స్పాట్ ఫిక్సింగ్: అడ్డంగా దొరికిపోయారు
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తాజాగా మరో క్రికెటర్ విచారణ ఎదుర్కోనున్నాడు. గత ఫిబ్రవరిలో జరిగిన పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో నలుగురు క్రికెటర్లలు స్పాట్‌ఫిక్సింగ్‌లో దొరికిపోయారు. ఖలీద్ లతీఫ్, షర్జీల్ ఖాన్, పేసర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఈ జాబితాలో ఉన్నారు.
ఇప్పుడు మరో బ్యాట్స్‌మన్ షహజైబ్ హసన్‌పై ఆరోపణలు రావడంతో పీసీబీ అవినీతి వ్యతిరేక కోడ్ కింద అభియోగం నమోదైంది. 2009లో టీ20 ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో షహజైబ్ సభ్యుడిగా ఉన్నాడు. షహజైబ్ హసన్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను మే 4 వరకు అందించాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను అవినీతి వ్యతిరేక ట్రైబ్యునల్ ఆదేశించింది.