Finn Allen
-
టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది: పాక్ మాజీ క్రికెటర్
పొట్టి ఫార్మాట్ వల్ల క్రికెట్ నాశనమవడం ఖాయమని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల మెదళ్లలో టీ20 అనే విషం నిండిపోవడం వల్ల సంప్రదాయ క్రికెట్‌కు ఆదరణ తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. లీగ్ క్రికెట్ వల్ల ఆయా బోర్డులు, ఆటగాళ్లకు డబ్బులు వస్తాయని.. అయితే, ఆటకు మాత్రం నష్టం చేకూరుతుందని పేర్కొన్నాడు.కాగా ఇటీవలి కాలంలో లీగ్ క్రికెట్ ఆడేందుకు చాలా మంది ప్లేయర్లు సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా న్యూజిలాండ్ క్రికెటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ ఇప్పటికే కాంట్రాక్టును వదులుకోగా.. డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ సైతం గురువారం ఇందుకు సంబంధించి తమ నిర్ణయాన్ని వెల్లడించారు.కాసుల వర్షం వల్లేఫ్రాంఛైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాంట్రాక్ట్ రెన్యువల్‌పై సంతకం చేసేందుకు వీరిద్దరు నిరాకరించారని కివీస్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘శ్రీలంకతో సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ జట్టుకు అందుబాటులో ఉండబోనని కాన్వే చెప్పాడు.మరో క్రికెటర్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఇది కేవలం న్యూజిలాండ్ బోర్డు సమస్య మాత్రమే కాదు. క్రమక్రమంగా అన్ని దేశాల బోర్డులకు ఇలాంటి తలనొప్పులు వస్తాయి. పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఇదే బాటలో నడిచినా ఆశ్చర్యం లేదు. ఫ్రాంఛైజీ క్రికెట్ కురిపించే కాసుల వర్షం వల్లే ఆటగాళ్లు అటువైపు ఆకర్షితులవుతున్నారు.ఇండియా లక్కీనిజానికి ఈ విషయంలో ఇండియా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే.. భారత ఆటగాళ్లు ఐపీఎల్ మినహా ఇతర టీ20 టోర్నమెంట్లు ఆడరు. ఏదేమైనా టీ20 పిచ్చి.. ఇక్కడితో ఆగదు. క్రికెట్‌ను.. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తుంది. గంటల తరబడి క్రీజులో నిలబడే బ్యాటర్ల పాలిట ఇదొక విషం లాంటిది. ఇండియా మినహా దాదాపు అన్ని దేశాల జట్లు టీ20 క్రికెట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డబ్బు వస్తోంది.. కానీ సంప్రదాయ క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’’ అని బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు -
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ల సంచలన నిర్ణయం!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కివీస్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లను వీరిద్దరూ వదులుకున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాన్వే, అలెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ తమ కాంట్రక్ట్ రెన్యూవల్‌పై సంతకం చేయలేదని కివీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అయితే వీరిద్దరూ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికి బ్లాక్‌క్యాప్స్ సెలెక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటారని బోర్డు స్పష్టం చేసింది. ఈ డిసెంబర్లో అలెన్ బిగ్ బాష్ లీగ్‌లో ఆడనుండగా.. కాన్వే వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్నాడు. కాగా ఇప్పటికే కేన్ విలియమ్సన్, లూకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మిల్నే వంటి స్టార్ క్రికెటర్లు సైతం బోర్డు కాంట్రాక్ట్‌లను వదులు కున్నారు.కివీస్ సెంట్రల్ ప్లేయింగ్ కాంట్రాక్ట్ నుండి నేను వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా అభ్యర్ధను అంగీకరించినందుకు న్యూజిలాండ్ క్రికెట్‌కు ధన్యవాదాలు. ఈ నిర్ణయం నేను అన్ని ఆలోచించే తీసుకున్నాను. నా కుటంబంతో కొద్ది రోజులు గడపాలనకుంటున్నాను. అదేవిధంగా బ్లాక్క్లాప్స్ తరపున ఆడేందుకు నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటాను. ఐసీసీ వరల్డ్ ఛాంపియన్షిప్ సైకిల్లో ముఖ్యమైన టెస్టు సిరీస్‌లలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేండుకు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాని న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసే ప్రకటనలో డెవాన్ పేర్కొన్నాడు. కాగా అఫ్గానిస్తాన్, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లకు కాన్వేకు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది. -
ఆర్సీబీ ఆటగాడి విధ్వంసం.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
మేజర్ లీగ్ క్రికెట్-2024 టోర్నీలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆదివారం డల్లాస్ వేదికగా సీటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఫ్లే ఆఫ్స్‌కు శాన్ ఫ్రాన్సిస్కో అర్హత సాధించింది.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓర్కాస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్(33 బంతుల్లో 8, 3 సిక్స్‌లతో 62 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జయసూర్య(31) పరుగులతో పర్వాలేదన్పించాడు. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో స్పిన్నర్ హసన్ ఖాన్ 3 వికెట్ల పడగొట్టగా.. రౌక్స్ రెండు, కౌచ్, ఆండర్సన్ తలా వికెట్ సాధించారు.ఫిన్ అలెన్ విధ్వంసం..అనంతరం 153 పరుగుల లక్ష్యాన్ని శాన్ ఫ్రాన్సిస్కో కేవలం 4 వికెట్ల మాత్రమే కోల్పోయి 14.2 ఓవర్లలో ఊదిపడేసింది. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటర్లలో ఫిన్ అలెన్(న్యూజిలాండ్) విధ్వంసం సృష్టించాడు. లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్లో సెకెండ్ ఫాస్టెస్ట్ హాప్ సెంచూరియన్‌గా అలెన్ నిలిచాడు. అంతకుముందు ఆసీస్ స్టార్, వాషింగ్టన్ ఫ్రీడమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 20 బంతుల్లోనే ఆర్ధశతకం నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 30 బంతులు ఎదుర్కొన్న అలెన్.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లీష్(24నాటౌట్) రాణించాడు. కాగా అలెన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఫిన్ అలెన్ సునామీ శతకం.. పాక్‌కు మరో ఘోర పరాభవం
పాకిస్తాన్ జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో చేతిలో (0-3తో టెస్ట్ సిరీస్ ఓటమి) భంగపడ్డ ఆ జట్టు.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో అంతకుమించిన అవమానాన్ని (0-3తో టీ20 సిరీస్ ఓటమి) ఎదుర్కొంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కోల్పోయి ఇంటాబయట అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. వన్డే ప్రపంచకప్ నుంచి చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్న పాక్ క్రికెట్ జట్టును పూర్తిగా ప్రక్షాళణ చేయాలని ఆ జట్టు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఫిన్ అలెన్ సునామీ శతకంతో (62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 137 పరుగులు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 224 పరుగుల భారీ స్కోర్ (7 వికెట్ల నష్టానికి) చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా టిమ్ సీఫర్ట్ (31), గ్లెన్ ఫిలిప్స్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అలెన్‌తో పాటు మరొక్కరు రాణించినా న్యూజిలాండ్ ఇంతకంటే భారీ స్కోర్ చేసేది. అలెన్ ధాటికి పాక్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) బెంబేలెత్తిపోయారు. ఈ ముగ్గురు 10కిపైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమతమై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (58) అర్ధసెంచరీతో రాణించాడు. టీ20ల్లో బాబర్‌కు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24), ఫకర్ జమాన్ (19), ఆజం ఖాన్ (10), ఇఫ్తికార్ అహ్మద్ (1), మొహమ్మద్ నవాజ్ (28) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో సౌథీ 2, హెన్రీ, ఫెర్గూసన్, సాంట్నర్, సోధి తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రపు నాలుగో టీ20 జనవరి 19న క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది. -
విధ్వంసం.. ఊచకోత.. ఎన్ని చెప్పినా తక్కువే, 16 సిక్స్‌లతో పరుగుల సునామీ
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ సరసన నిలిచాడు. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ 16 సిక్సర్లు బాదగా.. తాజాగా అలెన్ జజాయ్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్న అలెన్.. డునెడిన్ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో విధ్వంసర శతకం (137) బాదాడు. అలెన్ తన సెంచరీని కేవలం 48 బంతుల్లోనే పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అలెన్‌దే అత్యుత్తమ స్కోర్. దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్ మెక్కల్లమ్ (123) పేరిట ఉండింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. అలెన్ ఊచకోత ధాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. టిమ్ సీఫర్ట్ (31) పర్వాలేదనిపించగా.. కాన్వే (7), డారిల్ మిచెల్ (8), చాప్మన్ (1), సాంట్నర్ (4) విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. ఈ ఇన్నింగ్స్ గురించి విధ్వంసం.. ఊచకోత లాంటి ఎన్ని పదాలు వాడినా తక్కువే అవుతుంది. అంతర్జాతీయ టీ20ల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న ఫిన్ అలెన్ రెండో మ్యాచ్‌లో 74 (41 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), తొలి టీ20లో 34 (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ధాటికి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) 10కిపైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. పాక్ బౌలర్లలో అలెన్ ధాటి నుంచి మొహమ్మద్ వసీం జూనియర్ (4-0-35-1), జమాన్ ఖాన్ (4-0-37-1) కాస్త తప్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 9 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి, ఓటమి దిశగా సాగుతుంది. సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24) ఔట్ కాగా.. బాబర్ ఆజమ్ (27), ఫకర్ జమాన్ (12) పోరాడుతున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి రెండు టీ20ల్లో ఓడింది. ఈ మ్యాచ్‌లో కూడా ఆ జట్టు ఓడితే మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కివీస్ వశమవుతుంది. -
సత్తా చాటిన అలెన్, మిల్నే.. పాక్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ పాకిస్తాన్‌ను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడించింది. తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టును 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన కివీస్.. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో టీ20లో పాక్‌ను 21 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఫిన్ అలెన్ (41 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. విలియమ్సన్ (26 రిటైర్డ్ హర్ట్), సాంట్నర్ (25), కాన్వే (20), డారిల్ మిచెల్ (17), గ్లెన్ ఫిలిప్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు. లక్ష్య ఛేదనలో తడబడిన పాక్.. 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కివీస్ పేసర్ ఆడమ్ మిల్నే (4-0-33-4) పాక్ పతనాన్ని శాశించగా.. సౌథీ, బెన్ సియర్స్, సోధి తలో రెండు వికెట్లతో రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (66), ఫకర్ జమాన్ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. షాహీన్ అఫ్రిది (22) రెండంకెల స్కోర్ చేశాడు. ఈ ముగ్గురు మినహా పాక్ ఆటగాళ్లు మొత్తం విఫలమయ్యారు. సైమ్ అయూబ్ 1, రిజ్వాన్ 7, ఇఫ్తికార్ అహ్మద్ 4, ఆజం ఖాన్ 2, ఆమిర్ జమాల్ 9, అబ్బాస్ అఫ్రిది 7, ఉసామా మిర్ 0, హరీస్ రౌఫ్ 2 నాటౌట్ పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జనవరి 17న డెనెడిన్ వేదికగా జరుగుతుంది. -
ఫిన్ అలెన్ ఊచకోత.. పాక్ బౌలర్లపై మెరుపుదాడి
న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసిన అలెన్.. తాజాగా జరుగుతున్న రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులను ఎదుర్కొన్న అలెన్ 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ మార్కును కేవలం 24 బంతుల్లోనే అందుకున్న అలెన్ ఆతర్వాత కాస్త నెమ్మదించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో ఉసామా మిర్ అలెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా పాక్ బౌలర్లను ఊచకోత కోసిన అలెన్.. క్రీజ్‌లో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. అలెన్ ధాటికి న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (15 బంతుల్లో 20; 3 ఫోర్లు), ఫిన్ అలెన్ కివీస్‌కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలో 59 పరుగులు జోడించారు. కాన్వే ఔటయ్యాక బరిలోకి దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజ్‌లో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేసిన అతను ఇన్నింగ్స్ 10 ఓవర్ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన డారిల్ మిచెల్ 17 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మార్క్ చాప్మన్ 4 పరుగులకే ఔటయ్యాడు. ఆడమ్ మిల్నే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్ 13, సాంట్నర్ 25 పరుగులు చేశారు. భారీ స్కోర్ దిశగా పయనిస్తున్న కివీస్‌ను హరీస్ రౌఫ్ 19వ ఓవర్లో దెబ్బకొట్టాడు. ఈ ఓవర్ 1, 2, 4 బంతులకు వికెట్లు పడగొట్టిన రౌఫ్.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి కివీస్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. కాగా, ఈ సిరీస్‌లో కివీస్ తొలి మ్యాచ్‌లో పాక్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. -
NZ Vs PAK 1st T20: షాహీన్ అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్
పాకిస్తాన్ స్టార్ పేసర్, ఆ జట్టు కొత్త కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చుక్కలు చూపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అలెన్ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఆతర్వాత హ్యాట్రిక్ బౌండరీలు, ఆ వెంటనే సిక్సర్ బాదాడు. ఆఖరి బంతి డాట్ బాల్ అయ్యింది. ఆమిర్ జమాల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో రెండో బంతిని సైతం సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి ఓవర్లో మరో అఫ్రిది (అబ్బాస్ అఫ్రిది) అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరుకు అడ్డుకట్ట వేసి అతన్ని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కివీస్.. 11.2 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అలెన్, డెవాన్ కాన్వే (0) ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (57), డారిల్ మిచెల్ (31) క్రీజ్‌లో ఉన్నారు. అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 417 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20ల బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. -
అలెన్ అదరహో
బర్మింగ్హమ్: ఇంగ్లండ్ జట్టుతో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 74 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (53 బంతుల్లో 83; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (34 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి అర్ధ సెంచరీలు చేశారు. 203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ (3/23), ఇష్ సోధి (3/33) రాణించారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2–1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. -
పరిగెత్తడానికి మరీ ఇంత బద్దకమా.. ఫలితం అనుభవించాల్సిందే! వీడియో వైరల్
మేజర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా శనివారం శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో సీటెల్ ఓర్కాస్ ఘన విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్ ఫ్రాన్సిస్కో 142 పరుగులకే ఆలౌటైంది. సీటెల్ ఓర్కాస్ విజయంలో హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో ఓపెనర్ ఫిన్ అలెన్ విచిత్రకర రీతీలో ఔటయ్యాడు. ఏం జరిగిందంటే? శాన్ ఫ్రాన్సిస్కో ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్ వేసిన కామెరాన్ గానన్ బౌలింగ్‌లో రెండో బంతిని అలెన్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఫీల్డర్ కాస్త దూరంగా ఉండడంతో ఈజీగా పరుగు తీయవచ్చని అలెన్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌కి నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే ఫీల్డర్ షెహన్ జయసూర్య వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో క్రీజుకు దగ్గరలో ఉన్న అలెన్ కాస్త వేగంగా పరిగిత్తే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ బ్యాట్ పిచ్‌లో ఇరుక్కుపోయి కింద పడిపోయింది. అంతలో షెహన్ జయసూర్య స్టంప్స్‌ను పడగొట్టడంతో అలెన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 28 పరుగులు చేసిన అలెన్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అలెన్ రనౌట్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రనౌట్‌పై ఓ యూజర్ స్పందిస్తూ.. "పరిగెత్తడానికి మరీ ఇంత బద్దకమా.. ఫలితం అనుభవించాల్సిందే" అంటూ కామెంట్ చేశాడు. చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. వరుసగా రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి WHAT JUST HAPPENED⁉️ Was this the only way Finn Allen could get out tonight? HEADS-UP play and a BEAUTIFUL throw from Shehan Jayasuriya! 4⃣2⃣/1⃣ (3.2) pic.twitter.com/GZk5bkYG4Q — Major League Cricket (@MLCricket) July 16, 2023 -
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో టీమిండియా పేసర్
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుధవారం ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్, అఫ్గానిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జర్దన్, న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్‌లు నామినేట్ అయ్యారు. అర్ష్‌దీప్ సింగ్: టీమిండియాకు ఈ ఏడాది టి20ల్లో లభించిన ఆణిముత్యం అర్ష్‌దీప్ సింగ్. ముఖ్యంగా టి20 ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీరుస్తూ అర్ష్‌దీప్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా ఈ మెగాటోర్నీలో పది వికెట్లు తీసిన అర్ష్‌దీప్ ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20 క్రికెట్లో అడుగుపెట్టాడు. మొత్తంగా 21 మ్యాచ్‌లాడి 18.12 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్స్‌లో యార్కర్ల స్పెషలిస్ట్‌గా ముద్రపడిన అర్ష్‌దీప్ ఎటువంటి గొడవలు, బెరుకు లేకుండా బౌలింగ్ వేసి వికెట్లు పడగొట్టాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో మెల్బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్ హైలైట్‌గా నిలిచింది. ఆరంభంలో తొలి బంతికే బాబర్ ఆజంను గోల్డెన్ డకౌట్ చేసిన అర్ష్‌దీప్ తన మరుసటి ఓవర్లో మహ్మద్ రిజ్వాన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత డెత్ ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్ ఈసారి ఆసిఫ్ అలీని ఔట్ చేసి ఓవరాల్‌గా 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్: సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ ఈ ఏడాది టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా, బంగ్లాదేశ్‌లతో జరిగిన వన్డేల్లో మ్యాచ్‌ల్లో పలు వికెట్లు తీసిన జాన్సెన్కు ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ మరిచిపోలేనిది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 158 పరుగులకే కుప్పకూలడంలో జాన్సెన్ది కీలకపాత్ర. ఆ మ్యాచ్‌లో 35 పరుగులకే ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఇబ్రహీం జర్దన్: ఈ ఏడాది అఫ్గానిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జర్దన్కు మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోనుంది. ఎందుకంటే జర్దన్ ఈ ఏడాది వన్డేల్లో 71.83 సగటుతో 431 పరుగులు.. అలాగే 36.70 సగటుతో టి20ల్లో 367 పరుగులు చేశాడు. ఇక పల్లకెలే వేదికగా లంకతో మ్యాచ్‌లో 162 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్లో మరిచిపోలేనిది. ఆ ఇన్నింగ్స్‌తో అఫ్గాన్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే మహ్మద్ షెహజాద్ 131 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఫిన్ అలెన్: టి20 మెగాటోర్నీ ఆరంభానికి ముందు స్కాట్లాండ్తో జరిగిన టి20 సిరీస్‌లో భాగంగా 56 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లో 24 బంతుల్లోనే 42 పరుగులు చేసి ఢిపెండింగ్ చాంపియన్ ఆసీస్ ఓటమికి కారణమయ్యాడు. ఇక ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా ఐర్లాండ్ టూర్లో హాప్ సెంచరీతో మెరిసిన అలెన్ ఆ తర్వాత ఇండియా, వెస్టిండీస్‌లతో మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఇక మహిళల విభాగంలో ఈ అవార్డుకు టీమిండియా నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు నామినేట్ కావడం విశేషం. పేసర్ రేణుకా సింగ్‌తో పాటు వికెట్ కీపర్ యస్తిక బాటియా ఈ అవార్డు రేసులో ఉన్నారు. వీరిద్దరితో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డార్సీ బ్రౌన్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అలిస్ కాప్సీ కూడా పోటీలో ఉన్నారు. ఐసీసీ 2022 అవార్డ్స్‌ను మొత్తంగా 13 కేటగిరీల్లో ఇవ్వనున్నారు. ఇందులో ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన ఆటగాడికి ప్రతిష్టాత్మక సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అందజేయనున్నారు. అలాగే ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన క్రికెటర్‌కు రేచల్ హేయో ఫ్లింట్ అవార్డు ఇవ్వనున్నారు. The future looks bright 🙌 Our nominees for the ICC Men’s Emerging Cricketer of the Year were phenomenal in 2022. Find out more about them 👉 https://t.co/eHhghBmGo3#ICCAwards pic.twitter.com/rY5AAyBSK1 — ICC (@ICC) December 28, 2022 The four nominees for the ICC Women’s Emerging Cricketer in 2022 produced some amazing performances 🔥 More on their achievements 👉 https://t.co/04vQypUyAt #ICCAwards pic.twitter.com/eWir1w81Rk — ICC (@ICC) December 28, 2022 చదవండి: మాట నిలబెట్టుకున్న కేన్ మామ.. 722 రోజుల నిరీక్షణకు తెర -
WC 2022: కుప్పకూలిన టాపార్డర్.. మరీ ఇంత చెత్తగానా? అస్సలు ఊహించలేదు
T20 World Cup 2022 - New Zealand vs Australia: స్వదేశంలో భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2022 బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమైంది. బౌలర్లు, బ్యాటర్ల సమిష్టి వైఫల్యం కారణంగా న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. టాస్ గెలిచి సూపర్-12 ఆరంభం మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కంగారూ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్(16 బంతుల్లో 42 పరుగులు), డెవాన్ కాన్వే (58 బంతుల్లో 92 పరుగులు- నాటౌట్) అద్భుత ఆరంభం అందించారు. వీరిద్దరి విజృంభణతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 200 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో జంపాకు ఒకటి, హాజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కుప్పకూలిన టాపార్డర్ న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఆసీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు వార్నర్ 5, ఆరోన్ ఫించ్ 13.. వన్‌డౌన్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 16 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత గ్లెన్ మాక్స్వెల్ చేసిన 28 పరుగులే ఆసీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్. ఇక ఆఖర్లో ప్యాట్ కమిన్స్ 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కాగా 17.1 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్‌లోనే 89 పరుగులతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డెవాన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరీ చెత్తగా ప్రతిష్టాత్మక టోర్నీలో స్వదేశంలో ఆరంభ మ్యాచ్‌లోనే ఆసీస్ చెత్త ప్రదర్శన కనబరిచింది. ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో బౌలింగ్, బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిల పడ్డ ఫించ్ బృందంపై అభిమానులు మండిపడుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ మరీ ఇంత చెత్తగా ఆడుతుందని ఊహించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ పరిస్థితి ఇలా ఉంటే.. న్యూజిలాండ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొట్టి సమిష్టి కృషితో విజయం సాధించింది. చదవండి: T20 WC 2022: ఇదేం బ్యాటింగ్‌రా బాబు.. తొలి ఓవర్లోనే బౌలర్‌కు చుక్కలు! T20 WC 2022: ఫిలిప్స్ అద్భుత విన్యాసం.. గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ..! View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇదేం బ్యాటింగ్‌రా బాబు.. తొలి ఓవర్లోనే బౌలర్‌కు చుక్కలు!
టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 సమరం ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతోన్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ డెవాన్ కాన్వే 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం 16 బంతుల్లోనే 5ఫోర్లు, 42 పరుగులు చేసి కివీస్‌కు అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మిచిల్ స్టార్క్ వేసిన బౌలింగ్‌లో అలెన్ ఏకంగా 14 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్లో మూడో బంతికి అలెన్ లాంగ్ ఆన్ మీదగా అద్భుతమైన సిక్స్ బాదాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సునామీ ఇన్నింగ్స్ ఆడిన అలెన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్‌కు ఇటువంటి షాట్ ఆడటం అంత ఈజీ కాదు అని కొనియాడుతున్నారు. ఇక అఖరికి 42 పరుగులు చేసిన అలెన్ జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. This was a crazy shot from Finn Allen. pic.twitter.com/b5ZeZz4iNa — Johns. (@CricCrazyJohns) October 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: టిమ్ సౌథీ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా -
NZ Vs Aus: దుమ్ములేపిన కివీస్ ఓపెనర్లు.. వరల్డ్‌కప్‌లో విలియమ్సన్ సేన రికార్డు
ICC Mens T20 World Cup 2022 - New Zealand vs Australia- Super 12 Group 1: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు దుమ్ములేపారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో దంచికొట్టారు. కివీస్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఫిన్ అలెన్ 16 బంతుల్లో 42 పరుగులు సాధించగా.. డెవాన్ కాన్వే సైతం అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 23 పరుగులు చేయగా.. గ్లెన్ ఫిలిప్స్ 12 పరుగులు సాధించాడు. జేమ్స్ నీషమ్ ఆఖర్లో మెరుపులు(13 బంతుల్లో 26 పరుగులు- నాటౌట్) మెరిపించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ 200 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో న్యూజిలాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. గతంలో ఐర్లాండ్, బంగ్లాదేశ్ మీద 190 పైచిలుకు స్కోర్లు నమోదు చేసిన కివీస్.. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌పై ఈ మేరకు రాణించడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌లో కివీస్ అత్యధిక స్కోర్లు సిడ్నీ- 2022- ఆస్ట్రేలియా మీద- 200/3 నాటింగ్‌హాం- 2009- ఐర్లాండ్ మీద- 198/5 పల్లకెలె- 2012- బంగ్లాదేశ్ మీద- 191/32 ఇక ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ మెగా టోర్నీ పవర్‌ప్లేలోనూ తమ అత్యధిక స్కోరు(65/1) నమోదు చేసింది న్యూజిలాండ్ జట్టు. ఆసీస్‌తో గత మ్యాచ్‌లలో పవర్‌ప్లేలో కీవీస్ నమోదు చేసిన స్కోర్లు 2018- అక్లాండ్లో- 67/0 2018- అక్లాండ్లో-63/2 చదవండి: T20 WC 2022: టిమ్ సౌథీ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా NZ Vs Aus: ఒకే ఒక్క మార్పు.. మిగతా అంతా సేమ్ టూ సేమ్! కొత్తగా ఎవరంటే? View this post on Instagram A post shared by ICC (@icc)