Pakistan vs New Zealand
-
పాకిస్తాన్‌కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభోత్సవంలో భారత సారథి పాల్గొననున్నట్లు సమాచారం. కాగా 1996 తర్వాత తొలిసారి పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది.వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీని చివరగా 2017లో నిర్వహించగా.. నాడు పాక్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించడంతో పాటు నిర్వహణ హక్కులను కూడా దక్కించుకుంది.ఇక ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు.. భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ప్రదర్శన ఆధారంగా చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా.. అదే విధంగా టాప్-7లో నిలిచిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ కూడా ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి.తటస్థ వేదికపైఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించింది. తటస్థ వేదికపైన తమకు మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఆరంభంలో ఇందుకు ససేమిరా అన్నప్పటికీ.. ఐసీసీ జోక్యంతో పట్టువీడింది. తాము కూడా ఇకపై భారత్‌లో ఐసీసీ టోర్నీ జరిగితే అక్కడికి వెళ్లకుండా తటస్థ వేదికపైనే ఆడతామన్న షరతుతో హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.ఈ నేపథ్యంలో దుబాయ్(Dubai) వేదికగా భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుండగా.. ఫిబ్రవరి 16 లేదంటే 17వ తేదీన ఈ ఈవెంట్ ఆరంభ వేడుకను నిర్వహించేందుకు పాక్ బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం ఈ టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్లందరూ ఈ వేడుకకు హాజరు కావాల్సి ఉంటుంది.టీమిండియా కెప్టెన్ కూడా వస్తాడుఈ విషయం గురించి పాక్ బోర్డు వర్గాలు వార్తా సంస్థ(IANS)తో మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ వేడుకలను పీసీబీ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. టీమిండియా కెప్టెన్ కూడా ఇందులో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వస్తాడు. 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఐసీసీ ఈవెంట్ జరుగబోతోంది. దీనిని విజయవంతం చేయాలని పీసీబీ పట్టుదలగా ఉంది’’ అని పేర్కొన్నాయి.అయితే, బీసీసీఐ రోహిత్ శర్మను పాకిస్తాన్‌కు పంపిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా జరుగనున్న మ్యాచ్‌తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. దాయాదుల సమరం ఆరోజేఇక క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. దాయాదుల సమరానికి దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది. కాగా భారత్- పాక్ చివరగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా తలపడగా.. టీమిండియా విజయం సాధించింది.ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన.. చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకున్న తర్వాత.. రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం టెస్టు, వన్డే జట్ల సారథిగా కొనసాగుతున్నాడు.చదవండి: టి20 ప్రపంచకప్.. టీమిండియా ఘన విజయం -
‘ఇంత చెత్త ఆట చూడలేదు.. మేమేమీ క్యాచ్‌లు డ్రాప్ చేయలేదు’
మహిళల టీ20 ప్రపంచకప్-2024.. ఆరంభం నుంచే తడబడ్డ భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తేనే హర్మన్‌ప్రీత్ సేన టాప్-4కు చేరుతుంది. కాబట్టి.. దాయాది ఎలాగైనా గెలవాలని ఈసారి టీమిండియా అభిమానులు కూడా కోరుకున్నారు.కానీ.. ఫ్యాన్స్ ప్రార్థనలు ఫలించలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కివీస్ చేతిలో చిత్తుగా ఓడింది. బౌలింగ్‌లో రాణించినా.. ఫీల్డింగ్‌లో మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 4.2, 5.2, 7.3, 15.5, 17.2, 19.1, 19.3, 19.5 ఓవర్ల వద్ద ఏకంగా ఎనిమిది క్యాచ్‌లు జారవిడిచింది.లక్ష్య ఛేదనలోనూ నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించి.. తమ క్రికెట్ చరిత్రలోనే అత్యల్పస్కోరు (56 ఆలౌట్) నమోదు చేసింది. కివీస్ చేతిలో ఏకంగా 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నీ నుంచి తామూ నిష్క్రమిస్తూ.. భారత జట్టును కూడా ఇంటిబాట పట్టించింది పాకిస్తాన్ మహిళా టీమ్.ఇంత చెత్త ఆట చూడలేదుఈ నేపథ్యంలో పాక్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనా మిర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘15 ఏళ్ల మా జట్టు ఆట తీరులో నేను ఇలాంటి చెత్త ప్రదర్శన ఎప్పుడూ చూడలేదు’’ అని సనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్రదర్శనపై స్పందించాడు.మేమేమీ క్యాచ్‌లు ‘డ్రాప్’ చేయలేదు‘‘ఆసియాలో.. మేము ఆటగాళ్లను ‘డ్రాప్’ చేయము.. వారికి కేవలం ‘విశ్రాంతి’ని మాత్రమే ఇస్తాం.. అంతేకాదు.. మేమేమీ క్యాచ్‌లు ‘డ్రాప్’ చేయము.. కేవలం బంతిని గ్రౌండ్ మీద పెడతాము అంతే’’ అంటూ ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పాకిస్తాన్ పురుషుల జట్టు ఓటమి తర్వాత.. రెండు, మూడో మ్యాచ్‌ల జట్టు నుంచి బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది వంటి స్టార్లను తప్పించి.. రెస్ట్ ఇచ్చామని కోచ్‌లు చెప్పిన విషయం తెలిసిందే.అదే ప్రభావం చూపిందిఈ నేపథ్యంలో పాక్ పురుషుల, మహిళా జట్ల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆకాశ్ చోప్రా ఇలా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత పాక్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. ‘‘మేము బాగానే బౌలింగ్ చేశాం. కానీ.. బ్యాటింగ్.. ముఖ్యంగా ఫీల్డింగ్ విభాగంలో మెరుగ్గా రాణించాల్సింది.మా జట్టులోని సీనియర్లు సైతం బ్యాటింగ్‌లో విఫలం కావడం ప్రభావం చూపింది. ఒకవేళ మేము గనుక బ్యాటింగ్‌లో రాటుదేలకపోతే.. మహిళా క్రికెటర్లుగా మా ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొంది. ఆ ఎనిమిది క్యాచ్‌లు ఏదేమైనా.. పాకిస్తాన్ జారవిడిచిన ఆ ఎనిమిది క్యాచ్‌లు భారత జట్టు కొంపముంచాయి. సెమీస్ చేరాలన్న హర్మన్‌సేన ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో.. సహజంగానే కొంతమంది.. పాక్ కావాలనే చెత్తగా ఆడిందా అనే సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. అయితే, కివీస్ వంటి జట్టుతో మ్యాచ్ అంతతేలికైన విషయమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు.పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లువేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ స్కోరు: 110/6 (20)పాకిస్తాన్ స్కోరు: 56 (11.4)ఫలితం: పాక్‌పై 54 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు.. సెమీస్‌లో అడుగుమహిళల టీ20 ప్రపంచకప్-2024 నుంచి పాకిస్తాన్‌తో పాటు భారత్ కూడా అవుట్.చదవండి: Ind vs NZ: మా ఆటకు హద్దుల్లేవ్.. రోజుకు 400–500 పరుగులైనా..Pakistan dropped 8 catches against New Zealand. 🤯pic.twitter.com/kW53N2A31t— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2024 -
NZ vs Pak: షెడ్యూల్ విడుదల.. ఐపీఎల్-2025కి కివీస్ స్టార్స్ దూరం?
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2024- 2025 ఏడాదికి గానూ తమ హోం షెడ్యూల్‌ను ప్రకటించింది. స్వదేశంలో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్లతో సిరీస్‌లు ఆడనున్నట్లు తెలిపింది.ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, శ్రీలంక- పాకిస్తాన్లతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, పాక్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. కివీస్ జట్టు ఇప్పటికే సౌతాఫ్రికా- పాకిస్తాన్‌తో ట్రై సిరీస్ ఆడేందుకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి సన్నాహకంగా ముందుగా ఈ త్రైపాక్షిక సిరీస్‌లో న్యూజిలాండ్ పాల్గొననుంది. కాగా ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది.న్యూజిలాండ్ మెన్స్ షెడ్యూల్(2024- 2025)వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్👉మొదటి టెస్టు- నవంబరు 28- డిసెంబరు 2- క్రైస్ట్‌చర్చ్👉రెండో టెస్టు- డిసెంబరు 6- 10- వెల్లింగ్టన్👉మూడో టెస్టు- డిసెంబరు 14- 18- హామిల్టన్శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు👉తొలి టీ20- డిసెంబరు 28- తౌరంగ👉రెండో టీ20- డిసెంబరు 30- తౌరంగ👉మూడో టీ20- జనవరి 2- నెల్సన్👉తొలి వన్డే- జనవరి 5- వెల్లింగ్టన్👉రెండో వన్డే- జనవరి 8- హామిల్టన్👉మూడో వన్డే- జనవరి 11- ఆక్లాండ్పాకిస్తాన్తో టీ20, వన్డే సిరీస్‌లు👉మొదటి టీ20- మార్చి 16- క్రైస్ట్‌చర్చ్👉రెండో టీ20- మార్చి 18- డునెడిన్👉మూడో టీ20- మార్చి 21- ఆక్లాండ్👉నాలుగో టీ20- మార్చి 23- తౌరంగ👉ఐదో టీ20- మార్చి 26- వెల్లింగ్టన్తొలి వన్డే- మార్చి 29- నేపియర్👉రెండో వన్డే- ఏప్రిల్ 2- హామిల్టన్👉మూడో వన్డే- ఏప్రిల్ 5- తౌరంగ.చదవండి: మీరంటే నేను.. నేనంటే మీరు: గంభీర్ భావోద్వేగం -
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్! ఆఖరికి..
న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20లో పాకిస్తాన్ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్‌ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం కివీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది.బాబర్ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌కు ఇదే తొలి సిరీస్. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో బాబర్ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్ గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.లాహోర్‌లో టాస్ ఓడిన పాక్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్ ఖాన్(24 బంతుల్లో 31), ఫఖర్ జమాన్(33 బంతుల్లో 43), షాబాద్ ఖాన్(5 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. ఓపెనర్ టిమ్ సెఫార్ట్ (33 బంతుల్లో 52), జోష్ క్లార్క్సన్(26 బంతుల్లో 38 నాటౌట్) మాత్రమే మెరుగ్గా ఆడారు.మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. Scenes in Lahore following the fifth T20I as the series is squared 🏆🤝#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/pBm4SmQi7j— Pakistan Cricket (@TheRealPCB) April 27, 2024 -
Pak Vs NZ: ఉత్కంఠ పోరులో పాక్ చిత్తు.. ఏడ్చేసిన ఫ్యాన్స్!
సొంతగడ్డపై పాకిస్తాన్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో స్వల్ప తేడాతో బాబర్ ఆజం బృందం ఓడిపోయింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 2-1తో పాక్‌పై పైచేయి సాధించింది.కాగా బాబర్ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్ తొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇందులో తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో పాక్ గెలిచింది.అయితే, మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్(36 బంతుల్లో 51), టామ్ బ్లండెల్ (15 బంతుల్లో 28), వన్‌డౌన్ బ్యాటర్ ఫాక్స్‌క్రాఫ్ట్(26 బంతుల్లో 34), కెప్టెన్ మిచెల్ బ్రాస్‌వెల్(20 బంతుల్లో 27) రాణించారు.పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. ఆమిర్, ఉసామా మిర్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ ఆమిర్, జమాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే సయీమ్ ఆయుబ్(20), బాబర్ ఆజం(5), ఉస్మాన్ ఖాన్(16) వికెట్లు కోల్పోయింది. అయితే, ఫఖర్ జమాన్ పట్టుదలగా నిలబడి 45 బంతుల్లో 61 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.ఇఫ్తికర్ అహ్మద్(20 బంతుల్లో 23), ఇమాద్ వసీం(11 బంతుల్లో 22 నాటౌట్) పోరాడాడు. కానీ ఆఖరి బంతికి పాక్ విజయానికి ఆరు పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఉన్న ఇమాద్ వసీం జెమ్మీ నీషం బౌలింగ్‌లో ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో పాక్ ఓటమిపాలైంది. దీంతో లాహోర్ ప్రేక్షకుల హృదయాలు ముక్కలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన 22 ఏళ్ల పేసర్ విలియం రూర్కీకి ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
‘బాబర్ ఆజం పెళ్లి చేసుకోవాలనుకుంటే?.. ఒప్పుకోను!’
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజంకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో సుదీర్ఘకాలం పాటు నంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇటీవలే తిరిగి పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా పునర్నియమితుడయ్యాడు.ఇక బాబర్ ఆజంకు తరచూ ఎదురయ్యే ప్రశ్నల్లో పెళ్లి గురించి తప్పక ప్రస్తావన ఉంటుంది. వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా ఎదిగిన 29 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరిని పెళ్లాడబోతున్నాడన్న అంశంపై గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తుంటారు కూడా! ఈ విషయమై పాకిస్తాన్‌కు చెందిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. బాబర్ ఫ్యాన్స్ దెబ్బకు ఆమె అకౌంట్‌ను కాసేపు ప్రైవేట్ అకౌంట్‌గా మార్చుకోవాల్సి వచ్చింది. నజీష్ జహంగీర్ అనే బుల్లితెర నటికి ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెను.. ‘‘బాబర్ ఆజం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన’’ని అడిగితే ఏం చెప్తారు? అని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘‘సారీ చెప్తాను’’ అంటూ సున్నితంగా తిరస్కరిస్తాననే అర్థంలో సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె తన ఇన్స్టాస్టోరీలో పోస్ట్ చేసిందన్న వార్త వైరల్ అయింది.అంతేకాదు.. ‘‘బాబర్ మాకు సోదరుడి వంటి వాడు. కానీ అతడి అభిమానులు ఇలా నెగిటివిటీ ప్రచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు’’ అని నజీష్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నట్లు మరో ఇన్‌స్టా స్టోరీ కూడా తెరమీదకు వచ్చింది.ఈ క్రమంలో బాబర్ ఫ్యాన్స్ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేయగా.. వేధింపులను తట్టుకోలేక నజీష్ తన అకౌంట్‌ను సోమవారం కాసేపు ప్రైవేట్‌గా పెట్టినట్లు సామా టీవీ వెల్లడించింది. అయితే, మరుసటి రోజే ఆమె మళ్లీ తన అకౌంట్‌ను పబ్లిక్ చేసేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 వైఫల్యం తర్వాత బాబర్ ఆజం పాక్ కెప్టెన్‌గా వైదొలిగాడు.దీంతో అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అయితే, వీరి సారథ్యంలో జట్టు ఘోర వైఫల్యాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో షాహిన్‌పై వేటు వేసిన పాక్ బోర్డు.. పగ్గాలను తిరిగి బాబర్ ఆజంకు అప్పగించింది. షాన్ మసూద్‌ను మాత్రం టెస్టుల సారథిగా కొనసాగిస్తోంది. ఇక మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాబర్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీ అయ్యాడు. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. -
పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడికి గాయం!?
న్యూజిలాండ్‌తో తొలి టీ20కు ముందు పాకిస్తాన్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర కీపర్-బ్యాటర్ ఆజం ఖాన్ గాయం కారణంగా తొలి టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గురువారం రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20లో పాకిస్తాన్-కివీస్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో బుధవారం నెట్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోన్న ఆజం మోకాలికి గాయమైంది. మెకాలికి బంతి బలంగా తాకడంతో ఆజం తీవ్రమైన నోప్పితో విలవిల్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడిని తొలి టీ20కు పక్కన పెట్టాలని పాక్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. కాగా ఆజం ఖాన్ ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు కాకుల్ ఆర్మీ క్యాంపులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో ఆజం ఖాన్ తీవ్రంగా శ్రమించాడు. అతడితో పాటు జట్టు మొత్తం 11-రోజుల ఫిట్నెస్ క్యాంప్‌లో పాల్గోంది. కాగా ఈ సిరీస్ టీ20 వరల్డ్‌కప్-2024 సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు ఐదు టీ20లు ఆడనున్నాయి. అయితే పాక్ పర్యటనకు కివీస్ క్రికెట్ బోర్డు తమ ద్వితీయ శ్రేణి జట్టును పంపించింది. స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్-2024 సీజన్లో బీజీబీజీగా ఉండడంతో న్యూజిలాండ్ క్రికెట్ ఈ నిర్ణయం తీసుకుంది. -
పాకిస్తాన్ జట్టు ప్రకటన! 4 ఏళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ
స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్న పేసర్ మహ్మద్ అమీర్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంకు ఈ జట్టులో చోటు దక్కింది. వీరిద్దరితో పాటు యువ ఆటగాడు ఉస్మాన్ ఖాన్, అన్క్యాప్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా ఈ సిరీస్‌తో బాబర్ ఆజం మళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యువ ఓపెనర్ సైమ్ అయూబ్‌ను సైతం సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక మహ్మద్ అమీర్ పాకిస్తాన్ తరపున చివరగా 2020లో ఆడాడు. ఆ తర్వాత బోర్డుతో విభేదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు అమీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు బోర్డు కొత్త చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ సూచనల మెరకు అమీర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరోవైపు ఇమాద్ వసీం కూడా గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. కానీ పీసీబీ అధికారులతో చర్చలు జరిపి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికి వహాబ్ రియాజ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఏప్రిల్ 18 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కివీస్‌తో టీ20లకు పాక్ జట్టు బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ అమీర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్, ఉస్మాన్ ఖాన్, జమాన్ ఖాన్ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: హసీబుల్లా, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్ మరియు సల్మాన్ అలీ అఘా -
న్యూజిలాండ్‌కు బిగ్ షాకిచ్చిన పాకిస్తాన్.. 92 పరుగులకే ఆలౌట్
న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. క్రైస్ట్ చర్చ్ వేదికగా కివీస్‌తో జరిగిన ఐదో టీ20లో 42 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ వైట్ వాష్ నుంచి పాక్ తప్పించుకుంది. తొలి నాలుగు టీ20ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, ఫెర్గూసన్, సోధీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఇఫ్తికర్ ఆహ్మద్ 3 వికెట్లతో కివీస్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ నవాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు జమాన్ ఖాన్, ఉసమా మీర్ చెరో వికెట్ పడగొట్టారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు -
#NZvPAK: దంచి కొట్టిన మిచెల్, ఫిలిప్స్.. పాకిస్తాన్‌కు మరో పరాభవం
New Zealand vs Pakistan, 4th T20I: న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకున్న షాహిన్ ఆఫ్రిది బృందం.. నాలుగో టీ20లోనూ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి మరో పరాభవం మూటగట్టుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా టాస్ ఓడిన పాకిస్తాన్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(1) ఆదిలోనే అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(19), ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఫఖర్ జమాన్(9), షాహిజాదా ఫర్హాన్(1), ఇఫ్తికర్ అహ్మద్ (10) పూర్తిగా విఫలమయ్యారు. ఇలా ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 90 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. రిజ్వాన్‌కు తోడు మహ్మద్ నవాజ్(9 బంతుల్లో 23 రన్స్- నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే షాకిచ్చాడు. కివస్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ ధాటికి ఓపెనర్లు ఫిన్ అలెన్ 8, టిమ్ సెఫార్ట్ 0 వచ్చీ రాగానే మైదానం వీడగా.. విల్ యంగ్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. కానీ.. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరు తుపాన్ ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్‌కు మరోసారి ఘోర అవమానం తప్పలేదు. డారిల్ మిచెల్ 44 బంతుల్లో 72 పరుగులు(7 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ 52 బంతుల్లో 70 పరుగుల(5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కివీస్ 18.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇక పాక్‌తో నాలుగో టీ20లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన డారిల్ మిచెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Victory in Christchurch! #NZvPAK pic.twitter.com/5PZKPIzemF — BLACKCAPS (@BLACKCAPS) January 19, 2024 -
ఫలితాలు పట్టించుకోం.. బాబర్ గెలిపించలేకపోయాడు: షాహిన్ ఆఫ్రిది
"Results don't matter" - Shaheen Afridi's makes bold statement: పాకిస్తాన్ క్రికెట్ జట్టు వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న బాబర్ ఆజం బృందం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో చేపట్టిన ప్రక్షాళన చర్యల్లో భాగంగా బాబర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్.. టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులుగా నియమితులయ్యారు. ఇక మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ టీమ్ డైరెక్టర్ కమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి తనదైన మార్కు చూపేందుకు విఫలయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా హఫీజ్ మార్గదర్శనంలో మసూద్ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ టెస్టుల్లో 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఘోర అవమానం నుంచి కోలుకోకముందే న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. డునెడిన్ వేదికగా కివీస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఓడిపోయి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పాక్ టీ20 జట్టు కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఓటమిపై స్పందిస్తూ.. ఫలితాలతో మాకు సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Shaheen Afridi says result doesn't matter, effort of players matters 🤯 Do you agree with this statement? #NZvsPAK pic.twitter.com/Y69482v7ih — Farid Khan (@_FaridKhan) January 17, 2024 ఈ మేరకు..‘‘ మ్యాచ్ ఫలితాలతో మాకు పట్టింపు లేదు. మా ఆటగాళ్లు విజయం కోసం తగినంత ఎఫర్ట్ పెడుతున్నారా లేదా అన్నదే ముఖ్యం. నాకు తెలిసి మా జట్టులోని ప్రతి ప్లేయర్ పూర్తి నిబద్ధతతో ఆడుతున్నారు. మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బాబర్ ఫామ్‌లేమితో సతమతం కావడం లేదు. ఈ సిరీస్‌లో అతడు మూడు మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, జట్టుకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇన్నింగ్స్ ఫినిష్ చేయలేకపోయాడు. అతడికి తోడుగా కనీసం ఒక్క బ్యాటర్ అయినా పట్టుదలగా నిలబడి ఉంటే బాగుండేది. ఈరోజు కూడా అలాగే జరిగింది. బాబర్‌తో పాటు ఇంకొక్కరు రాణించినా ఫలితం వేరేలా ఉండేది’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో బాబర్ ఆజం ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కలిపి 181 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెగ్యులర్ ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో బరిలోకి దిగి ఈ మేరకు పరుగులు రాబట్టాడు. చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు -
ఫిన్ అలెన్ సునామీ శతకం.. పాక్‌కు మరో ఘోర పరాభవం
పాకిస్తాన్ జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో చేతిలో (0-3తో టెస్ట్ సిరీస్ ఓటమి) భంగపడ్డ ఆ జట్టు.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో అంతకుమించిన అవమానాన్ని (0-3తో టీ20 సిరీస్ ఓటమి) ఎదుర్కొంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కోల్పోయి ఇంటాబయట అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. వన్డే ప్రపంచకప్ నుంచి చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్న పాక్ క్రికెట్ జట్టును పూర్తిగా ప్రక్షాళణ చేయాలని ఆ జట్టు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఫిన్ అలెన్ సునామీ శతకంతో (62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 137 పరుగులు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 224 పరుగుల భారీ స్కోర్ (7 వికెట్ల నష్టానికి) చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా టిమ్ సీఫర్ట్ (31), గ్లెన్ ఫిలిప్స్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అలెన్‌తో పాటు మరొక్కరు రాణించినా న్యూజిలాండ్ ఇంతకంటే భారీ స్కోర్ చేసేది. అలెన్ ధాటికి పాక్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) బెంబేలెత్తిపోయారు. ఈ ముగ్గురు 10కిపైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమతమై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (58) అర్ధసెంచరీతో రాణించాడు. టీ20ల్లో బాబర్‌కు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24), ఫకర్ జమాన్ (19), ఆజం ఖాన్ (10), ఇఫ్తికార్ అహ్మద్ (1), మొహమ్మద్ నవాజ్ (28) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో సౌథీ 2, హెన్రీ, ఫెర్గూసన్, సాంట్నర్, సోధి తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రపు నాలుగో టీ20 జనవరి 19న క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది. -
విధ్వంసం.. ఊచకోత.. ఎన్ని చెప్పినా తక్కువే, 16 సిక్స్‌లతో పరుగుల సునామీ
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ సరసన నిలిచాడు. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ 16 సిక్సర్లు బాదగా.. తాజాగా అలెన్ జజాయ్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్న అలెన్.. డునెడిన్ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో విధ్వంసర శతకం (137) బాదాడు. అలెన్ తన సెంచరీని కేవలం 48 బంతుల్లోనే పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అలెన్‌దే అత్యుత్తమ స్కోర్. దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్ మెక్కల్లమ్ (123) పేరిట ఉండింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. అలెన్ ఊచకోత ధాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. టిమ్ సీఫర్ట్ (31) పర్వాలేదనిపించగా.. కాన్వే (7), డారిల్ మిచెల్ (8), చాప్మన్ (1), సాంట్నర్ (4) విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. ఈ ఇన్నింగ్స్ గురించి విధ్వంసం.. ఊచకోత లాంటి ఎన్ని పదాలు వాడినా తక్కువే అవుతుంది. అంతర్జాతీయ టీ20ల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న ఫిన్ అలెన్ రెండో మ్యాచ్‌లో 74 (41 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), తొలి టీ20లో 34 (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ధాటికి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) 10కిపైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. పాక్ బౌలర్లలో అలెన్ ధాటి నుంచి మొహమ్మద్ వసీం జూనియర్ (4-0-35-1), జమాన్ ఖాన్ (4-0-37-1) కాస్త తప్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 9 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి, ఓటమి దిశగా సాగుతుంది. సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24) ఔట్ కాగా.. బాబర్ ఆజమ్ (27), ఫకర్ జమాన్ (12) పోరాడుతున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి రెండు టీ20ల్లో ఓడింది. ఈ మ్యాచ్‌లో కూడా ఆ జట్టు ఓడితే మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కివీస్ వశమవుతుంది. -
కేన్ మామకు ఏమైంది..? గుజరాత్ టైటాన్స్ ఆందోళన
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయాల కారణంగా ఇటీవలికాలంలో తరుచూ క్రికెట్‌కు దూరమవుతున్నాడు. ఐపీఎల్ 2023 సందర్భంగా కాలు విరగ్గొట్టుకున్న కేన్ మామ.. అష్టకష్టాలు పడి వన్డే వరల్డ్‌కప్‌కు అందుబాటులోకి వస్తే, అక్కడ కూడా గాయపడి పలు కీలక మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా ఆ గాయం నుంచి కూడా కోలుకుని స్వదేశంలో పాక్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వస్తే, ఇక్కడ కూడా గాయపడి మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. హ్యామిల్టన్‌లో జరిగిన రెండో టీ20 సందర్భంగా గాయపడిన కేన్ మామ సిరీస్‌లోని మిగతా మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ న్యూజిలాండ్ ప్రకటించింది. రెండో టీ20లో మాంచి టచ్‌లో (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) ఉన్నప్పుడు కండరాల సమస్య కారణంగా అతను ఉన్నపళంగా మైదానాన్ని వీడాడు. స్కానింగ్ రిపోర్ట్ల్లో చిన్న సమస్యే అని తేలినప్పటికీ, టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా క్రికెట్ న్యూజిలాండ్ పాక్‌తో సిరీస్ మొత్తానికి అతన్ని దూరంగా ఉంచింది. పాక్‌తో మిగిలిన మ్యాచ్‌లకు కివీస్ సెలెక్టర్లు విల్ యంగ్‌ను కేన్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు. కేన్ పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్న గుజరాత్.. కేన్ తాజా పరిస్థితి చూసి అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా ఆందోళన చెందుతుంది. త్వరలో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కేన్ పూర్తిగా కోలుకుంటాడో లేదోనని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతానికి కోలుకున్నా ఆతర్వాత జరిగే సిరీస్‌లు ఆడి దెబ్బలు తగిలించుకుని తమని ఇబ్బంది పెడాతాడేమోనని కలవర పడుతుంది. 33 ఏళ్లకే వయసు పైబడినట్లు కనిపిస్తున్న కేన్ పరిస్థితి గుజరాత్ టైటాన్స్ ఉలిక్కిపడుతుంది. ఇప్పటినుంచి కేన్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటే మంచిదని ఆలోచిస్తుంది. ఇదిలా ఉంటే, పాక్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో టీ20 జనవరి 17న డునెడిన్ వేదికగా జరుగనుంది. -
సత్తా చాటిన అలెన్, మిల్నే.. పాక్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ పాకిస్తాన్‌ను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడించింది. తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టును 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన కివీస్.. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో టీ20లో పాక్‌ను 21 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఫిన్ అలెన్ (41 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. విలియమ్సన్ (26 రిటైర్డ్ హర్ట్), సాంట్నర్ (25), కాన్వే (20), డారిల్ మిచెల్ (17), గ్లెన్ ఫిలిప్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు. లక్ష్య ఛేదనలో తడబడిన పాక్.. 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కివీస్ పేసర్ ఆడమ్ మిల్నే (4-0-33-4) పాక్ పతనాన్ని శాశించగా.. సౌథీ, బెన్ సియర్స్, సోధి తలో రెండు వికెట్లతో రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (66), ఫకర్ జమాన్ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. షాహీన్ అఫ్రిది (22) రెండంకెల స్కోర్ చేశాడు. ఈ ముగ్గురు మినహా పాక్ ఆటగాళ్లు మొత్తం విఫలమయ్యారు. సైమ్ అయూబ్ 1, రిజ్వాన్ 7, ఇఫ్తికార్ అహ్మద్ 4, ఆజం ఖాన్ 2, ఆమిర్ జమాల్ 9, అబ్బాస్ అఫ్రిది 7, ఉసామా మిర్ 0, హరీస్ రౌఫ్ 2 నాటౌట్ పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జనవరి 17న డెనెడిన్ వేదికగా జరుగుతుంది. -
ఫిన్ అలెన్ ఊచకోత.. పాక్ బౌలర్లపై మెరుపుదాడి
న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసిన అలెన్.. తాజాగా జరుగుతున్న రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులను ఎదుర్కొన్న అలెన్ 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ మార్కును కేవలం 24 బంతుల్లోనే అందుకున్న అలెన్ ఆతర్వాత కాస్త నెమ్మదించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో ఉసామా మిర్ అలెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా పాక్ బౌలర్లను ఊచకోత కోసిన అలెన్.. క్రీజ్‌లో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. అలెన్ ధాటికి న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (15 బంతుల్లో 20; 3 ఫోర్లు), ఫిన్ అలెన్ కివీస్‌కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలో 59 పరుగులు జోడించారు. కాన్వే ఔటయ్యాక బరిలోకి దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజ్‌లో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేసిన అతను ఇన్నింగ్స్ 10 ఓవర్ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన డారిల్ మిచెల్ 17 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మార్క్ చాప్మన్ 4 పరుగులకే ఔటయ్యాడు. ఆడమ్ మిల్నే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్ 13, సాంట్నర్ 25 పరుగులు చేశారు. భారీ స్కోర్ దిశగా పయనిస్తున్న కివీస్‌ను హరీస్ రౌఫ్ 19వ ఓవర్లో దెబ్బకొట్టాడు. ఈ ఓవర్ 1, 2, 4 బంతులకు వికెట్లు పడగొట్టిన రౌఫ్.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి కివీస్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. కాగా, ఈ సిరీస్‌లో కివీస్ తొలి మ్యాచ్‌లో పాక్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. -
గప్టిల్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్.. కోహ్లి, రోహిత్ తర్వాత అతడే!
New Zealand vs Pakistan, 1st T20I - Babar Azam Record: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. తద్వారా కివీస్ బ్యాటర్ మార్టిన్ గఫ్టిల్ను అధిగమించాడు. కెప్టెన్సీకి గుడ్‌బై టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత పాక్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన బాబర్ ప్రస్తుతం కేవలం ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఈ క్రమంలో టీ20 కొత్త సారథి షాహిన్ ఆఫ్రిది సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో భాగమయ్యాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసిన బాబర్ 35 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించాడు. గప్టిల్ రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20లలో 3538 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మార్టిన్ గప్టిల్‌ను దాటి మూడోస్థానానికి ఎగబాకాడు. తన 105వ మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. ఇక ఈ లిస్టులో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా బాబర్ ఇంకో 316 పరుగులు సాధిస్తే రోహిత్‌ను కూడా దాటేస్తాడు! అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు: 1. విరాట్ కోహ్లి(ఇండియా)- 115 మ్యాచ్‌లలో- 4008 రన్స్ 2. రోహిత్ శర్మ(ఇండియా)- 148 మ్యాచ్‌లలో- 3853 రన్స్ 3. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 105 మ్యాచ్‌లలో- 3538 రన్స్ 4. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)- 122 మ్యాచ్‌లలో- 3531 రన్స్ 5. పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 134 మ్యాచ్‌లలో- 3438 రన్స్. చదవండి: డారిల్ మిచెల్ ఊచకోత.. కివీస్ చేతిలో పాక్ చిత్తు! బాబర్ పోరాడినా.. చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు -
చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు
New Zealand vs Pakistan, 1st T20I: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌతీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌తో తొలి టీ20 సందర్భంగా సౌతీ ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కాగా ఐదు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్లాండ్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన షాహిన్ ఆఫ్రిది బృందం న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డారిల్ మిచెల్(27 బంతుల్లో 61- నాటౌట్), కెప్టెన్ విలియమ్సన్ (57) అద్భుత అర్ధ శతకాలతో మెరవగా.. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లకే చేతులెత్తేసింది. 180 పరుగులకు ఆలౌట్ అయి 46 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏకైక బౌలర్‌గా రికార్డు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టిమ్ సౌతీ.. మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) రూపంలో రెండు బిగ్ వికెట్లు తీశాడు. అబ్బాస్ ఆఫ్రిదిని అవుట్ చేసిన క్రమంలో.. అంతర్జాతీయ టీ20లలో తన 150వ వికెట్ నమోదు చేశాడు సౌతీ. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఇక అబ్బాస్ తర్వాత హ్యారిస్ రవూఫ్‌ను పెవిలియన్‌కు పంపిన సౌతీ తొలి టీ20లో న్యూజిలాండ్ విజయాన్ని ఖరారు చేశాడు. నంబర్ 2 ఎవరంటే ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 35 ఏళ్ల కివీస్ ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌతీ(151) అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్ స్పిన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ అరుదైన లిస్టులో న్యూజిలాండ్ నుంచి ఇష్ సోధి(127), మిచెల్ సాంట్నర్(105) కూడా చోటు దక్కించుకోవడం విశేషం. చదవండి: Ind vs Afg: అందుకే 19వ ఓవర్లో బంతి అతడి చేతికి: రోహిత్ శర్మ -
డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బాబర్ పోరాటం వృథా
న్యూజిలాండ్ పర్యటనను పాకిస్తాన్ పరాజయంతో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. అక్లాండ్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వేను డకౌట్ చేసి శుభారంభం అందుకుంది. అయితే, మరో ఓపెనర్ ఫిన్ అలెన్(35), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ విలియమ్సన్(57) ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. ఇక నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కొరకరాని కొయ్యలా మారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో మార్క్ చాప్మప్ 26(11 బంతుల్లో) రన్స్‌తో రాణించాడు. బ్యాటర్లంతా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం ఒక్క హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ మొత్తంగా 35 బంతులు ఎదుర్కొని 57 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(27), మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) మాత్రమే 20 అంకెల స్కోరు చేశారు. రిజ్వాన్, ఇఫ్తికర్ రూపంలో కీలక వికెట్లు తీసిన టిమ్ సౌతీ.. అబ్బాస్ ఆఫ్రిది(1), హారిస్ రవూఫ్(0)లను త్వరత్వరగా పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకుని పాక్‌ను కోలుకోని దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఆడం మిల్నే రెండు, బెన్ సియర్స్ రెండు, ఇష్ సోధి ఒక వికెట్ దక్కించుకున్నారు. కివీస్ బౌలర్ల విజృంభణతో 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయిన పాకిస్తాన్ 46 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక పాకిస్తాన్ కెప్టెన్‌గా ఆ జట్టు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో అతడు బౌలర్‌గా, సారథిగానూ విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల కోటాలో 46 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ఆఫ్రిది.. కెప్టెన్‌గా అరంగేట్ర మ్యాచ్‌లో ఓటమిని చవిచూశాడు. మరోవైపు.. కివీస్‌ను గెలిపించిన డారిల్ మిచెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది’ మ్యాచ్ అవార్డు దక్కింది. -
NZ VS PAK 1st T20: డారిల్ మిచెల్ ఊచకోత
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ (27 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి కివీస్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించగా.. 417 రోజుల తర్వాత టీ20 మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (57) రాణించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిన్ అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో మార్క్ చాప్మన్ (11 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్స్ 19, ఆడమ్ మిల్నే 10 పరుగులు చేశారు. మ్యాట్ హెన్రీ 0, టిమ్ సౌథీ 6 పరుగులతో అజేయంగా నిలిచారు. డారిల్ మిచెల్ క్రీజ్‌లో ఉన్న సమయంలో కివీస్ 250కి పైగా పరుగులు చేసేలా కనిపించింది. అయితే అతను ఔటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవ్వరూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడకపోవడంలో కివీస్ 226 పరుగులతో సరిపెట్టుకుంది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-46-3), ఆమిర్ జమాల్ (4-0-56-0), ఉసామా మిర్‌లను (4-0-51-0) కివీస్ బ్యాటర్లు ఆటాడుకున్నారు. ముఖ్యంగా షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్‌లకు చుక్కలు చూపించారు. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్.. షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో 2 సిక్స్‌లు, 3 బౌండరీల సాయంతో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. పాకిస్తాన్‌ను అబ్బాస్ అఫ్రిది (4-0-34-3), హరీస్ రౌఫ్ (4-0-34-2) కాపాడారు. వీరిద్దరు కాస్త పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు కూడా తీశారు. -
NZ Vs PAK 1st T20: షాహీన్ అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్
పాకిస్తాన్ స్టార్ పేసర్, ఆ జట్టు కొత్త కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చుక్కలు చూపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అలెన్ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఆతర్వాత హ్యాట్రిక్ బౌండరీలు, ఆ వెంటనే సిక్సర్ బాదాడు. ఆఖరి బంతి డాట్ బాల్ అయ్యింది. ఆమిర్ జమాల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో రెండో బంతిని సైతం సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి ఓవర్లో మరో అఫ్రిది (అబ్బాస్ అఫ్రిది) అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరుకు అడ్డుకట్ట వేసి అతన్ని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కివీస్.. 11.2 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అలెన్, డెవాన్ కాన్వే (0) ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (57), డారిల్ మిచెల్ (31) క్రీజ్‌లో ఉన్నారు. అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 417 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20ల బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. -
పాకిస్తాన్‌తో తొలి టీ20కి ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (జనవరి 12) జరిగే తొలి టీ20కి ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ కోవిడ్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న సాంట్నర్ జట్టులో లేకపోవడం కివీస్‌కు పెద్ద లోటు. సాంట్నర్‌ను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు క్రికెట్ న్యూజిలాండ్ పేర్కొంది. కాగా, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి దేశంలో ఎలాంటి అంక్షలు లేనప్పటికీ.. ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. 🚨NEWS ALERT🚨: Mitchell Santner has been ruled out of the first T20I against Pakistan after testing positive for Covid. pic.twitter.com/lCFttMZzpQ — CricTracker (@Cricketracker) January 12, 2024 ఇదిలా ఉంటే, ఆక్లాండ్ వేదికగా ఇవాళ న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 11: 30 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ ఫుల్‌టైమ్ టీ20 జట్టు కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదికి ఇది తొలి మ్యాచ్ కాగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చాలాకాలం తర్వాత టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్), డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్ పాకిస్తాన్: మొహ్మమద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), షాహీన్ అఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, జమాన్ ఖాన్, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రర్ అహ్మద్, సాహిబ్జాదా ఫర్హాన్, అబ్బాస్ అఫ్రిది, హసీబుల్లా ఖాన్ -
