హారీస్ రవూఫ్.. ప్రస్తుత పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. తన పేస్ బౌలింగ్‌తో ప్యత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలిగే సత్తా ఉన్న స్పీడ్ స్టార్. 2020లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రవూఫ్.. వరల్డ్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే రవూఫ్ ఈ స్ధాయికి ఎదగడం వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. చదువుకునే రోజుల్లో కనీసం ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బులు లేకపోయేవి అంట. ఈ విషయాలను అతడే స్వయంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
"పదో తరగతి తర్వాత నేను ఇంటర్మీడియట్‌లో చేరాను. కానీ మా కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడేవాళ్లు. దీంతో నా ఫీజు చెల్లించడానికి ప్రతీ ఆదివారం మార్కెట్‌లో స్నాక్స్ అమ్మేవాడిని. వారంలో మిగిలిన రోజుల్లో క్లాస్‌లకు హాజరయ్యేవాడిని. ఆ తర్వాత నేను యూనివర్శిటీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఫీజులు చాలా ఎక్కువగా ఉండేవి.
మా నాన్నతో పాటు నేను కూడా ఆ ఫీజులను భరించలేకపోయాను. ఈ సమయంలో టేప్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాను. నాకు బాగా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులతో యూనివర్శిటీ ఫీజు కట్టేవాడిని. పాకిస్తాన్‌లో టేప్-బాల్ క్రికెట్ ఆడే ఆటగాళ్లు బాగా సంపాదిస్తారు. నెలకు దాదాపు 2 నుంచి 3 లక్షలవరకు సంపాదించవచ్చు.
నేను నా ఫీజు కట్టగా.. మిగిలిన డబ్బులను మా అమ్మకు ఇచ్చేవాడిని. నేను ఈ స్ధాయికి చేరుకోవడం వెనక మా అమ్మనాన్న కష్టం కూడా ఉంది. మాది ఉమ్మడి కుటంబం. మొత్తం మా నాన్నకు నలుగురు అన్నదమ్ములు. అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. దీంతో చోటు సరిపోక కొన్ని రోజుల పాటు వంటగదిలో నిద్రపోయేవాళ్లం. నా చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించాను”అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవూఫ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: IND vs NEP: 23 పరుగుల తేడాతో ఘన విజయం.. సెమీస్‌కు చేరిన టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment