చెన్నై సూపర్ కింగ్స్ను రద్దు చేసే అవకాశం! | IPL Scam: Supreme Court observes chennai Super Kings Should be disqualified | Sakshi
Sakshi News home page

చెన్నై సూపర్ కింగ్స్ను రద్దు చేసే అవకాశం!

Published Thu, Nov 27 2014 12:20 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

చెన్నై సూపర్ కింగ్స్ను రద్దు చేసే అవకాశం! - Sakshi

చెన్నై సూపర్ కింగ్స్ను రద్దు చేసే అవకాశం!

న్యూఢిల్లీ : ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి దర్యాప్తు లేకుండానే సీఎస్కేను రద్దు చేయాలని  పేర్కొంది. ఈ సందర్భంగా శ్రీనివాసన్కు సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది.  సీఎస్కే యజమానులు ఎవరని ప్రశ్నించింది. షేర్ హోల్డర్ల వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎన్నికలకు శ్రీనివాసన్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)ను రద్దు చేసేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇండియా సిమెంట్స్ సుప్రీం కోర్టును కోరిన విషయం తెలిసిందే.  ఆ టీమ్ ప్రిన్సిపల్‌గా ఉన్న గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని ముద్గల్ కమిటీ నివేదికలో పేర్కొనటంతో  లీగ్ నిబంధనల ప్రకారం సీఎస్‌కే ఫ్రాంచైజీని రద్దు చేయాల్సి ఉంటుంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement