ఆర్సీబీ ఆట‌గాడి విధ్వంసం.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ | MLC 2024: San Francisco Unicorns guaranteed of top-two finish | Sakshi
Sakshi News home page

MLC 2024: ఆర్సీబీ ఆట‌గాడి విధ్వంసం.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ

Published Sun, Jul 21 2024 10:04 AM | Last Updated on Sun, Jul 21 2024 11:02 AM

MLC 2024: San Francisco Unicorns guaranteed of top-two finish

మేజ‌ర్ లీగ్ క్రికెట్‌-2024 టోర్నీలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. ఆదివారం డల్లాస్‌ వేదికగా సీటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఫ్లే ఆఫ్స్‌కు శాన్ ఫ్రాన్సిస్కో అర్హత సాధించింది.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీటెల్ ఓర్కాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓర్కాస్‌ బ్యాటర్లలో క్వింటన్‌ డికాక్‌(33 బంతుల్లో 8, 3 సిక్స్‌లతో 62 పరుగులు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జయసూర్య(31) పరుగులతో పర్వాలేదన్పించాడు. శాన్‌ఫ్రాన్సిస్కో బౌలర్లలో స్పిన్నర్ హసన్‌ ఖాన్‌ 3 వికెట్ల పడగొట్టగా.. రౌక్స్‌ రెండు, కౌచ్‌, ఆండర్సన్‌ తలా వికెట్‌ సాధించారు.

ఫిన్ అలెన్ విధ్వంసం..
అనంతరం 153 పరుగుల లక్ష్యాన్ని శాన్ ఫ్రాన్సిస్కో కేవలం 4 వికెట్ల మాత్రమే కోల్పోయి 14.2 ఓవర్లలో ఊదిపడేసింది. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటర్లలో ఫిన్‌ అలెన్‌(న్యూజిలాండ్‌) విధ్వంసం సృష్టించాడు. లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ హాప్‌ సెంచూరియన్‌గా అలెన్‌ నిలిచాడు. అంతకుముందు ఆసీస్‌ స్టార్‌, వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ కేవలం 20 బంతుల్లోనే ఆర్ధశతకం నమోదు చేశాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 30 బంతులు ఎదుర్కొన్న అలెన్‌.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు జోష్‌ ఇంగ్లీష్‌(24నాటౌట్‌) రాణించాడు. కాగా అలెన్‌ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement