న్యూఢిల్లీ : మరోసారి బిసిసిఐ అధ్యక్షుడు కావాలని ఆశపడుతోన్న శ్రీనివాసన్ కు భంగపాటు తప్పదని వినిపిస్తోంది. ఐపీఎల్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ నివేదికపై సుప్రీం కోర్టులో గురువారం కూడా విచారణ కొనసాగింది. బిసిసిఐ అధ్యక్షుడిగా...చెన్నయ్ సూపర్ కింగ్స్ ఓనర్గా శ్రీనివాసన్ ఎలా వ్యవహరిస్తారని మొన్ననే సుప్రీం కోర్టు నిలదీసిన సంగతి తెలిసిందే.
ఇక ముద్గల్ కమిటీలో శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మేయప్పన్కు బుకీలతో సంబంధాలున్నాయని తేలిన నేపథ్యంలో చెన్నయ్ సూపర్ కింగ్స్పై వేటు పడే అవకాశాలున్నాయని అంటున్నారు. చెన్నయ్ సూపర్ కింగ్స్లో శ్రీనివాసన్ తనకున్న వాటాల వివరాలను కోర్టు ముందుంచాలని సుప్రీం ఆదేశించింది.
ముద్గల్ కమిటీ నివేదికపై తక్షణమే చర్యలు తీసుకుని దోషులను బయట పెట్టాలని సుప్రీం ఆదేశిస్తోంది. ప్రత్యేకించి బిసిసిఐ దాచిపెడుతోన్న నంబర్ టూ , నంబర్ త్రీ ప్లేయర్ల పేర్లు బయట పెట్టాలని న్యాయస్థానం ఆదేశించే అవకాశాలున్నాయి. క్రికెట్ ప్రక్షాళనే అజెండా కావాలని సుప్రీం ఇప్పటికే స్పష్టం చేసింది.
కాగా అన్ని వివాదాలకు బీసీసీఐ తెర దించాలని న్యాయస్థానం సూచించింది. బీసీసీఐకి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తూ, ముద్గల్ కమిటీ దోషులుగా పేర్కొన్న వారు ఎన్నికల్లో పోటీ చేయరాదని స్పష్టం చేసింది.
శ్రీనివాసన్కు భంగపాటు తప్పదా?
Published Thu, Nov 27 2014 1:37 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement