IPL Victory CSK Owner N Srinivasan Lauds MS Dhoni - Sakshi
Sakshi News home page

IPL victory: ఈ మిరాకిల్‌ నీకే సాధ్యం,చెన్నైకి రా సెలబ్రేట్‌ చేసుకుందాం! 

Published Tue, May 30 2023 6:57 PM | Last Updated on Tue, May 30 2023 7:38 PM

IPLVictory CSK owner N Srinivasan lauds MS Dhoni details inside - Sakshi

సాక్షి,ముంబై: ఐపీఎల్‌ 2023 టైటిల్‌ గెల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై ఫ్రాంచైజీ ఓనర్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ప్రశంసలు కురిపించారు. ఈ అద్భుతం లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మాత్రమే సాధ్యమంటూ కితాబిచ్చారు.  

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించి జట్టును ఆయన అభినందించారు. ఈ మేరకు మంగళవారు ఉదయం ఆయన ధోనితో మాట్లాడారు. “అద్భుతమైన కెప్టెన్ మీరు. అద్భుతం చేసారు. మీరు మాత్రమే చేయగలరు. మీ టీంని చూసి గర్విస్తున్నాను అంటూ ఆయన ధోనీని అభినందనల్లో ముంచెత్తారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్‌ సూపర్‌ పిక్స్‌ వైరల్‌ )

అంతేకాదు గత కొన్ని రోజులుగా బ్యాక్-టు-బ్యాక్ షెడ్యూల్‌తో అలిసిపోయారు.. విశ్రాంతి తీసుకోండి అంటూ ధోనీకి సలహా ఇచ్చారు.  విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు జట్టుతో పాటు చెన్నైకి రావాలని కూడా ఆయన ఆహ్వానించారు. (ఐపీఎల్‌ చాంపియన్‌ సీఎస్‌కే ఓనరు, నికర విలువ ఎంత? విషయాలు తెలుసా?)

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం సాక్షిబిజినెస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement