స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. ఇక గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన పాక్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ తిరిగి వన్డే జట్టకు ఎంపికయ్యాడు.
అదే విధంగా పాక్ మిడిలార్డర్ బ్యాటర్ షాన్ మసూద్, వెటరన్ ఆటగాడు హరీస్ సోహైల్ ఛాన్నాళ్ల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చారు. మరో వైపు పాకిస్తాన్ వన్డే కప్‌లో అదరగొట్టన టయ్యాబ్ తాహిర్, స్పిన్నర్ ఉస్మా మీర్‌కు తొలి సారి పాక్ జట్టులో చోటు దక్కింది. కాగా జనవరి 9న కరాచీ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హరీస్ సోహైల్, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్, నసీమ్ అలీ అఘా, షానవాజ్ దహానీ, షాన్ మసూద్, తయ్యబ్ తాహిర్, ఉసామా మీర్
Comments
Please login to add a commentAdd a comment