ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ పాకిస్తాన్‌ను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడించింది. తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టును 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన కివీస్.. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో టీ20లో పాక్‌ను 21 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఫిన్ అలెన్ (41 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. విలియమ్సన్ (26 రిటైర్డ్ హర్ట్), సాంట్నర్ (25), కాన్వే (20), డారిల్ మిచెల్ (17), గ్లెన్ ఫిలిప్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు.
లక్ష్య ఛేదనలో తడబడిన పాక్.. 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కివీస్ పేసర్ ఆడమ్ మిల్నే (4-0-33-4) పాక్ పతనాన్ని శాశించగా.. సౌథీ, బెన్ సియర్స్, సోధి తలో రెండు వికెట్లతో రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (66), ఫకర్ జమాన్ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. షాహీన్ అఫ్రిది (22) రెండంకెల స్కోర్ చేశాడు. ఈ ముగ్గురు మినహా పాక్ ఆటగాళ్లు మొత్తం విఫలమయ్యారు. సైమ్ అయూబ్ 1, రిజ్వాన్ 7, ఇఫ్తికార్ అహ్మద్ 4, ఆజం ఖాన్ 2, ఆమిర్ జమాల్ 9, అబ్బాస్ అఫ్రిది 7, ఉసామా మిర్ 0, హరీస్ రౌఫ్ 2 నాటౌట్ పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జనవరి 17న డెనెడిన్ వేదికగా జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment