Haris Rauf
-
ఐదేసిన స్పెన్సర్ జాన్సన్.. పాక్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆసీస్.. ఇవాళ (నవంబర్ 16) జరిగిన రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ (20), మ్యాక్స్‌వెల్ (21), స్టోయినిస్ (14), టిమ్ డేవిడ్ (18), ఆరోన్ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు.SPENSER JOHNSON FIVE WICKET HAUL.- A terrific spell against Pakistan! 👌pic.twitter.com/W8J1lMp4Xl— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2024అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఐదు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. జాన్సన్‌కు టీ20 కెరీర్లో ఇది తొలి ఐదు వికెట్ల ఘనత. మరో ఎండ్‌లో ఆడమ్ జంపా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. జంపా నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరో పేసర్ జేవియర్ బార్ట్లెట్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశాడు. బార్ట్లెట్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఇర్ఫాన్ ఖాన్ (37 నాటౌట్), మొహమ్మద్ రిజ్వాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బాబర్ ఆజమ్ 3, ఫర్హాన్ 5, అఘా సల్మాన్ 0, అబ్బాస్ అఫ్రిది 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 0, సూఫియాన్ ముఖీమ్ 0, హరీస్ రౌఫ్ 2 పరుగులకు ఔటయ్యారు. ఈ గెలుపుతో ఆసీస్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 హోబర్ట్ వేదికగా నవంబర్ 18న జరుగుతుంది. -
చరిత్ర సృష్టించిన హరీస్ రౌఫ్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా షాదాబ్ ఖాన్ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్ ఈ ఘనత సాధించాడు. రౌఫ్ తన 72 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్లో 107 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ 96 ఇన్నింగ్స్‌ల్లో 107 వికెట్లు పడగొట్టాడు. పాక్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ తర్వాత షాహిద్ అఫ్రిది (97 వికెట్లు), షాహీన్ అఫ్రిది (96) ఉన్నారు. 2020లో టీ20 అరంగేట్రం చేసిన రౌఫ్ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే పాక్ తరఫున లీడింగ్ వికెట్‌టేకర్‌గా అవతరించాడు.ఆసీస్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్ మరో ఘనత కూడా సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు (4-0-22-4) నమోదు చేసిన విదేశీ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంకకు చెందిన నువాన్ కులశేఖర పేరిట ఉండేది. కులశేఖర 2017లో నాలుగు వికెట్లు తీసి 31 పరుగులిచ్చాడు. ఈ జాబితాలో రౌఫ్, కులశేఖర తర్వాత కృనాల్ పాండ్యా (4/36), క్రిస్ వోక్స్ (3/4), టిమ్ సౌథీ (3/6) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ (20), మ్యాక్స్‌వెల్ (21), స్టోయినిస్ (14), టిమ్ డేవిడ్ (18), ఆరోన్ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే 12 బంతుల్లో 24 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందిన విషయం తెలిసిందే. -
నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఆస్ట్రేలియా
సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. హరీస్ రౌఫ్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. రౌఫ్ వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరో బౌలర్ అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. అబ్బాస్ కీలకమైన మాథ్యూ షార్ట్ వికెట్‌తో పాటు టెయిలెండర్ల వికెట్లు తీశాడు. స్పిన్నర్ సూఫియాన్ ముఖీమ్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 20, జోస్ ఇంగ్లిస్ 0, మ్యాక్స్‌వెల్ 21, స్టోయినిస్ 14, టిమ్ డేవిడ్ 18, ఆరోన్ హార్డీ 28, జేవియర్ బార్ట్లెట్ 5, స్పెన్సర్ జాన్సన్ 0 పరుగులకు ఔటయ్యారు. నాథన్ ఇల్లిస్ 1, ఆడమ్ జంపా 0 పరుగులతో అజేయంగా నిలిచారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. 7 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా.. పాక్ 7 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
AUS Vs PAK: ఏడేళ్ల తర్వాత పాక్ సాధించింది..!
ఆసీస్ గడ్డపై పాక్ ఏడేళ్ల తర్వాత తొలిసారి ఓ వన్డేలో విజయం సాధించింది. జనవరి 15, 2017లో పాక్ చివరిసారి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై (మెల్బోర్న్) ఓ వన్డేలో ఓడించింది. 2854 రోజుల తర్వాత పాక్ తిరిగి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది. అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 8) జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆసీస్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో హరీస్ రౌఫ్ (8-0-29-5).. ఆతర్వాత బ్యాటింగ్‌లో సైమ్ అయూబ్ (71 బంతుల్లో 82; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరికి తోడు మొహమ్మద్ రిజ్వాన్ వికెట్‌కీపింగ్‌లో చెలరేగాడు. రిజ్వాన్ ఈ మ్యాచ్‌లో ఏకంగా ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో నవంబర్ 10న పెర్త్ వేదికగా జరుగనుంది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా హరీస్ రౌఫ్ (5/29), షాహీన్ అఫ్రిది (3/26), నసీం షా (1/65), మొహమ్మద్ హస్నైన్ (1/27) ధాటికి 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 26.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజతీయాలకు చేరింది. ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో (69 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపాకు ఓ వికెట్ దక్కింది. -
నిప్పులు చెరిగిన రౌఫ్.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన పాక్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాలో 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. హరీస్ నిప్పులు చెరిగే బంతులలో ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. రౌఫ్ 8 ఓవర్లలో 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మరో ఎండ్ నుంచి ఫాహీన్ అఫ్రిది కూడా ఆసీస్ బ్యాటర్లపై అటాకింగ్ చేశాడు. అఫ్రిది 8 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పేసర్లు నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మాథ్యూ షార్ట్ 19, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 13, జోష్ ఇంగ్లిస్ 18, లబూషేన్ 6, హార్డీ 14, మ్యాక్స్‌వెల్ 16, కమిన్స్ 13, స్టార్క్ 1, జంపా 18, హాజిల్‌వుడ్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 164 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. 26.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఓపెనర్ సైమ్ అయూబ్ మెరుపు హాఫ్ సెంచరీతో (71 బంతుల్లో 82; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అలరించగా.. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ (69 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు. బాబర్ ఆజమ్ 20 బంతుల్లో సిక్సర్ సాయంతో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే నవంబర్ 10న పెర్త్ వేదికగా జరుగనుంది. -
Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్ పేసర్.. కుప్పకూలిన ఆసీస్! ఇమ్రాన్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్తాన్ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కంగారూ జట్టును కోలుకోని దెబ్బకొట్టారు. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షాహిన్, రవూఫ్ దెబ్బకు కమిన్స్ బృందం కనీసం 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య శుక్రవారం నాటి రెండో వన్డేకు అడిలైడ్ వేదికగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నమ్మకాన్ని నిలబెడుతూ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ షార్ట్(19), జేక్ ఫ్రేజర్ మెగర్క్(13)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.ఐదు కీలక వికెట్లు అతడి సొంతంవన్డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్(35) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. హస్నైన్ అతడిని అవుట్ చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హ్యారిస్ రవూఫ్ జోస్ ఇంగ్లిస్(18), మార్నస్ లబుషేన్(6), ఆరోన్ హార్డీ(14), గ్లెన్ మాక్స్వెల్(16), ప్యాట్ కమిన్స్(13) రూపంలో ఐదు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. The man of the moment #AUSvPAK pic.twitter.com/t0UJ3iZJLh— cricket.com.au (@cricketcomau) November 8, 2024 మరోవైపు.. టెయిలెండర్లలో మిచెల్ స్టార్క్(1)ను షాహిన్ అవుట్ చేయగా.. ఆడం జంపా (18) కాసేపు పోరాడగా నసీం షా అతడిని బౌల్డ్ చేసి పని పూర్తి చేశాడు.Vintage Smith 👌#AUSvPAK pic.twitter.com/PWKlbk4NgK— cricket.com.au (@cricketcomau) November 8, 2024 ఈ క్రమంలో 35 ఓవర్లకే ఆస్ట్రేలియా కథ ముగిసింది. కేవలం 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆసీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదిస్తుందా? లేదంటే తొలి వన్డే మాదిరి ఈసారీ మ్యాచ్‌ను చేజార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌తో రెండో వన్డేలో హ్యారిస్ రవూఫ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షాహిన్ ఆఫ్రిది మూడు, నసీం షా, మహ్మద్ హస్నైన్ ఒక్కో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన హ్యారిస్ రవూఫ్.. పాక్ తరఫున తొలి పేసర్గాఆసీస్తో రెండో వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అడిలైడ్‌లో వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ పేసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును రవూఫ్ బద్దలు కొట్టాడు.ఇక అడిలైడ్‌లో అంతకు ముందు స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ వన్డేల్లో ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ పాక్ తరఫున ఈ ఘనత నమోదు చేసిన మొదటి బౌలర్‌గా కొనసాగుతున్నాడు.అడిలైడ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాక్ బౌలర్లుహ్యారిస్ రవూఫ్- 5/29*సక్లెయిన్ ముస్తాక్- 5/29ఇజాజ్ ఫాకిహ్- 4/43ఇమ్రాన్ ఖాన్-3/19షాహిన్ ఆఫ్రిది- 2/24.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
నా కుటుంబం జోలికి వస్తే ఇలాగే చేస్తా: పాక్ స్పీడ్‌స్టర్
పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ హ్యారిస్ రవూఫ్ తనపై జరుగుతున్న ట్రోలింగ్ పట్ల స్పందించాడు. ఆటగాడిగా తనను విమర్శిస్తే పట్టించుకోనని.. అయితే.. తన కుటుంబం జోలికి వస్తే అస్సలు ఊరుకోనని స్పష్టం చేశాడు.ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయంతో కూడా తన సంబంధం ఉండదని.. తన స్పందన ఇలాగే ఉంటుందని రవూఫ్ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.గ్రూప్-ఏలో ఉన్న బాబర్ ఆజం బృందం తొలుత అమెరికా, టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా, ఐర్లాండ్ జట్లపై గెలిచినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లీగ్ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడిన పాక్.. సూపర్-8 రేసు నుంచి అప్పటికే అవుటై పోయింది.పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలుఈ క్రమంలో మాజీ క్రికెటర్లు సహా సొంత అభిమానులు సైతం పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులో ఐక్యత లేకుండా గ్రూపులు కట్టి.. సర్వనాశనం చేశారని మండిపడుతున్నారుఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్ తన భార్యతో కలిసి అమెరికా వీధుల్లో వెళ్తుండగా ఓ వ్యక్తి అతడిని విమర్శిస్తూ మాటల యుద్ధానికి దిగాడు. దీంతో రవూఫ్ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తూ.. అతడి పైకి దూసుకెళ్లాడు.భార్య వద్దని వారిస్తూనే ఉన్నా.. కోపాన్ని నియంత్రించుకోలేక సంమయనం కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్ తొలిసారిగా స్పందించాడు.నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి రానంతవరకే‘‘సోషల్ మీడియా వరకు ఈ విషయం రావొద్దని అనుకున్నా. కానీ వీడియో ఎలాగో బయటకు వచ్చింది. కాబట్టి నేను స్పందించక తప్పడం లేదు.పబ్లిక్ ఫిగర్లుగా ఉన్న కారణంగా పబ్లిక్ నుంచి అన్ని రకాల ఫీడ్‌బ్యాక్‌ను మేము తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లే మమ్మల్ని సమర్థిస్తారు. ఒక్కోసారి విమర్శిస్తారు కూడా!కానీ.. నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి రానంతవరకే నేను వాటన్నింటినీ భరిస్తాను. ఒకవేళ ఈ విషయంలో వాళ్లు హద్దు దాటితే నేను కూడా వారికి తగ్గట్లుగానే బదులిస్తాను.ప్రొఫెషన్లకు అతీతంగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది’’ అని హ్యారిస్ రవూఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో ఈ రైటార్మ్ పేసర్ ఏడు వికెట్లు తీశాడు.pic.twitter.com/KuUSZWoDaq— Haris Rauf (@HarisRauf14) June 18, 2024 -
T20 World Cup 2024: అభిమానిపైకి దూసుకెళ్లిన పాక్ పేసర్.. భార్య వారించినా..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో పాక్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో పాక్.. భారత్, యూఎస్ఏ చేతుల్లో ఓటమిపాలై సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది. పాక్ కంటే మెరుగ్గా రాణించిన ఆతిథ్య దేశం యూఎస్ఏ.. భారత్‌తో పాటు సూపర్-8లోకి ప్రవేశించింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ పోరాటం ముగిసినా ఆ జట్టు ఇంకా స్వదేశానికి తిరుగు ముఖం పట్టలేదు. మరికొద్ది రోజుల పాటు పాక్ బృందం యూఎస్ఏలోనే గడపనున్నట్లు సమాచారం.A heated argument between Haris Rauf and a fan in the USA. pic.twitter.com/d2vt8guI1m— Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2024అయితే ఈ మధ్యలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. భార్యతో కలిసి అమెరికా వీధుల్లో షికారుకు వెళ్లిన రౌఫ్‌పై ఓ అభిమాని మాటల దాడికి దిగాడు. ఇందుకు ప్రతిగా రౌఫ్ సైతం గట్టిగానే స్పందించాడు. తాను ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతని చెప్పులు సైతం జారిపోయినా పట్టించుకోలేదు. ఆ అభిమాని ఏమన్నాడో తెలియదు కానీ.. రౌఫ్ కోపంతో ఊగిపోయాడు. దారిన పోయేవారు.. సెక్యూరిటీ వారిండంతో రౌఫ్ ఆడిపోయాడు. ఈ లోపు రౌఫ్‌ను రెచ్చగొట్టిన అభిమాని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అభిమాని పట్ల రౌఫ్ ప్రవర్తన చూసి సొంత దేశ అభిమానులు కూడా అతన్ని అసహ్యించుకుంటున్నారు. రౌఫ్ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి వీధి రౌడీలా ప్రవర్తించాడని చివాట్లు పెడుతున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు సహజమేనని.. ఇలాంటి సందర్భాల్లో పరిణితి ప్రదర్శించి చూసీ చూడనట్లు వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్-8 బెర్త్‌లు ఖరారైన విషయం తెలిసిందే. గ్రూప్-ఏ నుంచి భారత్‌తో (A1) పాటు యూఎస్ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
T20 World Cup 2024: పాక్ పేసర్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు
టీ20 వరల్డ్‌కప్ 2024లో పటిష్టమైన పాకిస్తాన్‌పై పసికూన యూఎస్ఏ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యూఎస్ఏ పాక్‌పై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించి చిరస్మరణీయ విజయం నమోదు చేసుకుంది. ఇరు జట్ల నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. సూపర్ ఓవర్లో యూఎస్ఏ మరింత అద్భుతంగా ఆడి పాక్‌ను మట్టికరిపించింది.యూఎస్ఏ ఆటగాళ్లు ఈ విజయాన్ని ఆస్వాధిస్తుండగానే ఆ దేశానికే చెందిన బౌలర్ (ప్రపంచకప్ జట్టులో సభ్యుడు కాడు) రస్టీ థెరాన్ పాక్ పేసర్ హరీస్ రౌఫ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. రౌఫ్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని థెరాన్ ఆరోపించాడు. కేవలం రెండు ఓవర్లు వాడిన బంతిని రౌఫ్ వేళ్లతో రద్దుతూ (బంతిని పాతగా చేసే ఉద్దేశంతో) కనిపించాడని అన్నాడు. బంతి రివర్స్ స్వింగ్ అవుతున్నందుకు రౌఫ్ ఈ పనికి చేశాడని కామెంట్ చేశాడు.ఈ విషయాన్ని ఐసీసీ చూసీ చూడనట్లు వదిలేసిందని మండిపడ్డాడు. రౌఫ్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు టీవీల్లో స్పష్టంగా కనిపించిందని అన్నాడు. రౌఫ్‌పై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు థెరాన్ ట్వీట్ చేశాడు.38 ఏళ్ల థెరాన్ 2010 నుంచి 2019 వరకు సౌతాఫ్రికాకు ఆడాడు. ఆ తర్వాత ఆ దేశం తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వలస వచ్చాడు. 2019 సెప్టెంబర్ నుంచి థెరాన్ యూఎస్ఏ జట్టుకు ఆడుతున్నాడు. యూఎస్ఏ టీ20 వరల్డ్‌కప్ జట్టులో థెరాన్కు చోటు దక్కలేదు. థెరాన్ 2010-15 మధ్యలో వివిధ ప్రాంచైజీల తరఫున ఐపీఎల్లో ఆడాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన థెరాన్ 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. -
పాకిస్తాన్ బౌలర్ అత్యంత చెత్త రికార్డు.. 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలోనే
పాకిస్తాన్ స్టార్ పేసర్ హ్యారీస్ రవూఫ్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్ లీగ్ స్టేజిలోలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రవూఫ్ నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023లో కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రవూప్ ఈ చెత్త రికార్డును సాధించాడు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన రవూఫ్ ఏకంగా 533 పరుగులిచ్చి.. ఈ ఆ ప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ పేరిట ఉండేది. 2019 వరల్డ్‌కప్‌లో రషీద్ 11 మ్యాచ్‌ల్లో 526 పరుగులు సమర్పించుకున్నాడు. తాజా వరల్డ్‌కప్‌తో రషీద్ చెత్త రికార్డును రవూఫ్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో రవూఫ్ అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. రషీద్, శ్రీలంక పేసర్ మధుషంక మూడో స్ధానంలో కొనసాగుతున్నారు. మధుషంక కూడా ఈ వరల్డ్‌కప్‌లోనే 525 పరుగులిచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. జోరూట్(60), జానీ బెయిర్ స్టో(59) పరుగులతో రాణించారు. ఆఖరిలో హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), డేవిడ్ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15) మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇఫ్తికర్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది. చదవండి: World Cup 2023: మిచెల్ మార్ష్ విధ్వంసకర శతకం.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం -
ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా?
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: భారత్‌లో వన్డే ప్రపంచకప్-2023.. రెండు వరుస విజయాలు.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు.. వెరసి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం.. ఇలాంటి దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దురదృష్టం వెక్కిరించింది.. ‘చోకర్స్’ అన్న పేరున్న జట్టు చేతిలో ఘోర పరాభవానికి గురై సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే దుస్థితికి చేరుకుంది.. ఈ ఉపోద్ఘాతమంతా పాకిస్తాన్ జట్టు గురించే అని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆరంభ శూరత్వమే! వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన బాబర్ ఆజం బృందం 81 పరుగులతో జయభేరి మోగించింది. అనంతరం మ్యాచ్‌లో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత గెలుపు అన్న మాటనే మరిచిపోయింది. చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత.. పాకిస్తాన్‌ను వరుసగా పరాజయాలే పలకరించాయి. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా సైతం తమపై జయకేతనం ఎగురవేయడంతో బాబర్ బృందం సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. నువ్వా- నేనా.. నరాలు తెగే ఉత్కంఠ అయితే, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అటు పాకిస్తాన్ ఆటగాళ్లు.. తమపై పాక్ ఆధిపత్యాన్ని తగ్గించడం సహా టేబుల్ టాపర్‌గా నిలించేందుకు ఇటు సౌతాఫ్రికా ప్లేయర్లు పోరాడిన తీరు మాత్రం క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. పాక్ విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 10 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ జట్టు మరోసారి చోకర్స్ అనిపించుకోవడం ఖాయమంటూ విశ్లేషణలు ఓవైపు.. ఆఖరి వికెట్ తీసేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచి నిలుస్తుందా అన్న చర్చలు మరోవైపు.. చివరి వరకు హైడ్రామా.. పాక్ గెలుపు ఖాయమైందన్నంతగా ఆ మధ్యలో 46వ ఓవర్ ఆఖరి బంతికి పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్.. సఫారీ జట్టు టెయిలెండర్ తబ్రేజ్ షంసీని అవుట్ చేసినంత పనిచేశాడు. పాక్‌కు గెలుపు ఖాయమైపోయిందన్నంత నమ్మకంగా ఎల్బీకి అప్పీలు చేశాడు. అయితే అనుభవజ్ఞుడైన అంపైర్ అలెక్స్ వార్ఫ్ అదేమీ లేదన్నట్లు అడ్డంగా తలూపాడు. పాకిస్తాన్‌కు వేరే ఆప్షన్ లేదు. రవూఫ్ ఓవైపు.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మరోవైపు నమ్మకంగా చెప్పడంతో కెప్టెన్ బాబర్ ఆజం రివ్యూకు వెళ్లాడు. సఫారీల అదృష్టం బాగుంది కానీ.. షంసీ అదృష్టం బాగుంది. బంతి లెగ్ స్టంప్‌ను జస్ట్ అలా ముద్దాడినట్లుగా అనిపించింది గానీ మిస్ అయింది.. అంపైర్స్ కాల్ నాటౌట్ కావడంతో సౌతాఫ్రికాకు ఫేవర్‌గా ఫలితం వచ్చింది. అంతే.. పాక్ ఆటగాళ్లు ఒక్కసారిగా నీరుగారిపోయారు. రవూఫ్ అయితే ఏడ్చినంత పనిచేశాడు. రిజ్వాన్ సైతం ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చి రవూఫ్‌ను హత్తుకుని ‘ఎమోషనల్’ అయ్యాడు. పాకిస్తాన్ శిబిరం మొత్తం నిరాశలో కూరుకుపోయింది. ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లలో కొందరు పాక్ ఆటగాళ్లకు సానుభూతి తెలుపుతుండగా.. ‘‘ఓవరాక్షన్ రిజ్వాన్‌ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. కాగా పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కాస్త అతి చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ సమయంలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించే క్రమంలో మాటిమాటికి గట్టిగా అప్పీలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆటతో సంబంధంలేని విషయాల్లోనూ తలదూరుస్తూ ఉంటాడు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. మేము చోకర్స్ కాదు.. అర్థమైందా? ఇక చెన్నై మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో పాక్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో 48వ ఓవర్ రెండో బంతికి కేశవ్ మహరాజ్ ఫోర్ బాది పాకిస్తాన్ ఓటమిని ఖరారు చేసి సౌతాఫ్రికాపై ఉన్న ‘చోకర్స్’(అంతా బాగా ఆడి ఆఖరి నిమిషంలో చేతులెత్తేస్తారన్న అర్థంలో) అన్న ట్యాగ్ ఇకపై తమకు వాడొద్దనేలా సంకేతాలు ఇచ్చాడు. ఇక సఫారీల చేతిలో ఓటమితో పాక్ సెమీ ఫైనల్ ఆశలకు దాదాపు గండిపడినట్లే! చదవండి: Ind vs Aus: టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్ అతడే WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్
ICC WC 2023- Pak Vs SA- Babar Azam Comments On Loss: ‘విజయానికి అత్యంత చేరువగా వచ్చాం.. కానీ సరైన ముగింపు ఇవ్వలేకపోయాం. జట్టు మొత్తం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఆఖరి ఓవర్లలో మేము తిరిగి పుంజుకున్న తీరు.. కనబరిచిన పోరాట పటిమ అద్భుతం. కానీ ఇలా జరిగిపోయింది’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విచారం వ్యక్తం చేశాడు. అలా అయితే ఫలితం వేరేలా ఉండేది తాము మరో 10-15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో హ్యాట్రిక్ ఓటములతో డీలాపడిన పాకిస్తాన్.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ప్రొటిస్ టెయిలెండర్ కేశవ్ మహరాజ్ ఫోర్ బాదడంతో.. ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్ రేసులో ముందుకు వెళ్లాలనుకున్న పాకిస్తాన్‌కు భంగపాటు ఎదురైంది. అందుకే ఓడిపోయాం ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బాబర్ ఆజం.. తమ ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారని.. కానీ దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాబట్టలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. అతడు అవుట్ అయితే సెమీస్ రేసులో ఉండేవాళ్లం అదే విధంగా.. 46వ ఓవర్ ఆఖరి బంతికి సౌతాఫ్రికా టెయిలెండర్ తబ్రేజ్ షంసీ విషయంలో ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేసిన పాకిస్తాన్‌కు ప్రతికూల ఫలితం వచ్చిన విషయాన్ని బాబర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘డీఆర్ఎస్ ఆటలో భాగం. ఒకవేళ అతడిని అవుట్‌గా పరిగణించినట్లయితే.. ఫలితం మాకు అనుకూలంగా ఉండేది. సెమీస్ రేసులో నిలిచేందుకు మాకు అవకాశాలు ఉండేవి. కానీ అలా జరుగలేదు’’ అని అంపైర్ కాల్ వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి మూడు మ్యాచ్‌లలో బాగా ఆడి పాకిస్తాన్‌ను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్న బాబర్.. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో ఎక్కడి వరకు చేరుకుంటామో చూద్దామంటూ నిర్వేదంగా మాట్లాడాడు. హైడ్రామా.. కాగా పేసర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో షంసీ ఎల్బీడబ్ల్యూ అయినట్లు నమ్మకంగా ఉన్న పాకిస్తాన్‌కు అంపైర్స్ కాల్ షాకిచ్చిన విషయం తెలిసిందే. రవూఫ్ సంధించిన ఇన్‌స్వింగర్ లెగ్ స్టంప్స్‌ను తాకినట్లుగా అనిపించింది. అయితే, బాల్ ట్రాకింగ్‌లో తృటిలో మిస్ అయినట్లు కనిపించగా.. నాటౌట్‌గా పేర్కొన్న అంపైర్స్ కాల్ వల్ల సౌతాఫ్రికా బతికిపోయింది. మరుసటి రెండో ఓవర్ వరకు హైడ్రామా నడవగా కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికా విజయ లాంఛనం పూర్తి చేశాడు. పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లు: ►వేదిక: చెన్నై చెపాక్ స్టేడియం ►టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్ ►పాక్ స్కోరు: 270 (46.4) ►సౌతాఫ్రికా స్కోరు: 271/9 (47.2) ►ఫలితం: ఒక్క వికెట్ తేడాతో సౌతాఫ్రికా విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తబ్రేజ్ షంసీ(4 వికెట్లు) చదవండి: WC 2023: అతడు లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి! గిల్ కూడా.. View this post on Instagram A post shared by ICC (@icc) -
మరీ చెత్తగా! బ్యాటర్లంతా అతడి వెంటే పడుతున్నారు: పాక్ బౌలర్‌పై సెటైర్లు
