'బీసీసీఐ అధ్యక్షుడిగా గవాస్కర్ ను నియమించండి'
'బీసీసీఐ అధ్యక్షుడిగా గవాస్కర్ ను నియమించండి'
Published Thu, Mar 27 2014 1:47 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సునీల్ గవాస్కర్‌ను నియమించండని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో తుది తీర్పు వచ్చేంత వరకూ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను పక్కనపెట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది.
ఐపీఎల్-7లో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టు ప్రతిపాదన చేయడం సంచలనం రేపుతోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఆటగాళ్లు, యాజమాన్యాలపై ఆరోపణలు వెలువడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన శ్రీశాంత్, చండీలా, చవాన్ లు అరెస్టయ్యారు. ఈ కుంభకోణంలో చెన్నై సూపర్ కింగ్స్ సహ యజమాని గురునాథన్ మేయప్పన్ ను కూడా అరెస్ట్ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై నమోదైన కేసులో సుప్రీంకోర్టు తీర్పు శుక్రవారం తీర్పు వెల్లడించనుంది.
Advertisement
Advertisement