ధన్యవాదాలు.. పాక్ క్రికెట్‌తో ప్రయాణం ముగిసిపోయింది
Pakistan Cricket Team: పాకిస్తాన్ హై పర్ఫామెన్స్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ తన పదవికి రాజీనామా చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌తో తన ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. ఐదేళ్లకు పైగా మూడు భిన్న పాత్రలు పోషించానన్న బ్రాడ్‌బర్న్.. ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌ను రెండేళ్ల కాలానికి గానూ తొలుత హెడ్‌కోచ్‌గా నియమించుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మే, 2023లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో పాక్ జట్టు కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. తన మార్కు చూపిస్తున్న హఫీజ్ ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ప్రక్షాళన చర్యలకు పూనుకున్నాడు. ఇందులో భాగంగా కోచింగ్ సిబ్బంది ఫోర్ట్పోలియోలు మార్చాడు. ఈ క్రమంలో బ్రాడ్‌బర్న్ హై పర్ఫామెన్స్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించగా.. ఇటీవల అతడి స్థానంలో పాక్ మాజీ ఆల్‌రౌండర్ యాసిర్ అరాఫత్‌ను నియమించాడు. పాక్‌తో ప్రయాణం ముగిసిపోయింది ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ టీ20 సిరీస్ నుంచి యాసిర్ సేవలను వినియోగించుకోనున్నట్లు పీసీబీ తెలిపింది. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బ్రాడ్‌బర్న్ తాజాగా ప్రకటన విడుదల చేశాడు. ‘‘చాలా చాలా ధన్యవాదాలు. పాకిస్తాన్ క్రికెట్‌తో అద్భుతమైన అధ్యాయం ముగిసిపోయింది. అద్భుతమైన ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందితో పనిచేసినందుకు గర్వంగా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా’’ అని గ్రాంట్ బ్రాడ్‌బర్న్ ఎక్స్ వేదికగా నోట్ షేర్ చేశాడు. అతడు ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లామోర్గాన్ హెడ్‌కోచ్‌గా నియమితుడైనట్లు సమాచారం. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్‌తో కెప్టెన్‌గా షాహిన్ ఆఫ్రిది బాధ్యతలు స్వీకరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ నియమితుడయ్యాడు. Bohat Bohat Shukriya 🇵🇰 pic.twitter.com/n0k0pagdtb — Grant Bradburn (@Beagleboy172) January 7, 2024 -
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్!?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చిత్తు అయిన పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అహ్మద్ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. భారత్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అహ్మద్ గాయపడ్డాడు. అయినప్పటికి అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు పాకిస్తాన్ జట్టు మేనెజ్మెంట్ తీసుకు వెళ్లింది. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అహ్మద్ ఆడలేదు. అయితే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని సెలెక్టర్లు భావించారు. ఈ క్రమంలో కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో సెలక్టర్లు అహ్మద్‌కు చోటు కల్పించారు. కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్‌తో సిరీస్‌కు కూడా అతడు దూరం కావడం దాదాపు ఖాయమైంది. కాగా అతడి స్ధానాన్ని ఇక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ఆతిథ్య జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో తలపడనుంది. జనవరి 12న ఆక్లాండ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌తో టీ20లకు పాక్ జట్టు: షాహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్-కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), మహ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్ మరియు జమాన్ ఖాన్. చదవండి: #Shweta Sehrawat: 242 పరుగులతో విధ్వంసం.. 31 ఫోర్లు, 7 సిక్స్‌లు! ఎవరీ సెహ్రావత్? -
పాక్ జట్టేమీ నేపాల్‌కు వెళ్లడం లేదు.. వాళ్లకు రెస్ట్ ఎందుకు?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై జనవరి 12 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్ ద్వారానే పాక్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది సారథిగా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్లు అతడి నాయకత్వంలో తొలిసారి మైదానంలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో పీసీబీ సెలక్షన్ కమిటీ కన్సల్టెంట్, మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్‌కు వింత ప్రశ్న ఎదురైంది. స్థానిక టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో యాంకర్.. ‘‘సీనియర్లు బాబర్ ఆజం, రిజ్వాన్‌లకు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా విశ్రాంతినివ్వవచ్చు కదా?’’ అని అక్మల్‌ను అడిగారు. ఇందుకు అతడు బదులిస్తూ.. ‘‘సెలక్షన్ కమిటీలోని సభ్యులు కానీ.. మేనేజ్‌మెంట్‌గానీ న్యూజిలాండ్ సిరీస్‌లో బాబర్, రిజ్వాన్‌లకు రెస్ట్ ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే పాక్ జట్టు వెళ్తోంది న్యూజిలాండ్‌కు.. నేపాల్‌కు కాదు. అలాంటి పటిష్ట జట్టుతో పోటీపడేటప్పుడు సీనియర్లకు విశ్రాంతినివ్వడం ఏమిటి? అసలు ఎవరైనా అలాంటి ఆలోచన చేస్తారా?’’ అంటూ కమ్రాన్ అక్మల్ కౌంటర్ వేశాడు. ఇక షాన్ మసూద్ కెప్టెన్సీ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘కెప్టెన్‌గా లేదంటే కోచింగ్ సిబ్బందిగా కొత్తగా నియమితులైన వాళ్లకు.. తమను తాము నిరూపించుకునేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే వారి పనితీరును అంచనా వేసే అవకాశం ఉంటుంది’’ అని అక్మల్ పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో ఘోర వైఫల్యం అనంతరం పాక్ కెప్టెన్‌గా బాబర్ ఆజం వైదొలిగాడు. అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్లు అయ్యారు. ఈ క్రమంలో మసూద్ సారథ్యంలో తొలిసారి ఆసీస్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ తొలి టెస్టుల్లో చిత్తుచిత్తుగా ఓడి విమర్శలు మూటగట్టుకుంది. ఇక డిసెంబరు 26 నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ముగించుకుని తదుపరి న్యూజిలాండ్‌కు పయనం కానుంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు షాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసీబుల్లా ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్. చదవండి: ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం! ఆటకు దూరం.. కారణం?