న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. క్రైస్ట్ చర్చ్ వేదికగా కివీస్‌తో జరిగిన ఐదో టీ20లో 42 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ వైట్ వాష్ నుంచి పాక్ తప్పించుకుంది. తొలి నాలుగు టీ20ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇక ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, ఫెర్గూసన్, సోధీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఇఫ్తికర్ ఆహ్మద్ 3 వికెట్లతో కివీస్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ నవాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు జమాన్ ఖాన్, ఉసమా మీర్ చెరో వికెట్ పడగొట్టారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు
Comments
Please login to add a commentAdd a comment