ICC ODI WC 2023: పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలతో వన్డే వరల్డ్‌కప్-2023 బరిలోకి దిగిన అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడని విమర్శించాడు. రవూఫ్ బౌలింగ్ అంటే చాలు బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మరీ చెత్తగా బౌలింగ్ చేశాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121) విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు పాక్ బౌలర్ల పప్పులు ఉడకలేదు. వీరిద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించారు. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ ఫాస్ట్‌బౌలర్ హ్యారిస్ రవూఫ్ 8 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసినప్పటికీ వార్నర్- మార్ష్ ద్వయం కారణంగా అప్పటికే ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. వికెట్లు తీసి ఏం లాభం? ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో పాక్ 305 పరుగులకే కుప్పకూలడంతో 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘షాహిన్ ఆఫ్రిది 5 వికెట్లు తీయడంతో పాకిస్తాన్ తిరిగి పుంజుకోగలిగింది. హ్యారిస్ రవూఫ్ కూడా ఆఖర్లో వికెట్లు తీశాడు. బ్యాటర్లు అతడి వెంట పడి తరుముతున్నారు కానీ ఏం లాభం! ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ట్యాప్ విరిగి నీళ్లు పారినట్లుగా ఆసీస్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో పరుగుల వరద పారించారు. రవూఫ్ బౌలింగ్‌లో చితక్కొట్టారు. ఇప్పటికే ఈ టోర్నీలో చాలా మంది బ్యాటరుల రవూఫ్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు. టెర్రర్ బౌలర్‌గా టోర్నమెంట్లో అడుగుపెట్టిర రవూఫ్ ఆ స్థాయికి తగ్గట్లు ప్రభావం చూపలేకపోతున్నాడు. బ్యాటర్లు అతడి వెంట పరిగెడుతూ పరుగులు సాధిస్తున్నట్లుగా అనిపిస్తోంది’’ అంటూ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌ను విమర్శించాడు. అయితే, తనదైన రోజు అతడు కచ్చితంగా ప్రభావం చూపుతాడని ఆకాశ్ చోప్రా పేర్కొనడం కొసమెరుపు. చదవండి: కోహ్లి సెంచరీ చేసిన తీరును తప్పుబట్టిన పుజారా! త్యాగం చేయాల్సింది.. View this post on Instagram A post shared by ICC (@icc) -
పాక్ స్టార్ పేసర్ ఓవరాక్షన్.. అయ్యర్‌పైకి బాల్ త్రో! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్, సిరాజ్, బుమ్రా, హార్దిక్, జడేజా తలా రెండు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో బాబర్ ఆజం(50),మహ్మద్ రిజ్వాన్(49) టాప్ స్కోరర్లగా నిలిచారు. రవూఫ్ ఓవరాక్షన్.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్ హ్యారీస్ రవూఫ్ ఓవరాక్షన్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రవూఫ్‌కు తన తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ చుక్కలు చూపించాడు. టీమిండియా ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన రవూఫ్.. తన మొదటి ఓవర్లోనే 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో రవూఫ్ కాస్త అసహనానికి లోనయ్యాడు. ఈ క్రమంలో తన తదుపరి ఓవర్లో శ్రేయస్ అయ్యర్ ఓ బంతిని బౌలర్ దిశగా డిఫెన్స్ ఆడాడు. అయితే బంతిని అందుకున్న రవూఫ్.. శ్రేయస్‌పై త్రో చేశాడు. దీంతో ఒక్కసారిగా అయ్యర్ పక్కకు తప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: #Virat Kohli: రిజ్వాన్ ‘ఓవరాక్షన్’కు కోహ్లి రియాక్షన్ అదిరింది! ఇంకెంత సేపు.. చాలుగానీ.. pic.twitter.com/ISKrDbMJFt — Cricket Videos Only (@cricketvideos23) October 14, 2023 -
పాక్ స్టార్ బౌలర్‌ను కొట్టిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. మహ్మద్ రిజ్వాన్(68), సౌధ్ షకీల్(68) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో 286 పరుగులు సాధించింది. అనంతరం బౌలింగ్‌లో హారీస్ రవూఫ్, హసన్ అలీ చెలరేగడంతో డచ్ జట్టు 205 పరుగులకు ఆలౌటైంది. రవూఫ్‌ను కొట్టిన బాబర్.. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరదగా పేసర్ హ్యారీస్ రవూఫ్ చెంపపై కొట్టాడు. రవూఫ్ తన ఓవర్ వేసేందుకు సిద్దమవుతుండగా బాబర్ ఏదో చెప్పడానికి వెళ్లి నవ్వుతూ చెంపపై టచ్ చేశాడు. దీంతో రవూఫ్ కూడా నవ్వుతూ ఎదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో రవూఫ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 9 ఓవర్లలో 43 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. చదవండి: థాంక్యూ హైదరాబాద్.. చాలా సంతోషంగా ఉంది! క్రెడిట్ మొత్తం వాళ్లకే: బాబర్ pic.twitter.com/R2yqeleKPj — cricbaaz2 (@cricbaaz2) October 6, 2023 -
'వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని! ఎన్నో కష్టాలు'
హారీస్ రవూఫ్.. ప్రస్తుత పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. తన పేస్ బౌలింగ్‌తో ప్యత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలిగే సత్తా ఉన్న స్పీడ్ స్టార్. 2020లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రవూఫ్.. వరల్డ్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రవూఫ్ ఈ స్ధాయికి ఎదగడం వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. చదువుకునే రోజుల్లో కనీసం ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బులు లేకపోయేవి అంట. ఈ విషయాలను అతడే స్వయంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. "పదో తరగతి తర్వాత నేను ఇంటర్మీడియట్లో చేరాను. కానీ మా కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడేవాళ్లు. దీంతో నా ఫీజు చెల్లించడానికి ప్రతీ ఆదివారం మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని. వారంలో మిగిలిన రోజుల్లో క్లాస్‌లకు హాజరయ్యేవాడిని. ఆ తర్వాత నేను యూనివర్శిటీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఫీజులు చాలా ఎక్కువగా ఉండేవి. మా నాన్నతో పాటు నేను కూడా ఆ ఫీజులను భరించలేకపోయాను. ఈ సమయంలో టేప్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాను. నాకు బాగా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులతో యూనివర్శిటీ ఫీజు కట్టేవాడిని. పాకిస్తాన్లో టేప్-బాల్ క్రికెట్ ఆడే ఆటగాళ్లు బాగా సంపాదిస్తారు. నెలకు దాదాపు 2 నుంచి 3 లక్షలవరకు సంపాదించవచ్చు. నేను నా ఫీజు కట్టగా.. మిగిలిన డబ్బులను మా అమ్మకు ఇచ్చేవాడిని. నేను ఈ స్ధాయికి చేరుకోవడం వెనక మా అమ్మనాన్న కష్టం కూడా ఉంది. మాది ఉమ్మడి కుటంబం. మొత్తం మా నాన్నకు నలుగురు అన్నదమ్ములు. అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. దీంతో చోటు సరిపోక కొన్ని రోజుల పాటు వంటగదిలో నిద్రపోయేవాళ్లం. నా చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించాను”అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవూఫ్ చెప్పుకొచ్చాడు. చదవండి: IND vs NEP: 23 పరుగుల తేడాతో ఘన విజయం.. సెమీస్‌కు చేరిన టీమిండియా -
Asia Cup 2023: పాకిస్తాన్‌కు బ్యాడ్ న్యూస్
ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకతో రేపు (సెప్టెంబర్ 14) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. టీమిండియాతో సూపర్-4 మ్యాచ్ సందర్భంగా గాయపడిన ఆ దేశ స్టార్ పేసర్ నసీం షా ఆసియా కప్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇవాళ (సెప్టెంబర్ 13) అధికారికంగా ప్రకటించింది. నసీం షా గాయం (భుజం) తీవ్రత అధికంగా ఉండటంతో, త్వరలో జరుగనున్న వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని అతనికి పూర్తి విశ్రాంతినిచ్చినట్లు పీసీబీ పేర్కొంది. నసీం షా స్థానాన్ని జమాన్ ఖాన్‌తో రీప్లేస్ చేస్తున్నట్లు వెల్లడించింది. జమాన్ ఇప్పటికే జట్టులో చేరిపోయాడని, ట్రైనింగ్‌లో కూడా పాల్గొంటున్నాడని తెలిపింది. నసీం షా జట్టును వీడినప్పటికీ, అతను నిరంతరం పీసీబీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని, ప్రపంచకప్ సమయానికంతా అతను పూర్తి ఫిట్‌నెస్ట్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు భారత్‌తో సూపర్-4 మ్యాచ్ సందర్భంగానే గాయపడిన మరో పేసర్ హరీస్ రౌఫ్‌పై పీసీబీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పీసీబీ డాక్టర్లు నసీం, రౌఫ్‌లు ఇద్దరు తమ పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు కాని, రౌఫ్ గురించి ప్రత్యేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో రౌఫ్ గాయం నుంచి కోలుకున్నాడని తెలుస్తుంది. నసీంతో పోలిస్తే రౌఫ్ గాయం తేలికపాటిదని, అతను పూర్తిగా రికవర్ అయ్యాడని సమాచారం. తొలుత పీసీబీ రౌఫ్‌కు కూడా రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించాలని భావించినప్పటికీ, అతను వేగంగా కోలుకోవడంతో ఆ అవసరం లేదని భావించినట్లు తెలుస్తుంది. రౌఫ్ రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి నసీం షా ఒక్కడే గాయం కారణంగా పాక్ జట్టును వీడాడు. కాగా, భారత్‌తో మ్యాచ్ తర్వాత గాయపడిన రౌఫ్‌కు రీప్లేస్‌మెంట్‌గా షానవాజ్ దహానిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023లో పాక్ భవితవ్యం రేపు (సెప్టెంబర్ 14) శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో తేలిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాక్ ఓడినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా ఆ జట్టు ఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే మాత్రం సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది. -
ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు బిగ్‌షాక్.. ఇక కష్టమే మరి!
ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే పాకిస్తాన్‌కు మరో బిగ్‌షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీం షా గాయం కారణంగా ఆసియాకప్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు సమాచారం. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్చేస్తుండగా వీరిద్దరూ గాయపడ్డారు. దీంతో రవూఫ్ పూర్తిగా రిజర్వ్‌డే రోజు మైదానం అడుగుపెట్టకపోగా.. నసీం షా బ్యాటింగ్‌కు రాలేదు. మరోవైపు వీరిద్దరూ బ్యాకప్‌గా యువ పేసర్లు షానవాజ్ దహానీ,జమాన్ ఖాన్లకు పాకిస్తాన్ క్రికెట్ పిలుపునిచ్చింది. వీరిద్దరూ మంగళవారం పాక్ జట్టుతో కలవనున్నారు. "హారీస్ రవూఫ్, నసీం షా ఇద్దరూ మా మెడికల్ ప్యానెల్ పరిశీలనలో ఉంటారు. వారి గాయాలు అంత తీవ్రమైనవి కావు. కానీ వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా వారిద్దరి ఆడించి రిస్క్ చేయకూడదని అనుకుంటున్నాము. ఈ నేపథ్యంలో షానవాజ్ దహానీ,జమాన్ ఖాన్లకు సిద్దంగా ఉండమని సమాచారమిచ్చాం. ఒక వేళ వీరిద్దరిని భర్తీ చేయాలని అనుకుంటే ఏసీసీ టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకుంటామని" పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 14న శ్రీలంకతో తలపడనుంది. చదవండి: అతడికి 5 నిమిషాల ముందు చెప్పాం.. కానీ! వాళ్లందరికీ చాలా థ్యాంక్స్: రోహిత్ -
Asia Cup 2023: పాకిస్తాన్‌కు భారీ షాక్! స్టార్ ప్లేయర్ దూరం.. కారణమిదే
Asia Cup 2023- Pakistan vs India: టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హ్యారిస్ రవూఫ్ రిజర్వ్ డే బౌలింగ్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ధ్రువీకరించాడు. కాగా ఆసియా కప్-2023లో భారత్- పాకిస్తాన్ తొలిసారి ఎదురుపడిన సందర్భంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైపోయింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని పల్లెకెల్లెలో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో దాయాదుల పోరు పూర్తి కాకుండానే అర్ధంతరంగా ముగిసిపోవడంతో చెరో పాయింట్ లభించింది. మరోసారి వర్షం ఆటంకం ఈ నేపథ్యంలో గ్రూప్-ఏలో అప్పటికే నేపాల్‌పై విజయంతో ఉన్న పాకిస్తాన్ సూపర్-4లో అడుగుపెట్టగా.. తమ రెండో మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తు చేసి రోహిత్ సేన సైతం అర్హత సాధించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆదివారం(సెప్టెంబరు 10) టీమిండియా- పాకిస్తాన్ మరోసారి పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బాబర్ ఆజం బృందం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ దిగిన భారత జట్టుకు ఓపెనర్లు.. కెప్టెన్ రోహిత్ రోహిత్ శర్మ(56), శుబ్‌మన్ గిల్(58) హాఫ్ సెంచరీలతో శుభారంభం అందించారు. వాళ్లకు చెరో వికెట్ అయితే, కొలంబోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో రిజర్వ్ డే ఉన్న కారణంగా ఆదివారం ఆటను నిలిపివేశారు. అప్పటికి.. 24.1 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా మళ్లీ వరుణుడు అడ్డుపడటంతో ఆలస్యమైంది. ఇక సెప్టెంబరు 10న ఆట రద్దు చేసే సమయానికి పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది, ఆల్‌రౌండర్ షాబాద్ ఖాన్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. హ్యారిస్ రవూఫ్ అవుట్.. కారణమిదే ఇక 5 ఓవర్ల బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చిన ఫాస్ట్‌బౌలర్ హ్యారిస్ రవూఫ్‌నకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఈ క్రమంలో రిజర్వ్ డే అయిన సోమవారం అతడు పూర్తిగా బౌలింగ్‌కు దూరంగా ఉండనున్నాడు. వరల్డ్‌కప్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విషయం గురించి మోర్నీ మోర్కెల్ స్పందిస్తూ.. అజీర్తి, కడుపులో మంట కారణంగా రవూఫ్ పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అతడిని ఈ మ్యాచ్‌కు దూరం ఉంచుతున్నట్లు తెలిపాడు. అదే సమయంలో ఇతర బౌలర్లను కూడా పరీక్షించే అవకాశం దొరుకుతుందని పాక్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో గత మ్యాచ్‌లో హ్యారిస్ రవూఫ్ మూడు వికెట్లతో రాణించాడు. చదవండి: Asia Cup: కొలంబోలో ఎడతెగని వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం! ఇక.. -
IND Vs. PAK: ఇది ఆరంభం మాత్రమే.. మున్ముందు: షాహిన్ ఆఫ్రిది వార్నింగ్!
Shaheen Afridi Ahead of Indo-Pak Asia Cup 2023 Clash: ‘‘టీమిండియాతో ప్రతి మ్యాచ్ దేనికదే ప్రత్యేకం. అభిమానులకు ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే పండుగే! నేను కూడా అండర్-16 క్రికెట్ మొదలుపెట్టక ముందు మిగతా ఫ్యాన్స్‌లాగే మ్యాచ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడిని. ఇప్పటి వరకు టీమిండియాతో నా బెస్ట్ స్పెల్ ఇదీ అని స్పెషల్‌గా చెప్పలేను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు సాధించాల్సింది.. అత్యుత్తమంగా చేసి చూపాల్సింది చాలా ఉంది’’ అని పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది అన్నాడు. టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చి కాగా 2018లో పాకిస్తాన్ తరఫున 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన షాహిన్ ఆఫ్రిది.. అద్భుత బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. అనతికాలంలో జట్టులో కీలక సభ్యుడిగా మారి.. ప్రస్తుతం ప్రధాన పేసర్ స్థాయికి చేరుకున్నాడు. కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 252 వికెట్లు పడగొట్టిన షాహిన్ ఆఫ్రిది.. ఆసియా కప్-2023తో బిజీగా ఉన్నాడు. టీమిండియాతో సెప్టెంబరు 2 నాటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన ఆఫ్రిది తదుపరి ఆదివారం మరోసారి భారత్‌తో మ్యాచ్‌లో మెరవాలనే పట్టుదలతో ఉన్నాడు. అదే మా విజయాలకు కారణం ఈ వన్డే టోర్నీలో ఇప్పటి వరకు ఏడు వికెట్లు పడగొట్టిన షాహిన్.. సహచర పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్‌లతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో మేము పోషించాల్సిన పాత్రలేంటో మాకు తెలుసు. కొత్త, పాత బంతితో ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా అవగాహన ఉంది. హ్యారిస్ తన వైవిధ్యమైన పేస్‌తో ప్రభావితం చేయగలడు. ఇక నసీం, నేను ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించడంపై ఎక్కువగా దృష్టి సారిస్తాం. మా మధ్య ఉన్న సమన్వయమే మా విజయాలకు కారణం’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా కొలంబోలో ఆదివారం.. సూపర్-4 దశలో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రిజర్వ్ డే కేటాయించారు. చదవండి: ఆ సిరీస్ నాటికి అందుబాటులోకి పంత్?; అలాంటి బ్యాటర్ కావాలి: రోహిత్ రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్ ఆఫ్రిది.. ఆరోజే బరాత్! -
Asia cup 2023: చెలరేగిన పాకిస్తాన్ బౌలర్లు.. కుప్పకూలిన బంగ్లాదేశ్
ఆసియాకప్-2023లో పాకిస్తాన్ పేసర్లు మరోసారి నిప్పులు చేరిగారు. ఈ మెగా టోర్నీ సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ పేస్ త్రయం అఫ్రిది, హారీస్ రౌఫ్, నసీం షా చుక్కలు చూపించారు. వీరిముగ్గురు దాటికి బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరగులకే కుప్పకూలింది. హారీస్ రౌఫ్, నసీం షా తలా మూడు వికెట్లతో బంగ్లాను దెబ్బతీయగా.. అఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, అష్రఫ్ చెరో వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్(64) పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ షకీబ్ అల్హసన్(53) పరుగులతో రాణించాడు. కాగా అంతకుముందు ఈ పేస్ త్రయం భారత్‌తో మ్యాచ్‌లో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: WC 2023: జింబాబ్వేపై ఆడాడని వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేశారా? జట్టులో దండుగ అతడు -
పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతో అతృతగా ఎదురుచూసిన అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లింది. ఆసియాకప్-2023లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారీ వర్షం కురవడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలవ్వలేదు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇరు జట్లకి చెరో పాయింట్ దక్కింది. దీంతో సూపర్-4కు గ్రూపు-ఏ నుంచి పాకిస్తాన్ అర్హత సాధించింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కిషన్ 82 పరుగులు చేయగా.. హార్దిక్ 87 పరుగులతో అదరగొట్టాడు. పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. హారీస్ రవూఫ్, నషీం షా తలా మూడు వికెట్లు సాధించారు. హారీస్ రవూఫ్ ఓవరాక్షన్.. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ పేసర్ హారీస్ రవూఫ్ ఓవరాక్షన్ చేశాడు. ఇషాన్ కిషన్న్ను ఔట్ చేసిన తర్వాత రౌఫ్ చేసిన సెలబ్రేషన్స్ శృతి మించాయి. భారత ఇన్నింగ్స్ 38వ ఓవర్ వేసిన రవూఫ్ బౌలింగ్‌లో కిషన్ భారీ షాట్‌కు ప్రయత్నించి బాబర్‌కు క్యాచి ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే రవూఫ్.. కిషన్ వైపు వేలు చూపిస్తూ ఇక చాలు వెళ్లు వెళ్లు అంటూ సైగలు చేశాడు. అయితే కిషన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుపోయినప్పటికీ.. మరో ఎండ్‌లో ఉన్న హార్దిక్ మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. రవూఫ్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది బ్యాట్‌తో సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. pic.twitter.com/n01RoPaDgb — Nihari Korma (@NihariVsKorma) September 3, 2023 -
Asia Cup 2023 IND VS PAK: చరిత్ర సృష్టించిన పాక్ పేసర్లు
ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ పేస్ త్రయం (షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్) చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) చరిత్రలో 10కి 10 వికెట్లు (ఓ మ్యాచ్‌లో) తీసిన తొలి పేస్ బౌలింగ్ అటాక్‌గా రికార్డుల్లోకెక్కింది. ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో ఓ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పేసర్లే తీయడం ఇదే మొదటిసారి. 39 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ పేసర్లే మొత్తం 10 వికెట్లు తీసింది లేదు. కాగా, నేటి మ్యాచ్‌లో పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (10-2-35-4), నసీం షా (8.5-0-36-3), హరీస్ రౌఫ్ (9-0-58-3) టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ త్రయం భారత బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. టీమిండియాపై ఈ ముగ్గురు స్పష్టమైన ఆధిపత్యం కనబర్చారు. ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, సిక్స్) ఆదుకోకపోయుంటే భారత పరిస్థితి దారుణంగా ఉండేది. ఇషాన్, హార్దిక్‌లతో పాటు ఆఖర్లో బుమ్రా కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ 266 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్ ముగిసాక వర్షం మొదలుకావడంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభంకాలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించాల్సి వస్తే 40 ఓవర్లలో 239 పరుగులు, 30 ఓవర్లలో 203, 20 ఓవర్లకు 155 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఛేదించాల్సి ఉంటుంది. -
కొనసాగుతున్న గిల్ వైఫల్యాల పరంపర.. ఏకి పారేస్తున్న అభిమానులు
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. గతకొంతకాలంగా చెత్త ప్రదర్శనలతో అభిమానులకు విసుగు తెప్పిస్తున్న గిల్.. తాజాగా పాక్‌తో జరుగుతున్న కీలక సమరంలో మరోసారి ఘోరంగా విఫలమై, భారత అభిమానులకు టార్గెట్‌గా మారాడు. నెటిజన్లు గిల్‌ను ఏకి పారేస్తున్నారు. గిల్‌ను జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. Shubman Gill is very scared of Naseem Today😂🤦♂️.#PAKvIND #INDvPAK #pakvsind #INDvsPAK pic.twitter.com/YGF81raK3a — F A ح A D.. 🖤 (@Ziddi_bOy_) September 2, 2023 గిల్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పనికొస్తాడని, ఇంటర్నేషనల్ క్రికెట్లో అతనికి అంత సీన్ లేదని విమర్శిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో గత 17 ఇన్నింగ్స్‌ల్లో (20, 0, 37, 13, 18, 6, 10, 29, 7, 34, 85, 3, 7, 6, 77, 9, 10 (పాక్‌తో మ్యాచ్‌లో)) అతను కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే చేశాడని, ఈ మాత్రం దానికి అతనికి వరుస అవకాశాలు ఇవ్వడం ఎందుకుని సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు. గిల్‌ను తప్పిస్తే తుది జట్టు కూర్పు కూడా సెట్ అవుతుందని.. రోహిత్‌కు జతగా ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపవచ్చని అంటున్నారు. 147kph thunderbolt from Haris Rauf cleans up Shubman Gill 🚀 pic.twitter.com/Y7Oovl6uYD — CricTracker (@Cricketracker) September 2, 2023 పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ బ్యాటింగ్ లోపాలు స్పష్టంగా బయటపడ్డాయని, అతను పాక్ పేసర్లను ఎదుర్కోలేక నానా ఇబ్బందులు పడ్డాడని అంటున్నారు. ముఖ్యంగా నేటి మ్యాచ్‌లో నసీం షాను ఎదుర్కొనేందుకు గిల్ చాలా బయపడ్డాడని, ఇది అతని ముఖంలో స్పష్టంగా కనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గిల్ పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు చేసి హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ పాక్ పేసర్లు సంధించిన బంతులను ఎదుర్కోలేక చేతులెత్తేశాడు. 🎯 Rohit Sharma - Clean-bowled by Shaheen Afridi 🎯 Virat Kohli - Bowled by Shaheen Afridi 🎯 Shubman Gill - Castled by Haris Rauf India's top-order was dismissed in a similar fashion.#INDvPAK pic.twitter.com/9YL2dD6H3K — CricTracker (@Cricketracker) September 2, 2023 ఇదిలా ఉంటే, పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఎదురీదుతుంది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఇషాన్ కిషన్ (54), హార్ధిక్ పాండ్యా (37) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 29 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 147/4గా ఉంది. రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లి (4)లను అఫ్రిది క్లీన్ బౌల్డ్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ (14), శుభ్‌మన్ గిల్లను (10) హరీస్ రౌఫ్ పెవిలియన్‌కు పంపాడు. -
పాక్ పేసర్ల విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా టాపార్డర్
ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న హైఓల్టేజీ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. పాక్ పేసర్ల ధాటికి వణికిపోతుంది. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో భారత టాపార్డర్ 66 పరుగులకే కుప్పకూలింది. తొలుత షాహీన్ అఫ్రిది భారత టాపార్డర్ బ్యాటర్ల భరతం పట్టగా.. తర్వాత హరీస్ రౌఫ్ టీమిండియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. SHAHEEN SHAH AFRIDI! Rohit Sharma is clean bowled 🎯#ShaheenShahAfridi #INDvsPAK #INDvPAK #PAKvIND #AsiaCup23 #AsiaCup #RohitSharma pic.twitter.com/MNBGY2ywza — Haqeeq Ahmed (@eyemHaqeeq) September 2, 2023 అఫ్రిది.. ఐదో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మను (11), ఏడో ఓవర్ మూడో బంతికి విరాట్ కోహ్లి (4) క్లీన్ బౌల్డ్ చేయగా.. హరీస్ రౌఫ్.. 10వ ఓవర్ ఆఖరి బంతికి శ్రేయస్ అయ్యర్‌ను (14), 15వ ఓవర్ తొలి బంతికి శుభ్‌మన్ గిల్‌ను (10) ఔట్ చేశాడు. దీంతో భారత్ 14.1 ఓవర్లలో కేవలం 66 పరుగులు మాత్రమే చేసి టాప్-4 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా టాప్-3 బ్యాటర్లు అఫ్రిది, రౌఫ్‌ల చేతుల్లో క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. Shaheen Afridi has Rohit Sharma AND Virat Kohli. Castles them both. There is absolutely no doubt about it. Best in the WORLD! 🔥🔥🔥 #PAKvIND #INDvsPAK #AsiaCup #AsiaCup23 #ShaheenAfridi #ViratKohli #RohitSharma pic.twitter.com/wk4YUVCoig — King Babar Azam Army (@kingbabararmy) September 2, 2023 శ్రేయస్ అయ్యర్ (14).. రౌఫ్ బౌలింగ్‌లో ఫకర్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 95/4గా ఉంది. ఇషాన్ కిషన్ (28), హార్దిక్ పాండ్యా (7) క్రీజ్‌లో ఉన్నారు. అఫ్రిది 5 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. రౌఫ్ 5 ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. Haris Rauf claims his first wicket and India loses three wickets inside 50 runs. 📸: Disney + Hotstar pic.twitter.com/KJbPCSt0QD — CricTracker (@Cricketracker) September 2, 2023 147kph thunderbolt from Haris Rauf cleans up Shubman Gill 🚀 pic.twitter.com/Y7Oovl6uYD — CricTracker (@Cricketracker) September 2, 2023 Shreyas Iyer's bat broken on Haris Rauf's delivery. pic.twitter.com/CWs68vOGgC — Mufaddal Vohra (@mufaddal_vohra) September 2, 2023