Pakistan Cricket Team
-
పాకిస్తాన్ జోరు.. వరుసగా రెండో విజయం
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం సాధించింది. లాహోర్ వేదికగా స్కాట్లాండ్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 32 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.స్కాటిష్ బ్యాటర్లలో కెప్టెన్ కాథరిన్ బ్రైస్(91) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలీసా లిస్టర్(31), సారా బ్రైస్(21) పర్వాలేదన్పించారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సానా నాలుగు వికెట్లతో చెలరేగింది. సానా 5 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 4 వికెట్లను తమ ఖాతాలో వేసుకుంది. ఆమెతో పాటు సాదియా ఇక్బాల్ రెండు, డయానా బేగ్ ఓ వికెట్ సాధించింది. అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని పాక్ 30.4 ఓవర్లలో చేధించింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ మునీబా అలీ(71), అలియా రియాజ్(68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. స్కాట్లాండ్ బౌలర్లలో చోలీ అబెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. రిచెల్ స్లాటెర్, కాథరిన్ ఫ్రేజర్ తలా వికెట్ సాధించారు. పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 14న వెస్టిండీస్‌తో తలపడనుంది. పాకిస్తాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2025: సీఎస్కేతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ ఓపెనర్ పై వేటు! అతడి ఎంట్రీ? -
మ్యాచ్ ఫిక్సింగ్.. అన్నీ చెప్పేస్తా: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్(Rashid Latif) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొంభైవ దశకంలో జరిగిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ దారుణాలను తాను త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నాడు. తాను రాస్తున్న పుస్తకంలో ప్రతి విషయాన్ని విడమరిచి చెబుతానంటూ 90s ఆటగాళ్లు బెంబేలెత్తిపోయేలా చేశాడు.‘‘నేను ఒక పుస్తకం రాయడటం మొదలుపెట్టాను. ఇందులో 90వ దశకంలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గురించి రాయబోతున్నాను. అప్పట్లో ఇది తారస్థాయిలో ఉండేది. ఎవ్వరి గురించి దాచేదిలేదు. అన్ని విషయాలను పూర్తిగా బయటపెట్టేస్తాను.మ్యాచ్ ఫిక్సింగ్.. అన్నీ చెప్పేస్తాఅందులో ఎవరెవరి పాత్ర ఏమిటన్నది కూడా చెప్తాను. ఏ మాజీ కెప్టెన్ అయితే.. అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం ఎదురుచూశాడో.. అతడి గురించి కూడా పూర్తి వివరాలు అందిస్తా’’ అని రషీద్ లతీఫ్ ‘ది కరెంట్ పీకే’కు వెల్లడించాడు.అంతకు ముందు జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. తొంభైవ దశకంలో ఆడిన వాళ్లు పాకిస్తాన్ జట్టుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ అంటే 90s ఆటగాళ్లకు నచ్చదు. వారి వల్లే వరల్డ్‌కప్ గెలవడం ఆలస్యమైంది.దయచేసి వీరందిని పాక్ క్రికెట్‌కు దూరంగా ఉంచండి. అప్పుడే అనుకున్న ఫలితాలు పొందవచ్చు. పాక్ క్రికెట్‌కు సేవ చేసీ చేసీ వాళ్లు అలసిపోయారు. కాబట్టి ఇకనైనా వారికి విశ్రాంతినివ్వండి’’ అని రషీద్ లతీఫ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.చాలా వరకు స్క్రిప్టెడ్ఇక క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్‌లోనూ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు తెలిసి.. క్రికెట్ మ్యాచ్‌లలో చాలా వరకు స్క్రిప్టెడ్. సినిమాలు, నాటకాల మాదిరే క్రికెట్ కూడా!.. టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు రాబట్టాలి. ఎన్ని ఓవర్లు వేయాలి.. ఇలాంటివన్నీ ముందే చెప్తారు.ప్రతి ఒక్క ఆటగాడు తన భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. దీర్ఘకాలంపాటు జట్టులో కొనసాగలేమని అందరికీ తెలుసు. అందుకే డబ్బులు వచ్చే మార్గం కనిపించినపుడు ఇలా అడ్డదారులు తొక్కడం సహజమే. ఏదేమైనా ఒక ఆటగాడు స్వార్థపరుడైతే అతడు కచ్చితంగా అక్రమార్కుల వలలో చిక్కుకుంటాడు.తొలి ఐదేళ్లలో ఇది జరుగుతుంది. నా దృష్టిలో ప్రతిభలేని ఆటగాడి కంటే.. టాప్ ప్లేయర్ మరింత స్వార్థంగా ఉంటాడు’’ అని రషీద్ లతీఫ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా 1990లో పాక్ క్రికెట్‌ను ఫిక్సింగ్ ఉదంతం కుదిపేసింది. జస్టిస్ మాలిక్ మొహమద్ ఖయ్యూం నేతృత్వంలో ఏర్పాటైన దర్యాప్తు కమిటీ.. సుదీర్ఘ విచారణ అనంతరం మాజీ కెప్టెన్ సలీం మాలిక్, పేసర్ అటా ఉర్ రెహ్మాన్‌లను దోషులుగా తేల్చింది. దీంతో వారిపై జీవితకాల నిషేధం పడింది. ఘోర అవమానం ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్య దేశంగా వ్యవహరించిన పాకిస్తాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకిదిగిన మెన్ ఇన్ గ్రీన్.. కనీసం ఒక్క మ్యాచ్ గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖర్లో బంగ్లాదేశ్‌పైనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించింది. అయితే, వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దు కావడంతో విజయమన్నదే లేకుండా ఈ వన్డే టోర్నీని ముగించింది. మరోవైపు.. తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడిన టీమిండియా చాంపియన్‌గా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్ -
పాక్ చెత్త రికార్డులు.. ఇదేందయ్యా ఇది
-
ఓటమి ఎఫెక్ట్.. పాకిస్థాన్ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్!
ఇస్లామాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లో(భారత్, న్యూజిలాండ్) ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్, పీసీబీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు.. పాకిస్థాన్ టీమ్ ఆటతీరుపై రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించారు. రిజ్వాన్ సేన దారుణ ఆటతీరు, పీసీబీ వ్యవహారాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రధాని రాజకీయ, ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా వెల్లడించారు. పార్లమెంట్లో జట్టు ప్రదర్శనపై చర్చించాలని ప్రధాని షెహబాబ్ను కోరుతామని అన్నారు. జట్టు ఓటమిపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ సందర్బంగా సనావుల్లా మాట్లాడుతూ.. పాక్ క్రికెట్ జట్టు ఆట తీరుపై ప్రధాని వ్యక్తిగతంగా దృష్టిసారించాని కోరుతాం. జట్టు ఆటతీరు దారుణంగా ఉంది. పాక్ దారుణ ప్రదర్శనపై మంత్రివర్గంలో, పార్లమెంటులో ప్రస్తావించాలనుకుంటున్నాం. క్రికెట్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ. పాక్ బోర్డు తమ దగ్గర ఉన్న నగదును వేటికి ఎలా ఖర్చుపెడుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. పీసీబీలోని కొందరు అధికారులు నెలకు ఐదు మిలియన్లకు వరకు అందుకుంటున్నారు. వారు తమకు నచ్చినట్లు చేయగలరు. కానీ, వారి బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారు. గత దశాబ్ద కాలంగా మనం క్రికెట్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం. ఆటగాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం భారీగా ఉన్నాయి. ఇవన్నీ జట్టు ప్రదర్శనపై ప్రభావితం చూపుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై పార్లమెంట్లో వాడేవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కథ ముగిసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండానే(బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టు దారుణమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లలో ఆందోళనను రేకెత్తించింది. ఇలాంటి వైఫల్యాలకు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఒక్కటే కారణం కాదని, పాక్ జట్టు దేశవాలీ వ్యవస్థ పూర్తిగా క్షీణించడం అని వారు చెబుతున్నారు. -
పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే.. ఇప్పుడిలా!
తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ పోటీలపై ఆశలు చిగురిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల్ని చూసే అవకాశం లభించడంతో వారంతా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రధాన జట్టుగా వెలుగొందిన పాకిస్తాన్‌కి ఉగ్రవాద ముద్ర పడిన తర్వాత ప్రధాన క్రికెట్ జట్లన్నీ ఆ దేశంలో పర్యటించడానికి వెనుకాడాయి.ముఖ్యంగా 2009లో ఆ దేశానికీ పర్యటనకి వచ్చిన శ్రీలంక జట్టు ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి పాకిస్తాన్ దేశం లో దాదాపు అంతర్జాతీయ క్రికెట్ పర్యటనలు నిలిచిపోయాయి. విదేశీ జట్ల రాకపోకలు నిలిచిపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా కొంతకాలం క్రితం వరకు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని తమ స్వదేశీ వేదిక చేసుకొని క్రికెట్ మ్యాచ్ లు ఆడింది.పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే2015లో జింబాబ్వే తొలిసారిగా పాకిస్తాన్ లో పర్యటించింది. దీంతో మళ్ళీ ఆ దేశంలో క్రికెట్ పర్యటనలకు దారులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత 2017లో వరల్డ్ XI జట్టు టి20 సిరీస్ ఆడింది. దీంతో అంతర్జాతీయ జట్ల పర్యటనలు మళ్ళీ మెల్ల మెల్లగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్ కి పర్యటనలకు వెళ్లడంతో మళ్ళీ ఆ దేశ క్రికెట్ అభిమానులకి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లను చూసే అవకాశం లభించింది. వివాదాల ఛాంపియన్స్ ట్రోఫీఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత పాకిస్తాన్ అభిమానులు ఒక అంతర్జాతీయ టోర్నమెంట్, అదీ ఛాంపియన్స్ ట్రోఫీ చూసేందుకు అవకాశం లభించడంతో వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనేక వివాదాల అనంతరం పాకిస్తాన్ కి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చే అవకాశం లభించింది. 2017లో సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్‌ను తమ చిరకాల ప్రత్యర్థి భారత్‌పై ఫైనల్లో 180 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటి నుండి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఎందుకంటె భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)ల మధ్య ఈ టోర్నమెంట్ ఆడితిధ్యం హక్కులపై వివాదం నెలకొంది. ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుడుగా వ్యవహరించిన రోజర్ బిన్నీ నేతృత్వంలోని బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ గతంలో జట్టు ని పాకిస్తాన్‌కు పంపడానికి నిరాకరించింది. బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదించగా, పీసీబీ మాత్రం మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లోనే ఉంచాలని పట్టుదలకు పోయింది.పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కావడం, అంతే కాక 1996 ప్రపంచ కప్ తర్వాత తొలిసారి ఐసీసీ టోర్నమెంట్ ని నిర్వహించే అవకాశం రావడం ఇందుకు ప్రధాన కారణం. చివరికి పాకిస్తాన్ కొద్దిగా పట్టు సడలించింది. దీంతో పాకిస్తాన్ అభిమానుల కల నెరవేరే రోజు రానే వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్‌కి ఇది చాల ప్రత్యేకమైన రోజు!ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎందుకు రద్దు చేసింది?ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించిన ఐసీసీ 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ప్రతిపాదించింది. ఐసీసీలో అసోసియేట్ దేశాలు గా గుర్తింపు పొందిన దేశాల జట్లు మాత్రమే ప్రతిష్టాత్మకమైన యాభై ఓవర్ల ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఐసీసీ అనుమతించింది.మొదటి రెండు టౌర్నమెంట్లకు ఇదే పద్ధతిని అనుసరించారు. కానీ త్వరలోనే పూర్తి సభ్య దేశాల జట్లు కూడా ఈ టోర్నమెంట్లో పాలొనడం ప్రారంభించడం తో ఇది వన్డే ప్రపంచ కప్ తర్వాత ఎలైట్ ఐసీసీ యాభై ఓవర్ల ఈవెంట్‌గా మారిపోయింది. 2006 వరకు ఛాంపియన్స్ ట్రోఫీని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు కానీ ఆ తర్వాత ఐసీసీ దీనిని వన్డే ప్రపంచ కప్ మాదిరిగానే దీన్ని నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం ప్రారంభించింది. అయితే యాభై ఓవర్ల ఫార్మాట్లో రెండు ప్రధాన టౌర్నమెంట్లను -- ప్రపంచ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ --- నిర్వహించడంపై దుమారం చెలరేగడంతో, ముఖ్యంగా ప్రపంచ కప్ స్థాయిలో రెండు వన్డే టౌర్నమెంట్లు నిర్వహించడం అర్ధరహితమని క్రికెట్ అభిమానులు వాదనలు వినిపించారు.మరోవైపు.. మూడు ఫార్మాట్లలోనూ మెగా టోర్నీ నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఐసీసీ ప్రవేశట్టింది. ఈ క్రమంలో 2017లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను నిలిపివేసిన ఐసీసీ... 2021లో రీ ఎంట్రీపై అప్డేట్ ఇచ్చింది. 2025లో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీని నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ వేదిక కోసం పాకిస్తాన్ పట్టుబడటం, ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ ఆతిధ్యం పై వివాదం చెలరేగింది.తటస్థ వేదికైన యూఏఈలోఈ టోర్నమెంట్ నిర్వహణ పై అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ టోర్నమెంట్ పాకిస్తాన్ నుంచి వేరే దేశానికీ మార్చాలని కూడా భావించారు. అయితే గత సంవత్సరం నవంబర్ లో బీసీసీఐ, పీసీబీ అధికారుల మధ్య ఐసీసీ ఒక సమావేశం నిర్వహించింది. భారత్ మ్యాచ్‌లను తటస్థ దేశమైన యూఏఈలో నిర్వహించేందుకు చివరికి అంగీకారం కుదరడంతో మళ్ళీ ఈ టోర్నమెంట్ నిర్వహణకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.చదవండి: భారత తుదిజట్టులో బుమ్రా స్థానంలో అతడే సరైనోడు: రిక్కీ పాంటింగ్ -
చాంపియన్స్ ట్రోఫీ పూర్తి జట్లు.. కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు వీరే
క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy 2025) వన్డే సమరానికి సమయం దగ్గర పడుతోంది. మినీ వన్డే వరల్డ్‌కప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. వన్డే ప్రపంచకప్-2023లో సత్తా చాటి ఏడు టీమ్‌లు అర్హత సాధించగా, ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్‌కు నేరుగా ఎంట్రీ లభించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఈ మెగాటోర్ని జరగనుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ జరుగుతుండడంతో క్రికెట్ అభిమానులు (Cricket Fans) ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2017లో చివరిగా చాంపియన్స్ ట్రోఫీ జరిగిన సంగతి తెలిసిందే.రౌండ్-రాబిన్ ఫార్మాట్లో చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. 8 జట్లను రెండు గ్రూపులుగా (ఏ, బీ) విభజించారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని ప్రతి ఇతర జట్టుతో తలపడుతుంది. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీ ఫైనల్లో విజేతలుగా నిలిచిన రెండు టీమ్‌లు ఫైనల్లో ఢీకొంటాయి. నాకౌట్ చేరేందుకు ప్రతిజట్టు గట్టిగానే ప్రయత్నించే అవకాశం ఉన్నందున ఈసారి మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు రెట్టింపు వినోదాన్ని పంచనున్నాయి. గ్రూప్ ఏలో ఇండియా, (India) న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ టీమ్‌లున్నాయి. గ్రూప్ బీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఉన్నాయి.ఫిబ్రవరి 19న కరాచిలో జరిగే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. ఫిబ్రవరి 20 నుంచి టీమిండియా (Team India) మ్యాచ్‌లు ఉంటాయి. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లోనే జరుగుతాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 23న టీమిండియా తలపడుతుంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో మన మ్యాచ్ ఉంటుంది. మార్చి 4న దుబాయ్‌లో మొదటి సెమీఫైనల్, మార్చి 5న లాహోర్‌లో రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. టైటిల్ విజేతను తేల్చే ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. కాగా, పాకిస్థాన్ తప్ప మిగతా దేశాలు తమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి.Group Aఇండియాకెప్టెన్: రోహిత్ శర్మవైస్ కెప్టెన్: శుభమన్ గిల్స్టార్ ప్లేయర్లు: విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాభారత పూర్తి జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిన్యూజిలాండ్కెప్టెన్: మిచెల్ సాంట్నర్కీలక ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీన్యూజిలాండ్ పూర్తి జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.పాకిస్తాన్కెప్టెన్: బాబర్ ఆజంవైస్ కెప్టెన్: మహ్మద్ రిజ్వాన్ కీలక ఆటగాళ్లు: షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్పాకిస్థాన్ జట్టు (అంచనా): బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, నోమన్ అలీ, సాజిద్ ఖాన్, నసీమ్ షా, ఇహ్సానుల్లా, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్, అఘా సల్మాన్, ఉస్మాన్ ఖాదిర్, తయ్యాబ్ తాదిర్, హసన్ అలీబంగ్లాదేశ్కెప్టెన్: నజ్ముల్ హొస్సేన్కీలక ఆటగాళ్లు: ముష్ఫికర్ రహీమ్, తస్కిన్ అహ్మద్, మహ్మదుల్లాబంగ్లాదేశ్ పూర్తి జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, పర్వేజ్ హోస్సై ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రానాGroup Bఇంగ్లండ్కెప్టెన్: జోస్ బట్లర్వైస్-కెప్టెన్: హ్యారీ బ్రూక్కీలక ఆటగాళ్లు: జో రూట్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ఇంగ్లండ్ పూర్తి జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్ఆస్ట్రేలియాకెప్టెన్: పాట్ కమిన్స్కీలక ఆటగాళ్లు: స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్ఆస్ట్రేలియా పూర్తి జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, మిషెల్ హార్డీ, హాజిల్‌వుడ్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపాదక్షిణాఫ్రికాకెప్టెన్: టెంబా బావుమాకీలక ఆటగాళ్లు: కగిసో రబడ, హెన్రిచ్ క్లాసెన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్దక్షిణాఫ్రికా పూర్తి జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ర్యాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జేఅఫ్గానిస్థాన్కెప్టెన్: హష్మతుల్లా షాహిదీవైస్ కెప్టెన్: రహమత్ షాకీలక ఆటగాళ్లు: రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ఫజల్ హక్ ఫరూఖీఅఫ్గానిస్థాన్ పూర్తి జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీబ్, మహ్మద్ నబీబ్, రహమ్మద్ నబీబ్, గజన్ఫర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫరూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.రిజర్వ్ ఆటగాళ్లు: దర్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటీ, బిలాల్ సామివేదికలుకరాచీ నేషనల్ స్టేడియంలాహోర్: గడాఫీ స్టేడియంరావల్పిండి క్రికెట్ స్టేడియందుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంమ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2.30కు ప్రారంభమవుతాయి. -
ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ నుంచి పాక్ జట్టు దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వన్డే ప్రపంచకప్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన పాక్.. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లోనూ అదే తీరును కనబరిచింది.ఆఖరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కూడా పాక్ ఓటమి అంచున నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. ఇంకా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 115 పరుగుల వెనకబడింది. ఆఖరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. తొలి సెషన్లో పాక్ ఏమైనా మరో రెండు వికెట్లు కోల్పోతే ఓటమి ఖాయమవ్వక తప్పదు.ఈ క్రమంలో తమ జట్టుపై పాక్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ విమర్శలు వర్షం కురిపించాడు. ఇప్పటికైనా టీమిండియాను చూసి నేర్చుకోండి అంటూ పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు. "ఏ జట్టు అయినా విజయ పథంలో ముందుకు వెళ్లాలంటే సరైన ప్లానింగ్, ఆలోచన విధానం చాలా ముఖ్యం. కానీ ఆ రెండు విషయాలే పాకిస్తాన్ క్రికెట్లో లేవు. దయచేసి భారత్‌ను చూసి నేర్చుకోండి. వారి ద్వితీయ శ్రేణి జట్టుతో కూడా అద్బుతాలు చేస్తున్నారు. శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతి ఇచ్చారు. అయినప్పటకి మరో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. అదే పాక్ జట్టుకు మాత్రం అందరు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవరు. పాక్ జట్టు మెనెజ్‌మెంట్ ఆలోచన విధానంలో మార్పు రావాలి. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి.ప్రస్తుతం బారత జట్టు మెన్జ్మెంట్ అదే పనిచేస్తుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో యువ ఆటగాళ్లు నితీష్ కుమార్, రింకూ సింగ్ అదరగొట్టారు. నితీష్ కొట్టి సిక్సర్ల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పవర్ ఫుల్ షాట్లు ఆడాడు. మరోవైపు రింకూ మైఖల్ బెవాన్‌లా చెలరేగాడు. అయితే వీరిద్దరి విధ్వసంకర ఇన్నింగ్స్‌ల వెనక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గంభీర్ అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తాడు. ఒకవేళ ఆటగాళ్లు విఫలమైనా కూడా సపోర్ట్‌గా ఉంటాడు. అత్యుత్తమ ఆటగాళ్లను తాయారు చేసే పనిలో గంభీర్ ఉన్నాడు. అందుకు ఊదహరణే నితీష్" అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. -
‘ఈసారి అతడిని కెప్టెన్ చేయకపోతే పాక్ జట్టుకు అధోగతే’
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. షాహిన్ ఆఫ్రిది వంటి పాక్ దిగ్గజాలు ఇప్పటికే ఈ విషయం గురించి పాక్ బోర్డుకు సూచనలు చేయగా.. మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ కూడా ఇదే మాట అంటున్నాడు. బాబర్‌కు నాయకత్వ లక్షణలు లేవని.. అతడిని ఇకపై సారథిగా కొనసాగించవద్దని సూచిస్తున్నాడు.సరైన నిర్ణయం తీసుకోకపోతేబాబర్ ఆజం స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు పాక్ వన్డే, టీ20 పగ్గాలు అప్పగించాలని బసిత్ అలీ విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు గనుక కెప్టెన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే.. పాక్ క్రికెట్ మరింత భ్రష్టుపట్టిపోతుందని హెచ్చరించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల(వన్డే, టెస్టు, టీ20) కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులయ్యారు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అనూహ్యంగా షాహిన్‌పై వేటు వేసిన పాక్ బోర్డు.. తిరిగి వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతలను బాబర్‌కు అప్పగించింది. అయితే, గత టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన అతడు.. ఈసారి మాత్రం కనీసం సూపర్-8కు చేర్చలేకపోయాడు. ఫలితంగా బాబర్‌పై వేటు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ మాట్లాడుతూ.. మహ్మద్ రిజ్వాన్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. చాంపియన్స్ వన్డే కప్-2024లో అతడు మార్ఖోర్స్ జట్టును నడిపిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. బాబర్ బదులు రిజ్వాన్‌ను పాకిస్తాన్ కెప్టెన్ చేయాలని సూచించాడు.బాబర్ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు‘‘తన కంటే పాకిస్తాన్‌కు మెరుగైన కెప్టెన్ మరొకరు దొరకరు అనేలా రిజ్వాన్ చాంపియన్స్ కప్‌లో జట్టును నడిపిస్తున్నాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేస్తూ.. మెరుగైన ఫలితాలు రాబడుతున్నాడు. బాబర్ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు. షాన్ మసూద్ కూడా రిజ్వాన్లా జట్టుకు న్యాయం చేయలేడు.ఈసారి గనుక రిజ్వాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించకపోతే పాకిస్తాన్ క్రికెట్‌కు అంతకంటే భారీ నష్టం మరొకటి ఉండదు. రిజ్వాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయం’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ చాంపియన్స్ వన్డే కప్‌లో మహ్మద్ రిజ్వాన్ మార్ఖోర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ జట్టు ఆదివారం నాటి మ్యాచ్‌లో స్టాలియన్స్‌ను 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక బాబర్ ఆజం స్టాలియన్స్ జట్టుకు ఆడుతుండటం కొసమెరుపు. చదవండి: 4,4,4,4,4: బాబర్ ఆజం ఫోర్ల వర్షం.. అంత ఈజీగా ఎలా కొట్టేశాడు! -
బాబర్, రిజ్వాన్, అఫ్రిది వద్దు.. అతడే పాక్ కెప్టెన్ కావాలి: సల్మాన్ బట్
టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తమ జట్టు చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్‌పై వేటు వేసిన పీసీబీ.. కెప్టెన్సీ మార్పుపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.టీ20 వరల్డ్‌కప్ ముందు పాక్ జట్టు పగ్గాలను తిరిగి చేపట్టిన బాబర్ ఆజం.. మరోసారి ఐసీసీ టోర్నీల్లో జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో బాబర్‌ను పాక్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి.ఈ జాబితాలోకి తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ చేరాడు. పరిమిత ఓవర్లలో పాక్ కెప్టెన్సీని స్టార్ బ్యాటర్ షాన్ మసూద్‌కు అప్పగించాలని బట్ పీసీబీని సూచించాడు. కాగా మసూద్ ప్రస్తుతం టెస్టుల్లో పాక్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు."ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో కాస్త గందరగోళం నెలకొంది. జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటకి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. బాబర్‌కు కెప్టెన్సీ స్కిల్స్ పెద్దగా లేవు.ఫీల్డ్‌లో వ్యూహాలు రచించడంలో విఫలమవుతున్నాడు. పాకిస్తాన్ తిరిగి విన్నింగ్ ట్రాక్‌లో రావాలంటే ఒక్కటే మార్గం. షాన్ మసూద్ అన్ని ఫార్మాట్లలో పాక్ కెప్టెన్సీ అప్పగించాలని"ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భట్ పేర్కొన్నాడు.చదవండి: లంకతో సిరీస్‌తో రీఎంట్రీ!.. ఖరీదైన ఫ్లాట్ కొన్న టీమిండియా స్టార్ -
T20 WC: పాక్ కొంపముంచిన అమీర్.. చెత్త బౌలింగ్‌తో
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం ఆతిథ్య అమెరికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో జట్లు సమంగా పోరాడనప్పటకి.. సూపర్ ఓవర్లో మాత్రం విజయం యూఎస్ఎనే వరించింది.తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో యూఎస్ఏ కూడా 159/3 స్కోరుతో నిలిచింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.పాక్ కొంపముంచిన అమీర్..ఇక పాకిస్తాన్ తరపున సూపర్ ఓవర్ వేసే బాధ్యతను సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్‌కు కెప్టెన్ బాబర్ ఆజం అప్పగించాడు. బాబర్ ఆజం నమ్మకాన్ని అమీర్ వమ్ము చేశాడు. సూపర్ ఓవర్ వేసిన అమీర్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఏడు పరుగులు వైడ్ల రూపంలోనే రావడం గమనార్హం. అనంతరం 19 పరుగుల లక్ష్య చేధనలో పాక్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. ఇక పాక్ ఓటమికి పరోక్షంగా కారణమైన మహ్మద్ అమీర్‌ను ఆ జట్టు అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అమీర్ కంటే అఫ్రిదికి బౌలింగ్ బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
ఐర్లాండ్‌తో తొలి టీ20లో ఓటమికి పాకిస్తాన్ బదలు తీర్చుకుంది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే 16.5 ఓవర్లలో చేధించింది.పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(75), ఫఖార్ జమాన్(78) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.ఐరీష్ బ్యాటర్లలో లారెన్ టక్కర్(51), టాక్టెర్(32) పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. అమీర్, నసీం షా తలా వికెట్ సాధించారు.బాబర్ ఆజం వరల్డ్ రికార్డు..ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌ల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. బాబర్ సారథ్యంలో ఇప్పటివరకు పాకిస్తాన్ 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా పేరిట ఉండేది. బ్రియాన్ మసాబా కెప్టెన్‌గా ఉగాండాకు 44 టీ20లు విజయాలు అందించాడు. తాజా విజయంతో మసాబా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (42), మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్థాన్ మాజీ సారథి అస్గర్ ఆఫ్ఘన్ (42), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (41), రోహిత్ శర్మ (41) ఉన్నారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది. "నేను చాలా ఇష్టపడే ఆట(క్రికెట్) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.నా 17 ఏళ్ల ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది. నా క్రికెట్ ప్రయాణంలో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నాపై నమ్మకం ఉంచి, జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని" బిస్మా పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మరూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్‌కు తన సేవలు అందించింది. పాకిస్తాన్ మహిళ క్రికెట్ జట్టు తరపున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికి మరూఫ్ పేరునే ఉంది. ఆమె పాక్ తరపున 136 వన్డేల్లో 3369 పరుగులతో పాటు 44 వికెట్లు, 146 టీ20ల్లో 2893 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది.96 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా మరూఫ్ వ్యవహరించింది. మరూఫ్ చివరగా స్వదేశంలో వెస్టిండీస్ మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాక్ జట్టు తరపున ఆడింది. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కూడా మరూఫ్ భాగమైంది. కానీ ఈ సిరీస్‌లో ఆడుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు అజహర్ మహమూద్ ఎంపికయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ కూడా అయిన అజహర్.. పాక్ త్వరలో న్యూజిలాండ్‌తో ఆడబోయే టీ20 సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అజహర్‌ను ప్రస్తుతం ఈ సిరీస్‌కు మాత్రమే కోచ్‌గా ఎంపిక చేశారు. న్యూజిలాండ్ సిరీస్‌కు టీమ్ మేనేజర్‌గా పాక్ మాజీ బౌలర్ వహాబ్ రియాజ్ నియమించబడ్డాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు మహ్మద్ యూసుఫ్, సయీద్ అజ్మల్ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు పాక్‌లో పర్యటింనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 18, 20, 21, 25, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు రావల్పిండి వేదిక కానుండగా.. ఆఖరి రెండు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇదివరకే ప్రకటించబడగా.. పాక్ జట్టును ప్రకటించాల్సి ఉంది. కాగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత కొంతకాలంగా ఫుల్‌టైమ్ హెడ్ కోచ్ కోసం అన్వేషిస్తుంది. ఈ పదవిని భర్తీ చేయడం కోసం పీసీబీ పెద్ద కసరత్తే చేసింది. ఒకానొక సమయంలో పాక్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది. వాట్సన్ పీసీబీ ప్రతిపాదనను తోసిపుచ్చడంతో అజహర్ పాక్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. గ్రాంట్ బ్రాడ్‌బర్న్ నిష్క్రమణ తర్వాత పాక్ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి హెడ్ కోచ్ లేడు. ఇదిలా ఉంటే, 49 ఏళ్ల అజహర్ మహమూద్‌కు గతంలోనూ కోచింగ్ అనుభవం ఉంది. అతను 2017 నుంచి 2019 వరకు పాక్ జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. అజహర్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పాక్ తరఫున 21 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడిన అజహర్.. 162 వికెట్లు తీసి 2400 పైచిలుకు పరుగులు సాధించాడు. అజహర్ టెస్ట్‌ల్లో 3 సెంచరీలు కూడా చేశాడు. 2012-2015 మధ్యలో ఐపీఎల్లో పాల్గొన్న అజహర్.. పంజాబ్ కింగ్స్, కేకేఆర్ తరఫున ఆడాడు. ఐపీఎల్లో 23 మ్యాచ్‌లు ఆడిన అజహర్ 29 వికెట్లు తీసి 388 పరుగులు చేశాడు. అజహర్ ఐపీఎల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. -
న్యూజిలాండ్‌కు బిగ్ షాకిచ్చిన పాకిస్తాన్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
అండర్-19 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని పాక్ అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం ఈస్ట్ లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 25.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. పాక్ ఓపెనర్లు షాజైబ్ ఖాన్(80 నాటౌట్), షమీల్ హుస్సేన్(54నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్.. పాక్ బౌలర్ల దాటికి కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ఉబైద్ షా, ఆరాఫాట్ మిన్హాష్ తలా 3 వికెట్లు పడగొట్టి బ్లాక్ క్యాప్స్ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు నవీద్ రెండు,అలీ, జీషన్ ఒక్కో వికెట్ సాధించారు. ఈ విజయంతో పాకిస్తాన్ గ్రూపు-డి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. చదవండి: IND vs ENG: సెంచరీతో చెలరేగిన పోప్.. రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు -
పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్.. దేశాన్ని వీడనున్న స్టార్ ఆటగాడు!?
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు తన మకాం మార్చాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టెస్టుల్లో పాక్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్‌కు.. మహ్మద్ రిజ్వాన్‌తో పాటు యువ వికెట్ కీపర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది. దీంతో అతడిని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక వేళ సెలక్టర్లు ఎంపిక చేసినా.. తుది జట్టులో చోటు అంతంతమాత్రమే. తన క్రికెట్ భవిష్యత్తు సందిగ్ధంలో పడడంతో పాకిస్తాన్‌ను విడిచిపెట్టి లండన్ వెళ్లాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. యూకేలో ఉంటూ కౌంటీలు, ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడాలని సర్ఫరాజ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే అహ్మద్ తన సొంత దేశాన్ని వదిలి యూకేకు వెళ్లినా త్వరలో పాకిస్తాన్లో జరగనున్న పీఎస్ఎల్ లో మాత్రం ఆడతానని సర్ఫరాజ్ సృష్టం చేసినట్లు వినికిడి. ఇప్పటికే తన ప్రాతినిథ్యం వహిస్తున్న క్వెట్టా గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీకి సర్ఫరాజ్ ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే దేశం విడిచి వెళ్లడంపై సర్ఫరాజ్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టులలో పాకిస్తాన్ తరపున సర్ఫరాజ్ ఆడాడు. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న అహ్మద్.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని రెండో టెస్టుకు జట్టు మేనెజ్మెంట్ పక్కన పెట్టేసింది. రెండో టెస్టుకు సర్ఫరాజ్ స్ధానంలో మహ్మద్ రిజ్వాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్‌గా సర్ఫరాజ్ తన కెరీర్లో ఇప్పటివరకు 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20ల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 పరుగులు చేశాడు. కాగా 2017లో అతడి సారథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్! -
పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఒకేసారి తప్పుకున్న ముగ్గురు కీలక వ్యక్తులు
పాకిస్తాన్ క్రికెట్ భారీ కుదుపునకు లోనైంది. ఆ జట్టుకు సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తులు తమతమ పదవులకు రాజీనామా చేశారు. పాక్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుటిక్ ఒకేసారి విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పీసీబీతో తమ అనుబంధం ఈ నెలాఖరుతో ముగుస్తుందని ఈ ముగ్గురు వెల్లడించారు. తమ రాజీనామాలను పాక్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించిందని వారు తెలిపారు. మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుటిక్ ఆయా హోదాల్లో గతేడాదే నియమితులయ్యారు. అంతకుముందు కూడా వీరికి పాక్ జట్టుతో అనుబంధం ఉండింది. అయితే వన్డే వరల్డ్‌కప్‌కు ముందు పీసీబీ వీరి పదవులను మార్చింది. మిక్కీ ఆర్థర్.. గతంలో పాక్ జట్టు హెడ్ కోచ్‌గా.. బ్రాడ్‌బర్న్ ఎన్సీఏ హై పెర్ఫార్మింగ్ కోచ్‌గా పని చేశారు. ఈ ఇద్దరు ఆయా పదవుల్లో అద్భుతంగా రాణించి, పాక్ జట్టును అత్యున్నత స్థాయిలో నిలిపారు. అయితే కొత్త పదవుల్లోనే మాత్రం వీరు సత్తా చాటలేకపోయారు. ఆర్థర్ డైరెక్టర్‌గా, బ్రాడ్‌బర్న్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక పాక్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం, ఆ తర్వాత ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ పరాభవం.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్ ఓటమి.. ఇలా వరుస సిరీస్‌ల్లో పాక్ చెత్త ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డే వీరిని తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. వన్డే వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్‌ను మార్చిన పాక్.. తాజాగా ప్రధాన నాన్ ప్లేయింగ్ స్టాఫ్‌ను మార్చడం ఆసక్తికర పరిణామంగా మారింది. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమి నేపథ్యంలో బాబార్ ఆజమ్ పాక్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో పీసీబీ మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించింది. షాన్ మసూద్ సారథ్యంలోని పాక్ టెస్ట్ జట్టు ఆస్ట్రేలియాలో 0-3తో సిరీస్ కోల్పోయి ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా.. తాజాగా షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని పాక్ టీ20 జట్టు న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో (మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే) కోల్పోయింది. పాక్ ఇవాళ (జనవరి 19) న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో తలపడనుంది. -
అతడొక అద్భుతం.. పాక్ క్రికెట్లో లెజెండ్ అవుతాడు: గంభీర్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్ ఆజం తన కెరీర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలుస్తాడని గంభీర్ కొనియాడాడు. వన్డే ప్రపంచకప్-2023 అనంతరం అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. బాబర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తలపడుతున్న పాక్ టెస్టు జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కీడాతో గంభీర్ మాట్లాడుతూ.. "కెప్టెన్సీని విడిచిపెట్టడం లేదా స్వీకరించడమనేది ఆటగాళ్ల వ్యక్తిగతం. నా వరకు అయితే బాబర్ ఆజం అద్భుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వర్క్‌లోడ్ తగ్గింది. పాకిస్తాన్లో మాత్రం ప్రశంసలైనా, విమర్శలైనా కెప్టెన్‌కే దక్కుతాయి. ఇటువంటిది భారత్‌లో కూడా కొంత వరకు ఉంది. బాబర్ ఆజం బ్యాటింగ్‌పై ఎప్పుడూ పెద్దగా విమర్శలు రాలేదు. ప్రతీ సారి అతడి కెప్టెన్సీపైనే ప్రశ్నల వర్షం కురిసేది. ఇప్పుడు అతడు కెప్టెన్సీ విడిచిపెట్టాడు. ఇకపై మనం సరికొత్త బాబర్‌ను చూడవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా బాబర్ నిలిచాడు. అతడికి ఇంకా చాలా వయస్సు ఉంది. బాబర్ మరో 10 ఏళ్ల పాటు క్రికెట్ ఆడుతాడు. కచ్చితంగా అతడు రిటైర్ అయ్యే సమయానికి పాక్ క్రికెట్ చరిత్రలో తన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటాడని పేర్కొన్నాడు. చదవండి: AUS vs PAK: ఫేర్వెల్ టెస్టు సిరీస్ ... పాక్‌పై సెంచరీతో చెలరేగిన డేవిడ్ వార్నర్ -
దురదృష్టం అంటే నీదే భయ్యా.. పాపం ఎవరికీ ఈ కష్టం రాకూడదు!
పాకిస్తాన్ నేషనల్ టీ20 కప్‌లో భాగంగా డిసెంబర్2న అబోటాబాద్, సియాల్కోట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సియాల్కోట్ ఓపెనర్, పాక్ యువ బ్యాటర్ మీర్జా తాహిర్‌ను దురదృష్టం వెంటాడింది. ఎవరూ ఊహించని విధంగా హిట్‌వికెట్‌గా తాహిర్ వెనుదిరిగాడు. ఏం జరిగిందంటే..? సియాల్కోట్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన స్పిన్నర్ యాసిర్ షా బౌలింగ్‌లో తాహిర్ బ్యాక్ ఫుట్‌లో నుంచి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు వెనుక్కి వెళ్లి షాట్ ఆడే క్రమంలో అతడి బరువు బ్యాక్‌ఫుట్‌పై పడింది. దీంతో ఒక్కసారిగా తాహిర్ కుడి కాలి కండరాలు పట్టేసాయి. ఈ క్రమంలో నొప్పితో విల్లావిల్లాడిన అతడు బ్యాలెన్స్ కోల్పోయి స్టంప్స్‌పై పడిపోయాడు. దీంతో 38 పరుగులు చేసిన తహిర్ హిట్‌వికెట్‌గా నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సియాల్కోట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. సియాల్కోట్ బ్యాటర్లలో తాహిర్‌దే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అనంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో అబోటాబాద్ ఛేదించింది. చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్ Mirza Tahir Baig had a bizarre and unfortunate end to his stay at the crease 😳#NationalT20 | #ABTvSKT | #AajaMaidanMein pic.twitter.com/XdB0uXP4Jb — Pakistan Cricket (@TheRealPCB) December 2, 2023 -
పాకిస్తాన్ జట్టుకు ఏమైంది?.. వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శనకు కారణాలేంటి?
పాకిస్తాన్ క్రికెట్ టీమ్.. వన్డే ప్రపంచకప్-2023 టైటిల్ ఫేవరేట్‌గా భారత గడ్డపై అడుగుపెట్టిన జట్లలో ఒకటి. కానీ అందరి అంచనాలను తలకిందలూ చేస్తూ లీగ్ దశలోనే పాకిస్తాన్ ఇంటిముఖం పట్టింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంతో సరిపెట్టుకుంది. శనివారం ఇంగ్లండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీలో పాక్ కథ ముగిసింది. దీంతో వరుసగా మూడో సారి వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌కు చేరడంలో పాకిస్తాన్ విఫలమయ్యంది. గత ఆరు వరల్డ్‌కప్ ఎడిషన్లలో కేవలం ఒక్కసారి మాత్రమే సెమీస్‌కు పాక్ చేరింది. అయితే ఎన్నో అంచనాలతో ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగిన పాకిస్తాన్.. సెమీస్‌కు చేరడంలో ఎందుకు విఫలమైందో ఓ లూక్కేద్దం. ఫాస్ట్ బౌలింగ్ వైఫల్యం.. పాకిస్తాన్‌కు బ్యాటింగ్ కంటే బౌలింగే ఎక్కువ బలం. అటువంటి ఈ ఏడాది టోర్నీలో పాక్ బౌలర్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ముఖ్యంగా పేసర్లు దారాళంగా పరుగులు సమర్పించకున్నారు. వరల్డ్ నెం1 బౌలర్ షాహీన్ అఫ్రిది ఆడపదడప వికెట్లు తీసినప్పటికీ.. పరుగులు కట్టడం చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. అతడితో పాటు మరో వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్ రవూఫ్ అయితే ఘోరంగా విఫలమయ్యాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన రవూఫ్ ఏకంగా 533 పరుగులిచ్చాడు. ఇక్కడే మనం అర్ధం చేసుకోవచ్చు రవూఫ్ బౌలింగ్ ప్రదర్శన ఎలా ఉందో. నసీమ్ షా గాయం.. నసీమ్ షా.. పాకిస్తాన్ పేస్ త్రయంలో ఒకడు. షాహీన్ అఫ్రిదితో కలిసి కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. పవర్‌ప్లేలో తన పేస్‌తో వికెట్లు పడగొట్టి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాలను ఇచ్చేవాడు. అయితే ఈ మెగా టోర్నీకకి ముందు ఆసియాకప్‌లో నసీమ్ షా గాయపడ్డాడు. దీంతో అతడు వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. అతడి లేని లోటు పాక్ జట్టులో సృష్టంగా కన్పించింది. నసీం షా స్ధానంలో వెటరన్ పేసర్ హసన్ అలీ వచ్చినప్పటికీ అంత ప్రభావం చూపలేకపోయాడు. సరైన స్పిన్నర్ లేడు.. ఈ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జట్టులో క్వాలిటి స్పిన్నర్ ఒక్కరు కూడా లేరు. మిగితా జట్లలో స్పిన్నర్లు బంతిని బొంగరంలా తిప్పితే.. పాక్ స్పిన్నర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కీలకమైన మిడిల్ ఓవర్లలో పరుగులు లీక్ చేస్తూ తమ జట్టు ఓటమికి కారణమయ్యారు. పాకిస్తాన్ ప్రధాన స్పిన్నర్, వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ప్రదర్శన కోసం అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతడు దారుణంగా విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్‌లు ఆడి 6 కంటే ఎక్కువ ఎకానమీతో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతడితో పాటు నవాజ్ కూడా అంతంత ప్రదర్శన మాత్రమే కనబరిచాడు. బాబర్ చెత్త కెప్టెన్సీ.. ఈ వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ ఇంటముఖం పట్టడానికి మరో కారణం బాబర్ ఆజం కెప్టెన్సీ అనే చెప్పాలి. 9 మ్యాచ్‌ల్లో కూడా బాబర్ కెప్టెన్సీ మార్క్ పెద్దగా కన్పించలేదు. జట్టులో మార్పులు కూడా సరిగ్గా చేయలేదు. టోర్నీ ఆరంభం నుంచే ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ దారుణంగా విఫలమవుతున్నప్పటికీ అవకాశాలు ఇవ్వడం.. మరో సీనియర్ ఓపెనర్ ఫఖార్ జమాన్ పక్కన పెట్టడం వంటి తప్పిదాలను బాబర్ చేశాడు. మ్యాచ్ మధ్యలో వ్యూహత్మకంగా వ్యవరించడంలో కూడా బాబర్ విఫలమయ్యాడు. క్లిష్టమైన పరిస్ధితుల్లో బాబర్ పూర్తిగా తేలిపోయాడు..వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా బాబర్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 9 మ్యాచ్‌ల్లో 320 పరుగులు మాత్రమే ఆజం చేశాడు. ఇదేమి ఫీల్డింగ్ రా బాబు.. క్రికెట్లో పాకిస్తాన్ జట్టు మెరుగుపడాల్సిన అంశం ఏదైనా ఉందంటే ఫీల్డింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మెగా టోర్నీలో ఫీల్డింగ్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్ కనబరిచిన పాక్.. అందుకు భారీ మూల్యం చెల్లంచకుంది. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మొదటిలోనే డేవిడ్ వార్నర్‌కు అవకాశమివ్వడంతో అతడు భారీ శతకంతో చెలరేగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ ఫీల్డింగ్ కథలు ఎన్నో ఉన్నాయి. చదవండి: ENG vs WI: వెస్టిండీస్ టూర్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా జోస్ బట్లర్ -
టీవీల ముందు కూర్చుని ఎవరైనా సలహాలు ఇస్తారు: బాబర్ ఆజం
‘‘గత మూడేళ్లుగా.. నాయకుడిగా మా జట్టును ముందుకు నడిపిస్తున్నా. కానీ ఎప్పుడూ ఇలా ఫీల్ అవలేదు. వరల్డ్‌కప్‌లో నా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం వల్లే కొంతమంది నా గురించి ఇలా మాట్లాడుతున్నారు. నేను ఒత్తిడిలో కూరుకుపోయానని వాళ్లే ఊహించుకుంటున్నారు. నిజానికి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. గత రెండున్నర, మూడేళ్లుగా కెప్టెన్‌గా నా ప్రదర్శన ఎలా ఉందో నాకు తెలుసు. అప్పుడు బ్యాటింగ్ చేసింది నేనే.. కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపిందీ నేనే.. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నా! అయితే, ఒక విషయాన్ని మనం ఏ కోణం నుంచి చూస్తున్నామన్నదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలు ఉండటం సహజం. ఎవరికి వారే తాము ప్రత్యేకం అనుకుంటారు. కానీ.. కొంత మంది మాత్రం తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. ‘అతడు అలా ఆడితే బాగుండు.. ఇలా చేస్తే బాగుండు’ అని తోచింది చెబుతూ ఉంటారు. టీవీల ముందు కూర్చుని మాట్లాడటం సులభమే. నా గురించి మాట్లాడుతున్న వాళ్లందరి దగ్గరా నా ఫోన్ నంబర్ ఉంది. నిజంగా మీరు నాకేదైనా సలహా ఇవ్వాలనుకుంటే నేరుగా నాకు మెసేజ్ చేయండి’’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో వ్యక్తిగతంగా తన ప్రదర్శన బాగానే ఉందన్న బాబర్.. కెప్టెన్సీ వల్ల తన బ్యాటింగ్‌పై ఏమాత్రం ప్రభావం పడటం లేదని స్పష్టం చేశాడు. తాను పూర్తి స్వేచ్ఛగా ఆడుతున్నానని పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్-2023 టోర్నీలో ఆరంభంలో విజయాలు సాధించిన పాకిస్తాన్ ఆ తర్వాత చతికిలపడింది. బ్యాటర్‌గానూ బాబర్ ఆశించిన రీతిలో ఆడలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురిసింది. కెప్టెన్సీ వదిలేస్తేనే బాబర్ బాగుపడతాడంటూ పాక్ మాజీ క్రికెటర్లు సలహాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో లీగ్ దశలో ఆఖరిగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బాబర్ ఆజం మీడియాతో మాట్లాడుతూ విమర్శకులకు కౌంటర్ వేశాడు. ఇదిలా ఉంటే.. సెమీస్ రేసులో నిలవాలంటే ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితిలో ఉన్న పాక్‌కు న్యూజిలాండ్ షాకిచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరు వేదికగా శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించి అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో పాక్ ఇంకా సెమీస్ చేరాలని భావిస్తే ఇంగ్లండ్‌పై 287 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. బాబర్ ఆజం ఈ ప్రపంచకప్‌లో గత నాలుగు ఇన్నింగ్స్‌లో మూడు అర్ధ శతకాలు బాదాడు. -
దక్షిణాఫ్రికా చేతిలో కివీస్ ఘోర ఓటమి.. సెమీస్ రేసులోకి పాకిస్తాన్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పుణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. ప్రోటీస్ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది. ఇక న్యూజిలాండ్ ఘోర ఓటమితో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కివీస్ నాలుగో స్ధానానికి చేరుకోగా.. ఆస్ట్రేలియా మూడో స్ధానానికి ఎగబాకింది. కివీస్ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత రెట్టింపు అయ్యాయి. పాకిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే? ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంకా పాకిస్తాన్‌కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై కచ్చితంగా విజయం సాధించాలి. అప్పుడు పాక్ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరుతాయి. అయితే ఈ 10 పాయింట్లతో పాకిస్థాన్ సెమీస్ చేరడం చాలా కష్టం. ఈ సమయంలో ఇతర జట్ల ఫలితాలపై పాక్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 8 పాయింట్లతో నాలుగో స్ధానంలో కివీస్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. మరోవైపు ఆరో స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచులు గెలవకూడదు. అప్పుడు ఈ కివీస్, అఫ్గాన్ రెండు జట్లు 8 పాయింట్లతో ఉంటే.. పాక్ 10 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఒక వేళ కివీస్ ఒక్క మ్యాచ్, అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అప్పుడు మూడు జట్లు 10 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ క్రమంలో రన్‌రేట్ పరంగా మూడింటిలో ఒక జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. కాగా పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్ధానంలో ఆస్ట్రేలియా సెమీస్‌కు ఈజీగా చేరే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆసీస్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన చాలు. ఎందుకంటే మెరుగైన రన్‌రేట్ ఉంది కాబట్టి సెమీస్‌కు అసీస్ క్వాలిఫై అవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో స్ధానం కోసం తీవ్ర పోటీ నెలకొనడం ఖాయమన్పిస్తోంది. చదవండి: World Cup 2023: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 190 పరుగుల తేడాతో భారీ విజయం -
PAK Vs AFG: పాకిస్తాన్ పై అఫ్గాన్ సంచలన విజయం.. చరిత్రలోనే తొలిసారి..!
పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ అద్భుత విజయం సాధించింది. పటిష్ట పేస్ దళం ఉన్న బాబర్ ఆజం బృందాన్ని చిత్తుచేసి తాను పసికూన కాదని బెబ్బులిలా గర్జించింది. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో మూడో విజయం నమోదు చేసి తనను తక్కువ అంచనా వేయొద్దని మేటి జట్లకు సవాలు విసిరింది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 లో తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఓడించి సత్తా చాటిన అఫ్గాన్ తాజాగా సెమీస్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా భావిస్తున్న పాకిస్తాన్ ను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 58 పరుగులతో రాణించగా వన్ డౌన్ బ్యాటర్ బాబర్ ఆజాం 74 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. లోయర్ ఆర్డర్ లో షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ చెరో 40 పరుగులు సాధించారు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి అఫ్గాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ రెండు.. మహమ్మద్ నబీ, అజ్మతుల్లా చెరో వికెట్ దక్కించుకున్నారు. టార్గెట్ ఛేదనలో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అఫ్గానిస్తాన్ ఓపెనర్ రహమనుల్ల గురుబాజ్ 53 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 87 పరుగులతో రాణించాడు. ఇక వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత రహమత్ షా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో వీరిద్దరూ ఎటువంటి పొరపాట్లకు తావివ్వలేదు. చక్కటి సమన్వయంతో వికెట్ల మధ్య చురుగ్గా కదులుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో రహమత్ 77 పరుగులు, హష్మతుల్లా 48 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ కు తొలి గెలుపునందించారు. 49వ ఓవర్ ఆఖరి బంతికి హష్మతుల్లా ఫోర్ బాదడంతో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇక ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన ఇబ్రహీం జద్రాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. Creating history, one victory at a time 🇦🇫#CWC23 #PAKvAFG pic.twitter.com/ImtYjnMvIQ — ICC (@ICC) October 23, 2023 -
PAK vs SL: వన్డే ప్రపంచకప్ చరిత్రను తిరగరాసిన పాకిస్థాన్
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ అద్బుత విజయం సాధించింది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో పాక్ ఛేదించింది. దీంతో 6 వికెట్లతో విజయభేరి మోగించింది. Tons from Abdullah Shafique and Mohammed Rizwan guide Pakistan to the most successful chase in ICC Men's Cricket World Cup history 🔥#CWC23 #PAKvSL 📝: https://t.co/oVVBdMbGPN pic.twitter.com/Y9xq0o3WOj — ICC Cricket World Cup (@cricketworldcup) October 10, 2023 అయితే 345 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్లోయి పాకిస్థాన్ జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో పాక్ జట్టును మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఆదుకున్నాడు ఆ జట్టు మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్. ఈ ఇద్దరూ ఫస్ట్ స్లోగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ నిర్మించాక బౌండరీలు బాదారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తరువాత అబ్దుల్లా షఫీక్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 113 పరుగుల వద్ద షఫీక్ పెవిలియన్‌కు చేరాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు విజయంలో పాకిస్తాన్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(131), అబ్దుల్లా షఫీక్ (113) కీలక పాత్ర పోషించారు. అయితే పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ చరిత్రలో 300 పరుగులకి పైగా టార్గెట్‌ను ఛేజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. స్కోర్లు: శ్రీలంక 344-9(50), పాకిస్తాన్ 345-4(48.2) -
'వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని! ఎన్నో కష్టాలు'
హారీస్ రవూఫ్.. ప్రస్తుత పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. తన పేస్ బౌలింగ్‌తో ప్యత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలిగే సత్తా ఉన్న స్పీడ్ స్టార్. 2020లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రవూఫ్.. వరల్డ్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రవూఫ్ ఈ స్ధాయికి ఎదగడం వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. చదువుకునే రోజుల్లో కనీసం ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బులు లేకపోయేవి అంట. ఈ విషయాలను అతడే స్వయంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. "పదో తరగతి తర్వాత నేను ఇంటర్మీడియట్లో చేరాను. కానీ మా కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడేవాళ్లు. దీంతో నా ఫీజు చెల్లించడానికి ప్రతీ ఆదివారం మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని. వారంలో మిగిలిన రోజుల్లో క్లాస్‌లకు హాజరయ్యేవాడిని. ఆ తర్వాత నేను యూనివర్శిటీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఫీజులు చాలా ఎక్కువగా ఉండేవి. మా నాన్నతో పాటు నేను కూడా ఆ ఫీజులను భరించలేకపోయాను. ఈ సమయంలో టేప్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాను. నాకు బాగా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులతో యూనివర్శిటీ ఫీజు కట్టేవాడిని. పాకిస్తాన్లో టేప్-బాల్ క్రికెట్ ఆడే ఆటగాళ్లు బాగా సంపాదిస్తారు. నెలకు దాదాపు 2 నుంచి 3 లక్షలవరకు సంపాదించవచ్చు. నేను నా ఫీజు కట్టగా.. మిగిలిన డబ్బులను మా అమ్మకు ఇచ్చేవాడిని. నేను ఈ స్ధాయికి చేరుకోవడం వెనక మా అమ్మనాన్న కష్టం కూడా ఉంది. మాది ఉమ్మడి కుటంబం. మొత్తం మా నాన్నకు నలుగురు అన్నదమ్ములు. అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. దీంతో చోటు సరిపోక కొన్ని రోజుల పాటు వంటగదిలో నిద్రపోయేవాళ్లం. నా చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించాను”అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవూఫ్ చెప్పుకొచ్చాడు. చదవండి: IND vs NEP: 23 పరుగుల తేడాతో ఘన విజయం.. సెమీస్‌కు చేరిన టీమిండియా -
ఉప్పల్‌లో పాక్-న్యూజిలాండ్ పోరు.. సర్వం సిద్దం
ప్పల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌కు అంతా సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సన్నహాక మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులకు బీసీసీఐ అనుమతి నిరాకరిచింది. ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్టు ఇప్పటికే హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టాయి. బుధవారం పాక్, న్యూజిలాండ్ జట్లు భాగ్యనగరానికి చేరుకున్నాయి. అనంతరం గురువారం(సెప్టెంబర్28)న ఇరు జట్లు నెట్‌ప్రాక్టీస్‌లో కూడా పాల్గోనున్నాయి. కాగా ప్రస్తుత పాక్ జట్టులో మహ్మద్ నవాజ్, ఆగా సల్మాన్ మినహా మిగితా ఆటగాళ్లకు ఎవరికి భారత పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు ఎలా రాణిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన కేన్‌మామ అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. అదే విధంగా గాయంతో ఇంగ్లండ్ సిరీస్‌లో మధ్యలో ఇంటిముఖం పట్టిన స్టార్ పేసర్ టిమ్ సౌథీ కూడా ఫిట్నెస్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పాక్ జట్టుకు ఘన స్వాగతం.. ఇక 7 ఏళ్ల తర్వాత భారత గడ్డపై పెట్టిన పాక్ క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. అభిమానుల ఆదరణకుపాకిస్తాన్ క్రికెటర్లు ఫిదా అయిపోయారు. పాక్ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ కృతజ్ఞతలను తెలిపారు. హైదరాబాదీ అభిమానులు చూపిస్తున్న ఆదరణ, అభిమానం ఆనందాన్ని కలిగిస్తోందని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. మాకు హైదరబాదీల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. చాలా బాగుంది. భారత్‌లో గడిపే రానున్న నెలన్నర రోజుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మరో పాక్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఓ పోస్ట్ చేశాడు. -
బాబర్ ఆజంకు జరిమానా విధించిన పోలీసులు.. ఎందుకంటే?
అతి వేగంతో కారు నడిపినందుకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు పోలీసులు జరిమానా విధించారు. టైమ్స్ ఆఫ్ కరాచీ నివేదిక ప్రకారం.. పంజాబ్ హైవేలో తన ఆడి కారును పరిమితికి మించిన వేగంతో నడిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడి వేగాన్ని గమనించిన పంజాబ్ మోటర్వే పోలీసులు కారును ఆపి ఫైన్ వేసినట్లు సమాచారం. అయితే ఎంత జరిమానా విధించారన్న విషయం మాత్రం బయటకు రాలేదు. కాగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కడం బాబర్‌కు ఇదేం కొత్త కాదు. గతంలో తన కారుకు సరైన నెంబర్ ప్లేటు లేకుండా బాబర్ డ్రైవ్ చేస్తూ దొరికిపోయాడు. ఇక వరల్డ్‌కప్-2023లో పాల్గోనేందుకు పాకిస్తాన్ జట్టుకు మార్గం సుగమైంది. పాక్ జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సోమవారం ఆమోదముద్ర వేసింది. దీంతో బుధవారం తెల్లవారుజామున లాహోర్ నుంచి బయల్దేరే పాక్ టీమ్ దుబాయ్ మీదుగా సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటుంది. శుక్రవారం ఆ జట్టు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి వామప్ మ్యాచ్ ఆడుతుంది. వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాస్ జూనియర్ చదవండి: World Cup 2023: భారత్‌ను ఓడించిన జట్టు వరల్డ్‌కప్ గెలుస్తుంది.. మా జట్టుకు దిష్టి పెట్టకు! The captain of Pakistan, Babar Azam, has been fined by the Punjab Motorway Police 👮♀️ for speeding.#TOKSports | #BabarAzam pic.twitter.com/cGdJ1WW7s3 — TOK Sports (@TOKSports021) September 25, 2023 -
‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్ జట్టు
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు వీసా సమస్య తీరింది. సోమవారం సాయంత్రం జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి భారత వీసాలు మంజూరైనట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ధారించింది. పాక్ బృందానికి వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. 48 గంటల్లో భారతదేశానికి బయల్దేరాల్సి ఉన్నా... ఇంకా తమకు వీసాలు రాకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ అసంతృప్తిని వెల్లడించింది. సోమవారం ఉదయం ఈ విషయంపై పాక్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. చివరకు సాయంత్రానికి పరిస్థితి చక్కబడింది. వరల్డ్ కప్‌కు ముందు దుబాయ్‌లో రెండు రోజుల పాటు తమ జట్టుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయాలని భావించిన పాక్ వీసా సమస్య కారణంగా దానిని రద్దు చేసుకుంది. ఇప్పుడు తాజా షెడ్యూల్ ప్రకారం బుధవారం తెల్లవారుజామున లాహోర్ నుంచి బయల్దేరే పాక్ టీమ్ దుబాయ్ మీదుగా సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటుంది. శుక్రవారం ఆ జట్టు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి వామప్ మ్యాచ్ ఆడుతుంది. చదవండి: IND VS AUS 3rd ODI: టీమిండియాకు భారీ షాక్ -
వన్డేల్లో నెం1 జట్టుగా పాకిస్తాన్.. మరి టీమిండియా?
అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ అగ్రస్ధానానికి చేరుకుంది. శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్.. మళ్లీ నెం1 వన్డే జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి బాబర్ సేన టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. కాగా 118 రేటింగ్‌తో పాక్ -ఆస్ట్రేలియా జట్లు సమం ఉన్నాయి. అయితే పాయిట్లు పరంగా ఆస్ట్రేలియా(2714) కంటే పాకిస్తాన్(2725) ముందంజలో ఉండడంతో అగ్రపీఠాన్ని సొంతం చేసుకుంది. ఇక భారత జట్టు విషయానికి వస్తే.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్ధానంలో కొనసాగుతుంది. రేటింగ్స్ పరంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా కంటే ఐదు పాయింట్లు వెనుకబడి ఉంది. ఇక న్యూజిలాండ్ 104 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. అదే విధంగా ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్ధానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్,శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్ నిలిచాయి. సిరీస్ క్లీన్ స్వీప్.. ఇక కొలాంబో వేదికగా జరిగిన మూడో వన్డే విషయానికి వస్తే.. 59 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3–0తో పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (67), కెప్టెన్ బాబర్ ఆజమ్ (60) అర్ధ సెంచరీలు సాధించగా, ఆగా సల్మాన్ (38 నాటౌట్), నవాజ్ (30) రాణించారు. నైబ్, ఫరీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గన్ జట్టు 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ (37 బంతుల్లో 64) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నవాజ్, అఫ్రిది,అష్రాప్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్! సంజూకు -
తొలి టి20.. భారత్ ముంగిట అరుదైన రికార్డు; పాక్ మనకంటే ముందే?
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించుకుంది. టెస్టు సిరీస్‌ను 1-0తో నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఇప్పుడు టి20 సిరీస్‌పై కన్నేసింది. రోహిత్ శర్మ, కోహ్లి, జడేజాలు ఈ సిరీస్‌కు దూరంగా ఉండడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు విండీస్‌తో తొలి టి20లో తలపడనుంది. ఐపీఎల్లో ఇరగదీసిన యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సంజూ శాంసన్‌లు విండీస్‌తో టి20 సిరీస్‌లో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే జైశ్వాల్ విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక గిల్, ఇషాన్ కిషన్‌లు వన్డే సిరీస్‌లో అద్బుతంగా ఆడారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్థసెంచరీలతో మెరిశాడు. దీంతో ఈ ముగ్గురు తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇక మిడిలార్డర్లో సంజూ శాంసన్ ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇక ఫినిషర్స్‌గా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలు తమ వంతు పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా విండీస్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఒక అరుదైన ఘనత సాధించనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. టి20 క్రికెట్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా టీమిండియా నిలవనుంది. ఇంతకముందు పాకిస్తాన్ మాత్రమే ఈ మార్క్‌ను దాటింది. ఓవరాల్‌గా పాకిస్తాన్ 223 టి20 మ్యాచ్‌లు ఆడింది. దీంతో తొలి టి20 మొదలవ్వగానే ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా ఈ రికార్డును అందుకోనుండడం విశేషం. కాగా ఇప్పటివరకు 199 టి20 మ్యాచ్‌లాడిన టీమిండియా 127 విజయాలు, 63 ఓటములు చవిచూసింది. ఒక మ్యాచ్ మాత్రం టైగా ముగిసింది. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Ishan- Gill: వెటరన్ జోడీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్- గిల్! -
Asian Games 2023: 'ఆసియా గేమ్స్ నుంచి తప్పుకొంటున్నా’
పాకిస్థాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా గేమ్స్(Asian Games 2023)లో ఆడనున్న పాక్ జట్టు నుంచి తాను తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. టోర్నీకి పిల్లలను అనుమతించకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిస్మాహ్ మరూఫ్ తెలిపింది. ఆసియా గేమ్స్‌లో పాల్గొనే క్రికెటర్లు తమ పిల్లల్ని వెంట తీసుకురావొద్దని ఆసియా గేమ్స్ నిర్వాహకులు నిబంధన పెట్టారు. దీంతో రెండేళ్ల చంటిబిడ్డను వదిలి వెళ్లడం ఇష్టం లేని మరూఫ్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఇక బిస్మాహ్ పాక్ ప్రధాన బ్యాటర్లలో ఒకరు. 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆమె పాక్ తరపున 108 వన్డేల్లో 2602 పరుగులతో పాటు 44 వికెట్లు, 108 టి20ల్లో 2202 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది. 2021 ఏప్రిల్‌లో బిస్మాహ్ బిడ్డకు జన్మనివ్వడం కోసం క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ అదే ఏడాది డిసెంబర్లో మైదానంలో అడుగుపెట్టింది. 2022లో బిస్మాహ్ పరుగుల వరద పారించింది. పాక్ మహిళల జట్టు తరఫున ఆ ఏడాది వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు కొట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు ఒక్క సెంచరీ లేకుండానే వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు ఆమె పేరు మీదే ఉంది. ''దురృష్టవశాత్తూ పాక్ జట్టు బిస్మాహ్ మరుఫే సేవల్ని కోల్పోనుంది. పిల్లల్ని వెంట తీసుకురావొద్దనే నియమం కారణంగా ఆమె తన చిన్న పాపతో చైనాకు రాలేని పరిస్థితి'' అని మహిళల జట్టు హెడ్ తానియా మల్లిక్ పేర్కొంది. ఇక ఈ ఏడాది ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు చైనాలోని హాంగ్జూ నగరం వేదిక కానుంది. హ్యాట్రిక్ కొట్టేనా..? ఆసియా గేమ్స్‌లో పాకిస్థాన్ జట్టుకు మంచి రికార్డు ఉంది. వరుసగా రెండు సార్లు పాక్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. 2010లో చైనాలోని ఇంచియాన్‌లో, 2014లో దక్షిణ కొరియాలో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచింది. దాంతో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. చదవండి: వైరల్‌గా మారిన అపాయింట్మెంట్ లెటర్.. ధోని నెలజీతం ఎంతంటే? తమిళ సంప్రదాయ పద్ధతిలో ఆసీస్ ఆల్‌రౌండర్ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్! ఆ విషాదం తర్వాత.. -
PCB: పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా జకా ఆష్రఫ్ నియామకం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా జకా ఆష్రఫ్ నియమితుడయ్యాడు. పది మంది సభ్యులతో కూడిన కమిటీకి అతడు నేతృత్వం వహించనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం నియామకాలు జరిపినట్లు పీసీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా జకా ఆష్రఫ్ సారథ్యంలోని ఈ కమిటీ నాలుగు నెలల పాటు అధికారంలో కొనసాగనుంది. ఇందులో నలుగురు రీజినల్ రిప్రెజెంటేటివ్స్, నలుగురు సర్వీస్ రిప్రెజెంటేటివ్స్, ప్రధాని చేత నామినేట్ చేయబడిన ఇద్దరు సభ్యులకు చోటు ఉంటుంది. ఈ నేపథ్యంలో జకా ఆష్రఫ్ ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇప్పుడు అధికారికంగా పీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యాను. రానున్న కాలంలో పీసీబీలో సానుకూల మార్పులు తీసుకురాగలనని ఆ దేవుడి సాక్షిగా చెబుతున్నా’’ అంటూ తన నియామకానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫొటోను షేర్ చేశాడు. కాగా ఆసియాకప్, వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు సమీపిస్తున్న తరుణంలో కొత్త కమిటీ గురువారమే లాహోర్‌లో సమావేశం కానుంది. I have Officially Joined PCB as Chairman. Alhamdulillah, You will have Positives Changes in the PCB Upcoming Days In Sha Allah✌️💯. #ZakaAshraf pic.twitter.com/h6rRGkjlKm — Chaudhry Zaka Ashraf (@IZakaAshraf) July 5, 2023 -
క్లియరెన్స్ వస్తేనే పాల్గొనేది?.. 'ఆడకపోతే మీ కర్మ'
వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. ఒక్క టీమిండియాతో మాత్రమే అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. అయితే చెన్నై, కోల్‌కతాల్లో తాము ఆడలేమని.. ఈ రెండు వేదికలను మార్చాలని పీసీబీ ఐసీసీకి అభ్యర్థన పెట్టుకున్నప్పటికి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. తాజాగా పీసీబీకి మరో చిక్కు వచ్చి పడింది. అదేంటంటే భారత్‌లో ఏ టోర్నీ జరిగినా ప్రభుత్వం క్లియరెన్స్ తప్పనిసరి. ఇదే విషయమై పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు మాకు ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఈ విషయమై మా ప్రభుత్వంతో చర్చలు జరిపాం. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే ఈవెంట్ నిర్వహించే ఐసీసీ సమచారం అందిస్తాం. అయితే వరల్డ్‌కప్‌కు మేము ఆడబోయే మ్యాచ్‌ల్లో రెండు వేదికలను మార్చాలని పెట్టుకున్న ప్రతిపాదనను ఐసీసీ, బీసీసీఐ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మా ప్రభుత్వం ఎలా తీసుకుంటున్నది తెలియదు అని చెప్పుకొచ్చాడు. కాగా పాక్ ప్రభుత్వం నుంచి పీసీబీకి వరల్డ్‌కప్ ఆడేందుకు క్లియరెన్స్ రాకపోతే బోర్డు చాలా నష్టపోవాల్సి వస్తోంది. పాక్ జట్టు వరల్డ్‌కప్‌లో ఆడకుంటే కోట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పాక్ క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఈ లెక్కన చూసుకుంటే ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఇక అభిమానులు మాత్రం ఆడకపోతే ఐసీసీకి వచ్చే నష్టం ఏమి ఉండదు.. పీసీబీకే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని కామెంట్ చేశారు. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్, వివరాలు: అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2 అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ భారత్ అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్ అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs న్యూజిలాండ్ నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs ఇంగ్లాండ్ చదవండి: ఎదురులేని లంక.. గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త బాస్ ఎవరంటే..?
త్వరలో జరుగనున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ ఎన్నికల బరి నుంచి తాత్కాలిక బాస్ నజమ్ సేథి వైదొలగడంతో కొత్త అభ్యర్థిగా మాజీ పీసీబీ అధ్యక్షుడు జకా అష్రాఫ్ పేరును ప్రకటించారు పాక్ ఫెడరల్ మంత్రి ఎహసాన్ మజారి. ఛైర్మన్‌గా నజమ్ సేథి పదవీకాలం రేపటితో (జూన్ 21) ముగియనుండటంతో అష్రాఫ్‌ను బరిలోకి దించింది పాక్ ప్రభుత్వం. అష్రాఫ్ 2011-13 మధ్యకాలంలో పీసీబీ ఛైర్మన్‌గా పని చేశారు. పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఆసియా కప్, భారత్‌లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ లొల్లి నేపథ్యంలో నజమ్ సేథి అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు అతను ట్విటర్ వేదికగా వర్తమానం పంపాడు. కాగా, గతేడాది డిసెంబర్లో పాక్ ప్రధాని షాబాజ్.. షరీఫ్ రమీజ్ రజాను పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించి, తాత్కాలిక ఛైర్మన్ నజమ్ సేథిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. Salaam everyone! I don’t want to be a bone of contention between Asif Zardari and Shehbaz Sharif. Such instability and uncertainty is not good for PCB. Under the circumstances I am not a candidate for Chairmanship of PCB. Good luck to all stakeholders. — Najam Sethi (@najamsethi) June 19, 2023 ఈ ఆరు నెలల కాలంలో నజమ్ సేథీ పీసీబీలోని 14 మందితో కూడిన కమిటీని సమర్థంగా నడిపించాడు. కొన్ని కీలక నిర్ణయాలతో తన మార్కును చూపించాడు. మికీ ఆర్థర్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, గ్రాంట్ బ్రాడ్‌బర్న్ హెడ్‌కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ఏసీసీని ఒప్పించి ఆసియా కప్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. అయితే, భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ పాల్గొనడంపై జరుగుతున్న రచ్చ నేపథ్యంలో నజమ్ సేథి అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నాడు. -
హైదరాబాద్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు డేట్ ఫిక్స్
-
హైదరాబాద్ లో ఇండియా, పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్
-
పాకిస్తాన్ కు షాక్...పంతం నెగ్గించుకున్న బీసీసీఐ
-
వన్డే క్రికెట్లో పాకిస్తాన్ చరిత్ర.. అయినా టీమిండియా వెనకాలే
గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయాన్ని అందుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించింది. కివీస్‌పై విజయం పాక్‌కు వన్డేల్లో 500వది కావడం విశేషం. వన్డే క్రికెట్లో 500 విజయాలు నమోదు చేసిన మూడో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటివరకు 978 మ్యాచ్‌లు ఆడి 594 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా ఇప్పటివరకు మొత్తం 1029 మ్యాచ్‌లు ఆడి 539 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుంది. తాజాగా కివీస్‌పై విజయంతో పాక్ 949వ మ్యాచ్‌లో 500వ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వెస్టిండీస్ 411, దక్షిణాఫ్రికా 399, శ్రీలంక 399, ఇంగ్లండ్ 392, న్యూజిలాండ్ 368, బంగ్లాదేశ్ 149, జింబాబ్వే 147 విజయాలతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.ఇక 1973లో మొదటి వన్డే మ్యాచ్ ఆడిన పాకిస్తాన్.. 1974 ఆగస్టులో నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలి వన్డే విజయాన్ని అందుకుంది. 1992లో వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన పాకిస్తాన్.. ఆ తర్వాత 1999లో ఫైనల్ మెట్టుపై బోల్తా పడింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 289 లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్(117) సెంచరీతో చెలరేగగా.. ఇమామ్ ఉల్ హాక్(60) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(86), డార్లీ మిచెల్(113) పరుగులలో రాణించారు. చదవండి: సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్‌పై పాక్ ఘన విజయం -
క్రికెట్‌ను ఇలా ఆడటం పాకిస్తాన్లో మాత్రమే సాధ్యం..!
పాకిస్తాన్ వీధి క్రికెట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ పోస్ట్ చేసిన ఈ వీడియోలో కొందరు పాక్ యువకులు వినూత్నంగా క్రికెట్ ఆడుతూ కనిపించారు. వీధి లైట్ల వెలుతురులో సాగే ఈ గేమ్‌లో బౌలర్ బంతిని విసరకముందే బ్యాటర్ సగం క్రీజ్ వరకు వచ్చి గాల్లో ఉన్న బంతిని షాట్ ఆడి పరుగు పూర్తి చేస్తాడు. Outrageous shot in street cricket in Pakistan 🔥 pic.twitter.com/1mvq5V4z9t — England's Barmy Army (@TheBarmyArmy) April 5, 2023 ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం ఎవ్వరి వల్ల కాదు. బ్యాటర్ బంతిని ఎదుర్కొన్న విధానం చూసి క్రికెట్ ఇలా కూడా ఆడవచ్చా అని నెటిజన్లు సరదాగా చర్చించుకుంటున్నారు. కొందరేయో ఇలాంటి క్రికెట్ ఆడటం పాకిస్తాన్లో మాత్రమే సాధ్యమవుతుందని అంటున్నారు. మొత్తానికి ఫన్నీగా సాగే ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లచే నవ్వులు పూయిస్తుంది. ఇదిలా ఉంటే, షార్జా వేదికగా ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాభవాన్ని (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమి) ఎదుర్కొన్న పాకిస్తాన్.. ఏప్రిల్ 14 నుంచి న్యూజిలాండ్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు సమాయత్తమవుతోంది. 5 టీ20లు, 5 వన్డేల సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డే సిరీస్ జరుగుతుంది. ఏప్రిల్ 14, 15, 17, 20, 24 తేదీల్లో టీ20లు.. ఏప్రిల్ 27, 29, మే 3, 5, 7 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇదివరకే జట్లను కూడా ప్రకటించాయి. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ద్వితియ శ్రేణి జట్టును పంపించి చేతులు కాల్చుకున్న పీసీబీ.. కివీస్‌తో సిరీస్‌కు అలాంటి తప్పు చేయకుండా బాబర్ నేతృత్వంలలోని రెగ్యులర్ జట్టును ఎంపిక చేసింది. మరోవైపు న్యూజిలాండ్ టామ్ లాథమ్ నేతృత్వంలో యువ జట్టుతో పాక్‌ను సొంతగడ్డపై ఢీకొట్టనుంది. -
పాకిస్తాన్ బ్యాటర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 34 పరుగులు! వీడియో వైరల్
రంజాన్ మాసం సందర్భంగా జరుగుతున్న ఘనీ రంజాన్ టోర్నీలో పాకిస్తాన్ బ్యాటర్ ఉస్మా మీర్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో జీఐసీ జట్టుకు ఉస్మా మీర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే సోమవారం కరాచీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మా మీర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 20 బంతులు ఎదుర్కొన్న మీర్ 7 సిక్స్‌లు, 2 ఫోర్లు సాయంతో 66 పరుగులు చేశాడు. ముఖ్యంగా జీఐసీ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన బిలాల్‌కు మీర్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో అతడు.. 5 సిక్స్‌లు, 1 ఫోర్ సాయంతో ఏకంగా 34 పరుగులు రాబట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఉస్మా మీర్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా జీఐసీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసింది. కాగా ప్రతీ ఏడాది రంజాన్ నెల సమయంలో పాకిస్తాన్లో ఘనీ టోర్నమెంట్‌ను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఒక్కొక్క జట్టులో ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తారు. ఇక ఉస్మా మీర్ పాక్ తరుపున ఇప్పటివరకు మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. చదవండి: IPL 2023: యువ బౌలర్‌కు క్లాస్ పీకిన ధోని.. ఏం జరిగిందంటే?వీడియో వైరల్ Usama mir on 🔥🔥🔥🔥 He scored 34 runs with 5 sixes and one 4 in an over.... What a bowler and what a clean hitter he is... Usama mir the real future of Pakistan cricket 😍❤️🙌🙌🙌🙌 Vc: @geosupertv@iamusamamir#PakistanCricket #ramzancricket pic.twitter.com/mwcxtVvPcy — Qadir Khawaja (@iamqadirkhawaja) April 2, 2023 -
మాజీ క్రికెటర్ ఇంట్లో దొంగతనం.. 2 కోట్ల విలువైన సొత్తు చోరీ
పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాహోర్‌లోని హఫీజ్ ఇంట్లోకి మార్చి 5న(ఆదివారం) రాత్రి దొంగలు చొరబడ్డారు. రూ.25 వేల డాలర్ల (పాకిస్థాన్ రూపాయిలో 25 డాలర్ల విలువ దాదాపు రూ.2 కోట్లు)లతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. దొంగతనం జరిగే సమయంలో సమయంలో హఫీజ్, అతని భార్య ఇంట్లో లేరు. ఈ ఆల్‌రౌండర్ ఇంట్లో దొంగలు చొరబడి భారీగా విదేశీ కరెన్సీ, విలువైన సొత్తు ఎత్తుకెళ్లారని గురించి వాళ్ల అంకుల్ షాహిద్ ఇక్బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో, పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆల్‌రౌండర్‌గా విశేష సేవలందించిన హఫీజ్ 2022 జనవరి 3న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు 18 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మహ్మద్ హఫీజ్ పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లు కలిపి 392 మ్యాచ్‌లు ఆడి 12,780 రన్స్ చేశాడు. 253 వికెట్లు తీశాడు. 2018లో టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత వన్డేలు, టి20ల్లో కొనసాగాడు. హఫీజ్ 2019 వరల్డ్ కప్‌లో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం హఫీజ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. -
ప్రధాని మోదీపై పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అజాన్ (ముస్లింల ప్రార్ధనా సమయానికి ముందు ఇచ్చే పిలుపు) ఇచ్చేటప్పుడు మోదీ ఎన్నిసార్లు ప్రసంగాలు ఆపినా సైతాన్ ఆవహించిన హిందువుగానే మిగిలిపోతాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మసీదులా కనిపిస్తున్న ఓ ప్రదేశంలో జన సమూహం ముందు అన్వర్ భారత ప్రధానిపై అవాక్కులు చవాక్కులు పేలాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ అన్‌టోల్డ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా, వైరలవుతోంది. "It doesn't matter how many times you stop your speech for Azan You will remain a Satan-possessed Hindu." BTW this Mullah is ex Pak cricket captain Saeed Anwar who Indian Hindus hosted countless times. Imagine the hate in commoners. pic.twitter.com/tRhdSQ2HJL — Pakistan Untold (@pakistan_untold) March 5, 2023 అన్వర్ మోదీపై దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం భారత దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత నెటిజన్లు సయీద్ అన్వర్‌పై విరుచుకుపడుతున్నారు. అన్వర్ క్రికెట్ ఆడే రోజుల్లో భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో అభిమానించారని.. శత్రు దేశానికి చెందిన వాడని కూడా చూడకుండా, అతని ఆటను ఆస్వాదించారని.. భారత ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అన్వర్ తన వక్రబుద్ధిని చాటుకున్నాడని మండిపడుతున్నారు. సైతాన్ ఆవహించింది మోదీకి కాదని, మతం మత్తులో విధ్వేషాలను రెచ్చగొడుతున్న అన్వర్‌కేనని ధ్వజమెత్తుతున్నారు. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఓ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ప్రసంగిస్తుండగా సమీపంలో ఉన్న ఓ మసీదులో అజాన్ ఇచ్చారు. అప్పుడు మోదీ ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ.. కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపి వేశారు. మోదీ ఇలా చేయడాన్ని ఉద్దేశిస్తూనే సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 1989లో అంతర్జాతీయ క్రికెట్లోని అడుగుపెట్టిన అన్వర్.. 2003లో ఆటకు వీడ్కోలు పలికాక ఇస్లాం ప్రచారకర్తగా మారిపోయాడు. అన్వర్ 2001-02లో ముల్తాన్ వేదికగా బంగ్లాదేశ్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతుండగా.. అతని కుమార్తె బిస్మా అన్వర్ ఆనారోగ్యం కారణంగా కన్నుమూసింది. మ్యాచ్ జరుగుతుండగానే అన్వర్‌కు ఈ విషయం తెలిసింది. ఆ మ్యాచ్‌లో అన్వర్ సెంచరీ చేశాడు. ఈ విషయం పాకిస్తాన్ అభిమానులతో పాటు భారత అభిమానులను కూడా తీవ్రంగా కలిచివేసింది. పాక్ అభిమానులతో పోలిస్తే భారత అభిమానులు అన్వర్‌కు అధిక శాతం అండగా నిలిచారు. అతని చిన్నారి కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధనలు కూడా చేశారు. -
2002లో కెప్టెన్సీ ఛాన్స్.. కానీ వద్దనుకున్నా! ఒకవేళ అదే జరిగి ఉంటే..
Shoaib Akhtar Comments: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడిగా పేరొందిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. అత్యంత వేగవంతమైన బంతిని విసిరి చరిత్ర సృష్టించాడు. గంటకు 161 కిలోమీటర్ల వేగంతో బాల్ వేసిన అక్తర్ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఇక పాకిస్తాన్ తరఫున 1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్ 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వరుసగా 178 వికెట్లు, 247 వికెట్లు, 19 వికెట్లు పడగొట్టాడు. జట్టులో కీలక సభ్యుడైన అతడు 2011లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2002లోనే ఛాన్స్.. కానీ అయితే, ఒకానొక సందర్భంలో అతడికి కూడా కెప్టెన్సీ అవకాశం వచ్చిందట. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్‌ను వదులుకున్నాడట. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ స్వయంగా వెల్లడించాడు. ‘‘2002లో నాకు కెప్టెన్సీ అవకాశం వచ్చింది. కానీ నేను సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేను. ఆ సమయంలో పూర్తి ఫిట్‌గా లేను. ఐదు మ్యాచ్‌లు ఉంటే.. కేవలం 3 మాత్రమే ఆడే పరిస్థితి. ఒకవేళ అప్పుడు నేను ప్రతీ మ్యాచ్ ఆడి ఉంటే కేవలం ఒకటిన్నర- రెండేళ్లపాటే నా కెరీర్ కొనసాగేది’’ అని అక్తర్ క్రికెట్ పాకిస్తాన్‌తో వ్యాఖ్యానించాడు. బోర్డులో అనిశ్చితి ఇక నాటి మేనేజ్మెంట్ గురించి వివరిస్తూ.. ‘‘జట్టు సభ్యులకు నేను పూర్తి మద్దతుగా నిలబడ్డాను. నిజానికి అప్పుడు బోర్డులో అనిశ్చితి నెలకొంది. మిస్మేనేజ్మెంట్ కారణంగా సమస్యలు తలెత్తాయి’’ అని 47 ఏళ్ల అక్తర్ చెప్పుకొచ్చాడు. కాగా ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత క్రికెట్ విశ్లేషకుడిగా మారిన అక్తర్.. తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులకు మరింత చేరువగా ఉంటున్నాడు. చదవండి: IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త సారధి పేరు ప్రకటన Ind Vs Aus ODI Series: టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ల రీఎంట్రీ -
ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బోణీ.. ఐర్లాండ్‌పై ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 95 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు ఐర్లాండ్‌ను పతనాన్ని శాసించగా.. నిదా ధార్, ఇక్భాల్ చెరో రెండు వికెట్లు, ఫాతిమా సానా, హసన్ తలా వికెట్ సాధించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. సెంచరీతో చెలరేగిన మునీబా అలీ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ మునీబా అలీ అద్భుతమైన సెంచరీ సాధించింది. 68 బంతుల్లో 14 ఫోర్లతో 102 పరుగులు చేసింది. కాగా టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి పాకిస్తాన్ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇక మునీబాతో పాటు ధార్ కూడా 33 పరుగుల తేడాతో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లీన్ కెల్లీ రెండు వికెట్లు పడగొట్టగా.. పాల్, డెన్లీ తలా వికెట్ సాధించారు. చదవండి: Smriti Mandana: వచ్చీ రావడంతో స్టన్నింగ్ క్యాచ్‌తో.. -
పాక్ క్రికెట్ స్టేడియం వద్ద పేలుళ్లు.. ఇండియన్స్‌పై నోరు పారేసుకున్న పాకిస్తానీలు
పాకిస్తాన్లో ఏ మూలన ఏం జరిగినా ఇండియాపై, ఇండియన్స్‌పై నోరు పారేసుకోవడం పాకిస్తానీలకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జరిగిన ఓ సంఘటనను సంబంధించి కూడా పాకీలు ఇలాగే భారతీయులపై అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2023 సీజన్ సన్నాహకాల్లో భాగంగా క్వెట్టా స్టేడియం (భుగ్తీ) వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 5) పెషావర్ జల్మీ - క్వెట్టా గ్లాడియేటర్స్ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంకు అతి సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. There is no bomb blast in bughti cricket stadium quetta this is the reason please see this carefully especially for indians #bugticricketstadiu #quettavspz #psl pic.twitter.com/IqHTTOYVzR — Sardar Hamid Ghaffar Thaheem (@SardarHamidGha1) February 5, 2023 ఈ పేలుళ్లలో పదలు సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. పేలుళ్లకు కారణాలు తెలియరానప్పటికీ.. అక్కడికి అతి సమీపంతో పాక్ అంతర్జాతీయ క్రికెటర్లు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నందున అధికారులు మ్యాచ్‌ను రద్దు చేసి హుటాహుటిన ఆటగాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మ్యాచ్ జరుగుతుండగా స్డేడియం మొత్తాన్ని పొగ ఆవహించడంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. జనాలు స్డేడియం నుంచి బయటకు వెళ్లే క్రమంలో తొక్కసలాట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. Just a clarification No bomb blast near bugti stadium The match is stopped because some persons from outside threw stones and put something on fire They are being identified. Endians are making propaganda, don't give them importance.#PZvsQG #Quetta pic.twitter.com/jmgbU9ODHj — Ali Asghar Wattoo (@Ali1Wattoo) February 5, 2023 అయితే, పేలుళ్లను ఆతర్వాత స్టేడియంలో నెలకొన్న పరిణామాలను పాక్ నెటిజన్లు వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. పేలుళ్ల కారణంగా ఎక్కడ ఆసియా కప్-2023 నిర్వహణ తమ దేశం నుంచి తరలిపోతుందోనని సీన్‌ను వేరేలా క్రియేట్ చేశారు. అసలు విషయాన్ని దాచే క్రమంలో పాక్ అభిమానులు భారతీయులపై బురదజల్లుతున్నారు. పాక్‌లో ఆసియా కప్ నిర్వహించడం బీసీసీఐకు భారతీయులకు ఇష్టం లేదని, అందుకే పేలుళ్లను బూచిగా చూపి సోషల్‌మీడియాలో విషప్రచారం చేస్తున్నారని అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. Iftikhar Ahmed smashed 6 sixes in a single over in the PSL exhibition match.pic.twitter.com/s3NRRmrcZl — Johns. (@CricCrazyJohns) February 5, 2023 పేలుళ్లకు మ్యాచ్ రద్దు చేయడానికి అస్సలు సంబంధం లేదని, మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియం వద్దకు చేరారని, వారిలో చాలామందికి లోనికి ప్రవేశం లభించలేదని, అలాంటి వారు బయట నుంచి స్టేడియంలోకి రాళ్లు విసరడంతో ఆందోళన జరిగిందని లేని విషయాన్ని కథగా అల్లారు. కొందరు పాకీలు అయితే ఏదో ఫేక్ వీడియోను ట్రోల్ చేస్తూ.. స్టేడియం వద్ద జరిగింది ఇది, అసత్యాలను ప్రచారం చేస్తున్న భారతీయుల కోసమే ఇది అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు భారతీయులు సైతం ధీటుగా జవాబిస్తున్నారు. విషప్రచారాలు చేయడం పాకీలకే చెల్లుతుంది.. పేలుళ్లు జరిగినా, జరగకపోయినా ఆసియాకప్ ఆడేందుకు పాక్‌లో అడుగుపెట్టేది లేదంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే, క్వెట్టా స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్లో మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్.. అదే దేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన స్పోర్ట్స్ మినిస్టర్ వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో 6 వరుస బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. -
షాహీన్ అఫ్రిది 'నిఖా' హోగయా.. ప్రత్యేక అతిధి ఎవరంటే..?
పాకిస్తాన్ యువ పేసర్ షాహీన్ షా అఫ్రిది వివాహం ఇవాళ (ఫిబ్రవరి 3) పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో షాహీన్.. పాక్ దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాను నిఖా చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమానికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యాడు. షాహీన్-అన్షా జంటకు పాక్ సహచర క్రికెటర్లు, అలాగే షాహీన్ పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) జట్టు లాహోర్ ఖలందర్స్ జట్టు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. షాహీన్‌ను అత్యంత సన్నిహితులైన పాక్ క్రికెటర్ హరీస్ రౌఫ్, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ ట్విటర్ ద్వారా విషెస్ తెలిపారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ వివాహం కోసం ప్రత్యేకంగా కరాచీకి వచ్చినట్లు సమాచారం. నిఖా తర్వాత జరిగే మెహంది కార్యక్రమం ఇవాళ రాత్రి జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాక్ క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. కాగా, షాహీన్-అన్షాల ఎంగేజ్మెంట్ రెండేళ్ల క్రితమే జరిగింది. నాటి నుంచి వీరి వివాహం అదిగో ఇదిగో అంటూ మీడియాలో పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం పాక్‌కు అంతర్జాతీయంగా ఎలాంటి షెడ్యూల్ లేకపోవడంతో ఆ దేశ క్రికెటర్లంతా విదేశీ లీగ్‌ల్లో బిజీగా ఉన్నారు. షాహీన్ అఫ్రిది కూడా వివాహానికి కొద్ది రోజుల ముందు వరకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. Skipper is on his way to Karachi to attend Shaheen's wedding 🙌 Photo Courtesy: @mirzaiqbal80 #PakistanCricket #ShaheenAfridi pic.twitter.com/ynJ67vSnv1 — Cricket Pakistan (@cricketpakcompk) February 3, 2023 పాకిస్తాన్ తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ 13 నుంచి మొదలవుతుంది. 5 టీ20లు, 5 వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. 22 ఏళ్ల షాహీన్ అఫ్రిది ఇప్పటివరకు పాక్ తరఫున 25 టెస్ట్‌లు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. ఇందులో 99 టెస్ట్ వికెట్లు, 62 వన్డే వికెట్లు, 58 టీ20 వికెట్లు పడగొట్టాడు. 🎉Haris Rauf's reaction on Shaheen ka Nikah🎉#MainHoonQalandar #DilSe pic.twitter.com/CsjIQPxzsS — Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023 🎉Shaheen ka Nikah🎉 "Happy Wife, Happy Life"#MainHoonQalandar #DilSe pic.twitter.com/Zi6WGUNFiP — Lahore Qalandars (@lahoreqalandars) February 2, 2023 -
ఆర్థిక సంక్షోభం.. పాక్ క్రికెటర్‌కు మంత్రి పదవి
పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. రోజువారి నిత్యావసర ధరలు ఆకాశన్నంటగా.. అంతర్జాతీయంగా పాక్ రూపాయి ధర మరింత దిగజారింది. దీనికి తోడు విద్యుత్ కొరతతో దేశం తీవ్రంగా సతమతమవుతుంది. అయితే ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడం కోసం పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం పలు మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో పాక్ సీనియర్ క్రికెటర్ వహాబ్ రియాజ్‌ను క్రీడాశాఖ మంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్‌లోని తాత్కాలిక క్యాబినెట్లో పాక్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్‌ను క్రీడా మంత్రిగా నియమించింది. విశేషమేమిటంటే ప్రస్తుతం వహాబ్ రియాజ్ అందుబాటులో లేడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. దీంతో ఉన్నపళంగా పాక్‌కు తిరిగి రావాలని ప్రభుత్వం ఆదేశించింది. బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వహాబ్ రియాజ్ మంత్రిగా ప్రమాణం చేయనున్నాడు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను కొందరు రాజకీయ నిపుణులు తప్పుబట్టారు. ఇక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వహాబ్ రియాజ్ పాకిస్థాన్ తరఫున 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఫాస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు పొందిన వహాబ్ రియాజ్.. 91 వన్డేల్లో 120 వికెట్లు, 27 టెస్టుల్లో 83 వికెట్లు,36 టి20ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్ జట్టులో వహాబ్ సభ్యుడుగా ఉన్నాడు. అయితే 2020 తర్వాత వహాబ్ రియాజ్ పాకిస్థాన్ జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటినుంచి టి20 లీగ్స్‌లో బిజీ అయిన వహబ్ రియాజ్ మొత్తంగా 400 వికెట్లకు పైగా సాధించాడు. ప్రస్తుతం బీపీఎల్‌లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆడుతున్న అతను 9 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' మాట మార్చిన పాక్ క్రికెటర్.. అయినా కోహ్లితో నాకు పోలికేంటి?! -
ఘనంగా క్రికెటర్ పెళ్లి వేడుక.. జనవరి 27న రిసెప్షన్
పాకిస్తాన్ క్రికెటర్.. జట్టు వైస్‌కెప్టెన్ షాన్ మసూద్ వివాహం పెషావర్‌లో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి ఫ్రెండ్, ప్రేయసి నిషే ఖాన్‌ను అతను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పాకిస్తాన్ క్రికెట్ నుంచి చీఫ్ సెలెక్టర్ షాహిద్ అఫ్రిది, ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్లు హాజరయ్యారు. కరాచీ వేదికగా జనవరి 27న గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ రిసెప్షన్‌కు పాక్ క్రికెటర్లు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇక షాన్ మసూద్ పెళ్లి వేడుకను ఒక వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అయేమన్ మాలిక్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షాన్ మసూద్, నిఖా షేన్ వివాహ వేడుకల ఫోటోలను పంచుకున్నాడు. కాగా కొత్త జంటకు మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, ఇఫ్తికార్ అహ్మద్‌లతో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మసూద్, నిషేతో తన రిలేషన్షిప్ గురించి ప్రస్తావించాడు. నిషే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమెను మొదటిసారిగా లాహోర్‌లో కలిశానని చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ అయిన మసూద్ టి20 వరల్డ్ కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. టోర్నీలో పాకిస్థాన్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో షాన్ మసూద్ హాఫ్ సెంచరీ (52)తో రాణించాడు. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌పై 38 పరుగులు చేశాడు. పాక్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న షాన్ మసూద్ 28 టెస్టుల్లో 1500 పరుగులు, 19 టి20ల్లో 395 పరుగులు, ఆరు వన్డేల్లో 110 పరుగులు చేశాడు. Shan Masood Bhai Mubarak ho bohot Bohot . You both look adorable together, Ma Sha Allah♥️ #ShanMasood pic.twitter.com/UCVSjVWd26 — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 20, 2023 View this post on Instagram A post shared by Ayeman Malik 🔥 (@ayemanmalik01) చదవండి: 'కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం' -
'నాకు నచ్చలేదు.. బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా'
'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అనగానే మదిలో మెదిలే బౌలర్ పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్. ఇప్పుడు అదే 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' పేరుతో బయోపిక్ రూపొందించాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ను ముహ్మద్ ఫర్హాజ్ ఖాసిర్ డైరక్టర్‌గా వ్యవహరించగా.. క్యూ ఫిలిం ప్రొడక్షన్ తెరకెక్కించింది. అయితే తాజాగా బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు షోబయ్ అక్తర్ శనివారం రాత్రి ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ప్రొడక్షన్ హౌస్‌తో వచ్చిన విబేధాల కారణంగానే బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు తన అనుమతి లేనిదే బయోపిక్ రూపొందిస్తే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్‌ను హెచ్చరించాడు. ''రావల్పిండి ఎక్స్‌ప్రెస్ బయోపిక్ నుంచి తప్పుకోవడం చాలా బాధాకరం. కొన్ని నెలల కింద నుంచే మేకర్స్‌తో మనస్పర్థలు వచ్చాయి. ఈ కారణంగానే బయోపిక్ రూపొందించడాన్ని విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నా. త్వరలోనే నా మేనేజ్మెంట్, లీగల్ టీమ్ మేకర్స్‌తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుంది. నా అనుమతి లేకుండా మేకర్స్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే మాత్రం లీగల్‌గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా'' అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు. ఇక పాకిస్తాన్ క్రికెటలో తన ఆటతో అక్తర్ చెరగని ముద్ర వేశాడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్ 2011లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. వేగానికి మారుపేరైన అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టి20 మ్యాచ్‌లు ఆడాడు.అక్తర్ ఒక మ్యాచ్‌లో 161 కిమీవేగంతో విసిరిన బంతి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిగా కొన్నేళ్ల పాటు నిలిచిపోయింది. Important announcement. pic.twitter.com/P7zTnTK1C0 — Shoaib Akhtar (@shoaib100mph) January 21, 2023 చదవండి: భారత క్రికెటర్‌కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు -
'రీఎంట్రీ కదా.. హార్ట్‌బీట్ కొలిస్తే మీటర్ పగిలేదేమో!'
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. తన ఎంపిక సరైనదేనని చాటుతూ రీఎంట్రీ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. కివీస్‌తో స్వదేశంలో జరుగుతున్న మొదటి టెస్టులో అతను 86 పరుగులు చేశాడు. అయితే క్రీజులో ఉన్నప్పుడు తన గుండె చాలా వేగంగా కొట్టుకుందని అతను అన్నాడు. ''నేను మొదటి మూడు బంతులు ఎదుర్కొన్నప్పుడు నా గుండె ఎంతో వేగంగా కొట్టుకుందంటే.. ఆ సమయంలో నా హార్ట్‌బీట్‌ను కొలిస్తే, ఆ మీటర్ పగిలిపోయి ఉండేదేమో’ అని అతను మ్యాచ్ అనంతరం సరదాగా వ్యాఖ్యానించాడు. ‘నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఇదేమి నాకు తొలి టెస్టు మ్యాచ్ కాదు. అయినా సరే ఎందుకో చాలా టెన్షన్‌గా అనిపించింది. బాబర్ మాట్లాడడంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నాకు చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. నా ఇన్నింగ్స్ జట్టు విజయానికి తోడ్పడుతుందని అనుకుంటున్నా'' అని సర్ఫరాజ్ అన్నాడు. వికెట్ కీపర్ అయిన సర్ఫరాజ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. పాక్ క్రికెట్ బోర్డు మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్‌ను ఎంపిక చేసింది. కెప్టెన్ బాబర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 196 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. పాకిస్థాన్ భారీ స్కోర్‌కు బాటలు వేసిన సర్ఫరాజ్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 153 బంతుల్లో 86 రన్స్ చేసిన అతను ఎజాజ్ పటేల్ వేసిన 86వ ఓవర్లో అవుటయ్యాడు. ఇక సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ తరపున 49 టెస్టులు, 117 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా? అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ ఆల్‌రౌండర్ గుడ్‌బై -
తనయుడి బౌలింగ్‌లో తండ్రి గోల్డెన్ డక్
కళ్లముందే బిడ్డ ప్రయోజకుడై ఎదుగుతుంటే ఏ తండ్రైనా సంతోషిస్తాడు. అలాంటిది తనకే సవాల్‌గా మారి విజయం సాధిస్తే ఏ తండ్రైనా గర్వపడతాడు. ఇలాంటివి చాలా తక్కువగా చూస్తుంటాం. తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌ను తనయుడు అలీ రజాక్ గోల్డెన్ డక్ చేయడం వైరల్‌గా మారింది. కింగ్డమ్ వాలీ మెగాస్టార్స్ లీగ్(ఎంఎస్ఎల్) 2022 లీగ్‌లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. రావల్పిండి వేదికగా పెషావర్ పఠాన్స్, కరాచీ నైట్స్ మధ్య టి10 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అబ్దుల్ రజాక్ పెషావర్ పఠాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తే.. తనయుడు అలీ రజాక్ కరాచీ నైట్స్ తరపున ఆడాడు. పెషావర్ పఠాన్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌నే అలీ రజాక్ వేశాడు. అబ్దుల్ రజాక్ ఓపెనర్‌గా వచ్చాడు. ఓవర్ తొలి బంతినే ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ డెలివరీ వేయగా.. రజాక్ బ్యాట్‌ను తగిలించి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో బ్యాట్ ఎడ్జ్‌కు తాకి కీపర్ చేతుల్లో పడడంతో అబ్దుల్ రజాక్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతే తండ్రిని గోల్డెన్ డక్ చేశానన్న సంతోషాన్ని సహచర ఆటగాళ్లతో పంచుకున్నాడు. అయితే పెవిలియన్ బాట పట్టిన అబ్దుల్ రజాక్ పైకి బాధపడినట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం తనయుడు తనను ఔట్ చేశాడన్న ఆనందం కచ్చితంగా ఉండి ఉంటుంది అని అభిమానులు పేర్కొన్నారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 112 పరుగులు చేసింది. దిగ్గజ బ్యాటర్ ఇంజమామ్ ఉల్ హక్ 16 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 29 పరుగులు చేశాడు. Ali Razzaq takes wicket of his Father Abdul Razzaq | PP VS KK | Kingdom Valley MSL 2022 at Rawalpindi Cricket Stadium | Day 5 | Peshawar Pathans vs Karachi Knights#KingdomValleyMSL2022 #MegaStarsLeague #Cricketainment #ShahidAfridi #PeshawarPathans #KarachiKnights pic.twitter.com/S5c34sR6qq — Mega Stars League (@megastarsleague) December 22, 2022 చదవండి: విజయం దిశగా.. టీమిండియా టార్గెట్ 145 -
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్తాన్ స్టార్ ఆటగాడు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ అజహర్ అలీ అంతర్జాతీయ క్రికెట్లో అన్నిరకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న అజర్ ఆలీ తాజాగా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చేప్పేశాడు. శుక్రవారం విలేకురుల సమావేశంలో అజర్ ఆలీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కరాచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టెస్టు అనంతరం టెస్టుల నుంచి ఆలీ తప్పుకోనున్నాడు. 2010లో టెస్టుల్లో అంతర్జాతీయ ఆలీ ఆరంగ్రేటం చేశాడు. 12 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆలీ.. 95 టెస్టుల్లో 42.60 సగటుతో 7030 పరుగులు చేశాడు. 2016లో వెస్టిండీస్‌పై పింక్ బాల్ టెస్టులో ఆలీ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాదించాడు. అదే విధంగా పాకిస్తాన్ టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్ రన్ స్కోరర్ జాబితాలో అజహర్ ఆలీ ఐదో స్థానంలో ఉన్నాడు. "నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. పాకిస్తాన్ క్రికెట్‌తో నా 12 ఏళ్ల బంధానికి ముగింపు పలకాల్సి రావడం చాలా బాధగా ఉంది. నేను బాగా ఆలోచించిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాడు. నీను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, నా కుటంబ సభ్యలకు, పాకిస్తాన్ క్రికెట్‌కు అభినందనలు తెలియజేయాలి అనుకుంటున్నాను" ఆలీ పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు! -
హద్దు మీరితే ఇలాగే ఉంటుంది.. సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సహనం కోల్పోయాడు. తనను హేళన చేసిన కొంతమంది అభిమానులతో బహిరంగ గొడవకు దిగాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే ఫామ్ కోల్పోయిన జట్టుకు దూరమైన హసన్ అలీ ఒక లోకల్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. పంజాబ్ ఫ్రావిన్స్‌లోని పక్‌పత్తన్ జిల్లాలో ఆదివారం ఈ మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో హసన్ అలీ బౌండరీ లైన్ వద్ద నిల్చున్నాడు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు హసన్ అలీని టీచ్ చేశారు. జట్టులో చోటు కోల్పోయి గల్లీ క్రికెట్ ఆడడానికి సిగ్గులేదా.. అంటూ ఆటపట్టించారు. చాలాసేపు ఓపికతో భరించిన హసన్ అలీపై కొంతమంది గడ్డి, పేపర్లను విసిరారు. దీంతో సహనం కోల్పోయిన హసన్ అలీ తనను టీచ్ చేసిన వారితో గొడవకు దిగాడు. వారిని కొట్టడానికి ప్రయత్నించగా మిగతావారు హసన్ అలీని అడ్డుకున్నారు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు వచ్చి హసన్ అలీని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. ఒక లోకల్ మ్యాచ్‌లో ఆడేందుకు ఒప్పుకున్న అంతర్జాతీయ క్రికెటర్‌ను ఇలానే అవమానిస్తారా అంటూ మ్యాచ్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హసన్ అలీతో గొడవకు దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. కాగా 2021 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో హసన్ అలీ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటినుంచి హసన్ అలీని ట్రోల్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన అతను జట్టుకే దూరమయ్యాడు. దీంతో అభిమానుల ట్రోల్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. మంచిగా ఉన్నంతవరకు ఏం కాదు కానీ ఆటగాళ్లు రివర్స్ అయితే మాత్రం ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని హసన్ అలీ ఉదంతం హెచ్చరిస్తుందంటూ కొంతమంది పేర్కొన్నారు. ఒకప్పుడు హసన్ అలీ పాక్ తరపున నెంబర్‌వన్ బౌలర్‌గా రాణించాడు. ఆ తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ నెంబర్‌వన్‌గా కొంతకాలం కొనసాగాడు. ఇక పాకిస్తాన్ తరపున హసన్ అలీ 60 వన్డేల్లో 91 వికెట్లు, 21 టెస్టుల్లో 77 వికెట్లు, 50 టి20ల్లో 60 వికెట్లు తీశాడు. You gotta feel for Hasan Ali. He is out of the team but never gave any toxic statement always kept supporting the team. Once a No 1 ODI bowler and now he is facing such things in a random club game. pic.twitter.com/L2OLjVPRQd — zayn (@ZaynMahmood5) December 4, 2022 Hassan Ali's fight with the crowd😱#HassanAli #PakvEng #Cricket pic.twitter.com/G4mji06uwa — Muhammad Noman (@nomanedits) December 3, 2022 చదవండి: FIFA WC: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! ENG Vs PAK: ఎంత కష్టం.. ఒకే ఒక్క వికెట్ కోసం చకోర పక్షుల్లా -
'పబ్లిసిటీ కోసమే ఇదంతా.. మాట్లాడడం వ్యర్థం'
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్.. తన ఆటోబయోగ్రఫీ ''సుల్తాన్: ఏ మొమొయిర్'' ద్వారా వరుసగా సంచలన విషయాలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ''విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు పాక్ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ తనను ఒక పనివాడిలా చూసేవాడని.. బట్టలు ఉతికేంచేవాడని.. అవసరమైనప్పుడల్లా మసాజ్ చేయించుకునేవాడు.. అంతేకాదు అతనొక స్వార్థపరుడు.. నాకు బౌలింగ్ ఇవ్వడానికి ఆలోచించేవాడు'' అంటూ అక్రమ్ తన బయోగ్రఫీలో పేర్కొనడం ఆసక్తిని రేపింది. అయితే తాజాగా అక్రమ్ వ్యాఖ్యలపై సలీమ్ మాలిక్ ఎదురుదాడి చేశాడు. ''వాస్తవానికి అక్రమ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. మేం అప్పట్లో ఏ టూర్‌కు వెళ్లినా అక్కడ లాండ్రీ మెషిన్లు ఉంటాయి. మా బట్టలు అందులో వేసేవాళ్లం తప్ప ఎవరు ఉతుక్కునేవాళ్లం కాదు. ఇక నేను స్వార్థపరుడిని అంటున్నాడు. నిజానికి నేను కాదు అక్రమ్ స్వార్థపరుడు. తన గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం ఎన్ని అబద్దాలు అయినా చెప్తాడు. తాజాగా తన బయోగ్రఫీలోనూ అదే పేర్కొన్నాడు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడు. తనను తాను అవమానించుకుంటున్నట్లు అతనికి అర్థమవడం లేదు. అయినా అక్రమ్ వ్యాఖ్యలపై ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. బట్టలు ఉతికించడం.. మసాజ్ చేయించడం లాంటి పదాలు వాడాడు కాబట్టే.. అవన్నీ అబద్దాలు అని మాత్రమే చెప్పగలను. ఇంతకుమించి నేను ఏం మాట్లాడదలచుకోలేదు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సలీమ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల తర్వాత 1984లో వసీమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా మాలిక్ సారథ్యంలో 1992-1995 కాలంలో అక్రమ్ 12 టెస్టులు, 34 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో అతనిపై జీవితకాలం నిషేధం పడింది. చదవండి: అతడు మసాజ్ చేయమనేవాడు.. చాలా కోపం వచ్చేది: వసీం అక్రమ్ బుడ్డోడి మోచేతి ధర రూ. 40 లక్షలంట! -
అన్న అడుగు పడింది.. ఇప్పుడు తమ్ముడి వంతు
చిరకాల ప్రత్యర్థి.. దాయాది పాకిస్తాన్ జట్టులో బౌలింగ్ విభాగం ఎంత పటిష్టంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లయినప్పటికి అలాంటి నిఖార్సైన పేసర్లు మనకూ ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయం. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో పేసర్లకు కొదువ లేదు. ఒకరు గాయపడితే మరొక ఫాస్ట్ బౌలర్ సిద్ధంగా ఉంటున్నాడు. అది చురకత్తులాంటి బంతులతో వికెట్లు తీసే బౌలర్లు తయారవుతున్నారు. ఇటీవలే టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఫైనల్ వరకు వచ్చిందంటే అందులో బౌలర్ల పాత్రే ఎక్కువగా ఉంది. షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ వసీమ్ జూనియర్, హారిస్ రౌప్ ఇలా జట్టులో ఒకరిని మించి మరొక బౌలర్ ఉన్నాడు. పాక్ జట్టులో ఇప్పుడే కాదు.. వాళ్లు క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి పేసర్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్‌ల తర్వాత ఆ బాధ్యత షోయబ్ అక్తర్, మహ్మద్ సమీ, సోహైల్ తన్వీర్, మహ్మద్ ఆమిర్, మహ్మద్ ఆసిఫ్‌లు తీసుకున్నారు. వీరి తర్వాత వచ్చినవాళ్లే ప్రస్తుతం పాక్ జట్టులో ఉన్న స్టార్ బౌలర్లుగా వెలుగొందుతున్నారు. ఇక పాక్ జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ నసీమ్ షా(19) ఒక సంచలనం. తనదైన స్వింగ్.. పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టగల సమర్థుడు. అయితే టి20 ప్రపంచకప్‌లో పెద్దగా రాణించనప్పటికి తనదైన రోజున అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. పదునైన పేస్ బౌలింగ్‌తో వికెట్లు రాబట్టగల నైపుణ్యం అతని సొంతం. ఈ ఏడాది ఆసియా కప్‌లో టీమిండియాపై తొలి అంతర్జాతీయ టి20 ఆడిన నసీమ్ షా డెబ్యూ మ్యాచ్‌లోనే మంచి ప్రదర్శన కనబరిచాడు. షాహిన్ అఫ్రిది స్థానంలో జట్టులోకి వచ్చిన నసీమ్ షా తన పదునైన బంతులతో టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన నసీమ్ షా 27 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. తద్వారా పాక్ బౌలింగ్‌లో కీలకంగా మారిన నసీమ్ షా టి20 ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లాడిన నసీమ్ మూడు వికెట్లు తీశాడు. తాజాగా నసీమ్ షా తమ్ముడు హునైన్ షా(18) అన్నను మించిపోయేలా ఉన్నాడు. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆడుతున్న హునైన్ షా మ్యాచ్‌లో ఒక్క వికెట్ మాత్రమే తీసినప్పటికి తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. గుడ్ లెంగ్త్‌తో వేసిన బంతి బ్యాటర్ చేతిని తాకి ఆ తర్వాత బ్యాట్‌ను తాకి గాల్లోకి లేవడం.. స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ క్యాచ్ తీసుకోవడం జరిగిపోయింది. బ్యాటర్ తన చేతికి బంతి గట్టిగా తగలడంతో నొప్పితో బాధపడిన అతను పెవిలియన్‌కు వెళ్తూ రాసుకోవడం కనిపించింది. ఇక హునైన్ షాకు ఫస్ల్‌క్లాస్ క్రికెట్లో ఇదే తొలి వికెట్ కావడం విశేషం. అయితే మ్యాచ్‌లో 76 పరుగులిచ్చిన హునైన్ కేవలం ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకన్నాడు. మొత్తానికి అన్న నసీమ్ షా అడుగు ఇప్పటికే పాకిస్తాన్ జట్టులో పడింది.. ఇక ఇప్పుడు తమ్ముడి వంతు త్వరలో రాబోతుందంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ స్వయంగా ట్విటర్లో షేర్ చేసింది. Hunain Shah picks up his first wicket in first-class cricket ☝️ Watch Live ➡️ https://t.co/LcfNgwD2hw#QeAT | #CPvBAL pic.twitter.com/ORrjwhsQJL — Pakistan Cricket (@TheRealPCB) November 17, 2022 చదవండి: వర్షంతో మ్యాచ్ రద్దు.. వింత గేమ్ ఆడిన భారత్, కివీస్ ఆటగాళ్లు -
'2009 తర్వాత మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారాయి'
2009లో పాకిస్తాన్లో పర్యటనకు వచ్చిన లంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆరోజు బస్సుపై కురిసిన బులెట్ల వర్షానికి లంక జట్టులో పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. వీరిలో థిల్లాన్ సమరవీర, తిలకరత్నే దిల్షాన్, అజంతా మెండిస్, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, సురంగ లక్మల్, చమిందా వాస్ సహా మరికొంత మంది క్రికెటర్లు ఉన్నారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు చనిపోగా.. ఇద్దరు పౌరులు బలయ్యారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు మిగతా దేశాలు నిరాకరించాయి. అప్పటినుంచి దాదాపు 2019 వరకు అంటే పదేళ్ల పాటు ఏ జట్టు కూడా పాకిస్తాన్లో పర్యటించడానికి ఇష్టపడలేదు. పాక్ ఏదైనా హోం సిరీస్ ఆడాలంటే యూఏఈకి రావాల్సిందే. దీంతో పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్‌లు జరగక అక్కడి మైదానాలన్ని వెలవెలబోయాయి. బోర్డు నుంచి సహాయం లేకపోవడంతో క్రికెట్ మైదానాలను మూసే పరిస్థితి కూడా వచ్చింది. తాజా పరిస్థితి చూస్తే పాకిస్తాన్లో కాస్త మార్పు కనిపిస్తుంది. 2019లో శ్రీలంక రెండు టెస్టులు ఆడేందుకు పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఫలితం సంగతి పక్కనబెడితే.. పాక్‌లో ఆడేందుకు జంకిన ఇతర దేశాలు లంకతో సిరీస్‌ను పాక్ నిర్వహించిన తీరుపై నమ్మకం వచ్చి క్రికెట్ ఆడేందుకు ఒప్పుకున్నాయి. ఇటీవలే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు కూడా పాక్ గడ్డపై పర్యటించాయి. దశాబ్దం నుంచి క్రికెట్ మ్యాచ్‌లు లేక మూగబోయిన మైదానాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఈ అంశంపై స్పందించాడు. ''2009లో లంక క్రికెటర్లపై దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. మా దేశంలోని మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారిపోయాయి. మా మైదానాల్లో క్రికెట్ ఆడాలని మాకున్నప్పటికి పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. మైదానాల్లో ప్రేక్షకులు మిస్సయ్యాం. అప్పటి బాధ వర్ణణాతీతం. ఈ పదేళ్లలో దేశంలో ఎంతో మార్పు వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు దేశ ప్రభుత్వం క్రికెట్‌ను బతికించేందుకు చొరవ తీసుకుంది. మేము కూడా విదేశీ లీగ్‌ల్లో ఆడే సమయంలో విదేశీ ఆటగాళ్లతో మాట్లాడేవాళ్లం. వాళ్లను క్రికెట్ ఆడేందుకు ఒప్పించే ప్రయత్నం చేశాం. పాక్‌లో మళ్లీ క్రికెట్ ఆడేందుకు పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లలో పాకిస్తాన్ నుంచి మిగతా దేశాలకు క్రికెట్ సురక్షితంగా ఆడుకోవచ్చు అనే భరోసా కల్పించేలా చేశాం. ఇప్పుడు ఆ ఇబ్బందికర దశ మారింది. పాకిస్తాన్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు పర్యటించాయి. రానున్న కాలంలో మరిన్ని జట్లు పర్యటనకు వస్తాయని ఆశిస్తున్నా. ఇక క్రికెట్ గ్రౌండ్స్ ప్రేక్షకులతో నిండిపోతుండడం సంతోషంగా అనిపిస్తుంది. ''అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆఖరిమెట్టుపై బోల్తా పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలయ్యింది. బెన్ స్టోక్స్, సామ్ కరన్‌లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ రెండోసారి చాంపియన్‌గా అవతరించింది. సూపర్-12 దశలోనే ఇంటిముఖం పట్టాల్సిన పాకిస్తాన్ అనూహ్యంగా సెమీస్ చేరడం.. అక్కడ కివీస్‌ను ఓడించడం.. ఆపై ఫైనల్‌కు వెళ్లింది. ఇక ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన పాక్ రన్నరప్‌గా నిలిచింది. చదవండి: టీమిండియా ఫేవరెట్ ఏంటి..? ఆ జట్టుకు అంత సీన్ లేదు.. నాన్సెన్స్..! -
Sania-Shoaib Malik: టీవీ షో కోసం విడాకుల డ్రామా.. జనాల్ని ఫూల్స్ చేశారా..?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. తమ దాంపత్య జీవితానికి పుల్‌స్టాప్ పెట్టనున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. పాక్ మోడల్ అయేషా ఒమర్‌తో షోయబ్ సీక్రెట్ రిలేషన్ మెయిన్టైన్ చేస్తున్న విషయం సానియాకు తెలిసిపోవడమే, వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణమైందని నెట్టింట రకరకాల కథనాలు ప్రచారమయ్యాయి. View this post on Instagram A post shared by UrduFlix (@urduflixofficial) ఇటీవలి కాలంలో సానియా ఇన్‌స్టాలో పెట్టిన కొన్ని పోస్ట్‌లు, షోయబ్ మేనేజర్ విడాకుల విషయాన్ని దృవీకరించాడని వచ్చిన వార్తలు, మీర్జా-మాలిక్ వివాహ బంధానికి తెరపడినట్లు జరిగిన ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. విడాకుల విషయమై మీర్జా-మాలిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదేమోనని ఇప్పుడిప్పుడే వారిరువురి ఫ్యాన్స్ ఓ కన్ఫర్మేషన్కు వస్తున్నారు. View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) అయితే, ఇంతలోనే మీర్జా-మాలిక్ గురించిన ఓ వార్త అభిమానులను కన్ఫ్యూజింగ్ స్టేట్లోకి నెట్టేసింది. మీర్జా-మాలిక్ ఇద్దరూ కలిసి ఓ టీవీ షో చేస్తున్నారని ఊర్దూఫ్లిక్స్ అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రకటించింది. ఈ షో.. 'ది మీర్జా మాలిక్ షో' గా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఊర్దూఫ్లిక్స్ తమ అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వార్త తెలిసి అభిమానులు తలలు గోక్కుంటున్నారు. అసలు వీరి విడాకులు వార్త నిజమేనా లేక షో ప్రమోషన్లో భాగంగా జనాలను ఫూల్స్ చేశారా అన్న డైలమాలో ఉన్నారు. కొందరేమో.. ఈ షో వారిద్దరికీ చెడక ముందే ప్లాన్ చేసిందని, మీర్జా-మాలిక్‌ల వివాహ బంధానికి పుల్‌స్టాప్ పడిన వార్త నిజమేనని అనుకుంటున్నారు. కాగా, 2010లో ప్రేమ వివాహం చేసుకున్న సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులకు 2018లో ఇజాన్ మీర్జా అనే బిడ్డ పుట్టాడు. ఇద్దరు తమతమ కెరీర్లతో బిజీగా ఉండటంతో సానియా ఇండియాలో, షోయబ్ పాక్‌లో ఉంటున్నారు. చదవండి: Sania Mirza: సానియా మీర్జాతో విభేదాలు!? నటితో షోయబ్ మాలిక్ ఫొటోలు వైరల్ -
ఫైనల్ దారిలో రికార్డులు బద్దలు కొట్టిన పాక్
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. తాజాగా బుధవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాక్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి ఫైనల్‌కు చేరుకున్న పాకిస్తాన్ రెండోసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. ఇక ఫైనల్‌కు చేరుకున్న పాకిస్తాన్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► టి20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానం దక్కించుకుంది. ఇప్పటివరకు కివీస్‌ను పాకిస్తాన్ 18 సార్లు(తాజా మ్యాచ్‌తో కలిపి) ఓడించింది. ఆ తర్వాత వరుసగా ఇండియా వెస్టిండీస్‌ను 17సార్లు, ఇండియా శ్రీలంకను 17 సార్లు, ఇంగ్లండ్ పాకిస్తాన్‌ను 17సార్లు మట్టికరిపించాయి. ► 2009 నుంచి టి20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు సెమీఫైనల్లో ఇదే తొలి విజయం. ఓవరాల్‌గా మూడోసారి(ఇంతకముందు 2007, 2009) కాగా.. 13 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టడం విశేషం. ► ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ సెమీస్‌లో ఓడించడం ఇది నాలుగోసారి. ఇంతకముందు 1992, 1999 వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు 2007, 2022 టి20 ప్రపంచకప్‌లలోనూ కివీస్‌ను సెమీస్‌లో ఓడించింది. ► 2021 వరల్డ్‌కప్ తర్వాత ఆడిన టి20 మ్యాచ్‌ల్లో సౌథీ వికెట్ తీయకపోవడం ఇది రెండో సారి మాత్రమే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కివీస్ 152 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ చేయగా.. కేన్ విలియమ్సన్ 46 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. పాక్‌కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం అదిరిపోయే ఆరంభం అందించారు. బాబర్ ఆజం 42 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఇక రిజ్వాన్ 57 పరుగులతో అదరగొట్టాడు. మహ్మద్ హారీస్ 30 పరుగులతో రాణించాడు. చదవండి: NZ Vs PAK: ఆడింది కివీసేనా.. పేలవ ఫీల్డింగ్, నాసిరకం బ్యాటింగ్ -
సమయం ఆసన్నమైంది.. వారిద్దరిని విడదీయాల్సిందే!
క్రికెట్లో ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా ముఖ్యం. బ్యాటింగ్‌లో ఈ జోడి పోషించే పాత్రపైనే ఇన్నింగ్స్ మొత్తం ఆధారపడి ఉంటుంది. క్రికెట్ చరిత్రలో సచిన్-సెహ్వాగ్, సచిన్-గంగూలీ, మాథ్యూ హెడెన్-గిల్‌క్రిస్ట్, హెడెన్-జస్టిన్ లాంగర్, గ్రేమీ స్మిత్-హర్షలే గిబ్స్ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీలుగా ముద్రపడ్డారు. వీళ్లే కాదు ఇంకా చాలా ఓపెనింగ్ జోడీలున్నాయి.. చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టు వస్తుంది. మనం చెప్పుకున్న లిస్టులో పాకిస్తాన్ జోడి బాబర్ ఆజం-మహ్మద్ రిజ్వాన్‌లకు కూడా కచ్చితంగా స్థానం ఉంటుంది. గత రెండేళ్లుగా ఈ జోడి పరుగుల మీద పరుగులు చేస్తూ రికార్డులు సృష్టించారు. 2021 ఏడాదిలో ఈ జోడి 50.47 సగటుతో 2019 పరుగులు జోడించారు. దీన్నబట్టే అర్థం చేసుకోవచ్చు.. బాబర్-రిజ్వాన్ జోడి ఎంత సక్సెస్ అయిందనేది. అయితే ఈ సక్సెస్ ఇప్పుడు వారిద్దరిని చిక్కుల్లో పడేసింది. కొంతకాలంగా బాబర్-రిజ్వాన్ జోడి స్థిరంగా పరుగులు చేయలేకపోతుంది. ముఖ్యంగా బాబర్ ఆజం ఆట నాసిరకంగా తయారైంది. టి20 ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో బాబర్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకముందు ఆసియా కప్‌లోనూ ఇదే పరిస్థితి. తాజాగా అదే ఫేలవ ఫామ్‌ను టి20 ప్రపంచకప్‌లోనూ కంటిన్యూ చేస్తున్నాడు. అటు కెప్టెన్‌గానూ విఫలమవుతున్నాడు. టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి పాలైన పాకిస్తాన్‌కు జింబాబ్వే కూడా షాకిచ్చింది. ఈ దెబ్బకు బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. అసలే బ్యాటింగ్‌లో విఫలమవుతున్న బాబర్‌కు ఇది పెద్ద దెబ్బ. కొందరైతే ఏకంగా బాబర్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టు నుంచి ఉద్వాసన పలకాలని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మహ్మద్ రిజ్వాన్ పరిస్థితి మరోలా ఉంది. టి20 ప్రపంచకప్ ముందు వరకు రిజ్వాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చెప్పాలంటే 2021 నుంచి రిజ్వాన్ భీకరమైన ఫామ్ కనబరుస్తున్నాడు. టి20 ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించిన మహ్మద్ రిజ్వాన్ ఆ స్థానానికి తాను కరెక్టే అన్నట్లుగా ప్రతీ మ్యాచ్‌లోనూ స్థిరంగా ఆడుతూ వచ్చాడు. అయితే టి20 ప్రపంచకప్‌లో మాత్రం రిజ్వాన్ ఆ ఫామ్‌ను చూపెట్టలేకపోతున్నాడు. అయితే ఇప్పటికి ఆడింది రెండు మ్యాచ్‌లు మాత్రమే కాబట్టి.. అతన్ని తక్కువ అంచనా వేయలేము. అతని ఫామ్‌లో ఉన్నానని చెప్పడానికి ఒక నిఖార్సైన ఇన్నింగ్స్ చాలు. కానీ అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే.. పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో ఓపెనింగ్ ఆప్షన్ లేకుండా పోయింది. బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ జోడి మూడు ఫార్మట్లలోనూ ఓపెనింగ్ స్లాట్‌లోనే వస్తున్నారు. అయితే వీరిద్దరికి ప్రత్యామ్నాయంగా మరొకరిని ఆడించకపోవడం పీసీబీ చేసిన తప్పు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. ప్రతీసారి బాబర్-రిజ్వాన్ ఆడుతారని చెప్పలేం. ఇప్పుడు నడుస్తోంది కూడా అదే. వాస్తవానికి పాక్ జట్టులో ఫఖర్ జమాన్ రెగ్యులర్‌గా మూడో స్థానంలో వస్తుంటాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌కు దూరంగా ఉన్న ఫఖర్ జమాన్ స్థానంలో షాన్ మసూద్‌ను ఎంపిక చేయడం.. అతను అంచనాలకు మించి రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. అయితే ఫఖర్ జమాన్‌ను ఓపెనింగ్ స్లాట్‌లో ఆడించాల్సింది అని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు టీమిండియాలో రోహిత్-రాహుల్ జోడి విఫలమయినా.. వారికి ప్రత్యామ్నాయంగా చాలా మంది అందుబాటులో ఉన్నారు. కానీ పాకిస్తాన్‌కు ఆ చాన్స్ లేకుండా పోయింది. అందుకే బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ జోడిని విడదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ఓపెనింగ్ జోడిలో ఒకరి స్థానంలో వేరొకరిని ఆడించడం మంచిదని పేర్కొన్నారు. -
‘భారత్‌పై గెలిస్తే నవ్వుకుంటారుగా.. అంత ఏడుపు ఎందుకులే..’
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న అదృష్టవశాత్తు లీగ్ ఫేవరేట్‌గా ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఐర్లాండ్ చేతిలో ఓటమిని చవిచూడటం క్రికెట్ ఫ్యాన్స్‌కు మజానిచ్చింది. ఇంతలోనే దాయాది దేశం పాకిస్తాన్.. జింబాబ్వే చేతిలో ఓడిపోవడం భారత్ ఫ్యాన్స్‌కు కిక్కుఇచ్చింది. ఇక, చిన్న జట్టు చేతిలో పాక్ జట్టు ఓటమి చెందడం అటు పాకిస్తాన్ ఫ్యాన్స్‌కు కూడా మింగుడుపడటం లేదు. పాక్ క్రికెటర్ల ఆటపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి అనంతరం.. పాక్ జట్టు జింబాబ్వేతో తలపడింది. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాంతో సహా మిగిలిన క్రికెటర్లు షాక్‌లోకి వెళ్లిపోయారు. గ్రౌండ్‌లోనే తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ ఎదుట పాక్ జట్టు ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కన్నీరుపెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో షాదాబ్ ఖాన్.. తన మోకాళ్ల మీద కూర్చుని వెక్కివెక్కి కన్నీరుపెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇతర ప్లేయర్స్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. Shadab Last Night..😓#WorldCup2022 #Pakistan pic.twitter.com/0zdAMbtJqY — PriNce__🍁 (@UmerNazir_44) October 28, 2022 ఈ వీడియో పాక్ అభిమానుల కంటపడింది. పాపం వీడియో చూసిన ఫ్యాన్స్.. మనోడే కదా అని ఎమోషనల్‌గా ఫీల్ అవుతారనుకుంటే.. ఫైర్ అయ్యారు. వీడియోపై ట్రోల్స్ చేశారు. షాదాబ్ ఓవరాక్షన్ మొదలుపెట్టాడని, ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయి, ఏదో బాగా కష్టపడినట్లు నాటకాలు ఆడుతున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. ఇకనైనా ఈ బిల్డప్ తగ్గించుకుంటే మంచిదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు షాదాబ్ ఖాన్.. పాక్ జట్టుపై ఓవర్‌గా వ్యాఖ్యలు చేశారు. అన్ని జట్ల కంటే తమ టీమ్ బౌలింగ్ అటాక్ డేంజరస్‌గా ఉందన్నాడు. ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ జోడి(బాబర్ ఆజం, రిజ్వాన్) తమ జట్టుకు ప్లస్ అంటూ కితాబిచ్చాడు. Heartbreaking...💔 Shadab Khan in dressing room after Pakistan defeat against Zimbabwe#ICCT20WorldCup2022 pic.twitter.com/1wvpZjSKkV — PriNce__🍁 (@UmerNazir_44) October 28, 2022 Shadab crying After Match🤧 😢 unbreakable Lost PCT +PCT Fans @76Shadabkhan my All time favorite pic.twitter.com/afKeDNtDyy — 𝑀𝑢𝒉𝑎𝑚𝑚𝑎𝑑 𝐴𝑏𝑖𝑑 (@MAbidPak) October 28, 2022 ఇది కూడా చదవండి: ఆ బంతి తిరిగి ఉంటే టీమిండియాకు రిటైర్మెంట్ ఇచ్చేవాడిని! -
'ఇక చాలు.. కెప్టెన్సీ నుంచి తప్పుకో'
టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమితో పాక్ కెప్టెన్ బాబర్‌పై విమర్శలు ఎక్కువైపోయాయి. అందునా టీమిండియాతో మ్యాచ్‌లో బాబర్ గోల్డెన్ డక్ అయిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బాబర్ ఆజం స్థిరంగా పరుగులు సాధించడంలో విఫలమవుతూ వస్తున్నాడు. దీనికి తోడు కెప్టెన్సీలోనూ అనుకున్న విధంగా రాణించకపోవడంతో అతనిపై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ ఆటగాడు సలీమ్ మాలిక్ బాబర్ ఆజంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టున నడిపించలేకపోతే కెప్టెన్సీ నుంచి వైదొలగడం మంచిదంటూ చురకలంటించాడు. ఇలాంటి తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో సీనియర్ ఆటగాడి పాత్ర జట్టులో కీలకంగా మారుతుంది. కెప్టెన్ గందరగోళానికి గురైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అనుభవజ్ఘులు ఆ సమయంలో మార్గనిర్దేశం చేస్తారు. అందుకే ఒక సీనియర్ ఆటగాడు ఫాస్ట్ బౌలర్‌కు తగిన సూచనలు చేయాలని నేనెప్పుడూ చెప్తుంటాను. ఇన్నేళ్ల అనుభవం ఉన్నా జట్టును సమర్థంగా నడిపించలేకపోవడం.. చేసిన తప్పులనే మళ్లీ పునరావృతం అవుతుంటే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిది. ఇక నీ సేవలు చాలు.. ఇప్పటికైనా కెప్టెన్సీ నుంచి తప్పుకో'' అంటూ పేర్కొన్నాడు. ఇక టీమిండియాతో ఓటమి అనంతరం పాకిస్తాన్ గురువారం(అక్టోబర్ 27న) జింబాబ్వేతో తలపడనుంది. చదవండి: మైకెల్ వాన్‌ను మళ్లీ ఆడేసుకున్న వసీం జాఫర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హెడెన్ బంపరాఫర్ మిస్ చేసుకున్న పాక్ బౌలర్స్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్‌ల ద్వారా సరైన ప్రాక్టీస్ లభించలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో ఓటమిపాలైన పాకిస్తాన్‌కు రెండో మ్యాచ్ వర్షార్పణం అయింది. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం అంతరాయం కలిగించడం.. ఆపై ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. వార్మప్ మ్యాచ్‌లు ముగియడంతో ఇక పాకిస్తాన్ నేరుగా అక్టోబర్ 23న(ఆదివారం) మెల్బోర్న్ వేదికగా టీమిండియాతో తలపడనుంది. అయితే టీమిండియాతో పోరుకు ముందు బ్రిస్బేన్‌లో పాక్ జట్టు మెంటార్.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ త్రో చాలెంజ్ కాంపిటీషన్ నిర్వహించాడు. త్రో చాలెంజ్‌లో భాగంగా ఎవరైతే బంతిని స్టేడియం బయటకు విసురుతారో వాళ్లకు వంద డాలర్ల ఖరీదైన గిఫ్ట్‌ను ఇస్తానని చాలెంజ్ చేశాడు. ఈ చాలెంజ్‌కు పాక్ పేసర్లు నసీమ్ షా, మహ్మద్ వసీమ్ జూనియర్లు సై అన్నారు. తాను బంతిని స్టేడియం వెలుపలికి విసరగలనన్న నమ్మకం ఉందని వసీమ్ పేర్కొన్నాడు. అయితే చెప్పినట్లుగా బంతిని బయటకు విసరడంలో మాత్రం విఫలమయ్యాడు. నసీమ్ షా కూడా త్రో చాలెంజ్‌లో ఫెయిలయ్యాడు. ఇద్దరు విఫలమవడంతో హేడెన్ వంద డాలర్ల గిఫ్ట్‌ను తన వద్దే అట్టిపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Pakistan Cricket (@therealpcb) చదవండి: రాణించిన కుశాల్ మెండిస్.. భవితవ్యం ఇక బౌలర్ల చేతిలో స్లో ఓవర్ రేట్.. క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన -
పాకిస్తాన్ పర్యటనకు రానున్న కివీస్.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది డిసెంబర్లో న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడేందుకు కివీస్ జట్టు.. రెండు సార్లు పాకిస్తాన్‌కు రానుంది. తొలి దశ పర్యటనలో భాగంగా పాక్‌తో విలియమ్సన్ సేన రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌లలో తలపడనుంది. డిసెంబర్ 27న కరాచీ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో న్యూజిలాండ్ పర్యటన ప్రారంభం కానుంది. అదే విధంగా వచ్చే ఏడాది జనవరిలో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మరోసారి కీవిస్ జట్టు పాక్ టూర్‌కు రానుంది. రెండో దశ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో పాక్‌తో కివీస్ ఆడనుంది. కాగా గతేడాది పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. భద్రతా కారణాల దృష్ట్యా అఖరి నిమిషంలో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకుంది. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో ట్రై సిరీస్‌లో పాకిస్తాన్ తలపడుతోంది. చదవండి: IND vs WA-XI: నిరాశ పరిచిన రోహిత్.. మరోసారి చెలరేగిన సూర్య కుమార్ -
పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం
మహిళల ఆసియాకప్-2022లో పాకిస్తాన్ జట్టుకు థాయ్‌లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. షెల్లాట్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తమ టీ20 క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌పై థాయలాండ్కు ఇదే తొలి విజయం. 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ మరో బంతి మిగిలూండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. థాయ్ ఓపెనర్ నటకన్ చంతమ్ 61 పరుగులు చేసి.. తమ జట్టు చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ బౌలర్లలో నిదా దార్, హసన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకుముందు థాయ్‌లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 116 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో అమీన్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక థాయ్ బౌలర్లలో టిప్పోచ్ రెండు, తిపట్చా పుట్టావాంగ్ ఒక్క వికెట్ సాధించారు. ఇక పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న భారత్ తలపడనుంది. The sheer happiness after scoring those winning runs ✨The Thailand🇹🇭 Team won our hearts and the match today@ThailandCricket #ACC #AsiaCup2022 #WomensAsiaCup pic.twitter.com/atJwwG7wfh — AsianCricketCouncil (@ACCMedia1) October 6, 2022 చదవండి: IND VS SA: లక్నోలో భారీ వర్షం.. తొలి వన్డేపై నీలినీడలు -
మలేషియాను చిత్తు చేసిన పాక్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం
ఆసియాకప్-2022ను పాకిస్తాన్ మహిళల జట్టు విజయంతో ప్రారంభించింది. షెల్లాట్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మలేషియా.. పాకిస్తాన్ స్పిన్నర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 57 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో ఒమైమా సోహైల్ మూడు వికెట్లు పడగొట్టగా.. టుబా హసన్ రెండు, ఇక్భాల్ తలా వికెట్ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంటర్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 9 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేధించింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్లు (సదీరా అమీన్ 31), మునీబా అలీ(21) పరుగులు చేశారు. ఇక పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 3న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. చదవండి: Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి! వీరికి వెనుక ఉన్నది ఎవరంటే! -
మైదానంలో కుప్పకూలి.. ఆటగాడు మృతి! చనిపోయింది నేను కాదు: పాక్ పేసర్
Pakistan Pacer Usman Shinwari: తాను బతికే ఉన్నానని, దయచేసి పూర్తి వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఉస్మాన్ శిన్వారి విజ్ఞప్తి చేశాడు. తాను చనిపోయానన్న వార్త విని బంధువులు, శ్రేయోభిలాషులు తీవ్ర ఆందోళనకు గురయ్యారన్నాడు. దేవుడి దయ వల్ల తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా తన అభిమానులు, బంధువులకు స్పష్టతనిచ్చాడు. అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ కార్పొరేట్ లీగ్‌లో భాగంగా లాహోర్‌లోని చోబ్లీ టౌన్ క్రికెట్ గ్రౌండ్లో ఫ్రైస్‌ల్యాండ్, బర్జర్ పెయింట్స్ జట్ల మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా.. ఉస్మాన్ శిన్వారి అనే క్రికెటర్ గుండెనొప్పితో మైదానంలో కుప్పకూలాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. హఠాన్మరణం చెందిన శిన్వారి అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. అయితే, పాక్ జాతీయ జట్టుకు ఆడిన ఉస్మాన్ పేరు.. మరణించిన ఆటగాడి పేరు ఒకే విధంగా ఉండటంతో చాలా మంది ఉస్మాన్ మరణించినట్లుగా వార్తలు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో చనిపోయింది తాను కాదంటూ ట్విటర్ వేదికగా పాక్ పేసర్ ఉస్మాన్ శిన్వారి ఆదివారం స్పష్టతనిచ్చాడు. చివరిసారిగా అప్పుడే.. పాకిస్తాన్ తరఫున చివరిసారిగా 2019లో మైదానంలో దిగాడు ఉస్మాన్ శిన్వారి. శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్ ఆడాడు. ఇప్పటి వరకు మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కాగా ఇప్పటి వరకు అతడు పాక్ తరఫున ఒక టెస్టు, 17 వన్డేలు, 16 టీ20లు ఆడి వరుసగా ఆయా ఫార్మాట్లలో ఒకటి, 34, 13 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే... పాక్ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉంది. కరాచీలో జరిగిన నాలుగో టీ20లో గెలుపొందిన బాబర్ సేన ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. చదవండి: Ind Vs Aus: మ్యాచ్‌కు ముందు కడుపునొప్పి, జ్వరం! లెక్కచేయని సూర్య! ఇదే వరల్డ్‌కప్ ఫైనల్ అయితే! Ind Vs Aus 3rd T20: ద్రవిడ్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్ తర్వాత రెండో భారత బ్యాటర్‌గా.. Me belkul thek ho Allah ka shukar hai mery pory family ko log calls kr rahy hai with due respect itni bari News chalany se pehly tasdeeq kar liya kary shukria🙏 — Usman khan shinwari (@Usmanshinwari6) September 25, 2022 -
ఇదేమి జెర్సీరా బాబు.. పుచ్చకాయలా ఉంది! మీకో దండం!
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022 కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ కొత్త జెర్సీని సోమవారం అవష్కరించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ట్విటర్లో షేర్ చేసింది. ఇక పాకిస్తాన్ కొత్త జెర్సీపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దారుణంగా ట్రోలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ముదురు ఆకుపచ్చ లేదంటే లేత ఆకుపచ్చ రంగు జెర్సీలు ధరిస్తూ వస్తుంది. అయితే ఈ రెండు రంగులు కలపి కొత్త జెర్సీని పీసీబీ తాయారు చేసింది. అయితే అభిమానులు మాత్రం పాకిస్తాన్ జెర్సీ పుచ్చకాయను తలపించేలా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. Pakistan fans trolling Indian jersey.. ~Meanwhile Pakistan jersey.. pic.twitter.com/4wGc3vDiK3 — รѵҡ ∂αเℓεε✨ (@GrimRea27782254) September 18, 2022 మరి కొంత మంది సెంటర్ ఫ్రూట్ మింగిల్ చాక్లెట్ కవర్‌తో ఈ జెర్సీని పోలుస్తున్నారు. కాగా ఇప్పటికే టీ20 ప్రపంచకప్-2022 కోసం భారత్, ఆస్ట్రేలియా వంటి ఆగ్రశ్రేణి జట్లు తమ న్యూ జెర్సీలను లాంచ్ చేశాయి. Pakistan jersey pic.twitter.com/KOvpeQpfxc — Vishal Patel (@Vishal_dhoni07) September 18, 2022 𝐓𝐡𝐞 𝐛𝐢𝐠 𝐫𝐞𝐯𝐞𝐚𝐥! Presenting the official Pakistan T20I Thunder Jersey'22 ⚡ Order the official 🇵🇰 shirt now at https://t.co/A91XbZsSbJ#GreenThunder pic.twitter.com/BX5bdspqt1 — Pakistan Cricket (@TheRealPCB) September 19, 2022 చదవండి: LLC 2022: మిచెల్ జాన్సన్‌కు వింత అనుభవం.. హోటల్ గదిలో పాము! -
భారత్‌పై గెలుపొక్కటే కాదు.. ఆసియా కప్ కొట్టాలని కంకణం!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసియా కప్ కొట్టాలని కంకణం కట్టుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ పాక్ కెప్టెన్ కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. కొడితే సెంచరీ లేదంటే అర్థసెంచరీలుగా సాగుతుంది బాబర్ ఇన్నింగ్స్. ఒకప్పటి కోహ్లిని తలపిస్తోన్న బాబర్ ఆజంను కట్టడి చేయడం ప్రత్యర్థి బౌలర్లకు సవాల్‌గా మారిపోయింది. ఇక గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డేలోనూ బాబర్ అర్థ సెంచరీతో మెరిశాడు. వన్డేల్లో తొమ్మిది వరుస ఇన్నింగ్స్‌లో బాబర్‌కు ఇది ఎనిమిదో అర్థ సెంచరీ కావడం విశేషం. మరొకటి ఏంటంటే.. అతను హాఫ్ సెంచరీ సాధించిన ఎనిమిది సార్లు పాకిస్తాన్నే విజయం వరించింది. ఈ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి మాత్రమే విఫలమైన బాబర్.. విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరి ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థితో తలపడనున్న నేపథ్యంలో బాబర్ ఆజం ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. బాబర్ టార్గెట్ భారత్‌పై గెలుపుతో పాటు ఆసియా కప్ అందించడమేనట. ఎందుకంటే బాబర్ ఆజం తాను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాక్ ఖాతాలో ఒక్క మేజర్ టోర్నీ కూడా గెలవలేదు. అందుకే ఆసియా కప్‌ను గెలిచి.. రానున్న టి20 ప్రపంచకప్‌ను ఒడిసిపట్టాలని బాబర్ భావిస్తున్నాడు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లోనూ బాబర్ నేతృత్వంలోని పాకిస్తాన్ మంచి ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశలో ఓటమెరుగని పాకిస్తాన్.. సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ఇక పాకిస్తాన్ ఆసియా కప్ నెగ్గి దశాబ్దం అయిపోయింది. చివరిసారి 2012లో మిస్బా ఉల్ హక్ నేతృత్వంలోని పాకిస్తాన్ బంగ్లాదేశ్‌ను ఫైనల్లో మట్టికరిపించి ఆసియాకప్‌ను అందుకుంది. అప్పటి నుంచి మరోసారి ఆ కప్‌ను సాధించలేకపోయింది. మరి బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ఆసియా కప్ కొల్లగొడుతుందేమో చూడాలి. చదవండి: PAK Vs NED: రెండో వన్డేలో ఘన విజయం..'ఈసారి మాత్రం తేలిగ్గా తీసుకోలేదు' -
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్!
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు స్కాట్ ఎడ్వర్డ్స్ నాయకత్వం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ టోర్నీలు ది హండ్రెడ్, రాయల్ వన్డే కప్‌లో భాగమైన ఏడుగురు నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమయ్యారు. వారిలో కోలిన్ అకెర్మాన్, ఫ్రెడ్ క్లాసెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, షేన్ స్నేటర్, బ్రాండన్ గ్లోవర్, పాల్ వాన్ మీకెరెన్ ఉన్నారు. మరోవైపు వెటరన్ ఆల్ రౌండర్ వెస్లీ బరేసి ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. అదే విధంగా యువ ఆటగాడు ఆర్నవ్ జైన్ నెదర్లాండ్స్ తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఇక నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ మూడు వన్డేలు ఆడనుంది. రోటర్డ్యామ్ వేదికగా ఆగష్టు 16న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్కోసం పాకిస్తాన్ తమ జట్టును ప్రకటిచింది. నెదర్లాండ్స్ జట్టు: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓ డౌడ్, విక్రమ్ సింగ్, మూసా నదీమ్ అహ్మద్, టామ్ కూపర్, బాస్ డి లీడే, వెస్లీ బరేసి, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వివియన్ కింగ్మా, షరీజ్ అహ్మద్, అర్నవ్ జైన్ పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సల్మాన్ అలీ అఘా షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, జాహిద్ మహమూద్ చదవండి: డకౌట్ అయ్యానని ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ నా చెంపపై కొట్టాడు: టేలర్ -
11 ఏళ్లుగా నొప్పిని భరిస్తూ.. ఎట్టకేలకు
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఎమెషనల్ వీడియోతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఇటీవలే మోకాలి సర్జరీ కోసం అక్తర్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. మెల్బోర్న్లోని ఒక ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న అక్తర్ కోలుకుంటున్నాడు. కాగా అక్తర్ గత 11 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఒక రకంగా అక్తర్ క్రికెట్ నుంచి వైదొలగడానికి పరోక్షంగా ఇది కూడా ఒక కారణం. మొత్తానికి ఇన్నేళ్లకు మోకాలీ సర్జరీ చేయించుకున్న అక్తర్ కాస్త రిలీఫ్ అయ్యాడు. ఈ సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ.. ''11 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నా. వాస్తవానికి క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అయితే మోకాలి నొప్పితో మరో నాలుగైదేళ్లు ఆడి ఉంటే మాత్రం కచ్చితంగా వీల్‌చైర్‌కు పరిమితమయ్యేవాడిని. ఎలాగోలా ఇన్నేళ్లకు సర్జరీ చేయించుకున్నా. కాస్త నొప్పిగా ఉంది. మీ ప్రార్థనలు నేను తొందరగా కోలుకునేలా చేస్తాయని ఆశిస్తున్నా. ఇదే నా చివరి సర్జరీ కూడా కావాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ప్రస్తుతం షోయబ్ అక్తర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక షోయబ్ అక్తర్ పాకిస్తాన్ తరపున అన్ని ఫార్మాట్లు కలిపి 224 మ్యాచ్‌లాడి 444 వికెట్లు పడగొట్టాడు. Alhamdolillah, surgery went well. It will take some time to recover. Need your prayers. A special thanks to @13kamilkhan as well, he's a true friend who is looking after me here in Melbourne. pic.twitter.com/jCuXV7Qqxv — Shoaib Akhtar (@shoaib100mph) August 6, 2022 చదవండి: Kieron Pollard: చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో -
రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ సీనియర్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో యాసిర్ షా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యాసిర్ షా ఐదో స్థానానికి చేరుకున్నాడు. లంక సీనియర్ బ్యాట్స్‌మన్ ఏంజెల్లో మాథ్యూస్‌ను ఔట్ చేయడం ద్వారా యాసిర్ టెస్టుల్లో 237వ వికెట్‌ను దక్కించుకున్నాడు. తద్వారా అబ్దుల్ ఖాదీర్(236 వికెట్లు)ను దాటిన యాసిర్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక యాసిర్ షా కంటే ముందు పాక్ దిగ్గజ బౌలర్లు వసీమ్ అక్రమ్(414 వికెట్లు), వకార్ యూనిస్(373 వికెట్లు), ఇమ్రాన్ ఖాన్(362 వికెట్లు), దానిష్ కనేరియా(261) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక యాసిర్ షా పాకిస్తాన్ క్రికెట్లో పెను సంచలనం. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ►2014లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యాసిర్ షా పాకిస్తాన్ తరపున 50 వికెట్లు అత్యంత వేగంగా తీసిన బౌలర్‌గా నిలిచాడు. ►టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని(17 టెస్టుల్లో 100 వికెట్లు) అందుకున్న ఆటగాడిగా మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ►200 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న తొలి ఆటగాడిగా యాసిర్ షా చరిత్ర. 33 టెస్టుల్లో యాసిర్ 200 వికెట్లు సాధించాడు. అంతకముందు ఆస్ట్రేలియా బౌలర్ క్లారీ గ్రిమెట్(36 టెస్టుల్లో 200 వికెట్లు) పేరిట ఈ రికార్డు ఉంది. ►ఇప్పటివరకు యాసిర్ షా పాకిస్తాన్ తరపున 47 టెస్టుల్లో 237 వికెట్లు, 25 వన్డేల్లో 24 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ఫీట్‌ను 16 సార్లు అందుకున్నాడు. ఇక దాదాపు ఏడాది విరామం తర్వాత మ్యాచ్ ఆడుతున్న యాసిర్ షా లంకతో టెస్టులో మంచి ప్రదర్శననే ఇచ్చాడు. 21 ఓవర్లు వేసిన యాసిర్ షా 66 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. అజర్ అలీ (3), బాబర్ ఆజం(1) క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ అయింది. చండీమల్ 76 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మహీస్ తీక్షణ 38 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. యాసిర్ షా, హసన్ అలీ చెరో రెండు వికెట్లు తీశారు. -
పాకిస్థాన్ క్రికెట్‌ను 'అతను' భ్రష్టు పట్టిస్తాడు..!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాపై ఆ జట్టు మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ (పాక్ తరఫున 5 టెస్ట్‌లు, 2 వన్డేలు, ఓ టీ20 ఆడాడు) షాకింగ్ కామెంట్స్ చేశాడు. పీసీబీ అధ్యక్షుడిగా రమీజ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైనా చేసిందేమీ లేదని దుయ్యబట్టాడు. నాలుగు దేశాల టీ20 టోర్నీ (భారత్, పాక్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్), భారత్‌తో క్రికెట్ సంబంధాలు అంటూ హడావుడి చేస్తున్నాడే తప్ప ఈ ఏడాది కాలంలో అతను సాధించింది ఏమీ లేదని పెదవి విరిచాడు. రమీజ్ పీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేసిన ఓ మంచి పనైనా చూపించాలని సవాల్ విసిరాడు. పీసీబీ పరిస్థితి గత పాలకుల హయాంలో ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉందని, రమీజ్ వచ్చి కొత్తగా పొడిచిందేమీ లేదని విరుచుకుపడ్డాడు. రమీజ్ వచ్చే ఏడాది పీసీబీ ప్రణాళికలను వివరిస్తూ ప్రెస్‌మీట్ పెట్టిన నేపథ్యంలో తన్వీర్ ఈ మేరకు స్పందించాడు. రమీజ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీబీకి తన హయాం స్వర్ణయుగంలాంటిదని, తాను బాధ్యతలు చేపట్టాక ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేపట్టానని, పాక్ క్రికెట్‌ను తాను కొత్త పుంతలు తొక్కించానని గొప్పలు పోయాడు.జట్టు సెలక్షన్ విషయంలో పీసీబీ వ్యవహరిస్తున్న తీరును ఇటీవలే డానిష్ కనేరియా కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గతంతో పోలిస్తే పాక్ ఆటతీరు రమీజ్ హయాంలో కాస్త మెరుగు పడిందనే చెప్పాలి. గతేడాది కాలంలో పాక్ ఫార్మాట్లకతీతంగా ఓ మోస్తరు విజయాలు సాధిస్తుంది. చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! -
ఒకే జట్టులో కోహ్లి-బాబర్, బుమ్రా-అఫ్రిది..?
ప్రస్తుత తరంలో మేటి క్రికెటర్లుగా పరిగణించబడే విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, రోహిత్ శర్మలు ఒకే జట్టులో ఆడితే చూడాలని ఉందా..? అయితే మీ కోరిక నెరవేరే రోజు మరెంతో దూరంలో లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రత్యేక చొరవ తీసుకుని ఈ బ్యాటింగ్ దిగ్గజాలను ఒకే డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆసియా దేశాల క్రికెటర్లు ఓ జట్టులో, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి జరిగే ఆఫ్రో-ఆసియా క్రికెట్ కప్‌ను పునఃప్రారంభించాలని ఏసీసీ కసరత్తు చేస్తుంది. వివిధ కారణాల చేత 2007లో నిలిచిపోయిన ఈ టోర్నీని తిరిగి నిర్వహించేందుకు ఏసీసీ ప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తదితర క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఏసీసీ కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ తన్రాజ్ మీడియాకు వెల్లడించారు. ఈ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ అంగీకరిస్తే మిగతా దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని ప్రభాకరన్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ కనుక ఏసీసీ ప్రతిపాదనకు ఓకే చెబితే రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది లాంటి ప్రపంచస్థాయి క్రికెటర్లను ఒకే జట్టులో చూడవచ్చు. కాగా, ఈ టోర్నీ తొలిసారి 2005లో జరిగింది. నాడు షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్, సనత్ జయసూర్య లాంటి విధ్వంసకర ఆటగాళ్లు కలిసి ఆసియా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, జాక్ కలిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున ఆడారు. ఆసియా ఎలెవెన్ తరఫున భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల ఆటగాళ్లు ఆడగా.. ఆఫ్రికా ఎలెవెన్ తరఫున సౌతాఫ్రికా, కెన్యా, జింబాబ్వే దేశాల క్రికెటర్లు ఆడారు. చదవండి: పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. -
రెండేళ్ల క్రితం దూరమైంది.. పాక్ క్రికెటర్ ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం
పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీ ఇంట్లో సంతోషం వెల్లివెరిసింది. ఆసిఫ్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ సాధించాడు. గురువారం ఆసిఫ్ అలీ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆసిఫ్ ట్విటర్ వేదికగా.. తన చిట్టితల్లి వేసుకోబోయే వస్తువులను షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ''నా ఇంట్లోకి చిన్న దేవదూత అడుగుపెట్టింది.. వెల్కమ్ టూ వరల్డ్ స్వీట్హార్ట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆసిఫ్ అలీ పాకిస్తాన్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. 2018లో అరంగేట్రం చేసిన ఆసిఫ్ అలీ ఇప్పటివరకు 21 వన్డేల్లో 382 పరుగులు, 39 టి20ల్లో 435 పరుగులు సాధించాడు. రెండేళ్ల క్రితం మొదటి కూతురు మరణం.. ఆసిఫ్ అలీ ఇంట్లో రెండేళ్ల క్రితం విషాదం చోటుచేసుకుంది. తన రెండేళ్ల కూతురు నూర్ ఫాతిమా క్యాన్సర్ స్టేజీ-4తో పోరాడుతూ కన్నుమూసింది. మే 2019లో అమెరికాలో నూర్ ఫాతిమాకు చికిత్స అందించినప్పటికి వైద్యులు బతికించలేకపోయారు. కూతురు పోయిన బాధను దిగమింగుకొని ఆ ఏడాది పీఎస్ఎల్ 2019లో ఆసిఫ్ అలీ అద్బుత ప్రదర్శన నమోదు చేశాడు. కాగా రెండేళ్ల తర్వాత ఆసిఫ్ అలీ దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వడంతో నూర్ ఫాతిమా మళ్లీ పుట్టిందంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. Mere Ghar Ayee Aik Nanhi Pari!💓 Welcome to the World, Sweetheart!#blessed #blessedwithababygirl pic.twitter.com/R2dTGQ3gyk — Asif Ali (@AasifAli45) May 19, 2022 -
'షాహిద్ అఫ్రిది ఒక క్యారెక్టర్ లెస్.. అబద్ధాల కోరు'
''నేను పాకిస్తాన్ జట్టు నుంచి బయటికి వెళ్లడానికి షాహిద్ అఫ్రిది ప్రధాన కారకుడు.. అతనికి క్యారెక్టర్ అనేదే లేదు. నా గురించి జట్టు సభ్యులకు తప్పుగా చెప్పి వారి ముందు దోషిని చేశాడు. అతని నమ్మకద్రోహం నేను ఎప్పటికి మరిచిపోనూ'' -పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా 41 ఏళ్ల దానిష్ కనేరియా.. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై నిప్పులు చెరిగాడు. ఏఎన్ఐ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తాను జట్టు నుంచి బహిష్కరణకు గురవ్వడంలో అఫ్రిది పాత్ర ఉందంటూ తెలిపాడు. ''పాకిస్తాన్‌కు క్రికెట్ ఆడినంత కాలం షాహిద్ అఫ్రిది నన్ను హేళన చేసేవాడు. తోటి ఆటగాళ్ల ముందు అవమానపరుస్తూ మాట్లాడేవాడు. ఇద్దరం కలిసి చాలా ఏళ్లపాటు పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాం. అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు నన్ను ఎక్కువగా బెంచ్‌కే పరిమితం చేసేవాడు. దాని మూలంగా చాలా వన్డే మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. అంతేకాదు నేను హిందువునంటూ.. ఈ దేశంలో అతనికి చోటు లేదని.. జట్టు నుంచి బహిష్కరించాలని సహచరులకు నూరిపోసేవాడు. అతనొక అబద్దాల కోరు, అందరిని ప్రభావితం చేసే వ్యక్తి.. ఇంకా చెప్పాలంటే ఒక క్యారెక్టర్ లేని మనిషి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా క్రికెట్‌పైనే ఫోకస్ చేసేవాడిని. జట్టులో ఉన్నంతకాలం నన్ను ద్వేషించేవాడు. నేనంటే ఎందుకంత అసూయ అనేది నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఒక్కటి చెప్పగలను. పాకిస్తాన్ జట్టుకు ఆడడం నా అదృష్టంగా భావిస్తా.. నా జీవితంలో అది గొప్పది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 2009లో ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్‌షిప్ ప్రో లీగ్‌లో భాగంగా కనేరియా స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో 2012లో ఇంగ్లీష్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతనిపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని పీసీబీ కూడా సమర్థించింది. కాగా తనపై విధించిన జీవతకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పీసీబీకి మొరపెట్టుకున్నాడు. ''క్రికెట్లో ఫిక్సింగ్ చేసిన ఎంతో మంది బయట యథేచ్చగా తిరుగుతున్నారు. కానీ నాపై ఉన్న నిషేధాన్ని మాత్రం పీసీబీ తొలగించలేదు. ఒక దేశానికి క్రికెట్ ఆడాను.. నిషేధం తొలగిస్తే ప్రైవేట్ లీగ్‌ల్లో ఆడాలని ఉంది. ఎలాగూ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం పోయింది. పీసీబీని నేను అడిగేది ఒక్కటే.. నాపై బ్యాన్ ఎత్తేయండి.. నా పనేదో నేను చూసుకుంటా'' అని పేర్కొన్నాడు. కాగా దానిష్ కనేరియా 2000 సంవత్సరం నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. పాక్ తరపున 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు. -
పాక్ మాజీ క్రికెటర్ అకాల మరణం.. పీసీబీ దిగ్భ్రాంతి
Former Pakistan Spinner Mohammad Hussain Passed Away: పాకిస్థాన్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. 45 ఏళ్ల వయసులో ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ హుస్సేన్ ఆకాల మరణం చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు డయాబెటిక్ కూడా అయిన హుస్సేన్.. సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. హుస్సేన్ అకాల మరణంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ.. హుస్సేన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. The PCB is saddened by the passing of former Pakistan Test all-rounder Mohammad Hussain and offers its sincerest condolences to his family and friends. pic.twitter.com/f4q4zSUiXj — Pakistan Cricket (@TheRealPCB) April 11, 2022 లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్, లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన మహ్మద్ హుస్సేన్ 1996-98 మధ్యలో పాకిస్థాన్ తరఫున 2 టెస్ట్‌లు, 14 వన్డేలు ఆడాడు. ఇందులో 172 పరుగులు సాధించి, 16 వికెట్లు పడగొట్టాడు. ఇండిపెండెన్స్ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హుస్సేన్ 4 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా రాణించలేకపోయిన హుస్సేన్.. పాక్ దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 131 మ్యాచ్‌ల్లో 454 వికెట్లు సాధించాడు. కాగా, 1997 సహారా కప్ (భారత్-పాక్) సందర్భంగా శివ్ కుమార్ అనే భారత సంతతి కెనడియన్‌పై జరిగిన దాడి ఘటనలో ఇంజమామ్ ఉల్ హాక్‌తో పాటు మహ్మద్ హుస్సేన్ నిందితుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్ సందర్భంగా శివ్ కుమార్‌పై ఇంజమామ్ బ్యాట్‌తో దాడి చేయగా, 12వ ప్లేయర్‌గా ఉన్న మహ్మద్ హుస్సేన్ ఇంజమామ్‌కు బ్యాట్ అందించి సహకరించాడు. చదవండి: IPL 2022: వరుస ఓటములతో కుంగిపోయిన సీఎస్కేకు మరో భారీ షాక్..! -
PAK VS AUS 2nd Test: పాక్ జట్టులో కరోనా కలకలం
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని కీలక ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఫహీమ్ కరాచీ వేదికగా ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు దూరం కానున్నాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా తొలి టెస్ట్‌కు కూడా ఆడని ఫహీమ్ను ఐదు రోజుల ఐసోలేషన్‌కు తరలించినట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఫహీమ్ కంటే ముందు పాక్ పేసర్ హరీస్ రౌఫ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో అతను తొలి టెస్ట్ ద్వారా అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా, 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఆసీస్.. పర్యటనలో భాగంగా 3 టెస్ట్‌లు, 3 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా జరిగిన తొలి మ్యాచ్ నిర్జీవమైన పిచ్ కారణంగా పేలవ డ్రాగా ముగిసింది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై ఇరు జట్ల ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఇమామ్ ఉల్ హక్ (157; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజహర్ అలీ (185; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు భారీ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 476/4 వద్ద డిక్లేర్ చేసింది అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆతిధ్య జట్టుకు ధీటుగా బదులిచ్చింది. ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు నలుగురు ( ఉస్మాన్ ఖ్వాజా (97), వార్నర్ (68), లబూషేన్ (90), స్టీవ్ స్మిత్ (78) అర్ధ సెంచరీలతో రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగులకే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో నౌమాన్ అలీ 6 వికెట్లు, షాహీన్ అఫ్రిది 2, నసీమ్ షా, సాజిద్ ఖాన్లు తలో వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (242 బంతుల్లో 136 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్), ఇమామ్ ఉల్ హాక్ (223 బంతుల్లో 111 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విజృంభించడంతో ఆఖరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 252 పరుగులు చేసింది. చదవండి: PAK Vs AUS: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పాక్ ఓపెనర్ -
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సమరం
-
ఇదేం చిత్రం.. కోహ్లి సెంచరీ కోసం పాక్ ఆటగాళ్ల మొక్కులు
టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లి సెంచరీ మార్క్ సాధించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. కోహ్లి సెంచరీ లేకుండా ఇన్నేళ్లు ఉండడం ఇదే తొలిసారి. అతను ఎప్పుడు సెంచరీ కొడతాడా అని క్రికెట్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లి అభిమానులే గాక.. పాక్ క్రికెటర్లు సహా ఆ దేశ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లి సెంచరీ కోసం పరితపిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని పీఎస్ఎల్(పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్)లో పాల్గొంటున్న ఇస్లామాబాద్ యునైటెడ్ స్ట్రాటెజీ మేనేజర్ హసన్ చీమా తన ట్విటర్లో వెల్లడించాడు. చదవండి: ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన ఐపీఎల్.. రెండో స్థానంలో సమ్మర్ ఒలింపిక్స్ ''పీఎస్ఎల్ గురించి ఎక్కువగా ట్వీట్ చేయకూడదు అనుకున్నా. కానీ ఒక విషయం నాకు జీర్ణం కావడం లేదు. పీఎస్ఎల్లో ఆడుతున్న పాక్ ఆటగాళ్ల దగ్గర నుంచి అభిమానుల వరకు ఒక విషయాన్ని బలంగా కోరుకుంటున్నారు. అదేంటంటే.. కోహ్లి 71వ సెంచరీ అందుకోవాలని. దీనికోసం పాక్ ఆటగాళ్లు సహా ఫ్యాన్స్ మొక్కుకుంటున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. పేరుకే ప్రత్యర్థులం కానీ క్రికెట్లో రాణించే ఆటగాడికి ఏ దేశం నుంచైనా అభిమానులు ఉంటారన్న దానికి కోహ్లియే ఉదాహరణ. కోహ్లి కచ్చితంగా 71వ సెంచరీ సాధిస్తాడు.'' అని ట్వీట్ చేశాడు. ఇది విన్న టీమిండియా అభిమానులు.. ''ఇదేం చిత్రమో.. బయటకు మాత్రం మా చేతిలో పాక్ ఓడిపోతే.. మన దేశాన్ని తిడతారు.'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక కోహ్లి ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకముందే వన్డే, టి20 కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నాడు. ఇకపై సీనియర్ బ్యాట్స్‌మన్‌గా జట్టుకు సేవలందించనున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో కోహ్లి పర్వాలేదనిపించాడు. అందరు విఫలమైనచోటు తాను కాస్త సక్సెస్ అయ్యాడు. కేప్‌టౌన్ టెస్టులో కోహ్లి సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ 21 పరుగుల తేడాతో ఆ ముచ్చట తీరకుండానే 79 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే , మూడో వన్డేలో హాఫ్ సెంచరీలు సాధించినప్పటికి.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. 71వ సెంచరీ సాధిస్తాడని ఎదురుచూస్తున్న కోహ్లి అభిమానుల కల.. విండీస్‌తో సిరీస్‌లోనైనా తీరుతుందేమో చూడాలి. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా వెస్టిండీస్‌తో సిరీస్ ఆడనుంది. చదవండి: సిక్స్ కొడితే ఫైనల్‌కు.. బౌలర్‌కు హ్యాట్రిక్; ఆఖరి బంతికి ట్విస్ట్ -
2021 అవార్డులను ప్రకటించిన ఐసీసీ.. జాబితాలో పాక్ ప్లేయర్ల హవా
గతేడాది అన్ని ఫార్మాట్లలో అదరగొట్టిన పాక్ క్రికెటర్లు ఐసీసీ అవార్డులను కొల్లగొట్టారు. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల వన్డే(బాబర్ ఆజమ్), టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్(మహ్మద్ రిజ్వాన్), క్రికెటర్ ఆఫ్ ద ఇయర్(షాహీన్ అఫ్రిది) అవార్డులతో పాటు ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును(ఫాతిమా సనా) సొంతం చేసుకున్నారు. అంతకుముందు ఐసీసీ ప్రకటించిన వన్డే, టీ20 జట్లకు సైతం పాక్ ఆటగాడే(బాబర్ ఆజమ్) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ రెండు జట్లలో ఒక్క భారత ఆటగాడికి కూడా ప్రాతినిధ్యం లభించకపోవడం విశేషం. Congratulations to #BabarAzam, #LizelleLee and #JoeRoot on winning the prestigious ICC Awards for their performances in 2021. pic.twitter.com/sEqaIMvOqf — Circle of Cricket (@circleofcricket) January 24, 2022 అయితే, ఐసీసీ టెస్ట్ జట్టులో మాత్రం ముగ్గురు టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్‌లు టెస్టు జట్టులో ఉన్నారు. ఇదిలా ఉంటే, పురుషులు, మహిళల విభాగాల్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఐసీసీ అవార్డులకు ఎంపిక చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది. మూడు ఫార్మాట్లలో రాణించినందుకు గాను ఆమెకు.. ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డు లభించింది. A year to remember 🤩 Smriti Mandhana's quality at the top of the order was on full display in 2021 🏏 More on her exploits 👉 https://t.co/QI8Blxf0O5 pic.twitter.com/3jRjuzIxiT — ICC (@ICC) January 24, 2022 2021 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన అవార్డుల జాబితా : - ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - జో రూట్ (ఇంగ్లాండ్) - ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) - ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) - ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - షాహీన్ అఫ్రిది (పాకిస్థాన్) - ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - జన్నేమన్ మలాన్ (సౌతాఫ్రికా) - ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - జీషన్ మసూద్ (ఒమన్) - ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఈయర్ - మారియస్ ఎరాస్మస్ - ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - స్మృతి మంధాన (ఇండియా) - ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - టామీ బ్యూమోంట్ (ఇంగ్లాండ్) - ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - ఫాతిమా సనా (పాకిస్థాన్) - ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - ఆండ్రియా (ఆస్ట్రియా) (ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఈయర్, ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు ఇంకా ప్రకటించాల్సి ఉంది) చదవండి: ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు.. -
టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021 ఎవరంటే..!
Mohammad Rizwan Named T20 Cricketer Of The Year: 2021వ సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టీ20 క్రికెటర్ అవార్డుకు పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఆదివారం ప్రకటించింది. గతేడాది పొట్టి ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రిజ్వాన్.. 29 మ్యాచ్‌ల్లో 73.66 సగటున 1326 పరుగులు బాదాడు. అతని స్ట్రయిక్ రేట్ 134.89గా ఉంది. బ్యాటింగ్‌లో మెరుపులతో పాటు వికెట్‌కీపింగ్‌లోనూ సత్తా చాటిన రిజ్వాన్.. గతేడాది పాక్ సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. Sheer Consistency, indomitable spirit and some breathtaking knocks 🔥 2021 was memorable for Mohammad Rizwan 👊 More 👉 https://t.co/9guq9xKOod pic.twitter.com/6VZo7aaRIA — ICC (@ICC) January 23, 2022 టీ20 ప్రపంచకప్ 2021లో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచిన అతను.. తన జట్టు సెమీస్ చేరేందుకు తోడ్పడ్డాడు. కెరీర్లో ఇప్పటివరకు 19 టెస్ట్‌లు, 41 వన్డేలు, 55 టీ20లు ఆడిన రిజ్వాన్.. 3500కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, గతేడాది అసోసియేట్ దేశాల అత్యుత్తమ టీ20 క్రికెటర్ అవార్డును ఒమన్‌కు చెందిన జీషన్ మక్సూద్ గెలుచుకున్నాడు. ఒమన్ జట్టును సమర్ధవంతంగా నడిపించడంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించినందుకు గాను మక్సూద్ను ఈ అవార్డు వరించింది. చదవండి: ICC Award: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ఘనత.. టేక్ ఏ బౌ అన్న ఐసీసీ -
పాకిస్థాన్ స్పిన్నర్‌పై అత్యాచారం కేసు నమోదు..!
Yasir Shah Accused In Rape Case: అత్యాచారం కేసులో పాకిస్థాన్ వెటరన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. యాసిర్, అతని స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక చేసిన ఆరోపణల నేపథ్యంలో యాసిర్‌పై కేసు బుక్కైంది. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవాలని యాసిర్ ఫోన్ చేసి బెదిరించినట్లు ఆ అమ్మాయి పేర్కొంది. యాసిర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. త్వరలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కాగా, 35 ఏళ్ల యాసిర్ షా 46 టెస్టుల్లో 235 వికెట్లు సాధించి అత్యంత విజయవంతమైన పాక్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. షా వన్డేల్లో సైతం రాణించాడు. 25 వన్డేల్లో 24 వికెట్లు సాధించాడు. చదవండి: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! -
టెస్టులకు గుడ్‌బై చెప్పిన పాక్ క్రికెటర్
Usman Shinwari Announces Retirement From Test Cricket.. పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ షిన్వరీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని షిన్వరీ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. '' ఇటీవలే వెన్నునొప్పి నుంచి కోలుకున్నా. వేగంగా కోలుకోవడంలో సహాయపడిన స్పోర్ట్స్ ఫిజియో అహ్మదుల్లాకు కృతజ్క్షతలు. ఫిజియో, డాక్టర్లు సూచన మేరకు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. సుధీర్ఘంగా బౌలింగ్ చేస్తే గాయాలు మళ్లీ తిరగబెట్టే అవకాశాలున్యాయని వైద్యులు హెచ్చరించారు. అందుకే టెస్టులకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇక వన్డేలు, టి20లపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతానంటూ'' చెప్పుకొచ్చాడు 27 ఏళ్ల షిన్వరీ పాకిస్తాన్ జట్టు తరపున 17 వన్డేల్లో 34 వికెట్లు, 16 టి20ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక తన కెరీర్లో ఒకే ఒక టెస్టు ఆడిన షిన్వరీ 2013లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇక 33 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీసిన షిన్వరీ రెండుసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 2019 డిసెంబర్లో ఆఖరిసారిగా పాక్ జట్టు తరపున ఆడాడు. -
భారత్ వర్సెస్ పాకిస్తాన్ :భావోద్వేగాల సమరం
-
పాక్ కోచ్‌గా చచ్చినా చేయను: వసీం అక్రమ్
వసీం అక్రమ్.. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. 1992 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్రమ్.. 1999 వన్డే వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌గా పాకిస్తాన్‌ను ఫైనల్ చేర్చాడు. దిగ్గజ బౌలర్‌గా పేరు పొందిన అక్రమ్.. గతంలో వ్యాఖ్యాతగానూ పని చేశాడు. అయితే ఇంత అనుభవం ఉన్న అక్రమ్ ఏనాడు పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు ముందుకు రాలేదు. దీనిపై చాలా మందికి సందేహం ఉండగా.. తాజాగా ఈ యార్కర్ దిగ్గజం క్లారిటీ ఇచ్చాడు. పాకిస్తాన్ కోచ్ పదవి చేపట్టకపోవడంపై అక్రమ్ ఒక ఇంటర్య్వూలో పెదవి విప్పాడు. క్రికెట్ కార్నర్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో తన అనుభవాలను పంచుకున్నాడు. ''పాకిస్తాన్‌కు కోచ్‌గా ఎంపికైతే ఫ్యామిలీకీ దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేగాక సంవత్సరంలో 200 నుంచి 250 రోజులు పాకిస్తాన్ క్రికెట్‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఇక పాక్ జట్టు ఓడిపోతే అభిమానులు చేసే అల్లరి నాకు అస్సలు ఇష్టం ఉండదు. వారి ప్రవర్తన నన్ను పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవికి దూరంగా ఉండేలా చేసింది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అఫ్కోర్స్.. ఈ వ్యాఖ్యలు చేయడానికి నేనేం ఫూల్‌ను కాదు. పాకిస్తాన్ ఏ సిరీస్‌లో ఓడిపోయినా సోషల్ మీడియా వేదికగా కోచ్‌ను, సీనియర్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వాళ్లు పెట్టే కామెంట్స్ చిరాకు కలిగిస్తాయి. చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్ మ్యాచ్‌లో కోచ్ ఆడడు.. ప్లేయర్స్ మాత్రమే ఆడుతారు. కోచ్ అనేవాడు ఆటగాళ్లకు సలహాలు మాత్రమే ఇస్తాడు. ఈ విషయం తెలుసుకోకుండా అనవసరంగా కోచ్‌ల మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తారు. మా దేశంలో జట్టు ఓడిపోవడం కంటే కోచ్‌లపై కక్షసాధింపు చర్యలే ఎక్కువ ఉంటాయి. అందుకే పాకిస్తాన్ జట్టుకు కోచ్ పదవిలో ఎక్కువకాలం ఎవరూ ఉండరు. ఇలాంటివి బయటిదేశాలలో ఎక్కువగా కనిపించవు. నా దృష్టిలో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే నేను తట్టుకోలేను. క్రికెట్‌ను ఎంజాయ్ చేసేవాళ్లను.. ఇష్టంతో చూసేవాళ్లను ఎంత ప్రేమిస్తానో.. నాతో తప్పుగా ప్రవర్తించేవారిపై అంత కోపంతో ఉంటాను. అందుకే పాకిస్తాన్ క్రికెట్లో కోచ్ పదవిని ఎప్పుడు ఆశించలేదు.. ఆశించబోను కూడా'' అని చెప్పుకొచ్చారు. చదవండి: T20 World Cup: కచ్చితంగా వార్నరే ఓపెనింగ్ చేస్తాడు: ఫించ్ వసీం అక్రమ్ తన 19 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో పాక్ తరపున 104 టెస్టుల్లో 414 వికెట్లు, 356 వన్డేల్లో 502 వికెట్లు తీశాడు. ఇక క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అంతేకాదు ఐపీఎల్‌లోనూ కేకేఆర్ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేశాడు. ఇక ఇటీవలే పాకిస్తాన్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మిస్బాఉల్ హక్ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి వకార్ యూనిస్ కూడా వైదొలిగాడు. టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని పాక్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్.. మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌లను తాత్కాలిక కోచ్‌లుగా పీసీబీ ఎంపిక చేసింది. ఇక టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న టీమిండియాతో ఆడనుంది. చదవండి: అసలైన టీ20 క్రికెటర్ అతడే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
కివీస్ సిరీస్ రద్దు.. కావాలనే మాపై కుట్రలు పన్నారు
Pakistan Interior Minister Says International Conspiracy.. పాకిస్తాన్లో సరైన భద్రత లేదంటూ న్యూజిలాండ్ జట్టు చివరి నిమిషంలో సిరీస్‌ను రద్దు చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. మరికొద్ది నిమిషాల్లో తొలి మ్యాచ్ మొదలవుతుందనగా కివీస్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవడం సగటు అభిమానిని షాక్‌కు గురిచేసింది. ఈ ఊహించని హఠాత్పరిణామానికి పీసీబీ కూడా ఉలిక్కిపడింది. చాలా సంవత్సరాల తర్వత ఒక విదేశీ జట్టు మా గడ్డపై అడుగుపెట్టిందన్న ఆనందం పీసీబీకి మిగల్లేదు. ఒక్కసారిగా అయోమయంలో పడింది... ఉన్నపళంగా ఈ నిర్ణయానికి గల కారణం ఏంటో చెప్పాలంది. లోపాలుంటే సరిదిద్దుకుంటామంది. భద్రత ఏర్పాట్లను మరింత పటిష్టపరుస్తామంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చదవండి: పాకిస్తాన్లో భద్రత లేదంటూ... కివీస్ పర్యటన రద్దు! పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కూడా కివీస్ సిరీస్ రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. '' మాపై కావాలనే కుట్రలు పన్నుతున్నారు. కొన్ని అతీత శక్తులు మా దేశంలో క్రికెట్ జరగకుండా అడ్డుపడుతున్నాయి. అఫ్గానిస్తాన్‌లో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం మా దేశంపై పనిగట్టుకొని బురద జల్లుతున్నారు. ఉన్న పళంతగా కివీస్ సిరీస్ రద్దు చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. వాళ్లు భద్రతా కారణాల రిత్యా అనే సాకు చూపుతున్నారు.. కానీ భద్రత విషయంలో పీసీబీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కివీస్ బోర్డుకు ఎటువంటి నష్టం కలగకుండా ఆటగాళ్లను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చింది. అయినప్పటికీ భద్రత అనే అంశాన్ని లేవనెత్తి మమ్మల్ని కించపరిచారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. NZ just killed Pakistan cricket 😡😡 — Shoaib Akhtar (@shoaib100mph) September 17, 2021 Following points for New Zealand to remember: ° 9 Pakistanis were killed in the Christchurch attack. ° Pakistan stood strong with New Zealand. ° Pakistan toured New Zealand in the worst of Covid circumstances regardless of the crude treatment by NZ authorities on that tour. — Shoaib Akhtar (@shoaib100mph) September 17, 2021 కాగా న్యూజిలాండ్ జట్టు సిరీస్‌ను అర్థంతరంగా రద్దు చేసుకోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. కాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కివీస్ సిరీస్ రద్దు చేసుకోవడంపై ట్విటర్లో ఘాటుగా స్పందించాడు. ''న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ క్రికెట్‌ను చంపేసింది.అర్థంతరంగా సిరీస్ రద్దు చేసుకున్న కివీస్ ముందు నేను కొన్ని ప్రశ్నలు ఉంచుతున్నా. క్రైస్ట్‌చర్చిలో జరిగిన పేలుడులో 9 మంది పాకిస్తానీలు చనిపోయారు. మరి అప్పుడు మీకు భద్రత గుర్తుకురాలేదా..? అంతేగాక ఈ విషయంలో అప్పట్లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌కు మద్దతుగా నిలిచింది. కరోనా సంక్షోభం జోరుగా ఉన్న సమయంలో మేం మీ దేశంలో పర్యటించాం. అప్పడు మా ఆటగాళ్లకు మీ అధికారులు ఇచ్చిన భద్రత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..'' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా కివీస్ పాక్ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టి20ల సిరీస్ ఆడాల్సింది. చదవండి: ENG TOUR OF PAK IN DOUBT: గంటల వ్యవధిలో పాక్ క్రికెట్‌కు మరో షాక్.. ? -
కెరీర్లో చాలా ఎదగాలి.. పెళ్లికి తొందరేంలేదు: అఫ్రిదికి కాబోయే అల్లుడు
లాహోర్: పాకిస్తాన్ యువ సంచలనం.. బౌలర్ షాహిన్ అఫ్రిది తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. కెరీర్లో ఇంకా చాలా ఎదగాల్సి ఉందని.. పెళ్లికి ఇప్పుడేం తొందర లేదని తెలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కూతురు అక్సా అఫ్రిదితో వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి పెళ్లి జరగబోయేది నిజమేనని.. ఎప్పుడు చేయాలనేది మా రెండు కుటుంబాలు మాట్లాడుకుంటామని షాహిద్ అఫ్రిది కూడా మీడియాకు గతంలోనే వెల్లడించాడు. తాజాగా షాహిన్ అఫ్రిది తన పెళ్లిపై వస్తున్న వార్తలకు మరోసారి చెక్ పెట్టాడు. ''నా పెళ్లికి ఇప్పుడేం తొందర లేదు. కెరీర్లో ఇది నాకు కీలక సమయం. అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ బౌలర్‌గా మారుతున్న సమయం. ఇలాంటి దశలో ఎలా ముందుకు వెళ్లాలన్నది మాత్రమే ఆలోచిస్తున్నా. బౌలింగ్‌లో రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. జట్టు తరపున ఆడామా.. మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టామా.. గెలిపించామా అన్న చందంగా నా కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నా. బౌలింగ్‌లో మంచి ఫాం కనబరిస్తే రికార్డులు వాటంతట అవే వస్తాయి. నాకు తెలిసి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటూ జట్టుకు సుధీర్ఘ కాలం పాటు సేవలందించాలని అనుకుంటున్నా. ఇక రమీజ్ రజాను పీసీబీ చైర్మన్‌ను చేయడంపై సంతోషంగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక షాహిన్ అఫ్రిది ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదుగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ మంచి ఫామ్ కనబరుస్తున్న షాహిన్ ఇటీవలే విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లు తీసిన అఫ్రిది మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా షాహిన్ అఫ్రిది పాకిస్తాన్ తరపున 19 టెస్టుల్లో 76 వికెట్లు, 28 వన్డేల్లో 53 వికెట్లు, 30 టీ20ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఆ క్రికెటర్‌తోనే నా కూతురు పెళ్లి: పాక్ మాజీ క్రికెటర్ CPL 2021: షెఫర్డ్ అద్భుత స్పెల్.. సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ -
10 వికెట్ల ప్రదర్శనతో 10 స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-10లోకి..
దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాక్ ఆటగాళ్లు దుమ్మురేపారు. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న అనంతరం విడుదలైన ఈ ర్యాంకింగ్స్‌లో పాక్ సంచలన పేసర్ షాహిన్ అఫ్రిది, రెండో టెస్ట్ సెంచరీ హీరో ఫవాద్ ఆలమ్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తమతమ స్థానాలను మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ ర్యాంకులను సాధించారు. విండీస్‌తో రెండో టెస్ట్‌లో పది వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షాహిన్ అఫ్రిది ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ స్థానానికి ఎగబాకగా, బాబర్ ఆజమ్ ఓ ప్లేస్ మెరుగుపర్చుకుని 7వ స్థానానికి, ఫవాద్ ఆలమ్ 34 స్థానాలు మెరుగుపర్చుకుని 21వ ప్లేస్‌కు ఎగబాకారు. Shaheen Afridi launches up in the @MRFWorldwide ICC Men’s Test Bowling rankings after his stellar series in the West Indies 🚀 Full list: https://t.co/zWeR1wwvYA pic.twitter.com/jnAesHzo9v — ICC (@ICC) August 25, 2021 బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు టాప్-10లో తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. కోహ్లి(776), రోహిత్(773) ఐదు, ఆరు స్థానాల్లో నిలువగా, పంత్(724) ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(901) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(893) రెండో స్థానాన్ని, ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్(891) మూడో ప్లేస్‌ను పదిలం చేసుకున్నారు. Pakistan captain Babar Azam has climbed a spot on the @MRFWorldwide ICC Men’s Test Batting rankings ⬆️ Full list: https://t.co/17s2PmICbp pic.twitter.com/uFHHbpeRAE — ICC (@ICC) August 25, 2021 ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ కేటగిరీలో ఆసీస్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 848 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వీరి తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ పేసర్ సౌథీ(824), ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(816), కివీస్ పేసర్ నీల్ వాగ్నర్(810), ఇంగ్లండ్ స్టార్ పేసర్ అండర్సన్(800) వరుసగా మూడు, నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. చదవండి: కోహ్లి, రూట్ కొట్టుకున్నంత పని చేశారట..! -
ముద్దులు తర్వాత, ముందు వికెట్లెలా తీయాలో ఆలోచించు..
Shoaib Akhtar On Afridi: ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకున్న పాక్, ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో పాక్ వైఫల్యాలపై ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా పాక్ పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న షాహిన్ అఫ్రిదిపై ఆయన నిప్పులు చెరిగారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టిన షాహిన్.. వికెట్లు తీయడం కంటే ఫ్లైయింగ్ కిస్లకే ఎక్కువ సమయం కేటాయించాడని చురకలంటించాడు. ముద్దులు, కౌగిలింతలు పక్కకు పెట్టి, ముందు వికెట్లు ఎలా తీయాలో ఆలోచించాలని ఘాటుగా మందలించాడు. ఒక్క వికెట్ పడగొట్టగానే ఫ్లైయింగ్ కిస్‌లు పెట్టడంలో అర్ధం లేదని, ఐదు వికెట్ల ప్రదర్శన తర్వాత ఇలా చేస్తే బాగుంటుందని పంచ్‌ల వర్షం కురిపించాడు. సిరీస్‌కు ముందు సరిపడా సమయం లేదని సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదని హితవు పలికాడు. మ్యాచ్‌కు కేవలం రెండున్నర రోజులు ముందే ఇంగ్లండ్ జట్టు అక్కడికి వచ్చింది. వారు కలిసి జట్టుగా ఆడగలిగినప్పుడు మీకేమైందని నిలదీశాడు. ఇంగ్లండ్ అకాడమీ టీంతో ఓడిపోవడానికి సిగ్గు లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా ఆయన పాక్ బ్యాటింగ్ లైనప్‌పై కూడా ధ్వజమెత్తాడు. బంతికి ఒక పరుగు చేయాల్సిన స్థితిలోనూ అంత కష్టపడడం ఏంటని ప్రశ్నించాడు. ఇది పాక్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలానే ఆడితే భవిష్యత్తులో పాక్ క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులుండరన్నాడు. పాక్ పేలవ ప్రదర్శన ఇలానే కొనసాగితే బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు 3-0తో ఇంగ్లండ్ చేతిలో ఓడడం ఖాయమని జోస్యం చెప్పాడు. ఇదిలా ఉంటే, పాక్ జట్టు తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో, రెండో వన్డేలో 52 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే రేపు బర్మింగ్‌హామ్‌లో జరుగనుంది. -
ఇంగ్లండ్ పేసర్ దెబ్బ; తొలి వన్డేలో ఘన విజయం
కార్డీఫ్: కార్డీఫ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ పై ఇంగ్లండ్ 9 వికెట్ల తేడా తో ఘనవిజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ షకీబ్ మహమూద్ దెబ్బకు 141 పరుగులకే కూప్పకులిపోయింది. ఆ తర్వాత 142 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ డేవిడ్ మలన్ (68), జాక్ క్రాలే (58) అజేయంగా అర్ధ సెంచరీలు సాధించడంతో 21.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా సాధించింది. జాక్ క్రాలే అరంగేట్ర మ్యాచ్ లోనే ఆర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఫాస్ట్ బౌలర్ షకీబ్ మహమూద్ సహాయంతో ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 141 పరుగులకే పాకిస్థాన్‌ను కట్టడి చేసింది. షకీబ్ 42 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. షకీబ్ మహమూద్తో పాటు లూయిస్ గ్రెగొరీ, మాట్ పార్కిన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.తొలి వన్డే కు ముందు ఇంగ్లాండ్ ప్రధాన ఆటగాళ్లు కొంత మంది కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో జట్టు సభ్యులందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 15 మంది ఆటగాళ్లుతో కొత్త జట్టును ప్రకటించింది. ఇందులో ఏకంగా తొమ్మిది మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్‌కు యువ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. -
కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌ని అంటున్న ప్రముఖ పాక్ క్రికెటర్ భార్య..
ఇస్లామాబాద్: టీమిండియా డైనమిక్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలి కాలంలో అతనికి దాయాది దేశమైన పాక్‌లోనూ విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో కోహ్లీని మాకిచ్చేయండి అంటూ పాక్ యువతి రిజ్లా రెహాన్ తెగ హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత చాలా మంది పాక్ అమ్మాయిలు.. బహిరంగంగా కోహ్లీకి లవ్ ప్రపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ అమ్మాయి అయితే ఏకంగా స్టేడియంలోనే విరాట్ నన్ను పెళ్లి చేసుకుంటావా..? అంటూ ప్లకార్డ్‌ని ప్రదర్శించింది. తాజాగా కోహ్లీ అభిమానుల జాబితాలో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భార్య షామియా ఆర్జూ కూడా చేరింది. ఇటీవల, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన షామియా.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని వెల్లడించంది. ‘‘నీ ఫేవరెట్ బౌలర్ కచ్చితంగా హసన్ అలీనే అయ్యుంటాడు. మరి నీ ఫేవరెట్ బ్యాట్స్‌మెన్ ఎవరు.. ?’’ అని ఆ నెటిజన్ ప్రశ్నించడంతో.. ఆమె టక్కున విరాట్ కోహ్లీ పేరు చెప్పింది. ఇదిలా ఉంటే, షామియా స్వస్థలం భారత్‌లోని హర్యానా రాష్ట్రం. వాళ్ల ఫ్యామిలీ ప్రస్తుతం ఢిల్లీలో సెటిలైంది. ఎమిరేట్ ఎయిర్‌లైన్స్‌లో ప్లైయిట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న షామియాని మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా హసన్ అలీ మూడేళ్ల క్రితం దుబాయ్‌లో కలిశాడు. కొన్ని రోజులు ఫ్రెండ్స్‌గా ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అప్పట్లో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులు దుబాయ్‌లో పార్టీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. చదవండి: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్ వేరు -
అఫ్రిది కూతురితో షాహిన్ అఫ్రిది నిశ్చితార్థం!
కరాచీ: పాకిస్తాన్ యువ పేసర్ షాహిన్ అఫ్రిది త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. అయితే అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పెద్ద కూతురు అక్సా అఫ్రిది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇరువురు క్రికెటర్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే పాకిస్తానీ లోకల్ మీడియా అందించిన వివరాలు ప్రకారం.. షాహిద్ అఫ్రిది తండ్రి అయాజ్ ఖాన్ పెళ్లి విషయమై షాహిద్ కుటుంబం వద్ద ప్రస్తావించారని..అందుకు వారు ఒప్పుకున్నట్లుగా సమాచారం. అయితే షాహిన్ ఇప్పుడిప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్నాడని.. మా కూతురు అక్సా ఇంకా చదువుతుందని.. ఇప్పట్లో ఎంగేజ్మెంట్ ప్రస్తావన లేదని ఆఫ్రిది కుటుంబవర్గం తెలిపింది. అయితే వచ్చే రెండేళ్లలో మాత్రం వీరిద్దరి పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇవన్నీ ఒట్టి పుకార్లేనని.. వారి కుటుంబాల మధ్య పెళ్లికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదంటూ ట్విటర్లో వార్తలు వచ్చాయి. దీనిపై పాకిస్తానీ జర్నలిస్ట్ ఇతిషామ్ ఉల్ హక్ స్పందిస్తూ.. ‘షాహిన్ ఆఫ్రిది, అక్సా అఫ్రిది నిశ్చితార్థం నిజమే.. రూమర్లు కాదని.. ఇరు కుటుంబాలు ఇప్పటికే అంగీకరించాయి. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుంది. అయితే పెళ్లి మాత్రం అక్సా చదువు పూర్తయిన తర్వాత జరగనుంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. కాగా షాహిన్ అఫ్రిదితో మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. షాహిన్ లాహోర్ క్యూలాండర్స్‌కు.. షాహిద్ అఫ్రిది ముల్తాన్ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా షాహిన్ లీగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. చదవండి: వారు సహకరిస్తే బాగుండు.. సుందర్ తండ్రి ఎమోషనల్ దేవుడా.. పెద్ద గండం తప్పింది The reason behind this tweet is to clarify the suspicion caused by social media. Respect to both families; please do await their own official announcements as they are currently in talks.I would like to request all individuals to respect their privacy during this auspicious time. https://t.co/65IRygDxUw — Ihtisham Ul Haq (@iihtishamm) March 6, 2021 -
న్యూజిలాండ్‌దే టి20 సిరీస్
హామిల్టన్: బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్ (63 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ కేన్ విలియమ్సన్ (42 బంతుల్లో 57 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీలతో చెలరేగడంతో పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కివీస్ 2–0తో గెలుచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. మొహమ్మద్ హఫీజ్ (57 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. హఫీజ్ ఒంటరి పోరాటం చేయగా... మిగతా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ సౌతీ 4 వికెట్లతో చెలరేగాడు. జేమ్స్ నీషమ్, ఇష్ సోధి చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 164 పరుగులు చేసి గెలుపొందింది. గప్టిల్ (11 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. సీఫెర్ట్, విలియమ్సన్ రెండో వికెట్‌కు అజేయంగా 95 బంతుల్లో 124 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అష్రఫ్‌కు ఒక వికెట్ దక్కింది. నామమాత్రమైన మూడో టి20 మంగళవారం జరుగుతుంది. -
కివీస్ శుభారంభం
ఆక్లాండ్: పేసర్ జేకబ్ డఫీ (4/33) అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టడంతో శుక్రవారం పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్లతో నెగ్గి శుభారంభం చేసింది. తొలుత పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. కెపె్టన్ షాదాబ్ ఖాన్ (32 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. డఫీ ధాటికి 79/6తో కష్టాల్లో పడిన పాక్ జట్టు... చివర్లో ఫహీమ్ అష్రఫ్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో 150 పరుగులు దాటింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జేకబ్ డఫీ 4, స్కాట్ కుగ్లీన్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి గెలిచింది. టిమ్ సీఫెర్ట్ (43 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో అలరించాడు. మార్క్ చాప్మన్ (20 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 33 బంతుల్లో 45 పరుగుల్ని జోడించారు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. -
పాక్ సీనియర్ ఆటగాళ్లపై వేటు
కరాచీ: కొంత కాలంగా పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా తయారైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథులు షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతోపాటు పేసర్ మొహ్మమ్మద్ అమీర్‌పై వేటు పడింది. జింబాబ్వేతో ఆరంభమయ్యే వన్డే, టి20 సిరీస్‌ల కోసం 22 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టులో వీరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చోటు కల్పించలేదు. అయితే ఇటీవల ముగిసిన దేశవాళీ టి20 లీగ్ నేషనల్ టి20 కప్‌లో రాణించిన సెంట్రల్ పంజాబ్ జట్టు యువ ఆటగాడు అబ్దుల్లా షఫీక్‌కు మొదటిసారి సీనియర్ జట్టులో స్థానం లభించింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోని పేస్ ద్వయం హసన్ అలీ, నసీమ్ షా పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌ను నియమించిన పీసీబీ... వైస్ కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను నియమించింది. పాక్, జింబాబ్వే మధ్య తొలి వన్డే ఈనెల 30న జరగనుండగా... నవంబర్ 1, 3వ తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం నవంబర్ 7, 8, 10వ తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. మా వీసాల అంశాన్ని ఐసీసీ చూస్తుంది భారత్‌లో ఆడేందుకు తలెత్తే వీసా ఇబ్బందులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చూసుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వీసాల బాధ్యత పూర్తిగా ఐసీసీదేనని పీసీబీ సీఈఓ వసీమ్ ఖాన్ తెలిపారు. ఐసీసీ ఈ అంశంపై తమకు హామీ ఇవ్వాలని ఆయన చెప్పారు. అయితే దేనికైనా నిర్దిష్ట గడువు అంటూ ఉండాలని వచ్చే జనవరిదాకా ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు చెప్పారు. చిరకాల ప్రత్యర్థుల మధ్య సమీప భవిష్యత్తులో ముఖాముఖి టోర్నీలు జరుగుతాయన్న ఆశలేవీ లేవని ఆయన చెప్పారు. -
‘చీఫ్ సెలెక్టర్’ పదవికి మిస్బా గుడ్‌బై
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ పురుషుల జట్టు చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ బుధవారం ప్రకటించాడు. నవంబర్ 30 వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతానని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కూడా సమాచారమిచ్చానని వెల్లడించాడు. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా పూర్తిగా సేవలందించేందుకే సెలెక్టర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపాడు. ‘రానున్న జింబాబ్వే సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడంతో సెలెక్టర్‌గా నా పని ముగుస్తుంది. ఆ తర్వాత హెడ్ కోచ్ బాధ్యతలపై పూర్తిగా దృష్టి సారిస్తా. నా నిర్ణయంలో బోర్డు ప్రమేయం లేదు. ఒకేసారి రెండు అత్యున్నత పదవుల్లో కొనసాగడం అనుకున్నంత సులువుకాదని తెలిసింది. అందుకే కోచ్‌గా ఉండేందుకు నిర్ణయించుకున్నా’ అని మిస్బా వివరించాడు. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ జట్టు సెలెక్టర్‌గా, హెడ్ కోచ్‌గా మిస్బా నియమితుడయ్యాడు. -
'స్నేహం పక్కన పెట్టి ఆడితే బాగుంటుంది'
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా పాక్ జట్టు వన్డే కెప్టెన్ బాబర్ అజామ్ తో పాటు టీమ్ మేనేజ్మెంట్ను తప్పుబడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. 40 ఏళ్ల వయసుకు దగ్గర్లో ఉన్న మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌లను టీ20 క్రికెట్లో ఇంకా ఎందుకు ఆడిస్తున్నారంటూ చురకలంటించాడు. అసలు పాక్ సెలెక్షన్ టీమ్‌కు సరైన ప్రణాళిక లేదని.. అందుకే వయసుమీద పడ్డవారిని ఆడిస్తున్నారని ఎద్దేవా చేశాడు. టీ20 అంటేనే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహించాలి. కానీ కెప్టెన్‌గా బాబర్‌తో పాటు టీమ్ మేనేజ్మెంట్ అలా ఆలోచించడం లేదని... స్నేహం పేరుతో యువకులకు అవకాశం ఇవ్వడం లేదంటూ విమర్శించాడు. (చదవండి : పృథ్వీ షా.. నీ ప్రతిభ అమోఘం) 'కెప్టెన్‌గా బాబర్ అజామ్ తప్పు చేస్తున్నాడు. టీ20 అనేది యువ ఆటగాళ్లను దృష్ఠిలో పెట్టుకొని రూపొందించింది. కానీ బాబార్ జట్టు మేనేజ్మెంట్తో కలిసి 40 ఏళ్లకు దగ్గరలో ఉన్న హఫీజ్, మాలిక్‌లను ట20 జట్టుకు ఎంపిక చేయించాడు. ఇది కరెక్ట్ కాదు.. హఫీజ్, మాలిక్‌లు ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లే.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. టీ20 జట్టులో ఈ ఇద్దరు పనికిరారు. రాబోయే రెండేళ్లలో రెంటు టీ20 ప్రపంచకప్‌లు ఆడనున్న పాక్ జట్టులో కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తే బాగుంటుంది. బాబర్ అజామ్ స్నేహం అనే పదాన్ని పక్కనపెడితే బాగుంటుంది. అయినా కెప్టెన్‌తో పాటు జట్టును ఎంపిక చేసే సెలక్షన్ టీమ్ ధోరణి సరిగా లేదు.జట్టులో ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తుండాలి. (చదవండి : ‘ఆ బౌలర్‌తో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలే’) మా సమయంలో ఇలా ఉండేది కాదు.. ఇమ్రాన్ కొత్తగా కెప్టెన్ అయిన సమయంలో మార్పు పేరుతో ఐదు నుంచి ఆరు మంది సీనియర్ ఆటగాళ్లను వన్డే జట్టులో నుంచి తప్పించాం. కేవలం స్థిరంగా ఆడుతున్న జావేద్ మియాందాద్ లాంటి ఆటగాడిని మాత్రమే కొనసాగించాం. యువ ఆటగాళ్లతో నిండిన పాక్ జట్టు 1992లో ప్రపంచకప్ సాధించేవరకు వెళ్లగలిగింది. ఇప్పుడు మాత్రం జట్టు మేనేజ్మెంట్ అలా కనిపించడం లేదు. ఎప్పుడైనా ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే ఆటగాళ్ల ఎంపిక జరగాలి.. భవిష్యత్తుకు కూడా అదే మంచిది.' అంటూ రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. -
ఇంగ్లండ్ చేరిన పాక్ జట్టు
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం బయల్దేరిన పాకిస్తాన్ జట్టు ఆదివారం రాత్రి ఇంగ్లండ్‌కు చేరుకుంది. ప్రత్యేక విమానంలో లాహోర్ నుంచి మాంచెస్టర్‌కు చేరుకున్న 31 మంది సభ్యులతో కూడిన పాకిస్తాన్ బృందం వొస్టర్‌షైర్‌లో 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండనుంది. ఈ మేరకు ఇంగ్లండ్ బోర్డు ఏర్పాట్లు చేసింది. క్వారంటైన్ తర్వాత ఆటగాళ్లకు మరో సారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం సిరీస్ సన్నాహాల కోసం జూలై 13న పాక్ బృందం డెర్బీషైర్‌కు వెళ్లనుంది. -
ఇంగ్లండ్ బయలుదేరిన పాకిస్తాన్ జట్టు
మాంచెస్టర్: ఓవైపు కరోనా తాలూకు భయాందోళనలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ జట్టు ఆశావహ దృక్పథంతో ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరింది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్ బృందం ఆదివారం ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం మాంచెస్టర్ పయనమైంది. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆగస్టులో ఇరు జట్ల మధ్య 3 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరినట్టుగా పాక్ వన్డే, టి20 కెప్టెన్ బాబర్ ఆజమ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఇంగ్లండ్‌కు వెళ్లే దారిలో ఉన్నాం. ఈ పర్యటన కోసం ఎంతోకాలంగా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఇంగ్లండ్‌లాంటి పటిష్ట జట్టుతో ఆడటం గొప్పగా ఉంటుంది. ఎప్పటిలాగే అభిమానుల ఆశీస్సులు, ప్రార్థనలు మావెంటే ఉంటాయని నమ్ముతున్నా’ అని పేర్కొన్న బాబర్ విమానంలో తన సహచరులతో దిగిన ఫొటోను పంచుకున్నాడు. అయితే కరోనా బారిన పడిన 10 మంది క్రికెటర్లను మళ్లీ పరీక్షించగా అందులో ఆరుగురు ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. అయినప్పటికీ వారిని మరోమారు పరీక్షించాకే ఇంగ్లండ్‌కు పంపిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. పాకిస్తాన్ జట్టు: అజహర్ అలీ, బాబర్ ఆజమ్, అబిద్ అలీ, అసద్ షఫీఖ్, ఫహీమ్ అష్రఫ్, ఫవాద్ ఆలమ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీమ్, ఇమాముల్ హఖ్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ అబ్బాస్, మూసా ఖాన్, నసీమ్ షా, రోహైల్ నాజిర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, షాన్ మసూద్, సొహైల్ ఖాన్, ఉస్మాన్ షిన్వారీ, యాసిర్ షా. -
పాకిస్తాన్ క్రికెట్టీమ్ను పట్టిపీడిస్తోన్న కరోనా
-
‘ఆ పది మంది’ లేకుండా...
కరాచీ: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై స్పష్టత వచ్చింది. తొలిసారి నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్‌గా తేలిన 10 మంది క్రికెటర్లను పక్కన పెట్టి మిగతా 18 మంది ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బందితో పాక్ జట్టు నేడు ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ వెళ్లనుంది. వీరితో పాటు రిజర్వ్‌గా ఎంపిక చేసిన ఇద్దరు ఆటగాళ్లు కూడా అదనం. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 28 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసింది. వీరిలో పది మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వీరికి శనివారం మరో సారి కోవిడ్–19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురు ఆటగాళ్లు మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్నైన్ ‘నెగెటివ్’గా తేలారు. అయినా సరే వీరిని మాత్రం అప్పుడే ఇంగ్లండ్‌కు పంపరాదని పీసీబీ నిర్ణయించింది. ‘నిబంధనల ప్రకారం వరుసగా రెండోసారి వారి టెస్టులు నెగెటివ్‌గా రావాలి. అప్పుడే ఆ ఆరుగురికి ఇంగ్లండ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తాం. 18 మంది రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు రిజర్వ్‌గా ఎంపికై నెగెటివ్ వచ్చిన మూసా ఖాన్, రొహైల్ నజీర్ కూడా జట్టుతో పాటు వెళుతున్నారు’ అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ వెల్లడించారు. మరో నలుగురు క్రికెటర్లు హైదర్ అలీ, హారిస్ రవూఫ్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్ మాత్రం వరుసగా రెండోసారి కరోనా పాజిటివ్‌గా బయట పడ్డారు. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య 3 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. పాక్ జట్టు ముందుగా మాంచెస్టర్ చేరుకొని అక్కడి నుంచి వస్టర్‌షైర్‌కు వెళుతుంది. అక్కడ ఇంగ్లండ్ దేశపు నిబంధనల ప్రకారం కరోనా టెస్టులు జరుగుతాయి. ఆపై 14 రోజుల క్వారంటైన్ మొదలవుతుంది. జూలై 30 నుంచి ఇరు జట్ల మధ్య లార్డ్స్‌లో తొలి టెస్టు జరుగుతుంది. పాక్ జట్టు ప్రయాణం కోసం ఇంగ్లండ్ బోర్డే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం విశేషం. -
మరో ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోవిడ్–19 దెబ్బ గట్టిగా తగిలింది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన పాక్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు సోమవారం కరోనా నిర్ధారణ కాగా... ఇప్పుడు మంగళవారం మరో ఏడుగురు పాజిటివ్‌గా తేలారు. దీంతో కరోనా బారిన పడిన ఆటగాళ్ల సంఖ్య పదికి చేరింది. తాజాగా ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్నైన్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్లకు కరోనా వచ్చినట్లు బయటపడింది. ఈ ఏడుగురు ఆటగాళ్లు కూడా ఫలితాలు వచ్చేవరకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఎసింప్టమిక్‌గానే కనిపించారు. షోయబ్ మాలిక్, కోచ్ వకార్ యూనిస్ తదితరుల పరీక్షా ఫలితాలు కూడా రావాల్సి ఉంది. సోమవారం షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్లకు పాజిటివ్ ఫలితం వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగే 3 టెస్టులు, 3 టి20ల కోసం 29 మందితో భారీ జట్టును పాక్ ప్రకటించగా... ఇప్పుడు దాదాపు మూడోవంతు మంది కరోనా బారిన పడ్డారు. అయినా సరే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించింది. పాజిటివ్‌గా తేలినవారిలో ఒక్క వికెట్ కీపర్ రిజ్వాన్ మాత్రమే టెస్టు స్పెషలిస్ట్. అతనికి మాత్రమే తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని, మిగతా వారికి టి20ల కోసం కోలుకునేందుకు తగినంత సమయం ఉందని బోర్డు భావిస్తోంది. రిజ్వాన్ గైర్హాజరులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌కు అవకాశం దక్కవచ్చు. ముందు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు బిలాల్ ఆసిఫ్, ఇమ్రాన్ బట్, మూసా ఖాన్, మొహమ్మన్ నవాజ్‌లను ఎంపిక చేసిన పీసీబీ వారిని కూడా కరోనా టెస్టుల కోసం పంపించింది. జూన్ 25న పాక్ ఆటగాళ్లకు తర్వాతి దశ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. -
పాక్ క్రికెట్‌కు కరోనా సెగ
కరాచీ: మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఈ సిరీస్ కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లలో కొందరికి కోవిడ్–19 టెస్టులు నిర్వహించగా... జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం ప్రకటించింది. యువ ఆటగాడు హైదర్ అలీతోపాటు షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్లకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో జట్టు వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇంగ్లండ్ పర్యటన కోసమే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం రావల్పిండిలో వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ ముగ్గురికి వైరస్ సోకినట్లు తేలింది. వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన క్రికెటర్లను పీసీబీ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. అయితే పరీక్షల ముందు వరకు వీరికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం గమనార్హం. ఈ ముగ్గురితో పాటు ఇమాద్ వసీమ్, ఉస్మాన్ షిన్వారీలనూ పరీక్షించగా వారి ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని పీసీబీ వెల్లడించింది. మరోవైపు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, కోచ్ వకార్ యూనిస్‌లతోపాటు కొంతమంది జట్టు అధికారులు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షలకు హాజరయ్యారు వీరి ఫలితాలు నేడు వచ్చే అవకాశముందని పీసీబీ తెలిపింది. ఇప్పటికే పాక్ మాజీ క్రికెటర్లు తౌఫిక్ ఉమర్, షాహిద్ అఫ్రిదిలు కరోనా బారిన పడ్డారు. -
కరోనా.. పాక్ క్రికెట్ టీమ్ విరాళం
కరాచీ : కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించడానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఆ దేశ ప్రభుత్వానికి రూ. 5 మిలియన్లు విరాళంగా ఇచ్చింది. జాతీయ అత్యవసర నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ ఎహ్సాన్ మణి ప్రకటించారు. కరోనాపై పోరాటానికి సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లు రూ. 5 మిలియన్లు విరాళం ఇచ్చారని ఆయన తెలిపారు. అలాగే బోర్డులోని కిందిస్థాయి నుంచి సీనియర్ మేనేజర్ వరకు ఉన్న ఉద్యోగులు అంతా తమ ఒక్క రోజు జీతాన్ని జాతీయ అత్యవసర నిధికి అందజేయనున్నట్టు మణి వెల్లడించారు. జనరల్ మేనేజర్ ఆపై స్థాయి అధికారులు రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు చెప్పారు. పీసీబీ ఎప్పుడూ కష్ట సమయాల్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కరోనా వైరస్ క్రికెట్‌కు అంతరాయం కలిగించవచ్చు కానీ, దేశం మొత్తం ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం అవసరమైన అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాకిస్తాన్లో కూడా విజృంభిస్తోంది. పాక్‌లో ఇప్పటివరకు 1,000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చదవండి : చెప్పినా వినలేదు.. గాంధీ ఆస్పతికి తరలింపు ‘చైనీస్’ వైరస్ వార్తలపై ఘాటుగా స్పందించిన రోంగ్ -
ఆఫ్రిది ట్వీట్.. రషీద్ ఖాన్ స్పందన!
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది కుటుంబం ప్రస్తుతం ఆనంద డోలికల్లో తేలియాడుతోంది. ఇప్పటికే నలుగురు కూతుళ్లకు తండ్రైన ఆఫ్రిదికి.. మరోసారి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆఫ్రిది అభిమానులతో పంచుకున్నాడు. తన మీద దయతో దేవుడు అద్భుతమైన కూతుళ్లను ప్రసాదించాడంటూ ఓ ఫొటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా చిన్నారి కూతురికి పేరు ఎంపిక చేసే అవకాశాన్ని అభిమానులకు ఇస్తున్నట్లు ఆఫ్రిది పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ నా కూతుళ్లందరి పేరు ‘ఏ’ అక్షరంతో మొదలవుతున్న పరంపరను మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాపాయికి కూడా ‘ఏ’ అక్షరంతో మొదలయ్యే పేరును ఎంపిక చేయడంలో నాకు సహాయం చేయండి. ఇది నా అభిమానుల కోసం. విజేతకు మంచి బహుమతి కూడా ఇస్తాను! అక్సా, అన్షా, అజ్వా , అస్మారా ఇలాంటి పేర్లను సూచించండి’’ అంటూ ఆఫ్రిది ట్వీట్ చేశాడు.(భారత్-పాక్ సిరీస్; రాజకీయాలు సరికాదు) ఇందుకు స్పందించిన ఆఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. ‘అఫ్రీన్ అయితే బాగుంటుంది. ఈ పేరుకు సాహసం అని అర్థం’ అని బదులిచ్చాడు. కాగా పాక్ క్రికెట్‌కి విశేష సేవలందించిన ఆఫ్రిది.. కూతుళ్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటానంటూ తన ఆత్మకథలో పేర్కొన్న సంగతి తెలిసిందే. క్రికెట్ లాంటి ఔట్‌డోర్ గేమ్స్ ఆడడానికి వాళ్లకు అనుమతి ఇవ్వనని పుస్తకంలో పేర్కొన్నాడు. ఇస్లాం నియమాలను గౌరవిస్తూ... సామాజిక కట్టుబాట్లను దృష్టిలో ఉంచుకుని తన కూతుళ్లను ఇండోర్ గేమ్స్‌కే పరిమితం చేస్తానని స్పష్టం చేశాడు.(‘హారతి’ ఇస్తుందని టీవీ పగలగొట్టిన పాక్ క్రికెటర్) This one’s for my fans 😘: As you can see there’s a trend of my daughter’s names beginning with the letter ‘A’ ☺. Send me your recommendations for our new arrival with ‘A’....the winning name I select gets a prize! Keep the names rolling! #Aqsa#Ansha#Ajwa#Asmara#A.... — Shahid Afridi (@SAfridiOfficial) February 15, 2020 -
భారత్‌ను తరచుగా ఓడించేవాళ్లం: ఇమ్రాన్
దావోస్: భారత క్రికెట్ జట్టును ఎన్నోసార్లు తమ జట్టు ఓడించిందంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. దావోస్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..తాను క్రికెట్ ఆడే సమయంలో ఎన్నోసార్లు భారత్‌ను ఓడించామని అన్నారు. పరిమాణంలో తమ కంటే 7 రెట్లు పెద్ద దేశమైన భారత్‌ను తరచూగా ఓడించేవాళ్లమంటూ, అప్పట్లో హాకీ, ఇతర క్రీడలలో పాక్ అద్భుతంగా రాణిస్తుండేదని పేర్కొన్నారు. అప్పట్లో ఓడిన జట్టుకు ఏ బహుమతి ఇచ్చేవారు కాదని, కనీసం సానుభూతి చూపేవారు కాదని ఇమ్రాన్ అన్నారు. తాను రాజకీయాల్లోకి రాగానే కొందరు నవ్వారని..కానీ తానెప్పుడు లక్ష్యాన్ని వదిలిపెట్టలేదన్నారు. దేశంలో అనేక సహజ వనరులున్నాయని..సులభతర వాణిజ్య సూచీలో మెరుగైన స్థానాన్ని పొందడమే తమ లక్ష్యమన్నారు. 1960లో పాకిస్తాన్ చాలా అద్భుత దేశమని..ఆసియా దేశాలకు ఆదర్శంగా నిలిచేదని చెప్పుకొచ్చారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా తమ దేశంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిందని..సైన్యం అధికారంలోకి తీసుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలిపారు. దేశంలో మంచి పరిపాలన అందించగలిగితే పాకిస్తాన్ అభివృద్ధి చెందడం ఖాయమని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. చదవండి: ఇమ్రాన్‌పై ఒవైసీ ఫైర్ -
మనోడిని విందుకు పిలిచారు..
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్‌లో పాకిస్తాన్ ఓటమిపాలైంది. అయితే పాకిస్తాన్ టీమ్‌లోని కొందరు భారత ట్యాక్సీ డ్రైవర్ పట్ల తమ సహృదయతను చాటుకుని ప్రేక్షకుల మన్నన చూరగొన్నారు. ఈ ఘటన గురించి ప్రముఖ కామెంటేటర్ ఆలిసన్ మిచెల్ రేడియో ప్రత్యక్ష ప్రసారంలో వెల్లడించారు. ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్స్‌న్‌కు ఈ ఆసక్తికర సంఘటన గురించి తెలిపారు. ‘యాసిర్ షా, షహీన్ ఆఫ్రిది, నసీమ్ షా సహా ఐదుగురు పాకిస్తాన్ క్రికెటర్లు ఇండియన్ రెస్టరెంట్‌కు వెళ్లాలనుకున్నారు. భారత ట్యాక్సీ ఒకరు ఈ ఐదుగురిని ఇండియన్ రెస్టరెంట్‌కు తీసుకెళ్లాడు. ట్యాక్సీ దిగిన తర్వాత డబ్బులు ఇవ్వగా డ్రైవర్ సున్నితంగా తిరస్కరించాడు. తమ పట్ల భారత ట్యాక్సీ డ్రైవర్ చూపిన ఆదరాభిమానులకు ముగ్దులైన పాక్ క్రికెటర్లు అతడిని తమతో పాటు భోజనానికి పిలిచారు. పాకిస్తాన్ ఆటగాళ్ల పక్కన కూర్చుని ఆనందంగా విందు ఆరగిస్తున్న ఫొటోలను తన ఫోన్లో ట్యాక్సీ డ్రైవర్ తనకు చూపించాడ’ని ఆలిసన్ మిచెల్ వెల్లడించారు. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మానవీయ కథనం చాలా బాగుంది అంటూ నెటిజనులు కామెంట్లు పెట్టారు. గ్రేట్ స్టోరీ అంటూ కొంతమంది ప్రశంసించారు. -
పాక్ క్రికెటర్లకు... బిర్యానీ, స్వీట్స్ బంద్
లాహోర్: ఇకపై పాకిస్తాన్ క్రికెటర్ల ఆహార నియమావళి పూర్తిగా మారిపోనుంది. ఫిట్నెస్ ప్రమాణాలు పెంచి ఆటగాళ్లు మైదానంలో మరింత చురుగ్గా ఉండేలా చేసేందుకు బిర్యానీతో పాటు నూనె ఎక్కువగా వాడి వండే రెడ్ మీట్, మిఠాయిలకు దూరంగా ఉంచాలని హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బా ఉల్ హక్ యోచిస్తున్నాడు. జాతీయ శిబిరంతో పాటు దేశవాళీ టోరీ్నల్లో ఈ మేరకు డైట్ అమలు చేయాలని అతడు కోరాడు. వన్డే ప్రపంచ కప్‌లో జూన్ 16న టీమిండియాతో కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెటర్లు పిజ్జాలు–బర్గర్లు తింటున్న వీడియోను అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జంక్ ఫుడ్ నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనికితోడు కప్‌లో పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్ పైనా జోకులు పేలాయి. వీటన్నిటి కారణంగా మిస్బా... డైట్‌పై దృష్టి పెట్టాడు. పాక్ ఈ నెల 27 నుంచి స్వదేశంలో శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్ ఆడనుంది. -
‘పాక్ క్రికెట్ జట్టుపై చర్యలు తీసుకోండి’
ఇస్లామాబాద్: ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ జట్టుపై విమర్శలు ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేసిన పాక్ క్రికెట్ జట్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ విజ్ఞప్తి చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించి దేశం పరువుతీసిన ఆటగాళ్లను సాగనంపాలన్నారు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ దారుణంగా విఫలమయ్యాడని విమర్శించారు. ‘ప్రపంచకప్ టోర్నిలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఛేజింగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయి 105కే ఆలౌటైంది. మన బ్యాటింగ్ దారుణంగా ఉంది. మన లోపాలను ప్రత్యర్థులు సోపానాలుగా మలుచుకున్నార’ని అక్మల్ మండిపడ్డాడు. పాకిస్తాన్లో సమర్థులైన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను పటిష్టం చేసివుంటే పాక్ క్రికెట్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసివుండేదని అభిప్రాయపడ్డాడు. కాగా, ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శనపై లోతుగా సమీక్ష చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంతకుముందు ప్రకటించింది. -
పాక్ క్రికెటర్లకు ఇమ్రాన్‌ఖాన్ అడ్వైజ్ ఇదే!
సాక్షి: క్రికెట్ ప్రేమికులను ఉత్కంఠకు గురిచేస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తమ జట్టులో ప్రేరణనింపే ప్రయత్నం చేశారు. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తన నాయకత్వ ప్రతిభతో జట్టును ముందుండి విజయతీరాలకు నడిపిస్తాడని ఇమ్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపు గురించి అతిగా ఆలోచించకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ఫోకస్ చేయాలని జట్టు సభ్యులకు ఆయన సూచించారు. పాక్ సారథిగా 1992 ప్రపంచకప్‌ను అందించిన ఇమ్రాన్‌ఖాన్ తన వ్యక్తిగత అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘నా కెరీర్ ప్రారంభంలో 70శాతం ప్రతిభ, 30శాతం మానసిక బలంతో నేను విజయం సాధించానని భావించాను. కానీ కెరీర్ పూర్తయిన తరువాత ఇది 50-50 శాతం అనుకున్నాను. కానీ, 60శాతం మానసిక బలం, 40శాతం ప్రతిభతో రాణించినట్టు నా మిత్రుడు గవాస్కర్ చెప్పాడు. దానితో నేను ఏకీభవిస్తాను’ అని పేర్కొన్నారు. దాయాదుల పోరు సందర్భంగా ఇరుజట్లు తీవ్ర మానసిక ఒత్తిడిలో మ్యాచ్ ఆడతాయని, ఒత్తిడిని తట్టుకున్న వారే విజేతలుగా నిలుస్తారని, అదృష్టవశాత్తు సర్ఫరాజ్ లాంటి సాహసోపేత నాయకుడి ఆధ్వర్యంలో కచ్చితంగా తమ జట్టు విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. -
ఇండియా రికార్డు బద్దలు
నాటింగ్‌హామ్: గతంలో వన్డేల్లో 300 పరుగులను చేధించడమంటే చాలా కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం 300 లక్ష్యం అనేది చాలా చిన్న విషయంలా మారిపోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన నాలుగో వన్డేలో పాకిస్తాన్ నిర్ధేశించిన 341 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా సాధించింది. మూడు రోజుల వ్యవధిలో 340 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని రెండు సార్లు చేధించిన జట్టుగా ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో వన్డేల్లో 340 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యధికంగా నాలుగుసార్లు ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది. గతంలో భారత్ మూడుసార్లు ఈ ఘనత సాధించగా అది కాస్త ఇప్పుడు కనుమరుగైంది. -
నా కూతుళ్లకు ఆ పర్మిషన్ లేదు : మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్ : మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మరోసారి వార్తల్లో నిలిచారు. పాక్ క్రికెట్‌కి విశేష సేవలందించిన దిగ్గజ ఆటగాడు కూతుళ్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటానంటున్నాడు. వారికి క్రికెట్ లాంటి ఔట్‌డోర్ గేమ్స్ ఆడడానికి పర్మిషన్ లేదని అన్నారు. ఎంత ఎదిగినా ఇస్లాం నియమాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. సామాజిక కట్టుబాట్లను దృష్టిలో ఉంచుకుని తన కూతుళ్లు అన్షా, అజ్వా, అస్మారా, అక్షకు ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడడానికి అనుమతిస్తానని చెప్పారు. ఇటీవల విడుదలైన ఆఫ్రిది ఆత్మకథ ‘గేమ్ చేంజర్’లో ఈ విషయాలు వెల్లడైనట్టు ఓ ఆంగ్ల మీడియా తెలిపింది. ఇక తన నిర్ణయంపట్ల స్త్రీవాదులు ఏం మాట్లాడుకున్నా తనకు అనవసరమని ఆఫ్రిది అందులో చెప్పినట్టు తెలిసింది. (చదవండి : ఆఫ్రిది.. నిన్ను సైక్రియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్తా.. రా!) ‘చిన్న పిల్లలు అజ్వా, అస్మారాకు డ్రెస్ అప్ ఆట అంటే ఇష్టం. ఎటువంటి ఇండోర్ గేమ్స్ అయినా ఆడుకోవడానికి వాళ్లకు నా అనుమతి ఎప్పుడూ ఉంటుంది. కానీ క్రికెట్ ఆడేందుకు, బహిరంగ ప్రదేశాల్లో పోటీపడే ఆటలకు నా పిల్లలు దూరం’ అని పుస్తకంలో చెప్పుకొచ్చారు. ఇక ఈ పుస్తకంలో.. కశ్మీర్ వివాదంపైన, పాకిస్తాన్ ఆటగాళ్లపైన, పాక్ క్రికెట్ మాజీ కోచ్ జావేద్ మియాందాద్పైనా విమర్శలు చేశారు. 2010లో పాకిస్తాన్ క్రికెట్లో వెలుగుచూసిన స్పాట్‌ఫిక్సింగ్ వ్యవహారంపై జాగ్రత్తగా ఉండాలని జూనియర్లకు సూచించారు. భారత మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్‌పైనా విమర్శలకు దిగారు. డాన్ బ్రాడ్‌మన్, జేమ్స్ బాండ్‌కు మధ్యరకంలా గంభీర్ ప్రవర్తిస్తూ ఉంటాడని, ఆటలో అతనికి పెద్ద రికార్డులు లేకపోయినా.. అటిట్యూడ్ మాత్రం చాలా ఎక్కువ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘ఆఫ్రిదీ నువ్వు చాలా సరదా మనిషివి. మెడికల్ టూరిజంలో భాగంగా మేం ఇప్పటికీ పాకిస్థానీలకు వీసాలు ఇస్తున్నాం. నేనే స్వయంగా నిన్ను సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాలే..’ అంటూ బదులిచ్చారు. పాత్రికేయుడు వజాహత్ ఖాన్‌తో కలిసి అఫ్రిది ‘గేమ్ చేంజర్’ పుస్తకాన్ని రాశాడు. (చదవండి : స్పాట్ ఫిక్సింగ్ సమాచారం ముందే తెలుసు) -
క్రికెట్ : భారత్, పాక్ ముఖాముఖి పోరు!
దుబాయ్ : దాయాదీ దేశం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ అంటే భారత అభిమానులకు ఎక్కడి లేని ఉత్సాహం వస్తుంది. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదు. దీంతో ఆ మజాను అభిమానులు మిస్సవుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్-పాక్‌లు తలపడుతున్నాయి. గతేడాది జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఇలాంటి ఆసక్తికర మ్యాచ్ ప్రేక్షకులను రెండుసార్లు కనువిందు చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ గెలవగా.. అసలు సిసలు ఫైనల్ మ్యాచ్‌లో పాక్ నెగ్గి టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అలాంటి ఉత్కంఠకర మ్యాచ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. క్రికెట్ ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన భారత్,పాక్ జట్లు ముఖా ముఖి పోరుకు సిద్దమయ్యాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా జరిగే ఆసియాకప్ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల ప్రాతినిథ్యం ఖరారు కాగా.. మరోస్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేసియా, హంకాంగ్లు పోటీపడనున్నాయి. సెప్టంబర్ 18న భారత్, క్వాలిఫయర్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 19న దాయాదీ పాకిస్తాన్‌తో తలపడనుంది. రెండు గ్రూప్‌లు విభజించగా.. ఒక్కో గ్రూపులో మూడు జట్లు తలపడగా టాప్-2లో నిలిచినవి సూపర్-4లోకి అడుగుపెడుతాయి. సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా ఫైనల్ జరగనుంది. -
అజేయంగా 370 పరుగులు చేశాడు!
బులవాయో: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఫఖర్ ‘జమానా’ మొదలైంది. పరిమిత ఓవర్ల క్రికెట్ ఫార్మెట్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్లో వేగవంతంగా 1000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో ఫఖర్ పరుగుల పండుగ చేసుకున్నాడు. అత్యద్భుతంగా రాణించి బ్యాటింగ్‌లో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా దక్కించుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 257.5 సగటుతో 515 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ(210), సెంచరీ(117), రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ఐదు వన్డేల్లో మూడుసార్లు అతడు నాటౌట్‌గా నిలవడం విశేషం. అంటే అజేయంగా 370 పరుగులు సాధించాడన్న మాట. 28 ఏళ్ల ఫఖర్ జమాన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లాడి 76.07 సగటుతో మొత్తం 1065 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలున్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 210 పరుగులు నాటౌట్. ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు.. 1. ఫఖర్ జమాన్(515)- పాకిస్తాన్ 2. హెచ్. మసకజ్జా(467) - జింబాబ్వే 3. సల్మాన్‌భట్(451)- పాకిస్తాన్ 4. మహ్మద్ హఫీజ్(448)- పాకిస్తాన్ 5. రోహిత్ శర్మ(441)- భారత్ -
డోపింగ్ టెస్టులో దొరికిన పాక్ క్రికెటర్!
ఇస్లామబాద్: పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ డోపింగ్ పరీక్షలో దోషిగా తేలాడు. అతడు నిషేదిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు రుజువైంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అతనికి నోటిసులు జారీ చేస్తూ.. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు బోర్డు అధికారిక ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. షెహజాద్ పాకిస్తాన్‌లోనిర్వహించిన పరీక్షల్లోనే డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైందని, కానీ భారత్‌లోని ల్యాబ్‌కు పంపించి పీసీబీ మరోసారి నిర్ధారించుకుందని డాన్ పత్రిక పేర్కొంది. గత జూన్‌లో పేరు చెప్పకుండా ఓ క్రికెటర్ డోపింగ్ పాల్పడ్డాడని తెలిపిన పీసీబీ రిపోర్టులు అందడంతో నోటీసులు జారీ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం ఎలాంటి క్రికెట్ ఆడకుండా షెహజాద్‌పై కొంత కాలం నిషేదం పడే అవకాశం ఉంది. నిలకడలేమి ఆటతో జట్టులో చోటు కోల్పోయిన 26 ఏళ్ల షెహజాద్.. స్కాట్లాండ్తో జరిగిన రెండు టీ20ల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆస్ట్రేలియా, జింబాంబ్వేలతో జరిగిన ముక్కోణపు సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక డోప్ టెస్టులో విఫలమైన పాక్ క్రికెటర్లలో షెహజాద్ మొదటి వాడేం కాదు.. 2012లో డోప్ టెస్టులో విఫలమైన పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజా హసన్ రెండేళ్ల నిషేదం ఎదుర్కొనగా.. యాసిర్ షా, అబ్దుర్ రెహమాన్‌లు తాత్కాలిక నిషేదాలు ఎదుర్కొన్నారు. -
ఆఫ్రిది అది చట్టవిరుద్దం!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ట్విటర్లో షేర్ చేసిన ఒక పోస్ట్ జంతుప్రేమికుల ఆగ్రహానికి గురైంది. ‘జంతువులను రక్షించడం మర్చిపోకండి, వాటికి మన ప్రేమ ఎంతో అవసరం ఉందంటూ’ జింకకు పాలు తాగిస్తూ దిగిన ఫోటో, తన కూతురు ఫోటోను బూమ్ బూమ్ ఆఫ్రిది షేర్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆల్‌రౌండర్ షేర్ చేసిన ఫోటోలో తన కూతురుతో పాటు ఆమె వెనకాలా ఓ పెద్ద సింహాన్ని గొలుసుతో కట్టేసి ఉంచారు. దీనిపై ఆగ్రహించిన జంతు ప్రేమికులు స్వేచ్చగా అడవిలో తిరగాల్సిన సింహాన్ని ఇలా గోలుసులతో కట్టిపడేస్తే జంతువులను ప్రేమించటం కాదని ఘాటుగా స్పందించారు. ఇక మరికొందరు క్రూర జంతువులను ఇళ్లలో పెంచుకోవడం చట్టవిరుద్దమని ఆఫ్రిదిని కడిగిపాడేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఆఫ్రిది ఎలాంటి వివరణ ఇవ్వలేదు. I’m absolutely appalled with what #ShahidAfridi is doing. You can’t keep a #lion out of its natural habitat all chained up & then claim that u r loving animals. The lion looks weak & so done with life. I feel so bad for it. #PETA #AnimalRights #cricket #Pakistan pic.twitter.com/IiphTknlhX — Mia Utopian (@mia__utopian) June 9, 2018 -
అఫ్రిది ఇంట్లో సింహం.. అభిమానుల షాక్
హైదరాబాద్ : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ట్విటర్లో షేర్ చేసిన ఒక పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల తన కూతురితో గడిపిన క్షణాలను, ఫొటోలను ఈ పాక్ మాజీ క్రికెటర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నచ్చిన వారితో గడపడం చాలా మధురంగా ఉంటుంది. నా కూతురు నా వికెట్ సంబరాలను అనుకరించడం నాకు ఓ గొప్ప అనుభూతినిచ్చింది. జంతువులను సంరక్షించడం మరచిపోకండి. మన ప్రేమను పొందే అర్హత వాటికి ఉంది’ అని జింకకు తాను పాలుపడుతున్న ఫొటో, తన కూతురు సెలెబ్రేషన్ ఫొటోను షేర్ చేశాడు. అయితే ఇక్కడ తన కూతురు ఫొటోలో ఆమె వెనుకాలా ఓ పెద్ద సింహం ఉంది. దీన్ని చూసిన అభిమానులకు వెన్నులో వణుకు మొదలైంది. ‘ఆఫ్రిది సింహాన్ని పెంచుకుంటున్నాడా ఏందీ’ అని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎవరైనా కుక్క, పిల్లిలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు..కానీ సింహాలు పెంచుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే అఫ్రిది నిజంగానే సింహాన్ని పెంచుకుంటున్నట్లు మరో అభిమాని స్పష్టమైన ఫొటోను షేర్ చేశాడు. Great to spend time with loved ones. Best feeling in the world to have my daughter copy my wicket taking celebrations. And yes don't forget to take care of animals, they too deserve our love and care :) pic.twitter.com/CKPhZd0BGD — Shahid Afridi (@SAfridiOfficial) June 9, 2018 అఫ్రిది చేసిన ట్వీట్.. ఫొటోలో సింహం oh my god..is that a pet lion?!! how cool is that!! 😲 what is it called? you pet both deer and lion? wow!! — banojyotsna (@banojyotsna) June 9, 2018 When a lion met a cricketing lion pic.twitter.com/9wFK2bJaN3 — Saj Sadiq (@Saj_PakPassion) June 10, 2018 -
పాక్ క్రికెటర్లకు ఐసీసీ వార్నింగ్
లండన్: పాకిస్థాన్ క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) హెచ్చరికలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్‌లతో మైదానంలోకి అడుగుపెట్టకూడదని తెలిపింది. స్మార్ట్ వాచ్‌లతో ఫిక్సింగ్‌కు పాల్పడే ఆస్కారం ఉండటంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పేసర్ హసన్ అలీ మీడియాకు తెలియజేశాడు. ప్రస్తుతం పాక్ జట్టు ఇంగ్లాండ్ టూర్లో ఉంది. గురువారం ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో తొలిటెస్ట్ ప్రారంభమైంది కూడా. అయితే ఆట ముగిశాక ఐసీసీ నుంచి పాక్ టీమ్‌కు ఆదేశాలు అందాయి. పాక్ టీమ్ లోని ఇద్దరు ఆటగాళ్లు స్మార్ట్ వాచ్‌లతో మైదానంలో కనిపించారని, అది నిబంధనలకు విరుద్ధమని, ఇక నుంచైనా వాటిని వాడొద్దంటూ తెలిపింది. అయితే ఆ ఆటగాళ్ల ఎవరన్నది మాత్రం ఐసీసీ వెలువరించలేదు. మరోపక్క ఐసీసీ తన అఫీషియల్ ట్విటర్లో స్మార్ట్ వాచ్‌ల వాడకంపై ఉన్న నిషేధాన్ని ధృవీకరిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఫిక్సింగ్‌కు పాల్పడే అవకాశాలు ఉండటంతో ఎలక్ట్రానిక్(కమ్యూనికేషన్‌కు సంబంధించి) డివైజ్‌లను సాధారణంగా మైదానంలోకి అనుమతించరు. గతంలో (2010) పాక్ ఆటగాళ్లు సల్మాన్ భట్, మహ్మద్ అసిఫ్, మహ్మద్ అమీర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడటం, పాక్ జట్టు నిషేధం విధించటం, జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. The ICC has confirmed that smart watches are not allowed on the field of play or areas designated as the Player and Match Officials Area (PMOA).https://t.co/MAv4mRNAqv pic.twitter.com/tYgDi1LJwn — ICC (@ICC) 25 May 2018 -
పాక్ బౌలర్‌కు ఐసీసీ ఊరట
దుబాయ్ : నిబందనలకు విరుద్దంగా ఉన్న బౌలింగ్ యాక్షన్‌తో నిషేదం ఎదుర్కుంటున్న పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్,ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్‌కు ఊరట లభించింది. బౌలింగ్ యాక్షన్ మార్చుకున్న హఫీజ్‌పై ఐసీసీ తాజాగా నిషేదం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. నిబందనలకు విరుద్దంగా బౌలింగ్ చేస్తున్నాడని ఈ పాక్ స్పిన్నర్‌పై ఐసీసీ గతంలో మూడు సార్లు నిషేదం విధించిన విషయం తెలిసిందే. హఫీజ్ బంతులను వేసే సమయంలో తన మోచేతిని 15 డిగ్రీలకన్నా ఎక్కువగా వంచుతున్నాడని ఇది ఐసీసీ బౌలింగ్ నిబంధనలకు విరుద్దమని అతనిపై చర్యలు తీసుకుంది. తాజాగా తన బౌలింగ్ శైలిని మార్చుకున్న హఫీజ్ ఇటీవల ఐసీసీ ముందు హాజరయ్యాడు. అతని బౌలింగ్ యాక్షన్‌ను పరీక్షించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ నిషేదం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. హఫీజ్ తన బౌలింగ్ యాక్షన్‌ను భవిష్యత్తులో మార్చడని అధికారులు విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనికి హఫీజ్ తాజా బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం జోడించింది. -
భర్త గురించి సానియా ట్వీట్.. వైరల్
తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చికెన్‌లా ఉంటాడని భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లైక్స్, షేర్లు చేయడంతో వైరల్‌గా మారింది. డానియెల్ అలెగ్జాండర్ అనే నెటిజన్.. షోయబ్ మాలిక్, షహీన్ షా అఫ్రిది అఫ్రిది ఇద్దరూ పాక్ జట్టుకు ఆడుతున్నారు. అఫ్రిది ఏప్రిల్ 6, 2000 సంవత్సరంలో పుట్టాడు. మాలిక్ అక్టోబర్ 14, 1999లో క్రికెటర్ అరంగ్రేటం చేశాడని డానియెల్ ట్వీట్ చేశాడు. కాగా మాలిక్ ఫిబ్రవరి 1, 1982లో జన్మించిన విషయం తెలిసిందే. అయితే నెటిజన్ డానియెల్ ట్వీట్‌పై టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా స్పందించారు. 'కామన్.. నా భర్త ఇప్పటికీ స్ప్రింగ్ చికెన్‌లా ఉంటాడంటూ' డానియెల్ ట్వీట్‌కు సానియా బదులిచ్చారు. సానియా ట్వీట్‌కు అనూహ్య స్పందన వస్తోంది. వయసు సంఖ్య మాత్రమేనని, ఫిట్నెస్ కాపాడుకుంటూ మాలిక్ ఇంకా జట్టులో కొనసాగుతున్నాడని కషీఫ్ బేగ్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. 'పాక్ క్రికెట్ జట్టులో ఉన్న ఎంతోమంది ఆటగాళ్ల కంటే కూడా మాలిక్ భాయ్ చాలా యంగ్‌గా కనిపిస్తాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. అన్న, వదిలనలను ఎంతగానో ప్రేమిస్తాను. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటూ' అలీ అనే అభిమాని ట్వీట్ చేశాడు. Shoaib Malik and Shaheen Shah Afridi playing in the same Pakistan XI, Shaheen was born on 6th April 2000 and Shoaib Malik made his International cricket debut on 14th October 1999. #Cricket #PAKvWI — Daniel Alexander (@daniel86cricket) 3 April 2018 😱😱 common.. my husband is still a spring chicken 😀 #longevity @realshoaibmalik #mashaAllah https://t.co/gsmFMMVwDV — Sania Mirza (@MirzaSania) 3 April 2018 Malik Bhai still looks Younger than most of the Squad we have ... No Wonder why he's the best and still playing for Pakistan ♥ love you Bhai and Bhabi G Stay Blessed and Healthy Btw Malik Bhai be like : Jitni tumhari umar he utna mera tajurba he shaheen beta 😂 — M.Ali (@boxercute) 3 April 2018 Age is only number ... check Bhai fitness ... he is still smart & powerful player of the team ... #StayBlessed together 👍 — Kashif Baig (@kashif_baig) 3 April 2018 -
కశ్మీర్‌పై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత్‌కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఆక్రమించిన కశ్మీర్లో పరిస్థితి దారుణంగా ఉందని, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఐక్యరాజ్య సమితి ఎందుకు అడ్డుకోవడం లేదని ట్వీటర్ వేదికగా ప్రశ్నించాడు. ‘భారత్ ఆక్రమించిన కశ్మీర్లో పరిస్థితి దారుణంగా ఉంది. అణచివేత పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం తమ గళాన్ని వినిపిస్తున్న అమాయక ప్రజలు అన్యాయంగా తుపాకీ తూటాలకు బలైపోతున్నారు. ఈ హింసను ఐక్యరాజ్యసమితి, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయి.’ అని ట్వీట్ చేశాడు. Appalling and worrisome situation ongoing in the Indian Occupied Kashmir.Innocents being shot down by oppressive regime to clamp voice of self determination & independence. Wonder where is the @UN & other int bodies & why aren't they making efforts to stop this bloodshed? — Shahid Afridi (@SAfridiOfficial) 3 April 2018 ఇక అఫ్రిది భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం ఇదే తొలిసారేం కాదు. గతంలో 2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇదే కశ్మీర్ అంశం ప్రస్తావిస్తూ భారత్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. ఈ పాక్ మాజీ క్రికెటర్ తాజా వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017లో అంతర్జాతీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అఫ్రిది పాక్ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 2011 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న పాక్ జట్టుకు సారథిగాను వ్యవహరించాడు. -
పీఎస్ఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ : పాక్ క్రికెటర్‌పై నిషేధం!
సాక్షి, స్పోర్ట్స్: పాకిస్తాన్ మాజీ ఓపెనర్ షాజాబ్ హసన్‌పై ఆదేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఏడాది నిషేధంతో పాటు పదిలక్షల రూపాయల జరిమాన విధించింది. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో షాజాబ్తో పాటు పలువురు పాక్ క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరిలో కొంతమందిపై ఇప్పటికే చర్యలు తీసుకున్న పీసీబీ తాజాగా హసన్‌పై నిషేధం విధించింది. ఈ విషయాన్ని బోర్డు లీగల్ అడ్వైజర్ తాఫ్ఫాజుల్ రిజ్వీ ధృవీకరించారు. ఇతర క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌ల పాల్పడకుండా హసన్‌పై మరిన్ని కఠిన చర్యలు తీసుకునేలా చార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు. దూకుడు ఓపెనర్ అయిన హసన్ అంతర్జాతీయ క్రికెట్లో కేవలం మూడు వన్డేలు, 10 టీ20లే ఆడాడు. 2009 టీ20 ప్రపంచకప్ విజేత పాక్‌జట్టులో హసన్ సభ్యుడు. పేలవ ప్రదర్శనతో 2010 అనంతరం పాక్ జట్టులో చోటు కోల్పోయాడు. పీఎస్ఎల్లో కరాచి కింగ్స్‌కు తరపున ఆడాడు. రెండో సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న ఆదేశ క్రికెటర్లు షర్జీల్ ఖాన్, నాసిర్ జంషేడ్, ఖలీద్ లతీఫ్‌లు ఇప్పటికే శిక్షను అనుభవిస్తున్నారు. షర్జీల్ ఖాన్‌ను రెండున్నరేళ్లు నిషేధించగా.. ఖలీద్ లతీఫ్‌పై పీసీబీ ఐదేళ్లు నిషేధం విధించింది. ఇక పీఎస్ఎల్ మూడో సీజన్ కూడా దుబాయ్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. -
క్షుద్రపూజలతో టెస్ట్ సిరీస్ గెలిచాం!
కొలంబో : ఆధునిక టెక్నాలజీతో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారుతున్నవేళ క్రికెట్ రంగంలో ఊహించని పిడుగు! ప్రత్యర్థిని ఓడించాలంటే సమర్థత, మెరుగైన ప్రాక్టీస్, నిలకడతనం కంటే మంత్రాలు, చేతబడులను నమ్ముకుంటున్నవైనం!! ఇటీవల పాకిస్తాన్‌పై శ్రీలంక టెస్టు సిరీస్ నెగ్గడానికి కారణం క్షుద్రపూజలేనని లంక కెప్టెన్ దినేశ్ చండీమల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఏమైంది? : శ్రీలంక- పాకిస్తాన్ జాతీయ జట్ల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా(సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 29 వరకు) రెండు టెస్ట్‌లు, ఐదు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. టెస్ట్ సిరీస్‌ను లంక 2-0 తేడాతో కైవసం చేసుకుంది. పర్యటన ముగించుకుని లంక టీం మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ చండీమల్ విలేకరులతో మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. మంత్రగత్తె ఆశీర్వాదంతో.. : ‘‘క్రికెట్లో ఆటగాడికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. కాస్త అదృష్టం కూడా కలిసిరావాలని నేను నమ్ముతాను. ఆ అదృష్టం మనకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొరుకుతుందో చెప్పలేం. అందుకే మతగురువులు, మంత్రగాళ్లు అనే తేడా లేకుండా అందరి దగ్గరా నేను ఆశీర్వాదాలు తీసుకుంటాను. పాకిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు వెళ్లేముందు ఓ మంత్రగత్తెను కలిశా. శ్రీలంక చేతిలో పాకిస్తాన్ ఓడిపోయేలా చేతబడి చేస్తానని ఆమె మాటిచ్చారు. ఆ తల్లి ఆశీర్వాదబలం, పూజల వల్లే మేం సిరీస్ గెలిచాం’’ అని లంక సారధి చండీమల్ చెప్పారు. రెండు మ్యాచ్‌ల్లోనూ అతను శతకం, అర్థశతకం సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మంత్రాలతో మ్యాచ్‌లు గెలవొచ్చా? : చండీమల్ వ్యాఖ్యలపై యావత్ క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. క్రికెట్లో క్షుద్రపూజలేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఒకవేళ మంత్రాలతో మ్యాచ్‌లు గెలవగలిగితే.. టెస్ట్ సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు, ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో దారుణంగా ఎందుకు ఓడిపోయింది?’ అని ప్రశ్నిస్తున్నారు. పాక్‌తో టెస్ట్ సిరీస్ నెగ్గిన లంక.. 0-5తో వన్డే సిరీస్‌ను, 0-3 తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. -
పాక్‌లో మా రాయబారిని చంపేస్తారేమో!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో కొత్తగా నియమితులైన తమ రాయబారికి మరింత భద్రతను కల్పించాలని పాక్‌ను చైనా కోరింది. ఉగ్రవాదుల నుంచి తమ రాయబారి ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో చైనా ఈ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చైనా ఎంబసీ అక్టోబర్ 19వ తేదీన పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తమ రాయబారిని హతమార్చేందుకు నిషేధిత తూర్పు టర్కీస్థాన్ ఇస్లామిక్ మూమెంట్‌కు చెందిన ఉగ్రవాది పాక్‌లోకి ప్రవేశించాడని ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో పనిచేస్తున్న తమ దేశస్తులకూ భద్రతను కల్పించాలని చైనా– పాక్ ఎకనామిక్ కారిడార్( సీపీఈసీ) ప్రాజెక్టులో కీలక భూమిక పోషిస్తున్న పింగ్ ఫి లేఖలో కోరారు. -
కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తిన పాక్ ఫ్యాన్స్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ చేతులో ఘోర పరాజయం పొంది చాంపియన్స్ ట్రోఫీని కోల్పోయి భారతీయులతో తిట్లు తిన్నా పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల మనసులను మాత్రం టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ కొళ్లకొట్టాడు. ఓటమి అనంతరం కెప్టెన్ హోదాలో అతడు ఇచ్చిన స్పీచ్‌కు పాక్ క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. తమపై సముచిత గౌరవాన్ని ప్రకటించిన కోహ్లీ నిజమైన ఆడగాడని, అసలైన కెప్టెన్ అంటూ వారు ట్వీట్ల వర్షం కురిపించారు. ఆదివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడిన భారత్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిశాక కెప్టెన్ కోహ్లీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ తుది ఫలితం మాకు నిరాశ కలిగించినా ఫైనల్ చేరడం సంతృప్తినిచ్చింది. మేం ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేదు కానీ పాకిస్తాన్ మరింత పట్టుదలతో ఆడింది. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో కూడా వారు దూకుడు కనబర్చారు. తమదైన రోజున పాక్ ఎవరినైనా ఓడించగలదని మళ్లీ రుజువైంది. టోర్నీలో వారు కోలుకున్న తీరు అద్భుతం. హార్దిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బుమ్రా నోబాల్‌లాంటి చిన్న పొరపాట్లు కూడా ఒక్కోసారి పెద్దగా మారిపోతాయి. మా బలం (ఛేజింగ్)పై నమ్మకముంది. కానీ ఈసారి అది సరిపోలేదు. అయితే మేం ఓడింది ఒక్క మ్యాచ్ మాత్రమే. తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళతాం. ఈ సందర్భంగా విజయం సాధించిన పాక్‌కు నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. అన్ని పరిస్థితులు వారికి అనుగుణంగా మారిపోయాయి. మేం కొంత నిరుత్సాహపడిన ఇప్పటికీ నా ముఖంలో చిరునవ్వుందంటే కారణం మేం ఫైనల్‌కు చేరడం సంతృప్తి నిచ్చింది. ఫఖార్ జమాన్ లాంటి ఆటగాళ్లకు ఒక రోజంటూ వచ్చినప్పుడు వారిని అపడం కష్టమవుతుంది. ఎందుకంటే అతడు ఆడిన 80శాతం షాట్లు కూడా హై రిస్క్‌తో కూడుకున్నవి. ఒక బౌలర్‌గా, కెప్టెన్‌గా ఇలాంటిది జరుగుతున్నప్పుడు కలిసొచ్చే రోజున దేన్నయినా మార్చేందుకు ఈ ఒక్కడు చాలేమో అనిపిస్తుంది’ అని అన్నాడు. ఈ స్పీచ్‌కు ఫిదా అయిన పాక్ క్రికెట్ అభిమానులు మ్యాచ్ ముగిశాక కోహ్లీ స్పీచ్ సూపర్ అన్నారు. ‘ధన్యవాదాలు కోహ్లీ.. మ్యాచ్ ముగిశాక నువు చేసిన ప్రకటనతో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నావు. నువ్వు చాలా గొప్ప ఆటగాడివి. జెంటిల్‌మెన్‌వి కూడా’... మాకోసం మంచి మనసుతో నువ్వు చెప్పిన మాటలకు ధన్యవాదాలు, ఇండియా టీమ్ చాలా గొప్పది.. కోహ్లీ ఇంటర్వ్యూలో నిజమైన క్రీడాకారుడిగా స్ఫూర్తినిచ్చారు’ అంటూ ఇలా పలు ట్వీట్లు కురిపించారు. Thank you @imVkohli with your post match statement you won many hearts. You are a great player and a gentleman too — Mubasher Lucman (@mubasherlucman) 18 June 2017 Thank you @imVkohli for very kind words for us. And Team India, you're a really good team. It is an honour to have won from World Champions. — Marvi Sirmed (@marvisirmed) 18 June 2017 Credit too to @imVkohli for being gracious to PK and their fans - no greater team to play against — fatima bhutto (@fbhutto) 18 June 2017 Superb sportsmanship from @imVkohli in the interview right now. -
పాకిస్తాన్ జట్టుకు ఝలక్
కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ చేరుకున్న ఆనందంలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. పాక్ టీమ్‌కు మ్యాచ్ రిఫరీల ప్యానల్ ఝలక్ ఇచ్చింది. నిర్ణీత సమయం కంటే తక్కువ ఓవర్లు వేసినందుకు జరిమానా విధించింది. పాక్ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం చొప్పున కోత విధించింది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు 20 శాతం జరిమానా వేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.5.1 నిబంధన కింద ఈ చర్య తీసుకుంది. తప్పును ఒప్పుకోవడంతో పాటు జరిమానా చెల్లించేందుకు పాకిస్తాన్ టీమ్ అంగీకరించడంతో దీనిపై ఇక ఎటువంటి విచారణ జరపాల్సిన అవరసరముండదు. రెండోసారి కూడా పాక్ జట్టు ఇదే తప్పు చేస్తే కెప్టెన్ సర్ఫరాజ్‌ను ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం ఎదుర్కొవాల్సివుంటుంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన శ్రీలంకతో జరిగిన గ్రూప్‘బీ’ మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో పాకిస్తాన్ తలపడనుంది. సర్ఫరాజ్ (79 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపించాడు. -
కష్టాల్లో పాక్..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్- శ్రీలంక మధ్య జరుగుతున్న చావో రేవో మ్యచ్ లో లంక బౌలర్ల దాటికి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. 237 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 34 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ అహ్మద్(28), మహ్మద్ అమీర్(4) లు పోరాడుతున్నారు. చేతిలో 3 వికెట్లు ఉండగా పాక్ విజయానికి 67 పరుగులు అవసరం. పాక్ బ్యాట్స్ మెన్స్ లో ఫకార్ జమాన్(50; 8 ఫోర్లు, 1 సిక్స్) అజార్ అలీ( 34) ల మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. -
స్పాట్ ఫిక్సింగ్: క్రికెటర్‌పై నిషేధం
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ జాడ్యం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)కు పాకింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వేటు వేసింది. అతడు క్రికెట్ ఆడకుండా రెండు నెలల పాటు నిషేధం విధించింది. లక్ష రూపాయల జరిమానా వేసింది. నవాజ్‌పై విధించిన నిషేధం మే 16 నుంచి అమల్లోకి వస్తుందని పీసీబీ ప్రకటించింది. 23 ఏళ్ల నవాజ్ పీఎస్ఎల్లో స్పాట్ ఫిక్సింగ్ చేసేందుకు తనను సంప్రదించిన బుకీల వివరాలు పీసీబీ విజిలెన్స్ అండ్ సెక్యురిటీ విభాగంకు అందించడంలో విఫలమయ్యాడు. దీంతో పీసీబీ అతడిపై చర్య తీసుకుంది. పీసీబీ నిర్దేశించిన విధంగా లిఖితపూర్వక వివరణయిస్తే నవాజ్‌పై నిషేధం నెల రోజులకు తగ్గించే అవకాశముంది. ఫిబ్రవరి-మార్చిలో జరిగిన రెండో పీఎస్ఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు నవాజ్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై ఆరోపణలు వచ్చాయి. మహ్మద్ ఇర్ఫాన్‌పై పీసీబీ ఏడాది పాటు నిషేధం విధించింది. మూడు టెస్టులు, 9 వన్డేలు ఆడిన నవాజ్... పీఎస్ఎల్లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. -
స్పాట్ ఫిక్సింగ్: అడ్డంగా దొరికిపోయారు
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తాజాగా మరో క్రికెటర్ విచారణ ఎదుర్కోనున్నాడు. గత ఫిబ్రవరిలో జరిగిన పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో నలుగురు క్రికెటర్లలు స్పాట్‌ఫిక్సింగ్‌లో దొరికిపోయారు. ఖలీద్ లతీఫ్, షర్జీల్ ఖాన్, పేసర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు మరో బ్యాట్స్‌మన్ షహజైబ్ హసన్‌పై ఆరోపణలు రావడంతో పీసీబీ అవినీతి వ్యతిరేక కోడ్ కింద అభియోగం నమోదైంది. 2009లో టీ20 ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో షహజైబ్ సభ్యుడిగా ఉన్నాడు. షహజైబ్ హసన్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను మే 4 వరకు అందించాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను అవినీతి వ్యతిరేక ట్రైబ్యునల్ ఆదేశించింది. -
కశ్మీరీ క్రికెటర్ల తీరుపై తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఉద్విగ్న వాతావరణం ఉంటుంది. కశ్మీర్లో ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. కాకపోతే ఇక్కడ పాకిస్థాన్ జట్టు జెర్సీ ధరించిన ఆటగాళ్లు కశ్మీరీలు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కశ్మీరీ క్రికెటర్లు గ్రీన్ జెర్సీ ధరించడంతో పాటు పాకిస్థాన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. మరో జట్టు ఆటగాళ్లు తెల్లటి దుస్తులు ధరించారు. గాండ్రెబల్ జిల్లాలోని వేయిల్ ప్లే గ్రౌండ్లో జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కశ్మీరీ క్రికెటర్ల తీరుపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేశారు. భారతీయులు పన్నుల రూపంలో చెల్లించే డబ్బులతో జీవిస్తూ, పాకిస్థాన్ జాతీయ గీతాన్ని పాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెనాని-నష్రీ టన్నెల్‌ను ప్రారంభించడానికి కశ్మీర్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగినపుడు, ఇతర సందర్భాల్లో కశ్మీర్లో పాకిస్థానీ జెండాలు ప్రదర్శించిన సంఘటనలు ఉన్నాయి. -
స్పాట్ ఫిక్సింగ్: పాకిస్థాన్ క్రికెటర్‌పై వేటు
కరాచీ: వివాదాలకు, అనిశ్చితికి పాకిస్థాన్ క్రికెట్ మారుపేరు. ఎప్పుడు ఎవరు జట్టులో ఉంటారో, కెప్టెన్‌గా ఎవరు ఉంటారో, ఎప్పుడెలా ఆడుతారో ఊహించడం కష్టం. దీనికి తోడు పాకిస్థాన్ క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు షరా మామూలే. తాజాగా స్పాట్ ఫిక్సింగ్ కేసులో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్‌పై వేటు వేశారు. ఇర్ఫాన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత పొడగరి అయిన ఫాస్ట్ బౌలర్‌గా ఇర్ఫాన్‌కు గుర్తింపు ఉంది. పాక్ తరఫున నాలుగు టెస్టులు, 60 వన్డేలు, 20 టి-20 మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇర్పాన్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓ బుకీ అతన్ని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పీసీబీ విచారణకు ఆదేశించింది. సోమవారం పీసీబీ అవినీతి నిరోధక కమిటీ ముందు ఇర్ఫాన్ హాజరైనా సమాధానం ఇవ్వలేదు. అతని కుటుంబ సభ్యులు మరణించడంతో బాధలో ఉన్నట్టు సమాచారం. బుకీలతో సంబంధాలు, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి అతనిపై పీసీబీ ఛార్జిషీట్ నమోదు చేసి, సస్పెండ్ చేసింది. 14 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలపై మరో ఇద్దరు క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ సస్పెండ్ అయ్యారు. దీనిపై పీసీబీ విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్ కేసులోనే మరో పాక్ క్రికెటర్ నసీర్ జంషెడ్ అరెస్టయ్యాడు. గతంలో పాక్ అంతర్జాతీయ క్రికెటర్లు మహ్మద్ ఆమీర్, సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్‌లు ఫిక్సింగ్ కేసులో సస్పెండ్ కావడంతో పాటు జైలు శిక్ష అనుభవించారు. గతంలో ఇంకా పలువురు పాక్ క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. -
మిస్బా మరో రికార్డు
క్రైస్ట్ చర్చ్: పాకిస్థాన్ టెస్టు క్రికెట్ టీమ్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ మరో రికార్డు సాధించాడు. పాకిస్థాన్ జట్టుకు ఎక్కువ టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించిన ఘనత దక్కించుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో అతడు ఆడుతున్నాడు. కెప్టెన్ గా ఈ మ్యాచ్ అతడికి 50వది. ఇమ్రాన్ ఖాన్ రికార్డు అతడు అధిగమించాడు. ఇమ్రాన్ ఖాన్ 48 టెస్టుల్లో పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇప్పటివరకు 68 టెస్టులు ఆడిన మిస్బా ఉల్ హక్ 48.31 సగటుతో 4831 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలున్నాయి. ఉపఖండం జట్ల(భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్,) లో ఎక్కువ టెస్టు సిరీస్ విజయాలు అందించిన కెప్టెన్ గానూ మిస్బా ఖ్యాతికెక్కాడు. భారత దిగ్గజ కెప్టెన్లయిన సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ రికార్డును అధిగమించి అతడీ ఘనత అందుకున్నాడు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకాలనుకున్న మిస్బా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అభ్యర్థన మేరకు మరికొంత కాలం కొనసాగేందుకు అంగీకరిచాడు. భవిష్యత్ లో అతడు మరిన్ని రికార్డులు సాధించడం ఖాయమని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. -
గాల్లోకి ఎగిరి.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు
-
గాల్లోకి ఎగిరి.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు
పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ 19 టెస్టులు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏడేళ్ల కెరీర్ ఉంది. అయితే టెస్టు ఫార్మాట్లో ఇంతకుముందు ఒక్క క్యాచ్ కూడా పట్టుకోలేకపోయాడు. షార్జాలో వెస్టిండీస్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆమిర్ కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఆమిర్ అందుకున్నది తొలి క్యాచే అయినా అద్భుతం చేశాడు. పాక్ బౌలర్ జుల్ఫికర్ బాబర్ బౌలింగ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ డారెన్ బ్రావో షాట్ ఆడబోయాడు. సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న ఆమిర్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆమిర్ బంతి పట్టుకున్న సమయంలో పూర్తిగా గాల్లో ఉన్నాడు. అతని శరీరం ఎక్కడా గ్రౌండ్‌కు టచ్ కాలేదు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. టెస్టు క్రికెట్లో ఇంత ఆలస్యంగా తొలి క్యాచ్ పట్టిన క్రికెటర్ ఆమిరే. షార్జా టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేయగా, వెస్టిండీస్ 337 పరుగులు చేసింది. 2010లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆమిర్‌తో పాటు పాక్ క్రికెటర్లు సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్‌లపై ఐదేళ్లు నిషేధం విధించారు. ఈ ఏడాది జనవరిలో ఆమిర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. -
పాక్ క్రికెటర్లూ.. ఇక చాలు, పరువు తీయొద్దు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ల తీరుపై స్వదేశంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. సెంచరీ చేసినా లేదా మ్యాచ్ గెలిచినా మైదానంలో పాక్ ఆటగాళ్లు బస్కీలు తీయడాన్ని తప్పుపడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటుదని అధికార పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్౦-నవాజ్ సెనెటర్ రాణా అఫ్జాల్ ఖాన్ విమర్శించారు. బుధవారం క్రీడల సెనెట్ స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా అఫ్జాల్ ఖాన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 'క్రికెట్ అన్నది జెంటిల్మెన్ గేమ్. ఆటగాళ్లు ఇలా బస్కీలు చేస సంబరాలు చేసుకోవడం హుందాగా ఉండదు. క్రికెటర్లు ఇలా చేయడం వల్ల దేశ ప్రతిష్ట పోతుంది. ఇలాంటి విన్యాసాలను ఆపాలి. దీనికి బదులుగా మరో పద్ధతిలో సంబరాలు చేసుకోవచ్చు' అని అఫ్జాల్ ఖాన్ సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర చట్టసభ సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజామ్ సేథీ స్పందిస్తూ.. క్రికెటర్లు ఇకమీదట ఇలాంటి విన్యాసాలు చేయకుండా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా క్రికెటర్లు ఇలా ప్రవర్తించారని, భవిష్యత్‌లో ఇలా చేయకుండా ఆంక్షలు విధిస్తామని చెప్పారు. గత జూలైలో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ సెంచరీ చేసిన తర్వాత తొలిసారి బస్కీలు చేశాడు. ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెటర్లందరూ కెప్టెన్ బాటలో నడిచారు. లార్డ్స్ టెస్టు గెలిచాక పాకిస్థాన్ క్రికెటర్లందూ బస్కీలు తీయడంపై విమర్శలు వచ్చాయి. -
సంచలన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సాక్షి మాలిక్ !
⇒ ఆటగాళ్లకు ఏ దేశంలోనైనా ఆడే హక్కు ఉంది రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత, భారత రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన తీవ్ర పరిణామాల దృష్ట్యా.. పాక్ ఆటగాళ్లపై భారత్ లో నిషేధం విధించాలా అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎక్కడైనా, ఏ దేశంలోనైనా పోటీలో పాల్గొనే హక్కు అథ్లెట్లు, ఆటగాళ్లకు ఉంటుందని సాక్షి అభిప్రాయపడింది. దీంతో భారత్ లో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వాలని అర్థం వచ్చేలా కామెంట్ చేసిందని ఆమెపై భిన్న కథనాలు వచ్చాయి. అయితే తాను పాక్ ఆటగాళ్లను అన్ని ఈవెంట్లలోనూ భారత్ లో ఆడనివ్వాలని వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలను ఆమె తోసిపుచ్చింది. తాను ప్రస్తావించిన అంశాలను మీడియాకు మహిళా రెజ్లర్ వెల్లడించింది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ తో పాటు ఇతర దేశాల్లో నిర్వహించే అన్ని ఈవెంట్లలో ఆటగాళ్లు పాల్గొంటారు. అంతేకానీ, పాక్ ప్లేయర్స్ ను భారత్ లో నిషేధించవద్దని తాను ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఇతర ప్లేయర్స్ లా తాను వ్యవరించనని స్పష్టంచేసింది. పతకాలు సాధించడం కంటే దేశం కోసం ఇంకా ఏదైనా మంచిపని చేస్తే ఎక్కువగా సంతోషపడతానని సాక్షి చెప్పింది. ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన తర్వాత దేశంలో చాలా మంది తనను గుర్తిస్తున్నారని, దాంతో తన బాధ్యత మరింత పెరిగిందని వివరించింది. -
రాజ్‌నాథ్ పాక్‌లో ఎన్నిసార్లు టాయ్‌లెట్‌కు వెళ్లారు?
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత వారం సార్క్ సమావేశాల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ వెళ్లినప్పుడు పాకిస్థాన్ మీడియా, అధికారులు అడుగడుగున ఆయన్ను ఏదోరకంగా అవమానించేందుకే ప్రయత్నించారు. సార్క్ సమావేశాల్లో ఆయన ప్రసంగాన్ని భారత జర్నలిస్టులు కవర్ చేయకుండా అడ్డుకున్నారు. టెర్రరిస్టులను అమరు వీరులుగా కీర్తించడం ఏమాత్రం తగదని రాజ్‌నాథ్ సింగ్ సార్క్ వేదికపై నుంచి పరోక్షంగా పాక్‌ను హెచ్చరించిన అంశాన్ని ఏ మాత్రం కవర్ చేయని పాక్ మీడియా, ఆయన ఎందుకు 8 సార్లు టాయ్‌లెట్‌కు వెళ్లారంటూ అర్థంపర్థంలేని కథనాలను ప్రముఖంగా ప్రచురించింది. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడ కూడదో, ఎప్పటికప్పుడు భారతీయ అధికారులను సెల్‌ఫోన్ ద్వారా సంప్రదించేందుకు వీలుగానే ఆయన ఎనిమిదిసార్లు టాయ్‌లెట్స్‌కు వె ళ్లారని పాక్ మీడియా వ్యాఖ్యానించింది. వాస్తవానికి రాజ్‌నాథ్ సింగ్ రెండే రెండు సార్లు వాష్‌రూమ్‌కు వెళ్లారని, అది సార్క్ సంప్రదాయం ప్రకారం సార్క్ నాయకులు పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌ను కలుసుకున్నప్పుడు, సార్క్ సమావేశాలు ముగిశాక మరోసారి వాష్ రూమ్ వెళ్లారని భారత మీడియా తెలియజేసింది. ఆ సమయంలో రాజ్‌నాథ్ సింగ్ వద్ద సెల్‌ఫోన్ కూడా లేదని, ఆయన భారత్‌లో ఉన్నప్పుడు కూడా తన వెంట సెల్‌ఫోన్ పెట్టుకోరని హోం శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్ హోం మంత్రి ఇచ్చిన విందుకు హాజరుకాకపోవడాన్ని కూడా పాక్ మీడియా వివాదం చేసింది. తాను ఎందుకు విందులో పాల్గొనకుండా భారత్ తిరిగి రావాల్సి వచ్చిందో రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ ముఖంగానే వివరణ ఇచ్చిన విషయం తెల్సిందే. తనను విందుకు ఆహ్వానించిన పాక్ హోం మంత్రి తనను తీసుకొని వెళ్లకుండానే ఒక్కరే కారెక్కి వెళ్లిపోయారని, ఆయనతోపాటు పాక్ అధికారులెవరూ ఆ విందుకు హాజరుకాలేదని, అలాంటప్పుడు భారత్ పరువును కాపాడేందుకే తాను విందుకు వెళ్లలేదని ఆయన వివరణ ఇచ్చారు. సార్క్ సమావేశాలను కవర్ చేయడానికి పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మీడియాకు బహూశ మొదటిసారి పాక్ అధికారులు, పాక్ మీడియా అడ్డుకొంది. సార్క్ సమావేశాల వేదిక వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించిన పాక్ అధికారులు, లాబీలో సార్క్ దేశాల నేతలను కలుసుకునేందుకు భారత మీడియా చేసిన ప్రయత్నాలను పాక్ మీడియా సహకారంతో అడ్డుకున్నారు. పాక్ భద్రతా సిబ్బంది ఆదేశాల మేరకు భారత్ మీడియా ఎక్కడికెళితే అక్కడ మీడియాకు ముందు నిలబడి ఫొటోలు తీయకుండా, వీడియోలో తీయనీయకుండా పాక్ మీడియా అడ్డుకుందని భారత మీడియా సంస్థలు ఆదివారం ఆరోపించిన విషయం తెల్సిందే. ఎప్పటిలా కాకుండా ఈ సారి భారత జర్నలిస్టులకు వీసాలను కూడా పాక్ అధికారులు నియంత్రించారు. -
పండగ చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్లు
లార్డ్స్: ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ టీమ్ విభిన్నంగా విజయోత్సవం జరుపుకుంది. లార్డ్స్ మైదానంలో 20 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ లో గెలవడంతో పాక్ క్రికెటర్ల సంబరాలు మిన్నంటాయి. పాకిస్థాన్ ప్లేయర్లు ఐదేసి పుష్-అప్లు తీశారు. జాతీయ గీతం పడుతూ తమ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. ఆదివారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ ఆటగాళ్లందరినీ ఒక్కచోటుకు చేర్చి ఈ విన్యాసాలు చేయించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన తర్వాత కెప్టెన్ మిస్బా కూడా పుష్-అప్ లు తీశాడు. లార్డ్స్ మైదానంలో తొలి సెంచరీ సాధించడంతో తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌పై సెంచరీ చేసిన ప్రతిసారి పుష్-అప్లు తీస్తానని పాకిస్థాన్ సైన్యానికి ప్రమాణం చేసినట్టు మిస్బా వెల్లడించాడు. మ్యాచ్ లో విజయం సాధించడంతో సహచరులు కూడా అదేవిధంగా హర్షాతిరేకాలు తెలిపారు. -
పాక్ క్రికెట్ లో ఖాన్ కామెంట్స్ దుమారం
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ చేసిన 'డిగ్రీ' వ్యాఖ్యలపై సీనియర్ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెటర్లు చదువులో వెనకబడ్డారని, మిస్బా-వుల్-హక్ మినహా డిగ్రీ చదివాళ్లే లేరని షహర్యార్ కామెంట్ చేశారు. దీనిపై సీనియర్ బ్యాట్స్ మన్ మహ్మద్ హఫీజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదువుతో ఆటకు సంబంధం ఏమిటని ప్రశ్నించాడు. క్రికెట్టే తమకు కంప్లీట్ ఎడ్యుకేషన్ అని అన్నాడు. టెస్టు క్రికెటర్ గా చెప్పుకోవడానికి గర్వపడతానని, అదే తన డిగ్రీ అని వ్యాఖ్యానించాడు. అయితే అందరికీ చదువు ముఖ్యమేనని, దీనికి డిగ్రీలే కొలమానం కాదన్నాడు. పాకిస్థాన్ క్రికెటర్లు చదువును నిర్లక్ష్యం చేస్తున్నారని షహర్యార్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సీనియర్ ఆటగాళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే వారు బహిరంగంగా మాట్లాడకుండా, తమ అభిప్రాయాలను పీసీబీ వర్గాలకు రహస్యంగా వెల్లడించినట్టు సమాచారం. -
డబ్బులు ఇవ్వాలంటూ క్రికెటర్‌కు బెదిరింపులు
కరాచీ: డబ్బు కోసం తనను గుర్తు తెలియని వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ పాకిస్తాన్ క్రికెటర్ షర్జీల్ ఖాన్ చెప్పాడు. తనకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకుంటే తన నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించినట్టు తెలిపాడు. షర్జీల్ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. 'కొందరు గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. లేకుంటే నా భవిష్యత్‌కు భంగం కలిగించేలా వీడియోలను పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఎవరైనా అలాంటి వీడియోలను పోస్ట్ చేస్తే దయచేసి నమ్మకండి. అవన్నీ నకిలీ వీడియోలు. కొందరు నా ట్విట్టర్, ఫేస్బుక్ ఎకౌంట్లను కూడా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు' అని అభిమానులు, స్నేహితులను ఉద్దేశించి షర్జీల్ ట్వీట్ చేశాడు. బెదిరింపుల కేసులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పోలీసులు షర్జీల్‌కు అండగా నిలిచారు. ఆసియా కప్, ప్రపంచ టి-20 కప్‌లో పాక్‌కు షర్జీల్ ప్రాతినిధ్యం వహించాడు. -
వెంటాడుతున్న ప్రపంచ కప్ వైఫల్యం
లాహోర్: టి-20 ప్రపంచ కప్‌లో విఫలమైన పాకిస్తాన్ క్రికెటర్లు షాహిద్ అఫ్రిదీ, అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్‌కు నిరాశ ఎదురైంది. వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో ఈ ముగ్గురికి ఆడే అవకాశం దక్కలేదు. ఇంజమామ్ ఉల్ హక్ సారథ్యంలోని పాక్ సెలెక్షన్ కమిటీ ఇంగ్లండ్ టూర్‌కు 35 ఆటగాళ్లతో ప్రాబబుల్స్ జాబితాను ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 14 నుంచి జూన్ 4 వరకు ఖైబర్-పాక్టుంక్వా ప్రావిన్స్‌లో శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. టి-20 ప్రపంచ కప్‌లో విఫలమైనందుకు అఫ్రిదీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్ పేలవ ప్రదర్శనతో పాటు క్రమశిక్షణ చర్యల కింద వారిపై వేటు వేశారు. ఇంగ్లండ్ పర్యటనలో పాక్ నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టి-20 మ్యాచ్ ఆడనుంది. -
పాక్‌లో క్రికెట్‌కు విండీస్ నిరాకరణ
కరాచీ: పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ) నిరాకరించింది. దీంతో తమ దేశంలో క్రికెట్ పునరుద్ధరణకు విశ్వప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను విండీస్ నిర్ణయం నిరాశలో ముంచింది. ఈ సెప్టెంబర్-అక్టోబర్‌లో యూఏఈలో ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనుంది. అయితే దీంట్లో రెండు మ్యాచ్‌లను పాక్‌లో ఆడాల్సిందిగా విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ)ను పీసీబీ కోరింది. కానీ భద్రతాకారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని యూఏఈలోనే ఆడతామని విండీస్ బోర్డు తమకు తెలిపినట్టు పీసీబీ పేర్కొంది. తమ దేశంలో పరిస్థితులు మారాయని వివిధ బోర్డులకు ఎంత నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోతోందని పీసీబీ ఉన్నతాధికారి అన్నారు. -
క్షమించమని వీడియో పెట్టిన స్టార్ క్రికెటర్
దుబాయ్: టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైఫ్యలంపై కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కూడా అదే బాటలో నడిచాడు. తనను మన్నించాలని పాకిస్థాన్ ప్రజలను వేడుకున్నాడు. అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయామని వాపోయామంటూ తన ట్విటర్ పేజీలో వీడియో సందేశం పోస్టు చేశాడు. 'నా గురించి ఇతరులు ఏమనుకున్నా నేను లెక్క చేయను. కానీ మీకు(పాకిస్థాన్ ప్రజలకు) జవాబుదారీగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజు నన్ను క్షమించమని కోరుతున్నా. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ టీమ్, నేను అంచనాలకు తగినట్టు ఆడలేకపోయాం' అంటూ బ్రీఫ్ వీడియో ద్వారా వేడుకున్నాడు. తానెప్పుడూ దేశం కోసమే ఆడానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడలేదని అన్నాడు. 20 ఏళ్ల నుంచి స్టార్ హోదా మోస్తున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న అతడు స్వదేశానికి రాగానే కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) భావిస్తోంది. 36 ఏళ్ల ఆఫ్రిది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత్ లో పలు వివాదాలు ఎదుర్కొన్నాడు. -
మొహాలీలో పాకిస్తాన్ జట్టుకే మద్దతు
మొహాలీ: భారత్ వేదికపై దాయాది పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అనూహ్య మద్దతు లభిస్తోంది. టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అభిమానులు పాక్ టీమ్‌కు మద్దతు తెలిపారు. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు అభిమానులు 'పాకిస్తాన్ జీతేగా', 'అఫ్రిదీ లలా' అంటూ స్టేడియం హోరెత్తిపోయేలా నినాదాలు చేశారు. దీంతో పాక్ టీమ్‌కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న అనుభూతి కలిగింది. మొహాలీ స్టేడియంలో 27 వేల సీటింగ్ కెపాసిటీ ఉంది. పాక్-ఆసీస్ మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అఫ్రిదీ ఆటను చూసేందుకు వచ్చానని అనంత్‌నాగ్‌కు చెందిన ఆమిర్ అనే యువకుడు చెప్పాడు. అతను దగ్గరలోని రాజ్‌పురాలో చదువుతున్నాడు. పాకిస్తాన్ జట్టు అంటే పెద్దగా ఆసక్తి లేదని, అఫ్రిదీ కోసం వచ్చామని సరబ్ ప్రీత్ అనే యువకుడు చెప్పాడు. పాటియాలాకు చెందిన సరబ్ సోదరుడితో కలసి మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. పాక్ జట్టుకు స్థానికులతో పాటు కశ్మీరీ విద్యార్థులు మద్దతు ఇస్తున్నారు. ఇదే ఈవెంట్లో న్యూజిలాండ్, పాక్ మ్యాచ్ కూడా ఈ వేదికలోనే జరిగింది. -
'నా దేశ అభిమానుల్ని చిన్నబుచ్చలేదు'
కోల్‌కతా: భారత్‌లోనే పాకిస్థాన్ క్రికెటర్లకు అమితమైన ప్రేమాభిమానాలు లభిస్తున్నాయన్న తన వ్యాఖ్యలపై తన స్వదేశంలో విమర్శలు వస్తుండటంతో పాక్ టీ20 టీం కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ స్పందించాడు. తన దేశాన్ని చిన్నబుచ్చే ఉద్దేశం తనకు లేదని, అభిమానులపై గౌరవాన్ని చాటుతూ సానుకూల సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం మాత్రమే తాను చేశానని ఆయన పేర్కొన్నాడు. 'నేను పాకిస్థాన్ జట్టుకు సారథిని మాత్రమే కాదు, పాక్ ప్రజలందరి తరఫున ప్రతినిధిని. నా వ్యాఖ్యలను సానుకూల దృక్పథంతో చూడాలి. పాకిస్థాన్ అభిమానుల కన్నా ఇతరులెవరూ నాకు ఎక్కువ అనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. నాకు ప్రస్తుతమున్న ఈ గుర్తింపు మొత్తం పాకిస్థాన్ నుంచి వచ్చిందే' అని అఫ్రిది పేర్కొన్న ఆడియో సందేశాన్ని పీసీబీ తన ట్విట్టర్లో పేజీలో పోస్టు చేసింది. అఫ్రిదీ గత ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు. కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్ చేశాను. అందులో భారత్ ఒకటి. ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది. ఇంతటి ప్రేమకు మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్‌తోపాటు పలువురు అఫ్రిది వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యల వివాదాన్ని చల్లబర్చేలా పత్రికా ప్రకటన చేసిన అఫ్రిది.. సానుకూల దృక్పథంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తన వ్యాఖ్యలను ప్రపంచం మొత్తం గమనిస్తుంది కాబట్టి భారత్‌లో ఆడినప్పుడు మేం బాగా ఆస్వాదిస్తామని చెప్పానని, ఇదేమాటను గతంలో వసీం అక్రం, వకార్ యూనిస్, ఇంజమాముల్ హక్ కూడా చెప్పారని అఫ్రిది గుర్తుచేశాడు. -
అఫ్రిదీ.. నిన్ను చూసి సిగ్గుపడుతున్నా..!
కరాచీ: పాకిస్థాన్ టీ20 జట్టు సారథి షాహిద్ అఫ్రిదిపై ఆ దేశ మాజీ క్రికెటర్ జావేద్ మియందాద్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. పాకిస్థాన్ క్రికెటర్లను భారతీయులే ఎక్కువగా ప్రేమిస్తారన్న అఫ్రిది వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోయాడు. 'మన క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నా' అంటూ ఆగ్రహంగా పేర్కొన్నాడు. క్రికెట్ ఆడినంతకాలం భారత్ జట్టుకు కొరకరాని కొయ్యగా వ్యవహరించిన మియందాద్.. తన కొడుకుకు మాఫియా గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం కూతురితో పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ జట్టు భారత్‌కు వెళ్లింది టీ20 వరల్డ్ కప్ ఆడటానికే కానీ, ఆ దేశాన్ని ప్రశంసల్లో ముంచెత్తడానికి కాదని మియందాద్ పేర్కొన్నాడు. 'భారతీయులు మనకేం ఇచ్చారు? భారత్‌లో ఉన్నా నిజాన్నే మాట్లాడండి. గత ఐదేళ్ల కాలంలో పాకిస్థాన్ క్రికెట్‌కు వాళ్లు ఏమైనా ఇచ్చారా? పాకిస్థాన్ జట్టుకు ఎంతోకాలం సేవలందించిన నేను.. మన ఆటగాళ్ల నోటి నుంచి ఇలాంటి మాటలు వినడం బాధించింది. షాక్‌కు గురిచేసింది' అని ఆజ్ చానెల్‌తో ఆయన చెప్పాడు. భారత్‌లో అడుగుపెట్టిన సందర్భంగా అఫ్రిది, షోయబ్ మాలిక్ భారత్ క్రికెట్ ప్రేమికులను ప్రశంసల్లో ముంచెత్తిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు కోల్‌కతాలో అగుడుపెట్టిన సందర్భంగా అఫ్రిదీ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు. కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్ చేశాను. అందులో భారత్ ఒకటి. ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది. ఇంతటి ప్రేమకు మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్ తొలి వార్మప్ మ్యాచ్ రద్దు
కోల్ కతా: వరల్డ్ టీ 20లో భాగంగా శనివారం నగరంలోని ఈడెన్ గార్డెన్ లో బెంగాల్ జట్టుతో జరగాల్సి ఉన్న పాకిస్తాన్ తొలి వార్మప్ మ్యాచ్ రద్దయ్యింది. పాక్ ఆటగాళ్ల భద్రతపై భారత ప్రభుత్వం నుంచి హామీ లభించిన అనంతరం ఆ దేశ క్రికెట్ జట్టు శుక్రవారం సాయంత్రం వరల్డ్ టీ 20 బయల్దేరనుంది. రేపు సాయంత్రం లోగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌కు వచ్చే అవకాశం ఉండటంతో ఆ జట్టు ఆడే తొలి వార్మప్ మ్యాచ్ రద్దు చేయక తప్పలేదు. ఇదిలా ఉండగా, ఇదే స్టేడియంలో మార్చి 14 వ తేదీన పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య రెండో వార్మప్ మ్యాచ్ యథావిధిగా జరుగనుంది. భారత్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనపై గత కొన్ని రోజులుగా అనిశ్చితి నెలకొన్న క్రమంలో మ్యాచ్ టికెట్ల అమ్మకం కూడా ఆలస్యం కానుంది. ఈ నెల 19 వ తేదీన ఇరు జట్ల మధ్య కోల్ కతాలో జరిగే మ్యాచ్ కు సంబంధించి టికెట్ల అమ్మకాన్ని 16వ తేదీ నుంచి ఆరంభిచనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) స్పష్టం చేసింది. భద్రతా కారణాల నేపథ్యంలో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ ను ధర్మశాల నుంచి కోల్ కతాకు మార్చడం కెట్ల అమ్మకం ఆలస్యం కావడానికి మరో కారణం. -
పాక్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియర్
ఇస్లామాబాద్:వరల్డ్ టీ 20లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించే అంశంపై దాదాపు పదిరోజులకు పైగా ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టును భారత్‌కు పంపేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమ క్రికెట్ జట్టును భారత్ కు పంపుతున్నట్లు పాక్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పాక్ క్రికెట్ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని భారత ప్రభుత్వం తరపున హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీ ఇవ్వడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పురుషుల, మహిళ క్రికెట్ జట్లు శుక్రవారం రాత్రి భారత్‌కు పయనం కానున్నాయి. పాక్ క్రికెట జట్ల భద్రత గురించి భారత్ రాత పూర్వక హామీ ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తమ ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం నుంచి రాత పూర్వక హామీని పాకిస్తాన్ కోరింది. దీనిపై ఎట్టకేలకు స్పందించిన భారత ప్రభుత్వం పాక్ క్రికెట్ జట్టు భద్రతకు ఎటువంటి ముప్పు ఉండదని స్పష్టం చేయడంతో అందుకు పాక్ ప్రభుత్వం అంగీకరించింది. ఇదిలాఉండగా, ఈ నెల 19వ తేదీన కోల్ కతాలో భారత్ తో తలపడే పాకిస్తాన్ మ్యాచ్ భద్రతపై ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించింది. -
'పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రత మాది'
కోల్‌కతా: వరల్డ్ టీ 20లో భాగంగా ఈనెల 19వ తేదీన నగరంలోని ఈడెన్ గార్డెన్ లో భారత్ తో తలపడనున్న పాకిస్తాన్ జట్టు భద్రతపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ లభించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌లు లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలతో కూడిన రెండు లేఖలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్)అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి అందజేశారు. పాక్ క్రికెట్ భద్రతకు ఎటువంటి ఢోకా ఉండదని ఆ లేఖలో పేర్కొన్నారు. తమ జట్టుకు భారత్ ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకమైన హామీ లభిస్తేనే వరల్డ్ టీ20లో పాల్గొంటామని పీసీబీ భీష్మించుకుని కూర్చున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా భారత్‌తో పాకిస్తాన్ తలపడే మ్యాచ్‌లపై అనిశ్చిత నెలకొన్న నేపథ్యంలో ధర్మశాలలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ కోల్ కతాకు మారింది. దాంతో పాటు తమ ఆటగాళ్లు అక్కడ ఆడుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఎదుర్కోకూడదని, భారత ప్రభుత్వంనుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు తమ జట్టు భారత్‌కు బయల్దేరమని అని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి నిసార్ అలీ ఖాన్ చౌదరి పేర్కొన్నారు. లక్ష మంది సామర్థ్యం గల ఈడెన్గార్డెన్స్లోకి ఎవరైనా అవాంఛిత వ్యక్తులు వస్తే ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. దాంతో స్పందించిన క్యాబ్.. తమ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక హామీని ఐసీసీకి అందజేసింది. మరోవైపు పాకిస్తాన్ కోరిన భారత ప్రభుత్వం హామీ మాత్రం లభించలేదు. భారత్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు సంబంధించి ఎలాంటి రాతపూర్వక హామీ ఇవ్వబోమని భారత్ శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకుకేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు.ఈ నేపథ్యంలో భారత్ లో పాకిస్తాన్ పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు. -
పాకిస్తాన్ షరతును తిరస్కరించిన భారత్
న్యూఢిల్లీ: టి-20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడేందుకుగాను ఆ దేశం పెట్టిన షరతును భారత్ తిరస్కరించింది. భారత్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు సంబంధించి ఎలాంటి రాతపూర్వక హామీ ఇవ్వబోమని స్పష్టం చేసింది. శుక్రవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు ప్రకటన చేశారు. భారత్ ఆతిథ్యమిస్తున్న టి-20 ప్రపంచ కప్‌లో పాక్ పాల్గొనే విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ నెల 19న భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ జరగాల్సివుండగా.. భద్రత కారణాలతో పాటు పాక్ కోరిక మేరకు వేదికను కోల్‌కతాకు తరలించారు. అయితే భద్రత గురించి భారత్ రాత పూర్వక హామీ ఇవ్వాలని, అప్పుడే తమ జట్టు ఆ దేశానికి వెళ్తుందని, అప్పటి దాకా పాకిస్తాన్ నుంచి కదలరని ఆ దేశ ప్రభుత్వం షరతు విధించింది. ఇందుకు భారత్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో పాక్ జట్టు భారత పర్యటనకు వచ్చే విషయంలో స్పష్టత రాలేదు. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియర్
లాహోర్: టి-20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకుగాను భారత్‌కు వచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియరైంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ మేరకు అనుమతి మంజూరు చేశారు. ఈ నెల 19న భారత్, పాకిస్తాన్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరగాల్సివుంది. కాగా ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్రానికి లేఖరాయడంతో అనిశ్చితి ఏర్పడింది. ఈ వేదికలోనే మ్యాచ్ జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత పాక్ క్రికెట్ జట్టు భారత్‌కు వస్తోంది. ముంబైలో ఉగ్రవాద దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే ఆసియా కప్, ప్రపంచ కప్‌లలో ఇరు జట్లు పాల్గొనడం మినహా ద్వైపాక్షి సిరీస్‌లు ఆడటం లేదు.