
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో పాకిస్తాన్ ఆటగాడు హారిస్ రవూఫ్ అసాధరణ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. రవూఫ్ అద్భుతమైన క్యాచ్‌తో కివీస్ స్టార్ ఓపెనర్ ఫిన్ అలెన్ పెవిలియన్‌కు పంపాడు. అతడి క్యాచ్‌తో ఆక్లాండ్ మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో పాక్ బౌలింగ్ ఎటాక్‌ను షాహీన్ అఫ్రిది ప్రారంభించగా.. కివీస్ ఓపెనర్లగా టిమ్ సీఫర్ట్, అలెన్ బరిలోకి దిగారు. అయితే మొదటి ఓవర్ వేసిన షాహీన్ అఫ్రిది ఐదో బంతిని లెగ్ సైడ్‌గా సంధించాడు. ఆ బంతిని అలెన్ లెగ్ సైడ్‌లోకి ఫ్లిక్ చేశాడు. ఈ క్రమంలో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న రవూఫ్ అద్బుతం చేశాడు.
రౌఫ్ తన కుడి వైపునకు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఫిన్ అలెన్ ఆశ్చర్యపోయాడు. రవూఫ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. గ్లెన్ ఫిలిప్స్‌ను మించిన క్యాచ్ పట్టావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ పాకిస్తాన్ డూర్ ఆర్ డై. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.
ఇక ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం దూరమైన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలమైనందుకు ఈ సీనియర్ ద్వయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. టీ20ల్లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను నియమించిన పీసీబీ.. వైస్ కెప్టెన్సీ బాధ్యతలు స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌కు అప్పగించింది.
చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! పంత్ టీమ్‌లోకి ఎంట్రీ?
— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 21, 2025
Comments
Please login to add a commentAdd a comment