బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెఢీ: గవాస్కర్
బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెఢీ: గవాస్కర్
Published Thu, Mar 27 2014 5:15 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడానికి తాను సిద్దమేనని క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తెలిపారు. అధ్యక్ష పదవిని చేపట్టడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశిస్తే సంతోషంగా పదవిని చేపట్టడుతానన్నారు. ప్రస్తుతం కామెంటేటర్ గా పనిచేయడానికి బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకున్నానని ఆయన తెలిపారు.
సుప్రీం కోర్టు అధికారికంగా ఆదేశిస్తే అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెడీ అని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వేచి చూస్తానని ఆయన అన్నారు. ఓపెనర్ బ్యాట్స్ మెన్ గా అన్ని రకాలైన సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై విచారణ పూర్తయ్యే వరకు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ను తొలగించి.. సునీల్ గవాస్కర్ కు బాధ్యతలు అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement