పాకిస్తాన్ స్టార్ పేసర్, ఆ జట్టు కొత్త కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చుక్కలు చూపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో అలెన్ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఆతర్వాత హ్యాట్రిక్ బౌండరీలు, ఆ వెంటనే సిక్సర్ బాదాడు. ఆఖరి బంతి డాట్ బాల్ అయ్యింది.
ఆమిర్ జమాల్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో రెండో బంతిని సైతం సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి ఓవర్‌లో మరో అఫ్రిది (అబ్బాస్ అఫ్రిది) అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరుకు అడ్డుకట్ట వేసి అతన్ని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కివీస్.. 11.2 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.
అలెన్, డెవాన్ కాన్వే (0) ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (57), డారిల్ మిచెల్ (31) క్రీజ్‌లో ఉన్నారు. అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 417 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20ల బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment