న్యూఢిల్లీ: ఈనెల 8న జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ హాజరు కావడాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ మీటింగ్‌కు కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ శ్రీని హాజరు కావడమే కాకుండా అధ్యక్షత వహించారని బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ పిటిషన్ వేయగా కోర్టు విచారణ చేపట్టింది.
అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, కేవలం ఏజీఎం తేదీని మాత్రమే ఖరారు చేశారని శ్రీని తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనకూడదనే కోర్టు తీర్పునిచ్చిందని, కానీ ఎన్నికలయ్యే వరకు తన పదవికి దూరంగా ఉండమని చెప్పలేదని అన్నారు. వచ్చే శుక్రవారంలోపు తాము పూర్తి వివరణ ఇస్తామని ఆయన కోర్టుకు తెలిపారు.
‘వర్కింగ్ కమిటీకి ఎందుకు వెళ్లారు’
Published Tue, Feb 24 2015 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement