N Srinivasan
-
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
ఐపీఎల్ విక్టరీ: ఈ మిరాకిల్ నీకే సాధ్యం,చెన్నైకి రా సెలబ్రేట్ చేసుకుందాం!
సాక్షి,ముంబై: ఐపీఎల్ 2023 టైటిల్ గెల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఫ్రాంచైజీ ఓనర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ప్రశంసలు కురిపించారు. ఈ అద్భుతం లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మాత్రమే సాధ్యమంటూ కితాబిచ్చారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి జట్టును ఆయన అభినందించారు. ఈ మేరకు మంగళవారు ఉదయం ఆయన ధోనితో మాట్లాడారు. “అద్భుతమైన కెప్టెన్ మీరు. అద్భుతం చేసారు. మీరు మాత్రమే చేయగలరు. మీ టీంని చూసి గర్విస్తున్నాను అంటూ ఆయన ధోనీని అభినందనల్లో ముంచెత్తారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ ) అంతేకాదు గత కొన్ని రోజులుగా బ్యాక్-టు-బ్యాక్ షెడ్యూల్‌తో అలిసిపోయారు.. విశ్రాంతి తీసుకోండి అంటూ ధోనీకి సలహా ఇచ్చారు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు జట్టుతో పాటు చెన్నైకి రావాలని కూడా ఆయన ఆహ్వానించారు. (ఐపీఎల్ చాంపియన్ సీఎస్కే ఓనరు, నికర విలువ ఎంత? విషయాలు తెలుసా?) Mr N Srinivasan, former Chairman of the ICC, former President of BCCI and TNCA, Mrs. Chitra Srinivasan and Mrs Rupa Gurunath present @msdhoni with a special memento commemorating the very special 200th 👏#TATAIPL | #CSKvRR | @ChennaiIPL pic.twitter.com/nixs6qsq2P — IndianPremierLeague (@IPL) April 12, 2023 మరిన్ని బిజినెస్ వార్తల కోసం సాక్షిబిజినెస్ -
CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?
ఐపీఎల్ 2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ను దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్‌పై ఘన విజయం సాధించింది. సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చివరి ఓవర్లో పది పరుగులు కావాల్సిన సమయంలో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి జట్టును ఛాంపియన్‌గా మార్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇండియ ఫస్ట్ స్పోర్ట్స్ యునికార్న్ ఎంటర్‌ప్రైజ్‌గా అవతరించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడగా నిలిచిన జట్టుగా పేరొందిన సీఎస్కేకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.ఈ క్రమంలో సీఎస్కే యాజమాని ఎవరు, పెట్టుబడి, నికర విలువ ఎంత అనేది విశేషంగా మారింది. ఎన్ శ్రీనివాసన్ సీఎస్కే టీం యజమాని, ప్రముఖ పారిశశ్రామికవేత్త ఎన్ శ్రీనివాసన్. ఈయనకు క్రికెట్‌తో అనుబంధం చాలా సుదీర్ఘమైందే. అంతర్జాతీయ క్రికెట్ సర్క్యూట్లో పాపులర్ నేమ్. పలు నివేదికల ప్రకారం ప్రస్తుతం నికర నికర విలువ రూ.720 కోట్లుగా తెలుస్తోంది. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) ప్రాథమిక విద్య మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఎన్ శ్రీనివాసన్ చెన్నైలోని లయోలా కాలేజీలో గ్రాడ్యుయేషన్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) చేశారు. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) క్రికెట్ పరిచయం బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన తర్వాత, శ్రీనివాసన్ 2011లో బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. 2014లో శ్రీనివాసన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ ఎంపిక కావడంతో జగ్మోహన్ దాల్మియా నియమితులయ్యారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ) మాజీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్. 2008 సంవత్సరంలో సీఎస్కేను కొనుగోలు చేశారు. దేశంలోని సిమెంట్ పరిశ్రమలో పాపులర్ అయిన ఇండియా సిమెంట్ ఓనర్ కూడా. బీసీసీఐ చీఫ్‌గా , ఐసీసీ మాజీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్) 2016 Born Kids will Never Realise How Combination of Indian Captain MS Dhoni and BCCI President N. Srinivasan Was 💙🇮🇳 pic.twitter.com/t0APYnCvOm — Junaid Khan (@JunaidKhanation) March 29, 2023 చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు శ్రీనివాసన్ 2008లో చెన్నై ఫ్రాంచైజీని (చెన్నై సూపర్ కింగ్స్) సుమారు రూ. 752 కోట్లకు కొనుగోలు చేయడంతో జెంటిల్మన్ గేమ్‌తో ఆయన రిలేషన్ మరింత బలపడింది. ఫ్రాంచైజీ విలువ ఇప్పుడు దాదాపు సుమారు రూ. 7443 కోట్లుగా ఉంది. ప్రొఫెషనల్ జర్నీ చెన్నైకి చెందిన సిమెంట్ తయారీ కంపెనీ ఇండియా సిమెంట్స్‌కి కో ఫౌండర్ తండ్రి నారాయణస్వామి తరువాత 1989లో శ్రీనివాసన్ వైస్-ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. బొగ్గు ,ముడిసరుకు ధరలపెరుగుదల కారణంగా మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ.218 కోట్ల నష్టాన్ని నివేదించింది. ఈక్రమంలోనే తిరునెల్వేలిలో 600 ఎకరాల భూమిని డబ్బు ఆర్జించే దిశగా సంస్థ ఉందని, ఈ ఏడాది (2023)వడ్డీతో సహా రూ. 500 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని భావిస్తున్నట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఐపీఎల్ విజేతగా నిలివడంతో మార్కెట్లో ఇండియా సిమెంట్స్ షేర్ 3 శాతం లాభపడి. 199.50 వద్ద ముగిసింది. Attended the Platinum Jubilee celebrations of India Cements Ltd in Chennai today. India cement has played a crucial role in India’s growth under the leadership of N. Srinivasan Ji. Congratulated the entire team and also released a special postal stamp on this occasion. pic.twitter.com/xpWWj990Ye — Amit Shah (@AmitShah) November 12, 2022 ఇలాంటి ఇంట్రస్టింగ్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
ఐసీసీ చైర్మన్ పదవి.. బరిలో గంగూలీ, జై షాతో పాటు కేంద్ర మంత్రి..!
Anurag Thakur In ICC Chairman Race: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా గ్రెగ్ బార్ల్కే (న్యూజిలాండ్) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ పదవి కోసం ఇప్పటి నుంచి పోటీ మొదలైంది. క్రికెట్‌కు సంబంధించి అత్యున్నతమైన ఈ పదవిని దక్కించుకునేందుకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా సహా ఓ కేంద్ర మంత్రి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఐసీసీ చైర్మన్ గిరికి అర్హత సాధించగా.. బీసీసీఐ బాస్ హోదాలో గంగూలీ, ఐసీసీ ఆఫీస్ బేరర్‌గా జై షా సైతం ఈ పదవికి అర్హత కలిగి ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవిని దక్కించుకునేందుకు గంగూలీ ముందు నుంచే పావులు కదపగా.. తాజాగా జై షా, అనురాగ్ ఠాకూర్ సైతం ఐసీసీ పీఠాన్ని అధిరోహించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా, ఐసీసీ చైర్మన్లుగా గతంలో నలుగురు భారతీయులు పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ హోదాలో పని చేశారు. చదవండి: రెచ్చిపోయిన హనుమ విహారీ.. సెంచరీ, హాఫ్ సెంచరీ సహా 216 పరుగులు..! -
నన్ను రీటైన్ చేసుకుని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు.. ధోని సూచన..!
Dhoni Dont Want CSK To Lose Money By Retaining Him Before IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని జట్టు యాజమాన్యానికి కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. బీసీసీఐ సవరించిన తాజా రూల్స్ ప్రకారం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు నలుగురు ఆటగాళ్లను రీటైన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం తమ తురుపు ముక్క, జట్టు సారధి ధోనిని మొదటి ప్రాధాన్యతగా రీటైన్ చేసుకుంటుందని ఫ్రాంఛైజీ యజమాని ఎన్ శ్రీనివాసన్ ఇదివరకే వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే ధోని తాజాగా తన మనసులో మాటను బహిర్గతం చేశాడని సమాచారం. తాను రీటెన్షన్ పాలసీకి వ్యతిరేకమని, తనను రీటైన్ చేసుకుని అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోవద్దని ధోని సూచించినట్లు శ్రీనివాసన్ స్వయంగా ప్రకటించాడు. అయితే, ఈ ఒక్క విషయంలో తాము ధోని మాటను పక్కకు పెడతామని, అతన్ని వచ్చే సీజన్ కోసం తప్పక రీటైన్ చేసుకుంటామని శ్రీనివాసన్ చెప్పడం విశేషం. కాగా, ఫ్రాంఛైజీలు తమ మొదటి ప్రాధాన్యత ఆటగాడి కోసం 16 కోట్లు వెచ్చించాల్పి ఉంటుంది. ఇదిలా ఉంటే, 2008 నుంచి సీఎస్కేతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న ధోని మధ్యలో రెండు సీజన్లు మినహా లీగ్ మొత్తం సీఎస్కేతో పాటే ఉన్న విషయం తెలిసిందే. ధోని సారధ్యంలో సీఎస్కే ఇటీవలి సీజన్(2021) టైటిల్ ఎగరేసుకుపోయింది. దీంతో ధోని సీఎస్కే తరఫున సాధించిన టైటిల్‌ల సంఖ్య నాలుగుకు చేరింది. చదవండి: కివీస్ చేతిలో టీమిండియా ఓటమికి 'ఆ అంపైరే' కారణం..! -
చెన్నై‘సూపర్ కింగ్స్’.. అరుదైన ఘనత!
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశ్చర్యకర పరిణామాలకు కారణం కాబోతోంది. ధనా ధన్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఇటు ఐపీఎల్ లీగ్పరంగానే కాకుండా అటు మార్కెట్ వేల్యుయేషన్పరంగానూ దుమ్ము రేపుతోంది. ఏకంగా క్రీడా రంగంలో తొలి యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల పైగా విలువ) హోదా దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. ఈ విషయంలో మాతృ సంస్థ ఇండియా సిమెంట్స్ వేల్యుయేషన్‌ను కూడా దాటిపోతుండడం మరో విశేషం. ఈమధ్యే నాలుగోసారి లీగ్‌ను గెల్చుకోవడంతో సీఎస్కే టీమ్ విలువపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్లో రెండు జట్లకు చోటు కల్పించనున్నారని, వీటి విలువను సుమారు రూ. 4,000– 5,000 కోట్లుగా లెక్కించనున్నారని అంచనాలు నెలకొన్నాయి. దీన్ని బట్టి చూస్తే, తొలి నుంచి నిలకడగా రాణిస్తున్న సీఎస్కే వేల్యుయేషన్ దాదాపు రెట్టింపు స్థాయికి చేరవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ‘‘గత శుక్రవారం అనధికారిక మార్కెట్లో సీఎస్కే షేరు ధర రూ. 135గా ఉంది. దీని ప్రకారం సీఎస్కే మార్కెట్ వేల్యుయేషన్ సుమారు రూ. 4,200 కోట్లు. అయితే, కొత్తగా వచ్చే జట్ల విలువ దాదాపు రూ. 4,000– 5,000 కోట్లుగా ఉంటే సీఎస్కే రిటైల్ షేరు ధర ఏకంగా రూ. 200కి చేరవచ్చు. దీంతో టీమ్ విలువ రూ. 8,000 కోట్లకు ఎగియవచ్చు. తద్వారా యూనికార్న్‌గా మారవచ్చు’’ అని పేర్కొన్నాయి. మరోవైపు, మంగళవారం నాటి పరిస్థితుల ప్రకారం సీఎస్కే మాతృ సంస్థ ఇండి యా సిమెంట్స్ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో షేరు ధర రూ. 205) మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 6,343 కోట్లుగా ఉంది. అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే సీఎస్కే విలువ ఇండియా సిమెంట్స్ వేల్యుయేషన్‌ను కూడా దాటిపోనుంది. ఇండియా సిమెంట్స్‌కు ఊతం ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్ శ్రీనివాసన్ కూడా ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్కే విలువ.. మాతృ సంస్థ వేల్యుయేషన్‌ను దాటేసే అవకాశాలపై ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఫ్రాంచైజీ లీగ్‌లు మరింతగా ప్రాచుర్యంలోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. మరో సందర్భంలో ఇండియా సిమెంట్స్‌కు సీఎస్కే ఊతంగా నిలుస్తోందంటూ ఆయన అంగీకరించారు. ‘‘ఇండియా సిమెంట్స్ నెలకొల్పి 75 ఏళ్లవుతోంది. అది స్వయంగా ఒక పటిష్టమైన బ్రాండ్. కానీ ఇప్పుడు సీఎస్కే మాతృ సంస్థగా గుర్తింపు పొందుతోంది. సీఎస్కే అనతికాలంలోనే ఇండియా సిమెంట్స్ ప్రాచుర్యాన్ని అధిగమించింది’’ అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ‘‘సీఎస్కే స్వయంగా ఒక భారీ బ్రాండ్‌గా ఆవిర్భవిస్తోంది. వేల్యుయేషన్ గణనీయంగా పెరుగుతోంది. అయితే, ఇండియా సిమెంట్స్ దీన్నేమీ విక్రయించకపోవచ్చు. ఎందుకుంటే బ్రాండింగ్పరంగా ఇది మాతృ సంస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది’’ అని బ్రాండ్ మార్కెటింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఇండియా సిమెంట్స్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎస్కే టీమ్ ప్లేయర్లు సందడి చేయడం ఇందుకు నిదర్శనంగా తెలిపాయి. సీఎస్కే టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అటు ఇండియా సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. నిలకడగా రాణింపు 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పట్నుంచీ .. మిగతా టీమ్‌లతో పోలిస్తే సీఎస్కే నిలకడగా రాణిస్తోంది. 196 మ్యాచ్‌లలో 117 మ్యాచ్‌లలో గెలుపొంది.. 59.69 శాతం విజయాల రేట్‌తో కొనసాగుతోంది. ధోనీ సారథ్యంలో సీఎస్కే ఇప్పటికే పటిష్టమైన బ్రాండ్‌గా ఎదిగిందని, ఒకవేళ రేపు ఎప్పుడైనా అతను తప్పుకున్నా కూడా దాని ప్రాభవం తగ్గకపోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సీఎస్కే టీమ్ నిర్వహణ తీరు ఇందుకు కారణమని వివరించాయి. ‘‘మంచి బ్రాండ్స్ ఎలా వ్యవహరించాలన్నది సీఎస్కే చూపించింది. నిలకడగా రాణించడం, ప్రజల ఆప్యాయతను చూరగొనడం ఇలా అన్ని కీలకమైన అంశాల్లోనూ ఆకట్టుకునేలా వ్యవహరిస్తోంది. పనితీరులో నిలకడగా రాణిస్తోంది. మిగతా బడా పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన టీమ్‌లను ధైర్యంగా ఎదుర్కొని, నిలబడగలుగుతోంది. పేరుకు చెన్నై సూపర్ కింగ్స్ అయినప్పటికీ చెన్నై పరిధిని దాటి దేశవ్యాప్తంగా అందరూ ఇష్టపడే టీమ్‌గా ఎదిగింది’’ అని పేర్కొన్నాయి. చదవండి: ఇన్వెస్టర్లకు ఐఆర్సీటీసీ షాక్ -
‘మాది తండ్రీ కొడుకుల బంధం’
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో హైరానాకు కారణమైన సురేశ్ రైనా వివాదం త్వరగానే సమసిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రైనా తనకు పుత్ర సమానుడంటూ జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ భరోసానివ్వగా... తన దృష్టిలో ఆయన తండ్రి అంతటివాడంటూ రైనా కూడా గౌరవాన్ని ప్రదర్శించాడు. రైనా వ్యవహారశైలితో ఆరంభంలో ఆగ్రహం ప్రదర్శించిన శ్రీనివాసన్... అతను స్వయంగా ఫోన్ చేసి వివరణ ఇవ్వడంతో సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ‘హోటల్ గది’ వార్త ఎవరో కావాలని సృష్టించారని రైనా స్పష్టం చేశాడు. జట్టు ఎంపిక విషయంలో తన పాత్ర ఏమీ లేదని శ్రీనివాసన్ చెబుతున్నా... ధోని అండ, సీఈఓ కాశీ విశ్వనాథన్ కూడా రైనా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో అతను మళ్లీ జట్టుతో చేరి ఈ ఏడాది ఐపీఎల్ ఆడే అవకాశాలు మెరుగయ్యాయి. (చదవండి: బీసీసీఐకి ఐపీఎల్ ఫ్రాంచైజీల విజ్ఞప్తి) ‘రైనాను నేను నా కొడుకులాగా చూసుకున్నాను. అయితే రైనా పునరాగమనం విషయంలో నా పాత్ర ఏమీ ఉండదు. క్రికెట్ వ్యవహారాల్లో యాజమాన్యం జోక్యం చేసుకోకపోవడమే ఐపీఎల్లో మా జట్టు విజయరహస్యం. 1960ల నాటినుంచి క్రికెట్‌ను ఇండియా సిమెంట్స్ కంపెనీ అలాగే నడిపిస్తోంది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. మా జట్టుకు మేం యజమానులమే తప్ప ఆటగాళ్లకు కాదు. క్రికెటర్లు నా సొంతం కాదు. అతడిని తీసుకునే అంశంపై టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. నేను జట్టు కెప్టెన్‌ను కాదు. ఎవరు ఆడాలి, వేలంలో ఎవరిని తీసుకోవాలి అనే విషయాలు నేను ఎప్పుడూ చెప్పలేదు. ప్రపంచంలో అత్యుత్తమ కెప్టెన్ మా జట్టుతో ఉన్నప్పుడు మేమెందుకు జోక్యం చేసుకుంటాం. –ఎన్. శ్రీనివాసన్, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ‘నన్ను మళ్లీ మీరు చెన్నై శిబిరంలో చూస్తారేమో! ఇప్పుడే ఏమీ చెప్పలేను. ముందుగా నేను ఇక్కడ కొన్ని బాధ్యతలు పూర్తి చేసి అప్పుడు సిద్ధమవుతా. ఇంట్లో అత్యవసరంగా చక్కబెట్టాల్సిన కొన్ని పనులు ఉండటంతో నా కుటుంబం కోసం వెనక్కి రావాల్సి వచ్చింది. సూపర్ కింగ్స్ జట్టు నా కుటుంబంలాంటిది. ధోని భాయ్ నా జీవితంలో అత్యంత కీలక వ్యక్తి. అయితే కఠిన నిర్ణయమే అయినా ఇంటికి వచ్చేశాను. శ్రీనివాసన్ నాకు తండ్రిలాంటివారు. నా మనసుకు దగ్గరైన వ్యక్తి. ఎంతో అండగా నిలుస్తూ చిన్న కొడుకులాగా చూసుకున్నారు. బహుశా ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ఉంటారు. అప్పటికి నేను రావడానికి కారణం ఆయనకు తెలీదు. ఇప్పుడు అంతా చక్కబడింది. నాకు మెసేజ్ కూడా పంపించారు. ఆ అంశంపై వివరంగా మాట్లాడుకున్నాం. అయితే ఒక తండ్రి తన పిల్లలను కోప్పడితే తప్పేముంది. నాకు, సీఎస్కేకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప ఎవరైనా రూ. 12.5 కోట్లు వదిలేసుకొని వచ్చేస్తారా. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా నా వయసు ఎక్కువేం కాదు. కనీసం 4–5 ఏళ్లు ఐపీఎల్ ఆడగలను. ఇక్కడికి వచ్చాక క్వారంటైన్లో ఉంటూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ వివాదాన్ని మరచి ముందుకు వెళ్లాలని భావిస్తున్నా. –సురేశ్ రైనా -
రైనాకు ఎప్పుడైనా అండగా ఉంటాం
చెన్నై: ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో సురేశ్ రైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యజమాని ఎన్. శ్రీనివాసన్ 24 గంటల్లోపే సాంత్వన వచనాలు పలికారు. రైనా గురించి తాను చెప్పిన మాటలను వక్రీకరించారని, అతనికి ఎప్పుడైనా అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. ‘ఇన్నేళ్లుగా చెన్నై జట్టుకు రైనా చేసిన సేవలు అసమానం. నేను చేసిన వేర్వేరు వ్యాఖ్యలను ఒక చోట జోడించి కొందరు తప్పుగా ప్రచారం చేశారు. రైనా మానసిక పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని అతనికి మనం అండగా నిలవాల్సిన సమయమిది. మా ఫ్రాంచైజీ ఎప్పుడైనా అతనికి తోడుగా ఉంది. కష్టకాలంలో ఇప్పుడు కూడా మేం అతని వెంటే ఉంటాం. నా వ్యాఖ్యల్లో రైనాను తప్పు పట్టలేదు’ అని శ్రీనివాసన్ స్పష్టతనిచ్చారు. మరోవైపు రైనా వెనక్కి రావడంలో ‘హోటల్ గది’కి మించిన మరో బలమైన కారణం ఏదైనా ఉండవచ్చని చెన్నై టీమ్ సంబంధిత వ్యక్తి ఒకరు వెల్లడించారు. ‘సీఎస్కే నిబంధనల ప్రకారం కెప్టెన్, కోచ్, మేనేజర్లకు హోటల్లో అత్యుత్తమ సౌకర్యాలు ఉన్న గది ఇస్తారు. రైనాకు కూడా ఇలాంటిది ఇచ్చారు. అందులో బాల్కనీ లేకపోవడమనేది మరో అంశం. అయితే ఈమాత్రం దానికే వెనక్కి వచ్చేస్తారా. కరోనా కేసుల భయమే కాకుండా మరో కారణం కూడా ఉండవచ్చు. ఇప్పటికైతే రైనా తిరిగి రాకపోవచ్చు. ఇక చెన్నైతో కూడా ఆట ముగిసినట్లే’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
రైనాను సీఎస్కే వదులుకున్నట్లేనా..!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ఐపీఎల్ టోర్నీనుంచి అనుహ్యంగా తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైనా నిష్క్రమణపై ఇప్పటికే అనేక అనుమానాలు, పుకార్లు వస్తున్నాయి. కరోనా భయం కారణంగా భారత్‌కు తిరిగి వచ్చాడని కొంతమంది భావిస్తుండగా... కుటుంబ సమస్యలతో తిరుగుముఖం పట్టాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దుబాయ్‌లో రైనాకు కేటాయించిన గది విషయంపై రైనా కొంత అసహం వ్యక్తం చేశాడని, ఈ క్రమంలోనే జట్టు యజమానికి అతనికి మధ్య స్పల్ప వివాదం ఏర్పడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే జట్టు యజమాని ఎన్ శ్రీనివాససన్ తాజాగా రైనాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. గది విషయంలో రైనా వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టిన శ్రీనివాసన్.. జట్టులో రైనా లేనంతమాత్రనా తమకేమీ నష్టం లేదన్న రీతిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రైనా స్థానంలో రాణించేందుకు ఎంతోమంది యువ ఆటగాళ్ల సిద్ధంగా ఉన్నారని కూడా పేర్కొన్నారు. శ్రీనివాసన్ తాజా కామెంట్స్ నేపథ్యంలో ఇరువురి మధ్య పెద్ద వాదనే జరిగినట్లు తెలుస్తోంది. (రైనా నిష్ర్కమణపై శ్రీనివాసన్ ఆగ్రహం) గొడవ కారణంగానే ఐపీఎల్ సీజన్ నుంచి రైనా తప్పుకుని భారత్‌కు పయనమైనట్లు సమచారం. ఈ నేపథ్యంలో సీఎస్కేతో రైనా భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జట్టు యజమానిపైనే అతను దురుసుగా ప్రవర్తించాడని, ఇక రైనాతో ఒప్పందాన్ని సీఎస్కే పూర్తిగా రద్దు చేసుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నైకు ప్రాతినిథ్యం వహిస్తున్న రైనా.. మధ్యలో రెండేళ్లు నిషేధం మినహా అతను 2019 వరకు అదే జట్టుకు ఆడుతూ వస్తున్నాడు. చెన్నై తరుఫున 164 మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ 4527 పురుగులతో ఆ జట్టు తరఫున అత్యధిక స్కోర్ లిస్ట్‌లో తొలిస్థానంలో (లీగ్ మొత్తంలో రెండో స్థానం) ఉన్నాడు. టీంలో ధోనీ తరువాత అత్యంత విలువైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే తాజా వివాదం నేపథ్యంలో భవిష్యత్‌లో జట్టులో కొనసాగుతాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా చెన్నై జట్టు అతనికి ప్రస్తుత లీగ్‌లో రూ.11 కోట్లు చెల్లిస్తోంది. రైనా తాజా నిర్ణయంతో ఆ మొత్తాన్ని కోల్పోనున్నాడు. -
రైనా నిష్ర్కమణపై శ్రీనివాసన్ ఆగ్రహం
దుబాయ్: కరోనా భయం, కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం... ఐపీఎల్‌నుంచి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అనూహ్యంగా తప్పుకోవడంపై ఇప్పటి వరకు వినిపించిన కారణాలు. అయితే ఇప్పుడు కొత్తగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. మామూలుగానైతే ఇది కూడా ఒక రకమైన పుకారులాగానే కనిపించేది కానీ స్వయంగా జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ తాజా ఘటనపై స్పందించడంతో రైనా వ్యవహారంపై సందేహం రేగింది. ఒక జాతీయ పత్రిక కథనం ప్రకారం... దుబాయ్‌లో తనకు కేటాయించిన హోటల్ గది పట్ల రైనాలో కలిగిన అసంతృప్తే చివరకు ఇలా హఠాత్తుగా వెళ్లిపోవడానికి కారణమైందని తెలిసింది. బయో బబుల్ వాతావరణంలో కఠిన నిబంధనలు పాటిస్తూ హోటల్లోనే ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన స్థితిలో తనకు ఇచ్చిన గది మొదటి రోజే రైనాకు నచ్చలేదు. కనీసం దానికి సరైన బాల్కనీ కూడా లేదని అతను అన్నట్లు తెలిసింది. చివరకు సరిగ్గా ధోనికిచ్చిన తరహా గది తనకు కావాలంటూ అతను కోరాడు. అయితే తగిన స్పందన రాకపోవడంతో చివరకు ధోనికే విషయం చెప్పాడు. ఈ విషయంలో తానేమీ చేయలేనన్న ధోని... రైనా ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేయలేదు. దాంతో ధోనిపై కూడా అసహనం కనబరుస్తూ రైనా ‘వ్యక్తిగత కారణాలు’ అంటూ స్వదేశం బయల్దేరిపోయాడు. రైనా నిష్ర్కమణపై శ్రీనివాసన్ ఆగ్రహం 2008నుంచి నిషేధం ఎదుర్కొన్న రెండు సీజన్లు మినహా చెన్నై సూపర్ కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహించిన రైనా ఇలా కీలక సమయంలో తప్పుకోవడంపై టీమ్ యజమాని ఎన్. శ్రీనివాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘క్రికెటర్లు కూడా పాత తరం సినిమా తరల్లాగే తమ గురించి తాము బాగా గొప్పగా ఊహించుకుంటారు. చెన్నై టీమ్‌లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేకుండా అంతా కుటుంబంలా ఉంటారు. నిజంగా నీకు అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు. ఎవరినీ నేను బలవంత పెట్టను. కొన్ని సార్లు విజయం తలకెక్కడం సహజం. నాకు ధోని రూపంలో బలమైన కెప్టెన్ ఉన్నాడు. అతనితో నేను మాట్లాడా. పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉంది. ఒక వేళ మా జట్టులో కరోనా కేసులు పెరిగినా భయపడనవసరం లేదని చెప్పాడు. మా వద్ద ప్రతిభకు కొదవ లేదు. రైనా స్థానంలో సత్తా చాటేందుకు రుతురాజ్‌కు ఇది మంచి అవకాశం. అయినా ఇంకా ఐపీఎల్ మొదలే కాలేదు. భారీ డబ్బు (రూ. 11 కోట్లు)తో సహా తాను ఏం కోల్పోయాడో రైనా తర్వాత తెలుసుకుంటాడు’ అని శ్రీని అన్నారు. -
'ధోని ఎంపిక లెక్కలకు అందని సూత్రం'
చెన్నై : ఎంఎస్ ధోని సారధ్యంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలిచి రికార్డు సృష్టించింది. ఈ గెలుపే బీసీసీఐకి కాసుల పంట పండిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు పునాది పడింది. అప్పటికే భారత జట్టులో స్టార్ ఆటగాళ్లుగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్‌లను ఐకానిక్ ఆటగాళ్లుగా గుర్తించారు. అప్పటి రైజింగ్ స్టార్‌గా ఉన్న ఎంఎస్ ధోనికి ఐకానిక్ హోదా లేదు.(చదవండి : థ్యాంక్యూ నరేంద్ర మోదీజీ : రైనా) ఇందులో ఒక్క ధోని మినహా మిగతా ఐదుగురు ఐకానిక్ హోదాలో సొంతజట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. సచిన్( ముంబై ఇండియన్స్), గంగూలీ(కోల్‌కతా నైట్‌రైడర్స్), రాహుల్ ద్రవిడ్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), యువరాజ్(కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), సెహ్వాగ్ (ఢిల్లీ డేర్‌డేవిల్స్) ఉన్నారు. దేశానికి 2007 టీ 20 ప్రపంచకప్ సాధించిపెట్టిన ధోని క్రేజ్ వేరుగా ఉండేది. అయితే ధోని పుట్టిపెరిగిన రాంచీ నుంచి ఏ ఫ్రాంచైజీ లేదు.. దీంతో అతను వేలంలోకి వచ్చాడు. కాగా వేలంలో ధోని కోసం అన్ని ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించగా.. చివరకు చెన్నై సూపర్‌కింగ్స్ దక్కించుకొంది. ఆ తర్వాత ఏం జరిగందన్నది మీకందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ ధోని గురించి, చైన్నై జట్టు తనను వేలంలో ఎలా దక్కించుకున్న విషయాలను పీటీఐ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'మొదటి ఐపీఎల్ సీజన్ వేలం పాట సందర్భంగా.. యువరాజ్‌ను పంజాబ్‌ను కోరుకుంది.. వీరును ఢిల్లీ వదులకోదు.. ఇక సచిన్ లేకండా ముంబై జట్టును చూడలేము.. దాదా లేకపోతే.. కోల్‌కతా జట్టే ఉండదు.. అందులోనూ ఆయా ఫ్రాంచైజీలు ఐకానిక్ హోదా ఉన్న ఆటగాళ్లు సొంత జట్టుకే ఆడాలని తీర్మానం చేశాయి. ఐకానిక్ హోదాలో వీరికి అందరికంటే ఎక్కువ మొత్తం లభిస్తుంది. ధోనికి ఐకానిక్ హోదా లేదు.. కానీ స్టార్ హోదా ఉంది. అందుకే అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దీంతో ధోని రేటు అమాంతం పెరిగిపోయింది.(చదవండి : సిరీస్ ఫలితాన్నే మార్చేసిన స్టన్నింగ్ క్యాచ్) కానీ ఎలాగైనా ధోనిని దక్కించుకోవాలనే తపనతో వేలంలో ఎంతోదూరం వెళ్లా.. చివరకు చైన్నైకి ధోనిని తీసుకొచ్చి కెప్టెన్‌ను చేశా. అప్పడు నేను ఒక్కేటే అనుకున్నా.. మాకు ఐకానిక్ ఆటగాడు అవసరం లేదు.. జట్టును స్థిరంగా నడిపించే నాయకుడు చాలు.. అందుకే ధోనిని తమ ఫ్రాంచైజీలోకి తీసుకొని కెప్టెన్‌ను చేశాము. అందుకే ఇప్పటికి స్పష్టంగా చెబుతా.. ధోని ఎంపిక లెక్కలకు అందని సూత్రం అని. ' అంటూ చెప్పుకొచ్చాడు. ధోని నాయకత్వంలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన జట్టుగా పేరుపొందింది. ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ను కొల్లగొట్టిన చెన్నై రెండు సార్లు చాంపియన్ లీగ్స్‌ను గెలిచింది. అంతేకాదు.. ఐపీఎల్ సీజన్లలో 8సార్లు ఫైనల్ చేరిన జట్టుగా, ఎక్కువసార్లు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్ర సృష్టించింది.(చదవండి : యూఏఈలో పెరుగుతున్న కేసులు.. మరి ఐపీఎల్) -
వద్దు సార్.. జట్టును నాశనం చేస్తాడు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మూడు టైటిళ్లను గెలిచిన కెప్టెన్ ఎంఎస్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున(సీఎస్కే) మూడు టైటిళ్లు గెలుచుకుని, ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడు. ఐపీఎల్లో సీఎస్కే ఇప్పటివరకూ 10 సీజన్లు ఆడగా అన్నింటికీ ధోని కెప్టెన్‌గా వ్యహరించాడు. తాజాగా ధోని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్. సీఎస్కే యజమాని, ఇండియా సిమెంట్స్ అధినేత అయిన శ్రీనివాసన్ గ్రేట్ లేక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహించిన సెమినార్లో మాట్లాడుతూ.. ధోని గురించి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రధానంగా ఐపీఎల్లో ఒక ఆటగాడ్ని తాను సూచిస్తే అందుకు వద్దన్నాడని శ్రీనివాససన్ తెలిపారు. ‘గతంలో ఐపీఎల్లో ఒక ప్రత్యేక ఆటగాడ్ని నేను సూచించా. అతను విపరీతమైన టాలెంట్ ఉన్న ఆటగాడు. కానీ అతన్ని వద్దన్నాడు ధోని. వద్దు సార్.. జట్టును అతను నాశనం చేస్తాడు. ఏ ఆటగాడినైనా అంచనా వేయడంలో ధోని దిట్ట. ఒక ఆటగాడి పట్ల ఒకటి ఫిక్స్ అయితే దానికి ధోని కట్టుబడి ఉంటాడు. అభిప్రాయాన్నైనా, అపోహనైనా ధోని తేల్చిచెబుతాడు. అతని జడ్జ్మెంట్ అలానే ఉంటుంది’ అని చెప్పినట్లు శ్రీనివాసన్ తెలిపారు. అయితే ఆ ఆటగాడు ఎవరు అనేది శ్రీనివాసన్ తెలపలేదు. కాగా, గతేడాది వన్డే వరల్డ్‌కప్ తర్వాత ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతని రిటైర్మెంట్పై రూమర్లు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. అయితే గత కొన్ని నెలలుగా కరోనా విజృంభణతో స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏమీ లేకపోవడంతో ధోని ప్రస్తావన రావడం లేదు. అయితే మళ్లీ ఐపీఎల్‌కు దాదాపు మార్గం సుగుమం అయిన క్రమంలో ధోని ప్రస్తావన షురూ అయ్యింది. సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించడానికి ఇప్పటికే బీసీసీఐ కసరత్తులు పూర్తి చేసిన క్రమంలో సీఎస్కే ముందుగా ప్రాక్టీస్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ముందుగానే అక్కడకు చేరుకుని ప్రాక్టీస్ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ధోని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ జట్టులో రీఎంట్రీ ఇవ్వడానికి కూడా ఐపీఎల్ ధోనికి కీలకం కానుంది. -
శశాంక్ భారత క్రికెట్‌ను దెబ్బతీశారు!
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఇన్నాళ్లు వ్యవహరించిన శశాంక్ మనోహర్ భారత్ క్రికెట్‌ను బాగా దెబ్బతీశారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ దుయ్యబట్టారు. భారతీయుడై ఉండి తన గొప్పల కోసం మన బోర్డు ప్రయోజనాలకు వ్యతిరేకిగా పనిచేశారని ఆరోపించారు. తను ఎలాగూ మళ్లీ బీసీసీఐలో క్రీయాశీలం కాలేనని భావించే... చేయాల్సిన నష్టమంతా చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ‘నేను కచ్చితంగా చెప్పగలను... శశాంక్ బీసీసీఐ ప్రతిష్టను భ్రష్టు పట్టించారు. పలుకుబడిని పాతాళానికి తీసుకెళ్లారు. బోర్డు, భారత ప్రయోజనాలకు పాతరేశారు. ఇలాంటి వ్యక్తి పదవి నుంచి దిగిపోవడం ఇప్పుడు ప్రతి భారత క్రికెట్ అధికారికి సంతోషం కలిగించే అంశం. ఆయన భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీసి ఒకప్పుడు ఐసీసీని శాసించే స్థితిలో ఉన్న బీసీసీఐని ఇప్పుడు ప్రాముఖ్యత లేకుండా చేశారు. చెప్పుకోలేనంత నష్టాలెన్నో చేసి అన్ని రకాలుగా బోర్డుకు కీడు తలపెట్టారు’ అని శ్రీనివాస్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాసన్ వ్యాఖ్యలతో మాజీ కార్యదర్శి నిరంజన్ షా కూడా ఏకీభవించారు. -
ఇండియా సిమెంట్స్‌పై దమానీ కన్ను
న్యూఢిల్లీ: డీమార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్‌తో రిటైల్ రంగంలో సంచలనం సృష్టించిన ప్రముఖ ఇన్వెస్టరు రాధాకిషన్ దమానీ తాజాగా ఇండియా సిమెంట్స్‌పై దృష్టి సారించారు. కంపెనీని టేకోవర్ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాన షేర్‌హోల్డరు ఎన్ శ్రీనివాసన్‌తో సంప్రతింపులు కూడా జరిపినట్లు సమాచారం. ఇండియా సిమెంట్స్‌లో నియంత్రణ స్థాయి వాటాలు దక్కించుకునేందుకు చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో శ్రీనివాసన్‌కు 29 శాతం వాటాలు ఉన్నాయి. బలవంతపు టేకోవర్ల సమస్య ఎదురుకాకుండా శ్రీనివాసన్ ఇతర ఇన్వెస్టర్ల వైపు కూడా చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బలవంతపు టేకోవర్ కాకుండా మేనేజ్మెంట్లో స్నేహపూర్వక మార్పు జరిగే విధంగానే టేకోవర్ ఉండేట్లు చూస్తానంటూ దమానీ హామీ ఇచ్చినట్లు వివరించాయి. దమానీకి చెందిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించగా, ఇండియా సిమెంట్స్ ఈ సమాచారం సరైనది కాదంటూ పేర్కొంది. క్రమంగా షేర్లు పెంచుకుంటూ.. దమానీ, ఆయన కుటుంబ సభ్యులు ఇండియా సిమెంట్స్‌లో గత కొన్నాళ్లుగా క్రమంగా షేర్లు పెంచుకుంటూ ఉన్నారు. మార్చి 31 నాటికి వారి వాటాలు సుమారు 20 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ డీల్ గానీ సాకారమైన పక్షంలో దమానీ పోర్ట్‌ఫోలియోను మరింత డైవర్సిఫై చేసుకోవడానికి వీలవుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇక అల్ట్రాటెక్ సిమెంట్, లఫార్జ్‌హోల్సిమ్ వంటి పోటీ దిగ్గజాలను ఎదుర్కొనేందుకు ఇండియా సిమెంట్స్‌కు కూడా గట్టి ఇన్వెస్టరు మద్దతు లభించగలదని పేర్కొన్నాయి. 74 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఇండియా సిమెంట్స్‌కు గతేడాది నాటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇండియా సిమెంట్స్ షేర్ రయ్.. టేకోవర్ వార్తలతో బుధవారం ఇండియా సిమెంట్స్ షేరు ధర సుమారు 4.72 శాతం పెరిగి రూ. 131.95 వద్ద క్లోజయ్యింది. మరోవైపు, అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు 2.6 శాతం క్షీణించి రూ. 2,342 వద్ద క్లోజయ్యింది. ఇండియా సిమెంట్స్ షేరు ఈ ఏడాది మార్చి నాటి కనిష్ట స్థాయిల నుంచి 74 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 95 శాతం ఎగిసింది. 2019 సెప్టెంబర్ క్వార్టర్ నుంచి ఇండియా సిమెంట్స్ షేర్లను దమానీ గణనీయంగా కొనడం మొదలుపెట్టారు. అప్పట్లో ఆయన వాటా 1.3 శాతంగా ఉండేది. డిసెంబర్ క్వార్టర్ వచ్చేటప్పటికి 4.73 శాతానికి పెరిగింది. మార్చి క్వార్టర్లో సోదరుడు గోపీకిషన్ శివకిషన్ దమానీతో కలిపి 15.16% వాటాలు కొనుగోలు చేయడంతో ఇది 19.89 శాతానికి చేరింది. -
టీఎన్‌సీఏ అధ్యక్షురాలిగా రూప
చెన్నై: తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) నూతన అధ్యక్షురాలిగా.... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూప గురునాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారంతో నామినేషన్ గడువు ముగిసింది. అధ్యక్ష పదవికి రూప ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించారు. దీంతోపాటు సంఘంలోని ఇతర పదవులు శ్రీనివాసన్ వర్గానికే దక్కాయి. ఉపాధ్యక్షులుగా టీజే శ్రీనివాస్ రాజ్ (సిటీ), డా.పి అశోక్ సిగమణి (జిల్లాలు), సెక్రటరీగా ఆర్ఎస్ రామసామి, జాయింట్ సెక్రటరీగా కేఏ శంకర్, సహ కార్యదర్శిగా ఎన్.వెంకట్రామన్, కోశాధికారిగా జె.పార్థసారథిలను ఎన్నుకున్నారు. -
ఐపీఎల్: బీసీసీఐకి భారీ షాక్
సాక్షి, ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఎన్ఫోర్స్మెంట్ విభాగం(ఈడీ) షాకిచ్చింది. 2009 ఐపీఎల్ సీజన్ నిర్వాహణకు సంబంధించి బీసీసీఐకి భారీ జరిమానాను విధించింది. బీసీసీఐతోపాటు మాజీ సభ్యులకు కలిపి మొత్తం రూ. 121 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. 2009 ఐపీఎల్ సీజన్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ.. విదేశీ ఖాతా తెరవకుండానే రూ. 243 కోట్లను టోర్నీ నిర్వహణ కోసం బీసీసీఐ సౌతాఫ్రికాకు బదిలీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) అతిక్రమణ ఆరోపణలతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావటంతో భారీ జరిమానాను విధించింది. బీసీసీఐతోపాటు బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌తోపాటు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ, ఇతరులకు కలిపి ఈడీ రూ.121 కోట్ల జరిమానా విధించింది. బీసీసీఐకు రూ. 82.66 కోట్లు శ్రీనివాసన్‌కు రూ.11.53 కోట్లు, లలిత్ మోదీకి రూ.10.65 కోట్లు, బోర్డు మాజీ కోశాధికారి పాండవ్‌కు రూ. 9.72 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీఐతో విలీనమైంది)కు రూ.7 కోట్లను జరిమానాగా విధించింది. ఈ జరిమానాను 45రోజుల్లోగా చెల్లించాలంటూ ఈడీ ఆదేశించింది. -
సూపర్ కింగ్స్‌కు ఘన స్వాగతం
చెన్నై: చెన్నైలో ఒకే ఒక మ్యాచ్ ఆడి వెళ్లిపోయిన వారి అభిమాన జట్టు ఇప్పుడు ఏకంగా టైటిల్‌తోనే తిరిగొచ్చింది. అందుకే వారూ వీరనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో అభిమానులు తమ సూపర్ కింగ్స్‌కు అపూర్వ రీతిలో స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ధోని సోమవారం పూర్తి జట్టుతో చెన్నైకి తరలి వెళ్లింది. విమానాశ్రయం, హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఫ్యాన్స్ తమ కింగ్స్‌కు స్వాగతం చెప్పారు. జట్టు యజమాని, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్‌కు ఆటగాళ్లంతా రాత్రి హాజరయ్యారు. మరోవైపు జట్టు సీఈఓ కేఎస్ విశ్వనాథన్ స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం గుడిలో వెంకటేశ్వర స్వామి ముందు ఐపీఎల్ ట్రోఫీని ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. -
ధోనీ జాబ్ వెనక వందల కోట్ల స్కామ్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఆఫర్ లెటర్ సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. ఇండియా సిమెంట్స్ ఓనర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తన కంపెనీలో ధోనీకి ఉద్యోగం ఇచ్చిన వివరాలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ లీక్ చేశారు. ధోనీ, శ్రీనీకి మధ్య ఎన్నో కాంట్రాక్టులలో సంబంధాలు ఉన్నాయని ఈ జాబ్ వెనక అసలు ఉద్దేశమిదేనని అభిప్రాయపడ్డారు. ఏడాదికి వంద కోట్లు ధోనీకి ముట్టజెప్పడమే ఉద్యోగం ఇవ్వడానికి కారణమని లలిత్ మోడీ ఆరోపించారు. 2012 జూన్‌లో ధోనీని ఇండియా సిమెంట్స్ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు ఓ ఆఫర్ లెటర్‌ను మోడీ బయటపెట్టారు. దీని ప్రకారం చూస్తే ధోనీకి నెలకు బేసిక్ పే రూ. 43000, డీఏ రూ. 21,970, స్పెషల్ పే రూ. 20,000, ప్రత్యేక సదుపాయాల కోసం రూ. 60,000 సహా ఓవరాల్‌గా రూ.100 కోట్లు కంపెనీ అందిచనుంది. ఇండియా సిమెంట్స్‌లో పనిచేసిన ధోనీ శ్రీనివాసన్ కంపెనీ ఉద్యోగిగా వందల కోట్లు ఆర్జించానని అంగీకరిస్తాడా అని ప్రశ్నించారు. రాజస్థాన్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న లలిత్ మోడీ కుమారుడు రుచిర్ మోడీ ఈ ఆఫర్ లెటర్‌పై స్పందించారు. బీసీసీఐలో ఇలాంటివి జరగడంపై షాక్‌కు గురయ్యానని, చెన్నై సిమెంట్స్ ఉద్యోగిగా ధోనీ ఏడాదికి వందకోట్లు ఆర్జిస్తున్నాడని ట్వీట్ చేశారు. మరోవైపు రెండేళ్ల నిషేధం అనంతరం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఐపీఎల్ 11లో సందడి చేయనున్నాయి. -
ఎన్ శ్రీనివాసన్ 15వసారి..
చెన్నై: తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్ శ్రీనివాసన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన టీఎన్‌సీఏ ఏజీఏం (వార్షిక సర్వసభ్య సమావేశం)లో శ్రీనివాసన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవికి శ్రీనివాసన్ ఒక్కడే పోటీలో నిలవడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. తద్వారా వరుసగా 15వ సారి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌కు శ్రీనివాసన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో పాటు 2016-17 సంవత్సరానికి కార్యనిర్వాహక కమిటీ ఆఫీస్ బేరర్స్ కూడా ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. -
శ్రీనివాసన్ కొత్త లీగ్
చెన్నై: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్. శ్రీనివాసన్ మరో సరికొత్త లీగ్ తో ముందుకు వచ్చారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) పేరుతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తమిళనాడు క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు వేదిక ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో టీఎన్‌పీఎల్ కు రూపకల్పన చేశామని వెల్లడించారు. ఇలాంటి టోర్నీల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు మంచి అవకాశాలు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆటగాళ్లను వేలం ద్వారా కొనుగోలు చేయబోమని, ముసాయిదా(డ్రాఫ్ట్) పద్ధతిలో తీసుకుంటామని తెలిపారు. ఈ ఏడాది తమ టీమ్ లేకుండా ఐపీఎల్ అయిపోయిందన్నారు. 'ఒక సీజన్ వెళ్లిపోయింది. మరో సీజన్ ఉంది. ఇది కూడా అయిపోయాక చెన్నై సూపర్ కింగ్స్ ఎటువంటి ఆటంకాలు లేకుండా మళ్లీ ఐపీఎల్ లో అడుగు పెడుతుంద'ని శ్రీనివాసన్ అన్నారు. ఐపీఎల్ లో పాల్గొనకుండా చెన్నై సూపర్ కింగ్స్ పై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
ఐసీసీ చైర్మన్ పదవి నుంచి శ్రీనివాసన్ తొలగింపు
ఐసీసీ చైర్మన్ పదవి నుంచి శ్రీనివాసన్‌ను తొలగించి, ఆ స్థానంలో శశాంక్ మనోహర్‌ను నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. సోమవారం ఉదయం ముంబైలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జూన్ వరకు ఐసీసీలో శ్రీనివాసన్ పదవీకాలం ఉండగా, ఆ స్థానంలో ఇప్పుడు శశాంక్ మనోహర్ ఉంటారు. సాధారణంగా సెప్టెంబర్ నెలాఖరులో వార్షిక సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా, అది దాదాపు నెల రోజులు వాయిదా పడింది. ఇక ప్రయోజనాల వైరుధ్యం విషయంలో కూడా నిబంధనలు కఠినంగా పాటించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కొరడా ఝళిపించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
ఐసీసీ చైర్మన్ పదవి నుంచి శ్రీనివాసన్ తొలగింపు
-
జైట్లీని కలిసిన ఠాకూర్
న్యూఢిల్లీ: బీసీసీఐలో తిరిగి పట్టు కోసం చేస్తున్న ఎన్.శ్రీనివాసన్ ప్రయత్నాలను వమ్ము చేసేందుకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వేగంగా పావులు కదుపుతున్నారు. శరద్ పవార్‌తో శ్రీని జతకట్టడం ఇష్టం లేని ఆయన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సహాయాన్ని కోరారు. ఇందులో భాగంగా తన వెంట పవార్ వర్గీయులైన శశాంక్ మనోహర్, అజయ్ షిర్కేలను మంత్రి దగ్గరకు తీసుకెళ్లారు. వీరంతా ప్రస్తుత పరిణామాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. వీరి సమావేశాన్ని బోర్డుకు చెందిన అధికారి ఒకరు ధృవీకరించారు. పవార్‌ను బాస్ చేయడంలో ఠాకూర్ వర్గానికి ఎలాంటి వ్యతిరేకత లేదని... ఆయనకు ఆసక్తి లేకపోతే, రాజీవ్‌శుక్లా లేదా షిర్కేలలో ఒకరిని అధ్యక్షుడిని చేయాలనేది ఈ వర్గం ఆలోచన. వీరికి ఈస్ట్ జోన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరం. అవిషేక్‌ను కలిసిన జైట్లీ: దాల్మియా మృతి అనంతరం అరుణ్ జైట్లీ శనివారం ఆయన కుమారుడు అవిషేక్‌ను కలుసుకున్నారు. గంటన్నరపాటు వారి నివాసంలోనే గడిపిన జైట్లీ.. అవిషేక్‌తో వ్యక్తిగతంగా సంభాషించారు. క్యాబ్ చేతిలో జాతీయ క్రికెట్ క్లబ్ (ఎన్సీసీ), త్రిపుర సీఏ ఓట్లు కూడా ఉండడంతో వీరి చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
అదే ఉత్కంఠ
బీసీసీఐ పదవిపై కొలిక్కిరాని చర్చలు పవార్‌కు శ్రీని మద్దతుపై ఊహాగానాలు న్యూఢిల్లీ : ఇన్నాళ్లు ఉప్పు.. నిప్పుగా ఉన్న ఎన్.శ్రీనివాసన్, శరద్ పవార్ తిరిగి మిత్రులుగా మారనున్నారా..? దాల్మియా మృతితో ఖాళీ అయిన బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతోంది. నాగ్‌పూర్‌లో పవార్‌ను కలుసుకునేందుకు స్వయంగా శ్రీని ప్రత్యేక విమానంలో వెళ్లి రెండు గంటలకు పైగా మంతనాలు జరిపారు. తన ప్రధాన ప్రత్యర్థి, ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌పై పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్న శ్రీని.. పవార్ వర్గానికి మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే 8 క్రికెట్ సంఘాల మద్దతు ఉన్న శ్రీని.. నాలుగు సంఘాల మద్దతు ఉన్న పవార్‌తో కలవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బోర్డు అధ్యక్షుడిగా పవార్‌కు కానీ ఆయన నామినీకి కానీ మద్దతిస్తానని, దీనికి ప్రతిగా ఐసీసీ చైర్మన్‌గా తన పదవికి ఎలాంటి అవరోధాలు కల్పించవద్దని శ్రీనివాసన్.. పవార్‌ను కోరినట్టు ఉన్నత వర్గాల విశ్లేషణ. ఠాకూర్ వర్గానికి చెందిన రాజీవ్ శుక్లా అధ్యక్షుడైతే ఐసీసీ టాప్ పోస్టులోకి భారత్ నుంచి శ్రీనిని తప్పించి మరొకరికి అవకాశం ఇస్తారని శ్రీని ఆందోళన చెందుతున్నారు. అయితే శుక్లా ఎన్నికకు అవసరమయ్యే మెజారిటీ వారికి లేదు. అటు తన అనునాయి అమితాబ్ చౌధురికి మద్దతు కూడగట్టుకునేందుకే పవార్‌ను శ్రీనివాసన్ కలుసుకున్నారనే వాదనా వినిపిస్తోంది. ఇదిలావుండగా శ్రీనితో దోస్తీని పవార్‌కు మద్దతుగా ఉన్న నాలుగు యూనిట్లలో కొన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ అత్యున్నత స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. -
ఏజీఎం జరిగే అవకాశాల్లేవు!
ముంబై : షెడ్యూల్ ప్రకారం ఈనెల 27న జరగాల్సిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగే అవకాశాలు కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం 21 రోజుల ముందు ఈ సమావేశం గురించి సభ్యులకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అంతకన్నా ముందు వర్కింగ్ కమిటీకి సంబంధించిన వివిధ సబ్ కమిటీల ఆర్థిక వ్యవహారాలు పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఇది ఇప్పట్లో తేలేలా లేదు. అదీగాకుండా ఏజీఎంకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ హాజరవుతారా? లేదా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ‘ఏజీఎం జరిగేందుకు కాస్త సమయం పడుతుంది. తర్వాతి వర్కింగ్ కమిటీ ఎప్పుడనే విషయంలోనే ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఈనెల 27న ఏజీఎం అనేది అసలు సాధ్యమే కాదు’ అని బోర్డు వర్కింగ్ కమిటీ సభ్యుడొకరు స్పష్టం చేశారు. -
సీబీఐ చార్జిషీట్‌ను కొట్టేయండి
- హైకోర్టులో శ్రీనివాసన్ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో తనను నిందితునిగా చేరుస్తూ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను, దీనిని విచారణకు తీసుకుంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలంటూ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీనివాసన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ బలుసు శివశంకరరావు విచారించారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, జగన్ కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా పిటిషనర్ గానీ, ఆయన కంపెనీ గానీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని, ఈ విషయాన్ని గమనించకుండా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిందన్నారు. ఎలాంటి ఆధారాలను చూపకుండా కింది కోర్టు పిటిషనర్ అవినీతి నిరోధక చట్టం కింద నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక అభిప్రాయానికి రావడం సరికాదన్నారు. పిటిషనర్‌పై క్విడ్ ప్రో అభియోగాలు మోపిన సీబీఐ, అందుకు సంబంధించి చార్జిషీట్లో ఎలాంటి ఆధారాలను చూపలేకపోయిందని వివరించారు. -
శ్రీనిపై విచారణ జరిపిస్తాం
బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీ: క్రికెట్ ప్రక్షాళనలో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్.శ్రీనివాసన్ వ్యవహార శైలిపై విచారణ జరిపించే అవకాశం ఉన్నట్టు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సూచించారు. వీరిద్దరి మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. బుకీతో తనకు సంబంధాలున్నాయని ఐసీసీ పేర్కొనడం వెనుక శ్రీని ఉన్నాడని ఆయన ఆరోపించారు. అలాగే బోర్డు అధికారులపై నిఘా ఉంచేందుకు బ్రిటిష్ ఏజెన్సీతో శ్రీని రూ.14 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి. ‘బోర్డు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలిపై విచారణ జరగాల్సి ఉంది. దీనికి ఎస్‌జీఎంను ఉపయోగించుకోవచ్చు. సాక్ష్యాలేమైనా లభిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం. ఈ సెప్టెంబర్ వరకు బీసీసీఐ నుంచి ఐసీసీలో శ్రీనివాసన్ నామినీగా ఉంటారు. ఆ తర్వాత ఆయన కొనసాగేదీ.. లేనిదీ.. తేలుస్తాం’ అని ఠాకూర్ అన్నారు. -
సెమీస్ మ్యాచ్‌కు శ్రీనివాసన్, ఠాకూర్
ముంబై: భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ హాజరు కానున్నారు. ఆయనతో పాటు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, కోశాధికారి అనిరుధ్ చౌదరి కూడా సెమీస్‌ను ప్రత్యక్షంగా తిలకిస్తారు. శ్రీని ఐసీసీ చైర్మన్ హోదాలోనే వరల్డ్ కప్‌కు వెళుతుండగా... బీసీసీఐ ప్రతినిధులుగా ఠాకూర్, చౌదరి హాజరవుతారు. అయితే బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మాత్రం ఆరోగ్య కారణాలతో సిడ్నీకి వెళ్లడం లేదు. సుదీర్ఘ సమయంపాటు ఆయన విమాన ప్రయాణం చేయలేరని, అందుకే వెనక్కి తగ్గారని సమాచారం. పెరిగిన చార్జీలు... ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరడంతో ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లే విమానాల చార్జీలు అమాంతం పెరిగిపోయాయి. భారత్‌లోని ప్రధాన నగరాల నుంచి సిడ్నీ లేదా మెల్బోర్న్ వెళ్లే ఫ్లయిట్లలో దాదాపు 20 శాతం వరకు చార్జీలు పెంచారు. ఉత్తరాదితో పోలిస్తే హైదరాబాద్, బెంగళూరుల నుంచి ఇది మరి కాస్త ఎక్కువగా ఉందని పేర్కొన్న ఎయిర్వేస్ రంగ నిపుణలు...భారత్ ఫైనల్ చేరితే టికెట్లు దొరకడమే గగనంగా మారవచ్చని వెల్లడించారు. -
సుప్రీంకోర్టుకు శ్రీనివాసన్ బేషరతు క్షమాపణ
న్యూఢిల్లీ: బీసీసీఐ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఫిబ్రవరి 8 వ తేదీన జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో శ్రీనివాసన్ పాల్గొనడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఆయన తరఫున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకు శ్రీనివాసన్ తరఫున క్షమాపణలు తెలియజేశారు. మార్చి 2వ తేదీన జరిగే బీసీసీఐ సమావేశానికి శ్రీనివాసన్ హాజరుకాబోరని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత వర్కింగ్ కమిటీ సమావేశంలో శ్రీనివాసన్ పాల్గొనడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇలా చేసి ఉండాల్సింది కాదు... విరుద్ధమైన ప్రయోజనాలేవో మాకు కనిపిస్తున్నాయంటూ సుప్రీం అప్పట్లో వ్యాఖ్యానించింది. -
‘వర్కింగ్ కమిటీకి ఎందుకు వెళ్లారు’
న్యూఢిల్లీ: ఈనెల 8న జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ హాజరు కావడాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ మీటింగ్‌కు కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ శ్రీని హాజరు కావడమే కాకుండా అధ్యక్షత వహించారని బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ పిటిషన్ వేయగా కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, కేవలం ఏజీఎం తేదీని మాత్రమే ఖరారు చేశారని శ్రీని తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనకూడదనే కోర్టు తీర్పునిచ్చిందని, కానీ ఎన్నికలయ్యే వరకు తన పదవికి దూరంగా ఉండమని చెప్పలేదని అన్నారు. వచ్చే శుక్రవారంలోపు తాము పూర్తి వివరణ ఇస్తామని ఆయన కోర్టుకు తెలిపారు. -
శ్రీనివాసన్‌కు భంగపాటు తప్పదా?
న్యూఢిల్లీ : మరోసారి బిసిసిఐ అధ్యక్షుడు కావాలని ఆశపడుతోన్న శ్రీనివాసన్ కు భంగపాటు తప్పదని వినిపిస్తోంది. ఐపీఎల్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ నివేదికపై సుప్రీం కోర్టులో గురువారం కూడా విచారణ కొనసాగింది. బిసిసిఐ అధ్యక్షుడిగా...చెన్నయ్ సూపర్ కింగ్స్ ఓనర్‌గా శ్రీనివాసన్ ఎలా వ్యవహరిస్తారని మొన్ననే సుప్రీం కోర్టు నిలదీసిన సంగతి తెలిసిందే. ఇక ముద్గల్ కమిటీలో శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మేయప్పన్కు బుకీలతో సంబంధాలున్నాయని తేలిన నేపథ్యంలో చెన్నయ్ సూపర్ కింగ్స్‌పై వేటు పడే అవకాశాలున్నాయని అంటున్నారు. చెన్నయ్ సూపర్ కింగ్స్‌లో శ్రీనివాసన్ తనకున్న వాటాల వివరాలను కోర్టు ముందుంచాలని సుప్రీం ఆదేశించింది. ముద్గల్ కమిటీ నివేదికపై తక్షణమే చర్యలు తీసుకుని దోషులను బయట పెట్టాలని సుప్రీం ఆదేశిస్తోంది. ప్రత్యేకించి బిసిసిఐ దాచిపెడుతోన్న నంబర్ టూ , నంబర్ త్రీ ప్లేయర్ల పేర్లు బయట పెట్టాలని న్యాయస్థానం ఆదేశించే అవకాశాలున్నాయి. క్రికెట్ ప్రక్షాళనే అజెండా కావాలని సుప్రీం ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా అన్ని వివాదాలకు బీసీసీఐ తెర దించాలని న్యాయస్థానం సూచించింది. బీసీసీఐకి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తూ, ముద్గల్ కమిటీ దోషులుగా పేర్కొన్న వారు ఎన్నికల్లో పోటీ చేయరాదని స్పష్టం చేసింది. -
చెన్నై సూపర్ కింగ్స్‌ను రద్దు చేసే అవకాశం!
న్యూఢిల్లీ : ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి దర్యాప్తు లేకుండానే సీఎస్కేను రద్దు చేయాలని పేర్కొంది. ఈ సందర్భంగా శ్రీనివాసన్‌కు సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. సీఎస్కే యజమానులు ఎవరని ప్రశ్నించింది. షేర్ హోల్డర్ల వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎన్నికలకు శ్రీనివాసన్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను రద్దు చేసేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇండియా సిమెంట్స్ సుప్రీం కోర్టును కోరిన విషయం తెలిసిందే. ఆ టీమ్ ప్రిన్సిపల్‌గా ఉన్న గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని ముద్గల్ కమిటీ నివేదికలో పేర్కొనటంతో లీగ్ నిబంధనల ప్రకారం సీఎస్కే ఫ్రాంచైజీని రద్దు చేయాల్సి ఉంటుంది. -
నన్ను అనుమతించండి
బీసీసీఐ అధ్యక్ష పదవిపై సుప్రీంకు శ్రీనివాసన్ అభ్యర్థన న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ క్లీన్చిట్ ఇచ్చినందున.... బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఎన్.శ్రీనివాసన్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అలాగే కమిటీ నివేదికలోని అభ్యంతరాలపై ఆయన శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేశారు. ‘ప్యానెల్ పరిశోధన పూర్తయ్యింది. దాంట్లో ఎలాంటి నేరారోపణలు నాపై లేవు. నేను అమాయకుడిని. నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు కూడా బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉండడంలో ఎలాంటి అర్థం లేదు. ఇప్పటికే పస లేని ఆరోపణలతో దాదాపు ఏడాది కాలంగా పదవికి దూరంగా ఉన్నాను. తిరిగి నేను అధ్యక్షుడిగా కొనసాగేలా అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక నివేదికలో ఓ క్రికెటర్ తప్పు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపిన విషయం చాలా చిన్నది. అది నాపై నేరారోపణ చేసినట్టు కాదు’ అని ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న శ్రీనివాసన్ అన్నారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాంపై విచారణ పారదర్శకంగా కొనసాగేలా.. బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనిని తప్పుకోవాలని ఈ ఏడాది మార్చిలో సుప్రీం ఆదేశించింది. మరోవైపు వచ్చే నెల 17న జరిగే బీసీసీఐ ఏజీఎంకు ముందే అధ్యక్ష పదవి చేపట్టేందుకు శ్రీనివాసన్ ఆసక్తి చూపుతున్నారు. ఈస్ట్ జోన్ మద్దతుతో మరో దఫా ఈ పదవిలో కొనసాగేందుకు శ్రీని పావులు కదుపుతున్నారు. ‘సీఎస్కేను రద్దు చేయొద్దు’ ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఉద్వాసన పలికేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇండియా సిమెంట్స్ సుప్రీం కోర్టును కోరింది. ఆ టీమ్ ప్రిన్సిపల్‌గా ఉన్న గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని ముద్గల్ కమిటీ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో లీగ్ నిబంధనల ప్రకారం సీఎస్కే ఫ్రాంచైజీని రద్దు చేయాల్సి ఉంటుంది. ‘ఐపీఎల్లో సీఎస్కే చాలా ప్రాముఖ్యమైన జట్టు. చెన్నై ఆటగాళ్లకు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ జట్టును పక్కకు తప్పిస్తే అది ఒక్క సీఎస్కేకే కాకుండా మొత్తం ఐపీఎల్‌లోనే తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తుంది. అసలు గురునాథ్ ఈ జట్టు భాగస్వామి కాదు.. డెరైక్టర్, కంపెనీ ఉద్యోగి కూడా కాదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీకి చెందిన కంపెనీ లేక యజమాని మాత్రమే అనైతిక కార్యకలాపాలకు పాల్పడితే జట్టు రద్దు అవుతుంది’ అని ఇండియా సిమెంట్స్ పేర్కొంది. -
శ్రీనివాసన్‌కు క్లీన్చిట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌కు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ క్లీన్చిట్ ఇచ్చింది. ఐపీఎల్-6లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతంపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిటీ.. శ్రీనివాసన్ ఎలాంటి తప్పూ చేయలేదని తేల్చింది. ఆయన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లకు పాల్పడినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అలాగే ఈ కేసు విచారణను అడ్డుకునేందుకు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలిపింది. అయితే ఓ ఐపీఎల్ ఆటగాడు లీగ్ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన విషయం శ్రీనితో పాటు మరో న లుగురు బోర్డు అధికారులకు తెలిసినా అతడిపై ఎలాంటి చర్య తీసుకోలేదని కమిటీ చెప్పింది. కానీ ఆ ఆటగాడెవరు? అతడు అతిక్రమించిన నిబంధనలు ఏమిటి? అనే విషయాలను కమిటీ వెల్లడించలేదు. నివేదికలో ఈ ఆటగాడిని మూడో నంబర్‌గా పేర్కొంది. ఈనెల 14న ఈ మొత్తం విచారణకు సంబంధించిన తుది నివేదికను కమిటీ సుప్రీం కోర్టుకు అందించిన విషయం తెలిసిందే. వీరిలో నలుగురు అధికారుల పాత్రపై నోటీసులు కూడా జారీ చేసింది. 25 పేజీల ఈ నివేదిక సోమవారం మీడియాకు అందుబాటులోకి వచ్చింది. దీంట్లో ఆ నలుగురికి సంఖ్యలు కేటాయించారు. గురునాథ్ నంబర్‌వన్‌గా ఉండగా, రాజ్ కుంద్రా నంబర్ 11, సుందర్ రామన్ నంబర్ 12, శ్రీనివాసన్ నంబర్ 13గా ఉన్నారు. బుకీతో సుందర్ రామన్‌కు సంబంధం ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్‌కు నేరుగా బుకీతో సంబంధాలున్నాయని కమిటీ తేల్చింది. సీజన్లో ఓ బుకీకి రామన్ ఎనిమిది సార్లు ఫోన్ చేశాడని చెప్పింది. విచారణలో ఈ విషయాన్ని రామన్ అంగీకరించారని, అయితే తాను ఫోన్ చేసిన వ్యక్తికిబెట్టింగ్తో సంబంధాలున్న విషయం తెలీదని చెప్పాడని నివేదిక తెలిపింది. ‘రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న సమాచారం కూడా రామన్‌కు తెలుసు. అయితే ఇది శిక్షార్హమైన సమాచారం కాదని ఐసీసీ-ఏసీఎస్‌యూ చీఫ్ తెలిపినట్టు రామన్ విచారణలో చెప్పాడు’ అని నివేదిక పేర్కొంది. కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడ్డారు గతేడాది ఫిబ్రవరిలో కుంద్రాను బెట్టింగ్ గురించి ప్రశ్నించినప్పుడు తనకేమీ తెలీదని సమాధానమిచ్చాడని కమిటీ పేర్కొంది. ‘అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఆయన బుకీలతో టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. కుంద్రా స్నేహితుడొకరు చాలా పేరున్న పంటర్. తన తరఫున బెట్టింగ్ చేసేవాడు. మరోవైపు ఢిల్లీ పోలీసుల నుంచి కుంద్రా కేసు తమకు బదిలీ అయిన వెంటనే రాజస్థాన్ పోలీసులు ఎలాంటి కారణం లేకుండానే హఠాత్తుగా విచారణను ఆపేశారు’ అని కమిటీ పేర్కొంది. గురునాథ్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్‌గా కొనసాగిన గురునాథ్ మెయ్యప్పన్‌కు స్పాట్ ఫిక్సింగ్‌లో ప్రమేయం లేదని ముద్గల్ కమిటీ తెలిపింది. అయితే తను చట్టవ్యతిరేక బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్టు తేల్చింది. ‘బుకీలకు తనకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తితో సంభాషణలు జరిపినట్టు ఫోరెన్సిక్ శాంపిల్ తేల్చింది. అలాగే ఆయన చెన్నై టీమ్ ప్రిన్సిపల్ అని రూఢీ అయ్యింది. అయితే తను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టుగా ఎవరూ చెప్పలేకపోయారు’ అని కమిటీ తేల్చింది. చెన్నై, రాజస్థాన్ జట్ల పరిస్థితి ప్రశ్నార్థకం! ఐపీఎల్ ఫ్రాంచైజీలైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతోందనేది ప్రశ్నార్థకంగా మారింది. ముద్గల్ కమిటీ నివేదికలో వీరిద్దరికి ఆయా జట్లతో అధికారిక సంబంధాలున్నాయని తేలింది. లీగ్ నిబంధనల ప్రకారం ఏదేని జట్టు అధికారి తమ ప్రవర్తనతో ఆట ప్రతిష్టకు మచ్చ తెచ్చేట్టుగా ప్రవర్తిస్తే వారి ఫ్రాంచైజీ రద్దు అవుతుంది. కచ్చితంగా చర్యలు ఉంటాయి: శివలాల్ యాదవ్ బెట్టింగ్‌కు పాల్పడినట్టు కమిటీ తేల్చిన రాజ్ కుంద్రా, గురునాథ్ మెయ్యప్పన్లపై కఠిన చర్యలుంటాయని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఒకవేళ సుందర్ రామన్ బుకీతో మాట్లాడినట్టు సాక్ష్యాలు ఉంటే ఆయనపై కూడా చర్యలుంటాయని అన్నారు. బీసీసీఐ ఎవరినీ ఉపేక్షించదని శివలాల్ పేర్కొన్నారు. నేడు బీసీసీఐ అత్యవసర సమావేశం చెన్నై: ముద్గల్ కమిటీ నివేదికతో పాటు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నూతన తేదీపై బీసీసీఐ అత్యవసర వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో చర్చించనున్నారు. నేడు (మంగళవారం) చెన్నైలో ఈ సమావేశం జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న ఏజీఎం జరగాల్సి ఉన్నా ముద్గల్ కమిటీ విచారణ నేపథ్యంలో నాలుగు వారాలపాటు వాయిదా వేశారు. ఇప్పుడు నిర్దిష్ట తేదీపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో శ్రీనివాసన్ కూడా సమావేశానికి హాజరవుతారు. -
ఇండియా సిమెంట్స్‌కు నష్టం రూ. 31 కోట్లు
చెన్నై: గడిచిన ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో ఇండియా సిమెంట్స్ రూ. 30.6 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) క్యూ4లో రూ. 26.3 కోట్ల నికర లాభాన్ని సాధించింది. స్టాండెలోన్ ఫలితాలివి. సిమెంట్‌కు డిమాండ్ మందగించడం, సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమైనట్లు కంపెనీ వైస్‌చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. దక్షిణాదిలో డిమాండ్‌కు మించిన సరఫరా ఉండటంతో సిమెంట్ అమ్మకపు ధరలపై ఒత్తిడి పడినట్లు చెప్పారు. 2009లో ఆంధ్రప్రదేశ్‌లో సిమెంట్‌కు 24 లక్షల టన్నుల డిమాండ్ నమోదుకాగా, ప్రస్తుతం 16 లక్షల టన్నులకు పరిమితమైనట్లు తెలిపారు. కాగా, క్యూ4లో నికర అమ్మకాలు కూడా రూ. 1,191 కోట్ల నుంచి రూ. 1,080 కోట్లకు క్షీణించాయి. పూర్తి ఏడాదికి పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ రూ. 117 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. అంతక్రితం ఏడాదిలో రూ. 188 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక నికర అమ్మకాలు సైతం రూ. 5,159 కోట్ల నుంచి రూ. 5,085 కోట్లకు తగ్గాయి. సిమెంట్‌కు తగిన స్థాయిలో డిమాండ్ పుంజుకునేందుకు కనీసం ఆరు నెలల కాలం పడుతుందని శ్రీనివాసన్ అంచనా వేశారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి సిమెంట్ అమ్మకాలు పెరిగే అవకాశమున్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకాలు పడిపోగా, తమిళనాడు, కేరళలో సిమెంట్‌కు మంచి డిమాండ్ ఉన్నదని చెప్పారు. దేశీ కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గులు, రైల్వే రవాణా చార్జీల్లో పెరుగుదల వంటి అంశాలు కూడా ఫలితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా రూ. 166 కోట్ల ఆదాయం సమకూరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు దాదాపు 5% పతనమై రూ. 99 వద్ద ముగిసింది. -
బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెఢీ: గవాస్కర్
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి తాను సిద్దమేనని క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తెలిపారు. అధ్యక్ష పదవిని చేపట్టడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశిస్తే సంతోషంగా పదవిని చేపట్టడుతానన్నారు. ప్రస్తుతం కామెంటేటర్ గా పనిచేయడానికి బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకున్నానని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు అధికారికంగా ఆదేశిస్తే అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెడీ అని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వేచి చూస్తానని ఆయన అన్నారు. ఓపెనర్ బ్యాట్స్ మెన్ గా అన్ని రకాలైన సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై విచారణ పూర్తయ్యే వరకు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ను తొలగించి.. సునీల్ గవాస్కర్ కు బాధ్యతలు అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
'బీసీసీఐ అధ్యక్షుడిగా గవాస్కర్ ను నియమించండి'
న్యూఢిల్లీ: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సునీల్ గవాస్కర్‌ను నియమించండని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో తుది తీర్పు వచ్చేంత వరకూ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను పక్కనపెట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఐపీఎల్-7లో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టు ప్రతిపాదన చేయడం సంచలనం రేపుతోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఆటగాళ్లు, యాజమాన్యాలపై ఆరోపణలు వెలువడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన శ్రీశాంత్, చండీలా, చవాన్ లు అరెస్టయ్యారు. ఈ కుంభకోణంలో చెన్నై సూపర్ కింగ్స్ సహ యజమాని గురునాథన్ మేయప్పన్ ను కూడా అరెస్ట్ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై నమోదైన కేసులో సుప్రీంకోర్టు తీర్పు శుక్రవారం తీర్పు వెల్లడించనుంది. -
శ్రీనివాసన్.. ఇక తప్పుకో చాలు: సుప్రీం
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ మెడకు చుట్టుకుంది. స్పాట్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే శ్రీనివాసన్ స్వయంగా ఆ పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయ పడింది. ఆయన తనంతట తాను ఆ పదవి నుంచి వైదొలుగుతారా లేక తాము జోక్యం చేసుకోవాలా అంటూ శ్రీనివాసన్ తరపు న్యాయవాదులను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. లేకుంటే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించింది. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండా ఆ కుర్చీని అంటిపెట్టుకుని ఉండటంలో అంతర్యమేమిటని సుప్రీం ప్రశ్నించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తు చూస్తుంటే వాంతు వచ్చేలా ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది. -
'మిస్టర్ కూల్' పాత్రపై అనేక అనుమానాలు!
ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక భారత క్రికెట్ రంగాన్ని మరోసారి కుదిపేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న టాప్ క్రికెటర్ల పేర్లు జస్టిస్ ముకుల్ నివేదికలో వెలుగు చూడటం క్రికెట్ పండితులను, అధికారులను, అభిమానులను కలవరపరుస్తోంది. ముఖ్యంగా భారత క్రికెటర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాల పేర్లు నివేదికలో ఉండటం క్రికెట్ ఆటపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో శ్రీశాంత్ తోపాటు మరికొంత మంది కీలక ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో క్రికెట్ రంగం ఉలిక్కి పడింది. రాజస్థాన్ రాయల్స్ తోపాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ఫిక్సింగ్ ఆరోపణల్లో ఎదుర్కోవడం మరింత ఆందోళన కలిగించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యమే ఫిక్సింగ్ కు పాల్పడినట్టు, ఆ జట్టు యజమాని, బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ కీలక సూత్రధారి అంటూ ఆరోపణలు వెల్లువెత్తడం సంచలనం రేపింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి సైతం ఫిక్సింగ్ కుంభకోణంలో పాత్ర ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ కుంభకోణంలో అరెస్టైన దారాసింగ్ తనయుడు విందూ దారా సింగ్ తో ధోనీ సతీమణి సాక్షి సన్నిహితంగా మెలగడం అనేక విమర్శలకు తావిచ్చింది. ఫిక్సింగ్ కుంభకోణంలో ధోనీ పాత్రపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత ఫిక్సింగ్ కుంభకోణంలో తనపై వచ్చిన ఆరోపణలు సమాధానమిస్తూ.. కాలమే సమాధానం చెపుతుంది అని అప్పట్లో వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. శ్రీశాంత్ తోపాటు, ఇతర క్రికెటర్లు అరెస్ట్ కావడం, ఇదే కేసులో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ్ మేయప్పన్ ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత క్రికెట్ ప్రతిష్టకు మచ్చ తెచ్చిన ఫిక్సింగ్ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశిస్తూ పంజాబ్, హర్యానా మాజీ చీఫ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టి.. సోమవారం నాడు నివేదిక సమర్పించింది. మేయప్పన్ పిక్సింగ్ కు పాల్పడ్డారనే ఈ కమిటీ నిగ్గు తేల్చింది. మేయప్పన్ ఓ ఔత్సాహికుడు మాత్రమేనని, ఆయనకు జట్టు వ్యహరాల్లో పాత్ర లేదంటూ గతంలో ధోనీ మీడియాకు వివరించారు. కానీ ప్రతి మ్యాచ్ జరగడానికి ముందు ధోనీ, ఫ్లెమింగ్ తో కలిసి జట్టు వ్యూహాలను రచించేవారమని మేయప్పన్ వెల్లడించారు. ఫ్లెమింగ్ తో కలిసి జట్టు వేలం గురించి తాను చర్చించానని మేయప్పన్ తెలిపారు. జట్టులో మేయప్పన్ పాత్ర కీలకమే అని దాన్ని బట్టి అర్ధమవుతోంది. కానీ బీసీసీఐ చీఫ్, భారత కెప్టెన్ ధోనీ మాత్రం వీలైనంతవరకు మేయప్పన్ పై వచ్చిన ఆరోపణల తీవ్రత తగ్గించేందుకు గతంలో ప్రయత్నించారన్నది తాజా వివేదికలో వెల్లడవుతోంది. ముకుల్ కమిటీ నివేదిక వెల్లడైన నేపథ్యంలో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిక్సింగ్ కుంభకోణంలో పాత్ర ప్రత్యక్షంగా ఉందని తెలిసినా మేయప్పన్ ను ధోనీ ఎందుకు వెనుకేసుకొచ్చాడు? పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన బీసీసీఐ చీఫ్ అల్లుడిని కాపాడాల్సిన అవసరం ధోనీకి ఏముంది? విందూ సింగ్ తో ధోనీ సతీమణి సన్నిహిత సంబంధాలు ఫిక్సింగ్ కు దారితీశాయా? స్పాట్ ఫిక్సింగ్ లో దోనీ పాత్ర కూడా ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ ప్రతిష్ట గంగలో కలువక ముందే ధోనీ స్పందించాల్సిన సమయం వచ్చిందని పలువురు పండితులు అంటున్నారు. ముకుల్ కమిటీ నివేదిక వెల్లడైన నేపథ్యంలో అన్ని వేళ్లు ధోనీ వైపే ఉన్నాయి. ఫిక్సింగ్ కుంభకోణంలో తనపై వస్తున్న ఆరోపణల్ని, తన పాత్రపై వస్తున్న అనుమానాలకు ధోనీ ఎలా సమాధానం చెబుతాడో వేచి చూడాల్సిందే. -
జీవితకాలపు వేటు వేయాల్సిందే: మోడీ
బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్, అతని అల్లుడు గురునాథ్ మేయప్పన్ పై జీవితకాలపు నిషేధం విధించాలని బహిష్కృత ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ డిమాండ్ చేశారు. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో గురునాథ్ మేయప్పన్ పై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ ముగ్దల్ కమిటి నేరారోపణ చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఇండియా సిమెంట్ యాజమాన్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై చర్యలు తీసుకోవడానికి అధికారులు నిద్ర మత్తు నుంచి బయటపడాల్సిన సమయం ఆసన్నమైంది లలిత్ మోడీ ట్విటర్ లో తెలిపారు. ఈ వ్యవహారం గురించి నేనెప్పటి నుంచో చెబుతున్నాను. ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై జీవితకాలపు బహిష్కరణ విధించాలి అని ఆయన అన్నారు. నివేదిక కాపీ కోసం వేచి చూస్తున్నాను. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని బెట్టింగ్, ఫిక్సింగ్ పాల్పడితే.. నిబంధనల ప్రకారం వేటు వేయాలని ఆయన అన్నారు. -
స్పాట్ ఫిక్సింగ్ లో మేయప్పన్ కు ఎదురుదెబ్బ!
బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు మాజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని గురునాథ్ మేయప్పన్ మళ్లీ కష్టాల్లో పడ్డారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ సోమవారం నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయప్పన్ పాత్ర ఉందంటూ ముగ్దల్ కమిటీ నేరారోపణ చేసింది. ముగ్లల్ కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశాలకు మేయప్పన్ సమాధానమివ్వాలని ఆదేశించారు. మేయప్పన్ క్రికెట్ ఔత్సాహికుడు అంటూ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలను విచారణ కమిటి తిరస్కరించింది. మద్రాస్ హై కోర్టుకు చెందిన ఇద్దరు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ టి జయరామ చౌతా, ఆర్ బాలసుబ్రమణ్యంతో కూడిన దిసభ్య కమిటీ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బీహార్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేయడంతో గత సంవత్సరం ముగ్దల్ కమిటిని ఏర్పాటు చేశారు. గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా ఆటగాళ్లను, జర్నలిస్టులను, జట్టు యాజమాన్యాన్ని, పోలీసులను, అవినీతి నిరోధక ఆధికారులను, వివిధ వ్యక్తులతోపాటు టాప్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, ఇతరులను కమిటీ విచారించింది. -
ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టనున్న శ్రీనివాసన్
-
అంతరాత్మ అనుమతించింది
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పుతో బీసీసీఐ చీఫ్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్రీనివాసన్ ఈ అంశంలో తన అంతరాత్మ చాలా క్లియర్‌గా ఉందని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే పదవిని వదిలిపెట్టి పోలేదన్నారు. తన అల్లుడు, చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్‌పై ముంబై పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసినా... బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంతరాత్మ అంగీకరించిందా? అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. తాను తప్పు చేయలేదు కాబట్టి ఈ మొత్తం ఉదంతంలో నైతికతకు తావులేదని స్పష్టం చేశారు. ‘కచ్చితంగా చెబుతున్నా నేను మరో రకంగా భావిస్తే ఈ పదవిని స్వీకరించేవాడిని కాదు. ఆరంభంలో నేను ఏ మాటైతే చెప్పానో దానికే కట్టుబడి ఉన్నా. నేను తప్పు చేసి ఉంటే నా అంతరాత్మ అనుమతి ఇచ్చేది కాదు’ అని శ్రీని పేర్కొన్నారు. గురునాథ్‌పై జరిగిన విచారణలో తన ప్రమేయం లేదని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ‘విచారణ మొదలైనప్పుడు నేను బోర్డు చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్నా. ఆ తర్వాత ఇద్దరు జడ్జిల కమిటీని బీసీసీఐ వర్కింగ్ కమిటీ నియమించింది. ఇందులో నా ప్రమేయం లేదు. కమిటీ ఇచ్చిన నివేదికను కూడా చూడలేదు. శ్రీశాంత్ కేసును కమిటీతో పాటు రవి సవానీ విచారించారు. వీళ్ల కార్యక్రమాలు, ఎన్ని సమావేశాలు జరిగాయో కూడా నాకు తెలియదు’ అని శ్రీనివాసన్ వివరించారు. -
శ్రీనివాసన్‌కు తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌తో సమస్యల సునామీలో చిక్కుకున్న బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ బయటపడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఆయనకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై విచారణ జరిపేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ముకుల్ ముగ్దల్ నేతృత్వంలో దర్యాప్తు సంఘాన్ని నియమించింది. నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని శ్రీనివాసన్‌ను కోర్టు ఆదేశించింది. ఈ కమిటీ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ యజమానులపై వచ్చిన ఆరోపణలపై కమిటీ విచారణ జరుపుతుందని న్యాయస్థానం వెల్లడించింది. బీసీసీఐ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో శ్రీనివాసన్ బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. తన మద్దతుదారులకు బోర్డు పదవులు కట్టబెట్టి బీసీసీఐలో తనకు ఎదురులేదని శ్రీనివాసన్ మరోసారి నిరూపించుకున్నారు. -
సుప్రీం కోర్టులో శ్రీనివాసన్‌కు ఊరట
బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన ఎన్.శ్రీనివాసన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఐతే ఐపీఎల్‌కు సంబంధించిన విషయాలపై జోక్యం చేసుకోరాదని ఆదేశించింది. శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటీషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ రాకెట్లో శ్రీని అల్లుడు గురునాథ్ మేయప్పన్‌పై ఆరోపణలు రావడంతో ఆయన్ను బోర్డు పదవులకు దూరంగా ఉంచాలని కోర్టును బీహార్ సంఘం విన్నవించింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. -
ఎన్నికల్లో పోటీ చేస్తా: శ్రీనివాసన్
బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు శ్రీనివాసన్ ప్రకటించారు. బోర్డు ఎన్నికల నిర్వహణకు, శ్రీనివాసన్పోటీ చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. కాగా ఎన్నికల్లో గెలుపొందినా పదవికి దూరంగా ఉండాలని ఆయనను ఆదేశించింది. ఐపీఎల్ ఫిక్సింగ్ కేసుకు శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ సంఘం వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించేవరకు బోర్డు పదవులకు దూరంగా ఉండాలన సుప్రీం కోర్టు షరతు విధించింది. కాగా బోర్డు ఎన్నికలు ఆదివారం చెన్నైలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు కోర్టు అభ్యంతర వ్యక్తం చేయలేదని శ్రీనివాసన్ చెప్పారు. ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ రాకెట్ అనంతరం బోర్డు అధ్యక్ష పదవి నుంచి తాత్కాలికంగా వైదొలిగిన శ్రీని మరో సారి ఎన్నికయ్యేందుకు మద్దతు కూడగడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల క్రికెట్ సంఘాలు మద్దతిచ్చే అవకాశముంది. -
శ్రీనివాసన్‌కు మళ్లీ నిరాశ.. సుప్రీం కోర్టు షరతు
బీసీసీఐ అధ్యక్ష పదవిని మళ్లీ అధిష్టించాలని ఆశిస్తున్న ఎన్.శ్రీనివాసన్‌కు కాస్త ఉపశమనం కలిగినా నిరీక్షణ మాత్రం తప్పలేదు. ఈ నెల 29న జరిగే బోర్డు వార్షిక సర్వ సభ్య సమావేశానికి, అధ్యక్ష పదవి ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెన్నయ్‌లో జరిగే ఈ సమావేశంలో అధ్యక్ష పదవితో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అనుమతిచ్చింది. ఐతే బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ మరోసారి ఎన్నికయినా బాధ్యతలు చేపట్టరాదని ఆదేశించింది. బీసీసీఐ ఎన్నికల్లో శ్రీనివాసన్ పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ బీహార్ క్రికెట్ సంఘం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీనివాసన్ అల్లుడు, చెన్నయ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మాజీ టీమ్ ప్రిన్సిపాల్ బెట్టింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ దశలో ఉండటంతో పాటు బోర్డు అధ్యక్ష పదవి నుంచి శ్రీనివాసన్ తాత్కలికంగా వైదొలగిన విషయాలను బీహార్ సంఘం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ కేసులో తాము తీర్పు వెలువరించే వరకు శ్రీనివాసన్ బోర్డు పదవికి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇదిలావుండగా బోర్డు పగ్గాలు చేపట్టేందుకు శ్రీనివాసన్ వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల మద్దతు కూడగడుతున్నారు. -
శ్రీనివాసన్ మళ్లీ ఎన్నికైతే భారత క్రికెట్ నాశనమే: మోడి
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ మరోసారి ఎన్నికైతే అది భారత్ క్రికెట్‌కు వినాశకరమే అవుతుందని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడి ధ్వజమెత్తారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, వ్యాపార ప్రకటనదారులు, పరిపాలకులు శ్రీనివాసన్ తిరిగి ఎన్నికైతే తీవ్రంగా నిరాశపడతారు. అది ఓ తప్పుడు సందేశాన్ని పంపినట్టవుతుంది. ఓ రకంగా భారత క్రికెట్ మునిగినట్టే. క్రికెట్‌ను ఇక్కడ మతంగా భావిస్తారు. ఆయనకు నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. దక్షిణాది సంఘాలు ఇంకా ఆయనకే మద్దతివ్వడం శోచనీయం’ అని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మోడి అన్నారు. ‘ఏజీఎంలో పాల్గొనకుండా చూడండి’ బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌ను బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) ఇప్పట్లో వదిలేలా లేదు. ఈనెల 29న చెన్నైలో జరిగే బోర్డు వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన పాల్గొనకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సీఏబీ కార్యదర్శి ఆదిత్య వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే బీసీసీఐ కమిటీల్లో కానీ, ఇతర కార్యక్రమాల్లో కానీ శ్రీనివాసన్ హాజరు కాకుండా అడ్డుకోవాలని కోరారు. -
బీసీసీఐ అధ్యక్ష పదవిపై శ్రీనివాసన్ కన్ను
ముంబై: మరోసారి బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రస్తుత అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ఈమేరకు సెప్టెంబర్ 29న చెన్నైలో జరిగే బోర్డు వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో జరిగే ఎన్నికల్లో తలపడతానని ఆయన చెప్పారు. గురువారం ఇక్కడ జరిగిన బోర్డు మార్కెటింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘అధ్యక్ష పదవికి మరోసారి పోటీపడాలనుకుంటున్నాను. మీరంతా నాకు మద్దతిచ్చినా సరే లేక వ్యతిరేకించినా సరే. అలాగే దక్షిణాది యూనిట్లతో చెన్నైలో సమావేశం జరిపినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. వేదిక గురించి మీడియాలో తప్పుగా పేర్కొన్నారు’ అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. వాస్తవానికి బోర్డు అధ్యక్ష పదవి రెండేళ్లే అయినప్పటికీ అందరి మద్దతుతో మరో ఏడాది పొడిగించుకునేందుకు నిబంధనలు సవరించారు. దీంతో శ్రీనివాసన్ మరో ఏడాది పాటు బాధ్యతలు తీసుకోవాలని భావించినా అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారం ఆయనకు చిక్కుల్ని తెచ్చిపెట్టింది. బెట్టింగ్‌పై విచారణ పూర్తయ్యే దాకా ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కూడా మరోసారి బోర్డు చీఫ్ పదవిపై కన్నేశారు. అయితే ఆయనకు దక్షిణాది నుంచి కేవలం ఒక్క యూనిట్ మాత్రమే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. -
మళ్లీ పోటీ చేస్తా: మీడియాకు శ్రీనివాసన్ సవాల్
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, ఇతర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ ఎన్ శ్రీనివాసన్ బోర్దు ఎన్నికల్లో టాప్ పోస్ట్ కు పోటీ చేస్తానని గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 29న జరిగే ఎన్నికల్లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటి పడుతానని ఆయన తెలిపారు. బీసీసీఐ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో శ్రీనివాసన్ మాట్లాడుతూ.. మీడియా తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఎన్నికల్లో పోటికి నిలబడుతానని సవాల్ విసిరాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో తన అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తడంతో శ్రీనివాసన్ రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలనంతరం శ్రీనివాసన్ పక్కకు తప్పించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్ మోహన్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. -
శ్రీనివాసన్‌కు పోటీ తప్పదా!
న్యూఢిల్లీ: మరో ఏడాది పాటు బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు పొడిగించుకునేందుకు ఎన్.శ్రీనివాసన్ తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 29న చెన్నైలో బోర్డు సాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరుగనుంది. అంతలోపు వీలైనంత మద్దతు కూడగట్టుకోవాలని శ్రీని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాదిన ఉన్న బోర్డు గుర్తింపు సంఘాల ప్రతినిధులను చెన్నైకి ఆహ్వానించారు. ఈ సమావేశానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), కేరళ సీఏ, కర్ణాటక స్టేట్ సీఏ హాజరు కాగా గోవా క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ), ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మాత్రం డుమ్మా కొట్టాయి. దీంతో అధ్యక్ష పదవి కోసం ఎన్నిక అనివార్యం కానుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘చెన్నైలో సమావేశం కోసం బీసీసీఐ దక్షిణాది యూనిట్స్‌ను బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ పిలిచిన విషయం వాస్తవమే. అయితే కొన్ని పనుల వల్ల నేను అక్కడికి వెళ్లలేకపోయాను. ఆయన మా మద్దతు కోసం ఈ మీటింగ్ పెట్టారా? అనేది అంతర్గత వ్యవహారం. ఆ విషయాలు నేనేమీ చెప్పలేను’ అని జీసీఏ అధ్యక్షుడు వినోద్ ఫడ్కే అన్నారు. శ్రీనికి పోటీగా శశాంక్ మనోహర్! ఇదిలావుండగా మొత్తం 31 యూనిట్లలో చాలా వరకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌ను శ్రీనికి పోటీగా ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నట్టు, జీసీఏనే ఆయన పేరును ప్రతిపాదించనున్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఫడ్కే స్పందిస్తూ ఇంకా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని అన్నారు. అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల సమర్పణకు చివరి తేది ఈనెల 28. పదవి కోసం బరిలోకి దిగే వ్యక్తి పేరును మరో జోన్ బలపరచాల్సి ఉంటుంది. -
'శ్రీశాంత్ పై నిషేధంలో బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ దే కీలక పాత్ర'
కోచి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విధించిన నిషేధంపై కోర్టులో సవాల్ చేయనున్నాడని అతని తరపు న్యాయవాదులు తెలిపారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు శ్రీశాంత్ న్యాయవాది రెబెకా జాన్ ఢిల్లీలో స్థానిక మీడియా టెలివిజన్ కు తెలిపారు. అంతేకాక శ్రీశాంత్ పై జీవిత కాల నిషేధం విధించడంలో బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ దే కీలక పాత్ర అని ఆరోపించారు. కోర్టు తీర్పుకోసం వేచిచూడకుండా.. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన కొన్ని పేపర్ల ఆధారంగా శ్రీశాంత్ పై వేటు వేయడం అన్యాయం అని అన్నారు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీశాంత్, అంకిత్ చవాన్ లపై బీసీసీఐ శుక్రవారం జీవితకాలపు నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.