ఐపీఎల్పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు శుక్రవారం న్యూఢిల్లీలో స్పష్టం చేసింది. ఐపీఎల్లో ఆడకుండా ఏ ఆటగాడిని కానీ, జట్టును గాని నిలవరించలేమని పేర్కొంది. బీసీసీఐ ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా వ్యవహరించాలని సూచించింది. ఐపీఎల్ మ్యాచ్లు పూర్తయ్యేంత వరకు గవాస్కర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందని పేర్కొంది.ఐసీసీ కార్యకలాపాల్లో శ్రీనివాసన్ పాల్గొనేలా ఉత్తర్వులు ఇవ్వాలని బీసీసీఐ చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే శ్రీనివాసన్ తన పదవి నుంచి తప్పుకోవాలని మంగళవారం సుప్రీంకోర్టు సూచించింది.అందుకు రెండు రోజుల గడువు కూడా విధించింది. లేకుంటే తామే శ్రీనివాసన్ను ఆ పదవి నుంచి తొలగించ వలసి వస్తుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే.