ముంబై : షెడ్యూల్ ప్రకారం ఈనెల 27న జరగాల్సిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగే అవకాశాలు కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం 21 రోజుల ముందు ఈ సమావేశం గురించి సభ్యులకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అంతకన్నా ముందు వర్కింగ్ కమిటీకి సంబంధించిన వివిధ సబ్ కమిటీల ఆర్థిక వ్యవహారాలు పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఇది ఇప్పట్లో తేలేలా లేదు. అదీగాకుండా ఏజీఎంకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ హాజరవుతారా? లేదా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
‘ఏజీఎం జరిగేందుకు కాస్త సమయం పడుతుంది. తర్వాతి వర్కింగ్ కమిటీ ఎప్పుడనే విషయంలోనే ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఈనెల 27న ఏజీఎం అనేది అసలు సాధ్యమే కాదు’ అని బోర్డు వర్కింగ్ కమిటీ సభ్యుడొకరు స్పష్టం చేశారు.
ఏజీఎం జరిగే అవకాశాల్లేవు!
Published Fri, Sep 4 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM
Advertisement