
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు పాకిస్తాన్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఇప్పటికే యువ సంచలనం సైమ్ అయూబ్ సేవలను కోల్పోయిన పాకిస్తాన్‌కు మరో భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ స్టార్ పేసర్ హరీస్ రవూఫ్ గాయపడ్డాడు. అతడి చీలమండకు గాయమైంది.
దీంతో మ్యాచ్ మధ్యలోనే రవూఫ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం తీవ్రతపై పీసీబీ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో గాయపడకముందు రవూఫ్ తన స్పెల్‌లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. కివీస్ స్టార్ ప్లేయర్ టామ్ లాథమ్‌ను రవూఫ్ పెవిలియన్‌కు పంపాడు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి రవూఫ్ దూరమైతే పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
ఎందుకంటే ఈ మెగా టోర్నీ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడంతో పాకిస్థాన్ పేస్ త్రయం షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీం షాపై ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు రవూఫ్ గాయం బారిన పడడం పాక్ జట్టు మెనెజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
కాగా ఫిబ్రవరి 12 వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే దేశాలు తమ జట్లలో మార్పులు చేసుకునే అవకాశముంది. ఈ క్రమంలో పాక్ జట్టులో కూడా మార్పులు చేసే ఛాన్స్ ఉందని పీసీబీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ హింట్ ఇచ్చారు. కాగా ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన పాక్ జట్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎందకంటే ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఫహీమ్ అష్రఫ్ ఖుష్దిల్ షాలను ఎంపిక చేయడం వివాదానికి తావిచ్చింది. పీసీబీ సెలక్షన్ కమిటీపై మాజీలు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment