బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు శ్రీనివాసన్ ప్రకటించారు. బోర్డు ఎన్నికల నిర్వహణకు, శ్రీనివాసన్పోటీ చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది.
బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు శ్రీనివాసన్ ప్రకటించారు. బోర్డు ఎన్నికల నిర్వహణకు, శ్రీనివాసన్పోటీ చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. కాగా ఎన్నికల్లో గెలుపొందినా పదవికి దూరంగా ఉండాలని ఆయనను ఆదేశించింది. ఐపీఎల్ ఫిక్సింగ్ కేసుకు శ్రీనివాసన్కు వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ సంఘం వేసిన పిటిషన్పై తీర్పు వెలువరించేవరకు బోర్డు పదవులకు దూరంగా ఉండాలన సుప్రీం కోర్టు షరతు విధించింది.
కాగా బోర్డు ఎన్నికలు ఆదివారం చెన్నైలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు కోర్టు అభ్యంతర వ్యక్తం చేయలేదని శ్రీనివాసన్ చెప్పారు. ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ రాకెట్ అనంతరం బోర్డు అధ్యక్ష పదవి నుంచి తాత్కాలికంగా వైదొలిగిన శ్రీని మరో సారి ఎన్నికయ్యేందుకు మద్దతు కూడగడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల క్రికెట్ సంఘాలు మద్దతిచ్చే అవకాశముంది.