
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు పాక్ స్పీడ్‌స్టర్ హరీస్ రౌఫ్‌కు గుడ్ న్యూస్ అందింది. రౌఫ్ తండ్రి అయ్యాడు. అతని భార్య ముజ్నా మసూద్ మాలిక్ మగబిడ్డకు జన్మనిచ్చింది. హరీస్ రౌఫ్-ముజ్నా మాలిక్‌కు ఇది తొలి సంతానం. రౌఫ్-ముజ్నా వివాహాం 2022, డిసెంబర్ 23న జరిగింది.
రౌఫ్ తొలిసారి తండ్రి అయిన విషయం తెలిసి అతని సహచరుడు షాహీన్ అఫ్రిది సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. నా సహోదరుడా.. మీకు మగబిడ్డ పుట్టినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నీకు, నీ కుటుంబానికి అంతులేని ఆనందం కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. అఫ్రిది పోస్ట్‌ను చూసి షాదాబ్ ఖాన్ కూడా రౌఫ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
ఇదిలా ఉంటే, స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భంగపడిన అనంతరం పాక్ మార్చి 16 నుంచి న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో పాక్ న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనకు బయల్దేరకముందే హరీస్ రౌఫ్‌కు కొడుకు పుట్టాడన్న శుభవార్త అందింది.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన పాక్ జట్టులో హరీస్ రౌఫ్ కీలక సభ్యుడు. రౌఫ్‌తో పాటు అతనికి శుభాకాంక్షలు తెలిపిన షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ కూడా న్యూజిలాండ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన పాక్ టీ20 జట్టులో ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి వన్డే జట్టులో చోటు దక్కలేదు.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం పాక్ జట్టు: ఒమెయిర్ యూసఫ్, అబ్దుల్ సమద్, హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, జహన్దాద్ ఖాన్, మొహమ్మద్ హరీస్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, సూఫియాన్ ముఖీమ్, మొహమ్మద్ అలీ
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఖుష్దిల్ షా, బాబర్ ఆజమ్, తయ్యబ్ తాహిర్, ఇర్ఫాన్ ఖాన్, సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావిద్, మొహమ్మద్ ఆలీ, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, సూఫియాన్ ముఖీమ్
కాగా, స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఘెర పరాభవం అనంతరం పాక్ క్రికెట్ బోర్డు జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను టీ20 జట్టు నుంచి తప్పించి కేవలం వన్డేలకే పరిమితం చేసింది. అలాగే సీనియర్ బౌలర్లు షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌లను కేవలం టీ20లకే పరిమితం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
న్యూజిలాండ్ పర్యటనలో పాక్ షెడ్యూల్..
మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్)
మార్చి 18- రెండో టీ20 (డునెడిన్)
మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్)
మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్ మౌంగనూయ్)
మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్)
మార్చి 29- తొలి వన్డే (నేపియర్)
ఏప్రిల్ 2- రెండో వన్డే (హ్యామిల్టన్)
ఏప్రిల్ 5- మూడో వన్డే (మౌంట్ మౌంగనూయ్)
పాకిస్తాన్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్‌లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్‌లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్‌లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్‌లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి
Comments
Please login to add a commentAdd a comment