Spot fixing
-
టీ20 ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. బంగ్లా క్రికెటర్‌తో
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ మెగా టోర్నీలో ఫిక్సింగ్ కోసం ఓ బంగ్లాదేశీ ప్లేయర్‌ను బుక్కీలు సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీన్ క్రిక్‌ఈన్‌ఫో వెల్లడించింది. అయితే ఆమె ఈ ఆఫర్‌ను తిరష్కరించి ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేసినట్లు ఈఎస్పీన్ తన నివేదికలో పేర్కొంది. అదే విధంగా ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణను బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మీడియా సంస్థ విడుదల చేసినట్లు ఈఎస్పీన్ తెలిపింది. ఆ ఆడియో సంభాషణ ప్రకారం.. బుక్కీలకు ఆమెకు మరో మరో బంగ్లా ప్లేయర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఐసీసీ యాంటీ కరప్షన్ విభాగంకు ఫిర్యాదు చేశాం. ఐసీసీ దర్యాప్తు చేపడుతుంది. అయితే మా క్రికెటర్లకు ఫిక్సర్లు సంప్రదిస్తే.. వారికి ఏమో చేయాలో బాగా తెలుసు. ఈవెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేయాలని మా ప్లేయర్స్‌కు తెలుసు. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఆంశం కాదు. అందుకే మేము ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడాలని అనుకోలేదు. అంతా ఐసీసీ చూసుకుంటుందని"ఈఎస్పీన్‌తో పేర్కొన్నారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. చదవండి: T20 WC: ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బోణీ.. ఐర్లాండ్‌పై ఘన విజయం -
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా పాక్ దిగ్గజ పేసర్లు వసీం అక్రం, వకార్ యూనిస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకే గనక అధికారం ఉంటే అక్రమ్ తో పాటు వకార్ లను శాశ్వతంగా నిషేధించేవాడినని చెప్పుకొచ్చాడు. వసీం అక్రమ్ తో పాటు వకార్ లు 1993-94లలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ ఇద్దరితో పాటు సలీమ్ మాలిక్ పైనా ఆరోపణలు రావడంతో దీనిపై జస్టిస్ ఖయ్యూం కమిటీ విచారణ జరిపి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అక్రమ్, వకార్ల పేర్లు ఉన్నాయి. తాజాగా రమీజ్ రాజా ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ''వాళ్లెవరికీ తిరిగి జట్టుతో అవకాశమే ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఇందులో ఆరోపణలు ఎదుర్కున్న ఎవరికీ జట్టులోకి వచ్చే అవకాశమే ఉండకూడదని అనుకున్నా. వాళ్ల (అక్రమ్, వకార్)ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో నా చేతిలో పవర్ లేదు. ఒకవేళ నేనే నిర్ణయాధికారంలో గనక ఉంటే తప్పకుండా వారిపై జీవిత కాలం నిషేధం విధించేవాడిని. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నాకు తెలిసి ఈ ఫిక్సింగ్ కేసులో చాలా మంది ఉన్నారని నా అనుమానం. వారిని ఎందుకు వదిలేశారో నాకైతే తెలియదు..’ అని అన్నాడు. 2010లో మహ్మద్ అమీర్, మహ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ ల మీద కూడా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. వీరిమీద విచారణ జరిపిన పీసీబీ.. భట్, అమీర్, అసిఫ్ లపై నిషేధం విధించింది. అమిర్ 2016లో తిరిగి పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ రమీజ్ రాజా పీసీబీ చైర్మెన్ అయ్యాక వీళ్లెవరినీ సెలక్షన్స్ సమయంలో పరిగణించలేదు. అయితే ఈ విషయంపై రమీజ్ తనదైన రీతిలో వ్యాఖ్యానించాడు. ''నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇలాంటి తప్పులు చేసిన వారు ఎంతటి స్థాయి వ్యక్తులైనా తప్పించుకోకూడదు'' అని అన్నాడు. . చదవండి: లేక లేక మ్యాచ్‌లు.. పీసీబీకి సంకటస్థితి -
వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా?
ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం అసన్నమైంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదిల్లో మెగా వేలం జరగనుంది. కాగా ఇప్పటికే 1214 మంది ఆటగాళ్లు మెగా వేలం కోసం తమ పేర్లును రిజిస్టర్ చేశారు. కాగా భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మరో సారి వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సారి తన బేస్ ప్రైస్ రూ. 50 లక్షలుగా నిర్ణయించాడు. గత ఏడాది వేలంలో రూ. 75 లక్షలుగా తన కనీస ధరగా శ్రీశాంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఐపీఎల్లో శ్రీశాంత్ చివరిసారిగా 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత అతడిపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. కాగా గత ఏడాదిలో సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలలో కేరళ తరఫున ఆడాడు. అంతే కాకుండా త్వరలో జరగనున్న కేరళ రంజీ జట్టులో కూడా శ్రీశాంత్ భాగమై ఉన్నాడు. చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్‌బై.. -
‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరగలేదు’
దుబాయ్: సుమారు మూడేళ్ల క్రితం ‘క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్’ పేరుతో ప్రముఖ టీవీ చానల్ ‘అల్ జజీరా’ ప్రసారం చేసిన రెండు డాక్యుమెంటరీలలోని ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొట్టి పారేసింది. ఇందులో పేర్కొన్న అంశాలపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ఎక్కడా తప్పు జరగలేదని స్పష్టం చేసింది. డాక్యుమెంటరీ తొలి భాగంలో రెండు టెస్టు మ్యాచ్‌లలో స్పాట్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పిన చానల్... రెండో భాగంలో 2011–12 మధ్య కాలంలో 15 మ్యాచ్‌లలో ఫిక్సింగ్ చోటు చేసుకుందని ఆరోపించింది. 2016లో భారత్, ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరిగిన టెస్టు (ఇందులో భారత్ ఇన్నింగ్స్, 75 పరుగులతో గెలిచింది)...2017లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రాంచీలో జరిగిన టెస్టు (మ్యాచ్ డ్రాగా ముగిసింది)లలో ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు ఫిక్సర్ల సూచనల ప్రకారం బ్యాటింగ్ చేసినట్లు అల్ జజీరా వెల్లడించింది. అయితే సుదీర్ఘ కాలం విచారణ జరిగిన ఐసీసీ వీటన్నింటిని తప్పుగా తేల్చింది. అసలు చానల్ సమర్పించిన ఆధారాలు ఏ రకంగానూ నమ్మశక్యంగా లేవని స్పష్టం చేసింది. ‘చానల్ చూపించిన దృశ్యాలను బట్టి చూస్తే ఏదీ అసహజంగా అనిపించలేదు. ఫిక్సింగ్‌ను సూచించే విధంగా ఎలాంటి అంశం అందులోనూ కనిపించలేదు. అసలు అందులో చెప్పే విషయాలేవీ నమ్మశక్యంగా లేవు. ఇలాంటి అంశాలపై పట్టు ఉన్న నలుగురు నిపుణులతో మేం నియమించిన కమిటీ అన్ని అంశాలను పరిశీలించి తమ నివేదిక ఇచ్చింది’ అని ఐసీసీ ప్రకటించింది. మొత్తంగా ఈ వివాదంతో సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురికి కూడా క్లీన్చిట్ ఇచ్చింది. -
శ్రీశాంత్.. నీ కోసమే వెయిటింగ్
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్ల పాటు నిషేధానికి గురైన శ్రీశాంత్ తన రీఎంట్రీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో శ్రీశాంత్‌పై నిషేధం ముగియనుండటంతో క్రికెట్ పునరాగమనం కోసం యత్నాలు ఆరంభించాడు. దేశవాళీ సీజన్లో భాగంగా తన రాష్ట్ర రంజీ జట్టు కేరళతో ఆడాలనే యత్నంలో ఉన్నాడు. దీనిపై కేరళ బ్యాట్స్‌మన్ సచిన్ బేబీ మాట్లాడుతూ. శ్రీశాంత్ కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపాడు. గత ఏడేళ్లుగా శ్రీశాంత్ కేరళ జట్టుకు దూరమైన విషయాన్ని కాస్త బాధగా చెప్పిన సచిన్ బేబీ.. అతను ఎప్పుడూ జట్టుకు సలహాలు ఇస్తూ ఉండేవాడనే విషయాన్ని వెల్లడించాడు. గతంలో ప్రాక్టీస్ సెషన్లో కూడా శ్రీశాంత్ బౌలింగ్ చేసేవాడన్నాడు. (శ్రీశాంత్ మళ్లీ వస్తున్నాడు...) శ్రీశాంత్ పేస్‌లో స్వింగ్ ఎక్కువగా ఉండటంతో తాను ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడేవాడినని సరదాగా వ్యాఖ్యానించాడు. టెలివిజన్ కామేంటేటర్, ప్రజెంటర్ అరుణ్ వేణుగోపాల్‌తో ఇన్‌స్టా లైవ్ సెషన్లో అనేక విషయాలను సచిన్ బేబీ షేర్ చేసుకున్నాడు. ‘ నాకు శ్రీశాంత్ సోదరుడు లాంటివాడు. కేరళ తరఫున మళ్లీ ఆడతాడని ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.మా జట్టులోని ఆటగాళ్లంతా శ్రీశాంత్ రీఎంట్రీ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. మేమిద్దరం గత కొన్నేళ్లుగా కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకు శ్రీశాంత్ చాలా సాయం చేశాడు. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాం. శ్రీశాంత్‌తో ప్రాక్టీస్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. కేరళ జట్టుకు సలహాలు ఇస్తూ సహకరిస్తున్నాడు. అతను నెట్స్‌లో బౌలింగ్ అమోఘంగా వేస్తున్నాడు. ఇది వరకు శ్రీశాంత్ బౌలింగ్ ప్రాక్టీస్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇక శ్రీశాంత్ తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపించాల్సి ఉంది’ అని కేరళ మాజీ కెప్టెన్ సచిన్ బేబీ తెలిపాడు. భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్‌కు ఊరట లభించింది. శ్రీశాంత్‌ను దోషిగానే గుర్తించిన సుప్రీం... జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది. (‘చాలాసార్లు చనిపోవాలనుకున్నా’) -
శ్రీశాంత్ మళ్లీ వస్తున్నాడు...
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన భారత పేస్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ తిరిగి క్రికెట్లోకి అడుగు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. కేరళ రంజీ ట్రోఫీ జట్టులోకి అతడిని ఎంపిక చేయడం దాదాపుగా ఖరారైంది. రంజీ కోసం ఎంపిక చేసే ప్రాబబుల్స్‌లో 37 ఏళ్ల శ్రీశాంత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు జట్టు కోచ్ టిను యోహానన్ వెల్లడించాడు. దాంతో అతని పునరాగమనం లాంఛనమే కానుంది. ‘కేరళ తరఫున శ్రీశాంత్ మళ్లీ ఆడాలని మేం కోరుకుంటున్నాం. ఈ ఏడాది రంజీ ట్రోఫీ కోసం అతని పేరును కూడా పరిగణలోకి తీసుకుంటాం. కేరళలో కూడా ప్రతీ ఒక్కరు అదే కోరుకుంటున్నారు. ఇదంతా అతని ఫిజికల్ ఫిట్నెస్, బౌలింగ్ సత్తాను బట్టి ఉంటుంది. జట్టు నిర్దేశించిన ప్రమాణాలను శ్రీశాంత్ అందుకోవాల్సి ఉంటుంది’ అని యోహానన్ చెప్పాడు. కోవిడ్–19 కారణంగా ఎప్పటినుంచి క్రికెట్ మళ్లీ మొదలవుతుందో, రంజీ మ్యాచ్‌లు ఎప్పటినుంచో జరుగుతాయో ఎవరికీ తెలీదని... అయితే సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం శ్రీశాంత్‌కు ఉంది కాబట్టి అతను తన ఆటపై దృష్టి పెట్టవచ్చని టిను సూచించాడు. నేపథ్యమిదీ... భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్‌కు ఊరట లభించింది. శ్రీశాంత్‌ను దోషిగానే గుర్తించిన సుప్రీం... జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది. మరో సారి క్రికెట్ ఆడేందుకు తాను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానన్న శ్రీశాంత్... కష్టకాలంలో తనకు అండగా నిలిచిన సన్నిహితులు, కేరళ క్రికెట్ సంఘానికి కృతజ్ఞతలు తెలిపాడు. -
‘నేనే చివరి ఫిక్సర్‌ను కాదు కదా’
కరాచీ: ఎంతో మంది తప్పులు చేస్తూ ఉంటారని అందులో తాను ఒకడినని అంటున్నాడు పాకిస్తాన వెటరన్ పేసర్ మహ్మద్ అసిఫ్. 2010లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఆపై ఏడేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న అసిఫ్.. మళ్లీ పాకిస్తాన్ జట్టులో కనిపించలేదు. అప్పట్లో అసిఫ్‌పై ఉన్న నిషేధాన్ని ఐదేళ్లకు తగ్గించినా ఆ తర్వాత అతనికి పాక్ జట్టులో పునరాగమనం చేసే అవకాశం రాలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లలో కొంతమందికి తిరిగి జాతీయ జట్టులో ఆడే అవకాశం ఇచ్చినా తనకు మాత్రం రెండో చాన్స్ ఇవ్వలేదని అంటున్నాడు అసిఫ్. తన సహచర బౌలర్, మహ్మద్ అమిర్ కూడా ఫిక్సింగ్‌లో ఇరుక్కొన్నప్పటికీ మళ్లీ రీఎంట్రీ చేయడాన్ని అసిఫ్ పరోక్షంగా ప్రస్తావించాడు. (‘నో డౌట్.. ఆ సామర్థ్యం కోహ్లిలో ఉంది’) ‘నా కంటే ముందు ఫిక్సింగ్ చేసిన వాళ్లు కావొచ్చు.. నాతో పాటు ఫిక్సింగ్ చేసిన వారు కావొచ్చు. నా తర్వాత ఫిక్సింగ్స్ చేసిన వాళ్లు కావొచ్చు.. ఎవరికైనా రెండో అవకాశం అనేది ఉంటుంది. ప్రతీ ఒక్కరిలాగా నేను కూడా తప్పు చేశా. ఇక్కడ ఫిక్సింగ్ చేసిన వేరే వాళ్లకి ఆడే అవకాశం ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో తీరుగా ఉంటుందా పీసీబీ విధానం. ఫిక్సింగ్‌కు పాల్పడిన కొంతమంది క్రికెటర్లను పీసీబీ కాపాడింది. పీసీబీ మనుషులు కాబట్టి వారిని రక్షించుకుంది. నన్ను ఏ విషయంలోనూ పట్టించుకోలేదు.పాకిస్తాన్ క్రికెట్లో నేనే చివరి ఫిక్సర్‌ను అన్నట్లు ట్రీట్ చేస్తున్నారు. నా తర్వాత కూడా చాలా మంది ఫిక్సింగ్ చేశారు. వారికి కూడా పీసీబీ అవకాశం ఇచ్చింది. కొంతమంది ఏకంగా పీసీబీలోనే ఉన్నారు’ అంటూ అసిఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడితో తన ప్రపంచం ఏమీ అయిపోలేదని, జరిగిపోయిందేదో జరిగిందని, ఇక జరగాల్సింది మాత్రమే ఉందన్నాడు. తన కెరీర్లో చాలా క్రికెట్‌ను ఆడేశానని అసిఫ్ పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు లభించిందన్నాడు. తానెప్పుడు స్వార్థ పరుడిలా ఉండేవాడినని చాలా మంది అంటారనీ, అది వికెట్లు తీసి జట్టును గెలిపించాలనే స్వార్థం మాత్రమేనన్నాడు. జట్టు విజయం కోసం ఎప్పుడూ శ్రమించేవాడినని, ఒకవేళ అదే స్వార్థమైతే తాను ఏమీ చేయలేనని అసిఫ్ పేర్కొన్నాడు.(కెప్టెన్సీపై తిరుగుబాటు చేశారు..) -
మాజీ క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
కేప్‌టౌన్: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గులామ్ బోడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. దాదాపు నాలుగేళ్ల క్రితం ఒక దేశవాళీ మ్యాచ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అభియోగాలు ఎట్టకేలకు రుజువు కావడంతో అతనికి జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కింద జైలు శిక్ష అనుభవించబోతున్న తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా బోడి నిలిచాడు. 2015లో రామ్‌స్లామ్ టీ20 దేశవాళీ టోర్నమెంట్లో బోడి ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు.ఫలితంగా సఫారీ క్రికెట్ బోర్డు అతనిపై 20 ఏళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా తరఫున రెండు వన్డేలు ఆడిన బోడి.. క్రికెటర్‌గా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కామెంటేటర్ అవతారం ఎత్తాడు. ఆ క్రమంలోనే జట్టులోని ఆటగాళ్లకు డబ్బులు ఆఫర్ చేశాడు. అల్వీరో పీటర్సన్ అనే క్రికెటర్‌కు ఫిక్సింగ్ చేయమని నగదు ఆశ చూపాడు. అతను కాస్తా విషయం బయటపెట్టడంతో బోడిపై విచారణ చేపట్టారు. దాంతో అతనిపై రెండు దశాబ్దాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, 2018 నవంబర్ నెలలో పోలీసులకు బోడి పోలీసులకు లొంగిపోగా, తాజాగా అతనికి ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. బోడికి జైలు శిక్షను ఖరారు చేయడంతో అల్వీరో పీటర్సన్ ట్వీటర్ వేదికగా స్పందించాడు. క్రికెట్‌కు మంచి రోజులు వచ్చాయంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. గతంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రోనేపై కూడా ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేసు విచారణ దశలో ఉండగానే క్రానే విమాన ప్రమాదంలో మృతిచెందాడు. -
‘వంద కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’
న్యూఢిల్లీ: గత నెలలో భారత పేసర్ శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని తగ్గిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇప్పటికే ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్.. వచ్చే ఏడాది ఆగస్టు నెలతో నిషేధాన్ని పూర్తి చేసుకోనున్నాడు. అయితే తాజాగా శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణల్ని మరోసారి ఖండించాడు. ఈ క్రమంలోనే ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ నా పిల్లలు మీద, మా నాన్నపై ఒట్టేసి చెబుతున్నా. నేను ఎటువంటి ఫిక్సింగ్‌కు పాల్పడలేదు. నాకు ఎప్పుడూ ఆ ఆలోచన రాలేదు. రాబోదు. ఇప్పుడు మా నాన్న మంచాన పడ్డాడు. గత ఐదున్నరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మా అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు. వారిద్దరూ కనీసం నా మ్యాచ్‌ను చూసే స్థితిలో కూడా లేరు. నేను ఎప్పుడూ స్పాట్ ఫిక్సింగ్ అనేది చేయలేదు. రూ. 100 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మన దేశంలో చాలా లీగ్‌లు ఉన్నాయని, తన కుటుంబాన్ని చూసుకోవాలంటే క్రికెట్లో పునరాగమనం చేయాల్సి ఉందన్నాడు. -
స్పాట్ ఫిక్సింగ్ సమాచారం ముందే తెలుసు
న్యూఢిల్లీ: మొన్న అసలు వయసు దాచిన విషయం... నిన్న గంభీర్‌పై వాఖ్యలు... తాజాగా స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం! పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఆత్మకథ ‘గేమ్ చేంజర్’లో రోజుకో వివాదాస్పద అంశం బయటకు వస్తోంది. 2010 ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ‘స్పాట్ ఫిక్సింగ్’కు పాల్పడి అప్పటి పాక్ కెప్టెన్ సల్మాన్ భట్, ఆసిఫ్, ఆమిర్‌లు ఐసీసీ నిషేధానికి గురయ్యారు. అయితే ఈ స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి తనకు ముందే సమాచారం అందిందని ఆఫ్రిది తన పుస్తకంలో చెప్పుకొచ్చాడు. అదెలాగో అతడి మాటల్లోనే... ‘2010 ఆసియా కప్ సందర్భంగా శ్రీలంకలో ఉండగా... బుకీ మజహర్ మాజిద్, భట్ మధ్య సంభాషణ తాలూకు సందేశాలు నాకు అందాయి. మాజిద్ కుటుంబంతో పాటు శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు అతడి చిన్న కుమారుడు ఫోన్‌ను నీళ్లలో పడేశాడు. తర్వాత మరమ్మతు కోసం దానిని మాజిద్ లండన్‌లోని ఓ దుకాణంలో ఇచ్చాడు. ఆ దుకాణదారు నా స్నేహితుడికి స్నేహితుడు. రిపేర్ చేస్తుండగా అతడు ఫిక్సింగ్‌కు సంబంధించిన సందేశాలు చూశాడు. వాటి గురించి నా స్నేహితుడు, మరికొందరికి చెప్పాడు. దీంతో విషయం బయటకు పొక్కింది. అప్పుడే నేను వాటిని కోచ్ వకార్‌కు చూపెట్టాను. అతడు దానిని ముందుకు తీసుకెళ్లలేదు. మేమిద్దరం ఏదో జరుగుతుందని భావించాం కానీ, అది ఇంత తీవ్రమైనదని అనుకోలేదు. ఆ వెంటనే జరిగిన ఇంగ్లండ్ పర్యటనలో మాజిద్ అతడి బృందం మా ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండటాన్ని చూశా. దీంతో పరిస్థితిని జట్టు మేనేజర్ యావర్ సయీద్‌కు వివరించా. మాజిద్‌ను దూరం పెట్టాలని ఆటగాళ్లకు చెప్పమని కోరా. మొదట ఆయనా నమ్మలేదు. నేను మెసేజ్‌లను ప్రింట్ తీసుకెళ్లి చూపడంతో ‘ఇప్పుడేం చేద్దాం’ అంటూ తాపీగా అడిగారు. కానీ, అప్పటికే అందరికీ తెలిసిపోయింది’ అని వివరించాడు. -
శ్రీశాంత్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఐపీఎల్–2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ పేసర్ శాంతకుమారన్ శ్రీశాంత్‌కు సుప్రీం కోర్టులో కొంత ఊరట లభించింది. తనపై బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అతను వేసిన పిటిష¯Œ పై సుప్రీం తీర్పునిచ్చింది. శ్రీశాంత్‌పై విధించిన జీవిత కాల నిషేధాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచీ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్ శిక్షా కాలాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని కూడా బీసీసీఐకి నిర్దేశించింది. అయితే శిక్షా కాలం తగ్గించమని మాత్రమే ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం ఇతర అంశాల జోలికి వెళ్లలేదు. స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి శ్రీశాంత్‌పై ఢిల్లీ హైకోర్టులో నమోదైన క్రిమినల్ అభియోగాల విచారణపై తమ తీర్పు ప్రభావం ఉండదని కూడా స్పష్టం చేసింది. అంటే అతడిని పూర్తిగా నిర్దోషిగా ప్రకటించలేదని అర్థమవుతోంది. అయితే తాజా తీర్పు పట్ల కేరళ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు టీసీ మాథ్యూ సంతోషం వ్యక్తం చేశారు. నిషేధం కారణంగా శ్రీశాంత్ ఆరేళ్లు కోల్పోయాడని, దానిని తొలగిస్తే అతను ఇప్పటికి ప్పుడు క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నా... క్రికెట్‌కు సంబంధించి ఏదో ఒక రంగంలో మళ్లీ కెరీర్‌ను వెతుక్కోగలడని ఆయన అన్నారు. పరిశీలిస్తాం: సీఓఏ శ్రీశాంత్ నిషేధం విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై తాము వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. త్వరలో జరిగే సీఓఏ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని ఆయన వెల్లడించారు. క్రికెట్‌నే జీవితంగా భావించిన నేను ఇన్నేళ్లుగా ఆటకు దూరమయ్యాను. సుప్రీం తీర్పును గౌరవించి బీసీసీఐ మళ్లీ ఆడే అవకాశం నాకు ఇస్తుందని ఆశిస్తున్నా. మైదానంలో నీకు అనుమతి లేదంటూ ఎవరైనా అడ్డుకోకుండా ఇప్పటికైనా నేను ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. కష్టకాలంలో హర్భజన్, సెహ్వాగ్, రైనా తదితరులు కూడా నాకు అండగానిలిచారు. నా జీవితంలో ఎంతో కొంత మిగిలి ఉన్న ఆటను ఆడాలనుకుంటున్నా. అయినా 42 ఏళ్ల వయసులో లియాండర్ పేస్ గ్రాండ్‌స్లామ్ సాధించగా లేనిది నేను క్రికెట్ ఆడలేనా. – శ్రీశాంత్ -
ఆసియాకప్‌లో ఫిక్సింగ్ కలకలం!
దుబాయ్: ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం రేగింది. అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మొహ్మద్ షహ్జాద్ను స్పాట్ ఫిక్సింగ్ చేయమని కొంతమంది బుకీలు కలిశారు. ఈ విషయాన్ని షహజాద్.. టీమ్ మేనేజ్మెంట్కు తెలపడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) యాంటీ కరెప్షన్ యూనిట్ రంగంలోకి దిగింది. వచ్చే నెల్లో షార్జాలో జరుగనున్న అఫ్గాన్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ చేయాలంటూ తనను కొంతమంది కలిసినట్లు షహ్జాద్ తెలిపాడు. దీనిపై అలెక్స్ మార్షల్ నేతృత్వంలోని ఐసీసీ యాంటీ కరెప్షన్ యూనిట్ దర్యాప్తు చేపట్టింది. ‘షహజాద్‌ను ఫిక్పింగ్‌కు పాల్పడమని కొంతమంది కలిసిన ఘటన వెలుగు చూసింది. అది అఫ్గాన్ టీ20 లీగ్‌లో ఫిక్సింగ్ చేయాలంటూ బుకీలు ప్రేరేపించారు. కాగా, దీన్ని టీమ్ మేనేజ్మెంట్ ద్వారా మా దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు చేపట్టాం. గత 12 నెలల్లో ఐదుగురు అంతర్జాతీయ స్థాయి కెప్టెన్లను బుకీలు కలిశారు. ఇందులో పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన నాలుగు దేశాలకు చెందిన కెప్టెన్లు ఉన్నారు. గతేడాది నుంచి 32 మంది ఆటగాళ్లను స్పాట్ ఫిక్సింగ్ కేసులో విచారించాం. అందులో ఎనిమిది మందిపై వేటు పడింది’ అని మార్షల్ తెలిపారు. -
క్రికెట్లో కలకలం.. యాషెస్పై ఫిక్సింగ్ ఆరోపణలు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే యాషెస్ సిరీస్‌పై ఐసీసీ పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు ది సన్ అనే అంతర్జాతీయ వార్త పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గత డిసెంబర్లో పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసింది. సెషన్‌కు రూ.60 లక్షలు, రెండు సెషన్లకు 120 లక్షల చొప్పున బుకీలు బేరాలు ఆడినట్లు తెలిపింది. దీనిపై అన్ని ఆధారాలు ఐసీసీ వద్ద ఉన్నాయని 'ది సన్' ప్రచురించింది. అంతేకాదు దీనిపై ఐసీసీ రహస్య విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది. భారత్‌కు చెందిన బుకీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించింది. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐసీసీ స్పందించింది. విచారణలో ఇరు జట్ల ఆటగాళ్లు, స్టాఫ్ ఎటువంటి అక్రమాలకు, అవకతవకలకు పాల్పడలేదని తెలిపింది. ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జనరల్ మేనేజర్ అలెక్స్ మెర్షల్ మాట్లాడుతూ యాషెస్ ఫిక్సింగ్పై వచ్చిన ఆరోపణలపై విసృతస్థాయిలో విచారణ జరిపామని తెలియచేశారు. ఫిక్సింగ్‌కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆటగాళ్లు, జట్టు సభ్యులు, కోచ్, సహాయకులు ఇలా ప్రతిఒక్కరిని వ్యక్తిగతంగా విచారించామని, ఏ ఒక్కరు బుకీలతో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నిరూపితం కాలేదని మెర్షల్ పేర్కొన్నారు. ఇక బుకీ తెలిపిన వివరాల ప్రకారం గతంలో భారత్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లను, ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ టీ20 లీగ్‌ల్లోను ఫిక్సింగ్ చేసినట్లు ది సన్ ప్రచురించింది. సదరు పత్రిక జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో మ్యాచ్ బుకీ తెలుపినట్లు పేర్కొంది. ఒక ప్రపంచకప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌తోపాటు, పలు అవినీతి నిరోధక శాఖలతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు మరో బుకీ తెలిపాడని ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టులో 'ది సైలెంట్ మ్యాన్'గా పేరొందిన ఆటగాడు ఈఫిక్సింగ్‌కు చేసినట్లు తమ స్ట్రింగ్ ఆపరేషన్‌లో వెల్లడైందని 'ది సన్' ఆరోపించింది. -
కీలక ప్రకటన చేసిన ఐసీసీ
సాక్షి, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించటంతో క్రీడా లోకం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీనిపై తక్షణ విచారణ చేపట్టిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. స్పాట్ ఫిక్సింగ్ జరిగిందనటానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఐసీసీ యాంటీ కరప్షన్ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ దీనిపై స్పందిస్తూ... ఫిక్సింగ్ ఆరోపణలను చాలా తీవ్రంగా పరిగణించాం. మా బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. అయితే ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగానే ఈ విచారణ చేపట్టాం. ఈ ఫిక్సింగ్ ఆరోపణలు టీ20 టోర్నీలతో పాటు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లపై ప్రభావం చూపుతాయి. మా విచారణలో అన్ని అంశాలను పరిగణనలోకి దీనిపై విచారణ చేస్తున్నాం అని ఆయన వివరించారు. కాగా, యాషెస్ సిరీస్ సందర్భంగా పెర్త్ లో వాకా మైదానం వేదికగా గురువారం నుంచి జరగబోయే మూడో టెస్ట్ స్పాట్ ఫిక్సింగ్ అయినట్లు ఆరోపణలు వినిపించాయి. భారత్ కు చెందిన ఇద్దరు బుకీలు ఈ స్కాంలో ఉన్నట్లు బ్రిటీష్ పత్రిక ది సన్ ఆరోపణలు గుప్పించింది. అయితే ఇరు జట్లకు చెందిన సభ్యుల పేర్లు ఆ కథనంలో ప్రస్తావించపోగా.. ఆస్ట్రేలియాకు చెందిన బుకీ గ్రూప్ ‘ది సైలెంట్ మాన్’ భారీ మొత్తానికి ఈ మ్యాచ్‌ను ప్రభావితం చేసేందుకు ప్రణాళిక పన్నిందని ఆ కథనం వివరిచింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంతో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
మరో క్రికెటర్‌పై ఏడాది నిషేధం
కరాచీ: తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో భాగంగా విచారణకు సహకరించనందుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ నాసిర్ జంషెడ్‌పై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయం తీసుకుంది. దాంతో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) వంటి తదితర టోర్నీలకు జంషెడ్‌ను ఏడాది పాటు బహిస్కరిస్తున్నట్లు పేర్కొంది. గతేడాది ఒక టీ 20 టోర్నమెంట్లో జంషెడ్ స్పాట్ ఫిక్సింగ్‌లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నేతృత్వంలోని యాంటీ కరెప్షన్ యూనిట్(ఏసీయూ) విచారణ చేపట్టడానికి సిద్దమవ్వగా, అందుకు జంషెడ్ సహకరించలేదు. దాంతో అతనిపై ఏడాది నిషేధం విధిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. అంతకుముందు పలువురు పాక్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కుని నిషేధం ఎదుర్కొంటున్నారు. అందులో బ్యాట్స్‌మెన్ షార్జిల్ ఖాన్, ఖలిద్ లతీఫ్లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించగా, పేసర్ మొహ్మద్ ఇర్ఫాన్, ఆల్ రౌండర్ మొహ్మద్ నవాజ్‌లపై 12నెలల నిషేధం పడింది. -
‘ఫిక్సర్’ సోట్సోబ్‌పై ఎనిమిదేళ్ల నిషేధం
కేప్‌టౌన్: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ లోన్వాబో సోట్సోబ్‌పై ఆ దేశ బోర్డు ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2015లో దక్షిణాఫ్రికా దేశవాళీ టి20 టోర్నీ రామ్స్లామ్లో అతను ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. ఈ వివాదంలో నిషేధం ఎదుర్కొంటున్న ఏడో ఆటగాడు సోట్సోబ్. దక్షిణాఫ్రికా తరఫున అతను 5 టెస్టులు, 61 వన్డేలు, 23 టి20లు ఆడాడు. రెండేళ్ల క్రితం ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో ఫిక్సింగ్ వైపు మొగ్గు చూపినట్లు అంగీకరించిన సోట్సోబ్, అభిమానులను క్షమించమని కోరాడు. -
బుకీలు కలిస్తే ఆ పని చేసేవాడ్ని: సెహ్వాగ్
ముంబయి: క్రికెట్లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ లాంటి అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండేందుకు ఆటగాళ్లు ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. బుధవారం కాన్పూర్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ముగ్గురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ డాషింగ్ ఓపెనర్ ఈ విధంగా స్పదించారు. 'బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఇలాంటి వ్యవహారాలను ఎవరూ ఆపలేరు. తాను ఎవరిని కలుసుకుంటున్నాం అనేది ప్రతి ఆటగాడికి తెలిసుండాలి. తన మనస్సాక్షి స్పష్టంగా ఉన్నప్పుడే ఆటను కూడా క్లీన్‌గా ఉంచగలరు. ఎంత భద్రత ఉన్నా ఓ ఆటగాడు ఫిక్సింగ్‌కు పాల్పడాలనుకుంటే ఎవరూ ఆపలేరు. తనను ఎవరూ తప్పుపట్టకూడదనే విచక్షణ ఎవరికి వారు కలిగి ఉంటేనే ఈ మార్పు సాధ్యం. ఒకవేళ నేను క్రికెట్ ఆడే రోజుల్లో ఎవరైనా నాపై బెట్టింగ్ ఆరోపణలు లేవనెత్తినట్లయితే మరో ఆలోచన లేకుండా రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. దాంతో పాటు నేను సాధించిన రికార్డులను తొలగించేయాలని విజ్ఞప్తి చేసేవాడిని. ముఖ్యంగా ఫిక్సింగ్ మహమ్మారి పారిపోవాలంటే ఆటగాళ్లు వంద శాతం నిజాయితీగా ఉండటమే దానికి విరుగుడు' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం గుజరాత్, ఢిల్లీ ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. -
స్పాట్ ఫిక్సింగ్: అడ్డంగా దొరికిపోయారు
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తాజాగా మరో క్రికెటర్ విచారణ ఎదుర్కోనున్నాడు. గత ఫిబ్రవరిలో జరిగిన పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో నలుగురు క్రికెటర్లలు స్పాట్‌ఫిక్సింగ్‌లో దొరికిపోయారు. ఖలీద్ లతీఫ్, షర్జీల్ ఖాన్, పేసర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు మరో బ్యాట్స్‌మన్ షహజైబ్ హసన్‌పై ఆరోపణలు రావడంతో పీసీబీ అవినీతి వ్యతిరేక కోడ్ కింద అభియోగం నమోదైంది. 2009లో టీ20 ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో షహజైబ్ సభ్యుడిగా ఉన్నాడు. షహజైబ్ హసన్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను మే 4 వరకు అందించాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను అవినీతి వ్యతిరేక ట్రైబ్యునల్ ఆదేశించింది. -
'ఐపీఎల్.. ప్రతి సీజన్లోనూ సమస్యలు'
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి ఏడాది ఫ్రాంచైజీలకు ఏదో రకంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని బాలీవుడ్ నటి , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతీ జింటా వ్యాఖ్యానించారు. ప్రతి సీజన్లో ఆటగాళ్లపై, ఫ్రాంచైజీలపై వదంతులు వ్యాపిస్తున్నాయని అవి తమ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర నుంచి మ్యాచ్ వేదికల తరలింపు అంశంపై ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఐపీఎల్ లో ప్రతి సీజన్ సమస్యలమయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐపీఎల్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని కానీ లీగ్ నిర్వహణ సమస్యలతో తమ ఫ్రాంచైజీకి కలిసిరావడం లేదన్నారు. 2013 లో చూసినట్టయితే స్పాట్ ఫిక్సింగ్ కలకలం సృష్టించింది. అందులో ఆరోపణలు ఎదుర్కొన్న టీమిండియా ఆటగాడు శ్రీశాంత్ ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని ప్రీతీ జింటా ప్రస్తావించారు. 2014 సీజన్ విషయానికొస్తే.. దేశంలో సార్వత్రిక ఎన్నికల దృష్టా ఐపీఎల్-7 తొలి అర్థభాగంలో మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 2015 సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను రెండేళ్లపాటు నిషేధించారు.గత సీజన్లో తమ బౌలింగ్ బలహీనంగా ఉందని, ప్రస్తుతం ఆ లోపాలను సరిచేసుకున్నామని ప్రీతీ జింటా పేర్కొన్నారు. -
ఆ ఇద్దరి పైనే ఎందుకంత వివక్ష?
కరాచీ: జట్టు నుంచి కొన్నేళ్లపాటు ఉద్వాసనకు గురై పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ చోటు సంపాదించిన మహమ్మద్ ఆమీర్ తరహాలోనే మరో ఇద్దరికి రెండో అవకాశం కల్పించాలని ఆ జట్టు కోచ్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. ఆమీర్‌కు ఇచ్చినట్లుగానే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన బాట్స్మన్ సల్మాన్ బట్, బౌలర్ మహమ్మద్ ఆసిఫ్‌లకు జట్టులో చోటు కల్పించాలన్నాడు. ఐదేళ్ల నిషేధం తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే బట్ సెంచరీ చేశాడని, ఆసిఫ్ రెండు వికెట్లు తీశాడని.. అయినప్పటికీ ఆ ఇద్దరిపైనే ఎందుకంత వివక్ష అని వ్యాఖ్యానించాడు. దేశవాలీ క్రికెట్లో బట్, ఆసిఫ్ రాణిస్తున్నారని, వారు ఫిట్నెస్ మెరుగ్గానే ఉందని యూనిస్ పేర్కొన్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒకే రకమైన తప్పు చేసి, ఒకే రకమైన శిక్షకు గురయ్యారు. అటువంటిది, ఇప్పుడు ఒకరికి అవకాశం కల్పించి మిగతా ఇద్దరిని జట్టులోకి తీసుకోకపోవడం భావ్యం కాదన్నాడు. బట్, ఆమీర్, ఆసిఫ్ లను ఒకే విధంగా ట్రీట్ చేయాలని గత కొన్ని రోజుల నుంచి పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్, పాక్ టీ20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిలకు వకార్ యూనిస్ సూచించాడు. ఆమీర్ విషయం, బట్, ఆసిఫ్ వ్యవహారాన్ని ఓకే తీరున చూడలేమని షాహిద్ ఇటీవలే ప్రకటించాడు. కానీ, ఆఫ్రిది ఏం ఆలోచిస్తున్నాడో తనకు అర్ధం కావడం లేదన్నాడు. బట్, ఆసిఫ్ లను జట్టులోకి ఎందుకు తీసుకోరని యూనిస్ ప్రశ్నించాడు. వారు తప్పుచేసినందుకు ఐదేళ్ల పాటు క్రికెట్ ఆటకు దూరం చేసి శిక్షించారు. ఇప్పుడు వారిని జట్టులోకి తీసుకోవాలని, వారికి స్థానం కల్పిస్తే పాక్ టీమ్‌కు మంచి జరుగుతందని యూనిస్ పేర్కొన్నాడు. -
ఆఫ్రిదికి క్షమాపణలు చెప్పిన సల్మాన్!
కరాచీ: గతంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐదేళ్లు నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ భట్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అసలు ఆ సమయంలో ఫిక్సింగ్ అంశానికి దూరంగా ఉండాల్సిందంటూ తన సహచరుడు షాహిద్ ఆఫ్రిది ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం సాయంత్రం ఆఫ్రిదిని వ్యక్తిగతంగా కలిసిన సల్మాన్ భట్ తనను క్షమించాల్సిందిగా వేడుకున్నాడు. 2010 వ సంవత్సరంలో ఇంగ్గండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా ఫిక్సింగ్ ఆరోపణలు వెలుగు చూశాయి. దీనికి అప్పటి టెస్టు కెప్టెన్ సల్మాన్ భట్ తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు ఫిక్సింగ్ పాల్పడిట్లు ఆరోపణలు రావడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే సల్మాన్ భట్ పై ఐసీసీ విధించిన ఐదు సంవత్సరాల సస్పెన్షన్ వేటు సెప్టెంబర్ 1 వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో జరిగే దేశవాళీ మ్యాచ్ లకు సల్మాన్ భట్ కు పీసీబీ అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా ప్రస్తుత ట్వంటీ 20 కెప్టెన్ ఆఫ్రిదిని సల్మాన్ భట్ కలిశాడు. 'కనీసం ఆ సమయంలో నీ సలహా అయిన తీసుకోవాల్సింది. ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్ ఉదంతం వెలుగు చూసింది. అందుకు నన్ను క్షమించండి' అంటూ ఆఫ్రిదిని భట్ కోరాడు. దీనిపై ఆఫ్రిది స్పందిస్తూ గతంలో జరిగిపోయిన దాన్ని వదిలి పెట్టి క్రికెట్ పై దృష్టిపెట్టాలని సూచించాడు. -
ముద్గల్ కమిటీ నివేదికపై నేడు విచారణ
న్యూఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై 13 మంది క్రికెటర్ల పేర్లతో కూడిన ముకుల్ ముద్గల్ నివేదికను.. తదుపరి విచారణ కోసం జస్టిస్ లోధా కమిటీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. బీహార్ క్రికెట్ సంఘం (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మ సోమవారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ నేటి (శుక్రవారం) మధ్యాహ్నం అత్యవసర విచారణ జరుపుతుంది. గత నవంబర్‌లో ముద్గల్ కమిటీ ఇచ్చిన మూడో నివేదికలో ఉన్న పలువురి క్రికెటర్ల పేర్లు ఇప్పటిదాకా బహిర్గతం కాలేదు. ఈ రిపోర్ట్‌ను లోధా కమిటీకి ఇవ్వలేదని వర్మ తెలిపారు. దీని కారణంగా ముద్గల్ కమిటీ తీసుకున్న సమయం, చేసిన పరిశోధన వృథా అయ్యిందని అన్నారు. ఆటగాళ్ల పేర్లను వెల్లడించకూడదని అప్పట్లో బీసీసీఐ కోర్టును కోరింది. -
యువ ఆటగాళ్లపై ప్రభావం పడుతుంది: ద్రవిడ్
చెన్నై: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో ఐపీఎల్ నుంచి చెన్నై, రాజస్తాన్ జట్లను రెండేళ్ల పాటు నిషేధించిన జస్టిస్ లోధా కమిటీ తీర్పును గౌరవిస్తున్నానని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అయితే ఆయా జట్లలోని యువ ఆటగాళ్లపై ఇది ప్రభావం చూపుతుందని అన్నాడు. ‘ఎవరో ఒకరిద్దరు చేసిన అవినీతి చాలా మందిపై ప్రభావం చూపడం నిజంగా శోచనీయం. రెండు జట్లు నిషేధానికి గురవ్వడంతో యువ ఆటగాళ్లు ఇబ్బంది ఎదుర్కొంటారు. మా జట్టులోని టాప్ ఆటగాళ్లకు ఇతర జట్లలో చోటు లభించడం పెద్ద సమస్య కాదు. కానీ యువ ఆటగాళ్ల పరిస్థితి ఏమిటి?’ అని రాజస్తాన్ రాయల్స్ మెంటార్ ద్రవిడ్ ప్రశ్నించాడు. -
మహిళా క్రికెటర్లకూ గ్రేడింగ్!
ముంబై : భారత మహిళా క్రికెటర్లకు కూడా గ్రేడింగ్ విధానంలో ఏడాదికి నిర్ణీత మొత్తం చెల్లించాలని బీసీసీఐ భావిస్తోంది. బోర్డు ఫైనాన్స్ కమిటీ తాజాగా దీనిని ప్రతిపాదించింది. ఇది అమలైతే మిథాలీరాజ్, జులన్ గోస్వామివంటి సీనియర్ క్రికెటర్లకు ఎక్కువ ప్రయోజనం కలుగనుంది. మరో వైపు బీసీసీఐ గత రెండేళ్లలో లీగల్ వ్యవహారాలు, కోర్టు కేసుల నిమిత్తం రూ. 56 కోట్లు ఖర్చు చేయడం విశేషం. స్పాట్ ఫిక్సింగ్‌ను విచారించిన ముద్గల్ కమిటీకి రూ. 1.5 కోట్లు, సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీకి బోర్డు రూ. 3.90 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. వాస్తవానికి రాష్ట్ర సంఘాలకు ఇస్తున్న మౌలిక సౌకర్యాల మొత్తాన్ని ఈ ఏడాది రూ. 75 కోట్లకు పెంచాలని భావించినా... భారీ మొత్తంలో లీగల్ ఖర్చులు ఉండటంతో దానిని రూ. 50 కోట్లకే సరిపెట్టాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. -
స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణాధికారిగా వివేక్
సుప్రీంకోర్టు నియామకం న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసును విచారించేందుకు సీబీఐ అధికారి వివేక్ ప్రియదర్శిని సుప్రీంకోర్టు కొత్తగా నియమించింది. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక సెల్లో సూపరిండెంట్‌గా పని చేస్తున్నారు. ఇంతకుముందు విచారణాధికారిగా ఉన్న బీబీ మిశ్రా రిటైర్ కావడంతో ఆయన స్థానంలో వివేక్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల స్కామ్ కేసును వివేక్ సమర్థంగా నిర్వహించడంతో జస్టిస్ ఆర్.ఎమ్. లోథా కమిటీ కోరిక మేరకు సుప్రీం కోర్టు ఈ నియామకాన్ని చేపట్టింది. స్పాట్ ఫిక్సింగ్‌లో ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్ పాత్రపై వివేక్ విచారణ జరపనున్నారు. ఈ విచారణ కోసం సరైన టీమ్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ సీబీఐ అధికారికి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే బీబీ మిశ్రా టీమ్‌కు ఉన్న అధికారాలన్ని వివేక్ బృందానికి ఉంటాయని స్పష్టం చేసింది. విచారణ చేయడం, సోదాలు నిర్వహించడం, అవసరమైన డాక్యుమెంట్లను సీజ్ చేయడం కూడా ఈ టీమ్ చేయొచ్చని తెలిపింది. ఈ మొత్తం టాస్క్‌లో వివేక్ టీమ్ సేవలు లోథా కమిటీకి కూడా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌కు శిక్ష ఖరారు చేయడం కోసం సుప్రీంకోర్టు...జస్టిస్ లోథా అధ్యక్షతన జస్టిస్ అశోక్ భాను, ఆర్.వి. రాఘవేంద్రలతో కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే.