించుకుంటోంది.దీంతో ఆ మూవీ హీరో జూఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా జేమ్స్ కామెరాన్ వంటి దర్శక దిగ్గజం రామ్ చరణ్ నటనను ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ ప్రెజెంటర్‌గా రామ్ చరణ్ బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును ప్రకటించారు. అలాగే ఈ మూవీ సినిమా ఏకంగా నాలుగు అవార్డులను అందుకుంది. బెస్ట్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డులు అందుకుంది. గతంలో హెచ్‌సీఏ స్పాట్ లైట్ అవార్డును కూడా ప్రకటించడంతో, మొత్తం ఐదు అవార్డులను ఈ మూవీ దక్కించుకుంది. కాగా మార్చ్ 12న జరిగే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం ఇప్పటికీ చిత్రబృందం అమెరికా చేరుకుంది. అంతేకాదు మార్చ్ 16న ప్రకటించ నున్న క్రిటిక్స్ సూపర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు అవార్డుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ అయ్యారు. దీనిపై రామ్‌చరణ్ ట్వీట్ చేశారు కూడా. This man is a Global Star. Period. #NaatuNaatu @AlwaysRamCharan https://t.co/JcanE3OJmq — anand mahindra (@anandmahindra) February 25, 2023 Delighted to see my brother @tarak9999 ‘s and my name on the nominees list of Best Actor in an Action Movie. What a beautiful feeling to see our names next to legends like Nicolas Cage, Tom Cruise and Brad Pitt! https://t.co/FVVPx1lm9i — Ram Charan (@AlwaysRamCharan) February 25, 2023 -
ఈ కార్పొరేట్ దిగ్గజాలకు నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై : వాళ్లిద్దరూ ప్రముఖ పారిశ్రామికవేత్తలు. వృత్తిపరంగా ప్రత్యర్థులైన ఈ కార్పొరేట్ దిగ్గజాలు వ్యక్తులుగా మంచి స్నేహితులు కూడా. తాజాగా అంతకుమించి తమ మర్యాద పూర్వక ప్రవర్తనతో పలువురికి స్పూర్తిగా నిలిచారు. ఒకరు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ స్వామి(73) కాగా, మరొకరు టాటా అధినేత రతన్ టాటా (82). మొన్న టాటా ఫోటోకు నెటిజన్లు ఫిదా అవ్వగా, కార్పొరేట్ గవర్నెన్స్‌కు ప్రాణమిచ్చే ఇన్ఫీ నారాయణ మూర్తి ఫోటోలు తాజాగా వైరలవుతున్నాయి. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు జనవరి 28 న జరిగిన ట్రైకాన్ ముంబై 2020, 11వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రతన్‌టాటాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించిన వెంటనే తన కంటే వయసులో పెద్దవారైన టాటాకు నారాయణ మూర్తి ఆయనకు పాదాభివందనం చేశారు. గొప్ప స్నేహితుడైన నారాయణ మూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలను, వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు రతన్ టాటా. దీంతో నారాయణమూర్తి మరోసారి నెటిజన్ల ప్రశంసలను అందుకుంటున్నారు. రతన్ టాటాకు పాదాభివందనం చేసి నారాయణమూర్తి తన విధేయతను చాటుకున్నారని కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పలువురిని అబ్బుర పరుస్తున్నాయి. రెండు అతిపెద్ద ప్రత్యర్థి సంస్థలు, ఇద్దరు అత్యంత వినయపూర్వకమైన వ్యాపారవేత్తలు, ముఖ్యంగా నారాయణ మూర్తి రతన్ టాటా పాదాలను తాకడం అపూర్వం. ఇంటర్నెట్లో ఇది ఉత్తమమైందంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. టాటా ఆశీర్వాదం కోసం ఆయన పాదాలను తాకడం నారాణమూర్తి వ్యక్తిత్వానికి నిదర్శనమని మరొకరు ట్వీట్ చేశారు. పిల్లల్లో ఇలాంటి గొప్ప సంస్కృతిని జీర్ణింప చేయాల్సిన అవసరం చాలా వుందని ఒక తండ్రిగా తాను భావిస్తున్నానన్నారు. కాగా ఇటీవల రతన్ టాటా తాను యువకుడిగా ఉన్నప్పటి అద్భుతమైన ఫోటోను షేర్ చేసి పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. Life Time Achievement Award to Ratan Tata and Narayana Murthy took Tata's blessings. #RatanTata @RNTata2000 @Infosys_nmurthy #business #WednesdayThoughts #Respect pic.twitter.com/f0NG5TpDeM — Shubham Choudhary (@shub_lakku) January 29, 2020 This picture defines all about humbleness and simplicity, Mr. N R Narayana Murthy touching Mr. Ratan Tata’s feet to seek his blessings. A lesson for all of us. 🙏 #TiEConMumbai2020 #inspirational #RatanTata #NarayanaMurthy pic.twitter.com/NfnGpv4H04 — Arisudan Tiwari (@Arisudan29) January 29, 2020 Two biggest rival company, two most humble businessman. Narayana Murthy touching feet of Ratan Tata is best thing on internet, today. pic.twitter.com/OAjjE6gzba — That Indian girl (@thtsal) January 29, 2020 -
బిల్ గేట్స్‌కే ప్రేరణనిస్తున్న మహాదాత ఎవరో తెలుసా?
సమాజ సేవకు, ముఖ్యంగా విద్యకు భారీగా నిధులను కేటాయించే విప్రో ఛైర్మన్, ఇండియన్ బిలియనీర్ అజీమ్ ప్రేమ్‌జీ తన ఉదారతతో ప్రపంచ దాతలను సైతం ఆకర్షిస్తున్నారు. తాజాగా ప్రపంచ కుబేరుడు, మహాదాత, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. సమాజానికి ప్రేమ్‌జీ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమైనవని వ్యాఖ్యానించారు. సామాజిక వేదిక ట్విటర్ ద్వారా బిల్‌గేట్స్ తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. అజీమ్ ప్రేమ్‌జి తాజా వితరణ తనకు ఎంతో ఉత్సాహానిచ్చిందని పేర్కొన్నారు. ఇది అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ముఖ్యంగా సమాజానికి ప్రేమ్‌జీ అందిస్తున్న స్వచ్ఛంద సహకారం, దాతృత్వం, చూపిస్తున్న నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతలకు ప్రేరణనిస్తుందని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. కాగా విప్రోలోనితన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు కేటాయించినట్టు ఇటీవల అజీమ్ ప్రేమ్‌జీ ప్రకటించారు. రూ.52,700 కోట్లను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు అందించారు. దీంతో ప్రేమ్‌జీ అందించిన విరాళం విలువ మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (21 బిలియన్ డాలర్లు) చేరిన సంగతి తెలిసిందే. చదవండి: సంచలనం : వేల కోట్ల రూపాయల విరాళం I’m inspired by Azim Premji’s continued commitment to philanthropy. His latest contribution will make a tremendous impact. https://t.co/IOTiHxtivw — Bill Gates (@BillGates) March 24, 2019 -
టిమ్ కుక్ ప్రేమలో పడిపోయారట!
న్యూఢిల్లీ: యాపిల్ సీఈవో టిమ్ కుక్ హైదరాబాద్ ప్రేమలో పోయాడట. ఇక్కడి కల్చర్, హిస్టరీ తనను బాగా ఆకట్టుకుందన్నారు. ముఖ్యంగా జి నారాయణమ్మ మహిళా కాలేజీ విద్యార్థినిల ప్రతిభా పాటవాలపై ప్రశంసలు కురిపించారు. ఆ విద్యార్థినులను కలవడం తనకు చాలా షంతోషాన్ని పంచిందన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. హైదరాబాదీయుల ప్రతిభకు ముగ్ధుడైపోయిన కుక్ తన ఆనందాన్ని శుక్రవారం ఆ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతోపాటుగా ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశారు. జి నారాయణమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా ఇన్స్టిట్యూట్ ను సందర్శించిన ఆయన హైదరాబాద్ సంస్కృతి, చరిత్రకు ముగ్ధుడినయ్యానని ఇప్పటికే నగరం ప్రేమలో పడిపోయానని వ్యాఖ్యానించారు. జీఎన్ఐటీఎస్ మహిళా కళాశాలని కొత్త మ్యాక్ ల్యాబ్ దగ్గర అత్యుత్తమ ప్రతిభ , ఉత్సాహం ఉందని ట్విట్టర్ లో తెలిపారు. మిమ్మల్ని చూసి చాలా ఆనందించానని కుక్ ట్విట్ చేశారు. గురువారం కాలేజీని సందర్శించిన కుక్ అక్కడ కంప్యూటర్ సెంటర్ ని ప్రారంభించారు. అలాగే ఆపిల్ విద్యార్ధులకు శిక్షణ కు సంబంధించిన ఒక అవగాహనా పత్రంపై సంతకం చేశారు . కాగా భారతదేశంలో రెండో రోజు పర్యటనలో భాగంగా నిన్న హైదరాబాద్ వచ్చిన యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇక్కడ యాపిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించారు. దీని ద్వారా భవిష్యత్తులో నాలుగువేలమంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. Lots of talent and enthusiasm at the new Mac Lab at GNITS women’s college. Enjoyed visiting you yesterday! pic.twitter.com/ZqCnVkBpii — Tim Cook (@tim_cook) May 20, 2016 -
ఆ బామ్మకు మోదీ పాదాభివందనం
చత్తీస్ గఢ్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఓ బామ్మకు పాదాభివందనం చేశారు. చత్తీస్ గఢ్లోని మారుమూల ప్రాంతానికి చెందిన ఆ బామ్మకు మోదీ సిరస్సు వంచి నమస్కరించడానికి కారణం.. ఆమె తన ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించుకోవడమే. కారణం చాలా సిల్లీగా అనిపిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడంలో ప్రజల అలసత్వం ఎన్ని అనారోగ్య సమస్యలకు కారణమౌతుందో గుర్తించి.. తనకున్న రెండు మేకలమ్మి మరీ మరుగుదొడ్డి నిర్మించుకొని గ్రామానికి ఆదర్శంగా నిలిచిన ఆ బామ్మకు ప్రధాని మోదీ ఇచ్చిన గౌరవం ఇప్పుడు ప్రశంసలందుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతమైన ధమ్తరాయ్ గ్రామానికి చెందిన 104 ఏళ్ల కున్వర్ బాయి తన ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలనుకుంది. అయితే దానికి సరిపడా డబ్బు లేకపోవడంతో తనకున్న రెండు మేకలను అమ్మి ఆ డబ్బుతో అనుకున్నది సాధించింది. దీంతో కున్వర్ బాయిని స్ఫూర్తిగా తీసుకున్న గ్రమస్తులు తమ ఇళ్లలోనూ మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ముందుకొచ్చారు. ఇలా గ్రామ పారిశుధ్యం మెరుగవడానికి కున్వర్ బాయి చేసిన కృషిని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమెకు పాదాభివందనం చేసి ప్రత్యేకంగా అభినందించారు. -
ఆ సినిమాను ప్రశంసించిన శంకర్
చెన్నై: మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా సాలా ఖదూస్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ సినిమా తమిళ వెర్షన్ 'ఇరుది సుట్రు' ను ప్రముఖ దర్శకుడు శంకర్ కొనియాడారు. ఈ సినిమా దర్శకురాలు, నటీనటులు, సంగీత దర్శకుడి పై తన అధికారిక ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురిపించారు. *మహిళలకు ఒక వందనం ' డైరెక్టర్ సుధ ప్రయత్నం చాలా బావుంది అంటూ ట్విట్ చేశారు. మాధవన్, రితికీ నటన అద్భుతంగా ఉందని, సంతోష్ అందించిన సంగీతం చాలా బావుందంటూ తన సంతోషాన్ని ప్రకటించారు. కాగా చెన్నైలోని మురికివాడల నుంచి మట్టిలోని ఓ మాణిక్యాన్ని వెలికితీసి, బాక్సింగ్ చాంపియన్‌గా తీర్చిదిద్దిన బాక్సింగ్ కోచ్ జీవితం చుట్టూ నడిచే సినిమా ఇరుది సుట్రు. తెలుగుదర్శకురాలు సుధ కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికై పలు సంచలనాలను నమోదు చేసింది. ఈ సినిమాకోసం భారీగా బరువు తగ్గి హీరో మాధవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు, రియల్ లైఫ్ బాక్సర్ అయిన రితికా సింగ్ మహిళా బాక్సర్ పాత్ర పోషించారు. అటు ఈ సినిమాను తాను చూడాలనుకుంటున్నానంటూ బాక్సింగ్ యోధుడు కూడా మైక్ టైసన్ సోషల్ మీడియాలో ఆసక్తిని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. "Irudhi suttru" - 'A salute to women'. Great effort by the director Sudha. Superb performance by Rithika n Maddy. Good music by Santhosh. — Shankar Shanmugham (@shankarshanmugh) February 6, 2016